ప్రగతినగర్ : బ్యాంకు ఖాతాలకు నూరు శాతం ఆధార్ అనుసంధానం చేయాలని బ్యాంకు అధికారులను జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ఆదేశించారు. శనివారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్‌లో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాలు,రైతురుణ మాఫీ, పీఎంజేడీవై తదితర కార్యక్రమాలకు ఆధార్ అనుసంధానం చేయడం తప్పనిసరి అని పేర్కొన్నారు. బ్యాంకు అధికారులందరూ, వారి ఖాతాదారులకు సంబంధించి ఖాతాలను ప్రారంభించడానికి ప్రధాన మత్రి జన్,ధన్,యోజన పథకం కింద ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.
రుణ మాఫీ పొందే రైతులకు తిరిగి రుణాలందించడానికి అవసరమైన ముందస్తు పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. రైతులు పంట రుణాల కోసం ఇతరత్ర ఆర్థిక సంస్థలను ఆశ్రయించకుండా, అధిక వడ్డీల చెల్లింపులను నిరోధించడానికి వీలవుతుందన్నారు. ఈ ఖరీఫ్‌లో ఇప్పటి వరకు 319 బ్యాంకు బ్రాంచీల ద్వారా రూ. 1300 కోట్ల రుణ లక్ష్యానికి గాను 47.25 కోట్ల రూపాయలు పంట రుణాలు మంజూరు చేశామన్నారు.
మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజి కింద ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ నెలాఖరుకు రూ. 85 కోట్లు లక్ష్యం కాగా ఇప్పటికి 73 శాతంతో రూ. 61.64 కోట్లు మంజూరు చేశామన్నారు. ఈ సమావేశంలో ఎల్‌డీఎం రామకృష్ణారావు, ఆర్‌బీఐ ఏజీఎం పుల్లారెడ్డి,నాబార్డు ఏజీఎం రమేష్‌చంద్ర, అన్ని బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.
ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేయాలి
Published Sun, Sep 7 2014 1:21 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 PM
Advertisement