సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ)కు కొత్త చైర్మన్ ఎంపిక ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగ వంతం చేసింది. ఇప్పటివరకు చైర్మన్‌గా వ్యవహరించిన రొనాల్డ్ రోస్‌ను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించడంతో చైర్మన్ కుర్చీ ఖాళీ అయింది. ప్రస్తుతం గురుకుల నియామకాల బోర్డు పరిధిలో భారీగా ఉద్యోగ నియామకాల ప్రక్రియ కొనసాగుతోంది. దాదాపు 9 వేల ఉద్యో గాల భర్తీకి వివిధ ప్రకటనలు జారీ చేసిన గురుకుల బోర్డు... వచ్చే నెల నుంచి అర్హత పరీక్షలను నిర్వ హించేందుకు సిద్ధమవుతోంది.
ఈ తరుణంలో బోర్డు చైర్మన్ బదిలీ కావడంతో ఆ స్థానాన్ని వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే బోర్డు చైర్మన్‌కు సంబంధించి సొసైటీల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలి స్తోంది. గత నాలుగు రోజులుగా వర్షాల నేపథ్యంలో నిర్ణయం కాస్త ఆలస్యం కాగా... ఒకట్రెండు రో జుల్లో ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది.
పెద్ద సొసైటీ... సీనియర్ కార్యదర్శికే పగ్గం...
టీఆర్‌ఈఐఆర్‌బీ చైర్మన్ విషయంలో ప్రత్యేక నిబంధనలున్నాయి. కేవలం గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగ నియామకాల కోసం తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు 2018లో ఏర్పా టైంది. ప్రస్తుతం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, తెలంగాణ గిరి జన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీలున్నాయి.
ఈ ఐదు సొసైటీల్లోని కొలువుల భర్తీ గురుకుల బోర్డు నిర్వహిస్తోంది. ఈ బోర్డుకు చైర్మన్‌గా అత్యధిక పాఠశాలలున్న సొసైటీ కార్య దర్శి, అదేవిధంగా సొసైటీ కార్యదర్శుల్లో సీనియ ర్‌కు ఈ బాధ్యత అప్పగించాలనే నిబంధన ఉంది. ఇప్పటివరకు బోర్డు చైర్మన్‌గా మాజీ ఐపీఎస్ అధి కారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, ఆ తర్వాత రొనాల్డ్ రోస్ వ్యవహరించారు. ప్రస్తుతమున్న వారిలో ఒక కార్యదర్శికి బోర్డు చైర్మన్ బాధ్యత అప్పగించాలి. ఇప్పుడున్న కార్యదర్శుల్లో ఇద్దరు సివిల్ సర్వెంట్లు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా ఇ.నవీన్ నికోలస్ కొనసాగుతుండగా మైనారిటీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా షఫీయుల్లా ఉన్నారు. వారిద్దరిలో ఒకరు బోర్డు చైర్మన్ కానున్నారు.
అయితే ఇద్దరిలో ఒకరు ఐఏఎస్ కాగా మరొకరు ఐఎఫ్‌ఎస్ అధికారి. ఐఎఫ్‌ఎస్ అధికారిగా ఉన్న షఫీ యుల్లా దాదాపు 8 ఏళ్లుగా కార్యదర్శిగా కొనసాగు తున్నారు. ఐఏఎస్ అధికారి నవీన్ నికోలస్ గతంలో ఎస్టీ గురుకుల సొసైటీ అదనపు కార్యదర్శిగా, గురుకుల నియామకాల బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా, కన్వీనర్‌గా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఇరువురి పని చరిత్రను పరిశీలించి ఒకరికి ప్రభుత్వం చైర్మన్ బాధ్యత అప్పగించనుంది. వచ్చే వారంలో చైర్మన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment