ప్రగతినగర్: జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ సెలవుపై వెళ్లారు. ఆయన ఐదు రోజులు సెలవు పెట్టడంపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. ఐఏఎస్ అధికారు ల విభజనలో రోస్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. సెప్టెంబర్‌లో ఆ యన ఆ రాష్ట్రంలో బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. ఈ క్రమంలో కలెక్టర్ సెలవు పెట్టడంతో, బదిలీ తప్పదేమోనని పలువురు భావిస్తున్నారు. అం దరినీ కలుపుకుని పోతారని ఆయనకు మంచి పేరుంది. ప్రజాప్రతినిధు లు, అధికారులు, ప్రజలతో మంచి సంబంధాలను నెరుపుతున్నారు.
జిల్లాలో బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజులలోనే డైనమిక్ కలెక్టర్‌గా పేరు పొందారు. జిల్లాకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు రొనాల్డ్ రోస్ పనితీరుపై సీఎం కేసీఆర్ దగ్గ ర సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. కలెక్టర్‌గా ఆయన అయితేనే జిల్లా అభివృద్ధి పథంలో పరుగులు తీస్తుందని, సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చగలమనే నమ్మకాన్ని వారు సీఎం ముందు ప్రస్తావన తెచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రోస్‌ను మరికొంత కాలం జిల్లాలోనే కొనసాగేలా ఆంధ్రా సర్కా రును కోరే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయంతో ఐఏఎస్‌లను మార్చుకోవచ్చని ప్రత్యూష సిన్హా కమిటీ ఇప్పటికే సూచించింది. ఇరు రాష్ట్రా ల సీఎస్‌లు మాట్లాడుకొని కలెక్టర్ బదిలీ మార్చుకోవచ్చనే వాదన కూడా ఉంది. ఆంధ్రా, తెలంగాణ సర్కారుల మధ్య సమన్వయం కుదిరితే కలెక్టర్‌గా రొనాల్డ్ రోస్ మరికొంత కాలం ఇక్కడే కొనసాగే అవకాశం ఉంది. లేదా బదిలీ అనివార్యమైతే ఆయన ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లడం, జిల్లాకు కొత్త బాస్ రాక తప్పదు. సోమవారం విధులలో చేరనున్న అదనపు జాయింట్ కలెక్టర్ శేషాద్రికి ఇన్‌చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
సెలవుపై వెళ్లిన కలెక్టర్
Published Mon, Sep 15 2014 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 PM
Advertisement