Pragathinagar
-
ధనాధన్..
దీపావళికి గ్రేటర్లో పెరిగిన శబ్ద కాలుష్యం అత్యధికంగా ప్రగతినగర్‌లో 85 డెసిబుళ్లు నమోదు వివరాలు సేకరించిన పీసీబీ వాయు కాలుష్యంలో మనది మూడో స్థానం సాక్షి, సిటీబ్యూరో/సనత్‌నగ ర్: దీపావళి ఢాం..ఢాం శబ్దాలు సిటీజనుల గూబ గుయ్మనిపించాయి. గత ఏడాదితో పోలిస్తే మహానగరంలో శబ్ద కాలుష్య స్థాయి నాలుగు డెసిబుళ్లు అధికంగా నమోదైంది. నివాస, పారిశ్రామిక, వాణిజ్య ప్రాంతాల్లో దీపావళి రోజున వెలువడిన శబ్ద కాలుష్య ప్రమాణాలను కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) శుక్రవారం విడుదల చేసింది. అబిడ్స్, గచ్చిబౌలి, కూకట్పల్లి, తార్నాక, ప్యారడైజ్, జీడిమెట్ల, జూ పార్క్, పంజగుట్ట, జూబ్లీహిల్స్, ప్రగతినగర్, ఉప్పల్ ప్రాంతాల్లో కంటిన్యూ యాంబియంట్ సౌండ్ మెజర్మెంట్ పరికరాల ద్వారా దీపావళి రోజున (గురువారం) సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు (శుక్రవారం) ఉదయం 6 గంటల వరకు ధ్వని కాలుష్య ప్రమాణాలను నమోదు చేశారు. నివాస ప్రాంతాల్లోనే టపాసుల మోతతో ఎక్కువ శబ్దాలు వెలువడినట్లుగా పీసీబీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నగర శివారుల్లోని ప్రగతినగర్ (కూకట్పల్లి జేఎన్టీయూ ఎదురుగా)లో అత్యధికంగా 85.5 డెసిబుళ్ల ధ్వని కాలుష్యం నమోదైంది. అబిడ్స్‌లోనూ ఈసారి బాణసంచా పేలుళ్లు 82 డెసిబుళ్ల శబ్దంతో శ్రుతిమించాయి. సాధారణంగా 55 డెసిబుళ్ల కంటే అధిక శబ్దాలు వింటే మనుషులు వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది. కానీ నగరంలోని వివిధ ప్రాంతాల్లో టపాసుల మోతతో శబ్ద కాలుష్యం అంతకంటే అధికంగా నమోదైంది. ఉప్పల్‌లో 77.6 డెసిబుళ్లు, ప్యారడైజ్, పంజగుట్ట, కూకట్‌పల్లిలో 69 డెసిబుళ్లు, జీడిమెట్లలో 60, జూ పార్క్‌లో 56, తార్నాక, జూబ్లీహిల్స్‌లో 53, గచ్చిబౌలిలో 52 డెసిబుళ్లశబ్ద కాలుష్యం నమోదైంది. గత ఏడాది దీపావళి రోజున గ్రేటర్ పరిధిలో సగటున 71 డెసిబుళ్ల ధ్వని కాలుష్యం నమోదు కాగా.. ఈసారి 75 డెసిబుళ్లకు చేరుకుంది. అంటే నాలుగు డెసిబుళ్లు పెరిగిందన్నమాట. వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల్లో పేలని టపాసులు పీసీబీ గణాంకాలను బట్టి చూస్తే వాణిజ్య ప్రాంతాల్లో దీపావళి టపాసుల మోత అంతగా లేదని తేలింది. అబిడ్స్ మినహా మిగిలిన వ్యాపార, వాణిజ్య ప్రాంతాల్లో శబ్ద కాలుష్య ప్రమాణాలు మోస్తరుగానే నమోదయ్యాయి. ప్యారడైజ్ ప్రాంతంలో గత ఏడాది సగటున 82 డెసిబుల్స్ నమోదు కాగా, ఈసారి 69కి తగ్గింది. పంజగుట్ట చౌరస్తాలో సైతం శబ్ద కాలుష్యం తక్కువగానే నమోదైనట్లు పీసీబీ గణాంకాలు చెబుతున్నాయి. పారిశ్రామిక ప్రాంతమైన ఉప్పల్‌లో రెండు డెసిబుల్స్ తగ్గింది. గత ఏడాది సగటున 79 డెసిబుల్స్ ఉండగా, ఈ ఏడాది 77.6కు తగ్గింది. నిశ్శబ్ద జోన్లలోనూ మోత నిశ్శబ్ద మండలం (సెలైంట్ జోన్)గా పరిగణించే గచ్చిబౌలి, జూ పార్క్ ప్రాంతాల్లో సాధారణంగా ధ్వని కాలుష్యం రాత్రి వేళల్లో 40 డెసిబుళ్లు మించరాదు. దీపావళి రోజున జూ పార్క్ వద్ద 56, గచ్చిబౌలిలో 52 డెసిబుళ్ల శబ్ద కాలుష్యం నమోదవడం గమనార్హం. ఈ మోతతో జూ పార్క్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉన్న వన్యమృగాల జీవనశైలిలో పెనుమార్పులు వచ్చే ప్రమాదం ఉందని వెటర్నరీ వైద్యులు అభిప్రాయ పడుతున్నారు. మనది మూడో స్థానం మెట్రో నగరాలతో పోలిస్తే వాయు కాలుష్యంలో గ్రేటర్ నగరం మూడో స్థానంలో నిలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం సాధారణ రోజులతో పోలిస్తే తొమ్మిది రెట్లు పెరిగిందని వాతావరణ శాఖ అంచనా. బాణసంచా పేలుళ్లతో నైట్రోజన్ డై ఆక్సైడ్,సల్ఫర్ డైఆక్సైడ్ వాయువులు గాలిలో విపరీతంగా కలిసిపోయాయి. ఊపిరితిత్తులకు పొగబెట్టే ఈ కాలుష్య కారకాలు ఒక క్యూబిక్ మీటరు గాలిలో సుమారు 531 మైక్రోగ్రాములకు చేరడం గమనార్హం. చెన్నైలో క్యూబిక్ మీటరు గాలిలో కాలుష్య కారకాలు 320 మైక్రోగ్రాములు, గ్రేటర్లో క్యూబిక్ మీటరు గాలిలో 302 మైక్రోగ్రాములు, బెంగళూరులో 239 మైక్రోగ్రాములకు చేరినట్లు అంచనా వేస్తున్నాయి. వాయు కాలుష్య కారకాల వారీగా పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపాయి. -
కలెక్టరేట్లో భద్రత కరువు!
ప్రగతినగర్: నిత్యం కలెక్టరేట్లో, ప్రాంగణంలో ఏదో ఒక చోరీ, లేదా ఒక సమస్య ఉత్పన్నమవడం సర్వసాధారణమైంది. కనీసం తమ సమస్యలను చెప్పుకుందామని అక్కడి పోలీసులను ఆశ్రయించినా బాధితులకు న్యాయం జరగడంలేదు. మొత్తం మీద కలెక్టరేట్ ప్రాంతంలో ఉద్యోగులు అభద్రతా భావంతో మెలుగుతున్నారు. గంటకోసారి టీ తాగుదామనే వంకతో బయటకు వచ్చి బైక్‌లను చూసుకుంటున్నారు. హమ్మయ్యా..! బైక్ ఉందిరా బాబు అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే బైక్‌లే కాకుండా కంప్యూటర్లు కూడా మాయమైపోతున్నాయి.రాత్రి కల్లా కనబడ్డ కంప్యూట ర్ పొద్దున్నకల్లా మాయమైపోతోంది. దీంతో ఉద్యోగులు కలెక్టరేట్లో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కలెక్టరేట్లోని అన్ని శాఖల్లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేస్తే, ఈ బాధ ఉండదని, దొంగిలించిన వారిని పోలీసులు పట్టుకోవచ్చని పలువురు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. మూత్రశాలలు లేక ఇబ్బందులు కలెక్టరేట్లో మూత్రశాలలు లేక ఉద్యోగులతో పాటు సందర్శకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచినీటి వసతి కూడా లేదు. హౌసింగ్ కార్పొరేషన్ వారు ఏర్పాటు చేసిన ఫ్రిజ్ చెడిపోవడంతో సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కలెక్టరేట్లోని పలు కార్యాలయ గోడల్లో నుంచి మొక్కలు మొలవడంతో గోడలన్నీ పగుళ్లు ఏర్పడి బీటలు వారాయి. హౌసింగ్ కార్పొరేషన్లో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేసే వెంకటేష్ ఆదరబాదరాగా కలెక్టరేట్‌కు బైక్‌పై వచ్చాడు. వచ్చిరాగానే అక్షరభవన్లో ఉన్నా హౌసింగ్ కార్యాలయంలో తన పైఅధికారులను కలవడానికి వెళ్లాడు. వారితో మాట్లాడి కిందికి వచ్చే చూసుకునే సరికి తాను మూడునెలల క్రితం జీతం పొగేసి కొనుకున్న కొత్త గ్లామర్ బైక్ కనబడలేదు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే ఆనంద్ కలెక్టరేట్‌కు వచ్చి ప్రజావాణికి హాజరయ్యాడు. మధ్యాహ్న భోజనానికి ఇంటికి వెళదామనుకొని బైక్ దగ్గరికి వచ్చేసరికి బైక్ మాయమైంది. ఆధార్ సీడింగ్ చేయడానికి ఓ ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్ స్థానిక రెవెన్యూ భవన్ ముందు బైక్ పెట్టి బంగ్లాపైకి వెళ్ళాడు. రోజు మాదిరిగానేపని ముగిసి న అనంతరం కిందికి వచ్చి చూడగా తన బైక్ కనబడలేదు. తమ సమస్యలను చెప్పుకోవడానికి ఇటీవల కలెక్టరేట్‌కు వచ్చిన ఓ గ్రామం నుంచి వచ్చిన వారి బైక్ చోరీకి గురైంది. -
కేసీఆర్ తీరుపై దళిత సంఘాల ఆందోళన
ప్రగతినగర్ : ధర్నాలు, ముట్టడి, ఆందోళనలు, నిరసనలతో సోమవారం కలెక్టరేట్ ప్రాం గణం అట్టుడికిపోయింది. ఉదయం నుం చే పోలీసులు కలెక్టరేట్ చుట్టూ ఉన్న గేట్ల ను మూసివేసి గట్టి భద్రత ఏర్పాటు చేశా రు. కలెక్టర్ రొనాల్డ్‌రాస్ మాత్రం యథావిధిగా ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. కొన్ని శాఖలలో ఫిర్యాదులు పేరుకుపోతున్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజల ఫిర్యాదులపై నిర్లక్ష్యం చేయరాదన్నారు. దళితులకు మూడెకరాలు అందించాలి ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల వ్యవసాయ భూమిని అందించాలని వ్యవసాయ కార్మిక సం ఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు దుబాస్ రా ములు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాన్ని అమలు చేయకుండా ఇప్పుడు జిమ్మిక్కులు చేస్తూ దళితులకు ద్రో హం చేస్తున్నారని ఆరోపించారు. బొజ్జా భూమాగౌడ్, సీపీఐ నాయకులు సుధాకర్, ఓమయ్య, బిసాయిలు, విఠల్‌గౌడ్, రమేశ్, గంగారాం పాల్గొన్నారు. సర్వీసును క్రమబద్ధీకరించాలి జీఓ 22 ప్రకారం అర్బన్ హెల్త్ సెంటర్ ఉద్యోగుల స ర్వీసులను క్రమద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ అర్బన్ హెల్త్ సెంటర్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు రమేష్, గోవర్ధన్ మాట్లాడుతూ 2014 జనవరి తరువాత ఉద్యోగుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ సాక్షరభారత్ కాంట్రాక్ట ఉద్యోగులు ధర్నా చేశారు. సమస్యలు పరిష్కరించండి జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతి పత్రా న్ని ఇచ్చారు. ఏఐటీయూసీ నాయకులు సుధాకర్, ఓమయ్య మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, వారికి ఈఎస్ ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలన్నారు. షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి బోధన్‌లోని నిజాం షుగర్స్ దక్కన్ లిమిటెడ్‌ను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యలో ధర్నా చేశా రు. ఫార్వర్డ బ్లా క్ జిల్లా కన్వీనర్ రాజాగౌడ్ మాట్లాడుతూ ఆసియా ఖండంలో అతి పెద్దదైన షుగర్ ఫ్యాక్టరీ ఎన్నో వేల మందికి ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఉఫాది కల్పించిందిన్నారు. అక్కడ అలా చెప్పి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని, అందుకు అవసరమైన ఐదు లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాం క్‌ను ఏర్పాటు చేస్తానని సింగపూర్ పర్యటనలో అక్కడి పారిశ్రామిక వేత్తలకు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ దళితులకు మాత్రం మూడెకరాల భూమి పంపిణీ విషయాన్ని మరిచిపోయాని న్యూడెమోక్రసీ నాయకులు విమర్శించారు. కలెక్టర్ వద్ద నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు ఆకుల పాపయ్య, నీలం సాయిబాబా, సీహెచ్ సాయాగౌడ్, ఎన్ నర్సయ్య, కృష్ణగౌడ్, పీడీఎస్‌యూ నాయకులురాలు సరిత, సౌందర్య, రవి, అరుణ్, రాజేశ్వర్, నరేష్, కృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఓడ్ కులాన్ని గుర్తించాలి ఓడ్ కులస్తులకు ప్రభుత్వ గుర్తింపు ఇవ్వాలని తెలంగాణ ఓడ్ కుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎ దుట ధర్నా చేశారు. తెలంగాణలో పదివేల కు టుంబాలకు పైగా జీవిస్తున్నారని సంఘం నాయకు లు పేర్కొన్నారు. జిల్లాలో సుమారు మూడు వందలకుపైగా కుటుంబాలు మొరం, మట్టి, ఇసుక ప నులు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఓడ్ కులస్థులను ఎస్సీలలో చేర్చాలని డిమాండ్ చేశారు. సుధాబార్పై చర్యలు తీసుకోండి నిబంధనలను తుంగలో తొక్కి నగరం నడిబొడ్డున ప్రజలు నివసించే ప్రాంతంలో నిర్వహిస్తున్న సుధాబార్ను మూసివేయించాలని వినాయక్నగర్వాసులు కలెక్టర్‌ను కోరారు. బార్‌కు సుమారు వంద అడుగుల దూరంలో పాఠశాల ఉందని, విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలాన్ని కాపాడండి.. మిర్చి కాంపౌండ్ ప్రాంతంలోని ప్రభుత్వ స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని స్థానికులు కలెక్టర్‌ను కోరారు. ప్రభుత్వ స్థలంలో ఆకతాయిలు అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారన్నారు. -
సెలవుపై వెళ్లిన కలెక్టర్
ప్రగతినగర్: జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ సెలవుపై వెళ్లారు. ఆయన ఐదు రోజులు సెలవు పెట్టడంపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. ఐఏఎస్ అధికారు ల విభజనలో రోస్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. సెప్టెంబర్‌లో ఆ యన ఆ రాష్ట్రంలో బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. ఈ క్రమంలో కలెక్టర్ సెలవు పెట్టడంతో, బదిలీ తప్పదేమోనని పలువురు భావిస్తున్నారు. అం దరినీ కలుపుకుని పోతారని ఆయనకు మంచి పేరుంది. ప్రజాప్రతినిధు లు, అధికారులు, ప్రజలతో మంచి సంబంధాలను నెరుపుతున్నారు. జిల్లాలో బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజులలోనే డైనమిక్ కలెక్టర్‌గా పేరు పొందారు. జిల్లాకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు రొనాల్డ్ రోస్ పనితీరుపై సీఎం కేసీఆర్ దగ్గ ర సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. కలెక్టర్‌గా ఆయన అయితేనే జిల్లా అభివృద్ధి పథంలో పరుగులు తీస్తుందని, సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చగలమనే నమ్మకాన్ని వారు సీఎం ముందు ప్రస్తావన తెచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రోస్‌ను మరికొంత కాలం జిల్లాలోనే కొనసాగేలా ఆంధ్రా సర్కా రును కోరే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయంతో ఐఏఎస్‌లను మార్చుకోవచ్చని ప్రత్యూష సిన్హా కమిటీ ఇప్పటికే సూచించింది. ఇరు రాష్ట్రా ల సీఎస్‌లు మాట్లాడుకొని కలెక్టర్ బదిలీ మార్చుకోవచ్చనే వాదన కూడా ఉంది. ఆంధ్రా, తెలంగాణ సర్కారుల మధ్య సమన్వయం కుదిరితే కలెక్టర్‌గా రొనాల్డ్ రోస్ మరికొంత కాలం ఇక్కడే కొనసాగే అవకాశం ఉంది. లేదా బదిలీ అనివార్యమైతే ఆయన ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లడం, జిల్లాకు కొత్త బాస్ రాక తప్పదు. సోమవారం విధులలో చేరనున్న అదనపు జాయింట్ కలెక్టర్ శేషాద్రికి ఇన్చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. -
ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేయాలి
ప్రగతినగర్ : బ్యాంకు ఖాతాలకు నూరు శాతం ఆధార్ అనుసంధానం చేయాలని బ్యాంకు అధికారులను జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ఆదేశించారు. శనివారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్లో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాలు,రైతురుణ మాఫీ, పీఎంజేడీవై తదితర కార్యక్రమాలకు ఆధార్ అనుసంధానం చేయడం తప్పనిసరి అని పేర్కొన్నారు. బ్యాంకు అధికారులందరూ, వారి ఖాతాదారులకు సంబంధించి ఖాతాలను ప్రారంభించడానికి ప్రధాన మత్రి జన్,ధన్,యోజన పథకం కింద ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. రుణ మాఫీ పొందే రైతులకు తిరిగి రుణాలందించడానికి అవసరమైన ముందస్తు పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. రైతులు పంట రుణాల కోసం ఇతరత్ర ఆర్థిక సంస్థలను ఆశ్రయించకుండా, అధిక వడ్డీల చెల్లింపులను నిరోధించడానికి వీలవుతుందన్నారు. ఈ ఖరీఫ్‌లో ఇప్పటి వరకు 319 బ్యాంకు బ్రాంచీల ద్వారా రూ. 1300 కోట్ల రుణ లక్ష్యానికి గాను 47.25 కోట్ల రూపాయలు పంట రుణాలు మంజూరు చేశామన్నారు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజి కింద ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ నెలాఖరుకు రూ. 85 కోట్లు లక్ష్యం కాగా ఇప్పటికి 73 శాతంతో రూ. 61.64 కోట్లు మంజూరు చేశామన్నారు. ఈ సమావేశంలో ఎల్డీఎం రామకృష్ణారావు, ఆర్బీఐ ఏజీఎం పుల్లారెడ్డి,నాబార్డు ఏజీఎం రమేష్‌చంద్ర, అన్ని బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు. -
మేలు కలిగించే జన-ధన పథకం
ప్రగతినగర్ : ప్రధానమంత్రి జన-ధన యో జన పథకం బహుళ ప్రయోజనకారి గా పనిచేస్తుందని, ప్రజలు సద్విని యోగం చేసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరి గిన కార్యక్రమంలో మంత్రి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి రెండు బ్యాంకు ఖా తాలు ప్రారంభించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన పథకం ద్వారా ప్రజలు, ముఖ్యంగా పేదలు వారి కష్టార్జితాన్ని పొదుపు చేసుకునే వీలు కలుగుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు నేరుగా వారి ఖాతాలలోకి జమ చే యడానికి వీలవుతుందన్నారు. తద్వాదా ప్రభుత్వం చెబుతున్నట్లుగా అవినీతిని పారద్రోలడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. బ్యాంకు ఖాతాలు మహిళల పేరున ఉంటే ఆ కుటుంబం ఆర్థికంగా ఎంతో ఎదుగుతుందని, డబ్బు దుర్వినియోగం కాకుండా ఉం టుందన్నారు. ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేసినప్పుడే దీని లక్ష్యం నెరవేరుతుందన్నారు. ఇటు బ్యాంకులు, అటు ప్రజలు, రైతులు బాగుపడాలంటే వారికి నాణ్యమైన రుణాలు అందించాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉందన్నారు. తమ వంతుగా అన్ని సహాయ, సహకారాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రాస్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి జన -ధన యోజన పథకం ప్రజల హక్కు అని, దీనిని సద్వినియోగం చేసుకోవాలన్న భానవ ప్రజల్లో రావాలన్నారు. వచ్చే జనవరి 26 వరకు జిల్లాలో 100 శాతం ప్రజలకు ఖాతాలు ప్రారంభించాలని ఆయన బ్యాంకు అధికారులకు సూచిం చారు. ఎంపీ కవిత మాట్లాడుతూ గతంలో బ్యాంకులు పేద ప్రజలకు, విద్యార్థులకు , బీడీ కార్మికులకు ఖాతాలు ప్రారంభించడానికి అయిష్టత వ్యక్తం చేసేవని, ప్రస్తుతం ఈ పథకంలో బీమా లింకు ఉన్నందున బ్యాంకర్లు ఉత్సాహం చూపిస్తున్నారన్నారు. ప్రజలకు రేషన్‌కార్డు, ఓటరు కార్డు, ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో బ్యాంకు ఖాతా కూడా అంతే ముఖ్యమన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాల లబ్ధిని అందించడానికి, అంతేగాక దేశం ఆర్థికంగా ఎదగడానికి పరోక్షంగా ఉపయోగపడుతుందన్నారు. అవినీతిని తగ్గించడానికి దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో సంస్కృతి అనే బాలిక నృత్య ప్ర దర్శన ప్రేక్షకులను అకట్టుకుంది. సభలో ప్రధాన మం త్రి మోడీ ప్రత్యక్ష ప్రసారాన్ని స్క్రీను ఏర్పాటు చేసి ప్రదర్శించారు. అనంతరం లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల పాస్‌బుక్కులను పంపిణీ చేశారు. జిల్లా పరి షత్ చైర్పర్సన్ రాజు, నగర పాలక సంస్థ మేయర్ సుజాత, బోధన్ శాసన సభ్యులు షకీల్, డీసీఎంఎస్ చైర్మన్ ముజీబుద్దీన్, ఎల్డీఎం రామకృష్ణారావు, పలు బ్యాంకుల అధికారులు, జిల్లా అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. -
‘మీ-సేవ’ల మంజూరులో గోల్మాల్?
ప్రగతినగర్ : ప్రభుత్వ సేవలు ప్రజలకు సులువుగా, వేగవంతంగా అందించేందుకు గత సర్కారు మీ-సేవ కేంద్రాలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇవి ప్రజా పనులకు సత్వర పరిష్కారాలను అందిస్తున్నాయి. తహశీల్దార్, రిజిస్ట్రార్, పోలీస్, పోస్టాఫీస్, మున్సిపాలిటీ.. ఇలా పలు శాఖలకు సంబంధించని ఎన్నోరకాల సేవలను ఈ కేంద్రాలు అందిస్తున్నాయి. ఈ కేంద్రాల ఏర్పాటు ద్వారా నిరుద్యోగ యువతకు సైతం ఉపాధి లభించినట్లైంది. ఇలాంటి మీ-సేవ కేంద్రాల మంజూరు విషయంలో ఇటీవల జిల్లాలో ఇష్టానుసారంగా జరిగినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలె బదిలీ అయిన ఓ ఉన్నతాధికారి ఇష్టానుసారంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎలాగు తాను బదిలీ అవుతున్నానని ఈఎస్డీ(ఎలక్ట్రానికల్ డెలివరీ సర్వీసెస్) జిల్లా మేనేజర్‌తో కుమ్మకైన సదరు అధికారి ప్రభుత్వ నిబంధనలకు పాతరేసి జిల్లాలో సుమారు 30 మీ-సేవ కేంద్రాలను ఆగమేఘాల మీద మంజూరు చేశారు. నిబంధనలకు విరుద్దంగా మీ-సేవ కేంద్రానికి దరఖాస్తు పెట్టుకున్న అనంతరం సెంటర్ మంజూరు కోసం అన్ని నిబంధనలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి రూ. 12వేల డిపాజిట్ చెల్లించాలి. అయితే బదిలీ అయిన అధికారి, మీ-సేవ మేనేజర్లు కలిసి ఈఎస్డీ అధికారులను బోల్తా కొట్టించారు. తహశీల్దార్లతో సంబంధం లేకుండా ఈఎస్డీ అధికారులతో ఒప్పందం పెట్టుకొని మీ-సేవలకు సత్వరం మంజూరు చేశారు. ఒక్కో మీ-సేవ సెంటర్ మంజూరుకు రూ. 50వేల వరకు అడ్డగోలుగా వసూలు చేసినట్లు విమర్శలు ఉన్నాయి. అధికారులే నిబంధనలకు తుంగలో తొక్కి వసూళ్లకు పాల్పడుతుండటంతో.. ప్రజలకు సేవలందించాల్సిన పలు మీ-సేవ నిర్వాహకులు వారి దగ్గర అందిన కాడికి దండుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ రుసుము పది రూపాయాలే కదా అని అడిగితే.. ప్రభుత్వం రూపొందించిన రుసుము తీసుకుంటే కనీసం సెంటర్ అద్దె కూడా కట్టలేమంటూ.. వినియోగదారులకు తెగేసి చెబుతున్నారు. తహశీల్దార్లకు తెలియకుండానే జిల్లాలో మీ-సేవ కేంద్రాల మంజూరుకు జిల్లా జాయింట్ కలెక్టరే(జేసీ) సర్వాధికారి. అయితే మీ-సేవ సెంటర్ కోసం ముందుగా తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తును పరిశీలించిన అనంతరం తహశీల్దార్ వీఆర్ఓ, ఆర్ఐల ద్వారా ఎంక్వైరీ చేయించి ఆర్డీఓకు నివేదికను పంపుతారు. అనంతరం ఆర్డీఓ, తహశీల్దార్, ఆర్ఐ, వీఆర్ఓల పరిశీలన తర్వాత దరఖాస్తు ఫైలు కలెక్టరేట్ చేరుతుంది. జేసీ దానికి మంజూరు తెలిపిన అనంత రం తిరిగి ఆర్డీఓ, తహశీల్దార్ ద్వారా మీ-సేవ కేంద్రాల మేనేజర్‌కు అప్పగించాలి. అయితే ప్రస్తుతం బదిలీ అయిన సదరు జిల్లా అధికారి ఈ నిబంధనలన్నింటినీ అటకెక్కించినట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిశీలనలు లేకుండానే ఒక్కో సెంటర్ నిర్వాహకుని వద్ద నుంచి రూ.50వేల నుంచి లక్ష వరకు వసూళ్లు చేసి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తహశీల్దార్ల ప్రమేయం లేకుండానే ఏకంగా నిజామాబాద్ డివిజన్ పరిధిలో 14, కామారెడ్డి పరిధలో 8, బోధన్‌లో 7, ఆర్మూర్‌లో 2 మీ -సేవ కేంద్రాల నిర్వహణకు అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. ఈ సెంటర్ల మంజూరులో సదరు అధికారి ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 5 మొగిపురుగు.. తొలిచేస్తోంది ప్రస్తుతం మక్క పంటను కాండం తొలుచు పురుగు ఆశిస్తోందని రైతులు చెబుతున్నారు. ఈ పురుగు ముందుగా పత్రహరితాన్ని హరించి వేస్తుందని, తర్వాత కాండానికి వ్యాపిస్తుందని పేర్కొంటున్నారు. దీంతో దిగుబడి తగ్గిపోతుందన్నారు. ప్రాథమిక దశలోనే వీటిని అరికట్టకపోతే భారీ నష్టం వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు. బుస్సాపూర్ గ్రామానికి చెందిన ఉత్తమ రైతు గంగారెడ్డి ఈ పురుగు వల్లవాటిల్లే నష్టాలను వివరించారు. నివారణ చర్యలను సూచించారు. లక్షణాలు కాండం తొలిచే పురుగు మొక్కజొన్న మొలకెత్తిన 30-40 రోజులకు ఆశిస్తుంది. పిల్ల పురుగులు మొదట ఆకులపైన పత్రహరితాన్ని తినేస్తాయి. తర్వాత ముడుచుకున్న ఆకు ద్వారా కాండం లోపలికి చేరతాయి. ఆకులు విచ్చుకున్న తర్వాత చిన్నచిన్న రంధ్రాలు కనిపిస్తాయి. లార్వాలు ఎదిగే అంకురాన్ని తినడం వల్ల మొవ్వ చనిపోయి ఎండిపోతుంది. ఇది కాండం లోపల గుండ్రని లేదా ‘ఎస్’ ఆకారంలో సొరంగాలను ఏర్పరుస్తుంది. ఇవి పూతను, కంకిని కూడా ఆశించి దిగుబడి రాకుండా చేస్తాయి. ఈ పురుగు ఆశించిన మొక్క నిలువుగానే చనిపోతుంది. నివారణ చర్యలు పొలంలో కలుపు మొక్కలను నివారించాలి. పురుగు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి. పొలం చుట్టూ 3 నుంచి 4 వరుసలలో జొన్నను ఎర పంటగా వేసి 45 రోజుల తర్వాత తీసివేయాలి. ఎకరాకు 320 మిల్లీ లీటర్ల మోనోక్రోటోఫాస్ 36 యస్.ఎల్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి 10-15 రోజుల పైరుపై పిచికారి చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే కార్బోప్యురాన్ 3జీ గుళికలను ఎకరాకు మూడు కిలోల చొప్పున ఆకుల సుడులలో వేయాలి. -
మా సంగతేమిటో!
ప్రగతినగర్ :తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే-2014 జిల్లాలో అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల వరకు జరిగిన సర్వేలో 104 శాతం వరకు కుటుంబాల వివరాలు సేకరించారు. జిల్లాలో 6,95.205 కుటుంబాలను గుర్తించిన అధికారులు 30 వేలపై చిలుకు ఉద్యోగులు, సిబ్బందిని సమగ్ర స ర్వేకు నియమించారు. ఉదయం ఆరు గంటల నుంచే ఎన్యూమరేటర్లు సర్వేకు ఉపక్రమించారు. సర్వే సందర్భంగా, ముంబాయి, భీవండి, జాల్నా, నాందేడ్ తదితర ప్రాంతాలకు వలస వెళ్లిన తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున స్వస్థలాలకు తరలిరావడంతో కుటుంబాల సంఖ్య 7,21,775 చేరింది. ఇంకా మున్సిపల్ పరిధిలో సుమారు 10 వేల కుటుంబాల వివరాలు సర్వే చేయాల్సి ఉంటుందన్నారు. దీంతో జిల్లాలో 7.30 లక్షల కుటుంబాల సమాచారాన్ని పూర్తి చేసినట్లు అవుతుందని కలెక్టర్ తెలిపారు. స్టిక్కర్లు వేసినా ముందుగా స్టిక్కర్లు వేసినప్పటికీ, అధికారులు సర్వే చేపట్టకపోవడంతో అక్కడక్కడ జనం ఇబ్బంది పడ్డారు. తాము తెలంగాణకు చెందినవారమైనా తమను ఎన్యూమరేటర్లు గుర్తించడం లేదని వారు జోనల్ అధికారులకు, రూట్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ వెంటనే 600 మంది మంది ఎన్యూమరేటర్లను రంగం లోకి దింపి రాత్రి పొద్దుపోయే వరకు సర్వే నిర్వహించారు. నగరంలోని పోచమ్మగల్లి, ఎల్లమ్మగుట్ట, చంద్రశేఖర్‌కాలనీ, గౌతంనగర్, సాయినగర్, ఇంద్రపుర్కాలనీ, నా గారం తదితర ప్రాంతాలలో ఎన్యూమరేటర్లు రాలేరని సుమారు వెయ్యి మంది బుధవారం ఉదయం కలెక్టరేట్‌ను ముట్టడించారు. తాము ఏళ్ల తరబడి స్థిర నివాసం ఏ ర్పరుచుకొని ఉదయం నుంచి రాత్రి వరకు సర్వే కోసం వేచి చూసిన ఎన్యూమటర్లే రాలేదని, స్టిక్కర్లు వేసిన ఇళ్లకు కూడా రాలేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నగరం లో కొన్ని పొరపాట్లు జరిగిన మాటవాస్తవమేనని, రెండు నుంచి మూడు శాతం వరకు పొరపాట్లు జరిగాయని ఆయన చెప్పారు. సర్వేలో పేర్లు నమోదు చేయని కుటుం బాల వివరాలు ఆయా తహశీల్దార్ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాలలో స్వీకరిస్తామని, ప్రజలు ఆందోళన చెందవల్సిన అవసరం లేదన్నారు.ప్రభుత్వం నుండి మా ర్గదర్శకాలు రాగానే వాటిని పూర్తి చేస్తామని వివరించారు. జిల్లాలోని ఇతర ప్రాంతాలలోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. -
ఆధార్ సీడింగ్ పూర్తయ్యేనా?
ప్రగతినగర్ :జిల్లాలో పూర్తి స్థాయిలో రేషన్‌కార్డుల ఆధార్ సీడింగ్ జరుగుతుందా అన్న విషయమై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూలైలోనే వందశాతం ఆధార్ సీడింగ్ జరగాల్సి ఉన్నా.. ఇప్పటికి కూడా 72.8 శాతం లక్ష్యమే పూర్తయ్యింది. ఇంకో పది శాతం సీడింగ్ జరగడమూ కష్టమేనని భావిస్తున్నారు. బోగస్ రేషన్ కార్డులను ఏరివేయడానికి ప్రభుత్వం జూన్‌లో ఆధార్ కార్డుల నంబర్లను ఈ -పీడీఎస్ ద్వారా అనుసంధానం(సీడింగ్) చేసే ప్రక్రియను ప్రారంభించింది. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు డీలర్ల ద్వారా లబ్ధిదారుల ఆధార్ నంబర్లను సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియ జూలై నెలాఖరులోగా పూర్తి కావాల్సి ఉంది. అయితే 68.2 శాతమే సీడింగ్ పూర్తి కావడంతో గడువును ఆగస్టు నెలాఖరు వరకు పొడిగించారు. ఆగస్టు నెల సగం గడిచినా 78.2 శాతమే పూర్తయ్యింది. ఇదే సమయంలో అధికారుల ఆదేశాల మేరకు రేషన్ డీలర్లు తమ వద్ద ఉన్న బోగస్ కార్డులను అధికారులకు సరెండర్ చేశారు. అనర్హుల వద్ద తెల్ల రేషన్‌కార్డులుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో పలువురు స్వచ్ఛందంగా బోగస్ కార్డులను అప్పగించారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 40 వేలకుపైగా తెల్ల రేషన్‌కార్డులను సరెండర్ చేసినట్లు తెలుస్తోంది. కాగా జిల్లాలో వంద శాతం ఆధార్ సీడింగ్ జరగడం అసాధ్యమన్న వాదన వినిపిస్తోంది. జిల్లాలో 20 శాతానికి పైగా బోగస్ తెల్ల రేషన్ కార్డులున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే లక్ష మంది ఆధార్ నంబర్లు ఈ -పీడీఎస్‌లో నమోదు కావడం లేదు. దీంతో వారిని బోగస్ లబ్ధిదారులుగా అనుమానిస్తున్నారు. మరో మూడు లక్షల మంది ఇలా దొరికిపోయే అవకాశాలున్నాయని అనుమానిస్తున్నారు. జిల్లాలో పరిస్థితిని చూస్తే ఆధార్ సీడింగ్ 80 శాతానికి మించేలా లేదని స్పష్టమవుతోంది. ఈనెలాఖరులో అధికారులు సరెండర్ అయిన కార్డులు, రద్దు అయిన వారి వివరాలను ప్రభుత్వానికి పంపనున్నారు. డీలర్ల అత్యుత్సాహం ఓ వైపు ఆధార్ నంబర్లను ఈ -పీడీఎస్ ద్వారా అనుసంధానం(సీడింగ్) చేసే ప్రక్రియ సాగుతుండగానే పలువురు రేషన్ డీలర్లు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఆధార్ నంబర్లను ఇవ్వని లబ్ధిదారులకు జూలైలో రేషన్ సరుకులను ఇవ్వలేదు. ఆధార్ సీడింగ్‌కు సమయం ఉన్నప్పటికీ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేశారు. అక్రమాల విలువ కోట్లల్లోనే.. జిల్లాలో అన్ని రకాల కార్డులు 7,31,350 ఉన్నాయి. వీటికి ప్రతి నెల 12 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. డీలర్ల వద్దే పెద్ద ఎత్తున బోగస్ కార్డులు ఉన్నట్లు స్పష్టమవుతోంది. గ్రామాలనుంచి వలస వెళ్లడం, కార్డుదారులు చనిపోవడం, ఇతర కారణాలతో రేషన్ సరుకులు తీసుకోనివారి, ఆరోగ్య శ్రీ కోసం కార్డు పొందినవారికి సంబంధించిన రేషన్‌కార్డులను పలువురు డీలర్లు తమ వద్దే ఉంచుకొని సరుకులను తీసుకుంటున్నారు. అనంతరం వాటిని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు.రేషన్ డీలర్ల వద్ద 13,122 బోగస్ కార్డులున్నట్లు అధికారులు గుర్తించారు. కాగా ఇప్పటివరకు 12,110 కార్డులను డీలర్లు అప్పగించారు. వీరు అప్పగించిన కార్డుల తాలూకు సరుకుల విలువ అర కోటి రూపాయలు ఉంటుందని సమాచారం. కేవలం జూన్, జూలై మాసాల బియ్యం 60 వేల క్వింటాళ్లు పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. వీటిని ప్రతి నెల రైస్ మిల్లులకు తరలించి రీసైక్లింగ్ చేయిస్తూ పక్క జిల్లాలకు ఎగుమతి చేస్తున్నారు. బోగస్ కార్డులను పూర్తి స్థాయిలో ఏరివేస్తే నెలకు కోట్ల రూపాయల ప్రజాధనం అక్రమార్కుల పాలు కాకుండా కాపాడినట్లేనని పలువురు పేర్కొంటున్నారు. -
సర్వే సక్సెస్
ప్రగతినగర్ : తెలంగాణ ప్రభుత్వం మంగళవారం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే జిల్లాలో విజయవంతంగా జరిగిందని కలెక్టర్ రొనాల్డ్‌రాస్ తెలిపారు. ప్రగతిభవన్‌లో ఆయన రాత్రి విలేకరులతో మాట్లాడా రు. బంగారు తెలంగాణకు బాటలు వేసేందుకు, అర్హులందరికీ ప్రభుత్వ, సంక్షేమ పథకాలను అందించేందుకు చేపట్టిన సర్వే ఊరురా పండుగలా సాగిందన్నారు. గ్రామాలు, మండలాలలో సాయంత్రం ఆరు గం టల వరకు వంద శాతం సర్వే పూర్తి చేశామన్నారు. ఆర్మూర్, బోధన్, కామారెడ్డి మున్సి పాలిటీలలో ఏడు గంటల వరకు సర్వే పూర్తి అయిందన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో మాత్రం అక్కడక్కడా పొరపాట్లు జరిగాయని, వాటిని సరిదిద్దామని తెలి పారు. కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్లు ఉన్నందున, కుటుంబాల సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నం దున అక్కడక్కడ స్టిక్కర్ల కోసం ప్రజలు అవస్థలు పడ్డారన్నారు. మధ్యాహ్నం ఈ సమస్యను గుర్తించి తిరిగి 600 మంది ఎన్యూమరేటర్లను ఆయా డివిజన్ల పరి ధికి పంపించామన్నారు. మహారాష్ట్ర, బీవండీ, పూణె, ముంబాయి, ఇతర ప్రాంతాల నుండి ప్రజలు తరలి రావడంతో ప్రీ స్టిక్కర్ల కొరత ఏర్పడిందన్నారు. ఇంటి యజమానులు కొందరు కేవలం ఒక్క స్టిక్కరు మాత్ర మే వేయించుకున్నారని, అద్దెకు ఉన్న వారి వివరాల ను దాచి ఉంచారని పేర్కొన్నారు. జిల్లాలో 6,95,205 కుటుంబాలు ఉండగా, ఇతర ప్రాంతాల నుండి ప్రజలు తరలి రావడంతో మంగళవారం ఉదయానికి అవి7.10 లక్షలకు చేరుకున్నాయన్నారు. సర్వే పూర్తి డాటాను 13 ప్రాంతాలలో ఆన్లైన్ ద్వారా సీడింగ్ చేయనున్నామన్నారు. వీటి కోసం హై స్పీడ్ సాఫ్ట్ వేర్‌తో కూడిన రెండు వేల కంప్యూటర్లను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాకు సంబంధించిన పూర్తి డాటాను ఈ నెల 31లోగా పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ తెలిపారు. సర్వేను జిల్లా ప్రత్యేక అధికారి జనార్దన్‌రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారన్నాని కలెక్టర్ వివరించారు. -
భయం వలదు
ప్రగతినగర్ : ‘‘ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తయారు చేయడం, అమలు చేయాలన్నా, ఆ రాష్ట్ర కుటుంబాల, ప్రజల సమగ్ర సమాచారం అవసరం. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బేస్‌లైన్ సమాచారం సేకరించడానికి ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేపట్టాలని నిర్ణయించింది. సమగ్ర కు టుంబ సర్వేలో అన్ని కుటుంబాలకు సంబంధించి పూర్తి సమాచారం ఆగస్టు 19న సేకరించనున్నారు. ఆ రోజున ప్రతి ఇంటికి ఎన్యూమరేటర్ వచ్చి వివరాలు నమోదు చేసుకోనున్నారు. పది విభాగాలలో 80కిపైగా అంశాలలో వివరాలు సేకరించనున్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రజల ఆశలు నెరవేరాలంటే పక్కా లెక్కలు ఉండాలి. అర్హులు, లక్ష్యి త వర్గాలకు పథకాలు అందాల్సిన అవసరం ఉంది’’ అని కలెక్టర్ రొనాల్డ్ రాస్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఎలాంటి తప్పులకు అవకాశం ఇవ్వకుండా కుటుంబ సమాచారం సేకరించనున్నట్లు చెప్పారు. అప్పుడు ప్రభుత్వం సంక్షేమ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరికి సరైన రీతిలో అందడానికి ఆస్కారం ఉంటుందన్నారు. సర్వే రోజున ప్రజలు ఎలాంటి పనులు, ప్రయాణాలు పెట్టుకోవద్ధన్నారు. ఇంటి వద్దనే ఉండి ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్‌కు సహకరించాలన్నారు. అడిగిన సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎన్యూమరేటర్ వచ్చిన సమయంలో ఈ దిగువన ఉన్న ప్రతులు,సమాచారం అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సర్వేపై భయాందోళన వద్దు సర్వేపై ఎవ రూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ అన్నారు. ఎక్కడి వారు అక్కడ ఉన్నచోట సరైన పత్రాలు చూపి వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం ఈ సర్వే కాదు, కుటుంబ గణాంకాల నమోదు కోసమే సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. ఈనెల 19న ఎవరైతే ఇంటివద్ద ఉంటారో వారిపేర్లు నమోదు చేసుకుంటాం, గల్ఫ్, ఇతర దేశాలకు బతుకు దెరువు కోసం వెళ్లి వారి వివరాలను తర్వాత నమోదు చేస్తామన్నారు. పక్క జిల్లాలలో, రాష్ట్రాలలో చదువుతున్న విద్యార్థులు సొంత ఇళ్లకు రావాల్సిన అవసరం లేదన్నారు. వారు చదువుతున్న ధ్రువీకరణపత్రాలు కుటుంబీ కులు చూపెడితే సరిపోతుందన్నారు. జిల్లా వ్యా ప్తంగా 31 వేల సిబ్బంది ఉన్నారని, సర్వే కోసం 27,500 మంది సిబ్బంది పనిచేస్తున్నారన్నారు. 2,300 మంది ప్రైవేట్ టీచర్లు సర్వేలో పాల్గొంటున్నట్లు తెలిపారు. అనాథలు, సంచార జీవుల కోసం ప్రభుత్వం ఒక ఫార్మాట్‌ను తయారు చేసిందన్నారు. అత్యవసరంగా ఆస్పత్రులలో చికిత్స పొందితే, దానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రం అందిస్తే సరిపోతుందన్నారు. -
పర్యాటక కేంద్రంగా ‘రఘునాథ చెరువు’
ప్రగతినగర్ : జిల్లా కేంద్రంలోని రఘునాథ చెరువు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం ఉదయం ఆయన నగరంలోని పలు ప్రాంతాలను ముఖ్యమంత్రి అదనపు సంయుక్త కార్యదర్శి స్మిత సబర్వాల్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ముందుగా ఖిల్లా ప్రాంతంలోని రఘునాథ చెరువు, ఖిల్లా రామాలయాన్ని సందర్శించి అక్కడి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ.. ఈ ప్రాంతం తెలంగాణలో తలమానికమన్నారు. ఇక్కడ తెలంగాణ మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు స్వయంగా తానే ఖిల్లా రామాలయ గోడలపై ‘నా తెలంగాణ.. కోటి రతనా ల వీణ’ అని రాసి యావత్తు తెలంగాణ ప్రజలను జైలు నుంచే ఉత్తేజపరిచారన్నారు. అదే విధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ భక్తుడు భక్తరామదాసు స్వయంగా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడే సేద తీరిన ఆనవాళ్లు కూడా ఉన్నాయన్నారు. ఇంతటి ప్రఖ్యాతి గాంచిన ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రగా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు. అనంతరం అక్కడి నుంచి హమల్‌వాడి నుంచి దుబ్బ రోడ్డును పరిశీలించారు. రోడ్డు మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి గౌతంనగర్ వాటర్ ట్యాంకును పరిశీలించారు. తాగునీరు సక్రమంగా సరఫరా అవుతుందోలేదనని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సుభాష్‌నగర్ రైతుబజార్‌ను పరిశీలించి ఇంకా పెద్ద ఎత్తున కూరగాయలు విక్రయించేలా చర్యలు చేపట్టాలన్నారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్తో పాటు నగరమేయర్ సుజాత శ్రీశైలం,మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మంగతాయారు తదితరులున్నారు.