ప్రగతినగర్ : తెలంగాణ ప్రభుత్వం మంగళవారం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే జిల్లాలో విజయవంతంగా జరిగిందని కలెక్టర్ రొనాల్డ్‌రాస్ తెలిపారు. ప్రగతిభవన్‌లో ఆయన రాత్రి విలేకరులతో మాట్లాడా రు. బంగారు తెలంగాణకు బాటలు వేసేందుకు, అర్హులందరికీ ప్రభుత్వ, సంక్షేమ పథకాలను అందించేందుకు చేపట్టిన సర్వే ఊరురా పండుగలా సాగిందన్నారు. గ్రామాలు, మండలాలలో సాయంత్రం ఆరు గం టల వరకు వంద శాతం సర్వే పూర్తి చేశామన్నారు. ఆర్మూర్, బోధన్, కామారెడ్డి మున్సి పాలిటీలలో ఏడు గంటల వరకు సర్వే పూర్తి అయిందన్నారు.
నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో మాత్రం అక్కడక్కడా పొరపాట్లు జరిగాయని, వాటిని సరిదిద్దామని తెలి పారు. కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్లు ఉన్నందున, కుటుంబాల సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నం దున అక్కడక్కడ స్టిక్కర్ల కోసం ప్రజలు అవస్థలు పడ్డారన్నారు. మధ్యాహ్నం ఈ సమస్యను గుర్తించి తిరిగి 600 మంది ఎన్యూమరేటర్లను ఆయా డివిజన్‌ల పరి ధికి పంపించామన్నారు.
మహారాష్ట్ర, బీవండీ, పూణె, ముంబాయి, ఇతర ప్రాంతాల నుండి ప్రజలు తరలి రావడంతో ప్రీ స్టిక్కర్ల కొరత ఏర్పడిందన్నారు. ఇంటి యజమానులు కొందరు కేవలం ఒక్క స్టిక్కరు మాత్ర మే వేయించుకున్నారని, అద్దెకు ఉన్న వారి వివరాల ను దాచి ఉంచారని పేర్కొన్నారు. జిల్లాలో 6,95,205 కుటుంబాలు ఉండగా, ఇతర ప్రాంతాల నుండి ప్రజలు తరలి రావడంతో మంగళవారం ఉదయానికి అవి7.10 లక్షలకు చేరుకున్నాయన్నారు.
సర్వే పూర్తి డాటాను 13 ప్రాంతాలలో ఆన్‌లైన్ ద్వారా సీడింగ్ చేయనున్నామన్నారు. వీటి కోసం హై స్పీడ్ సాఫ్ట్ వేర్‌తో కూడిన రెండు వేల కంప్యూటర్‌లను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాకు సంబంధించిన పూర్తి డాటాను ఈ నెల 31లోగా పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ తెలిపారు. సర్వేను జిల్లా ప్రత్యేక అధికారి జనార్దన్‌రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారన్నాని కలెక్టర్ వివరించారు.
సర్వే సక్సెస్
Published Wed, Aug 20 2014 3:07 AM | Last Updated on Sat, Sep 2 2017 12:07 PM
Advertisement