ఓటు.. మన బాధ్యత : కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ | Vote is our responsibility: Collector Ronaldross | Sakshi
Sakshi News home page

ఓటు.. మన బాధ్యత : కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌

Published Sat, Dec 1 2018 9:05 AM | Last Updated on Sat, Dec 1 2018 9:05 AM

Vote is our responsibility: Collector Ronaldross - Sakshi

తప్పక ఓటు వేయాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు.

సాక్షి, పాలమూరు: ఓటు హక్కు ఉన్న ప్రతీ ఒక్కరు ఓటు వేయాలని.. తద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవచ్చని కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ అన్నారు. అందరూ ఓటు వేస్తూ ప్రజాస్వామ్యమనే దీపాన్ని వెలిగించాలని కోరారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ మైదానంలో శుక్రవారం రాత్రి ‘ఓటు  దీపోత్సవం’ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పట్టణానికి చెందిన మహిళలు దీపాలు వెలిగించారు. అనంతరం కలెక్టర్‌ చేతిలో దీపం పట్టుకుని రానున్న ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటామంటూ మహిళలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జేసీ వెంకట్రావు, డీఎంహెచ్‌ఓ రజిని, డీఈఓ సోమిరెడ్డి, ఈఎస్‌ అనితతో పాటు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.  

ఓటు దీపోత్సవం
ప్రస్తుతం కార్తీకమాసం.. త్వరలోనే ఎన్నికల పోలింగ్‌.. ఈ రెండూ కలిసొచ్చేలా జిల్లా కేంద్రంలో శుక్రవారం వినూత్న కార్యక్రమం చేపట్టారు.  జెడ్పీ మైదానంలో ‘ఓటు దీపోత్సవం’ పేరిట ఈ కార్యక్రమం ఏర్పాటుచేయగా కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌తో పాటు అన్ని జిల్లా శాఖల ఉన్నతాధికారులు, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ మేరకు ‘ఐ ఓట్‌’ అక్షరాల రూపంలో దీపాలు వెలిగించారు. అనంతరం ఓటు హక్కు ప్రాధాన్యం, ఓటర్లకు కల్పిస్తున్న సౌకర్యాలను మహిళలకు వివరించి∙


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement