Ronald Ross
-
Hyderabad: కీలకమైన మూడు పోస్టుల్లో కొత్త బాస్‌లు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు ముఖ్య విభాగాలైన జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ బోర్డుల్లో ఉన్న బాస్‌లు మారారు. వారిస్థానే కొత్త బాస్‌లను నియమించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రేటర్ పరిధిలో భారీ స్థాయిలో అధికారుల బదిలీలు జరగడం ఇదే ప్రథమం. ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచీ ఆయా విభాగాల చీఫ్‌లు మారతారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇప్పటిదాకా జరగలేదు. తాజాగా జరిగిన ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా నగరంలోని ముగ్గురు చీఫ్‌లతో పాటు మరికొందరు అధికారులను కూడా బదిలీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత బీఆర్ఎస్ హయాంలో కీలకశాఖల్లో ఉన్నవారిని వెంటనే మారుస్తారనుకున్నప్పటికీ, రాజకీయ పరిణామాలు, లోక్‌సభ ఎన్నికలు, ఇతరత్రా కారణాలతో పూర్తిస్థాయిలో బదిలీలు జరగలేదు. పాలనలో, అభివృద్ధిలో తమదైన మార్కు చూపించేందుకు ప్రభుత్వం ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకుంది. వాటిని అమలు చేయడం, నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంతో పాటు ఆయా సంస్థల్లో ప్రక్షాళనలో భాగంగా ఈ బదిలీలు జరిగినట్లు భావిస్తున్నారు. ప్రజా సదుపాయాలు, ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా.. నగరానికి సంబంధించినంత వరకు ఓఆర్ఆర్ వరకు యూనిట్‌గా పనులకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఓఆర్ఆర్ వరకున్న శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేయడం..ఒకటే పెద్ద కార్పొరేషన్ లేదా మూడు నాలుగు కార్పొరేషన్లుగా చేసే ఆలోచనలున్నాయి. జీహెచ్ఎంసీ, హెచ్‌ఎండీయేల్లో భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి భారీ అవినీతి జరిగిందనే అభిప్రాయాలున్నాయి. వాటిపై ఉన్న ఆ ముద్రను తొలగించడంతోపాటు పౌరులకు సకాలంలో సేవలు, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ కార్యక్రమాల అమలు ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. అంతేకాకుండా ‘వైబ్రెంట్ హైదరాబాద్’ కోసం మెగా మాస్టర్‌ప్లాన్–2050తో ఆయా పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో ఆరి్థకాభివృద్ధితోపాటు మొబిలిటీ, బ్లూ, గ్రీన్ ఇన్ఫ్రా స్ట్రక్చర్స్ కీలకంగా ఉన్నాయి. ఓవైపు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటంతో పాటు మరోవైపు పెరుగుతున్న జనావాసాలన్నింటికీ సురక్షిత నీరు, వందశాతం మురుగుజలాల శుద్ధి కోసం ఎస్టీపీల పనులు జరుగుతున్నాయి. ఓఆర్ఆర్ వరకు ఎలాంటి విపత్తులు జరిగినా వెంటనే ఆదుకునేలా ఉండేందుకు విపత్తు నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోంది. అందులో భాగంగానే ఈవీడీఎం విభాగంలోని డీఆర్ఎఫ్ టీమ్‌లను పెంచుతున్నారు. ఏడాది గడవకుండానే బదిలీ అయిన రోనాల్డ్‌రాస్ 👉 గత జూలై 5వ తేదీన జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన రోనాల్డ్‌రాస్‌ను ఇంధనశాఖ సెక్రటరీగా బదిలీ చేశారు. 👉 జీహెచ్ఎంసీ కమిషనర్‌గా హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్)ఎండీ ఆమ్రపాలికి పూర్తిస్థా యి బాధ్యతలప్పగించారు. 👉 హెచ్ఎండీఏ కమిషనర్‌గా ఈసీలో జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్‌ను నియమించారు. 👉 çహార్టికల్చర్ డైరెక్టర్ కె.అశోక్‌రెడ్డిని వాటర్‌బోర్డు ఎండీగా నియమించారు. 👉 మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్కు ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం..కొత్తగా జాయింట్ ఎండీ పోస్టును సృష్టించి రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ పి.గౌతమిని నియమించింది. నాలుగు జోన్లకు కొత్త కమిషనర్లు.. జీహెచ్ఎంసీ జోన్ల ప్రక్షాళనే లక్ష్యంగా నాలుగు జోన్లలో కొత్త జోనల్ కమిషనర్లను నియమించారు. ఇటీవల ఖాళీ అయిన ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌గా అనురాగ్ జయంతిని, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌గా హైదరాబాద్ అడిషనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్‌ను, కూకట్పల్లి జోనల్ కమిషనర్‌గా జోగులాంబ గద్వాల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అపూర్వ్ చౌహాన్‌ను నియమించారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అడిషనల్ కమిషనర్‌గా ఉన్న పి.ఉపేందర్‌రెడ్డిని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా నియమించారు. జోన్లలో అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఈ బదిలీలతో మొత్తం ఆరు జోన్లకు గాను మూడు జోన్లలో ఐఏఎస్ అధికారులున్నారు. ఇప్పటి వరకు శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌తో పాటు రెవెన్యూ, ఐటీ విభాగాల అడిషనల్ కమిషనర్‌గా ఉన్న స్నేహశబరీ ను జడ్సీ పోస్టు నుంచి బదిలీ చేశారు. ఈవీడీఎం ౖడైరెక్టర్‌గా రంగనాథ్ భారీ వర్షాలు, అగి్నప్రమాదాలు వంటి ఘటనలు జరిగినప్పుడు ఎదురవుతున్న విపత్తులను ఎదుర్కొనేందుకు తక్షణ స్పందనతో పనిచేస్తున్న ఈవీడీఎం డైరెక్టర్‌గా ఉన్న ప్రకాశ్‌రెడ్డిని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీగా బదిలీ చేసి, ఆయన స్థానంలో ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్‌ను నియమించారు. డిప్యూటీ కలెక్టర్లు రిలీవ్ ఎన్నికల సందర్భంగా జీహెచ్ఎంసీకి వచి్చన డిప్యూటీ కలెక్టర్లలో ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లు కె. శివకుమార్, డి. శ్రీధర్, ఎన్. విజయలక్షి్మలను ఐఏఎస్‌ల బదిలీ ఉత్తర్వులకు ముందే జీహెచ్ఎంసీ నుంచి రిలీవ్ చేశారు. వీరిలో శివకుమార్ సంతోష్ నగర్ సర్కిల్ డీసీగా పనిచేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలు కూడా ముగిసినందున వీరికి పెద్దగా పనులేమీ లేకపోవడంతో రిలీవ్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన స్టైలే వేరు.. కీలకమైన శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా పి.ఉపేందర్‌రెడ్డిని నియమించడం జీహెచ్ఎంసీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఆయన పనితీరు, ట్రాక్ రికార్డు ఆధారంగానే ప్రభుత్వం ఆయనను శేరిలింగంపల్లి జడ్సీగా నియమించినట్లు తెలుస్తోంది. గతంలో ఎల్బీనగర్ జడ్సీగా, బోడుప్పల్ కమిషనర్‌గా పనిచేసినప్పుడు ఆయన పలు అవార్డులు, రివార్డులు పొందారు. బోడుప్పల్లో పచ్చదనం పెంపు కార్యక్రమాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల నగదు రివార్డుఅందజేసింది. బోడుప్పల్ మునిసిపల్ కార్పొరేషన్లో ఆయన చేసిన పారిశుధ్య కార్యక్రమాలు చూసే అప్పటి మేయర్ బొంంతు రామ్మోహన్ ఆయన్ను జీహెచ్ఎంసీకి రప్పించారు. ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌గా ఉన్నప్పుడు అక్కడ వరదనివారణకు ఆయన రూపొందించిన ప్రాజెక్టు రిపోర్టుతోనే నగరమంతటికీ ఆ విధానాన్ని వర్తింపచేస్తూ ఎస్ఎన్డీపీ (వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం)కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.టాస్‌్కఫోర్స్ డీసీపీగా సుదీంద్ర ప్రస్తుతం ఏసీబీలో జాయింట్ డైరెక్టర్‌గా విధులు నగర పోలీసు విభాగానికి గుండెకాయ వంటి హైదరాబాద్ కమిషనర్స్ టాస్‌్కఫోర్స్ డీసీపీగా నాన్–క్యాడర్ ఎస్పీ స్థాయి అధికారి వైవీఎస్ సుదీంద్రను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సుదీంద్ర అవినీతి నిరోధక శాఖలో (ఏసీబీ) జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌కే చెందిన ఈయన బంజారాహిల్స్‌లోని ముఫకంజా కాలేజీ నుంచి ఇంజినీరింగ్ పట్టా పొందారు. 2012లో గ్రూప్–1 ద్వారా డీఎస్పీగా ఎంపికై పోలీసు విభాగంలోకి అడుగుపెట్టారు. సుదీంద్ర బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ముగ్గురు మహిళా అధికారుల తర్వాత.. గడిచిన తొమ్మిది నెలల కాలంలో టాస్‌్కఫోర్స్‌కు ముగ్గురు మహిళా అధికారులు నేతృత్వం వహించారు. సుదీర్ఘకాలం టాస్‌్కఫోర్స్ డీసీపీగా పని చేసిన పి.రాధాకిషన్‌రావును గత ఏడాది అక్టోబర్‌లో ఎన్నికల సంఘం బదిలీ చేసింది. అప్పట్లో తొలి మహిళా డీసీపీగా ఐపీఎస్ అధికారి నిఖిత పంత్ నియమితులయ్యారు. ఎన్నికల ప్రక్రియ ముగిసి, కొత్త సర్కారు కొలువు తీరిన తర్వాత గత ఏడాది డిసెంబర్లో తొలిసారిగా పోలీసు బదిలీలు జరిగాయి. ఆ నేపథ్యంలో టాస్క్‌ఫోర్స్ డీసీపీగా నిఖిత పంత్ స్థానంలో నాన్–క్యాడర్ ఎస్పీగా ఉన్న శ్రీ బాల దేవి నియమితులయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈమెను బదిలీ చేసిన ప్రభుత్వం సాధన రష్మి పెరుమాల్‌ను నియమించారు. ఇటీవల జరిగిన ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా ఈమె హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా వెళ్లారు. -
హైదరాబాద్ లో ప్రశాంతంగా పోలింగ్
-
ఎన్నికల ప్రక్రియ దాదాపు పూర్తి అయింది: జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్
-
డబ్బులు ఊరికే వస్తాయి!
డబ్బులు ఊరకే రావు... బాగా పాపులర్ అయిన ఓ వాణిజ్య ప్రకటన. కానీ ప్రస్తుతం డబ్బులు ఊరకే వస్తున్నాయి! ప్రతి ఊరికీ వెళ్తున్నాయి!!రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన దాదాపు రెండు వారాల్లోనే కట్టలకు కట్టలు డబ్బు పట్టుబడటమే ఇందుకు నిదర్శనం. ఇంకా నామినేషన్లు కూడా మొదలు కాకముందే ఓట్ల కొనుగోలు కోసం ప్రజలకు పంపిణీ చేయడానికి డబ్బు పంపిణీ మొదలైంది. డబ్బుతోపాటు ఫ్రీబీస్ (ఉచిత బహుమతులు) సైతం పంపిణీ అవుతున్నాయి. దీంతో వాటిని అడ్డుకునేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది. డబ్బు మాదిరిగా ఇవి భారీ మొత్తాల్లో పట్టుబడకపోవడానికి ఏవి ఫ్రీబీస్.. ఏవి కావు అనే సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలో ఏవి ఉచితాలో పేర్కొంటూ వాణిజ్య పన్నుల శాఖ 26 అంశాలతో కూడిన జాబితాను జిల్లాల కలెక్టర్లు, పోలీసులు, ఎన్నికల అధికారులకు పంపింది. తనిఖీల్లో పట్టుబడే ఉచితాలపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆయా వస్తువులు రవాణా అవుతున్నా లేదా భారీ స్థాయిలో గోదాముల్లో నిల్వ ఉన్నా తమకు తెలియజేయాలని పేర్కొంది. యూపీఐ పేమెంట్లపైనా నిఘా.. డబ్బు పంపిణీ సైతం గతంలోలా నగదు రూపేణానే కాకుండా యూపీఐ (గూగుల్‌పే/ఫోన్‌పే/పేటీఎం) చెల్లింపుల ద్వారా కూడా భారీగా జరుగుతుండటంతో వాటిపైనా ఎన్నికల అధికారులు నిఘా వేశారు. ఆయా వివరాల కోసం ఆర్బీఐ, బ్యాంకు మేనేజర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒకే ఖాతా నుంచి ఎక్కువ లావాదేవీలు జరిగితే వివరాలు అందజేయాల్సిందిగా కోరుతున్నారు. ఇప్పటివరకు రూ.307 కోట్లు స్వాదీనం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 21వ తేదీ వరకు పట్టుకున్న నగదు, మద్యం, సరుకులు, ఫ్రీబీస్, తదితరాల మొత్తం విలువ రూ. 307 కోట్లు కాగా, వీటిల్లో ఫ్రీబీస్ విలువ రూ.26.93 కోట్లు. వివిధ మార్గాల ద్వారా నిఘా.. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఆన్లైన్ ద్వారా డబ్బు పంపిణీ చేపట్టినా అడ్డుకొనేందుకు నిఘా పెట్టాం. ఒకే ఖాతా నుంచి వందల మందికి ఒకే మొత్తంలో (ఉదాహరణకు రూ.500, 2,000, 5,000,10,000 చొç³్పున) గూగుల్‌పే/ఫోన్‌పే/పేటీఎం ద్వారా ట్రాన్స్ఫర్ జరుగుతోందో లేదో పరిశీలిస్తాం. ఒకే బ్యాంకు ఖాతాలో భారీగా నగదు జమ చేసినా పరిశీలిస్తాం. అనుమానాస్పద లావాదేవీలపై విచారణ చేపడతాం. – రోనాల్డ్‌రాస్, హైదరాబాద్ ఎన్నికల అధికారి జాబితాలోని ఫ్రీబీస్ ఇవే.. 1.సీలింగ్ ఫ్యాన్లు 2.ప్రెషర్ కుక్కర్లు 3. మిక్సర్లు, గ్రైండర్లు 4.చీరలు 5.కుట్టు మిషన్లు 6.స్టెయిన్లెస్ స్టీలు పాత్రలు 7.ఎల్రక్టానిక్ వస్తువులు/టీవీ సెట్స్ 8. గోడ గడియారాలు 9.క్రికెట్ కిట్స్ 10. జ్యువెలరీ ఐటమ్స్ 11.ఇతర క్రీడాపరికరాలు 12.బెడ్‌షీట్స్/టవల్స్ 13.గడియారాలు 14.సైకిళ్లు, బైక్‌లు 15.కాస్మెటిక్స్ 16. జిమ్ పరికరాలు 17. బంగారం లేదా వెండి పూత వస్తువులు (ఇమిటేషన్ జ్యువెలరీ) 18. కుంకుమ భరిణెలు 19. మొబైల్ ఫోన్లు 20. రెడీమేడ్ గార్మెంట్స్ 21.స్కూల్ బ్యాగ్స్ 22. టీషర్ట్స్ 23. టార్చిలైట్లు 24. టాయ్స్ 25. ట్రావెల్ బ్యాగ్స్/సూట్‌కేస్‌లు 26. గొడుగులు - చెరుపల్లి వెంకటేశ్ -
ప్రగతి భవన్‌కు ఎన్నికల సంఘం నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే ఫిర్యాదు మేరకు నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. ప్రగతి భవన్ సీఎం అధికారిక భవనం. అయినప్పటికీ.. అందులో బీఆర్ఎస్ తన కార్యక్రమాలు నిర్వహిస్తుస్తోంది అని ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై తదుపరి చర్యల్లో భాగంగా అధికారులు గురువారం సుదీర్ఘంగా చర్చించారు. గురువారం సాయంత్రం సీఈవో వికాస్ రాజ్‌తో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ భేటీ అయ్యారు. ఈ ఫిర్యాదులో ఎవరికి నోటీసులు ఇవ్వాలనే దానిపై చర్చలు జరిపారు. చివరకు.. ప్రగతి భవన్ నిర్వహణ అధికారులు నోటీసులు పంపారు. క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి -
టీఆర్‌ఈఐఆర్‌బీకి కొత్త చైర్మన్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ)కు కొత్త చైర్మన్ ఎంపిక ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగ వంతం చేసింది. ఇప్పటివరకు చైర్మన్‌గా వ్యవహరించిన రొనాల్డ్ రోస్‌ను జీహెచ్ఎంసీ కమిషనర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించడంతో చైర్మన్ కుర్చీ ఖాళీ అయింది. ప్రస్తుతం గురుకుల నియామకాల బోర్డు పరిధిలో భారీగా ఉద్యోగ నియామకాల ప్రక్రియ కొనసాగుతోంది. దాదాపు 9 వేల ఉద్యో గాల భర్తీకి వివిధ ప్రకటనలు జారీ చేసిన గురుకుల బోర్డు... వచ్చే నెల నుంచి అర్హత పరీక్షలను నిర్వ హించేందుకు సిద్ధమవుతోంది. ఈ తరుణంలో బోర్డు చైర్మన్ బదిలీ కావడంతో ఆ స్థానాన్ని వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే బోర్డు చైర్మన్‌కు సంబంధించి సొసైటీల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలి స్తోంది. గత నాలుగు రోజులుగా వర్షాల నేపథ్యంలో నిర్ణయం కాస్త ఆలస్యం కాగా... ఒకట్రెండు రో జుల్లో ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. పెద్ద సొసైటీ... సీనియర్ కార్యదర్శికే పగ్గం... టీఆర్‌ఈఐఆర్‌బీ చైర్మన్ విషయంలో ప్రత్యేక నిబంధనలున్నాయి. కేవలం గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగ నియామకాల కోసం తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు 2018లో ఏర్పా టైంది. ప్రస్తుతం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, తెలంగాణ గిరి జన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీలున్నాయి. ఈ ఐదు సొసైటీల్లోని కొలువుల భర్తీ గురుకుల బోర్డు నిర్వహిస్తోంది. ఈ బోర్డుకు చైర్మన్‌గా అత్యధిక పాఠశాలలున్న సొసైటీ కార్య దర్శి, అదేవిధంగా సొసైటీ కార్యదర్శుల్లో సీనియ ర్కు ఈ బాధ్యత అప్పగించాలనే నిబంధన ఉంది. ఇప్పటివరకు బోర్డు చైర్మన్‌గా మాజీ ఐపీఎస్ అధి కారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఆ తర్వాత రొనాల్డ్ రోస్ వ్యవహరించారు. ప్రస్తుతమున్న వారిలో ఒక కార్యదర్శికి బోర్డు చైర్మన్ బాధ్యత అప్పగించాలి. ఇప్పుడున్న కార్యదర్శుల్లో ఇద్దరు సివిల్ సర్వెంట్లు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా ఇ.నవీన్ నికోలస్ కొనసాగుతుండగా మైనారిటీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా షఫీయుల్లా ఉన్నారు. వారిద్దరిలో ఒకరు బోర్డు చైర్మన్ కానున్నారు. అయితే ఇద్దరిలో ఒకరు ఐఏఎస్ కాగా మరొకరు ఐఎఫ్ఎస్ అధికారి. ఐఎఫ్ఎస్ అధికారిగా ఉన్న షఫీ యుల్లా దాదాపు 8 ఏళ్లుగా కార్యదర్శిగా కొనసాగు తున్నారు. ఐఏఎస్ అధికారి నవీన్ నికోలస్ గతంలో ఎస్టీ గురుకుల సొసైటీ అదనపు కార్యదర్శిగా, గురుకుల నియామకాల బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా, కన్వీనర్‌గా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఇరువురి పని చరిత్రను పరిశీలించి ఒకరికి ప్రభుత్వం చైర్మన్ బాధ్యత అప్పగించనుంది. వచ్చే వారంలో చైర్మన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
జాతీయస్థాయి పురస్కార గ్రహీత.. హైదరాబాద్ నయా బాస్‌గా రోనాల్డ్ రాస్
హైదరాబాద్: జీహెచ్ఎంసీ నూతన కమిషనర్‌గా డి.రోనాల్డ్‌రాస్ నియమితులయ్యారు. రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయనను జీహెచ్ఎంసీ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్న డీఎస్ లోకేశ్కుమార్ను గతవారమే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అడిషనల్ సీఈఓగా నియమించగా, అందుకనుగుణంగా రాష్ట్రప్రభుత్వం తాజాగా ఉత్వర్వులు జారీ చేసింది. రోనాల్డ్‌రాస్ గతంలో జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ (టౌన్‌ప్లానింగ్)గా, సెంట్రల్ జోన్ (ఖైరతాబాద్)కమిషనర్‌గా పని చేశారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో, కూల్చివేయడంలో చురుగ్గా వ్యవహరించేవారు. రోనాల్డ్‌రాస్ 2006 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఉమ్మడి రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో శిక్షణ తీసుకున్న ఆయన నర్సాపూర్ సబ్‌కలెక్టర్‌గా, రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా, డ్వాక్రా డైరెక్టర్‌గా, గ్రామీణ పేదరిక నిర్మూలన ప్రాజెక్టు అడిషనల్ సీఈఓగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. ఆర్థికశాఖతో పాటు సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల కార్యదర్శిగా, గనులు, భూగర్భశాఖ కార్యదర్శిగా కూడా ఉన్నారు. బుధవారం జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారిగా.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం జరుగుతున్న బదిలీల్లో భాగంగానే ఈ బదిలీలు చోటు చేసుకున్నాయి. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా నియమితులైన రోనాల్డ్‌రాస్ రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరించనున్నారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసినప్పుడు ఓటరు కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడంలో చేసిన కృషికి ఉత్తమ జిల్లా ఎన్నికల అధికారిగా జాతీయస్థాయి పురస్కారాన్ని అందుకున్నారు. ఆయా జిల్లాల్లో పని చేసినప్పుడు చిన్నారుల చదువు కోసం, విద్యాశాఖ ప్రక్షాళనకు, అవినీతి నిర్మూలనకు కృషి చేశారు. ఇసుక అక్రమ రవాణాను నిలువరించారు. ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి కాల్‌సెంటర్ వంటివి ఏర్పాటు చేశారు. పేదల బాగుకోసం తపించే అధికారిగా పేరుంది. -
World Mosquito Day: ప్రాణి చిన్నది.. ప్రమాదం పెద్దది..!
సీతంపేట: మలేరియా, డెంగీ, చికున్ గున్యా పేర్లు వినని వారు ఉండరు. దోమవల్ల వ్యాపించే ప్రాణాంతకమైన జ్వరాలివి. చిన్నదోమ ఎంత పెద ప్రమాదాన్ని తీసుకువస్తుందో చెప్పడానికి ఈ జ్వరాలే ఉదాహరణ. మనుషుల రక్తాన్ని పీల్చి వ్యాధుల బారిన పడవేసే దోమల బెడద పట్టణాలతో పాటు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. దోమల బారిన పడకుండా వాటిని తరిమి కొట్టే జాగ్రత్తలు తీసుకుంటేనే అనారోగ్యాల బారిన పడకుండా ఉండగలమని వైద్యులు సూచిస్తున్నారు. దోమల దినం ఎందుకంటే.. ప్రపంచానికి కామన్ శత్రువుగా మారిన దోమల ఆట కట్టించడానికి సర్ రోనాల్డ్ రాస్ శతాబ్దం క్రితమే రంగంలోకి దిగారు. 1897లో ఆయన దోమల ద్వారానే మలేరియా జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని నిర్ధారించారు. ఈ పరిశోధనకు గానూ ఆయనకు నోబెల్ బహుమతి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని లండన్ స్కూల్ ఆఫ్ హైజెనిక్ అండ్ ట్రాపికల్ మెడిసన్ ఆగస్టు 20వ తేదీని అంతర్జాతీయ దోమల నివారణ దినంగా ప్రకటించింది. అరికట్టేదెలా.. దోమ ఎగురుతున్నపుడు పట్టుకోవడం, చంపడం చాలా కష్టం. ఒక్క దోమను పట్టుకోవాలంటే ఎంతో శ్రమించాలి. కాని దోమలు నీటిలో లార్వా, ప్యూపా దశలో పెరుగుతున్నపుడు నాశనం చేయడం సులువు. అవి ఇంటిలో నీటిని నిల్వ చేసే కుండీల్లో చిన్నచిన్న పురుగుల్లా కనిపిస్తుంటాయి. దోమ పిల్లలు (లార్వా) నిల్వ నీటిలో ఉన్నట్లయితే ఆ నీటిని మట్టి లేదా ఇసుకలో పారబోయాలి. ఇలా చేయడం వల్ల లార్వా, ప్యూపా దశల్లో ఉన్న వాటిని వందల సంఖ్యలో నాశనం చేయవచ్చు. నిలువ ఉన్న నీటిలో దోమలు గుడ్లు పెడతాయి. ఒక దోమ వంద నుంచి 200 వరకు గుడ్లను పెడుతుంది. ఇవన్నీ కేవలం 8 నుంచి 10 రోజుల్లో దోమలుగా మారిపోతాయి. గుడ్డు నుంచి లార్వా, ప్యూపా, అడల్ట్ మస్కిటోగా రూపాంతరం చెందుతాయి. దోమలదాడికి లక్షల్లో ఖర్చు.. దోమలు ప్రజారోగ్యాన్ని కాటేస్తున్నాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా రక్తాన్ని పీల్చేస్తున్నాయి. దోమల దాడిని తట్టుకునేందుకు ప్రతి నెల నిత్యావసర సామగ్రి మాదిరిగానే లిక్విడ్స్, మస్కిటో రీఫిల్స్, కాయిల్స్, మస్కిటో ధూప్‌స్టిక్స్ వంటి వాటికి నెలకు రూ.100 నుంచి రూ.500 వరకు ఒక్కో కుటుంబం ఖర్చు చేస్తోంది. ఇవి కాకుండా దోమల బ్యాట్స్, దోమతెరలు, యాంటీ మస్కిటోమెస్ వంటి వాటికోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించక తప్పడం లేదు. ఆడదోమలే ప్రమాదకరం.. మగ దోమలు చెట్ల రసాలను పీల్చి బతుకుతాయి. ఆడ దోమలు మాత్రం సంతానాభివృద్ధిలో భాగంగా గుడ్లు పెట్టడానికి మనిషి రక్తాన్ని పీల్చుతుంటాయి. ఈ క్రమంలో వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని కుట్టిన దోమ ఆ వ్యక్తి రక్తాన్ని పీల్చినపుడు రక్తంతో పాటు వ్యాధి కారకమైన పారాసైట్ దోమ లాలాజల గ్రంధుల్లోకి చేరుతుంది. అక్కడ పారాసైట్‌లో కొన్ని మార్పులు జరుగుతాయి. మరో ఆరోగ్యవంతమైన వ్యక్తిని అదే దోమ కుట్టినపుడు దాని లాలాజలంతో పాటు పారసైట్ ఆ వ్యక్తి రక్తంలో చేరి వ్యాధులకు కారణమవుతుంది. అనార్థాలివే.. ► ఆడ ఎనాఫిలస్ దోమ కుట్టడం వల్ల మలేరియా,డెంగీ, చికెన్‌గున్యా జ్వరాలు, ఈడిస్, క్యూలెక్స్ దోమలవల్ల బోదకాలు వస్తాయి. ► జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కురిసే వర్షాల కారణంగా రోడ్లపైన కొబ్బరిబొండాలు, పాతటైర్లు, రుబ్బురోళ్లలో నిల్వ ఉన్న నీరు వీటి ఆవాస కేంద్రాలు. ► అవసరాల కోసం నీటిని కుండీలు, ఓవర్‌హెడ్ ట్యాంకుల్లో నీటిని నిల్వ చేయడం వల్ల దోమలు వృద్ధి చెంది వ్యాధుల వ్యాప్తికి కారణమవుతున్నాయి. నివారణ ఇలా .. ► వేపనూనె దోమలను తరిమికొట్టడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. దీని వాసన దోమలు భరించలేవు. వేప,కొబ్బరినూనెలను సమాన భాగాలుగా చేసుకుని బయటకు కనిపించే శరీర భాగాలపై రాసుకుంటే దోమలు దరిచేరవు. ► ఇళ్లలోకి దోమలు ప్రవేశించే కిటికీల వంటి ద్వారాల వద్ద తులసి మొక్కలను పెంచాలి. ఇవి దోమలను దూరం చేస్తాయి. దోమల వృద్ధి లేకుండా చూస్తాయి. ► లెమన్ ఆయిల్, యూకలిప్టస్ ఆయిల్ మిశ్రమం దోమలను తరిమికొడుతుంది. దోమలను తరిమికొట్టడంలో కర్పూరం మెరుగ్గా పనిచేస్తుంది. ఖాళీ ప్రదేశాలను మూసిన తర్వాత కర్పూరాన్ని వెలిగిస్తే దానినుంచి వచ్చే పొగకు దోమలు మాయమవుతాయి. తగ్గిన హైరిస్క్ గ్రామాలు దోమల నివారణకు మూడేళ్లుగా ప్రభుత్వ చేపట్టిన చర్యల వల్ల మలేరియా,డెంగీ, చికున్‌గున్యాలు దశలవారీగా తగ్గుముఖం పడుతున్నాయి. జిల్లాలో ఒకప్పుడు మలేరియా పాజిటివ్‌గా 100కు పైగా ఉన్న హైరిస్క్ మలేరియా గ్రామాలు ఇప్పుడు 45కు తగ్గుముఖం పట్టాయి. ఈనెల 16నుంచి 31 వరకు మొదటి రౌండ్ సింథటిక్ ఫైరాత్రిన్ జిల్లా వ్యాప్తంగా పిచికారీ చేశారు. 2 లక్షలకు పైగా దోమతెరలు పంపిణీ చేశారు. అలాగే 4లక్షలు పైగా గంబూషియా చేపలను నీటి కుంటల్లో వేశారు. దోమల నివారణకు విస్తృత చర్యలు దోమల నివారణకు విస్తృతంగా చర్యలు చేపడుతున్నాం. దోమల నివారణ మందు పిచికారీ చేస్తున్నాం. గ్రామాల్లో దోమతెరల విని యోగంపై గిరిజనులకు చైత న్యం కలిగిస్తున్నాం. గ్రామాల్లో ఎక్కడైనా మలేరియా, డెంగీ జ్వరాలు ప్రబలితే వెంటనే మెడికల్ క్యాంపులు పెడుతున్నాం. ర్యాపిడ్ ఫీవర్, మలేరియా సర్వేలు చేస్తున్నాం. ఒకసారి ఏ గ్రామంలోనైనా జ్వరాలకు సంబంధించి పాజిటివ్ వస్తే మళ్లీ అక్కడ రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. -కె.పైడిరాజు, జిల్లా మలేరియానివారణాధికారి -
గనుల శాఖ డైరెక్టర్‌గా రొనాల్డ్ రోస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర భూగర్భ గనుల శాఖ డైరెక్టర్‌గా ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి డి.రొనాల్డ్ రోస్కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. అలాగే వెయింటింగ్‌లో ఉన్న మరో నలుగురు ఐఏఎస్‌లకు పోస్టింగులిస్తూ మరో ఉత్తర్వు జారీచేశారు. అనితా రామచంద్రను పశుసంవర్ధక, మత్స్య శాఖ కార్యదర్శిగా, బి.విజయేంద్రను రవాణా, రోడ్డు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా, ఎమ్‌ఆర్‌ఎమ్ రావును రవాణా శాఖ కమిషనర్‌గా, ఎం.ప్రశాంతిను అటవీ శాఖ జాయింట్ సెక్రటరీగా నియమించారు. -
కలెక్టర్ అయ్యేందుకు ఎన్నో నిద్రలేని రాత్రులు..
రాజాపూర్ (జడ్చర్ల): ‘కష్టపడితేనే ఏ లక్ష్యాన్ని అయినా చేరుకోవచ్చు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దానిని చేరుకునేందుకు బాగా చదవాలి. మొదట రైల్వేలో ఉద్యోగం వచ్చినా కలెక్టర్ కావాలనేదే నా లక్ష్యం. దానిని చేరుకునేందుకు ఎంతో కష్టపడి చదివా. నిద్రలేని రాత్రిళ్లు గడిపా. మీరు కూడా లక్ష్యాన్ని ఎంచుకొని.. ఆ దిశగా చదవండి’ అని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ పేర్కొన్నారు. శనివారం మండలంలోని తిర్మలాపూర్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ పలు విషయాలు, సూచనలు చేశారు. మొదట పదో తరగతి విద్యార్థులు శ్రీవాణి, వైష్ణవి విద్యార్థులను పిలిచి మీ పాఠశాలలో అన్ని మౌళిక వసతులు ఉన్నాయా అని ప్రశ్నించారు. వారు సమాధానమిస్తూ.. పాఠశాలకు ప్రహరీ లేదు అని అన్నారు. దీంతో ఇంటికి వంద.. బడికి చందా కార్యక్రమంలో మౌళిక వసతులు కల్పించుకోవాలని చెప్పాం కదా అని కలెక్టర్ సూచించారు. ఇంటికో పది పెల్లలు తెచ్చుకోండి ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటికైనా ఏం పర్వాలేదని, ఇంటికో పది ఇటుకలు తెచ్చుకోండని, మిగతా సిమెంట్ తదితర వస్తువులను నేను సమకూరుస్తానని హామీ ఇచ్చారు. రెండు నెలల్లో ప్రహరీని పూర్తి చేద్దామని పేర్కొన్నారు. మన వసతులను మనమే సమకూర్చుకుందామని సూచించారు. అంతేకాకుండా విద్యార్థుల ఆత్మస్థైర్యం కోసం కరాటే తరగతులను నిర్వహించాలని ముఖ్యంగా బాలికలకు తప్పనిసరిగా శిక్షణ ఇప్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనుకున్న లక్ష్యం చేరుకోకపోతే గ్రామీణ స్థాయిలోనే మన జీవితం ఉంటుందని, ఐఏఎస్ కావాలనేది తన లక్ష్యమని, రైల్వేలో ఉద్యోగం వచ్చినా.. ఎన్నో నిద్రలేని రాత్రిళ్లు చదివి లక్ష్యాన్ని చేరుకున్నానన్నారు. అనంతరం ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. మంచి ఫలితాలు సాధించే దిశగా ఉపాధ్యాయులు విద్యాబోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఉపాధ్యాయుడికి అభినందనలు ఇదిలాఉండగా, కారులో నుంచి కలెక్టర్ దిగి పాఠశాల ఆవరణలోకి వచ్చే క్రమంలో ఓ ప్లాస్టిక్ కవర్ కనిపించింది. దీంతో కలెక్టర్ ఆ కవర్ తీసుకొని ఉపాధ్యాయుడు లక్ష్మినారాయణ చేతికి ఇవ్వడంతో.. ఆయన అట్టి కవర్‌ను జేబులో పెట్టుకున్నారు. దీంతో కలెక్టర్ వెరీగుడ్ అని అభినందించారు. డ్రెసింగ్ విషయంలో కూడా ఉపాధ్యాయులందరూ చక్కగా ఉండాలని సూచించారు. అనంతరం పాఠశాలలోని తెలుగు, ఇంగ్లిష్ మీడియం పదో తరగతి విద్యార్థులతో సమావేశమయ్యారు. -
కలెక్టర్ రొనాల్డ్‌రోస్ వినూత్న ప్రయోగం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రభుత్వ పాఠశాలలంటే అందరిలోనూ చిన్నచూపు ఉంటుంది. చదువు బాగా చెప్పరని, తరగతి గదులు సరిగా ఉండవని, సర్కారీ స్కూళ్లన్నీ సమస్యల వలయం లోనే కొట్టుమిట్టాడతాయని భావిస్తారు. పాలమూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు చూస్తే ఆ అభిప్రాయాలు మార్చుకోక తప్పదు. చుట్టూ పచ్చని చెట్లు.. పరిశుభ్రమైన పరిసరాలు.. ఆకర్షణీయమైన తరగతి గదులు.. చూస్తే ఇది సర్కారీ స్కూలేనా అని ఆశ్చర్యపోయే రీతిలో పాలమూ రు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు సరికొత్త శోభతో కనిపిస్తాయి. ఏళ్లుగా అనేక సమస్యలతో కొనసాగిన ఈ పాఠశాలల్లో ఇప్పుడు ఒక్కొక్క టిగా సదుపాయాలు సమకూరుతున్నాయి. కలెక్టర్ రోనాల్డ్‌రోస్ తీసుకున్న చొరవే ఇందుకు కారణం. సర్కారీ స్కూళ్లంటే విద్యార్థులు, ఉపాధ్యాయులు మాత్రమే కాదని.. వాటి బాధ్యత అందరిపై ఉందని పేర్కొంటూ ‘ఇంటికి వంద.. బడికి చందా’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి నుంచి స్వచ్ఛందంగా రూ.వంద వసూలు చేసి ఆయా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల న్నది దీని ఉద్దేశం. ఏడాది క్రితమే దీనికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులు, గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు, ప్రైవేట్ కంపెనీలు, స్వచ్చంద సంస్థ ల నిర్వాహకులంతా విరాళాలు ఇస్తున్నారు. ఇప్పటివరకు రూ.1.11 కోట్లు జమ కాగా, ఆ నిధులతో వసతులు కల్పిస్తున్నారు. అందరి భాగస్వామ్యంతోనే.. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్న మహబూబ్‌నగర్ జిల్లా యంత్రాంగానికి అండగా విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పాటు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయం. రూ.కోటికి పైగా వచ్చిన విరాళాలతో జిల్లాలో 601 ప్రభుత్వ పాఠశాలలను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుకుని.. స్వచ్ఛ పాఠశాలలుగా ప్రకటించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం అదే స్థాయిలో చదువు సామర్థ్యాలు, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుంటున్నారు. ఇదంతా అందరి భాగస్వామ్యంతోనే సాధ్యమైంది. – రొనాల్డ్‌రోస్, కలెక్టర్, మహబూబ్‌నగర్ సమస్యలు గుర్తించి.. పరిష్కారం మహబూబ్‌నగర్ జిల్లాలో 830 ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 83వేల మంది చదువుతున్నారు. కనీస సదుపాయాలు లేకపోవడంతో ఈ పాఠశాలల్లో చేరేందుకు నిరుపేద విద్యార్థులు సైతం ముందుకు వచ్చేవారు కాదు. కొన్నిచోట్ల టాయిలెట్లు లేక.. ఉన్నచోట నిర్వహణ సరిగాలేక బాలికలు ఇబ్బందులు పడేవారు. దీంతో చదువుకు స్వస్తి పలికేవారు. ఫలితంగా విద్యార్థుల సంఖ్య పడిపోతూ వచ్చింది. ఆయా స్కూళ్లలో నెలకొన్న సమస్యలే దీనికి కారణమని గుర్తించిన కలెక్టర్ రొనాల్డ్‌రోస్ వాటిని పరిష్కరించాలని నిర్ణయించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటిలోనూ సదుపాయాలు కల్పించే బాధ్యతను భుజస్కందాలపై వేసుకున్నారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న పాఠశాల నిర్వహణ నిధులు సరిపోకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రూ.వంద చొప్పున వసూలు చేసి ఆయా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నా రు. ఈ చర్యలతో ప్రభుత్వ స్కూళ్లలో చేరేవారి సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 30వేల మంది ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ఎంతో కృషి చేశాం కొన్నేళ్లుగా పాఠశాలను పూర్తిస్థాయి స్వచ్ఛ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు ఎంతో కృషి చేస్తున్నాం. స్వచ్ఛభారత్ నిబంధనలకు అనుగుణంగా పూర్తిస్థాయిలో వసతులు కల్పించినందుకు స్వచ్ఛ పాఠశాలగా ప్రకటించాం. – బాలుయాదవ్ బైకని, హెచ్ఎం,జెడ్పీహెచ్ఎస్ ధర్మాపూర్ -
మాకు ఇండియా అంటేనే ఎక్కువ ఇష్టం!
హలో హాయ్. నా పేరు దోమ. నేను మనుషుల రక్తాన్ని పీల్చే పిశాచినని అందరూ అనుకుంటారు. నన్ను విలన్‌గా చూస్తూ అందరూ తిట్టుకుంటూ ఉంటారు. అందుకే రాజమౌళి కూడా తన సినిమాలో ఈగనే హీరో గా చూపించాడు. మీరు నన్ను తిట్టే తిట్లవల్లే ఆ దేవుడు నాకు తక్కువ ఆయుష్షును ప్రసాదించాడేమో. కానీ నేనూ జీవినే. నా వల్ల కలిగే ప్రయోజనాలను పక్కనపెట్టి.. కేవలం నా వల్ల కలిగే జబ్బుల గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఇప్పటికీ నేను చెప్పేది మీరు నమ్మకపోవచ్చు. నా వల్ల లాభాలేంటి అని ఆలోచిస్తున్నారా? ఆ వివరాలు తెలియాలంటే వీడియోని క్లిక్చేయండి. -
టైమ్‌కు రాని టీచర్లు; 10 మందిపై వేటు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: విధుల్లో సమయపాలన పాటించడం లేదంటూ మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ పది మంది ఉపాధ్యాయులపై వేటు వేశారు. శనివారం ఉదయం 9.15 గంటలకు జిల్లా కేంద్రంలోని గాంధీరోడ్డు బాలికల ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. 16 మంది ఉపాధ్యాయులకు గానూ ముగ్గురు సెలవులో ఉండగా ప్రార్థన సమయానికి కేవలం నలుగురు మాత్రమే పాఠశాలకు హాజరయ్యారు. పిల్లలతో ప్రార్థనలో పాల్గొన్న కలెక్టర్ పాఠశాల ఆవరణ, తరగతి గదులు, మరుగుదొడ్లను పరిశీలించారు. ప్రార్థన అయిపోయాక కూడా మిగతా ఉపాధ్యాయులు రాకపోవడం, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేస్తూ వెళ్లిపోయారు. కాగా, ఆయన పదిమందిపై సస్పెన్షన్ వేటు వేయాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. ఈ విషయంపై డీఈఓ నాంపల్లి రాజేశ్‌ను వివరణ కోరగా విధులకు హాజరుకాని ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని కలెక్టర్ నుంచి ఆదేశాలు అందిన విషయం వాస్తవమేనన్నారు. -
తప్పిదాలను పునరావృతం చేయొద్దు
సాక్షి, జడ్చర్ల టౌన్: పోలింగ్ విధులు నిర్వహించే పీఓలు, ఏపీఓలు చిన్న చిన్న తప్పిదాలను పునరావృతం చేసుకుంటూ జవాబుదారీగా మారొద్దంటూ మహబూబ్‌నగర్ కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అన్నారు. గురువారం జడ్చర్ల బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమావేశ మందిరంలో నిర్వహించిన జడ్చర్ల అసెంబ్లీ పీఓలు, ఏపీఓల ఎన్నికల శిక్షణలో ఆయన పాల్గొని మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన చిన్న తప్పిదాలే పెద్ద చర్చగా మారాయని గుర్తుచేశారు. మాక్‌పోలింగ్ అయ్యాక తప్పనిసరిగా ఈవీఎంలు, వీవీప్యాట్లు క్లియర్ చేసి పోలింగ్‌కు వెళ్లాలని, పోలింగ్ ముగిశాక తప్పనిసరిగా ఈవీఎం క్లోజ్ చేయాలన్నారు. అలా చేయకపోవడం వల్ల కౌంటింగ్‌లో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఫలితంగా ఎన్నికల కమిషన్‌కు జవాబుదారీగా మారాల్సి వస్తుందన్నారు. ముందుగానే జాగ్రత్తలు తీసుకుని విధుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాక్‌పోలింగ్ చేసి ఈవీఎంలు క్లియర్ చేయలేదని, వారిలో కొందరు సమాచారం ఇచ్చినా మరికొందరు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయారన్నారు. తద్వారా సస్పెన్షన్‌కు గురి కావాల్సి వచ్చిందన్నారు. ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పోలింగ్ జరిగాక ఇచ్చిన పోలింగ్ శాతం తప్పుగా ఇవ్వద్దని, మీరిచ్చే నివేదికల ఆధారంగానే మీడియాకు సమాచారం అందిస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొన్నిచోట్ల పోలింగ్ పర్సంటేజీల విషయంలో తప్పుగా ఇవ్వడం వల్ల పెద్ద రచ్చ అయిన విషయాన్ని గుర్తుచేసి అలాంటి పొరపాట్లు చేయవద్దన్నారు. ఈవీఎం, వీవీప్యాట్లతోపాటు 17ఏ, 17సీ వంటి మొతం 7 రికార్డుల్లోనూ పోలైన ఓట్ల సంఖ్య ఒకేలా ఉండాలన్నారు. పోలింగ్‌కు అవసరమైన 9 డాక్యుమెంట్లతో బుక్లెట్ చేశామని, దానిని చింపకుండా సక్రమంగా రాసి రిసెప్షన్ కౌంటర్లో సమర్పించాలన్నారు. పోలింగ్ ముందురోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌కు సకాలంలో చేరుకుని కేంద్రాలకు సమయానికి చేరుకుని ఎన్నికలకు సిద్ధం చేసుకోవాలన్నారు. పోలింగ్ ముగిశాక త్వరగా రిసెప్షన్ సెంటర్‌కు చేరుకుని ఈవీఎంలు, వీవీప్యాట్, బుక్లెట్, డిస్ప్లే యూనిట్‌ను సమర్పించి వెళ్లాలన్నారు. కేంద్రాల్లో ఏవైనా సమస్యలు వస్తే బుక్‌లెట్‌లో సూచించిన ఫోన్ నంబరుకు సమాచారం ఇవ్వాలని, జడ్చర్ల అసెంబ్లీ పరిధిలోని ఊర్కొండ మండలంలో పనిచేసే సిబ్బంది మాత్రం మహబూబ్‌నగర్ కోడ్‌ను ఉపయోగించి ఫోన్ చేయాలన్నారు. సమయాన్ని వృథా చేయడం మనకు అలవాటని, అలా చేయకుండా ఎన్నికలు విజయవంతం చేద్దామన్నారు. గుర్తింపు కార్డులు తేవాల్సిందే ఓటరు స్లిప్‌లు తీసుకువచ్చిన ఓటర్లను ఓటు వేయడానికి అనుమతి ఇవ్వవద్దని, తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు కార్డు వెంట తీసుకురావాల్సిందేనని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు ముందుగానే తెలియజేయాలని, అంతకు ముందురోజు రాత్రి గ్రామాల్లో ప్రచారం చేయిస్తామన్నారు. శిక్షణలో సబ్ కలెక్టర్, ప్రత్యేక అధికారి క్రాంతి, తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, 300 మంది పీఓలు, ఏపీఓలు పాల్గొన్నారు. -
బాల్యదశలో జాగ్రత్త!
పాలమూరు: బాల బాలికలు ప్రతి ఒక్కరు తమ వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని.. తద్వారా ఎలాంటి అనారోగ్యం దరిచేరదని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అన్నారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని షాషాబ్‌గుట్ట ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కలెక్టర్ మాత్రలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది లోపు జిల్లాలో నులిపురుగులు, ఏలికపాములు, కొంకిపురుగులు నివారణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఇక బహిరంగ ప్రదేశాల్లో ఎవరు కూడా మలవిసర్జన చేయకుండా విద్యార్థులు అవగాహన కల్పించాలని సూచించారు. విద్యార్థులు సైతం వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తెలిపారు. పిల్లలో కొంకిపురుగులు, నులిపురుగులు కడుపులో ఏర్పడితే పెరుగుదల లోపించడం, రక్తహీనత, చదువుపై శ్రద్ధ కోల్పోవడం జరుగుతుందన్నారు. అంతకుముందు కలెక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాలలు వేయడంతో పాటు విద్యాబోధనపై ఆరా తీశారు. డీఎంహెచ్ఓ డాక్టర్ రజిని, ప్రోగ్రాం అధికారి డాక్టర్ శశికాంత్, మాస్‌మీడియా అధికారి వేణుగోపాల్‌రెడ్డి, డాక్టర్ కృష్ణ, డాక్టర్లు జరీనా, సునీత, హెల్త్‌ఎడ్యుకేటర్ రాజగోపాలాచారి, ఉమాదేవి, సుభాష్‌చంద్రభోస్, రెడ్‌క్రాస్ చైర్మన్ నటరాజ్, ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 85.9శాతం మందికి మాత్రలు జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లాలో 85.9శాతం మందికి మాత్రలు వేశారు. జిల్లాలోని 15మండలాలు, నారాయణపేట జిల్లాలో 11 మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లోని 1నుంచి 19 ఏళ్ల లోపు చిన్నారులు, యువతీ యువకులకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు.జిల్లా వ్యాప్తంగా 4,65,826 మంది బాలబాలికలకు గాను 3,51,568మందికి మాత్రలు వేసినట్లు అధికారులు తెలిపారు. ఇక మిగిలిపోయిన 1,14,258 మంది బాలబాలికలకు ఈనెల 23న మాత్రలు అందించనున్నారు. నులిపురుగు మాత్రలు తప్పనిసరి... భూత్పూర్ (దేవరకద్ర): ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు నులిపురుగు మాత్రలు విధిగా వేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ రిజిని సూచించారు. భూత్పూర్ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఆమె మంగళవారం మాత్రలు పంపిణీ చేశారు. అనంతరం డీఎంహెచ్ఓ మాట్లాడుతూ మాత్రలు వేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.కాగా, మండలంలో 10,833 మందికి గాను 7,513 మందికి మాత్రలు వేసినట్లు సీహెచ్ఓ రామయ్య వివరించారు. జిల్లా టీబీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ కృష్ణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
పాలమూరుకు పచ్చని పైట
పాలమూరు : కరవు కటకాలతో అల్లాడుతూ జీవకళ కోల్పోయిన జిల్లాకు కృష్ణమ్మ నీటిని తరలించి బీడు భూముల్లో బంగారు పంటలు పండించడానికి పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వరంగా మారనుందని జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని పరేడ్‌మైదానంలో శనివారం ఉదయం ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ శాఖల వారీగా ప్రగతిని వివరించారు. ఆ వివరాలు కలెక్టర్ మాటల్లోనే... ూ సాగునీటి రంగం : పాలమూరు–రంగారెడ్డి పథకం కింద 22మండలాల్లోని 4,13,167 ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరు అందించనున్నాం. ఈ పనులు పురోగతిలో ఉన్నాయి. సంగంబండ రిజర్వాయర్ కింద ఖరీఫ్, రబీ–2018లో 40వేల ఎకరాలు, రబీ–2019లో 5వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చాం. దీంతో పాటు 45 చెరువులు నింపాం. ఇక భూత్పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద ఖరీఫ్, గత రబీలో 37వేల ఎకరాల ఆయకట్టు నీళ్లు ఇవ్వడంతో పాటు 33చెరువులు నింపాం. కోయిల్‌సాగర్ ఎత్తపోతల కింద ఖరీఫ్, రబీ–2018కి సంబంధించి 25వేల ఆయకట్టుకు నీటి సరఫరా చేయడంతో పాటు 42చెరువులకు నీటిని అందించాం. మిషన్ కాకతీయ పథకం కింద జిల్లాలో 2,563 చెరువును ఐదేళ్లలో పునరుద్ధరించాలనేది లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 1,191 పనులను రూ.154.45కోట్లతో పూర్తి చేశాం. అలాగే, జిల్లాలో 3,11,894 మంది రైతులకు కొత్త పట్టదార్ పాసుపుస్తకాలు పంపిణీ చేశాం. వ్యవసాయం : రైతు బంధు పథకంలో భాగంగా జిల్లాలో 2,82,120 మంది రైతులకు రూ.316.32 కోట్ల విలువైన 2,87,075 చెక్కులు పంపిణీ చేశాం. రబీ 2018–19 సీజన్లో 2,90,611 మంది రైతులకు గాను ఇప్పటి వరకు 2,34,271 మంది రైతుల ఖాతాల్లో రూ.276.34 కోట్లు జమ చేశాం. రైతు భీమా పథకంలో భాగంగా ఇప్పటి వరకు 1,69,260 మంది అర్హులైన రైతులను గుర్తించి భీమా పత్రాలు అందజేశాం. ఇందులో ఇప్పటి వరకు 486మంది రైతులు మృతి చెందగా 413 మంది కుటుంబ సభ్యులకు రూ.20.65కోట్లు వారి ఖాతాల్లో వేశాం. భూసార ఆరోగ్య కార్డు పథకం కింద 2018–19గాను 25.519 మట్టి నమూనాలను సేకరించి 19,136 పరీక్ష ఫలితాలను రైతులకు ఇచ్చాం. సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ కింద రూ.2.03కోట్ల వ్యయంతో పండ్ల తోటల విస్తరణ, ఫాంపాండ్స్, శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటుచేశాం. పశు సంవర్ధక శాఖ : జిల్లాలో పశుగ్రాసం కొరత ఏర్పడకుండా ఇప్పటి వరకు 220మెట్రిక్ టన్నుల స్వల్పకాలిక, మేలుజాతి పశుగ్రాస విత్తనాలను 75శాతం సబ్సిడీపై రైతులకు ఇచ్చాం. ఇప్పటివరకు 2,096మందికి పశువులు పంపిణీ చేశాం. మార్కెటింగ్ : జిల్లా కేంద్రంలో రూ.5.50కోట్ల వ్యయంతో రైతు బజార్ ఏర్పాటు, 13మండలాల్లో గోదాములు 60వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేశాం. విద్యుత్ : 2018–19 ఏడాదిలో రూ.38.15 కోట్ల విలువైన 23 ఉపకేంద్రాలు మంజూరు కాగా,ఇందు లో నాలుగు ఉపకేంద్రాల పనులు పూర్తయ్యాయి. వ్యవసాయ బావుల విద్యుత్ కోసం కోసం 5,761 దరఖాస్తులు రాగా 3,983 కనెక్షన్లు ఇచ్చాం. ఆర్అండ్బీ: జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మాణం చేస్తున్న కలెక్టరేట్ కాంప్లెక్స్ కోసం రూ.43.83కోట్లు మంజూరు కాగా, పనులు పురోగతిలో ఉన్నాయి. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి అనుసంధాన రహదారుల కోసం 158.10 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి రూ.210.57 కోట్లు మంజూరయ్యాయి. మహబూబ్‌నగర్ పట్టణ బైపాస్ నిర్మాణానికి రూ.96.70కోట్లు మంజూరయ్యాయి. పౌరసరఫరాల శాఖ : రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వడంలో భాగంగా ఐకేపీ ద్వారా 39వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 45676.360 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. ఇందుకోసం 11,398 మంది రైతులకు రూ.75.83కోట్లు చెల్లించాం. వైద్య, ఆరోగ్యశాఖ : కంటి వెలుగు పథకం కింద జిల్లాలో 6,96,431 మంది కంటి పరీక్షలు చేసి 1,02,796 అద్దాలు అందజేశాం. ఇక 1,177మందికి ఆపరేషన్లు చేయించాం. జిల్లాలోని పలు ఆస్పత్రుల్లో 15 అధునాతన లేబర్ రూంలు నిర్మాణం పూర్తిచేశాం. డీఆర్డీఓ : 2018–19 ఏడాదిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం కింద రూ.99.63కోట్లతో 89,285 కుటుంబాల్లోని 1,41,203 మంది కూలీలకు 36.14లక్షల పనిదినాలు కల్పించాం. జిల్లాలోని 96 గ్రామాల్లో బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించాం. మత్స్యశాఖ : జిల్లాలో 251 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి 185 చెరువుల్లో 1.15 కోట్ల చేప విత్తనాలు వదిలాం. దీంతో పాటు మత్స్యకారులకు 2,163 ద్విచక్ర వాహనాలు, 183 నాలుగు చక్రాల వాహనాలు సబ్సిడీపై అందజేశాం. అటవీశాఖ : ఈ ఏడాది వేపూర్, మునిమోక్షం అటవీ ప్రాంతాల్లో 66.60 హెక్టార్ల విస్తీర్ణంలో 77, 572 మొక్కలను నాటాం. జాతీయ రహదారి సుం దరీకరణలో భాగంగా 57 కిలోమీటర్ల పొడవున 25, 147మొక్కలు, అంతర్రాష్ట్ర రోడ్ల వెంబడి 51,750 మొక్కలు నాటి సంరక్షిస్తున్నాం. జిల్లా కేంద్రంలోని అప్నన్నపల్లి సమీపంలో ఉన్న మయూరి ఎకో పార్క్‌ను సుందరీకరించాం. -
ఓటు.. మన బాధ్యత : కలెక్టర్ రొనాల్డ్‌రోస్
సాక్షి, పాలమూరు: ఓటు హక్కు ఉన్న ప్రతీ ఒక్కరు ఓటు వేయాలని.. తద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవచ్చని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అన్నారు. అందరూ ఓటు వేస్తూ ప్రజాస్వామ్యమనే దీపాన్ని వెలిగించాలని కోరారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ మైదానంలో శుక్రవారం రాత్రి ‘ఓటు దీపోత్సవం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన మహిళలు దీపాలు వెలిగించారు. అనంతరం కలెక్టర్ చేతిలో దీపం పట్టుకుని రానున్న ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటామంటూ మహిళలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జేసీ వెంకట్రావు, డీఎంహెచ్ఓ రజిని, డీఈఓ సోమిరెడ్డి, ఈఎస్ అనితతో పాటు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఓటు దీపోత్సవం ప్రస్తుతం కార్తీకమాసం.. త్వరలోనే ఎన్నికల పోలింగ్.. ఈ రెండూ కలిసొచ్చేలా జిల్లా కేంద్రంలో శుక్రవారం వినూత్న కార్యక్రమం చేపట్టారు. జెడ్పీ మైదానంలో ‘ఓటు దీపోత్సవం’ పేరిట ఈ కార్యక్రమం ఏర్పాటుచేయగా కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌తో పాటు అన్ని జిల్లా శాఖల ఉన్నతాధికారులు, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ మేరకు ‘ఐ ఓట్’ అక్షరాల రూపంలో దీపాలు వెలిగించారు. అనంతరం ఓటు హక్కు ప్రాధాన్యం, ఓటర్లకు కల్పిస్తున్న సౌకర్యాలను మహిళలకు వివరించి∙ -
పిక్నిక్ అనుకుంటున్నారా ? ఉద్యోగులపై కలెక్టర్ సీరియస్.
మహబూబ్‌నగర్ న్యూటౌన్: ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగుల తీరు పిక్నిక్ వెళ్లి వస్తున్నట్లుగా ఉందని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అసహనం వ్యక్తం చేశారు. ఇకనైనా తీరు మార్చుకోకపోతే నేరుగా పరిశీలకులే విధులు నిర్వర్తిస్తారని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు పక్కాగా అమలు చేయాలని పదేపదే చెబుతున్నా పిక్నిక్కు వెళ్లి వస్తున్నట్లుగా ఎన్నికల బృందాలు పనితీరు ఉందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రొనాల్డ్ రోస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం అభ్యర్థుల ప్రచారం సాగుతుందా, అతిక్రమిస్తున్నారా అనే విషయాన్ని అధికారులు పక్కాగా పరిశీలించాలని సూచించారు. జిల్లాలో 144 సెక్షన్ అమలు చేస్తూ.. నిబంధనలకు విరుద్ధంగా ప్రచారాలు నిర్వహించే వారికి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో సోమవారం కలెక్టర్ ఎన్నికల పరిశీలకులు, రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు, ఏఈఓలతో ఎన్నికల ఏర్పాట్లు, శాంతిభద్రతలపై సమీక్షించారు. తేడాలు ఎందుకు వస్తున్నాయ్? పెయిడ్ న్యూస్‌కు సంబంధించి ఆర్వోలు, ఎంసీఎంసీ వద్ద ఉన్న వివరాల్లో తేడాలు గమనించిన పరిశీలకులు సమన్వయలోపాన్ని కలెక్టర్ రొనాల్డ్ రోస్ దృష్టికి తెచ్చారు. దీంతో ఆయన ఆయన స్పందిస్తూ పెయిడ్ న్యూస్‌కు సంబంధించిన వివరాలను ప్రతీరోజు ఆర్వోలు, పరిశీలకులకు పంపాలని డీపీఆర్వోను ఆదేశించారు. ప్రతీ రోజు తాను స్వయంగా పేపర్ చూసి స్పందించినా ఎందుకు కదలిక రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇబ్బందులు పడతారని, ఎన్నికల కమిషన్‌కు పంపించే నివేదికలో తేడాలు రాకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మహబూబ్‌నగర్ పట్టణంలో ఎల్ఈడీ స్క్రీన్లకు సంబంధించిన అద్దెను అభ్యర్థుల ఖర్చుల జాబితాలో నమోదు చేయకపోవడంపై ప్రశ్నించారు. పట్టణాలు, గ్రామాల్లో సమూహంగా ర్యాలీలు నిర్వహిస్తూ ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నట్లు తెలుస్తోందని.. ఈ అంశంపై రిటర్నింగ్ అధికారులు, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలు పర్యవేక్షణ పెంచాలన్నారు. ఎంసీసీ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తీసుకున్న చర్యలపై ఆర్వోలను ఆరా తీయగా వారితో పాటు ఎంసీసీ వద్ద మరో రకంగా నివేదికలు ఉండడంతో ఎన్నికల పరిశీలకులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ ఉద్యోగుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విధుల నిర్వహణలో ఇదే నిర్లక్ష్యం కొనసాగితే చివరి ఐదు రోజులు నేరుగా పరిశీలకులకే ఎన్నికల నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తారని నారాయణపేట, జడ్చర్ల ఆర్వోలను హెచ్చరించారు. పదేపదే హెచ్చరిస్తున్నా... పదేపదే హెచ్చరిస్తున్నా కొందరు ఉద్యోగులు పనితీరు మార్చుకోవడం తెలుస్తోందని రొనాల్డ్ రోస్ పేర్కొన్నారు. ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల నామినేషన్ల సందర్బంగా నిర్వహించిన ర్యాలీల ఖర్చుపై ఆరా తీయగా తేడాలు ఉండడంతో మందలించారు. తప్పుడు వివరాలు ఇస్తే ఉద్యోగాలు పోతాయని, నిర్లక్ష్యంగా వ్యవహరించరాదన్నారు. సీ విజిల్ యాప్‌పై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. అనంతరం పోస్టల్ బ్యాలెట్‌పై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగాఎన్నికల పరిశీలకులు మాట్లాడుతూ ఎన్నికల విధులు రాజ్యంగబద్దమైనవని, జిల్లా ఎన్నికల అధికారి తర్వాత రిటర్నింగ్ అధికారుల బాధ్యతలు అత్యంత కీలకమైనవని తెలిపారు. ఎవరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని సూచించారు. ఈ సమావేశంలో ఎన్నికల ప్రత్యేకాధికారి క్రాంతి, డీఆర్వో స్వర్ణలత, నియోజకవర్గాల అధికారులు పాల్గొన్నారు. దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలి సాధారణ ఎన్నికల్లో దివ్యాంగులు వంద శాతం ఓటుహక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలహాబాద్ జిల్లా నుండి వచ్చిన ఐఏఎస్ అధికారి సుహాస్ లలిత్కేర్ సమక్షంలో సోమవారం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1,312 పోలింగ్ కేంద్రాలు, 748 పోలింగ్ లొకేషన్లు ఉన్నాయని వివరించారు. 125 పోలింగ్ కేంద్రాల పరిధిలో దివ్యాంగులను గుర్తించామని.. వారి కోసం రవాణా సౌకర్యం, తాగునీరు, వీల్చైర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చేలా 872 వలంటీర్లు, 978 వాహనాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అలాగే, 408 ర్యాంపులు నిర్మించినట్లు తెలిపారు. నోడల్ అధికారి శంకరాచారి, అసిస్టెంట్ నోడల్ అధికారి జోజప్ప పాల్గొన్నారు. -
అయ్యా.. మీ కాళ్లు కడుగుతాం !
నవాబుపేట (జడ్చర్ల): బాబ్బాబు మీ కాళ్లు కడుగుతాం.. ఎలాగైనా సరే ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకోండి.. అంటూ గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు ఇళ్లిళ్లూ తిరుగుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ జిల్లాను వంద శాతం ఓడీఎఫ్‌గా మార్చాలనే కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నారు. తరచూ గ్రామాల్లో పర్యటిస్తూ, అధికారులతో సమీక్షిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు సైతం ఇళ్లిళ్లూ తిరుగుతూ మరుగుదొడ్డి లేని వారికి అవగాహన కల్పిస్తున్నారు. ఈ మేరకు జిల్లాలోని నవాబుపేట మండలం పోమాల్ గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మంగళవారం వినూత్న ప్రచారం చేశారు. మరుగుదొడ్డి లేని ఇళ్లను గుర్తించి ఆ ఇంటి యాజమాని కాళ్లు కడిగి విజ్ఞప్తి చేయడంతో పాటు పాటు ఇంటి మహిళకు బొట్టు పెట్టి యజమానిని ఒప్పించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణ, శ్రీశైలం, రాజు, శ్రీౖశైలం, చంద్రయ్య, ఎస్బీఎం బృందం మల్లికార్జున్, రవితో పాటు అంగన్వాడీ, ఆశ, సాక్షరభారత్ కార్యకర్తలు పాల్గొన్నారు. -
పద బడికి....
సాక్షి, దేవరకద్ర : మహబూబ్‌నగర్ కలెక్టర్ రొనాల్డ్ రోస్ జిల్లా కేంద్రం నుంచి దేవరకద్రలోని కందుల కొనుగోలు కేంద్రాలను పరిశీలించేందుకు నిన్న (గురువారం) ఉదయం బయలుదేరారు. మార్గమధ్యలో కోయిల్‌కొండ పోతన్‌పల్లి వద్ద వద్ద కొందరు పిల్లలు మేకలను కాస్తూ కనిపించారు. ఇది చూసిన ఆయన వాహనం ఆపి వారితో మాట్లాడారు. చదువుకోవాల్సిన వయస్సులో ఈ పని ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. తన వాహనంలో ఎక్కించుకుని దేవరకద్ర ఉర్దూ మీడియం పాఠశాలకు తీసుకొచ్చారు. ఆ పిల్లల్లో ఒకరు ఖాజా కాగా, మరొకరు మౌలానా. వారి తండ్రి చనిపోవడంతో 3వ తరగతి, 9వ తరగతి చదువుతూ మానేశారని ఉపాధ్యాయులు తెలిపారు. వారిద్దరిని పాఠశాలలో చేర్పించి సక్రమంగా వచ్చేలా చూడాలని, డ్రాపౌట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. కాగా, విద్యార్థులపై కలెక్టర్ చూపిన ప్రత్యేక శ్రద్ధపై పలువురు అభినందించారు. -
ఇన్స్పైరింగ్ ఐఏఎస్‌లలో మనవాళ్లు ఇద్దరు
సాక్షి, హైదరాబాద్: బెటర్ ఇండియా వెబ్సైట్ దేశంలోని స్ఫూర్తిదాయక ఐఏఎస్ అధికారుల జాబితాను రూపొం దించింది. మెదక్ జిల్లా కలెక్టర్ భారతి హొలికెరి, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్‌లకు ఈ జాబితాలో చోటు దక్కింది. వినూత్న ఆలోచనలతో కొత్తరకమైన కార్యక్రమాలకు శ్రీకారంచుట్టి, ప్రజల అభ్యున్నతికి కృషి చేశారని వీరిద్దరి గురించి బెటర్ ఇండియా సంస్థ పేర్కొంది. భారతి హొలికెరి గర్భిణుల ఆరోగ్య పరిరక్షణ కోసం తీసుకున్న చర్యలను ప్రశంసించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో వైద్యసేవలను మెరుగుపర్చారని పేర్కొంది. మెదక్ జిల్లాను వంద శాతం బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా మార్చారు. ఇక రొనాల్డ్ రాస్ గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ ప్రజల అభ్యున్నతికి విభిన్న కార్యక్రమాలను అమలుచేశారు. హరితహారం అమలుచేసి జిల్లాను ఉత్తమ స్థానంలో నిలిపారు. దివ్యాంగ సోలార్ సొసైటీ ఏర్పాటుచేసి దివ్యాంగుల అభ్యున్నతికి కృషి చేశారు. కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తి చేసేలా వినూత్న కార్యక్రమాలు అమలుచేశారు’ అని బెటర్ ఇండియా సంస్థ పేర్కొంది. -
సింగూరుకు పోటెత్తుతున్న వరద..
సందర్శకులకు ప్రవేశం నిషేధం మెదక్ జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు వరద పొటెత్తుతోంది. వరద ఉధృతి దృష్ట్యా ప్రాజెక్టుకు సందర్శకులకు ప్రవేశం నిషేధిస్తున్నట్లు జల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్ ప్రకటించారు. మూడు రోజుల పాటు సందర్శకులను అనుమతించమని ఆయన తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1,717.93 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,716.45 అడుగుల వరకు నీరు చేరింది. ఇన్ ఫ్లో లక్ష క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 84 వేల క్యూసెక్కులు ఉంది. -
అంగన్వాడీల్లో అటకెక్కిన ‘ఆంగ్ల’ విద్య
ఇందూరు : అంగన్వాడీ కేంద్రాలను పటిష్టం చేయడానికి గత కలెక్టర్ రొనాల్డ్ రోస్ హయాంలో ఐసీడీఎస్ నిజామాబాద్ అర్బన్ ప్రాజెక్టు పరిధిలో చేపట్టిన ఆంగ్ల విద్య కార్యక్రమం అటకెక్కింది. ఆయన బదిలీ అనంతరం ఐసీడీఎస్ అధికారులు ఈ కార్యక్రమాన్ని పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడానికి గత కలెక్టర్ రొనాల్డ్ రోస్ చర్యలు చేపట్టారు. అతి తక్కువ హాజరు శాతం నమోదవుతున్న ఐసీడీఎస్ నిజామాబాద్ అర్బన్ ప్రాజెక్టును ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. నగరంలోని పులాంగ్ చౌరస్తాలో గల అంగన్వాడీ కేంద్రంలో 2015 జూలైలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించారు. ఎలాంటి ఖర్చు లేకుండా ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థులతో ఆంగ్ల మాధ్యమంలో పాఠాలు చెప్పించడానికి చర్యలు చేపట్టారు. నిజామాబాద్ అర్బన్ ప్రాజెక్టులో పరిధిలో మొత్తం 152 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. అయితే మొదటి విడతగా 30 అంగన్వాడీ కేంద్రాలను ఎంపిక చేసిన రొనాల్డ్ రోస్.. ఒక్కో కేంద్రానికి ఇద్దరు చొప్పున మొత్తం 60 మంది మెడికల్ విద్యార్థులను కేటాయించారు. వీరికి కేటాయించిన కేంద్రాలకు విద్యార్థులు వారంలో ఒక సారి (ప్రతి శుక్రవారం) వెళ్లి 3 నుంచి 5 ఏళ్లలోపు విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్య అందించాల్సి ఉంది. ఇలా చిన్న పిల్లలకు బోధించడం తమకూ ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో మెడికల్ విద్యార్థులు కూడా కార్యక్రమానికి ఒప్పుకున్నారు. కానీ రొనాల్డ్ రోస్ ప్రారంభించిన ఆంగ్ల విద్య కార్యక్రమం కొన్ని రోజులకే అటకెక్కింది. ఆయన గతేడాది ఆగస్టులో బదిలీ కావడంతో ఆంగ్ల విద్య నిలిచిపోయింది. మెడికల్ విద్యార్థులు కూడా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చి పిల్లలను విద్య నేర్పించడం మానేశారు.ప్రైవేట్ పాఠశాలల్లో ప్రీ స్కూల్ విద్య అందిస్తుండడంతో చాలా మంది తమ పిల్లలను రెండున్నర ఏళ్లకే ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారు. దీంతో అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థుల సంఖ్య రానురాను తగ్గిపోతోంది. దీనిని గుర్తించిన గత కలెక్టర్ రొనాల్డ్‌రోస్.. అంగన్వాడీల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధించడానికి ఏర్పాట్లు చేశారు. మొదట నిజామాబాద్ అర్బన్ ప్రాజెక్టును ఎంపిక చేశారు. ఈ ప్రయోగం విజయవంతమైతే అన్ని అంగన్వాడీల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని భావించారు. ఆయన బదిలీతో ఈ కార్యక్రమం ఆగిపోయింది. దీనిని కొనసాగించడానికి ఐసీడీఎస్ అధికారులూ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ప్రస్తుత కలెక్టర్ దీనిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా – డెబోరా, నిజామాబాద్ అర్బన్ సీడీపీవో నిజామాబాద్ అర్బన్ ప్రాజెక్టులో ఆంగ్ల విద్యను అమలు చేసిన విషయం నాకు తెలియదు. అప్పుడు నేను ఇక్కడ పని చేయలేదు. అయితే అంగన్వాడీల్లో పిల్లల సంఖ్య పెంచడానికి ఈ విధానం ఎంతో మేలు చేస్తుంది. నగరంలో నిలిచిపోయిన ఆంగ్ల విద్యను ప్రారంభించాలని జిల్లా ఉన్నతాధికారులను కోరతా.. -
సెలైన్‌తో మొక్కలకు ప్రాణం
వినూత్న ఆలోచనకు కలెక్టర్ ప్రశంస సోషల్ మీడియాలో పెట్టండి అధికారులకు రోనాల్డ్ రోస్ సూచన జూనియర్ కళాశాలలో హరితహారం జగదేవ్‌పూర్: సెలైన్‌తో మొక్కలను కాపాడుతున్న తీరును కలెక్టర్ రోనాల్డ్ రోస్ ప్రశంసించారు. శనివారం ఆయన జగదేవ్‌పూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. సెలైన్ ఆలోచనను మెచ్చుకున్నారు. ఈ ఆలోచన ఎవరిది? అని కలెక్టర్ ఆరా తీయగా తానేనంటూ కళాశాల లెక్చరర్ మోహన్‌దాస్ ముందుకు రావడంతో అభినందించారు. ఆలోచన బాగుంది, వెంటనే సోషల్ మీడియాలో పెట్టండి అంటూ పక్కనే ఉన్న అధికారులకు ఆదేశించారు. మొక్కలను సెలైన్ డ్రిప్పు పద్ధతి బాగుంది.. మొక్కలకు ఎవరు పేరు పెట్టారు? అంటూ విద్యార్థులను ఆరా తీశారు. ఎవరు నాటిన మొక్కకు వారి పేరే పెట్టుకున్నామని విద్యార్థులు చెప్పడంతో కలెక్టర్ శభాష్ అంటూ మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళాశాల ఐడియా చాలా అద్భుతంగా ఉందని ప్రతి ఒక్కరు ఇలాంటి ప్రయోగాలు చేసి మొక్కలను కాపాడుకోవాలని సూచించారు. అనంతరం ప్రిన్సిపాల్ కళాశాలలో నెలకొన్న సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. అంతకుముందు హరితహారంలో భాగంగా కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో గఢా అధికారి హన్మంతరావు, ఎంపీపీ రేణుక, జెడ్పీటీసీ రాంచంద్రం, ఎంపీడీఓ రామారావు, తహసీల్దార్ పరమేశం, సర్పంచ్ కరుణకర్, ఎంపీటీసీలు వెంకటయ్య, బాలేషంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
హాజరు శాతం పెంచడమే లక్ష్యం
♦ కలెక్టర్ రోనాల్డ్ రోస్ ♦ కోత్లాపూర్‌లో బడిబాట ప్రారంభం సంగారెడ్డి రూరల్: ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచడమే ఆచార్య జయశంకర్ బాడిబాట ప్రధాన లక్ష్యమని కలెక్టర్ రోనాల్డ్ రోస్ అన్నారు. సోమవారం సంగారెడ్డి మండలం కోత్లాపూర్‌లో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బడి బయట ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలన్నారు. ఐదు నుంచి పదిహేనేళ్ల వయసులోపు పిల్లలను పనుల్లో పెట్టుకోరాదని సూచించారు. పిల్లలు పా ఠశాలల్లో ఉండేలా తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు. బడి బయట పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు చదువుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన క ల్పించాలన్నారు. ప్రధానోపాధ్యాయులకు ఎంఈఓలు తరచూ సమావేశాలను నిర్వహించి బడిబాట కార్యక్రమం విజయవంతమయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి యాస్మిన్ బాషా, తహసీల్దార్ గోవర్దన్, ఆర్ఐ కార్తీక్, ఎంపీటీసీ కళావతి వెంకటేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయ్‌కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
డ్రాపౌట్లను బడిలో చేర్చండి: కలెక్టర్
సమీక్షలో కలెక్టర్ రోనాల్డ్ రోస్ సంగారెడ్డి జోన్: జిల్లాలో బడి మానేసిన పిల్లలను తిరిగి పాఠశాలలో చేర్పించేందుకు కృషి చేయాలని కలెక్టర్ రోనాల్డ్ రోస్ సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టర్ 15 మండలాలకు సంబంధించిన మండల విద్యాధికారులు, రీసోర్స్ పర్సన్లతో సమీక్ష జరిపారు. జిల్లాలో మొత్తం 3,700 మంది పిల్లలు మధ్యలో బడి మానేశారని తెలిపారు. యూనిసెఫ్ సౌజన్యంతో జిల్లాలో వలస వెళ్లిన పిల్లలను, బడి మానేసిన పిల్లలను గుర్తించి వారిని బడి బాట పట్టించాలన్నారు. పిల్లల కోసం 15 మండలాల్లో 163 ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపా రు. ఏప్రిల్ 18 నుంచి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు విద్యా వలంటీర్ల ద్వారా తెలుగు, ఆంగ్లం, గణిత శాస్త్రం బోధించడం జరుగుతుందన్నారు. ఈ ప్రత్యేక బోధన కార్యాక్రమం జూలై 15వరకు కొనసాగిస్తామన్నారు. ఇప్పటి వరకు మూడు వేల మంది పిల్లలను గుర్తించి బడి బాటలోకి తేవడం జరిగిందని, మిగిలిన ఏడు వందల మంది పిల్లలను పాఠశాలలో చేర్పించేం దుకు చర్యలు తీసుకోవాలన్నారు. బడిలో చేరకపోవడానికి గల కారణాలను నివేదిక రూపంలో అందజేయాలని కోరారు. పిల్లలను తిరిగి బడిలో చేరి పాఠశాల వాతావరణాన్ని అలవాటు చేసుకునేందుకు ప్రత్యేకంగా ఉదయం పూట స్నాక్స్ ఏర్పాటు చేయడం వలన మంచి ఫలితాలు వచ్చాయన్నారు. పాఠశాలలు ఈ నెల 13 ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ ప్రత్యేక తరగతులకు ఇబ్బంది కలుగకుండా ప్రతి ఉన్నత పాఠశాలలో ఒక క్లాస్ రూమ్ ను కేటాయించాలని ఆర్వీఎం పీఓకు సూచించారు. గదులు అందుబాటులో లోని చోట ప్రత్యామ్నాయ భవనాలను ఏర్పాటు చేయాలన్నారు, ప్రతి రోజా ఈ కేంద్రాలను ఎంఈఓలు, రిసోర్సు పర్సన్లు తనిఖీ చేసి నివేదికలను, ఫొటోలను వాట్సప్ ద్వారా అందజేయాలని సూచించారు. సమావేశంలో యూనిసెఫ్ ప్రతినిధి బింద్రా , ఆర్వీఎం పీఓ యాస్మిన్ భాషా పాల్గొన్నారు. -
వక్ఫ్ భూములు కాపాడాలి
♦ భూముల సమాచారం పక్కాగా ఉండాలి ♦ రిజిస్ట్రేషన్లు చేయొద్దు ఆక్రమణలు వాస్తవమే ♦ శాసనసభ కమిటీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సంగారెడ్డి జోన్: రాష్ట్రంలో వక్ఫ్ భూములను కాపాడాలని వక్ఫ్ ఆస్తుల పరిరక్షణపై ఏర్పాటైన శాసనసభ కమిటీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అధికారులను ఆదేశించారు. భూములు ఆక్రమణకు గురైన విషయం వాస్తవమేనని అంగీకరించారు. వక్ఫ్ భూముల విచారణకు నియమించిన శాసన సభ కమిటీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, సభ్యులు ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, సయ్యద్ అల్తాఫ్ హుస్సేన్ రజ్వీలు మంగళవారం సంగారెడ్డిలో పర్యటించారు. ఈ మేరకు వారు కలెక్టరేట్ సమావేశ మందిరంలో తహసీల్దార్లతో స మీక్ష నిర్వహించారు. చైర్మన్ బాజిరెడ్డి మాట్లాడు తూ... గతంలో నియమించిన కమిటీ నివేదిక లో స్పష్టత లేకపోవడంతో శాసన సభ్యులు, శాసన మండలి సభ్యుల విజ్ఞప్తి మేరకు సీఎం స్పందించి వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం శాసన సభ కమిటీని ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణలో పెద్ద ఎత్తున వక్ఫ్ భూములు ఆక్రమణకు గురైనందున వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక రూపొందిస్తామన్నారు. రెవెన్యూ పో లీస్, వక్ఫ్ అధికారులు సమన్వయంతో పనిచేసి వక్ఫ్ భూములు, ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాలని సూచించారు. ఆస్తుల విషయంలో గందరగోళం... జిల్లాలో 23,910.11 ఎకరాల వక్ఫ్ భూములున్నట్టు సమాచారం ఉండగా, వక్ఫ్‌బోర్డు ఇన్స్పెక్టర్ మాత్రం 20,806 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు నివేదిక అందించారని చైర్మన్ బాజిరెడ్డి తెలిపారు. జిల్లాలో వక్ఫ్ బోర్డు ఆధీనంలో 4,480 ఎకరాలు ఉండగా, 7,728.3 ఎకరాలు ఓఆర్సీ, ఇతరుల కబ్జాలో ఉందన్నారు. 8,603.2 ఎకరాల భూమి వివరాలను తేల్చాల్సి ఉందన్నారు. వక్ఫ్ బోర్డు నుంచి ఆదాయం రూ.5 కోట్లు వస్తుండగా అంతే మొత్తంలో ఖర్చవుతుందన్నారు. వక్ఫ్ భూములను కొందరు దాతలు విరాళంగా అందజేశారన్నారు. వాటిని విద్య, వైద్యం, ఇతర సామాజిక అంశాలకు వినియోగించాలనే వారి లక్ష్యమన్నారు. కాని వారి లక్ష్యం నెరవేరకపోగా, ఆస్తులను కొందరు ఆక్రమించుకొని అనుభవిస్తున్నారన్న ఆరోపణలపై తమ కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు. రిజిస్ట్రేషన్లు జరగకుండా నియంత్రించాలి... వక్ఫ్ భూములు రిజిస్ట్రేషన్ జరగకుండా చూడాలని బాజిరెడ్డి అధికారులను ఆదేశించారు. సర్వే నంబర్ల వారీగా వివరాలను సంబంధిత రిజిస్ట్రార్లకు అందజేయాలని సూచించారు. ఆస్తుల ఆక్రమణను తీవ్రంగా పరిగణిస్తామన్నారు. వక్ఫ్ బోర్డు వివరాలను, రెవెన్యూ రికార్డులకు సరిచూసుకుని త్వరగా నివేదికలు అందజేయాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు. జిల్లా నుంచి వచ్చే నివేదిక ఆధారంగా మిగిలిన తొమ్మిది జిల్లాల్లో తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టత వస్తుందన్నారు. సమైక్య రాష్ట్రంలోని వక్ఫ్‌బోర్డు పట్ల తీవ్ర నిర్లక్ష్యం జరిగిందన్నారు. వక్ఫ్ ఆస్తులతో ప్రభుత్వానికి సంబంధం లేకుండా చేశారన్నారు. వక్ఫ్ ఆస్తులను రెవెన్యూ శాఖకు అప్పగించి, వాటి పరిరక్షణకు శాసన సభ కమిటీ చర్యలు చేపట్టిందన్నారు. బోర్డులు ఏర్పాటు చేయాలి... క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న తహసీల్దార్లు వక్ఫ్‌భూములను కాపాడాలని కమిటీ సభ్యులు ఫారూక్ హుస్సేన్, సయ్యద్ అల్తాఫ్ హుస్సేన్ రజ్వీ అధికారులకు సూచించారు. సదరు భూ ముల్లో బోర్డులను ఏర్పాటుచేసి అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కోహీర్‌లో అత్యధికంగా భూములున్న నేపథ్యంలో వాటి పరిరక్షణకు సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 175 దరఖాస్తులు ఆర్డీఓల వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిష్కరించి వివరాలను వక్ఫ్ బోర్డుకు అందజేయాలన్నారు. వక్ఫ్ భూములు లీజుకు పొందిన, ఆస్తుల విషయంలో అద్దె పెంచకుండా, ఖాళీ చేయకుండా బోర్డుకు ఆదాయం రాకుండా కబ్జా చేస్తున్న వాటి వివరాలను అందజేయాలన్నారు. జిల్లాలో వక్ఫ్ భూములను క్షేత్రస్థాయిలో గుర్తించడానికి మరో ఐదుగురు ఇన్స్పెక్టర్లను కేటాయించాలని కలెక్టర్ రోనాల్డ్ రోస్ అన్నారు. పహాణీల్లో వక్ఫ్‌భూములను ప్రత్యేకంగా నమోదు చేయాలని సూచించారు. ఉదయం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో శాసన సభా కమిటీ సభ్యుల సమావేశంలో కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వక్ఫ్ భూముల వివరాలు వెల్లడించారు. సమావేశంలో శాసన సభ్యులు మహిపాల్ రెడ్డి, డీఆర్ఓ దయానంద్, వక్ఫ్ సీఈఓ మహ్మద్ అసదుల్లా, సంగారెడ్డి, మెదక్ ఆర్డీఓలు శ్రీనివాస్ రెడ్డి, మెంచు నగేశ్, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
ఏఈని సస్పెండ్ చేసిన కలెక్టర్
మెదక్ జిల్లా నారాయణఖేడ్ గురుకుల బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేయాడానికి వచ్చిన కలెక్టర్ భవన నిర్మాణ పనులను పరిశీలిస్తున్న ఏఈని సస్పెండ్ చేశారు. బుధవారం జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ గురుకుల వసతి గృహాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నూతన భవన పనులను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లు నిర్మించక పోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులను పర్యవేక్షి స్తున్న ఏఈ రఘు పనితీరును ఆయనను విధుల నుంచి తొలగించారు. -
రాస్‌ను మరిచారు సరే...?
రోనాల్డ్ రాస్ హైదరాబాద్‌లోని బేగంపేట పరిశోధనా కేంద్రంలోనే దోమ కాటు మలేరియాకు కారణమని కనిపెట్టారు. ఆయనను మరిస్తే మరిచారు... మలేరియా నిర్మూలన పట్ల అయినా పాలకులు వీసమెత్తు శ్రద్ధ చూపడం లేదు. కారణం మలేరియా పేదల రోగం, అందులోనూ ఆదివాసీలకే ఎక్కువగా వచ్చే రోగం. మలేరియా నుంచి ప్రజలను కాపాడాలని రాస్ పడ్డ తపనలో ఒక వంతైనా ప్రభుత్వాలకు, పౌర సమాజానికి ఉండాలి. మలేరియాను పారద్రోల గలిగీ, ఆ పని చేయలేకపోవడమంటే రాస్ కృషిని అవహేళన చేయడమే అవుతుంది. ప్రపంచ ప్రజారోగ్యానికి సంబంధించి చిరస్మరణీయమైన గొప్ప రోజు.. 1897 ఆగస్టు 20. అంతకుముందు వరకు ప్రాణాంతకమైన మలేరియా వ్యాధి చెడుగాలుల వల్ల వస్తుందని ప్రపంచం విశ్వసించేది. రోనాల్డ్ రాస్ అనే శాస్త్రవేత్త అలుపెరుగక సాగించిన నిరంతర పరిశోధనల ఫలితంగా అది తప్పని తేలింది. మలేరియా వ్యాధి దోమ కాటు వల్ల సంక్రమిస్తుందని రాస్ చారిత్రాత్మకమైన ఆ రోజునే కనుగొన్నారు. అదీ మన హైదరాబాద్ నగరం లోనే! దోమలో, మనిషిలో రెండు దశలుగా మలేరియా పరాన్నజీవి జీవిత చక్రం సాగుతుందని రాస్ తేల్చారు. ఆయన శాస్త్రీయ ఆవిష్కరణ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 111 దేశాల్లోని కోట్లాది మంది మలేరియా వ్యాధి నుంచి విముక్తి చెందడానికి దోహదం చేసింది. భారతదేశం మాత్రం ఇంకా మలేరియా వ్యాధి నుంచి విముక్తి చెందలేకపోవడమే విషాదం. దోమలకు నిలయమైన కొండకోనల్లో మలేరియా జ్వరంతో రాలిపోతున్న గిరిజనుల ప్రాణాలు లెక్కలకు అందవు. అందుకే మరపునపడ్డ చరిత్రగా మారిన రోనాల్డ్ రాస్ని సంస్మరించుకోవాల్సిన సందర్భమిది. హైదరాబాద్‌లోని బేగంపేట నుంచి సికింద్రాబాద్ వైపు వస్తుంటే, పాత విమానాశ్రయం దగ్గరలో ఎడమవైపున ‘రోనాల్డ్ రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పారసైటాలజీ’ అనే బోర్డు కనిపిస్తుంది. లోపలికి వెళ్లి చూస్తే శిథిలావస్థలో ఉన్న ఓ పరిశోధనాలయం కనిపిస్తుంది. దాని ఆలనా పాలనా ఉస్మానియా విశ్వవిద్యాలయం జంతుశాస్త్ర విభాగం బాధ్యత. కానీ అలాంటి దాఖలాలేవీ లేవు. మంగళవారం ఒక ఉస్మానియా వర్సిటీ ఉద్యోగి, చెత్తను, గడ్డిని, పిచ్చి మొక్కలను పెరికివేస్తు న్నాడు. ఎందుకని అడిగితే ఆగస్టు 20వ తేదీన ఇక్కడేదో మీటింగు ఉంద న్నాడు. అది ఎందుకో కూడా అతనికి తెలియదు. రాస్ మలేరియా పరిశోధ నలు ఆ సంస్థలోనే జరిగాయి. వానాకాలం దోమ గండం మన దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో, ప్రధానంగా ఆదివాసీ ప్రాంతాల్లో వర్షాకాలం అంటే ప్రజలకు ప్రాణగండమే. ఏటా మలే రియా మహమ్మారి వల్ల మరణిస్తున్నవారి సంఖ్య అధికంగానే ఉంటోంది. ఇటీవలే ఢిల్లీకి చెందిన ‘తెహల్కా’ ఫొటో జర్నలిస్టు తరుణ్ శరావత్ సైతం ఆదివాసీ జీవితాలపై పరిశోధన కోసం వెళ్లి మలేరియా బారినపడి చని పోయారు. మావోయిస్టు అగ్రనేత అనురాధాగాంధీ లాంటి ఉద్యమకారులు సైతం మలేరియాకు బలైపోయారు. అయితే అతి తక్కువ ఖర్చుతో లభించే మందు సాధారణ మలేరియాను నయం చేయగలుగుతుంది. అది సైతం అందుబాటులో లేక, కొనలేక ఏటా వందలాది విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. 1998లో ఒక్క ఆదిలాబాద్‌లో, కేవలం మూడు నెలల్లో 2,200 మంది ఆదివాసులు మరణించారు. 118 ఏళ్ళ క్రితమంటే ఈ జ్వరా లకు కారణం తెలియదు. ఇటాలియన్లో ‘మలే అంటే చెడు అని, ‘ఏరియా’ అంటే గాలి అని అర్థం. ఈ జ్వరాలకు చెడుగాలే కారణమని అంతవరకు పరి శోధకులు భావించేవారు. 1895లో హైదరాబాద్ రావడానికి ముందే మలేరి యాకు దోమలకు సంబంధం ఉందని విశ్వసిస్తున్న రాస్ బేగంపేటలోని పరిశోధన సంస్థలో 1897 జూన్‌లో 20 దోమలను కల్చర్ చేసి పెంచాడు. ఆగ స్టులో హుస్సేన్ ఖాన్ అనే మలేరియా రోగగ్రస్తుని ద్వారా ఎనిమిది దోమల రక్తంలోకి మలేరియా పరాన్నజీవి ప్రవేశించినట్టు కనిపెట్టాడు. దోమలే మలే రియా వ్యాధికి మూలమని ఆగస్టు 20న నిర్ధారించి ప్రపంచానికి చాటాడు. ఇష్టం లేకుండానే డాక్టరై... భారత సైన్యంలో జనరల్‌గా పనిచేసిన సర్ సీసీజీ రాస్, మటెల్డ దంపతులకు రోనాల్డ్ 1857లో హిమాలయాల సమీపంలోని అల్మోరాలో జన్మించారు. అయితే విద్యాభ్యాసం ఇంగ్లండ్‌లోనే సాగింది. కవిత్వం, సాహిత్యం, సంగీ తం, గణితశాస్త్రాల పట్ల మక్కువ ఉన్న రోనాల్డ్ వైద్య విద్య పట్ల అంత ఆసక్తి లేదు. తండ్రి కోరిక మేరకు వైద్య విద్యనభ్యసించాడు. అన్ని అర్హతలుగల డాక్టర్‌గా రోనాల్డ్ రాస్ 1881లో భారత్‌కు తిరిగి వచ్చి, ఇండియన్ మెడికల్ సర్వీసులో చేరారు. మొదట మద్రాసు, బర్మా, అండమాన్లలో పనిచేశారు. అప్పట్లోనే ఆయనలో ఉష్ణదేశమైన భారతదేశంలో ప్రజల ఆరోగ్య సమ స్యలపై, ముఖ్యంగా జ్వరాలపై పరిశోధనలు చేయాలనే ఆసక్తి కలిగింది. 1892 నుంచి మలేరియానే ఆయన తన ముఖ్య పరిశోధనాంశంగా ఎంచుకు న్నాడు. 1894లో ఇంగ్లండ్ వెళ్ళి డాక్టర్ పాట్రిక్ మాన్సన్ మార్గదర్శకత్వంలో తన పరిశోధనలు ప్రారంభించారు. అప్పటికే డాక్టర్ పాట్రిక్ మాన్సన్ ఉష్ణ మండల దేశాల్లో ప్రబలే ప్రధాన వ్యాధులపై పరిశోధనలు చేస్తున్నారు. మలే రియా జ్వరానికి దోమలు కారణం కావచ్చని డాక్టర్ మాన్సన్ మొదట అభి ప్రాయపడ్డారు. ఆ విషయం రోనాల్డ్ రాస్‌ను అమితంగా ఆకర్షించింది. అయితే దాన్ని రుజువు చేసి చూపాలి. అందుకు భారతదేశమే సరియైన ప్రయోగశాల కాగలదని ఆయన భావించారు. అప్పటి భారత ప్రభుత్వం రోనాల్డ్ రాస్‌ను 1895లో ఇండియన్ మెడికల్ సర్వీసులోకి తీసుకొని, సికిం ద్రాబాద్‌లో ఆర్మీ డాక్టర్‌గా నియమించింది. అలా రాస్ 1895 నుంచి 1897 వరకు దాదాపు రెండేళ్లు బేగంపేట పరిశోధనా కేంద్రంలోనే మలేరియా పరిశో ధనలు చేశారు. దోమ కడుపులో మలేరియా పరాన్నజీవి జీవితం తొలి దశ గడుస్తుందని కనుగొన్న రాస్... బేగంపేటలోనే దోమకు మనిషి ద్వారా, మనిషికి దోమ ద్వారా మలేరియా పరాన్నజీవి వ్యాపిస్తోందని రుజువు చేశాడు. ఆ పరిశోధనలు మన దేశంలోనే, అదీ తెలుగు నేలపైనే జరగడం మనకి గర్వకారణం. రోనాల్డ్ రాస్ సేవలను గుర్తించి 1902లో నోబెల్ బహుమతిని ప్రసాదించారు. ఆయన పేరు మీద 1926లో లండన్‌లో ఉష్ణ మండల వ్యాధుల పరిశోధన సంస్థను ప్రారంభించారు. రాస్ జీవిత చర మాంకం ఆర్థిక ఇబ్బందులతో గడిచింది. 1932, సెప్టెంబర్ 16న 75 ఏళ్ల వయసులో రాస్ మరణించారు. మలేరియాలో మన ఘనత మరి ఆయన త్యాగానికి మనం ఇస్తున్న విలువేమిటి? ఆయన అసాధారణ సేవకు కొనసాగింపేమిటి? ఆలోచించాలి. హైదరాబాద్‌లోని విశ్వవిద్యాల యాలు, ప్రభుత్వాలు ఆయనను పూర్తిగా మరచాయి. మలేరియా నిర్మూలన పట్లగానీ, ఆ వ్యాధికి బలైపోతున్న వారి పట్ల గానీ ప్రభుత్వాలకు వీసమెత్తు శ్రద్ధలేదు. అందుకు కారణం మలేరియా ప్రధానంగా పేదల రోగం, అందు లోనూ ఆదివాసీలకే ఎక్కువగా వచ్చే రోగం. దోమలు దూరని కోటల్లాంటి ఇళ్లలో ఉండే వారికి అది పట్టదు. ఒకవేళ ఎక్కడైనా దోమ కుట్టి మలేరియా వచ్చినా సులభంగా నయం చేసే డాక్టర్లున్నారు, మందులున్నాయి. వైద్య సౌక ర్యాలు లేని, అడవుల్లో మురికినీళ్ళ పక్కన, చెట్ల చేమల మధ్య జీవిస్తున్న వాళ్ళు, పట్టణ, నగర మురికివాడల్లో బతికే వారే ఈ వ్యాధికి బలైపోతు న్నారు. ప్రపంచవ్యాప్తంగా 2010లో 21 కోట్ల 90 లక్షల మందికి మలేరియా సోకగా, 40 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్టు అంచనా. అయితే ఈ లెక్క లన్నీ అరకొర సమాచారమే. ఆదివాసీ ప్రాంతాల్లో, పల్లెల్లో చనిపోతున్న వారి వివరాలను సేకరించేవారే లేరు. ఆసుపత్రిలో మరణిస్తే తప్ప ప్రభుత్వం దాన్ని మలేరియా మరణంగా లెక్కించదు. మన దేశంలో ప్రభుత్వాసుప త్రులు ఎన్ని గ్రామాలకు అందుబాటులో ఉన్నాయో తెలియందికాదు. చాలా దేశాలు మలేరియాను అతి తీవ్ర సమస్యగా భావించి తరిమేసినట్టు ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకటించింది. ఇటీవలనే యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మలే రియా లేదని ఆ దేశం సగర్వంగా ప్రకటించింది. ప్రపంచంలో 111 దేశాలు మలేరియా నుంచి విముక్తి కాగా ఇంకా 34 దేశాల్లో ప్రజలు ఆ వ్యాధి బారిన పడుతున్నారు. వాటిలో మన దేశమూ ఒకటి. పేదలపైనే దోమల కన్ను ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఆదివాసీ గూడేలలో ప్రజలు జ్వరాలతో బాధప డుతున్నట్టు గత వారం రోజులుగా పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఏటా ఇది సర్వసాధారణమైపోయింది. దోమల ద్వారానే వ్యాపించే డెంగ్యూ కూడా గతంలో ఎన్నడూలేని విధంగా వ్యాపిస్తున్నది. ఇది చాలా తీవ్రమైన సమస్య. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గంగదేవిపల్లి ‘గ్రామ జ్యోతి’ కార్యక్రమంలో మాట్లాడుతూ... దోమల వల్ల జ్వరాలు వస్తాయని, దోమలు లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. దోమకాటుకు గురయ్యేది ఎక్కువగా పేదలేననే విషయాన్ని అధికారులు గుర్తిస్తే మంచిది. ధనవంతుల నివాస ప్రాంతాలను అత్యంత పరిశుభ్రంగా ఉండేలా చూసి, పేదల మురికివాడలను పట్టించుకోకపోతే వారి ప్రాణాలకు దోమ గండం తప్పదు. ప్రజల భాగస్వామ్యంతో పరిసరాల పరిశుభ్రతలో ప్రధానాంశంగా ఉండాల్సింది ఇదే. ఎటువంటి వైద్య సౌకర్యాలూ లేని అటవీ ప్రాంతాల్లోని ప్రజలకు ఆరోగ్య, వైద్య సదుపాయాల కార్యక్రమాలను అందు బాటులోకి తేవాలి. ఆదివాసీ ప్రాంతాల్లోనే కాదు, గ్రామాల్లో సైతం పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు ఉండటంలేదు. మలేరియాలాంటి జ్వరా ల నుంచి ప్రజలను కాపాడాలని రాస్ పడ్డ తపనలో ఒక వంతైనా ప్రభుత్వా లకు, పౌర సమాజానికి ఉండాలి. మలేరియాను పారద్రోలగలిగీ, ఆ పని చేయలేకపోవడమంటే రాస్ కృషిని అవహేళన చేయడమే అవుతుంది. (వ్యాసకర్త: మల్లేపల్లి లక్ష్మయ్య.. సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213 -
14న కొత్త కలెక్టర్ రాక
సాక్షి, సంగారెడ్డి : కొత్త కలెక్టర్ రోనాల్డ్ రాస్ ఈనెల 14న బాధ్యతలు చేపట్టనున్నారు. రాహుల్ బొజ్జా హైదరాబాద్‌కు బదిలీ అయిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన రోనాల్డ్‌రాస్‌ను ప్రభుత్వం మెదక్ జిల్లా కలెక్టర్‌గా నియమించింది. రోనాల్డ్ ప్రస్తుతం సెలవుల్లో ఉన్నారు. ఈనెల 14న ఆయన తిరిగి రానున్నారు. అదేరోజు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. రోనాల్డ్ రాస్ ప్రస్థానం.. తమిళనాడు రాష్ట్రానికి చెందిన రోనాల్డ్ రాస్ మద్రాసు యూనివర్సిటీలో బీకాం పూర్తి చేశారు. 1980 జూన్ 24న జన్మించిన ఆయన మద్రాసు యూనివర్సిటీలో ఉన్నత విద్యనభ్యసిస్తూ 2006లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. 2006 నుంచి 2007 వరకు ట్రైనింగ్ పూర్తి చేసిన రోస్కు 2007 జులై 22న అసిస్టెంట్ కలెక్టర్‌గా ల్యాండ్ రెవెన్యూ హైదరాబాద్ కార్యాలయంలో మొదటి పోస్టింగ్ ఇచ్చారు. అసిస్టెంట్ కలెక్టర్, సబ్‌కలెక్టర్ హోదాలలో అదే కార్యాలయంలో పనిచేసిన ఆయన 2008 సెప్టెంబర్‌లో నర్సాపూర్ సబ్‌కలెక్టర్‌గా నియమితులు కాగా అక్కడ 2010 వరకు పని చేశారు. 2010 ఫిబ్రవరి 19న రంపచోడవరం ఐటీడీఏ పీవోగా నియమితులైన రొనాల్డ్ 2011 ఆగస్టు 19 వరకు అక్కడే విధులు నిర్వహించారు. 2011 ఆగస్టు 20న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో అడిషనల్ సీఈవోగా పనిచేశారు. 2012 సెప్టెంబర్11న గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లో అడిషనల్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. సుమారు రెండు సంవత్సరాల పాటు జీహెచ్ఎంసీలో వివిధ జోన్లలో పనిచేసిన ఆయన సిటీ ప్లానింగ్ విభాగంలో కీలకంగా వ్యవహరించారు. విధుల్లో ముక్కుసూటిగా, నిజాయితీగా, నిక్కచ్చిగా వ్యవహరించే అధికారిగా పేరున్న రోనాల్డ్‌రాస్ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఖైరతాబాద్ రిటర్నింగ్ అధికారిగా సమర్థంగా ఎన్నికలు నిర్వహించారన్న పేరుంది. సిటీ ప్లానింగ్ విభాగం నుంచి నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ కాాగా అక్కడ నుంచి ప్రస్తుతం మెదక్ జిల్లాకు బదిలీ అయ్యారు. -
భారమైతే మాకివ్వండి
ప్రగతినగర్ : ‘పసి మొగ్గలను తుంచేయొద్దు.. ఆర్థిక స్థోమత లేని తల్లిదండ్రులెవరైనా మాకు అప్పగిస్తే కంటికి రెప్పలా కాపాడు కుంటాం..కానీ వారిని చెత్తకుప్పల్లో.. నాళాల్లో వేసి వారి ప్రాణాలు తీయండి. అది మానవతకే చెరగని మచ్చ’. అంటూ కలెక్టర్ రొనాల్డ్ రోస్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం నగరంలోని బాల సదనంలో హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.అనాథ శిశువులను ముద్డాడారు. అమ్మా, నాన్నలు లేరనే దిగులు రానీయకుండా చిన్నారులను చూసుకోవాలని కలెక్టర్ సిబ్బందికి ఉద్బోధించారు. కేక్‌కట్ చేసి కలెక్టర్ చిన్నారులకు తినిపించారు. అనంతరం బాలసదనంలో ఉన్న 80 మంది చిన్నారులకు కొత్త దుస్తులతో పాటు, దుప్పట్లు,స్వెటర్లు హెల్పింగ్ హార్ట్స్ సబ్యులు అందజేశారు. కార్యాక్రమంలో ఆర్బీఓ యదిరెడ్డి,హెల్పింగ్ హార్ట్స్ సభ్యులు రమణారెడ్డి, మహేశ్, శ్రీనివాస్, కార్తిక్, వేణు, డీఎం సివిల్ సప్లై దివాకర్, ఏఎస్ఓ లక్ష్మీభవాని, తెలంగాణ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు సూర్యప్రకాష్, సుధాకర్, ప్రభాకర్,తహశీల్దార్లు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. క్యాంప్ ఆఫీసులో కొత్త సంవత్సర వేడుకలు నిజామాబాద్ క్రైం : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గురువారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో వేడుకలు జరిగాయి.అన్ని సబ్ డివిజన్ల పోలీసు అధికారులు హాజరు కాగా ఎస్పీ ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి కేక్‌కట్ చేశారు. ఎస్పీని కలిసిన వారిలో జిల్లా అదనపు ఎస్పీ పాండునాయక్, స్పెషల్‌బ్రాంచ్ డీఎస్పీ ప్రసాద్‌రావు, నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్ డీఎస్పీలు ఆనంద్‌కుమార్, ఎ భాస్కర్, ఆకుల రాంరెడ్డి, రాంకుమార్, ఎన్ఐబీ డీఎస్పీ రవీందర్, హోంగార్డు డీఎస్పీ సులోమాన్, జిల్లా పోలీస్ కార్యాలయం ఏఓ గులాం గౌస్ మెయినోద్దీన్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు షకీల్పాష తదితరులు పాల్గొన్నారు. -
ఆ 'నలుగురు' మాకే కావాలి
ఐఏఎస్ అధికారులపై కేంద్రానికి టీ సర్కారు లేఖ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నలుగురు ఐఏఎస్ అధికారుల కోసం పట్టుపడుతోంది. వారిని తెలంగాణలోనే కొనసాగించాలని కేంద్రాన్ని కోరుతోంది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్లు సమాచారం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ ప్రత్యేకాధికారి సోమేశ్‌కుమార్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ జయేశ్ రంజన్, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్‌లను తెలంగాణలోనే కొనసాగించాలని ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. తెలంగాణలో పనిచేస్తున్న ఈ నలుగురు అధికారులను కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది. వీరిని ఇప్పటికిప్పుడే రిలీవ్ చేయొద్దన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఏపీకి కేటాయించిన అధికారులందర్నీ ఒకేసారి రిలీవ్ చేస్తే.. అక్కడ్నుంచి రావాల్సిన అధికారుల విషయంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా పాలన వ్యవస్థ స్తంభించిపోతుందని సర్కారు భావిస్తోంది. అందుకే అధికారులను దశల వారీగా రిలీవ్ చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. ఏపీ నుంచి తెలంగాణకు కేటాయించిన అధికారులను ఆ ప్రభుత్వం జనవరి 1 లేదా 2వ తేదీల్లో రిలీవ్ చేసే అవకాశం ఉందన్న సమాచారం మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆచితూచి స్పంది స్తోంది. తెలంగాణ ప్రభుత్వం నలుగురు అధికారులను ఈ రాష్ట్రంలోనే కొనసాగించాలని కోరినట్టుగానే.. ఏపీ సర్కారు కూడా నలుగురు అధికారులను కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు సమాచారం. అఖిల భారత సర్వీసు అధికారుల నిబంధనల ప్రకారం ఒకే నగరంలో బదిలీ అయినా.. కేడర్ మారిన అధికారులను రిలీవ్ చేసిన 24 గంటల్లోగా వారు విధుల్లో చేరాల్సి ఉంటుంది. అదే వేరే ప్రాంతంలో ఉంటే వారం రోజుల గడువు ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు వివరించారు. -
పంచాయతీలకు ఊరట
ఇందూరు : ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామపంచాయతీలకు ఊరట లభించింది. 13వ ఆర్థిక సంఘం నిధులలో భాగంగా బేసిక్ గ్రాంటు క్రింద జిల్లాకు ప్రభుత్వం రూ. 11.04 కోట్లను మంజూరు చేసింది. ఇందులో నుంచి 20 శాతం నిధులను విద్యుత్ బకాయిల చెల్లింపుల కోసం వాడుకోవాలని కలెక్టర్ రొనాల్డ్ రోస్ ఉత్తర్వులు జారీ చేశారు. పేరుకుపోయిన కరెంటు బకాయిలను ప్రభుత్వమే చెల్లించాలని సర్పంచులు కోరుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు వారు సర్కారుపై ఒత్తిడి సైతం తీసుకొచ్చారు. 13వ ఆర్థిక సంఘం నిధులలోంచి కొన్ని నిధులు వాడుకోవచ్చని 25 రోజుల క్రితం ప్రభుత్వం సూచించింది. తాజాగా నిధులను కూడా కేటాయించడంతో బకాయిల విషయంలో సర్పంచులకు కాస్త ఊరట లభించింది. రెండున్నరేళ్లుగా పం చాయతీల కరెంటు బిల్లుల భారం పంచాయతీలపైనే పడిం ది. బకాయిలు రూ.117 కోట్లకు చేరడంతో విద్యుత్ శాఖ అధికారులు సరఫరా నిలిపివేశారు. గ్రామాలు అంధకారంలో మునిగే పరిస్థితి ఏర్పడింది. ఇపుడు ప్రత్యేక నిధులను కేటాయించడంతో సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విడుదల అయిన నిధులను అన్ని పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన ట్రెజరీ శాఖ ద్వారా అధికారులు సర్దుబా టు చేయించి, పంచాయతీల ఖాతాలలో జమ చేశారు. ప్రస్తుతం మంజురు చేసిన నిధులే కాకుండా, పంచాయతీలలో ఇదివరకు నిలువ ఉన్న నిధులలో నుంచి కూడా 20 శాతం కరెంటు బిల్లుల కోసం వాడుకోవచ్చని కలెక్టర్ సూ చించారు. వీలైనంత త్వరగా విద్యుత్ బకాయిలు చెల్లించాలని సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు డీపీఓ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని, ఖర్చు చేసిన నిధుల వివరాలను డీఎల్పీఓ కా ర్యాలయాలలో తప్పనిసరిగా సమర్పించాలని పేర్కొన్నా రు. విద్యుత్ బకాయిలకు ఉపయోగించగా మిగిలిన నిధు లు, సీపీడబ్ల్యూఎస్, పీడబ్ల్యూఎస్ పథకాల నిర్వహణ, పారిశుధ్యం, అంతర్గత రోడ్లు, సాలిడ్ పేస్ట్ మేనేజ్మెంట్, జీపీ బిల్డింగ్ నిర్వహణ, ఈ-పంచాయతీ, పాఠశాలలు, అంగన్వాడీలలో పారిశుద్ద్య పనుల కోసం వినియోగించాలని ఆదేశాలిచ్చారు. -
బతకనివ్వండి
‘‘అమ్మ కడుపులో ఉండగానే ఎంతో సంబురపడిపోయా. కొద్ది రోజులలోనే ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నానని ఆనందించా. పుట్టగానే నన్ను అమ్మ, నాన్న అల్లారు ముద్దుగా చూసుకుంటారని భావించా. బుడిబుడి అడుగులు వేస్తూ, అల్లరి చేస్తూ పెరగాలనుకున్నా. కానీ, పుట్టిన క్షణాలలోనే నన్ను మురికి కాలువలో పడేసి పరలోకానికి చేర్చారు. ఎన్నో ఆశలతో రంగుల జీవితంలోకి ఇలా అడుగుపెట్టానో లేదో అలా... ఆడబిడ్డ అంటూ నొసలు చిట్లించి నన్ను బతకనివ్వకుండా చేసిండ్రు. నేనేం పాపం చేశాను. ఏ విధంగా మీకు అడ్డమయ్యానో తెలియదు. పెంచడం ఇష్టం లేకుంటే ప్రభుత్వ అధికారులకో, మరెవరికో ఇస్తే సరిపోయేది కదా! ఎలాగో అక్కడే పెరిగే దానిని కదా?’’ ఓ మృత శిశువు ఆత్మ వేదన ఇది... కాదు.. కాదు.. పుట్టి క్షణాలు కూడా గడవకుండానే నిర్జీవమవుతున్న ప్రతి శిశువు ఆత్మ నివేదన. ఇందూరు : సాంకేతిక విప్లవం పరవళ్లు తొక్కుతున్న ఈ ఆధునిక సమాజంలోనూ భ్రూణ హత్యలూ, పుట్టిన శిశువును ఎలాగోలా వదిలించుకునే సంఘటనలూ ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. కొందరు తల్లిదండ్రుల నిర్ణయాలు శిశువుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఆడబిడ్డ పుట్టిందనో, ఆర్థిక స్థోమత లేదనో, మరే ఇతరత్రా కారణలతో మానవత్వాన్ని మరిచి పుట్టిన బిడ్డలను వదిలించుకుంటున్నారు. కన్నతల్లి కూడా దిగులు చెందకుండా, తాను కూడా ఒకప్పుడు శిశువునేనన్న సంగతిని మరిచి పోయి పేగు బంధాన్ని తెంచుకుంటోంది. రైల్వే స్టేషన్లలో, బస్ స్టేషన్లలో, రోడ్డుపై, చెత్త కుప్పలలో, ముళ్లపొదలలో, మురికి కాలువలలో శిశువుల ఏడుపు వినిపించడం పరిపాటిగా మారింది. అదృష్టవశాత్తూ ఇతరుల కంట పడి, లేదా ఏడుపు విని చేరదీసి వెంటనే ఆస్పత్రికి తీసుకెళితే బతికి బయటపడుతున్నారు. మురికి కాలువలలో పడేసిన శిశువులు శవమై కనిపిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఈ మూడు నెలలలో 14 వరకు వెలుగు చూశాయి. అనాథలుగా మారుతున్న పసిపాపలను ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు, అధికారులు చేరదీసి ఆశ్రయం కల్పిస్తున్నారు. ఈ విషయాలపై ప్రజలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టినా మార్పు కనిపించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక స్థోమత లేకపోతే, పెంచే ఇష్టం లేకపోతే, అధిక సంతానం అని భావిస్తే,ఏ ఆరణంతోనైనా బిడ్డను వద్దకుంటే వారిని అనాథలుగా వది లేయకుండా అధికారులకు అప్పగించాలని కలెక్టర్ రొనాల్డ్ రోస్ ఇటీవలే పత్రికల ద్వారా విన్నవించారు. ఇందుకోసం 1098కు ఫోన్ చేయాలని సూచించారు. భ్రూణ హత్యలెన్నో పుట్టిన బిడ్డలను చంపుకుంటున్న తీరు ఇలా ఉంటే, భ్రూణ హత్యలు కూడా కలవరం లిగిస్తున్నాయి. ప్రత్యక్షంగా కనిపించే సంఘటనలకంటే, కనిపించని ఈ విధానంలోనే ఎంతో మంది పసిబిడ్డలు కడుపులోనే కరిగిపోతున్నారు. ఆడబిడ్డ పుడుతుందని ముందే తెలుసుకునే టెక్నాలజీ రావడం ఇందుకు కారణం. లింగ నిర్ధారణ చేయడం నేరమని, ఒకవేళ అలా చేసినా, చేయమని అడిగినా కఠినంగా శిక్షలుం టాయని ప్రభుత్వం ప్రకటించింది. ఆస్పత్రులలో ప్రచారం కూడా చేస్తోంది. అయినా, భ్రూణ హత్యల సంఖ్య ఎక్కువగానే ఉంటోందని అధికారులు చెబుతున్నారు. వివాహేతర సంబంధాలు ఇందుకు కారణమవుతున్నాయని పేర్కొంటున్నారు. మచ్చుకు కొన్ని సంఘటనలు నవంబర్ 2న కామారెడ్డి సమీపంలో శ్రీరాంనగర్ కాలనీలో గల చెత్త కుప్పలో అప్పుడే పుట్టిన ఆడపిల్ల మృతదేహం కనిపించింది. డిసెంబర్ 2న జిల్లా కేంద్రంలోని ఖలీల్‌వాడీ చౌరస్తా చెత్తకుప్పలో అప్పుడే పుట్టిన పసిపాప మృతదేహం కనిపించింది. ఇటు సుబాష్‌నగర్ రైతు బజా ర్ వద్ద ఉన్న మురుగు కాలువలో మరో పసిపాప మృత దేహం కనిపించింది. 4న నగరంలోని కసాబ్‌గల్లీకి చెందిన రాజు తన రెండేళ్ల కుమారుడిని అమ్మకానికి పెట్టగా, అధికారు లు గమనించి బాలుడిని స్వాధీనం చేసుకున్నారు. గాంధారి మండలం, దుర్గం గ్రామానికి చెందిన తల్లిదండ్రులు పోషించే స్థోమత లేక నాలుగు రోజుల పాపను ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. 10న కామారెడ్డిలోని మురికి కాలువలో గుర్తు తెలియని వ్యక్తులు రెండు రోజుల పాపను పడేశారు. మృత శిశువును చూసిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. ఈ విషయంపై అధికారులు నేటి వరకు విచారణ చేస్తూనే ఉన్నారు. 13న బాల్కొండ మండలం కేంద్రం నెహ్రూనగర్ లో రెండు నెలల పసిపాపను గుర్తు తెలియని మహిళ నుంచి ఐసీడీఎస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 16న నగరంలోని నాందేవ్‌వాడ రేషన్ షాపు ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు ఒక రోజు బాబును వదిలేసి వెళ్లారు. ఐసీడీఎస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 25న నిజామాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని ముళ్లపొదలలో రెండు నెలల పసిపాప కనిపించింది. రైల్వే అధికారులు ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. -
అందరికీ ‘ఆసరా’
‘ఆసరా’ పథకం కింద దరఖాస్తు చేసుకునే అర్హులందరికీ వారం రోజులలో పింఛన్ అందజేస్తామని కలెక్టర్ రొనాల్డ్ రోస్ స్పష్టం చేశారు. సమగ్రసర్వే, డోర్‌లాక్, సాంకేతిక కారణాలతో ఎవరి పేర్లయినా గల్లంతయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వారందరి పింఛన్లను పునరుద్ధరిస్తామన్నారు.లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిరంతరం సాగుతుందని, ఎట్టి పరిస్థితులలోనూ అర్హులను విస్మరించేది లేదని అన్నారు. సోమవారం ఆయన తన ఛాంబర్లో ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘‘ఆసరా పథకం కింద అందిన దరఖాస్తులను వివిధ రకాలుగా సర్వే చేసిన తర్వాత 2,03,886 మంది అర్హులుగా తేలింది. అర్హులందరికీ ఈ నెల పది నుంచి నవంబర్, డిసెంబర్ మాసాలకు సంబంధించిన రెండు నెలల ఫించన్లను పంపిణీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలో 11,770 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. వివిధ కారణాలతో చాలామంది పింఛన్‌దారుల జాబితాలో పేర్లు కోల్పోయారు’’ అని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ పేర్కొన్నారు. అయితే, ఫించన్ల కోసం దరఖాస్తు చేసుకోవడమనేది నిరంతర ప్రక్రియ అని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఫించన్లు అందేవరకు ప్రభుత్వం దీనిని కొనసాగిస్తుందని చెప్పారు. అర్హులను ఎంపిక చేసే ందుకు ఆధార్ ఒక్కటే ఆధారం కాదని, వయస్సు ను ధ్రువీకరించే ఏ పత్రాలనైనా సంబంధిత అధికారులకు చూపించవచ్చని అన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలా ంగులు, ఇతర ఫించన్ల కోసం దరఖాస్తు చేసుకునేవారు జిల్లా కేంద్రానికి రానవసరం లేదని, మండల కేంద్రాలలో ఉన్న అధికారులకు అందజేయాలని సూచించారు. అర్హత ఉంటే దరఖాస్తు చేసుకున్న వారం రోజులలో కొత్తగా ఫించన్లు మంజూరు చేస్తామన్నారు. ఫించన్ల కోసం వచ్చిన దరఖాస్తులలో నిరాకరణకు గురైన వాటి వివరాల ను కూడ త్వరలోనే గ్రామ పంచాయతీల నోటీసు బోర్డుపై అంటిస్తామన్నారు. -
నేటినుంచి ‘సదరం’
ప్రగతినగర్ : వికలాంగులకు సదరం సర్టిఫికెట్లు ఇప్పించే విషయంలో కలెక్టర్ రొనాల్డ్ రోస్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. అందులో భాగంగా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. సోమవారం నుంచి వారం పాటు నియోజకవర్గాల వారీగా శిబిరాలు నిర్వహించనున్నారు.వికలాంగులకు సదరం సర్టిఫికెట్ల జారీ విషయంలో జాప్యం జరుగుతుండడంపై చాలా ఫిర్యాదులు వచ్చాయి. సదరం ధ్రువీకరణ పత్రాలు జారీ కాకపోవడం, జారీ అయిన వాటిలోనూ వైద్యుల సంతకాలు లేకపోవడం వంటి పొరపాట్లు దొర్లాయి. దీంతో వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని గమనించిన కలెక్టర్.. నియోజకవర్గాల వారీగా సదరం ప్రత్యేక శిబిరాల ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సోమవారంనుంచి 16వ తేదీ వరకు శిబిరాలు కొనసాగుతాయి. జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని ఆస్పత్రులలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. అయితే గతంలో మాదిరిగా నామమాత్రంగా కాకుండా పకడ్బందీగా క్యాంపులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈసారి సదరం క్యాంపులకు సూపర్వైజర్లను, క్యాంపు ఇన్చార్జి వైద్యుడిని, కోఆర్డినేటర్లును నియమించారు. క్యాంప్‌ల సూపర్వైజర్లు, ఇన్చార్జి వైద్యులు, కోఆర్డినేటర్లుగా నియమితులైనవారు తప్పనిసరిగా ఆయా క్యాంపులను సందర్శించాలని కలెక్టర్ సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. క్యాంపులు, అధికారులు వీరే.. నిజామాబాద్ మండలంలోని వికలాంగులకోసం జిల్లా ఆస్పత్రిలో సదరం క్యాంపు ఏర్పాటు చేశారు. క్యాంపు సూపర్వైజర్గా జడ్పీ సీఈఓ రాాజారాం, క్యాంప్ ఇన్చార్జి వైద్యుడిగా రజనీకాంత్, కోఆర్డినేటర్‌గా ఐకేపీ ఏపీఎం మోహన్ వ్యవహరిస్తారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని నిజామాబాద్ మండలం మినహా మిగిలిన మండలాల వికలాంగుల కోసం డిచ్పల్లి సీహెచ్‌సీలో శిబిరం ఏర్పాటు చేశారు. క్యాంప్ సూపర్వైజర్గా డీపీఓ కృష్ణమూర్తి, ఇన్చార్జి వైద్యుడిగా రాథోడ్, కోఆర్డినేటర్ రవీందర్ సేవలందిస్తారు. బోదన్ నియోజకవర్గంలో బోధన్ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన క్యాంప్‌లో మెప్మా పీడీ సత్యనారాయణ సూపర్వైజర్గా, ఇన్చార్జి వైద్యుడిగా భానుప్రసాద్, కోఆర్డినేటర్‌గా సాయిలు ఉంటారు. బాన్సువాడ నియోజకవర్గంలో బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో సదరం క్యాంప్ ఏర్పాటు చేశారు. సూపర్వైజర్గా డీసీహెచ్ఎస్ శివదాస్, ఇన్చార్జి డాక్టర్‌గా శ్రీనివాస్, కోఆర్డినేటర్‌గా రవీందర్ సేవలందిస్తారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఆర్మూర్‌లో ఏర్పాటుచేసిన క్యాంప్ సూపర్వైజర్గా డీఎంహెచ్ఓ గోవింద్ వాగ్మారే, ఇన్చార్జి వైద్యుడిగా నారాయణ, కోఆర్డినేటర్ నీలిమ వ్యవహరిస్తారు. కామారెడ్డి నియోజకవర్గంలో కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో సదరం క్యాంప్ ఏర్పాటు చేశారు. సూపర్వైజర్గా డీఆర్డీఏ పీడీ వెంకటేశం, ఇన్చార్జి వైద్యుడిగా అజయ్‌కుమార్, కోఆర్డినేటర్‌గా సుధాకర్ ఉంటారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి సీహెచ్‌సీలో ఏర్పాటు చేసిన క్యాంప్ కోఆర్డినేటర్‌గా మండల ప్రత్యేకాధికారి గంగాధర్, ఇన్చార్జి వైద్యుడిగా బాలోజీ, కోఆర్డినేటర్‌గా రచ్చయ్య వ్యవహరిస్తారు. బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ సీహెచ్‌సీ క్యాంప్ సూపర్వైజర్గా డీఎంహెచ్ఓ గోవింద్ వాగ్మారే, ఇన్చార్జి డాక్టర్‌గా మోహన్‌బాబు, కోఆర్డినేటర్ శ్రీనివాస్ ఉంటారు. జుక్కల్ నియోజకవర్గంలో జుక్కల్ పీహెచ్సీలో సదరం క్యాంప్ ఏర్పాటు చేశారు. క్యాంప్ సూపర్వైజ ర్గా డీసీహెచ్ఎస్ శివదాస్, ఇన్చార్జి డాక్టర్‌గా బాల మురళి, కోఆర్డినేటర్‌గా రవీందర్ వ్యవహరిస్తారు. -
పెండింగ్ పనులు పూర్తి చేయండి
ప్రగతినగర్ : పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ డి.రొనాల్డ్‌రోస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రగతిభవన్ సమావేశ మందిరంలో శుక్రవారం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ పనుల పురోగతిపై సమీక్షించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. గత సమావేశంలో జిల్లాకు సంబంధించి రహదారుల మ్యాప్‌ను అందించాలని చెప్పినప్పటికీ సిద్ధం చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో ఎస్ఈ శంకరయ్య, ఈఈలు రాజేంద్రప్రసాద్, సీతారాములు, మాధవి, డిప్యూటీ ఈఈలు, ఏఈలు పాల్గొన్నారు. ఆలోచించండి.. స్వయం సహాయక సంఘాల ద్వారా కొత్తగా మార్కెటింగ్ చేసి లాభదాయక వ్యాపారాలు నిర్వహించేలా ఆలోచనలు చేయాలని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ డీఆర్డీఏ, మెప్మా అధికారులకు సూచించారు. ఆయా శాఖలు నిర్వహిస్తున్న కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. సంఘాలను కేవలం వరి, మొక్కజొన్న కొనుగోలుకు మాత్రమే పరిమితం చేయకుండా వారు ఏ రకమైన వ్యాపారాలు నిర్వహిస్తే లాభదాయకంగా ఉంటుందో సూచించాలన్నారు. విద్యార్థుల యూనిఫారాలు, పెన్సిళ్లు, పాదరక్షలు, నోటుపుస్తకాలు, కూరగాయలు, పాలు తదితర వ్యాపారాలపై దృష్టి కేంద్రీకరించేలా చూడాలన్నారు. మహిళ సంఘాలకు మంజూరు చేసే లింకేజీ రుణాలను ఇతర రుణాల బకాయిలను బదిలీ చేయకుండా బ్యాంకర్లకు సూచనలు చేయాలన్నారు. సంఘాలు బలోపేతం కావడానికి చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశం పీడీలు వెంకటేశం, సత్యనారాయణ, డీపీఎంలు, ఏపీఓలు తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి నిర్వహించాలి నిజామాబాద్‌నాగారం: ప్రజావాణి కార్యక్రమాన్ని డివిజన్, మండల స్థాయిల్లో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ డి. రొనాల్డ్‌రోస్ శుక్రవారం ఒక ప్రకటనలో సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రతి సోమవారం తమ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా ప్రజలు, ఆర్జీదారులు ఈ విషయాన్ని గమనించి, సంబంధిత మండలాల్లోనే తమ సమస్యలపై దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. -
తీరనున్న దాహార్తి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లావ్యాప్తంగా 25 మండలాలలోని 194 ప్రాథమిక పాఠశాలలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు త్వరలో తాగునీటి సౌకర్యం కల్పించనున్నారు. జాతీయ గ్రామీణ తాగునీటి పథకం (ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ) మొదటి విడతలో ఈ పథకాలను చేపట్టనున్నారు. రాష్ట్రస్థాయి పథకాల మంజూరు కమిటీ (ఎస్ఎల్ఎస్ఎస్సీ) సుమారు ఐదు నెలల తర్వాత ఎట్టకేలకు శనివారం నిధుల విడుదలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి జె.రేమండ్‌పీటర్ ఉత్తర్వులు జారీ చేశారు. అసలే తాగునీటి వసతిలేని, కొద్దిపాటి నిధులతో తాగునీటి సౌకర్యం కలిగే ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు నిధులు మంజూరు చేయాలని జిల్లా గ్రామీణ నీటిసరఫరా విభాగం అధికారులు ఈ ఏడాది మే ఎనిమిదిన ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 225 పీఎస్, జడ్పీహెచ్ఎస్లకు రూ.159.47 లక్షలు అవసరమని పేర్కొన్నారు. ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ మొదటి విడతలో ఈ నిధులు మంజూరు చేయాలని కోరారు. రెండు దఫాలుగా సమీక్ష ఈ మేరకు నిధుల విడుదలపై ఎస్ఎల్ఎస్ఎస్సీలో రెండు దఫాలుగా సమీక్ష జరిగింది. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పంపిన ప్రతిపాదనలలోని 225లో 31 పాఠశాలల కు జులై 29న నిధులు మంజూరైనట్లు నిర్ధారిం చారు. వాటిని మినహాయించిన మిగతా 194 పాఠశాలలకు రూ.130.17 లక్షలు మంజూరు చేస్తూ ప్రస్తుతం అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిధులతో ఆయా బడులలో మంచినీటి పథకాలను ఏర్పాటు చేయాల ని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఇందులో అత్యధికంగా డిచ్పల్లి, భీమ్గ ల్, నిజామాబాద్, ఆర్మూరు మండలాలకు పథాలను కేటాయించారు. డిచ్పల్లికి 42, భీమ్‌గల్‌కు 25, నిజామాబాద్‌కు 26, ఆర్మూరుకు 4, నిజాంసాగర్‌కు 12, నందిపేట కు 2, బాల్కొండకు 2, కమ్మర్‌పల్లికి 2, మోర్తాడ్‌కు 5, వేల్పూరుకు 1, బోధన్‌కు 9, నవీపేటకు 3, ఎడపల్లికి 2, భిక్కనూర్‌కు 3, దోమకొండకు 3, కామారెడ్డికి 2, మా చా రెడ్డికి 3, జుక్కల్‌కు 2, జక్రాన్‌పల్లికి 8, ధర్పల్లికి 11, సిరికొండకు 6, బాన్సువాడకు 9, బీర్కూరుకు 1, కోటగిరికి 2, వర్ని మండలానికి 8 మంజూరయ్యాయి. కాగా ఈ పనుల పర్యవేక్షణకు కలెక్టర్ సహా ఎనిమిది మంది ఉన్నతాధికారులతో కమిటీ ఉంటుంది. కలెక్టర్ రోనాల్డ్‌రోస్ చైర్మన్‌గా వ్యవహరించనుండగా, కన్వీనర్‌గా ఆర్డబ్ల్యూ ఎస్ ఎస్ఈ శ్రీనివాస్‌రెడ్డి ఉంటారు. సభ్యులుగా జడ్ సీఈఓ రాజారాం, డీపీఓ సురేష్‌బాబు, ఆర్అండ్బీ ఎస్ ఈ సుకన్య, నీటిపారుదలశాఖ ఎస్ఈ షకీల్ అహ్మద్ ఉమ్రాన్, ట్రాన్స్‌కో ఎస్ఇ ప్రభాకర్‌తో పాటు గ్రౌండ్‌వాటర్ డిప్యూటీ డెరైక్టర్లు ఉంటారు. -
డీపీఓ బదిలీ
ఇందూరు : జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌బాబు బదిలీ అయ్యారు. ఆయనను నల్గొండ జిల్లాకు బదిలీ చేస్తూ పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రేమండ్ పీటర్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాకు నల్గొం డ డీపీఓ కృష్ణమూర్తి బదిలీపై వస్తున్నారు. కృష్ణమూర్తి హైదరాబాద్‌కు చెందినవారు. కలెక్టర్ రొనాల్డ్ రోస్ సెలవు నుంచి రాగానే సురేశ్‌బాబు రి లీవ్ అవుతారు. ఆ తర్వాత కృష్ణమూర్తి జిల్లాకు వచ్చి విధుల్లో చేరుతారు. సురేశ్‌బాబు జిల్లాకు డీపీఓగా 2010 మే 11న వచ్చారు. నాలుగున్నర సంవత్సరాల పాటు పని చేసిన ఆయనకు ముక్కుసూటితనం, నిక్కచ్చి గా వ్యవహరించడం, పైరవీలకు తావిచ్చేవారు కాదని పేరుంది. అసెంబ్లీ, పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో తనదైన శైలిలో పనిచేసి ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఎక్కడా కూడా రీ పోలింగ్ జరగకుండా, పొరపాట్లు లేకుండా పనిచేసిన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. లోతుగా పరిశీలించి పని చేయడం, క్షుణ్ణంగా చూసిన తరువాతే ఫైళ్లపై సంతకాలు చేయడం ఆయన ప్రత్యేకతలు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుటుంబ సర్వే, దాని తరువాత పెన్షన్, ఆహార భద్రతా కార్డుల సర్వేలో కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్‌లో సర్వే వేగవంతం చేయడానికి తోడ్పడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించిన వర్క్‌షాపుల్లో పాల్గొన్నారు. పథకాల అమలు, పంచాయతీ రాజ్ నూతన చట్టం తయారీలో ప్రభుత్వానికి సలహాలిచ్చారు. ప్రభుత్వం నుంచి రాష్ట్ర అధికారుల నుంచి ఎన్నో ప్రసంశలు పొందారు. జిల్లాలో అత్యధిక కాలం పని చేసిన జిల్లాస్థాయి అధికారి సురేశ్‌బాబే కావడం గమనార్హం. పలుమార్లు జరిగిన బదిలీల్లో ఈయన పేరు ఉన్నప్పటికీ కలెక్టర్లు నిలిపివేయించారు. -
ఆదేశించినా.. విచారణ జరపరా?
ప్రగతినగర్ : అక్రమ నిర్మాణాలపై కలెక్టర్ రొనాల్డ్ రోస్ ప్రజావాణిలో సీరియస్ అయ్యారు. తాను ఆదేశించినా.. విచారణ జరిపి నివేదిక ఇవ్వకపోవడంపై పంచాయతీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గూపన్పల్లిలో ఫేజ్-2 ఇళ్ల నిర్మాణాల విషయంలో విచారణ జరిపి వివరణ ఇవ్వని డీఎల్పీఓ, గ్రామ కార్యదర్శులనుంచి వివరణ తీసుకోండి అంటూ డీపీఓను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో పలువురు సమస్యలపై ఫిర్యాదులు చేశారు. కలెక్టర్‌తోపాటు అదనపు జేసీ శేషాద్రి, డీఆర్వో మనోహర్, జడ్పీ సీఈఓ రాజారాం తదితరులు ఫిర్యాదులు స్వీకరించారు. అక్రమ నిర్మాణాలపై.. గూపన్పల్లి ఫేజ్-2లో నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లు నిర్మిస్తున్నారని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామానికి చెందిన నారాయణరెడ్డి అనే వ్యక్తి గత వారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని డీపీఓ, గ్రామ కార్యదర్శులను కలెక్టర్ ఆదేశించారు. ఆ ఫిర్యాదుదారుడు ఈ వారం కూడా ప్రజావాణికి వచ్చి.. సమస్య అలాగే ఉందని, అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. దీంతో కలెక్టర్ సీరియస్ అయ్యారు. తానే స్వయంగా ఆదేశించినా చర్యలు తీసుకోకపోవడంతో మండిపడ్డారు. డీపీఓతో ఫోన్ ద్వారా మాట్లాడారు. డీఎల్పీఓతోపాటు గ్రామ కార్యదర్శినుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను అధికారులు నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. మరోసారి ఇలాంటివి పునరావృతమైతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. మైనింగ్‌కు అనుమతివ్వాలంటూ.. ఆర్మూర్‌లోని మామూళ్ల నడిమి గుట్ట వద్ద మైనింగ్‌కు ఒడ్డెరలకు అనుమతి ఇవ్వాలని ఒడ్డెర సంఘం రాష్ట్ర నాయకుడు దేవంగుల నాగేశ్ కలెక్టర్‌ను కోరారు. ఒడ్డెర కార్మికుల సమస్యల పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. తమకు బాకూర్ గుట్ట వద్ద కంకర మిషన్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వకుండా అపుదల చేయడం గు రించి మాట్లాడారు. ఆర్మూర్‌లో ఒడ్డెరలు సు మారు 2 వేల మంది ఉన్నారని, రాళ్లు కొట్టుకుం టూ జీవిస్తున్నామని, మైనింగ్‌కు అనుమతి ఇ వ్వకపోతే జీవనోపాధి కోల్పోతామన్నారు. ఆయన వెంట సంఘం నాయకులు రాజన్న, ఎల్లయ్య, గణపతి, రాజు తదితరులున్నారు. వధశాలకు మరమ్మతుల కోసం.. స్వాతంత్య్రంకంటె ముందు ఆర్మూర్‌లో నిర్మిం చిన మేకల వధశాలకు మరమ్మతుల కోసం ని ధులు మంజూరు చేయాలని అరె కటికె సంఘం ఆర్మూర్ ప్రతినిధులు కలెక్టర్‌ను కలిసి వినతి ప త్రాన్ని సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పట్టణం దినదినాబివృద్ధి చెందడంతో 1995 నుంచి అద్దె భవనంలో మేకల వధశాల నిర్వహిస్తున్నామన్నారు. కాగా తాత్కాలికంగా మేకల వధశాలను మూసి వేయాలని మున్సిపాలిటీ అదికారులు నోటీసులు ఇచ్చారన్నారు. కేటాయించిన వధశాలకు నిధులు కేటాయించి సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఇసుక మఫియాపై.. ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని వేల్పూర్ మండలం అక్లూర్ రైతులు కలెక్టర్‌ను కోరారు. గ్రామం నుంచి అనుమతి లేకుండానే ఇసుకను తరలిస్తున్నారన్నారు. దీంతో భూగర్భజలాలు పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు భూ పంపిణీపై.. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినట్లుగా వెంటనే దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేయాలని న్యూడెమోక్రసీ నాయకులు కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లాకార్యదర్శి వేల్పూర్ భూమయ్య, నాయకులు నర్సయ్య, సాయాగౌడ్, మురళి తదితరులు పాల్గొన్నారు. కబ్జా దారులపై.. నందిపేటలో సర్వే నం. 685/1, 2, 3, 4, 5 లలోని భూమి తన పేరు మీద ఉన్నప్పటికీ సర్పంచ్ ఎండీ షకీల్ , గ్రామ కార్యదర్శి శంకర్లు అక్రమార్కులకు కొమ్ముకాస్తూ భూఅక్రమాలకు పాల్పడుతున్నవారిని ప్రోత్సహిస్తున్నారంటూ గ్రామానికి చెందిన రావెళ్ల ఝాన్సీ లక్ష్మీబాయి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వికలాంగుల సమస్యలపై.. వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్ కలెక్టర్‌ను కోరారు. ఇటీవల అర్హులైన పింఛన్ కూడా తొలగించారని, అందరికీ పింఛన్లు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కళ్యాణ లక్ష్మి పథకం కింద వికలాంగులకు లక్ష రుపాయలు ఇవ్వాలన్నారు. -
మద్దతు కరువు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ధాన్యం అమ్మకాలలోనూ రైతులకు కష్టాలు తప్పడం లేదు. 287 కొనుగోలు కేంద్రాలకుగాను ఇప్పటివరకు 168 ప్రారంభం కాగా, 119 కేంద్రాలు ఇంకా ఎప్పుడు తెరుస్తారో తెలియడం లేదు. ఫలితంగా రైతులు ఖరీఫ్ ధాన్యాన్ని విక్రయించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. కేంద్రాలలో అసౌకర్యాలు తిష్టవేయగా, గన్నీ సంచులు, హమాలీల కొరత అక్కడక్కడా ఇబ్బందికరంగా మారింది. ఆరుగాలం శ్రమించిన రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చూడాలని ప్రభుత్వం జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ మేరకు కలెక్టర్ రొనాల్డ్ రోస్ మార్కెటింగ్, పౌరసరఫరాల, డీఆర్డీఏ తదితర శాఖలను అప్రమత్తం చేసి నా, క్షేత్రస్థాయిలో కొందరి అలసత్వం రైతులకు ఇబ్బందికరంగా మారుతోంది. వారు రైస్ మిల్ల ర్లు, దళారులను ఆశ్రయించక తప్పడం లేదు. మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా, సోమవారం నాటికి 7,030 మె.టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. కామారెడ్డిలో హమాలీలు లేరు కామారెడ్డి మండలం గర్గుల్ కొనుగోలు కేంద్రం లో హమాలీలు లేక వారం రోజులుగా ధాన్యం అక్కడే ఉంది. రైతులు ధాన్యం కుప్పల వద్దే పడిగాపులు పడుతున్నారు. ఒకవేళ ఎవరైనా కొనుగోలు చేసినా బిల్లులు సరిగ్గా రావడంలేద ని వారు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి మార్కెట్లో కొనుగోళ్లు నెమ్మదిగా జరుగుతుం డటంతో రైతులు వారం రోజులుగా అక్కడే ఉంటున్నారు. మాచారెడ్డి సింగిల్‌విండోలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినా ఇప్పటి వరకు తెరవలేదు. సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరు. దీంతో రైతులు ధాన్యాన్ని వ్యాపారులకు విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు. దోమకొండలో ఆరు కొనుగోలు కేంద్రాలుండగా,కొ న్న ధాన్యానికి సరిగ్గా డబ్బులు ఇవ్వడం లేదు. ఆర్మూర్‌లో తూకం లేదు ఆర్మూర్ నియోజకవర్గంలో రైతులు ధాన్యం తీసుకువచ్చి వారం గడుస్తున్నా తూకం వేయ డం లేదు. కొనుగోలు కేంద్రాలలో హమాలీల పేరుతో దోపిడీ చేస్తున్నారన్న ఆరోపణలు విని పించాయి. పలు కేంద్రాలలో అకాల వర్షంతో ధాన్యం తడిసిపోగా, రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్నారు. ఆర్మూర్ పట్టణంలో మెప్మా ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో, పీఏసీఎస్ ఆధ్వర్యంలో పీఏసీఎస్ పరిసరాలలో, పెర్కిట్, మిర్ధాపల్లి, ఆలూర్, దేగాం, పిప్రి, పెర్కిట్, ఫత్తేపూర్, తదితర గ్రామాలలో కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం కొంత మేర తడిసి పోవడంతో రైతులు వేదనకు గురవుతున్నారు. కొనుగోలు కేంద్రంలో 40 కేజీల బస్తాకు హమాలీ పేరుతో రూ.14లు వసూలు చేస్తూ క్వింటాలుకు రెండున్నర కిలోల కోత విధిస్తూ రైతులను దోచుకుంటున్నారు. తూకం వేసి లారీలలో ఎక్కించే వరకు రైతులదే బాధ్యత అని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పేర్కొంటుండటంతో రైతులు రేయింబవళ్లు కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. బోధన్‌లో బిల్లులు రావడం లేదు బోధన్ వ్యవసాయ మార్కెట్లో, సింగిల్విం డోలో, సాలూర, సాలంపాడ్, నవీపేట మండలంలోని అభంగపట్నం, రెంజల్ మండలం సాటాపూర్, దండిగుట్ట, ఎడపల్లి మండలంలో ని ఎడపల్లి, ఠానాకలాన్ కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించిన రైతులకు డబ్బులు సకాలంలో అందడం లేదని తేలింది. ఇప్పటివరకు 11 వేల కింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. రైతులకు రూ. 1.37 కోట్లు చెల్లించాల్సి ఉండ గా, ఇందులో రూ. 68 లక్షలు చెల్లించారు. మిగిలిన డబ్బుల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. కొనుగోలు కేంద్రంలో కాంటా లేదు. సాలూర సొసైటీలో 6 వేల క్వింటాళ్ల వరకు కొనుగోలు చేశారు. ఇక్కడ తేమ కొలత మీటరు పని చేయ డం లేదు. కాంటాలు లేవు. పంట పొలాలు, ఖా ళీ ప్రదేశాలలో తూకం వేస్తున్నారు. సాలంపాడ్ లో ఇప్పటి వరకు 8 వేల క్వింటాళ్లు కొనుగోలు చేశారు. ఇక్కడ కొనుగోలు కేంద్రంలో కాంటా లేదు. పెంటాకుర్థులో ఇదే పరిస్థితి. ఈ సొసైటీ పరిధిలో బీపీటి రకం ధాన్యం సాగు చేశారు. ఇక్కడ కేవలం 2,190 కింటాళ్లు కొనుగోలు చేశారు. రెంజల్ మండలంలోని సాటాపూర్, దండిగుట్ట కేంద్రాలలో తూకం బంద్ ఉంది. తేమ, తాలు ఉన్నాయని జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు మొక్కుబడిగా మారాయి. కనీస మద్దతు ధర దేవుడెరుగు ఎనలేని ఇబ్బందులను ఎదుర్కుంటున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉందని, తా లు ఉందని చెబుతూ నిరాకరిస్తున్నట్లు రైతులు వెల్లడించారు. పైగా తెచ్చిన ధాన్యాన్ని జల్లెడ పట్టటంతో చాలా వరకు తరుగు పోతోంది. గత్యంతరం లేక ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు అమ్ముకుంటున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వానలకు అక్కడక్కడా ధాన్యం తడిసిపోయి రంగు మారింది. ఇదే అదునుగా కొనుగోలు కేంద్రాలలో రైతులను నానా ఇబ్బందులు పెడుతున్నారు. అక్టోబర్ 29న ప్రారంభించిన ‘మెప్మా’ కేంద్రం మొక్కుబడిగా మారింది. అకాల వాన కొంప ముంచింది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో కొనుగోలు కేంద్రాల పరిస్థితి దారుణంగా ఉంది. డిచ్పల్లి మండలం బర్థిపూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధర్మారం (బి) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం కొద్దిమేర తడిసింది. దీంతో సోమవారం కొనుగోళ్లను నిలిపివేశారు. తరుగు పేరిట బస్తాకు కిలో ధాన్యం తీసేస్తున్నారని రైతులు తెలిపారు. ధర్పల్లి పీఏసీఎస్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోనూ, సిరికొండ మండలం తాళ్ల రామడుగులోనూ వానకు ధాన్యం తడిసి పోవడంతో కొనుగోళ్లను నిలిపివేశారు. జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో పడకల్ గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించకపోవడం వల్ల తడిసిపోయింది. ఇక్కడా అంతే జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట, గున్కుల్, మల్లూర్ సింగిల్ విండోల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. మద్నూర్ మండలంలో డోంగ్లిలో ఇంతవరకు ధాన్యం రాకపోవడంతో తూకాలు ప్రారంభం కాలేదు. మదన్ హిప్పర్గలో 6,040 బస్తాల ధాన్యాన్ని కొన్నారు. ఎల్లారెడ్డిలో.. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి, సదాశివనగర్, ఎల్లారెడ్డి, లింగంపేట, తాడ్వాయి, నాగిరెడ్డిపేట మండలాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్‌విండోలు, ఐకేపీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి కురిసిన వానకు ధాన్యం తడవడంతో రైతులు ఆరబెట్టడంలో నిమగ్నమయ్యారు. తాటిపత్రు లు లేకపోవడంతో రైతులు స్వయంగా తెచ్చుకుంటున్నారు. తేమశాతం ఎక్కువగా ఉందనే కారణంతో తూకాలు చేయడం లేదు. రైతులకు డబ్బులు రావడానికి 10 నుంచి 20 రోజుల సమయం పడుతోంది. -
కొలువులుఇస్తారా!
ప్రగతినగర్ : ప్రభుత్వ శాఖలలో త్వరలో ఔట్సోర్సింగ్ విధానంలో వెయ్యి పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ మేరకు కలెక్టర్ రొనాల్డ్ రోస్ ఉద్యోగ ఏజెన్సీలు వేసిన టెండర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అర్హతలేని ఏజెన్సీలు సైతం టెండర్లలో పాల్గొన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సెప్టెంబర్ 29న నోటిఫికేషన్ వేయగా 27 ఏజెన్సీ లు టెండర్లు దాఖలు చేశాయి. సీల్డు టెండర్లను గతనెల 20న అదనపు జాయింట్ కలెక్టర్ శేషాద్రి ఏజెన్సీ నిర్వాహకుల సమక్షంలో తెరిచారు. కాగా కొన్ని ఏజెన్సీలు బినామీ పత్రాలు దాఖలు చేసి టెండర్ లో పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు. బ్లాక్‌లిస్టులో ఉన్న ఏజెన్సీలు, క్రిమినల్ కేసులు నమోదైనవారు, ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లింపులు జమచేయని, సరైన ధ్రువపత్రాలు లేని ఏజెన్సీలు టెండర్లు వేసినట్లు తెలుస్తోంది. తీవ్ర పోటీ ఒకేసారి వెయ్యి పోస్టుల నియామకాలు జరుపుతుండడంతో ఏజెన్సీల మధ్య పోటీ తీవ్రమైంది. ఈసారి గతంలో కంటే ఎక్కువ ఏజెన్సీలు టెండర్ దాఖలు చేశాయి. మొత్తం 33 మంది ఏజెన్సీ నిర్వాహకులు దరఖాస్తులు తీసుకువెళ్లగా 27 మంది ఈఎండీ చెల్లించి టెండర్లో పాల్గొన్నారు. వీరిలో ప్రస్తుతం జిల్లాలోని కొన్ని శాఖల్లో ఔట్ సోర్సింగ్ నడుపుతున్న ఏజెన్సీ నిర్వాహకులతో పాటు కొత్తవారు ఉన్నారు. ఈనెల 20న అదనపు జేసీ శేషాద్రి తన చాంబర్లో టెండర్‌దారుల సమక్షంలో బాక్స్ ఓపెన్ చేసి ఏజెన్సీలు నమోదు చేసిన ‘కోట్’ను చదివి విని పించారు. వాస్తవానికి ఏజెన్సీల ఎంపికలో తక్కువ కోట్తో సంబంధం లేకుండా ఏజెన్సీలకు ఉన్న అర్హతలు, అనుభవం, ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లింపులు, పరిగణనలోకి తీసుకోవాలి. ప్రభుత్వానికి టీడీఎస్ (టాక్స్ డిడ క్షన్ సోర్స్) 2.64 శాతం చెల్లించిన అర్హత కూడా ఉండాలి. ఈ ప్రకారం టెండర్ వేసిన 27 ఏజెన్సీల అర్హతలు అదే రోజు రాత్రి పదిగంట వరకు అధికారులు పరిశీలించారు. బినామీ పత్రాలు సమర్పించి వీటిలో కొన్ని ఏజెన్సీలు బినామీ అర్హత పత్రాలు సమర్పించినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ముందు తక్కువ కోట్ చేసిన ఏజెన్సీల ఒరిజినల్ అర్హత పత్రాలు పరిశీలించాలని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ శ్యాంసుందర్, ఉపాధి కల్పానాధికారి మోహన్‌లాల్‌ను కలెక్టర్ ఆదేశించారు. ఏజెన్సీల ఎంపికలో ఎక్కడ కూడ నిబంధనలు ఉల్లంఘించకుండా అర్హత కలిగిన పది ఏజెన్సీలను ముందు గుర్తించి ఫైల్ తనదగ్గరకు పంపాలని సూచించారు. అధికారులు పరిశీలించిన ఏజెన్సీ జాబి తాను ఈనెల 13 కలెక్టర్ పరిశీలించనున్నట్లు అధికారికి వర్గాలు చెబుతున్నా యి. స్క్రూటినీ చేసి ఏఏ ఏజెన్సీలకు అర్హత ఉందో కలెక్టర్ అదేరోజు ఫైనల్ చేయనున్నట్లు చెబుతున్నారు. మొత్తం పది ఏజెన్సీలకు ఒక్కో ఏజెన్సీకి వంద చొప్పున పోస్టుల భర్తీ కోసం ఉద్యోగుల నియామకాలకు సంబంధించి అనుమతులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఓ ఏజెన్సీ నిర్వాహకుడు దరఖాస్తు తప్ప మిగితావన్నీ ఇతర ఏజెన్సీల అర్హత పత్రాలే సమర్పించినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. 2012 ఆగస్టులో జరిపిన అవుట్ సోర్సింగ్ నియామకాలలో ఓ ఏజెన్సీకి 70 పోస్టుల భర్తీ అప్పగించారు. అయితే, ఆ ఏజెన్సీ 30 మందికి మాత్రమే ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లిం చినట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. -
‘కలెక్టర్’నువ్వా.. నేనా!
ప్రగతినగర్ : ‘‘కలెక్టర్ నువ్వా.. నేనా! నేను సెలవులో వెళ్లకముందు ఇంటింటి సర్వేను వేగంగా పూర్తి చేయాలని, ముఖ్యంగా నిజామాబాద్ నగర పరిధిలో సమస్యలు వస్తాయని, అందుకు తగ్గట్టుగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పాను. అయినా నా మాట పెడచెవిన పెట్టి ఇంత వరకు కొన్ని టీమ్‌లు.. అసలు సర్వే కూడా మొదలు పెట్టనట్లు తెలుస్తుంది. ఇదంతా కమిషనర్‌గా నీ వైఫల్యం’’ అంటూ జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మంగతాయారుపై మండిపడ్డారు.మంగళవారం స్థానిక ప్రగతిభవన్‌లో ఆయన మున్సిపల్ అధికారులతో ఆహారభద్రత కార్డులు,సామాజిక పింఛన్ల సర్వేపై మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలాల్లో 80 శాతం సర్వే పూర్తయినట్లు నివేదికలు అందుతున్నాయని,అయితే నిజామాబాద్ నగరంతో పాటు మూడు మున్సిపాలిటీలు సర్వేలో వెనుకబడ్డాయన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి సర్వేను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశా లు జారీ చేసిందని అన్నారు. మున్సిపల్ సిబ్బంది మాత్రం సర్వేపై అంత సుముఖంగా లేరని సర్వే నివేదిక ద్వారా తెలుస్తుందన్నారు. ఏది ఏమైన ప్పటికీ ఈ నెల 6 నాటికి ముఖ్యంగా సామాజిక భద్రత పింఛన్ల సర్వేపూర్తి చేయాలని, 8వ తేదీ నుంచి ప్రభుత్వం పింఛన్లు అందిస్తుందన్నారు. మున్సిపల్ సిబ్బంది ప్రతి రోజు చేసిన సర్వే వివరాలు, ఇండ్ల వివరాలు క్యాంపు కార్యాలయంలో అందించాలన్నారు. సర్వే పూర్తి అయిన వెంటనే ముందుగా నైపుణ్యం గల ఆపరేటర్లను నియమించుకొని వెంటనే సీడింగ్ మొదలు పెట్టాలన్నారు.ఇదిలా ఉండగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సర్వే సీడింగ్కై ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు, హైస్పీడ్ సాఫ్ట్‌వేర్‌ను ఏర్పాటు చేసి స్థానిక ఎన్ఐసీడీఎస్ఓ,రెవెన్యూభవన్,తహశీల్దార్ కార్యాలయంలో మీ-సేవ ట్రైనింగ్ సెంటర్లలో కంప్యూటర్లను ఏర్పాటు చేశారు. -
మీ సేవలు గొప్పవి
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా జరుపుకొన్నారు. వారి త్యాగాలను కొనియాడారు. అమరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలను ఉంచి నివాళులు అర్పించారు. జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాలలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. నిజామాబాద్ క్రైం : పోలీసులు సమాజ సేవలో ఉన్నందుకు గర్వపడాలని కలెక్టర్ రొనాల్డ్ రోస్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో అమర పోలీసుల సంస్మరణ దినం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పోలీ సులు విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించటం బాధాకరమన్నారు. వారి త్యాగాలు మరువలేనివన్నారు. ప్రజలకు ఎటువంటి ఆపద వచ్చినా పోలీసులు ముందుండి శాంతిభద్రతలు కాపాడుతున్నారని కొని యాడారు. దేశంలో ప్రజలు స్వేచ్ఛగా జీవి స్తున్నారంటే, దాని వెనుక పోలీసుల కృషి ఎంతో ఉందన్నారు. తెలంగాణవ్యాప్తంగా విధి నిర్వహణలో ఈ ఏడాది ముగ్గురు పోలీసులు మృతి చెందారని పేర్కొన్నారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ఎనిమిది గం టలపాటు పనిచేస్తే పోలీసులు 24 గంటల పాటు విధులలో ఉంటారని అన్నారు. పోలీసు అమర వీరుల కుటుంబాలు ఆపదలో ఉన్నప్పుడు తక్షణమే వారికి సహాయం అందించాలని అధికారులకు సూచించారు. ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ సమాజంలో శాంతిభద్రతల కోసం కృషి చేస్తుంది పోలీస్ శాఖయేనన్నారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది పోలీసులు, వివిధ పోలీసు కంపెనీలకు చెందిన సిబ్బంది 653 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. రాష్ట్రంలో ముగ్గురు పోలీసులు ప్రాణాలు కోల్పోవటం బాధాకరమన్నారు. కార్యక్రమంలో డీపీ ఓ ఉద్యోగి సుశీల ఆలపించిన దేశభక్తి గీతం ఆకట్టుకుంది. అంతకు ముందు కలెక్టర్, ఎస్పీ తదితరులు అమర పోలీసుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలుంచి ఘనంగా నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నగర మేయ రు ఆకుల సుజాత, అదనపు ఎస్పీ పాండునాయక్, ఏఆర్ డీఎస్పీ ఎం వెంకటేశ్వర్లు, డీటీసీ డీఎస్పీ పుల్లెల రాజబాబు, నగర సీఐ నర్సింగ్‌యాదవ్, నిజామాబాద్ రూరల్ సీఐ వెంకటశ్వర్లు, నగర ఎస్ఐలు, పోలీసు అధికారులు అమర పోలీసులకు శ్రద్ధాంజలి ఘటించారు. అమర పోలీసుల సాక్షిగా పనిచేయాలి డిచ్పల్లి : విధి నిర్వహణలో అమరులైన పోలీసుల సాక్షిగా శాంతి భద్రతల పరిరక్షణలో సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని డిచ్పల్లి ఏడో బెటాలియన్ కమాండెంట్ వై.శ్రీనివాసరావు అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా బెటాలియన్‌లోని అమరవీరుల స్థూపం వద్ద కమాం డెంట్, అసిస్టెంట్ కమాం డెంట్లతోపాటు అమరవీరుల కుటుంబాల సభ్యులు, బెటాలియన్ సిబ్బంది పుష్పగుచ్చాలను ఉంచి నివాళులర్పించారు. ఈ సం దర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఇప్పటివరకు ఏడో బెటాలియన్‌కు చెందిన 11 మంది పోలీసులు అమరులయ్యారని తెలిపారు. వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. ఏదేని సమస్య ఉంటే తన దృష్టికి తేవాలని పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణలో ముందుండి బెటాలియన్‌కు మంచి పేరు తేవాలని ఆయన సిబ్బందికి సూచించారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది అమరులైన పోలీసుల పేర్లను చదివి వినిపించారు. అనంతరం తుపాకులను కిందకు దించి అమర పోలీసులకు నివాళులు అర్పించారు. రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు కుమారస్వామి, అమృతరావు, రామాంజనేయులు, ప్రసన్నకుమార్, బీడబ్ల్యుఓ మహేందర్, ఆర్ఐలు నయీం, దామోదర్, ఆర్ఎస్ఐలు, బెటాలియన్ సిబ్బంది, అమర పోలీసుల కుటుంబాల సభ్యులు, సర్పంచ్ అంజయ్య, తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు మమత, రవీందరెడ్డి, కంజర గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ సింధు, టాటా గోల్డ్‌ప్లస్ ప్రతినిధులు రవిదాస్, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. చివరగా, పోలీసుల అమర వీరుల దినం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమ తులను అందజేశారు. -
గడువులోగా తేలుస్తారా?
మోర్తాడ్ : ఆహార భద్రత కార్డులు, సామాజిక పింఛన్లకు అర్హులను ఎంపిక చేయడం అధికారులకు చిక్కుగా పరిణమించింది. సమయం ఎక్కువగా లేకపోవడం, దరఖాస్తులు అధికంగా ఉండటంతో సకాలంలో ‘ఇంటింటి సర్వే’ ఎలా పూర్తి చేయాలో అర్థంకాక వారు ఇరకాటంలో పడ్డారు. ఈనెల 30లోగా సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదే శించింది. రోజుకు 150 నుంచి 200 వ రకు ఇళ్లను సర్వే చేయాలని కలెక్టర్ రొనాల్డ్ రోస్ అధికారులకు సూచించారు. వారు మాత్రం రోజుకు 50ఇళ్లకు మిం చి సర్వే చేయడం సాధ్యం కాదని చెబుతున్నారు. పరిశీలన జరిపి అర్హులను తేల్చడానికి ఒక ఇంటికి 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతుంది. ఇ లాంటి పరిస్థితిలో రోజుకు 150 నుంచి 200 ఇళ్లను సర్వే నిర్వహించడం అసాధ్యమని వారు పేర్కొంటున్నారు. ఒక గ్రామంలో సర్వే పూర్తి చేయాలంటే కనీసం వారం రోజుల సమయం పడుతుందని, అన్ని గ్రామాలలో సర్వే అనుకున్న సమయంలో పూర్తి చేయలేమని అధికారులు చెబుతున్నారు. ఆహార భ ద్రత కార్డులు, సామాజిక ఫించన్లకు అర్హులను మాత్రమే ఎంపిక చేయాల ని, అనర్హులకు లబ్ధి చేకూర్చితే సర్వే బృందానికి నాయకత్వం వహించిన అధికారిని బాధ్యుడిని చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. మరోవైపు ఈ స ర్వే అధారంగానే నవంబరు నుంచి ప థకాలను అమలు చేయాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. ఇదీ పరిస్థితి జిల్లావ్యాప్తంగా ఆహారభద్రత కార్డుల కోసం 6,93,055 మంది, సామాజిక పింఛన్ల కోసం 3,52,913 మంది ద రఖాస్తులు సమర్పించారు. మండలాని కి ఐదు నుంచి ఆరు సర్వే బృందాలను ప్రభుత్వం నియమించింది. వీటికి త హశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాయకత్వం వహిస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో ఎంపీడీఓ లను కూడా సర్వే బృందానికి నాయకత్వం వహించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సర్వే బృందం లో వీఆర్ఓ, గ్రామసేవకులు, పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ సి బ్బంది సభ్యులుగా ఉన్నారు. ఆహారభద్రత కార్డులు, పింఛన్ కోసం దరఖా స్తు చేసుకున్న వ్యక్తికి సంబంధించిన కు టుంబానికి ఉన్న భూములు, వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇందుకోసం సర్వే బృందానికి వ్యవసాయ భూముల వివరాలు, రవాణా శాఖ వివరాలు, సమగ్ర సర్వే వివరాలను ప్ర భుత్వం అందజేసింది. ప్రభుత్వ పథకాలకు అర్హుడని తేల్చడానికి దాదాపు 10 కాలాల ఫారమ్ నింపాలి. అనర్హుడని తేల్చినా అంతే నివేదికను తయా రు చేయాలి. ఇందుకోసం దరఖాస్తుదా రు ఉంటున్న ఇంటిని, అక్కడి వసతుల ను పూర్తి స్థాయిలో పరిశీలించిన తరువాత సర్వే బృందం ఒక అంచనాకు రావాల్సి ఉంది. సర్వే అనంతరం అనర్హునికి లబ్ధి చేకూరినట్లు తేలితే సదరు అధికారిని సస్పెండ్ చేసే అవకాశం ఉంది. దీంతో అధికారులు జాగ్రత్తగా సర్వే నిర్వహిస్తున్నారు. అయితే దరఖాస్తులు ఎక్కువగా ఉండటం, సమయం తక్కువగా ఉండటంతో తమ మెడపై కత్తి పెట్టినట్లు ఉందని వాపోతున్నారు. శాస్త్రీయంగా సర్వే నిర్వహించి అర్హులను తేల్చాలంటే ఎక్కువ సమయం అవసరమని, లేకపోతే గందరగోళం ఏర్పడుతుందని చెబుతున్నారు. సర్వే బృందాలు తక్కువగా ఉండటంతో గడువు పెంచాలని కోరుతున్నారు. -
ప్రమాదం జరిగితే బాధ్యులెవరు?
నిజామాబాద్ అర్బన్: దీపావళి వచ్చిందంటే వారికి పండుగే. వ్యాపారంపై వున్న దృష్టి ప్రమాదం జరిగితే ఎలా అన్నదానిపై మాత్రం ఉండదు. వీరికి అధికారుల నిర్లక్ష్య వైఖరి తోడైంది. దీంతో విచ్చలవిడిగా పటాకుల కేంద్రాలు వెలుస్తున్నాయి. అధికారుల తీరు వ్యాపారులకు కాసులు పండిస్తోంది. నగరంలోని కిషన్‌గంజ్ నిత్యం జనంతో కిటకిటలాడుతూ ఉంటుంది. కనీసం మోటారు సైకిళ్లు కూడా సక్రమంగా వెళ్లే పరిస్థితి లేదు. ఇదే ప్రాంతంలో ఇరుకు గదులలో పటాకుల వ్యాపారం కొనసాగుతోంది. దాదాపు పది మంది హోల్‌సేల్ వ్యాపారులు వీటిని ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచే జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు టపాసులు సరఫరా అవుతాయి. ఇంత పెద్ద మొత్తంలో ఇక్కడ వ్యాపారం జరుగుతుంటే, కనీస నిబంధనలు మాత్రం అమలు కావడం లేదు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఏదైనా ప్రమాదం జరిగితే అందుకు బాధ్యులెవరు? అక్కడికి కనీసం అగ్నిమాపక శకటం కూడా వెళ్లలేని పరిస్థితి. కోట్ల రూపాయల విలువ చేసే వ్యాపార సమూదాయాలూ అక్కడే ఉన్నాయి. మరి కొన్ని పటాకుల దుకాణా లను నివాస గృహాలలోనే ఏర్పాటు చేస్తున్నారు. అధికారులు లెసైన్సుల జారీ చేస్తూ అందినంతా ముడుపులు అందుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్ పటాకుల విక్రయ కేంద్రాలు నిర్ణీత ప్రదేశాలలోనే కొనసాగేలా చూడాలని, నిబంధనలు ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రొనాల్డ్ రోస్ గత శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశంలో అధికారులను ఆదే శించారు. అధికారులు మాత్రం ఆయన ఆదేశాలను తుంగలో తొక్కారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న విక్రయ కే్రందాలకు నేటి వరకూ వెళ్లలేదు. విక్రయాల కోసం నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ, డిచ్‌పల్లిని ఎంపిక చేశారు. ఈ ప్రాంతాలలో జారీ చేసిన లెసైన్సుల సంఖ్య రెండంకెలు కూడా దాటలేదు. ప్రజలు తిరగాడే ప్రాంతాలలో పటాకుల అమ్మకాలు ఉండకూడదని, దుకాణానికీ, దుకాణానికీ మధ్య కనీసం మూడు మీటర్ల దూరం పాటించాలన్న కలెక్టర్ ఆదేశాలను ఎవ్వరూ పాటించడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నిబంధనలు అమలయ్యేలా చూడాలని పలువురు కోరుతున్నారు. -
సర్వే ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక : కలెక్టర్ రోస్
కామారెడ్డి : సమగ్ర కుటుంబ సర్వే ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా పెన్షన్, ఆహార భద్రతా కార్డుల అర్హులను గుర్తించి సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపర్చాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ మండల అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక ఎస్ఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ... గ్రామ రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శు లు అనర్హులకు ప్రభుత్వ పథకాలు చేరకుండా తమ పరి శీలనలో ధ్రువీకరించాలని సూచించారు. ఫామ్ 1 (బీ), ట్రాన్స్పోర్ట్, ఆదాయపు పన్ను చెల్లింపుల ఆధారంగా అనర్హులను పక్కాగా గుర్తించాలన్నారు. ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉన్నవారిని ప్రత్యేకంగా గుర్తిం చాలన్నారు. ప్రభుత్వపథకాలకు వేర్వేరుగా గుర్తింపు కార్డులుంటాయని తెలిపారు.అంత్యోదయ అన్నయోజన కింద హెచ్ఐవీ, లెప్రసీ, దారిద్య్రంలో ఉన్న మహిళలు, వితంతువులు, భూమిలేని శ్రమజీవులు, రిక్షా నడుపుకునేవారు, కుమ్మరి, చెప్పులు కుట్టేవారు అర్హులన్నారు. వికలాంగులు సదరన్ క్యాంపు ద్వారా పొంది న సర్టిఫికేట్, తహశీల్దార్, ఎంపీడీవో ధ్రువీకరణ తరువాత పెన్షన్ లభిస్తుందన్నారు. ఐకేపీ ద్వారా అల్ట్రాపవర్ సర్వే ప్రతీ మండలంలో నిర్వహించారని, స్వాతం త్య్ర సమరయోధులు, సంచార గృహాల సమాచారాన్ని తప్పకుండా సేకరించాలన్నారు. పరిశీలన సమయంలో దరఖాస్తులు స్వీకరించవచ్చు అనంతం ఆర్డీవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. డివిజన్ లో సర్వేద్వారా భిక్కనూరులో 16,186, దోమకొండలో 17,186, గాంధారిలో 15,320, కామారెడ్డిలో 27 వేలు, లింగంపేటలో 12,817, మాచారెడ్డిలో 15,066, నాగిరెడ్డిపేటలో 9452, సదాశివనగర్‌లో 16,617, తాడ్వాయిలో 13,625, ఎల్లారెడ్డిలో 12,824 దరఖాస్తులు వివిధ ప్రభుత్వ పథకాలకు అందాయని తెలిపారు. వెరిఫికేషన్ సమయంలోనూ దరఖాస్తులను స్వీకరించవచ్చన్నారు. వీఆర్వోలు పహణీ ప్రకారం రైతుల భూమిని చూపించాలని, రెండున్నర ఎకరాల మాగా ణి, ఐదు ఎకరాల మెట్టభూమి, రైస్‌మిల్, షాప్స్ ఇతర ప్రాపర్టీ ఉన్నచో అనర్హుల జాబితాలో చేర్చాలన్నారు. డివిజన్ ప్రత్యేకాధికారి, ఐకేపీ పీడీ వెంకటేశం మాట్లాడుతూ.. ఆయా మండలాల్లో ఏర్పాటయిన బృందాలు వెరిఫికేషన్ ప్రక్రియను నిరంతరాయంగా పరిశీలించాలన్నారు. ఎండీవో, ఎమ్మార్వోలు, డిప్యూటీ ఎమ్మార్వో లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సీనియర్ అసిస్టెంట్లు సభ్యులుగా బృందాలు ఏర్పాటయ్యాయని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బాలోజీనాయక్, ప్రతేయకాధికారులు, ఎమ్మార్వోలు, వీర్వోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
6 నుంచి ఇంటింటి సర్వే
ప్రగతినగర్: ఆహార భద్రత, సామాజిక పిం ఛన్ కార్డుల మంజూరు కోసం ఈ నెల 16 నుంచి ఇంటింటి సర్వే చేపట్టనున్న ట్లు జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ తెలిపారు. ఇవి దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి వర్తింపజేయడంతోపాటు అనర్హులకు లబ్ధి కలుగుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక ప్రగతి భవన్లో రాజీవ్‌గాంధీ ఆడిటోరియం లో రెవెన్యూ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నందున గతంలో జారీ చేసిన రేషన్,పింఛన్ కార్డుల స్థా ్థనంలో తెలంగాణ రాష్ట్రం పేరున కార్డు లు జారీ చేస్తారని తెలిపారు. గతంలో అన్ని పథకాలకు ఈ కార్డునే ప్రామాణికంగా తీసుకున్నందున అందరూ ఈ కార్డులు పొందారని తెలిపారు. ప్రస్తు తం ఇచ్చే కార్డులు కేవలం బియ్యం,కిరోసిన్‌లకే పనికి వస్తాయన్నారు. అన్ని కుటుంబాలకు ఇప్పటికి ఆధార్ అనుసంధానం చేసినందున చాలా వరకు డూప్లికేట్, బోగస్ కార్డులను తొలగించినట్లు చెప్పారు. ప్రస్తుతం జారీ చేసే ఆహార భద్రత, పింఛన్ కార్డులకు అర్హులను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశిం చారు. తనిఖీ అధికారులు ఈ విషయం లో పూర్తి జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ట్రాక్టర్లు మినహా నాలుగు చ క్రాల వాహనాలు గల యజమాను లు, రెండున్నర ఎకరాల తరి, ఐదు ఎకరాల ఖుష్కి భూమిగల కుటుంబాలు,ఆ దా య పన్ను దారులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, డాక్టర్లు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు, పెన్షనర్లు, ప్రొఫెసర్లు, బీపీఎల్ పరిధిలోకి రాని ఇతరులు ఈ కార్డులకు అనర్హులని వివరించారు. తనిఖీ పకడ్బందీగా చేపట్టాలి భూములు గ్రామాల్లో ఉండి వేరేచోట్ల నివాసం ఉండేవారి వివరాలు ఆ గ్రా మాల్గోని వీఆర్వోలు తెలుసుకొని సంబంధిత వీఆర్లకు తెలిపి, తనిఖీ పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఈ తనిఖీలో రెవెన్యూలో సీనియర్ అసిస్టెంట్ నుంచి ఆపైస్థాయి అధికారు లు, ఎంపీడీవోలను తనిఖీ అధికారులను నియమిస్తామన్నారు. ప్రతి మండలానికి అయిదు తనిఖీ బృం దాలు, మున్సిపల్ కార్పొరేషన్ పరి దిలో 10-15 బృందాలు పనిచేస్తాయన్నారు. ఈ నెల 16 నుంచి 31 వరకు తనిఖీ చేయిస్తామన్నారు. దరఖాస్తులన్నీ రిజిష్టర్‌లో నమోదు చేయాలని, దరఖాస్తుదారులకు రశీదులు ఇవ్వాలన్నారు. నవంబర్ 7 వరకు డాటా నమోదు చేయాలని ఆదేశించారు. కుటుంబంలో ఒక్కరికే వృద్ధాప్య పిం ఛన్ వస్తుందన్నారు. వితంతు పింఛన్‌కు భర్త మరణ ధ్రువపత్రం పరిశీలించాలని సూచించారు. వికలాంగ పింఛన్ సదరం ద్వారా జారీచేసిన 40 శాతం ఆపైన వైకల్య ధ్రువపత్రాలను పరిశీలించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో యాదిరెడ్డి, వెంకటేశ్వర్లు, శ్యాం ప్రసాద్‌తో పాటు రెవెన్యూ ఉద్యోగులు తహశీల్దార్లు పాల్గొన్నారు. -
ఐదువేల పింఛన్లు గోవిందా!
ప్రగతినగర్ : అధికారుల నిర్లక్ష్యం వికలాంగులకు శాపంగా మారింది. అర్హులైన వికలాంగులు పింఛన్‌కు దూరమవుతున్నారు. బోగస్ పింఛన్లు ఉన్నాయంటూ ప్రభుత్వం 2011లో (సాఫ్ట్వేర్ ఫర్ అస్సెస్మెంట్ ఆఫ్ డిజెబిలిటి యాక్సెస్,రిహాబిలిటేషన్ అండ్ ఎంపవర్మెంట్) వికలాంగుల వైకల్య నిర్ధారణ కోసం సదరం శిబిరం ఏర్పాటు చేసింది. వీటి నిర్వహణ బాధ్యతలను డీఆర్డీఏకు అప్పగించింది. అయితే సదరం శిబిరం నిర్వహణ మొదటి నుంచి అస్తవ్యస్తంగా మారింది. శిబిరం ప్రారంభంకాకముందు జిల్లావ్యాప్తంగా 32,232 వికలాంగుల పింఛన్లు ఉన్నాయి. సదరం శిబిరం ప్రారంభమైన తరువాత పింఛన్లో కోత మొదలైంది. దీంతో సు మారు ఐదు వేల మంది వికలాంగులు అనర్హులం టూ పింఛన్లను తొలగించారు. ప్రస్తుతం 29, 634 మందికి పింఛన్లు అందిస్తున్నారు. అయితే సదరం శిబిరం నిర్వహణను కొన్ని నెలల క్రితం జిల్లా ఆస్పత్రికి బదలాయించారు. నిర్వహణ, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పూర్తిబాధ్యతలను వారికే అప్పగించారు. ఇక్కడ శిబిరం ప్రారంభం నుంచి 37,113 మందికి పరీక్షలు జరపుగా, 29, 408 మంది వికలాంగులను అర్హులుగా గుర్తించారు. ఇందులో నుంచి సుమారు 25 వేల సదరం సర్టిఫికెట్లు వికలాంగులకు చేరాయని అధికారులు చెబుతుండగా, అది వాస్తవం కాదని వికలాంగులు ఆరోపిస్తున్నారు. ఏడాది క్రితం తాము సదరం శిబిరానికి హాజరైనా ఇంతవరకు ధ్రువీకరణ పత్రం అందలేదని పలువురు వికలాంగులు ప్రతి శుక్రవారం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల సదరం సర్టిఫికెట్ల ఐడీ నంబర్ కంప్యూటకరీంచకుంటే దాదాపు ఐదు వేల మంది అర్హులైన వికలాంగులు పింఛన్ కోల్పోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా సదరం నిర్వాహకులు మరో నాలుగు వేల సర్టిఫికెట్లు ప్రింటింగ్‌కు ఇచ్చారు. మిగతా ఐదువేల మంది వికలాంగులకు సంబంధించి ఫొటోలు మిస్ చేశారు. దీంతో వారు సదరం శిబిరానికి హాజరైనా ఫలితంలేకుండా పోయింది. ఈ విషయాన్ని డీఆర్డీఏ అధికారులు గోప్యంగా ఉంచి, వికలాంగుల కోసం ఆయ మండలాల్లో వివరాలు సేకరిస్తున్నారు. సర్టిఫికెట్లో ఫొటో లేకుంటే ఇస్తే పింఛన్ రాదు. ఇటీవలే జిల్లా కలెక్టర్ నిర్వహించిన సమీక్షలో కూడా అధికారులు సదరం సర్టిఫికెట్లు వికలాంగులందరికి అందించామని చెప్పారు. కానీ సర్టిఫికెట్లు వేలల్లో వికలాంగులకు చేరాల్సి ఉన్నా, రహస్యంగా ఉంచి ప్రమాదం మీద కు తీసుకువస్తున్నారు. ఇందులో అప్పటి సీవోలు, ఏంపీఎంల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఫొటోలు తీసుకోకుండా లక్ష్య సాధన కోసం తూతూ మంత్రంగా పనిచేయడం ఇప్పుడు 5 వేల మంది వికలాంగులకు శాపంగా మారింది. దీనిని రహస్యంగా ఉంచి గ్రామాల్లో సీఆర్పీలు, సీసీలకు వికలాంగులను గుర్తించే బాధ్యతలను అప్పగించా రు. ఈ నెలాఖరు వరకు సదరంలో హాజరై ఫొటోలు మిస్అయిన వికలాంగులను గుర్తించడానికి గ్రామా ల్లో స్పెషల్ డ్రైవ్టీంలు బయలు దేరాయి. ఈ విషయం ఎక్కడబయటపడుతుందోనని అత్యంత గోప్యంగా ఈ బాగోతాన్ని డీఆర్డీఏ అధికారులు నడిపిస్తున్నారు. నేడు సదరంపై కలెక్టర్ సమీక్ష సదరం శిబిరం నిర్వహణపై బుధవారం జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. డీఆర్డీఏ, సదరం అధికారులతో సమావేశం కానున్నారు. సదరం శిబిరానికి కేటాయించిన బడ్డెట్,ఇంతవరకు ఎన్ని సదరం ధ్రువీకరణపత్రాలు అందించారు..ఇంకా ఎంత మందికి అందించాలనేది అధికారులతో కలెక్టర్ చర్చించనున్నారు. అలాగే సదరం నిర్వహణలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఇటీవల వికలాంగుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తాయి. -
పిల్లల నమోదుకు చర్యలు తీసుకోండి
ప్రగతినగర్ : అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల నమోదును పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ తన చాంబర్లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలలో మూడేళ్లు నిండిన పిల్లలను చేర్పించడానికి తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాలన్నారు. ఎన్నిక చేయబడిన కేంద్రాలలో ఆంగ్లమాధ్యమంలో పిల్లలకు చదువు చెప్పడానికి కార్యకర్తలకు అవసరమైన శిక్షణ ఇప్పించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్రాలలో కనీస వసతులు కల్పించాలని, మంజూరు చేసిన కేంద్రాలలో త్వరలో పూర్తిచేయడానికి తిరిగి టెండర్లు పిలవాలని సూచించారు. సొంతభవనాల కోసం ప్రతిపాదనలు పంపించండి పట్టణ కేంద్రాలలో అద్దెకు గదులు లభించని పరిస్థితుల్లో పాఠశాలల పరిధిలో ఒక గదిని కేటాయించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. అసంపూర్తిగా నిర్మాణ దశలో ఉన్న శిశు కేంద్రానికి అవసరమైన నిధులు విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న 989 కేంద్రాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయడానికి అవసరమైన ప్రతిపాదనలు పంపించాలన్నారు. భవనాలు పూర్తి చేయడానికి ఇంటర్ డిపార్ట్మెంట్ సమన్వయ కమిటీ సమావేశాలలో సమస్యలు తెలుపాలన్నారు. పిల్లలకు, గర్భిణులకు ఐరన్ ఫోలిక్ మాత్రలు సమపాళ్లలో పంపిణీ చేయాలని, ఇందుకు అవసరమైన ఇండెంట్‌ను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారికి పంపించాలని సూచించారు. పౌష్టికాహారం అందించి పిల్లలు ఆ రోగ్యంగా ఎదగడానికి కృషి చేయాలన్నారు. సమావేశంలో కమిటీ సభ్యులు ఐసీడీఎస్ పీడీ రాములు, డీఈఓ శ్రీనివాసాచారి, అదనపు డీఎంహెచ్ఓ బసవేశ్వరి, ఎంపీడీఓ గీతారాణి, పీఆర్ రాజేంద్రప్రసాద్, వైద్యాధికారి నాగరాజు, సీడీపీఓ ఝూన్సీరాణి, ఏపీఆర్ఓ రాంమోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. రుణమాఫీకి అర్హులను గుర్తించండి మద్నూర్ : రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన లబ్ధిదారుల వివరాలను అందించాలని అధికారులను జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ ఆదేశించారు. మంగళవారం మద్నూర్ మండల కేంద్రంలోని తహశీల్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డుల గది, కంప్యూటర్ గది, తహశీల్దార్ చాంబర్‌ను పరిశీలించారు. అనంతరం బ్యాంకు అధికారులు,వీఆర్వోలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. రుణమాఫీకి ఆధార్ అనుసంధానం, బ్యాంకు ఖాతాల పరిశీలన, ఒకే కుటుంబంలో పంట రుణాలు పొందిన వారిని గుర్తించాలని బ్యాంకు అధికారులను ఆదేశించారు. 2014-15 సంవత్సరానికి గాను పహాణీ తయారు చేశారా అని వీఆర్వోలను అడిగారు. పంట వివరాలను తప్పకుండా పహాణీలో పొందుపరచాలని కలెక్టర్ సూచించారు. జమాబందీ వివరాలను వచ్చే నెలలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఆధార్ అనుసంధానం వంద శాతం పూర్తిచేయాలన్నారు. లెండి ప్రాజెక్ట్ ఎక్కడ ఉందని..ఇక్కడి నుంచి ఎంత దూరం ఉందని కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జుక్కల్ నియోజకవర్గానికి ఆనుకొని ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలను ఆయన మ్యాప్‌ను పరిశీలించారు. -
సార్లొస్తారా!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాస్థాయి కీలక పోస్టులలో ఇన్చార్జులు కొనసాగుతుండటంతో పాలనపై ప్రభావం పడుతోంది. ఖాళీలకు తోడు,ఉన్నతాధికారులు సెలవులో వెళ్లినప్పుడు ఒకే ఉన్నతాధికారి నాలుగైదు పోస్టుల కు ఇన్చార్జిగా వ్యవహరించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సదరు అధికారులు ఏ పోస్టుకూ న్యాయం చేయలేకపోతున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఇదే పరిస్థి తి నెలకొంది. ఫలితంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో స్తబ్దత ఏర్పడింది. జాయింట్ కలెక్టర్, అడిషనల్ జాయింట్ కలెక్టర్, డీఆర్ఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డైనమిక్ కలెక్టర్‌గా పేరు తెచ్చుకు న్న రొనాల్డ్ రోస్ ఈ నెల 15 నుంచి సెలవులో వెళ్లా రు. డీఆర్ఓ తప్ప అన్ని పోస్టులకు జడ్పీ సీఈఓ రా జారాం ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. నిజామాబా ద్ ఆర్డీఓ యాదిరెడ్డి ఇన్చార్జి డీఆర్ఓగా వ్యవహరి స్తున్నారు. కలెక్టర్ రొనాల్డ్‌రోస్ 19న తిరిగి విధుల లో చేరాలి. కానీ, ఆయన రాకపోవడంతో సెలవు పొ డిగించినట్లు ప్రచారం జరుగుతోంది.కలెక్టర్ క్యాంపు వర్గాలు మాత్రం రోస్ సోమవారం విధులలో చేరుతారని చెబున్నారు. పోలీసు బాస్ ఎస్పీ డాక్టర్ తరుణ్‌జోషి కూడ ఈ నెల 15 నుంచి సెలవులో వెళ్లగా అడిషనల్ ఎస్పీ బాలునాయక్ ఆ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఉన్నతాధికారుల సెలవుపై చర్చ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన పీఎస్ ప్రద్యుమ్నను, బోధ న్ సబ్‌కలెక్టర్ హరినారాయణన్‌ను జూన్ 17న ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రద్యుమ్న స్థానంలో ఎవరినీ ని యమించకుండా, అప్పటి జాయింట్ కలెక్టర్ డి.వెంకటేశ్వర్రావుకు కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. జులై 30న రొనాల్డ్ రోస్‌ను కలెక్టర్‌గా నియమితులయ్యారు.అదేరోజు జేసీ వెంకటేశ్వర్రావు సైతం బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. మరోవైపు అదనపు జాయింట్ కలెక్టర్ శేషాద్రి అనారోగ్య కారణాలతో ఏప్రిల్ నుంచి దీర్ఘకాలిక సెలవులో ఉండడంతో ఆ పోస్టు కూడా ఖా ళీగా ఉంది. రోనాల్డ్ రోస్ జూలై 31న కలెక్టర్‌గా బా ధ్యతలు తీసుకొని సీఎం పర్యటన, సమగ్ర కుటుంబ సర్వేలో చురుకుగా పాల్గొని సీఎం ప్రశంసలు అందుకున్నారు. ఈ లోగా ఐఏఎస్‌ల విభజనలో ఆయనను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఆ యన అక్కడి సీఎస్‌కు రిపోర్టు చేయడం అనివార్యం గా మారింది. రోస్‌ను డిప్యూటేషన్‌పై ఇదే జిల్లాలో కొ నసాగించే విషయమై ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఎస్పీ డాక్టర్ తరుణ్‌జోషిపై టీఆర్ ఎస్ ప్రజాప్రతినిధులు కొందరు అసంతృప్తిగా ఉండటమే కాకుండా, ఆయన వైఖరిపై సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు కూడా చేశారు. జిల్లాలో జరిగిన 41 మంది ఎస్ఐల బదిలీలను ప్రభుత్వం నిలిపి వేయడంపై ఎస్పీ కొం త కలత చెందినట్లు ప్రచారం ఉంది. ఈ నేపథ్యం లో నే ఇద్దరు ఉన్నతాధికారులు సెలవులో వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. -
సెలవుపై వెళ్లిన కలెక్టర్
ప్రగతినగర్: జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ సెలవుపై వెళ్లారు. ఆయన ఐదు రోజులు సెలవు పెట్టడంపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. ఐఏఎస్ అధికారు ల విభజనలో రోస్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. సెప్టెంబర్‌లో ఆ యన ఆ రాష్ట్రంలో బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. ఈ క్రమంలో కలెక్టర్ సెలవు పెట్టడంతో, బదిలీ తప్పదేమోనని పలువురు భావిస్తున్నారు. అం దరినీ కలుపుకుని పోతారని ఆయనకు మంచి పేరుంది. ప్రజాప్రతినిధు లు, అధికారులు, ప్రజలతో మంచి సంబంధాలను నెరుపుతున్నారు. జిల్లాలో బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజులలోనే డైనమిక్ కలెక్టర్‌గా పేరు పొందారు. జిల్లాకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు రొనాల్డ్ రోస్ పనితీరుపై సీఎం కేసీఆర్ దగ్గ ర సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. కలెక్టర్‌గా ఆయన అయితేనే జిల్లా అభివృద్ధి పథంలో పరుగులు తీస్తుందని, సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చగలమనే నమ్మకాన్ని వారు సీఎం ముందు ప్రస్తావన తెచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రోస్‌ను మరికొంత కాలం జిల్లాలోనే కొనసాగేలా ఆంధ్రా సర్కా రును కోరే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయంతో ఐఏఎస్‌లను మార్చుకోవచ్చని ప్రత్యూష సిన్హా కమిటీ ఇప్పటికే సూచించింది. ఇరు రాష్ట్రా ల సీఎస్‌లు మాట్లాడుకొని కలెక్టర్ బదిలీ మార్చుకోవచ్చనే వాదన కూడా ఉంది. ఆంధ్రా, తెలంగాణ సర్కారుల మధ్య సమన్వయం కుదిరితే కలెక్టర్‌గా రొనాల్డ్ రోస్ మరికొంత కాలం ఇక్కడే కొనసాగే అవకాశం ఉంది. లేదా బదిలీ అనివార్యమైతే ఆయన ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లడం, జిల్లాకు కొత్త బాస్ రాక తప్పదు. సోమవారం విధులలో చేరనున్న అదనపు జాయింట్ కలెక్టర్ శేషాద్రికి ఇన్చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. -
ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేయాలి
ప్రగతినగర్ : బ్యాంకు ఖాతాలకు నూరు శాతం ఆధార్ అనుసంధానం చేయాలని బ్యాంకు అధికారులను జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ఆదేశించారు. శనివారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్లో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాలు,రైతురుణ మాఫీ, పీఎంజేడీవై తదితర కార్యక్రమాలకు ఆధార్ అనుసంధానం చేయడం తప్పనిసరి అని పేర్కొన్నారు. బ్యాంకు అధికారులందరూ, వారి ఖాతాదారులకు సంబంధించి ఖాతాలను ప్రారంభించడానికి ప్రధాన మత్రి జన్,ధన్,యోజన పథకం కింద ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. రుణ మాఫీ పొందే రైతులకు తిరిగి రుణాలందించడానికి అవసరమైన ముందస్తు పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. రైతులు పంట రుణాల కోసం ఇతరత్ర ఆర్థిక సంస్థలను ఆశ్రయించకుండా, అధిక వడ్డీల చెల్లింపులను నిరోధించడానికి వీలవుతుందన్నారు. ఈ ఖరీఫ్‌లో ఇప్పటి వరకు 319 బ్యాంకు బ్రాంచీల ద్వారా రూ. 1300 కోట్ల రుణ లక్ష్యానికి గాను 47.25 కోట్ల రూపాయలు పంట రుణాలు మంజూరు చేశామన్నారు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజి కింద ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ నెలాఖరుకు రూ. 85 కోట్లు లక్ష్యం కాగా ఇప్పటికి 73 శాతంతో రూ. 61.64 కోట్లు మంజూరు చేశామన్నారు. ఈ సమావేశంలో ఎల్డీఎం రామకృష్ణారావు, ఆర్బీఐ ఏజీఎం పుల్లారెడ్డి,నాబార్డు ఏజీఎం రమేష్‌చంద్ర, అన్ని బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు. -
పరిశీలించి ఆన్లైన్లో పొందుపర్చాలి
కామారెడ్డిటౌన్ : ఇంటింటా సమగ్ర కుటుంబ సర్వేలో సేకరించిన సమాచారాన్ని కంపూట్యర్ ఆపరేటర్లు నిశితంగా పరిశీలించి ఆన్లైన్లో పొందుపర్చాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రాస్ సూచించారు. స్థానిక ఆర్కే డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న కామారెడ్డి డివిజన్ సమగ్ర సర్వే ఆన్లైన్ నమోదును సోమవారం కలెక్టర్ పరిశీలించారు. ఎటువంటి తప్పులు జరుగకుండా కచ్చితమైన సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపర్చాలని, లేని పక్షంలో అర్హ్హులైన వారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను కోల్పోతారని అన్నారు. సర్వే విజయవంతం కావాలంటే ఈ ఘట్టమే ప్రధానమన్నారు. అధికారులు దగ్గరుండి నమోదు చేయించాలని ఆయన ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న సమాచారాన్ని స్థానిక అధికారుల ద్వారా సేకరించాలన్నారు. ఆపరేటర్లు తమ సొంత నిర్ణయం తీసుకోకుండా సూపర్వైజర్లు, వీఆర్వోల సహకారం తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 7 లక్షల 32 వేల కుటుంబాల సమగ్ర సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు. ఇందులో కొత్తగా 40వేల కుటుంబాలు నమోదు చేసుకున్నారని, ఇంకా సు మారు 10 వేల కుటుంబాలు నమోదు కావాల్సి ఉం దని తెలిపారు. నమోదు కాని కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయం మేరకు చర్యలు చేపడుతామన్నారు. ఆన్లైన్లో సాంకేతిక సమస్యలున్నాయని వాటిని వెంటనే పునరుద్ధరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆపరేటర్ల వివరాల రిజిష్టర్లను పరిశీలించారు. శిక్షణ పొందుతున్న కంప్యూటర్ ఆపరేటర్లతో కాసేపు ముచ్చటించారు. జాగ్రత్తగా సర్వే వివరాలను నమోదు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఎంపీడీవో జయదేవ్ ఆచార్య , తహశీల్దార్ గఫర్‌మియా, వీఆర్వోలు తదితరులున్నారు. -
సర్వే ప్రారంభం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సమగ్ర కుటుంబ సర్వేకు అధికార యంత్రాం గం సర్వ సన్నద్ధమైంది. ఒకే రోజు జిల్లాలోని 6,95,205 కుటుంబాలను సర్వే చేసేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు జరిగాయి. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జిల్లాలో ఇప్పటికే దశలవారీగా సమీక్షలు, శిక్షణ తరగతులు నిర్వహించారు. ప్రతి కుటుంబం నుంచి 32 రకాల వివరాలను సేకరించనున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమయ్యే సర్వేలో ఎలాంటి లోపాలు లేకుండా వివరాలు సేకరించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ కార్య క్రమ నిర్వహణ కోసం ప్రభుత్వం జిల్లాకు సీనియర్ ఐఏఎస్ అధికారి బి.జనార్దన్‌రెడ్డిని ఇన్చార్జ్గా నియమించింది. కలెక్టర్ రొనాల్డ్ రాస్ వారం రో జులుగా రెవెన్యూ డివిజన్లవారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించి ఉద్యోగులను అ ప్రమత్తం చేశారు. సర్వేను సక్సెస్ చేయాలంటూ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితోపాటు శాసనసభ్యులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తప్పులు లేకుండా 2011 లెక్కల ప్రకారం జిల్లాలో 25,51,335 మంది జనాభా ఉన్నారు. 6,95,205 కు టుంబాలున్నాయి. ఈ కుటుంబాలను స ర్వే చేసేందుకు ఐకేపీ, డ్వామా, ఆర్వీఎం, మెప్మా, పీఆర్, ఐసీడీఎస్ తదితర శాఖల ఉద్యోగులు, అధికారులు 30,680 మంది ని నియమించారు. పోలీసుశాఖ 1,498 మందిని కేటాయించింది. ప్రభుత్వం జారీ చేసిన సూచనల ప్రకారం కుటుంబ సభ్యుల వివరాలు నిర్దేశించిన నమూనా పట్టికలో తప్పులు దొర్లకుండా రాయాలని ప్రత్యేక అధికారి జనార్దన్‌రెడ్డి, కలెక్టర్ రొనాల్డ్‌రాస్ ఇదివరకే అధికారులను, ఎన్యూమరేటర్లను ఆదేశించారు. సర్వేలో పాల్గొనే ఉద్యోగుల కోసం అల్పాహారం, మధ్యా హ్న భోజనం ఏర్పాటు చేయాలని ఆయా పంచాయతీల సర్పంచులు, మండల ప్ర త్యేకాధికారులను ఆదేశించారు. ఎన్యూమరేటర్లను 56 రిసెప్షన్ సెంటర్ల ద్వారా 979 వాహనాల్లో 718గ్రామాలకు తరలించారు. ఇబ్బంది కలిగినా సొంతూళ్లకు జిల్లాలో మొత్తం 36 మండలాలు, 718 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. హైదరాబాద్, మహారాష్ట్ర, బొంబాయి, భీవండి, షోలాపూర్, బీదర్ తదితర ప్రాంతాలకు వలస వెళ్లినవారితోపాటు వివిధ ప్రాంతాలలో నివాసం ఉంటున్నవారు సోమవా రం రాత్రికే స్వగ్రామాలకు చేరుకున్నారు. కొంత ఇబ్బంది కలిగినా, ప్రభుత్వం ఇచ్చి న పిలుపు మేరకు ఒక్కరోజు ముందే జ నం స్వస్థలాలకు చేరుకోవడంతో పల్లెలు పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఇతర ప్రాంతాలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు అందుకు సం బంధించిన ధ్రువీకరణ పత్రాలను కుటుం బసభ్యులకు పంపించారు. -
‘సర్వే’ విధులు సక్రమంగా నిర్వహించాలి
ప్రగతినగర్ : ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా ప్రజలు బాగుండాలనే సంకల్పంతో సమగ్ర కు టుంబ సర్వే విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రాస్ అధికారులకు, ఎన్యూమరేటర్లకు సూచించారు. శనివారం రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో సమగ్ర కుటుంబ సర్వేపై జోనల్ అధికారులు, ప్రత్యేక అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈనెల 17న జిల్లాలోని అన్ని మండలాల్లో రెండో విడత శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినందున ఎన్యూమరేటర్లు అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. బ్యాంకు ఉద్యోగులు కూడా శిక్షణకు హాజరయ్యేందుకు లీడ్ బ్యాంక్ మేనేజర్ బ్యాంకర్లందరికి తెలియజేయాలన్నారు. ఎన్యూమరేటర్లకు డ్యూటీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నామని తహశీల్దారులు, స్పెషల్ అధికారులు డ్యూటీ ఆర్డరుతో పాటు వాటిని తీసుకుని 17వ తేదీకల్లా ఎన్యూమరేటర్లకు అందచేయాలని కలెక్టర్ ఆదేశించారు. 19వ తేదీన ఉదయం 6 గంటల కల్ల సంబంధిత మండల కేంద్రంలోని కార్యాలయం వద్ద సిద్ధంగా ఉండాలన్నారు. ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు, గ్రామాలకు వెళ్లేందుకు రూట్ ఆఫీసర్స్ సహకరిస్తారని తెలిపారు. మెటీరియల్‌తో కూడిన కిట్ బ్యాగులను ఎన్యుమరేటర్లకు అందజేస్తామన్నారు. కొత్తగా రూపొందించిన కర దీపికను తీసుకెళ్లాలని ఎన్యూమరేటర్లకు స్పెషల్ ఆఫీసర్లు చెప్పాలన్నారు. జోనల్ ఆఫీసర్లు, మండల స్పెషల్ ఆఫీసర్లు ,గ్రామ స్పెషల్ ఆఫీసర్ల వద్ద రిజర్వు సిబ్బందిని కేటాయిస్తున్నామని, అవసరమైతే వారి సేవలు వినియోగించుకోవాలని సూచించారు. స్పెషల్ ఆఫీసర్లు 19వ తేదీన ఎన్యూమరేటర్ల బస్సులు బయలుదేరినప్పటి నుంచి సర్వే పూర్తి అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తుండాలన్నారు. 17వ తేదీన జరిగే శిక్షణ కార్యక్రమంలో జోనల్ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు అన్ని వివరాలు ఎన్యూమరేటర్లకు తెలియచేయాలని సూచించారు. సమావేశంలో జడ్పీ సీఈవో రాజారాం, ఐకేపీ పీడీ వెంకటేశం, డీపిఓ సురేష్‌బాబు, అధికారులు పాల్గొన్నారు. కుటుంబ వివరాలు తప్పులు లేకుండా నమోదు చేయాలి ప్రభుత్వం నిర్దేశించిన ప్రోఫార్మలో ఎన్యూమరేటర్లు కుటుంబ వివరాలు సమాచారం తప్పులు లేకుండా నమోదు చేయాలని జిల్లా పరిషత్ సీఈవో రాజారాం సూచించారు. ఈనెల 12వ తేదీన అనివార్య కారణాల వల్ల శిక్షణకు హాజరుకాని ఉద్యోగులకు, ఎన్యూమరేటర్లకు శనివారం రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలోప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాచారం సరిగ్గా ఇవ్వకపోతే ఆ కుటుంబాల వారు భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు అందక నష్టపోతారన్నారు. అందువల్ల సర్వే ప్రాముఖ్యతను వారికి తెలియచెప్పి, వివరాలు తీసుకొని సమాచారం నమోదు చేయాలని ఎన్యూమరేటర్లకు సూచించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివిధ అంశాలలో ఏ విధంగా సమాచార నమోదు చేయాలో వివరించారు. కార్యక్రమంలో ఇన్చార్జి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మంగతాయారు, పలువురు అధికారులు పాల్గొని ఎన్యూమరేటర్లకు అవగాహన కల్పించారు. -
విజన్‌తో ముందుకు వెళ్దాం..
