ప్రగతినగర్ : ప్రధానమంత్రి జన-ధన యో జన పథకం బహుళ ప్రయోజనకారి గా పనిచేస్తుందని, ప్రజలు సద్విని యోగం చేసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరి గిన కార్యక్రమంలో మంత్రి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి రెండు బ్యాంకు ఖా తాలు ప్రారంభించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన పథకం ద్వారా ప్రజలు, ముఖ్యంగా పేదలు వారి కష్టార్జితాన్ని పొదుపు చేసుకునే వీలు కలుగుతుందన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు నేరుగా వారి ఖాతాలలోకి జమ చే యడానికి వీలవుతుందన్నారు. తద్వాదా ప్రభుత్వం చెబుతున్నట్లుగా అవినీతిని పారద్రోలడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. బ్యాంకు ఖాతాలు మహిళల పేరున ఉంటే ఆ కుటుంబం ఆర్థికంగా ఎంతో ఎదుగుతుందని, డబ్బు దుర్వినియోగం కాకుండా ఉం టుందన్నారు. ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేసినప్పుడే దీని లక్ష్యం నెరవేరుతుందన్నారు. ఇటు బ్యాంకులు, అటు ప్రజలు, రైతులు బాగుపడాలంటే వారికి నాణ్యమైన రుణాలు అందించాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉందన్నారు.
తమ వంతుగా అన్ని సహాయ, సహకారాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రాస్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి జన -ధన యోజన పథకం ప్రజల హక్కు అని, దీనిని సద్వినియోగం చేసుకోవాలన్న భానవ ప్రజల్లో రావాలన్నారు. వచ్చే జనవరి 26 వరకు జిల్లాలో 100 శాతం ప్రజలకు ఖాతాలు ప్రారంభించాలని ఆయన బ్యాంకు అధికారులకు సూచిం చారు.
ఎంపీ కవిత మాట్లాడుతూ గతంలో బ్యాంకులు పేద ప్రజలకు, విద్యార్థులకు , బీడీ కార్మికులకు ఖాతాలు ప్రారంభించడానికి అయిష్టత వ్యక్తం చేసేవని, ప్రస్తుతం ఈ పథకంలో బీమా లింకు ఉన్నందున బ్యాంకర్లు ఉత్సాహం చూపిస్తున్నారన్నారు. ప్రజలకు రేషన్‌కార్డు, ఓటరు కార్డు, ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో బ్యాంకు ఖాతా కూడా అంతే ముఖ్యమన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాల లబ్ధిని అందించడానికి, అంతేగాక దేశం ఆర్థికంగా ఎదగడానికి పరోక్షంగా ఉపయోగపడుతుందన్నారు. అవినీతిని తగ్గించడానికి దోహదపడుతుందన్నారు.
కార్యక్రమంలో సంస్కృతి అనే బాలిక నృత్య ప్ర దర్శన ప్రేక్షకులను అకట్టుకుంది. సభలో ప్రధాన మం త్రి మోడీ ప్రత్యక్ష ప్రసారాన్ని స్క్రీను ఏర్పాటు చేసి ప్రదర్శించారు. అనంతరం లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల పాస్‌బుక్కులను పంపిణీ చేశారు. జిల్లా పరి షత్ చైర్‌పర్సన్ రాజు, నగర పాలక సంస్థ మేయర్ సుజాత, బోధన్ శాసన సభ్యులు షకీల్, డీసీఎంఎస్ చైర్మన్ ముజీబుద్దీన్, ఎల్‌డీఎం రామకృష్ణారావు, పలు బ్యాంకుల అధికారులు, జిల్లా అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
మేలు కలిగించే జన-ధన పథకం
Published Fri, Aug 29 2014 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 12:35 PM
Advertisement