సర్వేకు అందని ప్రజా సహకారం
► వెనుకడుగు వేసిన ప్రభుత్వం
► జిల్లాలో ఇప్పటికి 81.09 శాతమే నమోదు
► ఊపిరి పీల్చుకున్నఅదికారులు
► వందశాతం పూర్తి ఎప్పటికో?
విజయనగరం గంటస్తంభం: ప్రభుత్వం ఎంత తొందర పెట్టినా.. అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చినా ప్రజాసాధికార సర్వే జిల్లాలో శతశాతం పూర్తి కాలేదు. పొట్టకూటి కోసం జనం వలస బాట పట్టడంతో ఇప్పటివరకు 81.09 శాతం మాత్రమే పూర్తరుుంది. నిర్దేశిత గడువు పూర్తి కావడంతో ప్రస్తుతం ఇంటింటి సర్వేను అధికారులు తాత్కాలికంగా ఆపారు. ప్రజల నుంచి సహకారం లేకపోవడం, అధికార వర్గాల నుంచి లోలోపల వ్యతిరేకత వ్యక్తం కావడంతో ప్రభుత్వం కూడా దీనిపై ఒత్తిడి తగ్గించింది. దీంతో శతశాతం పూర్తి కావడానికి మరికొన్ని నెలలు పట్టే అవకాశాలు కనిపిస్తున్నారుు. ప్రజల పూర్తి వివరాలు సేకరించడానికి ప్రభుత్వం ప్రజాసాధికార సర్వే చేపట్టిన విషయం విదితమే. ఇందులోభాగంగా జిల్లాలో జులై 8వతేదీన ఈ సర్వే ప్రారంభమైంది. ఆరంభంలో ఆ నెలాఖరుకు పూర్తి కావాలని ఆదేశించిన ప్రభుత్వం తర్వాత అనేక పర్యాయాలు వారుుదాలు వేసుకుంటూ వచ్చింది. చివరిగా గత నెలలో మాత్రం అధికారులపై ఒత్తిడి పెంచింది. నవంబరు నెలాఖరుకు పూర్తి కావాలని ఆదేశించింది. ఈమేరకు మండలస్థారుు అధికారులు, ఎన్యుమరేటర్లుపై జిల్లా అధికారులు తీవ్ర ఒత్తిడి పెంచారు. వలస వెళ్లిన వారినిసైతం తెప్పించి సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ పరిస్థితుల్లో అధికారులు కూడా సర్వే చేయడం లేదు. మరో వైపు నగదు రహిత లావాదేవీలపై ప్రచారం కోసం ప్రభుత్వం అధికారులను పురమారుుంచడంతో సర్వే పనిని ప్రస్తుతం వారు చేయడం లేదు. అరుుతే తదుపరి కూడా ప్రత్యేకించి సర్వే ఉండదని అధికారులు చెబుతున్నారు. నిరంతర పక్రియ అరుునా వచ్చిన వారికి మాత్రమే నమోదు చేసే అవకాశముందంటున్నారు. సెంట్రలైజ్ చేసి ఏదో ఒక కేంద్రంలో నమోదు చేస్తారని ఒక అధికారి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసినట్లు సమాచారం. మరోవైపు అమరావతిలో గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చిన విషయం విదితమే. ప్రజలు, అధికారుల్లో వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో సర్వేపై వెనుకడుగు వేసి తదుపరి గడువు తేదీలు చెప్పకుండా వదిలేసినట్లు కొందరు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యం లో శతశాతం సర్వే ఎప్పటికి పూర్తి కానుందోనన్న ప్రశ్న ఇంకా అలాగే మిగిలిఉంది.