6 నుంచి ఇంటింటి సర్వే | Household Survey starts from the 6 | Sakshi
Sakshi News home page

6 నుంచి ఇంటింటి సర్వే

Published Wed, Oct 15 2014 2:28 AM | Last Updated on Sat, Sep 2 2017 2:50 PM

Household Survey starts from the 6

ప్రగతినగర్: ఆహార భద్రత, సామాజిక పిం ఛన్ కార్డుల మంజూరు కోసం ఈ నెల 16 నుంచి ఇంటింటి సర్వే చేపట్టనున్న ట్లు జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ తెలిపారు. ఇవి దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి వర్తింపజేయడంతోపాటు అనర్హులకు లబ్ధి కలుగుండా  జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మంగళవారం స్థానిక ప్రగతి భవన్‌లో రాజీవ్‌గాంధీ ఆడిటోరియం లో రెవెన్యూ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నందున గతంలో జారీ చేసిన రేషన్,పింఛన్ కార్డుల స్థా ్థనంలో  తెలంగాణ రాష్ట్రం పేరున కార్డు లు జారీ చేస్తారని తెలిపారు.  గతంలో అన్ని పథకాలకు ఈ కార్డునే ప్రామాణికంగా తీసుకున్నందున అందరూ ఈ కార్డులు పొందారని తెలిపారు. ప్రస్తు తం ఇచ్చే కార్డులు కేవలం బియ్యం,కిరోసిన్‌లకే పనికి వస్తాయన్నారు.

అన్ని కుటుంబాలకు ఇప్పటికి ఆధార్ అనుసంధానం చేసినందున  చాలా వరకు డూప్లికేట్, బోగస్ కార్డులను తొలగించినట్లు చెప్పారు. ప్రస్తుతం జారీ చేసే ఆహార భద్రత, పింఛన్ కార్డులకు అర్హులను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశిం చారు. తనిఖీ అధికారులు ఈ విషయం లో పూర్తి జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ట్రాక్టర్లు మినహా నాలుగు చ క్రాల వాహనాలు గల యజమాను లు, రెండున్నర ఎకరాల తరి, ఐదు ఎకరాల ఖుష్కి భూమిగల కుటుంబాలు,ఆ దా య పన్ను దారులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, డాక్టర్లు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు, పెన్షనర్లు, ప్రొఫెసర్లు, బీపీఎల్ పరిధిలోకి రాని ఇతరులు ఈ కార్డులకు అనర్హులని వివరించారు.

తనిఖీ పకడ్బందీగా చేపట్టాలి
భూములు గ్రామాల్లో ఉండి వేరేచోట్ల నివాసం ఉండేవారి వివరాలు ఆ గ్రా మాల్గోని వీఆర్వోలు తెలుసుకొని సంబంధిత వీఆర్‌లకు తెలిపి, తనిఖీ పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఈ తనిఖీలో  రెవెన్యూలో సీనియర్ అసిస్టెంట్ నుంచి ఆపైస్థాయి అధికారు లు, ఎంపీడీవోలను తనిఖీ అధికారులను నియమిస్తామన్నారు. ప్రతి మండలానికి అయిదు తనిఖీ బృం దాలు, మున్సిపల్ కార్పొరేషన్ పరి దిలో 10-15 బృందాలు పనిచేస్తాయన్నారు. ఈ నెల 16 నుంచి 31 వరకు తనిఖీ చేయిస్తామన్నారు.

దరఖాస్తులన్నీ రిజిష్టర్‌లో నమోదు చేయాలని, దరఖాస్తుదారులకు రశీదులు ఇవ్వాలన్నారు. నవంబర్ 7 వరకు డాటా నమోదు చేయాలని ఆదేశించారు. కుటుంబంలో ఒక్కరికే వృద్ధాప్య పిం ఛన్ వస్తుందన్నారు. వితంతు పింఛన్‌కు భర్త మరణ ధ్రువపత్రం పరిశీలించాలని సూచించారు. వికలాంగ పింఛన్ సదరం ద్వారా జారీచేసిన 40 శాతం ఆపైన వైకల్య ధ్రువపత్రాలను పరిశీలించాలన్నారు.  కార్యక్రమంలో ఆర్డీవో యాదిరెడ్డి, వెంకటేశ్వర్లు, శ్యాం ప్రసాద్‌తో పాటు రెవెన్యూ ఉద్యోగులు తహశీల్దార్‌లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement