పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ పతాకానికి వందనం చేస్తున్న కలెక్టర్ రొనాల్డ్‌రోస్, ఎస్పీ రెమారాజేశ్వరి, గణతంత్ర వేడుకల్లో మాట్లాడుతున్న కలెక్టర్ రొనాల్డ్‌రోస్
పాలమూరు : కరవు కటకాలతో అల్లాడుతూ జీవకళ కోల్పోయిన జిల్లాకు కృష్ణమ్మ నీటిని తరలించి బీడు భూముల్లో బంగారు పంటలు పండించడానికి పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వరంగా మారనుందని జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని పరేడ్‌మైదానంలో శనివారం ఉదయం ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ శాఖల వారీగా ప్రగతిని వివరించారు. ఆ వివరాలు కలెక్టర్ మాటల్లోనే...
ూ సాగునీటి రంగం : పాలమూరు–రంగారెడ్డి పథకం కింద 22మండలాల్లోని 4,13,167 ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరు అందించనున్నాం. ఈ పనులు పురోగతిలో ఉన్నాయి. సంగంబండ రిజర్వాయర్ కింద ఖరీఫ్, రబీ–2018లో 40వేల ఎకరాలు, రబీ–2019లో 5వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చాం. దీంతో పాటు 45 చెరువులు నింపాం. ఇక భూత్పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద ఖరీఫ్, గత రబీలో 37వేల ఎకరాల ఆయకట్టు నీళ్లు ఇవ్వడంతో పాటు 33చెరువులు నింపాం. కోయిల్‌సాగర్ ఎత్తపోతల కింద ఖరీఫ్, రబీ–2018కి సంబంధించి 25వేల ఆయకట్టుకు నీటి సరఫరా చేయడంతో పాటు 42చెరువులకు నీటిని అందించాం. మిషన్ కాకతీయ పథకం కింద జిల్లాలో 2,563 చెరువును ఐదేళ్లలో పునరుద్ధరించాలనేది లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 1,191 పనులను రూ.154.45కోట్లతో పూర్తి చేశాం. అలాగే, జిల్లాలో 3,11,894 మంది రైతులకు కొత్త పట్టదార్ పాసుపుస్తకాలు పంపిణీ చేశాం.
వ్యవసాయం : రైతు బంధు పథకంలో భాగంగా జిల్లాలో 2,82,120 మంది రైతులకు రూ.316.32 కోట్ల విలువైన 2,87,075 చెక్కులు పంపిణీ చేశాం. రబీ 2018–19 సీజన్‌లో 2,90,611 మంది రైతులకు గాను ఇప్పటి వరకు 2,34,271 మంది రైతుల ఖాతాల్లో రూ.276.34 కోట్లు జమ చేశాం. రైతు భీమా పథకంలో భాగంగా ఇప్పటి వరకు 1,69,260 మంది అర్హులైన రైతులను గుర్తించి భీమా పత్రాలు అందజేశాం. ఇందులో ఇప్పటి వరకు 486మంది రైతులు మృతి చెందగా 413 మంది కుటుంబ సభ్యులకు రూ.20.65కోట్లు వారి ఖాతాల్లో వేశాం. భూసార ఆరోగ్య కార్డు పథకం కింద 2018–19గాను 25.519 మట్టి నమూనాలను సేకరించి 19,136 పరీక్ష ఫలితాలను రైతులకు ఇచ్చాం. సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ కింద రూ.2.03కోట్ల వ్యయంతో పండ్ల తోటల విస్తరణ, ఫాంపాండ్స్, శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటుచేశాం.
- పశు సంవర్ధక శాఖ : జిల్లాలో పశుగ్రాసం కొరత ఏర్పడకుండా ఇప్పటి వరకు 220మెట్రిక్ టన్నుల స్వల్పకాలిక, మేలుజాతి పశుగ్రాస విత్తనాలను 75శాతం సబ్సిడీపై రైతులకు ఇచ్చాం. ఇప్పటివరకు 2,096మందికి పశువులు పంపిణీ చేశాం.
- మార్కెటింగ్ : జిల్లా కేంద్రంలో రూ.5.50కోట్ల వ్యయంతో రైతు బజార్ ఏర్పాటు, 13మండలాల్లో గోదాములు 60వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేశాం.
- విద్యుత్ : 2018–19 ఏడాదిలో రూ.38.15 కోట్ల విలువైన 23 ఉపకేంద్రాలు మంజూరు కాగా,ఇందు లో నాలుగు ఉపకేంద్రాల పనులు పూర్తయ్యాయి. వ్యవసాయ బావుల విద్యుత్ కోసం కోసం 5,761 దరఖాస్తులు రాగా 3,983 కనెక్షన్లు ఇచ్చాం.
- ఆర్‌అండ్‌బీ: జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మాణం చేస్తున్న కలెక్టరేట్ కాంప్లెక్స్ కోసం రూ.43.83కోట్లు మంజూరు కాగా, పనులు పురోగతిలో ఉన్నాయి. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి అనుసంధాన రహదారుల కోసం 158.10 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి రూ.210.57 కోట్లు మంజూరయ్యాయి. మహబూబ్‌నగర్ పట్టణ బైపాస్ నిర్మాణానికి రూ.96.70కోట్లు మంజూరయ్యాయి.
- పౌరసరఫరాల శాఖ : రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వడంలో భాగంగా ఐకేపీ ద్వారా 39వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 45676.360 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. ఇందుకోసం 11,398 మంది రైతులకు రూ.75.83కోట్లు చెల్లించాం.
- వైద్య, ఆరోగ్యశాఖ : కంటి వెలుగు పథకం కింద జిల్లాలో 6,96,431 మంది కంటి పరీక్షలు చేసి 1,02,796 అద్దాలు అందజేశాం. ఇక 1,177మందికి ఆపరేషన్లు చేయించాం. జిల్లాలోని పలు ఆస్పత్రుల్లో 15 అధునాతన లేబర్ రూంలు నిర్మాణం పూర్తిచేశాం.
- డీఆర్డీఓ : 2018–19 ఏడాదిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం కింద రూ.99.63కోట్లతో 89,285 కుటుంబాల్లోని 1,41,203 మంది కూలీలకు 36.14లక్షల పనిదినాలు కల్పించాం. జిల్లాలోని 96 గ్రామాల్లో బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించాం.
- మత్స్యశాఖ : జిల్లాలో 251 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి 185 చెరువుల్లో 1.15 కోట్ల చేప విత్తనాలు వదిలాం. దీంతో పాటు మత్స్యకారులకు 2,163 ద్విచక్ర వాహనాలు, 183 నాలుగు చక్రాల వాహనాలు సబ్సిడీపై అందజేశాం.
- అటవీశాఖ : ఈ ఏడాది వేపూర్, మునిమోక్షం అటవీ ప్రాంతాల్లో 66.60 హెక్టార్ల విస్తీర్ణంలో 77, 572 మొక్కలను నాటాం. జాతీయ రహదారి సుం దరీకరణలో భాగంగా 57 కిలోమీటర్ల పొడవున 25, 147మొక్కలు, అంతర్‌రాష్ట్ర రోడ్ల వెంబడి 51,750 మొక్కలు నాటి సంరక్షిస్తున్నాం. జిల్లా కేంద్రంలోని అప్నన్నపల్లి సమీపంలో ఉన్న మయూరి ఎకో పార్క్‌ను సుందరీకరించాం.
Comments
Please login to add a commentAdd a comment