నిజామాబాద్‌కల్చరల్ : కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో జిల్లా అభివృద్ధే ధ్యేయంగా విజన్‌తో ముందుకుసాగుదామని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్ పిలుపునిచ్చారు. 68వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రంలోని గోదాంరోడ్డులో గల హరిత ఇందూర్ ఇన్ సమావేశపు హాల్లో శుక్రవారం రాత్రి జిల్లా అధికార యంత్రాంగం తరపున జిల్లా అధికారులకు, మీడియా ప్రతినిధులకు తేనేటి విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధిపరిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృతనిశ్చయంతో,ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నారన్నారు. అందుకుగాను మన జిల్లాను కూడా ఆయన ఆశయాలకనుగుణం గా అన్నిరంగాల్లో అభివృద్థిపథంలో తీసుకువెళ్లేందుకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ఈ సందర్భంగా నలుగురు స్వాతం త్య్ర సమరయోధుల సతీ మణులు లక్ష్మీబాయి, పార్వతిబాయి, లక్ష్మీనర్సవ్వ, సర స్వతిలకు కలెక్టర్ శాలువకప్పి ఘనంగా సన్మానిం చారు. అనంతరం ఆష్ట గంగాధర్ కళా బృందం నృత్యప్రదర్శనలు, దేశభక్తి,జానపద గేయాలు అలరించగా, అంతర్జాతీయ ఇంద్రజాలికుడు రంగనాథ్ ప్రదర్శన అబ్బురపరిచింది. ఉత్తమ సేవలందించిన పలువురికి ప్రశంసాపత్రాలను అందజేశారు. ఉదయం పోలీసు పరేడ్ గ్రౌండ్లో ప్రదర్శించిన 15 వివిధ శాఖల శకటాలకుగాను వ్యవసాయ శాఖకు ప్రథమ, గ్రామీణ నీటి పారుదల శాఖకు ద్వితీయ, రాజీవ్ విద్యామిషన్‌కు తృతీయ బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తరుణ్‌జోషి, జిల్లా జడ్జి షమీమ్ అక్తర్, ఆయా శాఖల జిల్లా అధికారులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. -
భయం వలదు
ప్రగతినగర్ : ‘‘ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తయారు చేయడం, అమలు చేయాలన్నా, ఆ రాష్ట్ర కుటుంబాల, ప్రజల సమగ్ర సమాచారం అవసరం. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బేస్‌లైన్ సమాచారం సేకరించడానికి ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేపట్టాలని నిర్ణయించింది. సమగ్ర కు టుంబ సర్వేలో అన్ని కుటుంబాలకు సంబంధించి పూర్తి సమాచారం ఆగస్టు 19న సేకరించనున్నారు. ఆ రోజున ప్రతి ఇంటికి ఎన్యూమరేటర్ వచ్చి వివరాలు నమోదు చేసుకోనున్నారు. పది విభాగాలలో 80కిపైగా అంశాలలో వివరాలు సేకరించనున్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రజల ఆశలు నెరవేరాలంటే పక్కా లెక్కలు ఉండాలి. అర్హులు, లక్ష్యి త వర్గాలకు పథకాలు అందాల్సిన అవసరం ఉంది’’ అని కలెక్టర్ రొనాల్డ్ రాస్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఎలాంటి తప్పులకు అవకాశం ఇవ్వకుండా కుటుంబ సమాచారం సేకరించనున్నట్లు చెప్పారు. అప్పుడు ప్రభుత్వం సంక్షేమ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరికి సరైన రీతిలో అందడానికి ఆస్కారం ఉంటుందన్నారు. సర్వే రోజున ప్రజలు ఎలాంటి పనులు, ప్రయాణాలు పెట్టుకోవద్ధన్నారు. ఇంటి వద్దనే ఉండి ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్‌కు సహకరించాలన్నారు. అడిగిన సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎన్యూమరేటర్ వచ్చిన సమయంలో ఈ దిగువన ఉన్న ప్రతులు,సమాచారం అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సర్వేపై భయాందోళన వద్దు సర్వేపై ఎవ రూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ అన్నారు. ఎక్కడి వారు అక్కడ ఉన్నచోట సరైన పత్రాలు చూపి వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం ఈ సర్వే కాదు, కుటుంబ గణాంకాల నమోదు కోసమే సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. ఈనెల 19న ఎవరైతే ఇంటివద్ద ఉంటారో వారిపేర్లు నమోదు చేసుకుంటాం, గల్ఫ్, ఇతర దేశాలకు బతుకు దెరువు కోసం వెళ్లి వారి వివరాలను తర్వాత నమోదు చేస్తామన్నారు. పక్క జిల్లాలలో, రాష్ట్రాలలో చదువుతున్న విద్యార్థులు సొంత ఇళ్లకు రావాల్సిన అవసరం లేదన్నారు. వారు చదువుతున్న ధ్రువీకరణపత్రాలు కుటుంబీ కులు చూపెడితే సరిపోతుందన్నారు. జిల్లా వ్యా ప్తంగా 31 వేల సిబ్బంది ఉన్నారని, సర్వే కోసం 27,500 మంది సిబ్బంది పనిచేస్తున్నారన్నారు. 2,300 మంది ప్రైవేట్ టీచర్లు సర్వేలో పాల్గొంటున్నట్లు తెలిపారు. అనాథలు, సంచార జీవుల కోసం ప్రభుత్వం ఒక ఫార్మాట్‌ను తయారు చేసిందన్నారు. అత్యవసరంగా ఆస్పత్రులలో చికిత్స పొందితే, దానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రం అందిస్తే సరిపోతుందన్నారు. -
‘సర్వే’ నిష్పక్షపాతంగా నిర్వహించాలి
కామారెడ్డి రూరల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న చేపట్టనున్న ఇంటింటి సర్వేను ప్రతి ఉద్యోగి నిష్పక్షపాతంగా వ్యవహరించి పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ సూచించారు. మంగళవారం పట్టణంలోని ఆర్కే డిగ్రీ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ, కర్షక్ బీఈడీ కళాశాలల్లో ఎన్యూమరేటర్లకు ఒక రోజు శిక్షణ ని ర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరై సర్వే వివరాల నమోదు కోసం ప్రభుత్వం నిర్ధేశించిన పట్టికలోని ప్రతి అంశాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం మాట్లాడుతూ.. అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడానికి ఈ సర్వే ఎంతో ముఖ్యమైందన్నారు. అభివృద్ధి పథకాలు రూపొందించి అర్హులైన వారికి అందాలంటే డాటా బేస్‌లైన్ సమాచారం ఎంతో ము ఖ్యమన్నారు. అందుకే ప్రభుత్వం ఈ సర్వేను చేపడుతుందన్నారు. ఈ సర్వే ద్వారా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించనుందన్నారు. సర్వే అధికారులకు ప్రజలు పూర్తిగా సరైన వివరాలను అందించాలని సూచించారు. వంట గ దులను బట్టే కుటుంబాల సర్వే చేపట్టాల న్నారు. గల్ఫ్ వెళ్లిన వారి విషయాలు, ఇంట్లో లే ని వారి వివరాలు నమోదు చేయకూడదన్నారు. హాస్టళ్లో ఉన్న విద్యార్థులు, ఆస్పత్రుల్లో ఉన్న వారు ఆధారాలు చూపిస్తేనే వివరాలు నమోదు చేయాలన్నారు. సమగ్ర సర్వేలో ఎలాంటి త ప్పులు లేకుండా పకడ్బందీగా చేపట్టాలన్నారు. సర్వే సమయంలో ఇంటిపైనున్న స్టిక్కర్లను చూ సి ఈవీ నెంబర్ నమోదు చేసుకోవాలని సూ చించారు. ఒక్కో ఉద్యోగి సగటున 20 నుంచి 30 కుటుంబాలను సర్వే చేసేలా ప్రణాళికలు రూ పొందించమన్నారు. జిల్లా వ్యాప్తంగా 27,500 మంది ఎన్యూమరేటర్లను నియమిం చినట్లు చెప్పారు. సర్వే అనంతరం ఎంతమంది ఏయే పథకాలకు అర్హులనే విషయాలతో స మగ్ర సర్వేను బట్టి ప్రణాళికలు తయారు చేయాడానికే ఈ సర్వే చేపడుతున్నట్లు వివరిం చారు. సమావేశంలో ఐకేపీ పీడీ వెంకటేశం, నెడ్‌క్యాప్ జిల్లా మేనేజర్ రామేశ్వర్రావు, ఆర్డీవో వెంకటేశ్వర్లు, తహశీల్దార్ పాల్గొన్నారు. -
సమగ్ర సర్వేకు సిద్ధం
నిజామాబాద్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే నిర్వహణకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు ప్రారంభించింది.వారం రోజులుగా ఇదే అంశంపై కసరత్తు చేస్తున్న కలెక్టర్ రొనాల్డ్ రాస్ జిల్లా, మండల అధికారులకు రెండు రోజులుగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సర్వేకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. సర్వేలో పాల్గొనే అధికారులు, ఎన్యూమరేటర్లకు మంగళవారం మండల స్థాయిలో శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలోని 56 కేంద్రాలలో ఈ శిక్షణ కొనసాగుతుంది. ఇందులో ప్రభుత్వ సిబ్బందితోపాటు ప్రైవేట్ సిబ్బంది కూడా ఉన్నందున పాఠశాలలకు నేడు సెలవు ప్రకటించారు. లోటుపాట్లు లేకుండా 27,635 మంది ప్రభుత్వ ఉద్యోగులు శిక్షణలో పాల్గొననున్నారు. ప్రైవేట్ పాఠశాలల సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు ఆశ వర్కర్లు కలిపి మరో మూడున్నర వేల మంది కూడా శిక్షణ పొందుతారు. వీరికి సోమవారం కలెక్టర్ అనుమతి పత్రాలను జారీ చేశారు. సర్వేను పకడ్బందీగా చేపట్టాలని, ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని అధికారులకు ఉపదేశించారు. ప్రతి మండలంలో నాలుగు జోన్లు ఏర్పాటు చేసుకొని ఉద్యోగులను ఎన్యూమరేటర్లుగా నియమించుకోనున్నారు. ప్రతి ఇంటికి కరపత్రం, ప్రతి గ్రామానికి పది చొప్పున పోస్టర్లు పంపిణీ చేశారు. మండల ప్రత్యేక అధికారులు ఈ కార్యక్రమానికి ఇన్చార్జిలుగా వ్యవహరించనున్నారు. సర్వే వివరాలను నమోదు చేయడానికి 1200 కంప్యూటర్లను సిద్ధం చేశా రు. అవసరమైన వాహనాలను సమకూరుస్తున్నారు. జిల్లా జనాభా 25,51,335 జిల్లా జనాభా 25,51,335 కాగా, నివాస గృహాలు 6,68,146 ఉన్నాయి. పట్టణ జనాభా 5,88,372, గ్రామీణ జనాభా19,62,963. ఒక కార్పొరేష న్, మూడు మునిసిపాలిటీలు, 718 గ్రామాలు ఉన్నాయి. ఈ వివరాల న్నింటినీ సర్వేలో సేకరించనున్నారు. ఒక్కో ఎన్యూమరేటర్‌కు 25 నుంచి 30 ఇళ్లను కేటాయించారు. సర్వే ఇలా ఉంటుంది ఎన్యూమరేటర్లకు కుటుంబ సభ్యులు తమ పూర్తి వివరాలు చెప్పాలి. కుటుంబ సభ్యులతో పాటు తాత, ముత్తాతల వివరాలు సేకరించనున్నారు. ఎన్యూమరేటర్ల వద్ద 80 అంశాలతో కూడిన నమూనా ఫారం(25) అందుబాటులో ఉంటుంది. అందులో వివరాలు నమోదు చేస్తారు. ము ఖ్యంగా కులం, భూముల వివరాలు, సొంత ఇళ్లు, రేషన్‌కార్డు, పెన్షన్ వివరాలు తెలియజేయాలి. సర్వేలో గ్రామాధికారులతోపాటు మండలంలోని ప్రతి శాఖ అధికారి, ఎంపీడీఓ, తహశీల్దార్సహా సుమారు 18 శాఖలకు చెందిన అధికారులు పాల్గొంటారు. ఇవి ఉండాలి సర్వే రోజు ఇవి తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ కార్డు, వంట గ్యాస్ పుస్త కం, బ్యాంకు ఖాతా పుస్తకం, ఇంటికి సంబంధించిన పత్రాలు, భూముల వివరాలు తెలియజేసే పత్రాలు, ఇళ్ల కొనుగోలు దస్తావేజులు, వాహనపత్రాలు, ఆస్తుల వివరాలు, ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్ ఏది అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. 19న సెలవు 19న ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. ప్రతి ఒక్కరు ఇంటి వద్దే ఉండాలి. బస్సులు నడవవు. ప్రైవేట్ వాహనాలను అధికారులు తీ సుకుంటారు. దూరప్రాంతా లవారు ఒక రోజు ముందుగానే ఇంటికి చేరుకోవాలి. -
సీఎం పర్యటనకు ఏర్పాట్లు
ప్రగతినగర్ : జిల్లాలో ఈ నెల 7వ తేదీన సీఎం కేసీఆర్ పర్య టించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్, ఎస్పీ తరుణ్‌జోషిలు సోమవారం ఏర్పాట్లను పరి శీలించారు. జిల్లా కేంద్రంలోని వర్నిరోడ్‌లో ఉన్న ఎమ్మెల్సీ రాజేశ్వర్ ఇంటిని, విజయలక్ష్మి గార్డెన్ పరిశీలించారు. ఆర్మూర్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద మంచినీటి పథకాన్ని శంకుస్థాపన చేయనున్నందున అందుకువసరమైన పనులకు సత్వరమే పూర్తిచేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ప్రజలకు అసౌకర్యం కలుగకుండా చూడాలన్నారు.అందుకు ఆర్ అండ్బీఅతిథి గృహాన్ని సందర్శించి, ముఖ్యమంత్రి బస చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయించాలని అధికారులను ఆదేశించారు. అతిథి గృహంలో ఏర్పాట్లు చేయండి బాల్కొండ : ముఖ్యమంత్రి ఈనెల 7న రాత్రికి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ అతిథి గృహంలో బస చేసే అవకాశం ఉన్నందున ఏర్పాట్లను చేపట్టాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రాస్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ తరుణ్ జోషితో కలిసి ఆయన ఎస్సారెస్పీ అతిథి గృహాన్ని పరిశీలించారు. వీఐపీ సూట్‌ను, ఇతర సూటులను పరిశీలించారు. ఏసీలు పని చేస్తున్నాయా లేదా అని ప్రాజెక్ట్ ఈఈ రామారావును అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి స్థాయి వీఐపీ బస చేయడానికి అతిథి గృహం అనువుగా ఉంటుందా.. లేదా అని ప్రాజెక్ట్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అతిథి గృహంలో ఉన్న పురాతన సోఫా సెట్లను తొలగించాలని సూచించారు. డైనింగ్ హాల్‌ను పరిశీలించారు. భద్రత దృష్ట్యా ఎస్పీ పోలీస్‌లను వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం ఎస్సారెస్పీలో బస చేసేది ఇం కా నిర్ణయం కాలేదన్నారు. అధికారులు మాత్రం సి ద్ధంగా ఉండాలన్నారు. ఆయన వెంట ఆర్డీఓ యాది రెడ్డి, తహశీల్దర్ పండరీనాథ్, ఎంపీడీఓ కిషన్, ఆ ర్మూర్ డీఎస్పీ ఆకుల రాంరెడ్డి తదితరులు ఉన్నారు. ఆర్మూర్ టౌన్: ఆర్మూర్ పట్టణంలో సీఎం బహిరంగ సభ నిర్వహించనున్న జావీద్భాయ్ మినీ స్టేడియాన్ని కలెక్టర్, ఎస్పీలు తనిఖీ చేశారు. సభాస్థలి ఏర్పాటు, మీడియా గ్యాలరీ, ప్రవేశమార్గాలు, ప్రజలు కూర్చునే స్థలాల గురించి ఆరా తీశారు. డీఎస్పీ ఆకుల రాంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, తహశీల్దార్ శ్రీధర్, ఎంపీడీఓ సునంద, ఆర్అండ్బీ ఎస్ఈ అంజయ్య, ఆర్ఐ రవీందర్‌తో తీసుకోవలసిన చర్యల గురించి చర్చించారు. అంగడి బజార్లో వాహనాల పార్కిం గ్ను, బాలుర పాఠశాల మైదానంలో హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఒకవేళ సీఎం రోడ్డు మార్గం ద్వారా వస్తే ఆయా రహదారులలో మరమ్మత్తులు, ట్రాఫిక్ క్లియరెన్సు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అంబేద్కర్ చౌరస్తాలో సీఎం ప్రారంభించనున్న శిలాఫలకం, పైలాన్, కాకతీయ కళాతోరణ నిర్మాణ పనులను పరిశీలించారు. అంకాపూర్‌లో రైతులతో సీఎం ముఖాముఖి ఆర్మూర్ అర్బన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా ఆర్మూర్ మండలం అంకాపూర్‌లో ఏర్పాట్లను జిల్లా ఎస్పీ తరుణ్ జోషి సోమవారం పరిశీలించారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కల్యాణ మండపాన్ని సీ ఎం ముఖాముఖి కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు ఖరారు చేశారు. దీంతో ఎస్పీ మండపా న్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చే శారు. సభా స్థలి, రైతులు, అధికారులు, మీ డియా విభాగాలు కూర్చునేందుకు వేరువేరుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా భద్రత చర్యలపై సమీక్షించారు. ఎలాంటి అవాంతరాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎంతో పాటు వచ్చే వాహనాల పార్కింగ్‌ను పరిశీలించారు. ముఖాముఖి సందర్భంగా గందరగోళం జరకుండా గ్రామస్తులను మాత్రమే అనుమతించాలన్నారు. వారిని గుర్తించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. సీఎం వచ్చిపోయే మార్గంలో తీసుకునే చర్యలను గ్రామస్తులతో చర్చించారు. -
ఆలకిస్తూ.. ఆదేశిస్తూ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కొత్త కలెక్టర్ రొనాల్డ్ రాస్ ప్రజావాణి ద్వారా ఉన్నతాధికారులు, జిల్లా ప్రజలకు తన వాణిని, బాణిని తెలియజేశారు. గురువారం విధులలో చేరిన ఆయన ఆ మరుసటి రోజు సీఎం కేసీఆర్‌తో హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. శనివారం జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ బాధ్యతలను ఇతర అధికారికి అప్పగించి జిల్లాకు చేరుకున్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ‘ప్రజావాణి’లో పాల్గొన్నారు. కోర్టు కేసు నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లిన జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి కొండల్రావు మినహా అన్ని శాఖల అధికారులు ప్రజావాణికి హాజరయ్యారు. సార్వత్రిక ఎన్నికలు, ఆ తర్వాత కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న బదిలీ, మన ఊరు-మన ప్రణాళిక కార్యక్రమాల నేపథ్యంలో కొద్ది రోజులు ప్రజావాణి మొక్కుబడిగా సాగింది. యువ ఐఏఎస్ అధికారి, జీహెచ్ఎంసీలో మంచి అధికారిగా పేరు సంపాదించిన రొనాల్డ్ రాస్ కలెక్టర్‌గా వ చ్చారన్న ప్రచారంతో సోమవారం ఒక్కసారిగా ఫిర్యాదుల తాకిడి పెరిగింది. కలెక్టరేట్ ప్రాంగణంలోని ప్రగతిభవన్ సమావేశ మందిరం చాలా రోజుల తరువాత అర్జీదారులతో కిటకిట లాడింది. ఓపికగా వింటూ ప్రజావాణికి కొత్తై కలెక్టర్ రొనాల్డ్ రాస్ ఫిర్యాదుల ను ఓపికతో విన్నారు. ఉదయం నుంచే జనం బారు లు తీరడంతో ప్రగతిభవన్ హాలు నిండిపోయింది. క లెక్టర్ నేరుగా ఫిర్యాదులు స్వీకరించడంతోపాటు సా ధ్యమైనంత వరకు అక్కడిక్కడే పరిష్కారం చూపే ప్ర యత్నం చేశారు. ఒక్కొక్కరుగా వచ్చినవారి నుంచి ఫి ర్యాదులను స్వీకరిస్తూ, వారి గోడును ఆలకిస్తూ, పరి ష్కారం కోసం అధికారులను ఆదేశిస్తూ ప్రజావాణిని నిర్వహించారు. జక్రాన్‌పల్లి మండలంలో దళిత స ర్పంచ్‌ను గ్రామ బహిష్కరణ చేశారన్న వివాదంపై ఇటు సర్పంచ్, అటు వీడీసీ ఆధ్వర్యంలో వచ్చిన ప్రజ లు కలెక్టర్‌ను కలిశారు. ఈ విషయమై పోలీసులు చ ట్టం ప్రకారం వ్యవహరిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. వాస్తవాలను తెలుసుకునేందుకు గ్రామంలో విచారణ జరపాలని జడ్పీ సీఈఓను ఆదేశించారు. మొత్తం 268 ఫిర్యాదులందగా, అందులో చాలావరకు వ్య క్తిగతమైనవే కాగా, కొన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినవి. బారులు తీరిన జనం సుమారుగా ఆరు నెలల తర్వాత నిర్వహించిన ప్రజావాణికి పెద్ద సంఖ్యలో జనం బారులు తీరారు. ఫిర్యాదుల సంఖ్య కూడ గణనీయంగా పెరిగింది. కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నా యకులు, స్వచ్ఛంద సంస్థలు, మహిళ సంఘాల నేత లు కూడా కలెక్టర్‌ను కలిశారు. నిజామాబాద్ నగరం 22వ డివిజన్ అయోధ్యనగర్‌కు చెందిన ప్రజలు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వినతి పత్రం అందచేశారు. మున్సిపాలిటీల పరిధిలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో పని చే స్తున్న తమను ఆదుకోవాలంటూ రిసోర్స్ పర్సన్లు క లెక్టర్‌ను కలిశారు. పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగ నియామకాలను వెంటనే చేపట్టాలని అభ్యర్థులు విన్నవించారు. ప్రజావాణిలో ఇన్చార్జ్ డీఆర్ఓ యాదిరెడ్డి, జడ్పీ సీఈఓ రాజారాం, డ్వామా, డీఆర్డీఏ పీడీలు శి వలింగయ్య, వెంకటేశం, ఇతరఅధికారులు పాల్గొన్నారు. -
ఇందూరు కలెక్టర్ రొనాల్డ్ రాస్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ప్రభుత్వం ఎట్టకేలకు జిల్లాకు కలెక్టర్‌ను నియమించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వెస్ట్‌జోన్ జోనల్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి రొనాల్డ్ రాస్ ఇక్కడికి కలెక్టర్‌గా బదిలీపై వస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ బుధవారం నియామక ఉత్తర్వులను జారీ చేశారు. గత కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న బదిలీ అయిన 43 రోజులకు జిల్లాకు కొత్త కలెక్టర్ నియామకమైంది. ఇంతకాలం ఇన్చార్జి కలెక్టర్‌గా వ్యవహరించిన జాయింట్ కలెక్టర్ డి. వెంకటేశ్వర్రావు కూడ బదిలీ అయ్యారు. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోగా, ఆయన స్థానంలో కూడ ఇంకా ఎవరినీ నియమించ లేదు. పీఎస్ ప్రద్యుమ్నను జూన్ 17న ప్రభుత్వం బదిలీ చేసిన విషయం విదితమే. ఆయనతో పాటు అదేరోజు ఐఏఎస్ అధికారి, బోధన్ సబ్‌కలెక్టర్ హరినారాయణన్‌ను కూడ బదిలీ చేసింది. అయితే బోధన్‌కు కరీంనగర్లో ఆర్వీఎం పీవోగా పనిచేస్తున్న జి.శ్యాంప్రసాద్‌లాల్‌ను ఆర్డీవోగా ఆ మరుసటి రోజే నియమించింది. కలెక్టర్ నియామకంలో మాత్రం జాప్యం జరిగింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన రొనాల్డ్‌రాస్ మద్రాసు యూనివర్సిటీలో బీకాం పూర్తి చేశారు. 1980 జూన్ 24న జన్మించిన ఈయన మద్రాసు యూనివర్సిటీలో ఉన్నత విద్యనభ్యసిస్తూ 2006లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. 2006 నుంచి 2007 వరకు ట్రైనింగ్ పూర్తి చేసిన రాస్కు 2007 జూలై 22న అసిస్టెంట్ కలెక్టర్‌గా ల్యాండ్ రెవెన్యూ హైదరాబాద్ కార్యాలయంలో మొదటి పోస్టింగ్ ఇచ్చారు. అసిస్టెంట్ కలెక్టర్, సబ్‌కలెక్టర్ హోదాలలో అదే కార్యాలయంలో పనిచేసిన ఆయన 2008 సెప్టెంబర్‌లో నర్సాపూర్ సబ్‌కలెక్టర్‌గా నియమితులు కాగా అక్కడ 2010 వరకు పని చేశారు. 2010 ఫిబ్రవరి 19న రంపచోడవరం ఐటీడీఏ పీవోగా నియమితులైన రొనాల్డ్‌రాస్ 2011 ఆగస్టు 19 వరకు అక్కడే విధులు నిర్వహించారు. 2011 ఆగస్టు 20న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో అడిషనల్ సీఈవోగా పనిచేశారు. 2012 సెప్టెంబర్11న గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లో అడిషనల్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. సుమారు రెండు సంవత్సరాల పాటు జీహెచ్ఎంసీలో వివిధ జోన్లలో పనిచేసిన ఆయన సిటీ ప్లానింగ్ విభాగంలో కీలకంగా వ్యవహరించారు. విధుల్లో ముక్కుసూటిగా, నిజాయితీగా, నిక్కచ్చిగా వ్యవహరించే అధికారిగా పేరున్న రొనాల్డ్‌రాస్ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఖైరతాబాద్ రిటర్నింగ్ అధికారిగా సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించారన్న పేరుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ వెస్ట్‌జోన్ జోనల్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఆయనను ప్రభుత్వం కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.