ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీలో అవినీతి | Enardidablyupilo corruption | Sakshi
Sakshi News home page

ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీలో అవినీతి

Published Tue, Mar 31 2015 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 11:36 PM

Enardidablyupilo corruption

సాక్షి ప్రతినిధి, వరంగల్ : గ్రామీణులకు రక్షిత తాగునీటిని సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ తాగునీటి కార్యక్రమం(ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ) పథకాన్ని అమలు చేస్తోంది. గ్రామీణులకు తాగునీటిని అందించడం ఎలా ఉన్నా.. ఈ పథకం కింద చేయాల్సిన పనులు చేయకుండానే.. బిల్లులు స్వాహా చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ పథకం కింద మంజూరైన పనులు చేపట్టకుండా తాత్సారం చేస్తూ.. ఇష్టం వచ్చినప్పుడు టెండర్ల ప్రక్రియను నిర్వహిస్తూ భారీగానే దోపిడీ సాగిస్తున్నారు.

అధికారులు టెండర్ల ముగుసులో తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు పనులు కట్టబెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీలో నిధులు మంజూరైనా పనులు చేయడం లేదు. ఇతర పథకాల నిధులతో పనులు పూర్తయిన తర్వాత.. అధికారులు, కాంట్రాక్టర్లు కలిసి ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ నిధులతో పనులు చేసినట్లు రికార్డులుృసష్టిస్తున్నారు. చేయని పనులకు తప్పుడు రికార్డులు తయూరు చేసి రూ.లక్షలు దండుకుంటున్నారు. గ్రామాల్లో తాగు నీటికి తండ్లాట తప్పడం లేదు.

ఒక పథకం కింద పనులు.. మరో పథకం కింద నిధులు..
జిల్లా వ్యాప్తంగా ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ కింద దాదాపు రూ.80 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులతో ఎన్ని పనులు.. ఎక్కడెక్కడ చేశారనే సమాచారం ఈ విభాగం అధికారుల వద్ద లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. తాజాగా ఇతర పథకంలో చేపట్టిన పనులు ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ పథకంలో చేసినట్లు రికార్డులు సృష్టించి విషయం ఆలస్యంగా వెలుగు చూసిం ది. ఎస్టీ ఉప ప్రణాళిక(టీఎస్పీ) పరిధిలోని 13 మండలాల్లో జరుగుతున్న అక్రమాలకు అంతూ అదుపు లేకుండా పోతోంది. ఇటీవల ఐటీడీఏలో చేపట్టిన పనికి ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు సుమారు రూ.5 లక్షలకు పైగా బిల్లుల రూపం లో చెల్లించిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే... ఏటూరునాగారం మం డలం షాపల్లిలో 2010లో ఐటీడీఏలోని ఇంజినీరింగ్ విభాగం ఏఆర్‌డబ్ల్యూఎస్ పథకంలో రూ. 2 లక్షల వ్యయంతో స్టాస్టిక్ ట్యాంకును నిర్మిం చింది. గ్రామంలో పైపులైను నిర్మించాలని వినతులు మేరకు ఐటీడీఏ అధికారులు 2010-11 లో ఎస్‌సీఏ గ్రాంటులో పైపులైన్ నిర్మాణానికి రూ.3 లక్షలు కేటాయించారు. ఈ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ సుమారు 1200 మీటర్ల పైపులైన్‌ను గ్రామంలో నిర్మించి 32 నల్లాలను ఏర్పా టు చేశాడు.

ఎస్‌సీఏ గ్రాంటుల్లో కేటాయింపుల కంటే ఎక్కువ పనులు చేపట్టడంతో ఈ పనికి బి ల్లులు చెల్లించేందుకు నిధులు లేకుండా పోయా యి. చేసిన పనికి బిల్లులు రాకపోవడంతో సద రు కాంట్రాక్టర్  పైపులైన్‌ను కట్ చేసినట్లు తెలి సింది. ఈ పైపులైన్‌ను ఇతర పథకంలో చేపట్టినట్లు రికార్డులు సమర్పించి రూ.లక్షల బిల్లుల ను అధికారులు చెల్లించారని.. ఈ పని పూర్తి చే సిన కాంట్రాక్టర్ ఆరోపణలు చేస్తుండడం ఆశ్చర్యంగా ఉంటోంది.
 
ఒకే పనికి.. రెండు బిల్లులు!
షాపెల్లిలోని కొత్తూరులో 20 వేల లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంక్, పైపులైన్లు, నల్లాల నిర్మాణం కోసం ఎస్‌వీఎస్ పథకంలో భాగంగా 2011-12లో రూ.12 లక్షలు మంజూరయ్యాయి. ఈ ప నులకు 2013 ఆగస్టులో టెండర్ నిర్వహించా రు. 4.90 శాతం ఎక్కువ(ఎక్సెస్)తో కాంట్రాక్టర్ పనులు దక్కించుకున్నారు. ఈ పనుల్లో భా గంగా ఓవర్ హెడ్ ట్యాంకును షాపల్లి కొత్తూరులో నిర్మించాల్సి ఉంది. కాంట్రాక్టర్ ముందుచూపుతో షాపల్లి పాత గ్రామంలోనే నిర్మించా డు. ఓవర్ హెడ్ ట్యాంక్‌ను నిర్మించి ఐటీడీఏ నిధులతో గతంలోనే నిర్మించిన పాత పైపులైన్లకు కనెక్షన్ ఇచ్చి నల్లాలను ప్రారంభించినట్లు తెలిసింది.

ఈ పనులను అధికారులకు చూపెట్టి రూ.12 లక్షల వరకు బిల్లులు పొందినట్లు అధికారులు తెలిపారు. ఈ నిధులతో 20 వేల లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంక్‌తోపాటు పైపులైను నిర్మిం చాల్సి ఉన్నా ఇదేమీ చేయకుండానే బిల్లులు డ్రా అయినట్లు అధికారులు తెలిపారు.

ఆర్‌డబ్ల్యూఎస్‌కు నిధులు కేటాయించిన విధంగానే.. ఐటీడీఏలోని గిరిజన సంక్షేమ విభాగంలో చేపట్టే తాగు నీటి పనులకు ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ నిధులను ప్రభుత్వం కేటాయిస్తోంది. ఐటీడీఏ పరిధిలోని ఎస్టీ ఉప ప్రణాళిక(టీఎస్పీ), మైదాన ప్రాంతాల అభిృద్ధి సంస్థ(మాడా), డిజర్ట్ ట్రైబల్ గ్రూప్(డీటీజీ) వర్తించే గిరిజన గూడేలు, తండాల్లో ఈపనులు చేపడుతున్నారు. ఒకే పనిని ఒకే గ్రామంలో చేపడుతుండడంతో బిల్లులు రెండు శాఖల్లో చెల్లింపులు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement