
ఆయన విధానాలపై పెదవి విరుపు.. సర్వేలో వెల్లడి
వాషింగ్టన్: అధ్యక్షుడిగా డొనాల్ట్ ట్రంప్ దేశాన్ని ముందుకు నడిపించే విధానంపై ప్రజల్లో ఇప్పటికీ అనుకూల వైఖరి కంటే వ్యతిరేక వైఖరే ఎక్కువగా కనిపి స్తోంది. ట్రంప్‌పై ప్రజామోదం, పని తీరు, నిర్ణయాలు, దేశాన్ని ఆయన సరైన దిశగా నడిపిస్తున్నారా అంటే లేదనే ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తమ్మీద ట్రంప్ పని తీరుపై 52 శాతం మంది పెదవి విరిచారు. 48 శాతం మంది మాత్రమే ట్రంప్ పాలన బాగుందన్నారు.
ఫిబ్రవరి మధ్యలో సర్వే చేపట్టినప్పుడు సైతం దాదాపు ఇదే ఫలితం రావడం గమనార్హం. ఉద్యో గులపై వేటు సహా ఆయన విధానాలకు సొంత రిపబ్లికన్లు 90 శాతం మంది సానుకూలత చూపగా, ప్రతిపక్ష డెమో క్రాట్లు 90 శాతం మంది వ్యతిరేకత తెలిపారు. స్వతంత్రుల్లో 59 మంది కూడా ట్రంప్ తీరు నచ్చలేదన్నారు. ట్రంప్ విధానాలు దేశాన్ని తప్పుడు మార్గంలో నడిపిస్తు న్నాయని 45 శాతం మంది చెప్పగా సరైన దిశగానే దేశం సాగుతోందని 39 శాతం మంది బదులిచ్చారు. 15 శాతం మంది ఏ సమాధానమూ చెప్పలేదు.
దేశం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్ర సమస్యల పై ట్రంప్ దృష్టి పెట్టడం లేదని 52 శాతం మంది, ప్రాధాన్యతలు బాగానే ఉన్నాయని 40 శాతం మంది అభిప్రాయం వెలిబుచ్చారు. మొత్త మ్మీద 18–34 ఏళ్ల గ్రూపులో 51 శాతం మంది ట్రంప్ పాలన సరిగా లేదని కుండబద్దలు కొట్టారు. అదే సమయంలో మహిళలు కూడా 57 శాతం మంది ట్రంప్ ప్రభుత్వంపై అసంతృప్తి వెలిబుచ్చారు. ఎస్‌ఎస్‌ఆర్ సంస్థ ఫిబ్రవరి 24–28వ తేదీల మధ్య దేశవ్యాప్తంగా ర్యాండమ్‌గా ఎంపిక చేసిన 2,212 మందితో సర్వే చేపట్టింది. ఆన్‌లైన్‌లో, టెలిఫోన్ ద్వారా లేదా లైవ్ ఇంటర్వ్యూ ద్వారా చేపట్టిన ఈ సర్వే కచ్చితత్వం మైనస్ 2.4 శాతం పాయింట్లు అటూఇటుగా ఉండొచ్చని సీఎన్‌ఎన్ పేర్కొంది. కాగా, శుక్రవారం వైట్‌హౌస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో తీవ్ర వాదోపవాదం జరిగిన ముందు రోజే ఈ పోల్ ముగియడంతో, ఆ ప్రభావం దీనిపై కనిపించదు.
అక్రమ వలసలు రికార్డు స్థాయిలో తగ్గాయి: ట్రంప్
అమెరికాపై అక్రమ వలసల ఆక్రమణ ముగిసిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ‘‘మెక్సికో సరిహద్దులో అక్రమ వలసలు ఫిబ్రవరిలో చరిత్రాత్మక స్థాయిలో తగ్గాయి. నా కఠిన నిర్ణయాల వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. ‘‘నా పాలనలో మొదటి పూర్తి నెల అయిన ఫిబ్రవరిలో అతి తక్కువ సంఖ్యలో అక్రమ వలసదారులు అమెరికాలో ప్రవేశించడానికి ప్రయత్నించారు. మెక్సికో సరిహద్దులో కేవలం 8,326 మంది అరెస్టయ్యారు. వారందరినీ వెంటనే బహిష్కరించాం’’ అని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. బైడెన్ హయాంలో నెలకు 3ల క్షల మంది పై చిలుకు చొప్పున అక్రమంగా ప్రవేశించారని ఆరోపించారు. వలసలు గణనీయంగా తగ్గాయన్న ప్రకటనను వార్తా నివేదికలు తిప్పికొట్టాయి. ‘‘బైడెన్ అధికారంలో ఉన్న చివరి వారంలో రోజుకు సగటున 2,869 సరిహ ద్దు అరెస్టులు జరిగాయి. ట్రంప్ అధికారం చేపట్టాక తొలి వారంలో 7,287 అరెస్టులు నమోదయ్యాయి. అంటే రోజుకు సగటున 1,041. అంటే తగ్గుదల కేవలం 60 శాతమే. వైట్‌హౌస్ చెబుతున్నట్టు 95 శాతం కాదు’’ అని ఫాక్స్ న్యూస్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment