The survey
-
భారత్ మార్గం సరైనదే!
సర్వేలో వెల్లడైన దేశ ప్రజల మనోగతం న్యూఢిల్లీ: భారత్ సరైన దిశలోనే వెళ్తోందని దేశ ప్రజల్లో అత్యధికం విశ్వసిస్తున్నారు. చైనా, సౌదీ అరేబియా దేశాలు కూడా సరైన గమ్యం దిశగానే వెళ్తున్నాయని అక్కడి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ‘ప్రపంచాన్ని భయపెడుతున్నదేమిటి?’ అన్న ప్రశ్నతో మార్కెట్ పరిశోధన సంస్థ ఇప్సోస్ 26 దేశాల్లో నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో ఈ విషయం వెల్లడయింది. ప్రపంచ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న సమస్యల్లో నిరుద్యోగం, ఆర్థిక/రాజకీయ అవినీతి, పేదరికం/సామాజిక అసమానతలు ముఖ్యమైనవిగా ఈ సర్వేలో తేలింది. అవినీతి, నిరుద్యోగం, నేరాలు భారతీయులను తీవ్రంగా కలచివేస్తున్నాయి. నైతిక విలువల పతనం, పర్యావరణం, నిరుద్యోగంపై చైనీయులు.. నిరుద్యోగం, ఉగ్రవాదం, పన్నుల గురించి సౌదీ అరేబియా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ సర్వే ఫలితాల ప్రకారం.. తమ దేశాలు గాడిలోనే నడుస్తున్నాయని చైనా, భారత్, సౌదీ ప్రజలు అత్యంత సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారత్‌లో ఇలా విశ్వసించేవారు 74 శాతం మంది, చైనాలో 87 శాతం మంది, సౌదీలో 71 శాతం మంది ఉన్నారు. అయితే అమెరికా, బ్రిటన్, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా పౌరులు తమ దేశాలు గాడి తప్పాయని అభిప్రాయపడ్డారు. -
సర్వే నాలుగు రోజుల్లో పూర్తి కావాలి
అనంతపురం అర్బన్ : ‘ప్రజాసాధికార సర్వేలో మీ పనితీరు సంతృప్తిగా లేదు. సర్వే ఇంత జాప్యం చేస్తే ఎలా..? నాలుగు రోజుల్లో వంద శాతం సర్వే పూర్తవ్వాలి. లేకపోతే చర్యలు తప్పవు’ అని మున్సిపల్ అధికారులను, సిబ్బందిని జాయింట్ కలెక్టర్ బి.లక్మీకాంతం హెచ్చరించారు. సోమవారం ఆయన డ్వామా హాల్లో ప్రజాసాధికార సర్వేపై ఆర్డీఓ మలోలాతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, పట్టణ జనాభా 2.73 లక్షలు ఉంటుందని, ఇప్పటి వరకు ఎంత మేర సర్వే పూర్తి చేశారని ప్రశ్నించారు. ఇందుకు అదనపు కమిషనర్ పగడాల కృష్ణమూర్తి మాట్లాడుతూ 2.04 లక్షలు సర్వే చేశామని తెలిపారు. మిగిలిన జనాభాలో శాశ్వతంగా వలసలు వెళ్లిన వారి, మృతుల సంఖ్య వివరాలను మంగళవారం సాయంత్రంలోగా ఇవ్వాలని జేసీ ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ జ్యోతిలక్షి్మ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఊరించి.. ఉసూరుమనిపించి!
► జిల్లాలో పూర్తి కావచ్చిన పల్స్ సర్వే ► సిబ్బందికి చెల్లించాల్సిన గౌరవ వేతనంలో జాప్యం ► ఎన్యూమరేటర్ల ఎదురుచూపు జనాలకు నిద్రపట్టినివ్వలేదు.. సిబ్బందిని పడుకోనివ్వలేదు.. సామాన్యుల్లో ఒకటే టెన్షన్. స్మార్ట్ సర్వేలో నమోదు అరుుతే చిక్కులు తప్పవని.. దాని తీరూ అలాగే ఉంది. ప్రస్తుతానికి ఆ విషయం పక్కనపెడితే రేరుుంబవళ్లు సర్వే పేరుతో ఒళ్లు గుల్ల చేసుకొని.. పని పూర్తి చేసిన సిబ్బందికి ప్రభుత్వ ఇప్పుడు చుక్కలు చూపిస్తోంది. చేసిన శ్రమకు గౌరవ వేతనం ఇంకా ఇవ్వకుండా మనోవేదనకు గురి చేస్తోంది. - ఒంగోలు టౌన్ ‘ప్రస్తుతం జిల్లాలో స్మార్ట్ పల్స్ సర్వే చివరి దశకు చేరుకొంది. ఆరునెలలపాటు ఈ సర్వే ప్రక్రియ కొనసాగింది. అరుుతే కష్టపడిన ఎన్యూమరేటర్లకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్ ఊసే ఎత్తడం లేదు. దీని కోసం వారంతా ఎదురు చూస్తున్నారు’ జేబులో డబ్బుతో.. సర్వే చేసిన సమయంలో సిబ్బంది కష్టాలు అన్నీ.. ఇన్నీ కావు. సిగ్నల్స్ దొరక్కపోవడంతో పాటు జేబులో డబ్బు పెట్టి మరీ నెట్ బిల్లు చెల్లించి సర్వే పూర్తి చేశారు. అరుుతే ఈ నగదు కూడా తమ ఖాతాలో జమ అవుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది జూన్ నుంచి సర్వే ప్రారంభం కాగా.. 8,60,463 ఇళ్లను సందర్శించి 33,59,220 మంది వివరాలు నమోదు చేయాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. కాగా దీనికోసం ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నవారిలో 2251 మంది ఎన్యూమరేటర్లను, వారి పనితీరును పరిశీలిస్తూ సలహాలు సూచనలు అందించేందుకు 295 మంది సూపర్వైజర్లను నియమించారు. ఒక్క పేరుకు రూ. 4 ఒక్కో ఎన్యూమరేటర్ ఒక పేరు సర్వేలో పొందుపరిస్తే నాలుగు రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎన్యూమరేటర్ చేసిన సర్వేలో దానిలో పదిశాతం సూపర్వైజర్కు ఇవ్వనున్నట్లు చెప్పింది. దీంతో కొన్ని శాఖలకు చెందినవారు తమ విధులను పక్కనపెట్టి పూర్తి స్థారుులో సర్వేలో పాల్గొన్నారు. చాలా సందర్భాల్లో కుటుంబ సభ్యులంతా అందుబాటులో లేకపోవడంతో ఒక్కో ఇంటికి నాలుగైదుసార్లు తిరిగిన సందర్భాలున్నారుు. పైగా కొంతమంది అథంటికేషన్(థంబ్, ఐరిష్) వంటివి లేకపోవడంతో మరోమారు వివరాలను సేకరించాల్సి వచ్చింది. రూ 3.47కోట్లకు రూ. 1.70 కోట్లే! జిల్లాలో స్మార్ట్ పల్స్ సర్వేకు సంబంధించి 3.47 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించింది. సర్వేకు సంబంధించి ఎన్యూమరేటర్ల రెమ్యునరేషన్ నుంచి మెటీరియల్ తదితర వాటికి లెక్కలు వేసి నివేదించారు. అరుుతే ప్రభుత్వం కోటి 70లక్షల రూపాయలను మాత్రమే విడుదల చేసింది. ప్రస్తుతం వచ్చిన ఈ మొత్తాన్ని ఏవిధంగా పంపిణీ చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీనికితోడు సర్వే ప్రారంభించిన సమయంలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లుగా నియమించిన వారిలో కొంతమంది శాఖాపరమైన విధి నిర్వహణకు సంబంధించి ఒత్తిళ్లు ఉండటంతో స్మార్ట్ పల్స్ సర్వే నుంచి తప్పుకున్నారు. దాంతో వారి స్థానాల్లో కొత్తవారిని నియమించారు. సర్వే చేస్తూ మధ్యలో మానివేసిన వారి వివరాలు, ప్రస్తుతం సర్వే చేస్తున్న వారి వివరాలను సేకరిస్తూ వారి ఖాతాల్లో రెమ్యునరేషన్ వేసే విషయంలో గందరగోళం నెలకొంది. -
