మోర్తాడ్ : ఆహార భద్రత కార్డులు, సామాజిక పింఛన్‌లకు అర్హులను ఎంపిక చేయడం అధికారులకు చిక్కుగా పరిణమించింది. సమయం ఎక్కువగా లేకపోవడం, దరఖాస్తులు అధికంగా ఉండటంతో సకాలంలో ‘ఇంటింటి సర్వే’ ఎలా పూర్తి చేయాలో అర్థంకాక వారు ఇరకాటంలో పడ్డారు. ఈనెల 30లోగా సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదే శించింది. రోజుకు 150 నుంచి 200 వ రకు ఇళ్లను సర్వే చేయాలని కలెక్టర్ రొనాల్డ్ రోస్ అధికారులకు సూచించారు.
వారు మాత్రం రోజుకు 50ఇళ్లకు మిం చి సర్వే చేయడం సాధ్యం కాదని చెబుతున్నారు. పరిశీలన జరిపి అర్హులను తేల్చడానికి ఒక ఇంటికి 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతుంది. ఇ లాంటి పరిస్థితిలో రోజుకు 150 నుంచి 200 ఇళ్లను సర్వే నిర్వహించడం అసాధ్యమని వారు పేర్కొంటున్నారు. ఒక గ్రామంలో సర్వే పూర్తి చేయాలంటే కనీసం వారం రోజుల సమయం పడుతుందని, అన్ని గ్రామాలలో సర్వే అనుకున్న సమయంలో పూర్తి చేయలేమని అధికారులు చెబుతున్నారు. ఆహార భ ద్రత కార్డులు, సామాజిక ఫించన్‌లకు అర్హులను మాత్రమే ఎంపిక చేయాల ని, అనర్హులకు లబ్ధి చేకూర్చితే సర్వే బృందానికి నాయకత్వం వహించిన అధికారిని బాధ్యుడిని చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. మరోవైపు ఈ స ర్వే అధారంగానే నవంబరు నుంచి ప థకాలను అమలు చేయాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది.
ఇదీ పరిస్థితి
జిల్లావ్యాప్తంగా ఆహారభద్రత కార్డుల కోసం 6,93,055 మంది, సామాజిక పింఛన్‌ల కోసం 3,52,913 మంది ద రఖాస్తులు సమర్పించారు. మండలాని కి ఐదు నుంచి ఆరు సర్వే బృందాలను ప్రభుత్వం నియమించింది. వీటికి త హశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ నాయకత్వం వహిస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో ఎంపీడీఓ లను కూడా సర్వే బృందానికి నాయకత్వం వహించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సర్వే బృందం లో వీఆర్‌ఓ, గ్రామసేవకులు, పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ సి బ్బంది సభ్యులుగా ఉన్నారు. ఆహారభద్రత కార్డులు, పింఛన్ కోసం దరఖా స్తు చేసుకున్న వ్యక్తికి సంబంధించిన కు టుంబానికి ఉన్న భూములు, వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.
ఇందుకోసం సర్వే బృందానికి వ్యవసాయ భూముల వివరాలు, రవాణా శాఖ వివరాలు, సమగ్ర సర్వే వివరాలను ప్ర భుత్వం అందజేసింది. ప్రభుత్వ పథకాలకు అర్హుడని తేల్చడానికి దాదాపు 10 కాలాల ఫారమ్ నింపాలి. అనర్హుడని తేల్చినా అంతే నివేదికను తయా రు చేయాలి. ఇందుకోసం దరఖాస్తుదా రు ఉంటున్న ఇంటిని, అక్కడి వసతుల ను పూర్తి స్థాయిలో పరిశీలించిన తరువాత సర్వే బృందం ఒక అంచనాకు రావాల్సి ఉంది.
సర్వే అనంతరం అనర్హునికి లబ్ధి చేకూరినట్లు తేలితే సదరు అధికారిని సస్పెండ్ చేసే అవకాశం ఉంది. దీంతో అధికారులు జాగ్రత్తగా సర్వే నిర్వహిస్తున్నారు. అయితే దరఖాస్తులు ఎక్కువగా ఉండటం, సమయం తక్కువగా ఉండటంతో తమ మెడపై కత్తి పెట్టినట్లు ఉందని వాపోతున్నారు. శాస్త్రీయంగా సర్వే నిర్వహించి అర్హులను తేల్చాలంటే ఎక్కువ సమయం అవసరమని, లేకపోతే గందరగోళం ఏర్పడుతుందని చెబుతున్నారు. సర్వే బృందాలు తక్కువగా ఉండటంతో గడువు పెంచాలని కోరుతున్నారు.
గడువులోగా తేలుస్తారా?
Published Mon, Oct 20 2014 3:29 AM | Last Updated on Tue, Oct 2 2018 8:49 PM
Advertisement
Advertisement