హాజరు శాతం పెంచడమే లక్ష్యం
♦ కలెక్టర్ రోనాల్డ్ రోస్
♦ కోత్లాపూర్‌లో బడిబాట ప్రారంభం
సంగారెడ్డి రూరల్: ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచడమే ఆచార్య జయశంకర్ బాడిబాట ప్రధాన లక్ష్యమని కలెక్టర్ రోనాల్డ్ రోస్ అన్నారు. సోమవారం సంగారెడ్డి మండలం కోత్లాపూర్‌లో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బడి బయట ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలన్నారు. ఐదు నుంచి పదిహేనేళ్ల వయసులోపు పిల్లలను పనుల్లో పెట్టుకోరాదని సూచించారు. పిల్లలు పా ఠశాలల్లో ఉండేలా తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు.
బడి బయట పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు చదువుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన క ల్పించాలన్నారు. ప్రధానోపాధ్యాయులకు ఎంఈఓలు తరచూ సమావేశాలను నిర్వహించి బడిబాట కార్యక్రమం విజయవంతమయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి యాస్మిన్ బాషా, తహసీల్దార్ గోవర్దన్, ఆర్‌ఐ కార్తీక్, ఎంపీటీసీ కళావతి వెంకటేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయ్‌కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.