సర్వేకు అందని ప్రజా సహకారం
► వెనుకడుగు వేసిన ప్రభుత్వం ► జిల్లాలో ఇప్పటికి 81.09 శాతమే నమోదు ► ఊపిరి పీల్చుకున్నఅదికారులు ► వందశాతం పూర్తి ఎప్పటికో? విజయనగరం గంటస్తంభం: ప్రభుత్వం ఎంత తొందర పెట్టినా.. అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చినా ప్రజాసాధికార సర్వే జిల్లాలో శతశాతం పూర్తి కాలేదు. పొట్టకూటి కోసం జనం వలస బాట పట్టడంతో ఇప్పటివరకు 81.09 శాతం మాత్రమే పూర్తరుుంది. నిర్దేశిత గడువు పూర్తి కావడంతో ప్రస్తుతం ఇంటింటి సర్వేను అధికారులు తాత్కాలికంగా ఆపారు. ప్రజల నుంచి సహకారం లేకపోవడం, అధికార వర్గాల నుంచి లోలోపల వ్యతిరేకత వ్యక్తం కావడంతో ప్రభుత్వం కూడా దీనిపై ఒత్తిడి తగ్గించింది. దీంతో శతశాతం పూర్తి కావడానికి మరికొన్ని నెలలు పట్టే అవకాశాలు కనిపిస్తున్నారుు. ప్రజల పూర్తి వివరాలు సేకరించడానికి ప్రభుత్వం ప్రజాసాధికార సర్వే చేపట్టిన విషయం విదితమే. ఇందులోభాగంగా జిల్లాలో జులై 8వతేదీన ఈ సర్వే ప్రారంభమైంది. ఆరంభంలో ఆ నెలాఖరుకు పూర్తి కావాలని ఆదేశించిన ప్రభుత్వం తర్వాత అనేక పర్యాయాలు వారుుదాలు వేసుకుంటూ వచ్చింది. చివరిగా గత నెలలో మాత్రం అధికారులపై ఒత్తిడి పెంచింది. నవంబరు నెలాఖరుకు పూర్తి కావాలని ఆదేశించింది. ఈమేరకు మండలస్థారుు అధికారులు, ఎన్యుమరేటర్లుపై జిల్లా అధికారులు తీవ్ర ఒత్తిడి పెంచారు. వలస వెళ్లిన వారినిసైతం తెప్పించి సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పరిస్థితుల్లో అధికారులు కూడా సర్వే చేయడం లేదు. మరో వైపు నగదు రహిత లావాదేవీలపై ప్రచారం కోసం ప్రభుత్వం అధికారులను పురమారుుంచడంతో సర్వే పనిని ప్రస్తుతం వారు చేయడం లేదు. అరుుతే తదుపరి కూడా ప్రత్యేకించి సర్వే ఉండదని అధికారులు చెబుతున్నారు. నిరంతర పక్రియ అరుునా వచ్చిన వారికి మాత్రమే నమోదు చేసే అవకాశముందంటున్నారు. సెంట్రలైజ్ చేసి ఏదో ఒక కేంద్రంలో నమోదు చేస్తారని ఒక అధికారి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసినట్లు సమాచారం. మరోవైపు అమరావతిలో గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చిన విషయం విదితమే. ప్రజలు, అధికారుల్లో వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో సర్వేపై వెనుకడుగు వేసి తదుపరి గడువు తేదీలు చెప్పకుండా వదిలేసినట్లు కొందరు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యం లో శతశాతం సర్వే ఎప్పటికి పూర్తి కానుందోనన్న ప్రశ్న ఇంకా అలాగే మిగిలిఉంది. -
పండుటాకులకు ఎన్ని కష్టాలో..
ఈ చిత్రంలో కనిస్తున్న వ్యక్తి పేరు మహ్మద్ అలీ. మచిలీపట్నంలోని 29వ వార్డు శివారు నూరినగర్ నివాసి. ప్రమాదవశాత్తు ఒక కాలు కోల్పోయాడు. ప్రస్తుతం చంక కర్రల సాయంతోనే నడవగలడు. ఎక్కడికైనా వెళ్లాలంటే మూడు చక్రాల సైకిలే ఆధారం. 2013 నవంబరు నుంచి వస్తున్న వికలాంగుల పింఛనును ఇటీవలి సర్వేలో నిలిపివేశారు. అప్పటినుంచీ అధికారుల చుట్టూ తిరుగుతున్నా భరోసా ఇచ్చే నాథుడే కనిపించడం లేదు. ఈమె పేరు వల్లూరి వెంకటరత్నమ్మ. బందరు మండలం శ్రీనివాసనగర్ నివాసి. వయస్సు 90 సంవత్సరాలు. గత ఏడేళ్లుగా వృద్ధాప్య పింఛను తీసుకుంటోంది. గత నెల పింఛన్ల జాబితాలో ఆమె పేరు తొలగించారు. ఈ వయసులో తనకు పింఛను తొలగించడంపై స్థానిక పెద్దల వద్ద గోడు వెళ్లబోసుకుంది. వాళ్లు వస్తుందని చెప్పడమే తప్ప ఇప్పటివరకు ఇవ్వలేదని ఆమె వాపోతోంది. ఈమె పేరు అమ్మనాతి బేగం. మచిలీపట్నం 29వ వార్డు నివాసి. గత ఏడేళ్లుగా వితంతు పింఛను తీసుకుంటోంది. ఇటీవలి సర్వేలో ఆమె పేరును పింఛృు జాబితా నుంచి తొలగించారు. అనారోగ్యంతో బాధపడుతున్న తనకు పింఛను సొమ్ము మందులకు ఉపయోగపడేదని, దానిని నిలిపివేయడంతో ఇప్పుడు ఇక్కట్ల పాలవుతున్నానని కన్నీటి పర్యంతమవుతోంది. అధికారులకు తన గోడు చెప్పుకొన్నా పింఛను సొమ్ము ఇంకా చేతికందలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ...ఇలాపింఛన్లు రద్దయి.. ఆసరా కోల్పోయి.. దిక్కుతోచని స్థితిలో ఉన్నవారు జిల్లా వ్యాప్తంగా వేలాదిమంది ఉన్నారు. అందరూ తమకు నిలిపివేసిన పింఛన్లు ఇప్పించాలని వేడుకుంటున్నారు. పింఛన్ల కోసం కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. పండుటాకులకు కష్టం వచ్చి పడింది. ముదిమి వయసులో ఆసరాగా ఉన్న పింఛను ఒక్కసారిగా రద్దవడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో, ఎవరిని సంప్రదించాలో తెలియక ఇక్కట్ల పాలవుతున్నారు. పింఛను సొమ్ము ఐదు రెట్లు పెంచి ఇస్తున్నామని ఆర్భాటంగా ప్రకటించిన పాలకులు అన్ని అర్హతలూ ఉన్న తమకు వస్తున్న సొమ్ము కూడా రద్దు చేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అధికారులను, స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి తిరిగి పింఛను ఇప్పించాలని కోరుతున్నా ఇదిగో అదిగో అనడమే తప్ప స్పష్టమైన హామీ ఇవ్వడం లేదు. పింఛన్ల సర్వే పేరుతో గ్రామ, వార్డు కమిటీల సభ్యులు తీసుకున్న నిర్ణయాలు పలువురికి చేటు తెచ్చి పెట్టాయి. నెలనెలా వచ్చే పింఛను రాకుండా చేశాయి. జిల్లాలో 3.13 లక్షల మందికి వివిధ రకాల పింఛన్లు ఆగస్టు వరకు అందాయి. సెప్టెంబరులో చేపట్టిన సర్వే కారణంగా ఈ సంఖ్యను 2.77 లక్షలకు కుదించారు. 16 వేల మందిని అనర్హులుగా గుర్తించి వారి పింఛన్లు రద్దు చేశారు. మిగిలిన 34 వేల మంది వివరాలు సక్రమంగా లేవని, ఆధార్ నంబరు సమర్పించలేదని పింఛను నిలిపివేశారు. సెప్టెంబరు నెల పింఛను సొమ్మును నవంబరు 12 వరకు అందజేశారు. అక్టోబరు నెలకు సంబంధించి పింఛన్ల జాబితాలను తయారు చేశామని డీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి పింఛన్లు అందజేయాలని ఇంకా ఉత్తర్వులు రాలేదని పేర్కొంటున్నారు. అర్హత ఉండి పింఛను రద్దయిన వారి పూర్తిస్థాయి వివరాలు తమ వద్ద లేవని వారు స్పష్టం చేస్తున్నారు. అన్ని అర్హతలూ ఉండి పింఛను రద్దయిన వారు మున్సిపాలిటీ, మండల అధికారులను సంప్రదించాలని, వారు విచారణ చేసి పింఛను మంజూరు చేయవచ్చని పేర్కొంటున్నారు. ఇటీవల జరిగిన జన్మభూమిలో నూతనంగా పింఛన్లు మంజూరు చేయాలని కోరుతూ 42 వేల 220 దరఖాస్తులు వచ్చాయి. వీటిన్నింటినీ ఆన్లైన్లో పొందుపరిచి, అర్హులను నిర్ధారించి వారికి పింఛను మంజూరుకు ఎంత సమయం పడుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. - మచిలీపట్నం -
తండ్రులు సో హ్యాపీ !
పెళ్లయ్యి పిల్లలు ఉన్న మగాళ్లు బాగా హ్యాపీగా ఉంటున్నారట. ఇది కొన్నివేల మందిపై జరిపిన సర్వే అనంతరం వెలువడిన ఫలితం. ఊరికే ఆషామాషీగా చెప్పిందేం కాదు.పెళ్లి అయితే మగాడు స్వేచ్ఛ కోల్పోతాడేమో (ఇది సెటైర్‌గా మాత్రమే ప్రచారమని తెలుసు కదా) గాని సంతోషాన్ని పొందుతాడని నిరూపితమైంది. మీకు పెళ్లయ్యిందా? ఓకే! ఓ సారి మీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి.. అరె... మీకు పిల్లలున్నారా? ‘‘ఫేస్ చూసి చెప్పడానికి నువ్వు ఏమైనా జాతకాలు చెబుతావా?’’ అని అడగబోతున్నారా... అసలు విషయం వేరే ఉంది. పెళ్లయ్యి పిల్లలు ఉన్న మగాళ్లు బాగా హ్యాపీగా ఉంటున్నారట. ఇది కొన్నివేల మందిపై జరిపిన సర్వే అనంతరం వెలువడిన ఫలితం.ఊరికే ఆషామాషీగా చెప్పిందేం కాదు. ఆస్ట్రేలియన్ యూనిటీ అనే సంస్థ వెల్బీయింగ్ ఇండెక్స్పైన ఓ పెద్ద అధ్యయనం చేసింది. ఆస్ట్రేలియాలోని అతిపెద్ద నగరమైన మెల్బోర్న్లో ఉన్న డీకిన్ విశ్వవిద్యాయలంలో సెంటర్ ఫర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ విభాగంతో కలిసి నిర్వహించిన ఈ అధ్యయనంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఈ పరిశీలనలో పురుషులు (పెళ్లి అయిన వారు, కాని వారు), స్త్రీలు (పెళ్లయిన వారు, కాని వారు) ఇద్దరూ పాల్గొన్నారు. వీరందరిపై జరిపిన అధ్యయనం/సర్వేలో ఎవరెంత హ్యాపీగా ఉన్నారు అని పరిశీలిస్తే పెళ్లయ్యి పిల్లలున్న అంటే తండ్రులైన వారు మిగతా వారికంటే సంతోషంగా ఉన్నట్టు తేలింది.ఇందులోనూ ఇద్దరు పిల్లలున్న వారికంటే ముగ్గురు లేదా నలుగురున్న పిల్లలు ఎక్కువగా ఆనందంగా ఉండటం విశేషం. అంటే పెళ్లి అయితే మగాడు స్వేచ్ఛ కోల్పోతాడేమో (ఇది సెటైర్‌గా మాత్రమే ప్రచారమని తెలుసు కదా) గాని సంతోషాన్ని పొందుతాడని నిరూపితమైంది. అయితే, ఇందులోనూ మరో కోణం బయటపడింది. సాధారణంగా మాతృత్వం గురించి చాలా గొప్పగా భావిస్తాం కదా. ఆ లెక్కన మాతృత్వం పొందిన ప్రతి స్త్రీ మిగతా అన్ని వర్గాల కంటే ఎక్కువ ఆనందంగా ఉండాలి. ఇది కొంతవరకు మాత్రమే నిజమేమో అని పరిశీలకులు అనుమానపడుతున్నారు. మాతృత్వం పొందిన తొలినాళ్లలో ఆ ఆనందం చాలా ఎక్కువగా ఉండొచ్చు గాని ఈ సర్వే ప్రకారం పెళ్లి కాని స్త్రీలు, పెళ్లయి పిల్లలున్న స్త్రీల సంతోష స్థాయిల్లో మాత్రం పెద్దగా తేడా లేదు. పిల్లలున్న స్త్రీలు పిల్లలు లేని వారి కంటే భిన్నమైన అభిప్రాయాలను, సంతోషాలను వెలిబుచ్చలేదంటే దీన్నిబట్టి ఓ విషయం అర్థం చేసుకోవాలి. బయట పురుషుడి గురించి జరుగుతున్నవన్నీ ప్రచారాలే! నిజానికి పెళ్లి ద్వారా పురుషుడు మరింత మంచి జీవనాన్ని (కనీసం ఆనందం విషయంలో) పొందుతాడని భావించొచ్చు అన్నమాట. ఇంకేం... ఈ పెళ్లీ గిళ్లీ జాంతానై, ఆ పెళ్లాం పిల్లల లంపటం వద్దప్పా మాకు అనుకుని భయపడే పురుష పుంగవులు పునరాలోచించుకోవడం మంచిదని దీన్ని బట్టి అర్థమవుతోంది కదా! -
ఆటో, లారీ ఢీ.. ఏడుగురి దుర్మరణం
మరో ఆరుగురికి గాయాలు మహబూబ్‌నగర్ జిల్లాలో ఘటన సర్వే కోసం వచ్చి వెళ్తుండగా ఘోరం మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా మంగళవారం జరిగిన సమగ్ర సర్వేలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు వచ్చిన వారు కావటం గమనార్హం. వివరాలివీ...జిల్లాలోని మక్తల్, మాగనూరు మండలాలకు చెందిన కొందరు ముంబై, హైదరాబాద్‌లో వలస జీవనం సాగిస్తున్నారు. సమగ్ర సర్వేలో వివరాలు నమోదు చేసుకునేందుకు వారంతా స్వగ్రామాలకు చేరుకున్నారు. తిరిగి వెళ్లేందుకు బుధవారం 13 మంది ఆటోలో మక్తల్‌కు బయలుదేరారు. ఉదయం 11గంటలకు వారి ఆటోను మాగనూరు సమీపంలో రాయిచూర్‌కు వెళుతున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలోని ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చనిపోయారు. మృతుల్లో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. క్షతగాత్రులైన ఆరుగురిని ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదంపై సీఎం కె.చంద్రశేఖర్‌రావు సంతాపాన్ని ప్రకటించారు. మరో ప్రమాదంలో.. తమిళ డెరైక్టర్‌కు గాయాలు ఏపీలోని ప్రకాశం జిల్లా మద్దిపాడు-కొష్టాలు మధ్య జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో తమిళ సినిమా డెరైక్టర్ ముకళంజియం గాయపడగా.. ఆయనతోపాటు కారులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి మృతి చెందాడు. ముకళంజియం తన స్నేహితుని వివాహానికి రాజమండ్రి వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. -
సొంత ఇల్లు ఉన్నా టెంటు నీడన..
నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన సంగని సాయిబాబా ఉపాధి కోసం కొద్ది రోజుల క్రితం అనంతపురం జిల్లాకు కుటుంబం సహా వెళ్లారు. ఇక్కడ ఉన్న ఆయన నివాస గృహాన్ని ఇతరులకు అద్దెకు ఇచ్చారు. సర్వే కోసం సోమవారం స్వగ్రామానికి వచ్చారు. అద్దెకు ఉన్నవారు ఇంటికి తాళం వేసుకుని తమ ప్రాంతానికి సర్వే కోసం వెళ్లిపోయారు. దీంతో సాయిబాబా ఇంటి ఎదుట ఒక టెంటును ఏర్పాటు చేసుకుని రెండు రోజుల పాటు కుటుంబసభ్యులతో గడిపి సర్వేలో వివరాలను నమోదు చేయించుకున్నారు. -
సర్వేతో ప్రజలకు ఒరిగేదేమీ లేదు..
తాండూర్ : ఒక రోజు సర్వే నిర్వహించడం వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ విమర్శించారు. ఈ సర్వే వల్ల నిర్దిష్టమైన ప్రణాళిక తయారు కాబోదని పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని మాదారం ఏఐటీయూసీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. విధివిధానాలు ప్రకటించకుండా హామీలు ఎలా అమలు చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను గాలికొదిలేసిందని అన్నారు. ప్రభుత్వ భూమిని అమ్మి రుణ మాఫీలు చేస్తే పేదలకు భూమి ఎలా పంచుతారని అన్నారు. అవినీతిని నిర్మూలిస్తామని అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం బడా కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, బహుళజాతి సంస్థలకు లాభం చేకూర్చే చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర సాగుతోందని, అటవీ హక్కుల చట్టానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని అన్నారు. బహిరంగ సభకు భారీగా తరలిరండి ఈ నెల 11న హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో నిర్వహించే చండ్ర రాజేశ్వర్‌రావు శతజయంతి బహిరంగ సభకు ప్రజలు పెద్దయెత్తున తరలి రావాలని గుండా మల్లేశ్ కోరారు. పది వేల మంది జన సేవాదళ్ కార్యకర్తలతో కవాతు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కళవేణి శంకర్, మండల కార్యదర్శి మామిడాల రాజేశ్, జిల్లా కార్యవర్గ సభ్యులు పులుగం వెంకటేశ్, ఏఐటీయూసీ బ్రాంచి ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి తదితరులు పాల్గొన్నారు. -
త్యాగమూర్తివయా... ఓ పురుషా!
సర్వే గత తరాలతో పోల్చితే ఈ తరం పురుషులు స్త్రీల పట్ల త్యాగభావనతో ఉంటున్నారు అంటోంది తాజా సర్వే. మగాళ్లలో సగం మందికి పైగా తమ భార్య కెరీర్ కోసం ఉన్న ఊళ్లను వదులుకోవడానికి సిద్ధపడుతున్నారు. జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో స్త్రీ, పురుషులిద్దరూ తమ కెరీర్‌ను దృష్టిలో పెట్టుకుంటున్నారని సర్వే చెబుతోంది. ఈ సర్వేను అమెరికాకు చెందిన ‘మేఫ్లవర్ మూవింగ్ కంపెనీ’ నిర్వహించింది. అందం, సంపద కంటే తమ కెరీర్ విషయంలో సహకరించే వారికే స్త్రీలు ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ సర్వేలో తేలింది.