ప్రగతినగర్ : అధికారుల నిర్లక్ష్యం వికలాంగులకు శాపంగా మారింది. అర్హులైన వికలాంగులు పింఛన్‌కు దూరమవుతున్నారు. బోగస్ పింఛన్‌లు ఉన్నాయంటూ ప్రభుత్వం 2011లో (సాఫ్ట్‌వేర్ ఫర్ అస్సెస్‌మెంట్ ఆఫ్ డిజెబిలిటి యాక్సెస్,రిహాబిలిటేషన్ అండ్ ఎంపవర్‌మెంట్) వికలాంగుల వైకల్య నిర్ధారణ కోసం సదరం శిబిరం ఏర్పాటు చేసింది. వీటి నిర్వహణ బాధ్యతలను డీఆర్‌డీఏకు అప్పగించింది. అయితే సదరం శిబిరం నిర్వహణ మొదటి నుంచి అస్తవ్యస్తంగా మారింది.
శిబిరం ప్రారంభంకాకముందు జిల్లావ్యాప్తంగా 32,232 వికలాంగుల పింఛన్‌లు ఉన్నాయి. సదరం శిబిరం ప్రారంభమైన తరువాత పింఛన్‌లో కోత మొదలైంది. దీంతో సు మారు ఐదు వేల మంది వికలాంగులు అనర్హులం టూ పింఛన్‌లను తొలగించారు. ప్రస్తుతం 29, 634 మందికి పింఛన్‌లు అందిస్తున్నారు. అయితే సదరం శిబిరం నిర్వహణను కొన్ని నెలల క్రితం జిల్లా ఆస్పత్రికి బదలాయించారు. నిర్వహణ, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పూర్తిబాధ్యతలను వారికే అప్పగించారు. ఇక్కడ శిబిరం ప్రారంభం నుంచి 37,113 మందికి పరీక్షలు జరపుగా, 29, 408 మంది వికలాంగులను అర్హులుగా గుర్తించారు. ఇందులో నుంచి సుమారు 25 వేల సదరం సర్టిఫికెట్లు వికలాంగులకు చేరాయని అధికారులు చెబుతుండగా, అది వాస్తవం కాదని వికలాంగులు ఆరోపిస్తున్నారు. ఏడాది క్రితం తాము సదరం శిబిరానికి హాజరైనా ఇంతవరకు ధ్రువీకరణ పత్రం అందలేదని పలువురు వికలాంగులు ప్రతి శుక్రవారం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెల సదరం సర్టిఫికెట్ల ఐడీ నంబర్ కంప్యూటకరీంచకుంటే దాదాపు ఐదు వేల మంది అర్హులైన వికలాంగులు పింఛన్ కోల్పోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా సదరం నిర్వాహకులు మరో నాలుగు వేల సర్టిఫికెట్లు ప్రింటింగ్‌కు ఇచ్చారు. మిగతా ఐదువేల మంది వికలాంగులకు సంబంధించి ఫొటోలు మిస్ చేశారు. దీంతో వారు సదరం శిబిరానికి హాజరైనా ఫలితంలేకుండా పోయింది. ఈ విషయాన్ని డీఆర్‌డీఏ అధికారులు గోప్యంగా ఉంచి, వికలాంగుల కోసం ఆయ మండలాల్లో వివరాలు సేకరిస్తున్నారు. సర్టిఫికెట్లో ఫొటో లేకుంటే ఇస్తే పింఛన్ రాదు. ఇటీవలే జిల్లా కలెక్టర్ నిర్వహించిన సమీక్షలో కూడా అధికారులు సదరం సర్టిఫికెట్లు వికలాంగులందరికి అందించామని చెప్పారు.
కానీ సర్టిఫికెట్లు వేలల్లో వికలాంగులకు చేరాల్సి ఉన్నా, రహస్యంగా ఉంచి ప్రమాదం మీద కు తీసుకువస్తున్నారు. ఇందులో అప్పటి సీవోలు, ఏంపీఎంల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఫొటోలు తీసుకోకుండా లక్ష్య సాధన కోసం తూతూ మంత్రంగా పనిచేయడం ఇప్పుడు 5 వేల మంది వికలాంగులకు శాపంగా మారింది. దీనిని రహస్యంగా ఉంచి గ్రామాల్లో సీఆర్‌పీలు, సీసీలకు వికలాంగులను గుర్తించే బాధ్యతలను అప్పగించా రు. ఈ నెలాఖరు వరకు సదరంలో హాజరై ఫొటోలు మిస్‌అయిన వికలాంగులను గుర్తించడానికి గ్రామా ల్లో స్పెషల్ డ్రైవ్‌టీంలు బయలు దేరాయి. ఈ విషయం ఎక్కడబయటపడుతుందోనని అత్యంత గోప్యంగా ఈ బాగోతాన్ని డీఆర్‌డీఏ అధికారులు నడిపిస్తున్నారు.
నేడు సదరంపై కలెక్టర్ సమీక్ష
సదరం శిబిరం నిర్వహణపై బుధవారం జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. డీఆర్‌డీఏ, సదరం అధికారులతో సమావేశం కానున్నారు. సదరం శిబిరానికి కేటాయించిన బడ్డెట్,ఇంతవరకు ఎన్ని సదరం ధ్రువీకరణపత్రాలు అందించారు..ఇంకా ఎంత మందికి అందించాలనేది అధికారులతో కలెక్టర్ చర్చించనున్నారు. అలాగే సదరం నిర్వహణలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఇటీవల వికలాంగుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఐదువేల పింఛన్‌లు గోవిందా!
Published Wed, Oct 8 2014 2:06 AM | Last Updated on Wed, Apr 3 2019 5:52 PM
Advertisement