ప్రగతినగర్: నిత్యం కలెక్టరేట్‌లో, ప్రాంగణంలో ఏదో ఒక చోరీ, లేదా ఒక సమస్య ఉత్పన్నమవడం సర్వసాధారణమైంది. కనీసం తమ సమస్యలను చెప్పుకుందామని అక్కడి పోలీసులను ఆశ్రయించినా బాధితులకు న్యాయం జరగడంలేదు. మొత్తం మీద కలెక్టరేట్ ప్రాంతంలో ఉద్యోగులు అభద్రతా భావంతో మెలుగుతున్నారు. గంటకోసారి టీ తాగుదామనే వంకతో బయటకు వచ్చి బైక్‌లను చూసుకుంటున్నారు. హమ్మయ్యా..! బైక్ ఉందిరా బాబు అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు.
అయితే బైక్‌లే కాకుండా కంప్యూటర్‌లు కూడా మాయమైపోతున్నాయి.రాత్రి కల్లా కనబడ్డ కంప్యూట ర్ పొద్దున్నకల్లా మాయమైపోతోంది. దీంతో ఉద్యోగులు కలెక్టరేట్‌లో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కలెక్టరేట్‌లోని అన్ని శాఖల్లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేస్తే, ఈ బాధ ఉండదని, దొంగిలించిన వారిని పోలీసులు పట్టుకోవచ్చని పలువురు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.
మూత్రశాలలు లేక ఇబ్బందులు
కలెక్టరేట్‌లో మూత్రశాలలు లేక ఉద్యోగులతో పాటు సందర్శకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచినీటి వసతి కూడా లేదు. హౌసింగ్ కార్పొరేషన్ వారు ఏర్పాటు చేసిన ఫ్రిజ్ చెడిపోవడంతో సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కలెక్టరేట్‌లోని పలు కార్యాలయ గోడల్లో నుంచి మొక్కలు మొలవడంతో గోడలన్నీ పగుళ్లు ఏర్పడి బీటలు వారాయి.
హౌసింగ్ కార్పొరేషన్‌లో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేసే వెంకటేష్ ఆదరబాదరాగా కలెక్టరేట్‌కు బైక్‌పై వచ్చాడు. వచ్చిరాగానే అక్షరభవన్‌లో ఉన్నా హౌసింగ్ కార్యాలయంలో తన పైఅధికారులను కలవడానికి వెళ్లాడు. వారితో మాట్లాడి కిందికి వచ్చే చూసుకునే సరికి తాను మూడునెలల క్రితం జీతం పొగేసి కొనుకున్న కొత్త గ్లామర్ బైక్ కనబడలేదు.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేసే ఆనంద్ కలెక్టరేట్‌కు వచ్చి ప్రజావాణికి హాజరయ్యాడు. మధ్యాహ్న భోజనానికి ఇంటికి వెళదామనుకొని బైక్ దగ్గరికి వచ్చేసరికి బైక్ మాయమైంది.
ఆధార్ సీడింగ్ చేయడానికి ఓ ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్ స్థానిక రెవెన్యూ భవన్ ముందు బైక్ పెట్టి బంగ్లాపైకి వెళ్ళాడు. రోజు మాదిరిగానేపని ముగిసి న అనంతరం కిందికి వచ్చి చూడగా తన బైక్ కనబడలేదు.
తమ సమస్యలను చెప్పుకోవడానికి ఇటీవల కలెక్టరేట్‌కు వచ్చిన ఓ గ్రామం నుంచి వచ్చిన వారి బైక్ చోరీకి గురైంది.
కలెక్టరేట్‌లో భద్రత కరువు!
Published Thu, Sep 25 2014 2:39 AM | Last Updated on Sat, Sep 2 2017 1:54 PM
Advertisement
Advertisement