![Ronald Ross Appointed Director For Mining Department - Sakshi](/styles/webp/s3/article_images/2020/02/29/ronald-ross.jpg.webp?itok=UpQy9KyL)
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర భూగర్భ గనుల శాఖ డైరెక్టర్‌గా ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి డి.రొనాల్డ్ రోస్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. అలాగే వెయింటింగ్‌లో ఉన్న మరో నలుగురు ఐఏఎస్‌లకు పోస్టింగులిస్తూ మరో ఉత్తర్వు జారీచేశారు. అనితా రామచంద్రను పశుసంవర్ధక, మత్స్య శాఖ కార్యదర్శిగా, బి.విజయేంద్రను రవాణా, రోడ్డు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా, ఎమ్‌ఆర్‌ఎమ్ రావును రవాణా శాఖ కమిషనర్‌గా, ఎం.ప్రశాంతిను అటవీ శాఖ జాయింట్ సెక్రటరీగా నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment