
త్యాగమూర్తివయా... ఓ పురుషా!
సర్వే
గత తరాలతో పోల్చితే ఈ తరం పురుషులు స్త్రీల పట్ల త్యాగభావనతో ఉంటున్నారు అంటోంది తాజా సర్వే. మగాళ్లలో సగం మందికి పైగా తమ భార్య కెరీర్ కోసం ఉన్న ఊళ్లను వదులుకోవడానికి సిద్ధపడుతున్నారు.
జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో స్త్రీ, పురుషులిద్దరూ తమ కెరీర్‌ను దృష్టిలో పెట్టుకుంటున్నారని సర్వే చెబుతోంది. ఈ సర్వేను అమెరికాకు చెందిన ‘మేఫ్లవర్ మూవింగ్ కంపెనీ’ నిర్వహించింది.
అందం, సంపద కంటే తమ కెరీర్ విషయంలో సహకరించే వారికే స్త్రీలు ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ సర్వేలో తేలింది.