ఊరించి.. ఉసూరుమనిపించి! | problems of enumarators | Sakshi
Sakshi News home page

ఊరించి.. ఉసూరుమనిపించి!

Published Sun, Dec 4 2016 2:37 AM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM

ఊరించి.. ఉసూరుమనిపించి!

ఊరించి.. ఉసూరుమనిపించి!

జిల్లాలో పూర్తి కావచ్చిన పల్స్ సర్వే
సిబ్బందికి చెల్లించాల్సిన గౌరవ వేతనంలో జాప్యం
ఎన్యూమరేటర్ల ఎదురుచూపు

 
 జనాలకు నిద్రపట్టినివ్వలేదు.. సిబ్బందిని పడుకోనివ్వలేదు.. సామాన్యుల్లో ఒకటే టెన్షన్. స్మార్ట్ సర్వేలో నమోదు అరుుతే చిక్కులు తప్పవని.. దాని తీరూ అలాగే ఉంది. ప్రస్తుతానికి ఆ విషయం పక్కనపెడితే రేరుుంబవళ్లు సర్వే పేరుతో ఒళ్లు గుల్ల చేసుకొని.. పని పూర్తి చేసిన సిబ్బందికి ప్రభుత్వ ఇప్పుడు చుక్కలు చూపిస్తోంది. చేసిన శ్రమకు గౌరవ వేతనం ఇంకా ఇవ్వకుండా మనోవేదనకు గురి చేస్తోంది.  
  - ఒంగోలు టౌన్
 
‘ప్రస్తుతం జిల్లాలో స్మార్ట్ పల్స్ సర్వే చివరి దశకు చేరుకొంది. ఆరునెలలపాటు ఈ సర్వే ప్రక్రియ కొనసాగింది. అరుుతే కష్టపడిన ఎన్యూమరేటర్లకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్ ఊసే ఎత్తడం లేదు. దీని కోసం వారంతా ఎదురు చూస్తున్నారు’

 జేబులో డబ్బుతో..
 సర్వే చేసిన సమయంలో సిబ్బంది కష్టాలు అన్నీ.. ఇన్నీ కావు. సిగ్నల్స్ దొరక్కపోవడంతో పాటు జేబులో డబ్బు పెట్టి మరీ నెట్ బిల్లు చెల్లించి సర్వే పూర్తి చేశారు. అరుుతే ఈ నగదు కూడా తమ ఖాతాలో జమ అవుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు.  
 జిల్లాలో ఈ ఏడాది జూన్ నుంచి సర్వే ప్రారంభం కాగా.. 8,60,463 ఇళ్లను సందర్శించి 33,59,220 మంది వివరాలు నమోదు చేయాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. కాగా దీనికోసం ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నవారిలో 2251 మంది ఎన్యూమరేటర్లను, వారి పనితీరును పరిశీలిస్తూ సలహాలు సూచనలు అందించేందుకు 295 మంది సూపర్‌వైజర్లను నియమించారు.  

 ఒక్క పేరుకు రూ. 4  
 ఒక్కో ఎన్యూమరేటర్ ఒక పేరు సర్వేలో పొందుపరిస్తే నాలుగు రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎన్యూమరేటర్ చేసిన సర్వేలో దానిలో పదిశాతం సూపర్‌వైజర్‌కు ఇవ్వనున్నట్లు చెప్పింది. దీంతో కొన్ని శాఖలకు చెందినవారు తమ విధులను పక్కనపెట్టి పూర్తి స్థారుులో సర్వేలో పాల్గొన్నారు. చాలా సందర్భాల్లో కుటుంబ సభ్యులంతా అందుబాటులో లేకపోవడంతో ఒక్కో ఇంటికి నాలుగైదుసార్లు తిరిగిన సందర్భాలున్నారుు. పైగా కొంతమంది అథంటికేషన్(థంబ్, ఐరిష్) వంటివి లేకపోవడంతో మరోమారు వివరాలను సేకరించాల్సి వచ్చింది.
 
రూ 3.47కోట్లకు రూ. 1.70 కోట్లే!
జిల్లాలో స్మార్ట్ పల్స్ సర్వేకు సంబంధించి 3.47 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించింది. సర్వేకు సంబంధించి ఎన్యూమరేటర్ల రెమ్యునరేషన్ నుంచి మెటీరియల్ తదితర వాటికి లెక్కలు వేసి నివేదించారు. అరుుతే ప్రభుత్వం కోటి 70లక్షల రూపాయలను మాత్రమే విడుదల చేసింది. ప్రస్తుతం వచ్చిన ఈ మొత్తాన్ని ఏవిధంగా పంపిణీ చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.  దీనికితోడు సర్వే ప్రారంభించిన సమయంలో ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లుగా నియమించిన వారిలో కొంతమంది శాఖాపరమైన విధి నిర్వహణకు సంబంధించి ఒత్తిళ్లు ఉండటంతో స్మార్ట్ పల్స్ సర్వే నుంచి తప్పుకున్నారు. దాంతో వారి స్థానాల్లో కొత్తవారిని నియమించారు. సర్వే చేస్తూ మధ్యలో మానివేసిన వారి వివరాలు, ప్రస్తుతం సర్వే చేస్తున్న వారి వివరాలను సేకరిస్తూ వారి ఖాతాల్లో రెమ్యునరేషన్ వేసే విషయంలో గందరగోళం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement