తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే-2014 జిల్లాలో అనుకున్న లక్ష్యాన్ని సాధించింది.
ప్రగతినగర్ :తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే-2014 జిల్లాలో అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల వరకు జరిగిన సర్వేలో 104 శాతం వరకు కుటుంబాల వివరాలు సేకరించారు. జిల్లాలో 6,95.205 కుటుంబాలను గుర్తించిన అధికారులు 30 వేలపై చిలుకు ఉద్యోగులు, సిబ్బందిని సమగ్ర స ర్వేకు నియమించారు.
ఉదయం ఆరు గంటల నుంచే ఎన్యూమరేటర్లు సర్వేకు ఉపక్రమించారు. సర్వే సందర్భంగా, ముంబాయి, భీవండి, జాల్నా, నాందేడ్ తదితర ప్రాంతాలకు వలస వెళ్లిన తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున స్వస్థలాలకు తరలిరావడంతో కుటుంబాల సంఖ్య 7,21,775 చేరింది. ఇంకా మున్సిపల్ పరిధిలో సుమారు 10 వేల కుటుంబాల వివరాలు సర్వే చేయాల్సి ఉంటుందన్నారు. దీంతో జిల్లాలో 7.30 లక్షల కుటుంబాల సమాచారాన్ని పూర్తి చేసినట్లు అవుతుందని కలెక్టర్ తెలిపారు.
స్టిక్కర్లు వేసినా
ముందుగా స్టిక్కర్లు వేసినప్పటికీ, అధికారులు సర్వే చేపట్టకపోవడంతో అక్కడక్కడ జనం ఇబ్బంది పడ్డారు. తాము తెలంగాణకు చెందినవారమైనా తమను ఎన్యూమరేటర్లు గుర్తించడం లేదని వారు జోనల్ అధికారులకు, రూట్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ వెంటనే 600 మంది మంది ఎన్యూమరేటర్లను రంగం లోకి దింపి రాత్రి పొద్దుపోయే వరకు సర్వే నిర్వహించారు. నగరంలోని పోచమ్మగల్లి, ఎల్లమ్మగుట్ట, చంద్రశేఖర్‌కాలనీ, గౌతంనగర్, సాయినగర్, ఇంద్రపుర్‌కాలనీ, నా గారం తదితర ప్రాంతాలలో ఎన్యూమరేటర్లు రాలేరని సుమారు వెయ్యి మంది బుధవారం ఉదయం కలెక్టరేట్‌ను ముట్టడించారు.
తాము ఏళ్ల తరబడి స్థిర నివాసం ఏ ర్పరుచుకొని ఉదయం నుంచి రాత్రి వరకు సర్వే కోసం వేచి చూసిన ఎన్యూమటర్లే రాలేదని, స్టిక్కర్లు వేసిన ఇళ్లకు కూడా రాలేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నగరం లో కొన్ని పొరపాట్లు జరిగిన మాటవాస్తవమేనని, రెండు నుంచి మూడు శాతం వరకు పొరపాట్లు జరిగాయని ఆయన చెప్పారు. సర్వేలో పేర్లు నమోదు చేయని కుటుం బాల వివరాలు ఆయా తహశీల్దార్ కార్యాలయాలు, ఆర్‌డీఓ కార్యాలయాలలో స్వీకరిస్తామని, ప్రజలు ఆందోళన చెందవల్సిన అవసరం లేదన్నారు.ప్రభుత్వం నుండి మా ర్గదర్శకాలు రాగానే వాటిని పూర్తి చేస్తామని వివరించారు. జిల్లాలోని ఇతర ప్రాంతాలలోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చాయి.