![R Madhavan Shared he is insecure of his bank account](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/madahava.jpg.webp?itok=Se1HL70v)
హీరో మాధవన్ (R Madhavan) తమిళంతోపాటు తెలుగు, హిందీలోనూ పలు సినిమాల్లో నటించారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్‌తో 3 ఇడియట్స్ మూవీ చేశాడు. అప్పట్లో ఆ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇటీవల హిసాబ్ బార్‌బార్ మూవీతో అభిమానులను పలకరించాడు. ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే విడుదలైంది.
అయితే తాజాగా హీరో మాధవన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన ఆర్థిక క్రమశిక్షణ, జీవనశైలి గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన బ్యాంక్ బ్యాలెన్స్ గురించి ఎప్పుడు ఆలోచించలేదని ఆయన అన్నారు. నా బ్యాంక్ ఖాతా పట్ల నేను అభద్రతా భావంతో ఉంటానని తెలిపారు. నా దగ్గర ఎంత ఉందో నాకు తెలియదు.. కానీ ప్రతిసారీ నేను బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు ఇష్టపడను అన్నారు. ఎందుకంటే అలా చేయడం వల్ల నాకు ఎలాంటి ఉపయోగం ఉంటుందో నాకు తెలియదు కానీ.. నేను ఎంత సంపాదిస్తున్నానో.. ఎంత ఖర్చు పెడుతున్నానో నాకు కచ్చితమైన అవగాహన అయితే ఉంది' అని వెల్లడించారు.
కెప్టెన్ లైసెన్స్ ఉంది..
తన కొత్త నైవుణ్యం గురించి మాధవన్ మాట్లాడుతూ.. "నా దగ్గర ఒక సాధారణమైన చిన్న పడవ ఉంది. అది నా కుటుంబానికి సరిపోతుంది. కొవిడ్ సమయంలో నేను నేర్చుకున్న కొత్త నైపుణ్యం నా కెప్టెన్ లైసెన్స్ పొందడమే. బోట్‌లో నావిగేట్ చేయడం నేర్చుకున్నా. ఇదేమీ కష్టమైన పని కాదు. మీరు కూడా 10-15 రోజులు నేర్చుకుంటే లైసెన్స్ వచ్చేస్తుందని' సలహా ఇచ్చారు.
మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం హిసాబ్ బరాబర్ . అశ్వని ధర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కీర్తి కుల్హరి, నీల్ నితిన్ ముకేశ్, రష్మీ దేశాయ్, ఫైజల్ రషీద్ కీలక పాత్రల్లో నటించారు. ఈ థ్రిల్లర్ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజైంది. జనవరి 24 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. అతను ఫాతిమా సనా షేక్‌తో కలిసి ఆప్ జైసా కోయిలో చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment