cash-free transactions
-
‘రేషన్ ’లో దశల వారీగా నగదు రహిత లావాదేవీలు
సబ్బవరం (పెందుర్తి) : రేషన్ షాపుల్లో నిర్భంధ విధానం కాకుండా దశలవారీగా నగదు రహిత లావాదేవీలు అమలు చేయాలని రేషన్ డీలర్ల రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి దివిలీల మాధవరావు అన్నారు. ఆదివారం మండలంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో మండల రేషన్ డీలర్లతో సమావేశమయా్యరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం ఉదయం విజయనగరంలో రాష్ట్ర రేషన్ లర్ల సమావేశం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ–పోస్ విధానాన్ని రాష్ట్ర డీలర్లు విజయవంతం చేసి ప్రజాపంపిణీ వ్యవస్థను దేశంలోనే తొలిస్థానానికి తీసుకువెళ్లారన్నారు. డీలర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా రూ.20 నుంచి రూ.70కు కమీషన్ పెంచిం దని తెలిపారు. రేషన్ డీలర్లను బ్యాంక్ కరస్పాం డెంట్లు నియమిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నారు. అందువల్ల వీరికి ఖర్చులు పోనూ 5 శాతం కమీషన్ వచ్చేవిధంగా విధివిధానాలు రూపొం దించాలని కోరారు. డీలర్ల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో రేషన్ డీలర్ల రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.గంగాధరగౌడ, రాష్ట్ర కోశాధికారి పి.చిట్టిరాజు, కె.అప్పారావు, వాసిరెడ్డి నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. -
‘క్యాష్‌లెస్’కు ఊతం
►ఎస్‌హెచ్‌జీ మహిళలకు స్మార్ట్ ఫోన్లు ►కొనుగోలుకు స్త్రీనిధి ద్వారా రూ.6 వేల రుణం ►24 వాయిదాల్లో చెల్లించేందుకు నిర్ణయం ►నగదు రహిత లావాదేవీలు పెంచేందుకు ప్రభుత్వ ప్రయత్నం ►రూరల్ జిల్లాలో 1.62 లక్షల మందికి లబ్ధి వరంగల్ రూరల్ (వెల్ఫేర్) : కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత దేశ వ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలు పెంచేందుకు అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్టీసీ బస్సులు, బస్టాండ్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అయితే క్యాష్‌లెస్ లావాదేవీలను పెంచేందుకు తాజాగా మరో అడుగు ముందుకు పడుతోంది. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)ల్లోని మహిళల వద్ద స్మార్ట్ఫోన్లు ఉంటే నగదు రహిత లావాదేవీలు ఊపందుకుంటాయని భావించి వారికి అవగాహన కల్పించాలని అధికారులు నిర్ణయించారు. కాగా, సంఘాల్లోని మహిళలకు ఫోన్లు కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత లేదని గుర్తించి.. స్త్రీనిధి బ్యాంకు ద్వారా రుణం ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతున్నారు. దీంతో రూరల్ జిల్లాలో 1.62 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. రూ.6 వేలు.. 24 వాయిదాలు మహిళా సంఘాల్లోని సభ్యులు ఒక్కొక్కరు సెల్‌ఫోన్ కొనుగోలు చేసేందుకు రూ.6 వేల చొప్పున స్త్రీ నిధి బ్యాంకు ద్వారా రుణం అంజేయనున్నారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ కమిటీ సమావేశంలో అధికారులు నిర్ణయించారు. ఇలా రుణంగా అందే నగదుతో మహిళలు ఏ కంపెనీ ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్ అయినా కొనుగోలు చేసుకోవచ్చు. అనంతరం 24 వాయిదాల్లో రూ.275 చొప్పున ఈ నగదును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఒక్కో మహిళ తీసుకున్న రూ.6 వేలకు రూ.6,600 చెల్లించాల్సి వస్తుంది. ఇది పెద్దగా భారమేం కాదు కనుక మహిళలంతా స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేస్తారని, తద్వారా నగదు రహిత లావాదేవీలు పెరుగుతాయనేది ప్రభుత్వ భావిస్తోంది. కాగా, అందరూ రుణం తీసుకోవాలనే నిబంధన విధించకపోవడంతో ఆసక్తి ఉన్న వారే రుణం తీసుకోవడంతో పాటు స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. స్త్రీ ‘నిధి’ సాయం.. స్త్రీనిధి బ్యాంకు ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు చేయూతనిచ్చేందుకు అనేక పథకాలు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం మహిళా సంఘాలకు రూ.71.54 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉంది. అయితే, ఇందులో ఇప్పటివరకు రూ.30 కోట్ల మేరకు అందజేశారు. దీంతో మిగిలిన రూ.41 కోట్లను వచ్చే నెల ముగిసేలోగా అందజేయాలని అధికారులు భావిస్తున్నారు. అన్ని గ్రామాల్లో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేయాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయి. ఇందులో భాగం గా మరుగుదొడ్డి నిర్మాణానికి అయ్యే ఖర్చులో రూ.12 వేలను స్త్రీనిధి ద్వారా రుణంగా ఇస్తారు. ఈ రుణాన్ని తిరిగి 12 నెలల్లో వడ్డీతో సహా చెల్లించాల్సి ఉం టుంది. ఒకవేళ ఆలోగా నిర్మాణ బిల్లు ప్రభుత్వం నుంచి ఇస్తే ఆ వెంటనే చెల్లించాలనే నిబంధన విధించారు. -
త్వరలో రేషన్ నగదు రహితం!
కార్డు, ఆధార్ ద్వారా చెల్లింపులు న్యూఢిల్లీ: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే దిశగా కేంద్రం మరో అడుగు ముందుకు వేసింది. క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు ఆధార్ ద్వారా చెల్లింపులకు అన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)లు, ఎరువుల దుకాణాల్లో త్వరలో పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మిషన్లు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే 1.7 లక్షల పీఓఎస్‌లు పీడీఎస్‌ల్లో అమర్చామని, కొద్ది నెలల్లో మిగిలిన అన్ని దుకాణాల్లో అందుబాటులోకి తెస్తామని ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్ లవసా తెలిపారు. ‘ఆహార– ప్రజా పంపిణీ, ఎరువుల విభాగాల వద్ద పీఓఎస్‌లను ఇన్ స్టాల్ చేయడానికి అవసరమైన ప్రోగ్రామ్ ఉంది. వాటిల్లో ఆధార్ ద్వారా కూడా చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకొంటాం. లక్ష గ్రామాల్లో రెండేసి మిషన్ల చొప్పున ఏర్పాటు కోసం ఆర్థిక సహకారం అందించేందుకు నాబార్డు ముందుకు వచ్చింది’ అని అశోక్ చెప్పారు. డిజిటల్ చెల్లింపుల ద్వారా లాభమెంతన్నది అంచనాకు రావడానికి ఏడాదికి పైగా సమయం పట్టవచ్చని ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. -
నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలి
లేదంటే లైసెన్స్ రద్దు ఈ నెల 31 చివరి తేదీ జిల్లా కలెక్టర్ అమ్రపాలి హన్మకొండఅర్బన్ (వరంగల్ పశ్చిమ) : జిల్లాలోని వ్యాపార వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు ఈ నెల 31నాటికి నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని, లేనిపక్షంలో ఆ సంస్థల లైసెన్స్‌లు రద్దు చేస్తామని కలెక్టర్ అమ్రపాలి హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లో విజిలెన్స్, ఎన్పోర్స్మెంట్ వరంగల్ యూనిట్ ఆధ్వర్యంలో నగదు రహిత లావాదేవీలపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని సంస్థలు ఆర్టీజీఎస్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇతర సాకేంతిక విధానాలు ఏర్పాటు చేసుకుని నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలన్నారు. సంస్థల్లో పనిచేసే సిబ్బందికి కూడా బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబర్, ఆధార్ కలిగి ఉండాలని అన్నారు. జిల్లా యంత్రాంగం నుంచి అవసరం మేరకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్ శ్రీకాంత్, ఆంధ్రాబ్యాంక్ మేనేజర్ శ్రీను, కార్పొరేషన్‌బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ చిత్ర, ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్షయ వ్యాధిపై అవగాహన కల్పించాలి జిల్లాలో క్షయ వ్యాధి నివారణకు సంబంధించి వైద్య అధికారులు తగు చర్యలు తీసుకోవడంతోపాటు వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ అమ్రపాలి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో క్షయవ్యాధి నివారణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షయవాధి బాధితుల నుంచి వారి కుటుంబ సభ్యులకు, పక్కవారికి వ్యాధి సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందస్తుగా అవగాహన కల్పించాలన్నారు. వ్యాధిని సకాలంలో గుర్తించి సరైన చికిత్స అందించాలన్నారు. సమావేశంలో క్షయవ్యాధి ప్రోగ్రాం అధికారి డాక్టర్ సూర్యప్రకాష్, డీఎంహెచ్ఓ సాంబశివరావు, లెప్రసీ విభాగం అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ శ్యామనీరజ, డాక్టర్ శ్రవణ్‌కుమార్, ప్రొఫెసర్ శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు. జీఎంహెచ్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ హన్మకొండ చౌరస్తా (వరంగల్ పశ్చిమ): హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని మంగళవారం కలెక్టర్ అమ్రపాలి తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ప్రతి వార్డును క్షణ్ణంగా పరిశీలించిన ఆమె సమస్యలు, కావాల్సిన వసతులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఎంహెచ్ఓ సాంబశివరావు, సూపరింటెండెంట్ నిర్మల, ఆర్ఎంఓ సుధార్సింగ్తో సమావేశమయ్యారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ, బడ్జెట్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, సుమారు గంట పాటు ఆసుపత్రిలో సమయం వెచ్చించిన కలెక్టర్ తిరిగి బయటకు వెళ్తుండగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. -
నగదు రహితంతో అవినీతి నిర్మూలన
రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేది అవగాహన సైకిల్‌యాత్ర కరీంనగర్ క్రైం : నగదు రహిత లావాదేవీలతో అవినీతి నిర్మూలించబడుతుందని రాష్ట్రహోం శాఖ కార్యదర్శి, విజిలెన్స్ అండ్ ఎన్ఫొర్స్మెం ట్ డీజీపీ రాజీవ్ త్రివేది అన్నారు. నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించేందుకు కరీం నగర్ జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫొర్స్‌మెంట్ శాఖ అదివారం కమిషనరేట్ హెడ్‌క్వార్టర్‌లో ఏ ర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పటిష్ట ఆర్థిక వ్యవస్థ ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. నగదు రహిత లావాదేవీలపై ఆందోళనలు చెం దాల్సిన అవసరం లేదన్నారు. వ్యాపారులు పా రదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించాలని తెలిపారు. కరీంనగర్ పోలీస్‌కమిషనర్ క మలాసన్రెడ్డి మాట్లాడుతూ నగదు రహిత లా వాదేవీల కొనసాగింపునకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. రాబోయే రోజుల్లో డెబిట్/క్రెడిట్ కార్డులు అవసరం లేకుండానే లా వాదేవీలు కొనసాగించే దిశగా ముందుకు సాగుతుందన్నారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని స్థా యిల పోలీస్అధికారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. స్మార్ట్‌సిటీ నిర్మాణంలో భాగంగా పో లీసులు చేపడుతున్న చర్యలకు అన్ని వర్గాల ప్ర జలు తమవంతు సహకారం అందించాలని కో రారు. కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ శశాంక, అడిషనల్ డీసీపీ అన్నపూర్ణ, డీఆర్వో అయేషాఖాన్, వ్యాపార వాణిజ్య ప్రతినిధులు మునీందర్, భాస్కర్, అంజయ్య, శంకర్, శ్రీనివాస్, బ్యాంక్ అధికారి శ్రీనివాసరెడ్డి, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫొర్స్‌మెంట్ అడిషనల్ ఎస్పీ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. ఘనంగా స్వాగతం నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పి స్తూ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేది ఇద్దరు కుమారులు హైదరాబాద్ నుంచి కరీంనగర్ వరకు సైకిల్‌యాత్రగా వచ్చారు. ఈ సందర్భంగా తిమ్మాపూర్ మండలం వాగేశ్వరీ, జ్యోతి ష్మతి, శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలల వద్ద విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. -
సెలూన్ లో కలెక్టర్ షేవింగ్..
పేటీఎం ద్వారా చెల్లింపులు కనగల్: నగదు రహిత లావాదేవీలపై నల్లగొండ జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ప్రచారం నిర్వహిస్తున్నారు. మంగళవారం కనగల్ మండలం చిన్నమాదారంలో పర్య టించిన ఆయన క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఓ హెయిర్ సెలూన్ లో షేవింగ్ చేయించుకున్న కలెక్టర్.. తన మొబైల్ ఫోన్ నుంచి పేటీఎం ద్వారా నగదు రహిత చెల్లింపులు నిర్వహించారు. మారుమూల కుగ్రామంలో ఉన్న చిన్న కటింగ్ డబ్బాలో కలెక్టర్ షేవింగ్ చేయించుకోవడంతో స్థానికులు ఆశ్చర్య పోయారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీల గ్రామాలుగా మార్చేందుకు జిల్లాలో 11 పల్లెలను ఎంపిక చేశామన్నారు. ఇందులో చినమాదారం గ్రామం ఒక్కటని చెప్పారు. -
నగదు రహితం కోసం సర్వే
గంభీరావుపేట : కేంద్ర ప్రభుత్వం పాత పె ద్దనోట్లను ర ద్దు చేసిన నేపథ్యంలో ప్రజలను నగదు రహిత లావాదేవీల వైపు తీ సుకెళ్లేందుకు అధికారులు చ ర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఐకేపీ, అంగన్ వాడీ, రెవెన్యూ, ఐకేపీ, పంచాయతీరాజ్ విభాగం, సాక్షరభారత్ అధికారులు, సిబ్బంది గ్రామాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ తిరిగి సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వే తరహాలో అన్ని వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. మండలంలో సర్వే వేగవంతంగా సాగుతోంది. -
క్యాష్‌లెస్ వైపు అడుగులు
జిల్లాలో నాలుగు గ్రామాలు ఎంపిక ఆ గ్రామాల్లోని అన్ని కుటుంబాలలో నగదు రహిత లావాదేవీలు నిజామాబాద్ : నగదు రహిత లావాదేవీల వైపు అడుగులు పడుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఈ నగదు రహిత లావాదేవీల ప్రాధాన్యతపై గ్రామీణ స్థాయిలో అవగాహన కల్పించే దిశగా జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ మేరకు జిల్లాలో నాలుగు గ్రామ పంచాయతీలను ఎంపిక చేసుకుంది. ఆయా గ్రామాల్లో ప్రతి కుటుంబం ప్రత్యక్షంగా నగదు రహిత లావాదేవీలు జరిపేలా చర్యలు చేపట్టింది. నగదు రహిత లావాదేవీలతో ఉన్న ప్రయోజనాలను ప్రత్యక్షంగా అవగాహన కలిగేలా చర్యలు చేపట్టింది. ఇలా మొదటి విడతలో తుంగిని, బాదన్పల్లి, దోమలెడిగి, కేశారం గ్రామాలను పూర్తి స్థాయిలో నగదు రహిత లావాదేవీల గ్రామాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఇప్పటికే తుంగిని గ్రామంలో ఉన్న సుమారు 180 కుటుంబాలతో సుమారు 400 లావాదేవీలు జరిపించారు. అంటే ఒక్కో కుటుంబం నుంచి కనీసం రెండు నగదు రహిత లావాదేవీలు జరిపించారు. అలాగే కేశారం గ్రామంలో కూడా పూర్తి స్థాయిలో అన్ని కుటుంబాలు కనీసం రెండు చొప్పున నగదు రహిత లావాదేవీలు జరిపించారు. అలాగే దోమలెడిగి, బాదన్పల్లిలో కూడా అన్ని కుటుంబాలతో నగదు రహిత లావాదేవీలు జరిపేలా చర్యలు చేపట్టింది. ఇలా మరో 31 గ్రామాలను ‘క్యాష్ లెస్’ గ్రామాలు గా చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగం భావిస్తోంది. ఆధార్ ఎనేబుల్డ్ ద్వారా.. పేటీఎం వంటి యాప్‌లు స్మార్ట్‌ఫోన్ ఉన్న వారితో మాత్రమే నగదు రహిత లావాదేవీలు జరిపేందుకు వీలుంటుంది. కానీ గ్రామాల్లో అందరి వద్ద స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉండవు. దీంతో ఆధార్ ఎనేబుల్డ్ విధానం ద్వారా లావాదేవీలు జరుపుతున్నారు. ఆయా బ్యాంకుల కరస్పాండెంట్లను నియమించి, వేలిముద్రల ద్వారా ఈ లావాదేవీలు జరుపుతున్నారు. రేషన్‌షాపులు, కిరాణా దుకాణాల్లో ఈ విధానం ద్వారా లావాదేవీలు జరిగేలా చూస్తున్నారు. ఇటీవల ఈ గ్రామాల్లో కొందరు రేషన్ కార్డుదారులు కిరోసిన్‌ను ఇలా నగదు రహిత లావాదేవీల ద్వారానే పంపిణీ చేసినట్లు జాయింట్ కలెక్టర్ రవీందర్‌రెడ్డి ‘సాక్షి’తో తెలిపారు. బ్యాంకు కరస్పాండెంట్ల కొరత జిల్లాలో పూర్తి స్థాయిలో బ్యాంకు కరస్పాండెంట్లు లేకపోవడంతో నగదు రహిత లావాదేవీలు పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు వీలు పడటం లేదు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కేవలం సుమారు రెండు వందలకు మించి బ్యాంకు కరస్పాండెంట్లు లేరు. ఎస్బీహెచ్, ఎస్బీఐ, గ్రామీణ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, విజయ బ్యాంకులకు మాత్రమే బ్యాంకు కరస్పాండెంట్లు ఉన్నారు. బ్యాంకు కరస్పాండెంట్లు ఎక్కువ మంది ఉంటే ఈ నగదు రహిత లావాదేవీలు విస్తృతంగా జరిపేందుకు వీలు పడుతుంది. ఈ కరస్పాండెంట్ల నియామకాలు చేపట్టేలా బ్యాంకులపై అధికార యంత్రాంగం ఒత్తిడి తెస్తోంది. -
పూర్తి స్థాయిలోడిజిటలైజేషన్‌కు 20 ఏళ్లు ఆగాల్సిందే!
• మెట్రో నగరాలైతే మూడు నాలుగేళ్లు • నగదు రహిత లావాదేవీలపై అసోచాం అంచనా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అయితే గ్రామాలన్నీ డిజిటల్ చెల్లింపులకు మళ్లడానికి రెండు దశాబ్దాల సమయం పడుతుందని అసోచాం వెల్లడించింది. మెట్రోలు, పెద్ద నగరాలకైతే మూడు నాలుగేళ్ల సమయం పట్టొచ్చని అసోచాం సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ తెలిపారు. అది కూడా ఈ నగరాల్లో 65–70 శాతం మాత్రమే డిజిటల్ లావాదేవీలు జరగొచ్చని అంచనాగా చెప్పారు. నగదు రహితానికి మరిన్ని ఉద్దీపనలను ప్రధాని మోదీ డిసెంబరు 30న ప్రకటిస్తారని భావిస్తున్నట్టు తెలిపారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత మొబైల్ వాలెట్ల స్థితిగతులపై కన్సల్టెన్సీ కంపెనీ ఆర్ఎన్సీవోఎస్తో కలసి అసోచాం రూపొందించిన నివేదికను మంగళవారమిక్కడ విడుదల చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. గ్రామీణ భారతమే ఎక్కువ.. భారత జనాభాలో 70 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. నెటిజన్ల సంఖ్య పరిమితంగా ఉన్న కారణంగా గ్రామాల్లో డిజిటల్ లావాదేవీలు పెద్ద సమస్యేనని రావత్ వ్యాఖ్యానించారు. మొబైల్ వాలెట్లు కేవలం ఇంగ్లిషులోనే ఉన్నాయని గుర్తు చేశారు. చదువుకున్న వారికి డిజిటల్ లావాదేవీలతో సమస్య లేదని అన్నారు. నిరక్షరాస్యులకే ఇబ్బందులని చెప్పారు. 2 లక్షల ఏటీఎంలలో గ్రామాల్లో 20 శాతమే ఉన్నాయని, దీంతో సమస్య మరింత క్లిష్టమని వివరించారు. దేశంలో డిజిటల్ లావాదేవీలు 100 శాతం భద్రమని చెప్పలేమన్నారు. ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇప్పటికీ పెద్ద సవాల్ అని ఆర్‌ఎన్‌సీవోఎస్ ఫౌండర్ శుష్ముల్ మహేశ్వరి అన్నారు. ప్రభుత్వానిదే బాధ్యత.. ఖాతాదారుల నగదు భద్రత బాధ్యత ప్రభుత్వం, బ్యాంకులపైనే ఉందని సైబర్ సెక్యూరిటీ ఇంటెగ్రేటర్స్ ఇండియా చైర్మన్ బాబు లాల్ జైన్ స్పష్టం చేశారు. ‘ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాల ముప్పు పొంచి ఉంది. వీటి మూలంగా ఏటా 4 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోంది. ఐటీ ఉన్నంత కాలం ఈ ముప్పు తప్పదు. సైబర్ నేరగాళ్ల బారిన సాధారణ ప్రజలు పడకూడదు. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వమే చర్యలు చేపట్టాలి. డిజిటల్ లావాదేవీల పట్ల పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పించాలి’ అని వివరించారు. ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ పోలీసు ఉండాలన్నారు. ఎం–వాలెట్ల హవా..: దేశంలో మొబైల్ వాలెట్ల లావాదేవీల విలువ 2012–13లో రూ.1,000 కోట్లు ఉంది. 2015–16లో రూ.20,600 కోట్లకు ఎగసిందని ఆర్‌ఎన్‌సీవోఎస్–అసోచాం నివేదిక వెల్లడించింది. 2021–22 నాటికి ఇది రూ.275 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. లావాదేవీల సంఖ్య 300 కోట్ల నుంచి అయిదేళ్లలో 46,000 కోట్లను తాకుతుందని వివరించింది. మొబైల్ పేమెంట్ల రంగంలో లావాదేవీల పరంగా మొబైల్ వాలెట్ వాటా ప్రస్తుతమున్న 20 శాతం నుంచి 2021–22 కల్లా 57 శాతానికి చేరుతుందని వెల్లడించింది. వాలెట్ల నుంచి రిటైల్‌పై సగటు వ్యయం రూ.500–700 ఉంది. కొద్ది రోజుల్లోనే ఇది రూ.10 వేల దాకా చేరుతుందని తెలిపింది. -
నగదు రహితం వైపు అడుగులు
ఆరెపల్లి గ్రామస్తుల నిర్ణయం ఇప్పటికే గ్రామపంచాయతీతీర్మానం గ్రామంపై కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ అందరికీ బ్యాంకు ఖాతాలు, ఏటీఎంలు అందించడంపై దృష్టి గీసుకొండ : వంద శాతం నగదు రహిత లావాదేవీలు సాధించే దిశగా గీసుకొండ మండలంలోని ఆరెపల్లి గ్రామం అడుగులు వేస్తోంది. పెద్ద నోట్ల రద్దుతో రైతులు, సామాన్యులు ఇబ్బందులు పడుతుండగా నగదు రహిత లావాదేవీలు జరిగేలా గ్రామాల్లో ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ మేరకు ఆరెపల్లి గ్రామస్తులు కూడా పూర్తిగా నగదు రహిత లావాదేవీలవైపు మొగ్గుచూపాలని గ్రామపంచాయతీలో తీర్మానం కూడా చేశారు. ఈక్రమంలోనే గ్రామంలో 18ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికి బ్యాంకు అకౌంట్ ఉండేలా చర్యలు చేపట్టారు. పూర్తయిన సర్వే గ్రామంలో ఎంత మందికి అకౌంట్లు ఉన్నాయో, లేని వారెవరు అనేది తెలుసుకోవడానిని సాక్షర భారత్ గ్రామ కోఆర్డినేటర్ ద్వారా ఇంటింటి సర్వే చేయించారు. ఈ సందర్భంగా గ్రామంలో 602 మందికి బ్యాంకు అకౌంట్లు లేని వారు కేవలం 25 మంది ఉన్నట్లుగా గుర్తించారు. వీరందరికీ త్వరలో బ్యాంకు ఖాతాలను తెరిపించే పనిలో సర్పంచ్, తదితరులు నిమగ్నమయ్యారు. గ్రామంలోని చాలా మందికి మండలంలోని ఊకల్ కార్పొరేషన్ బ్యాంకు, మచ్చాపూర్‌లోని గ్రామీణ వికాస్ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి. అయితే, ఖాతాలు ఉండడమే కాదు.. అందరికీ ఏటీఎం కార్డులు ఇప్పించేందుకు చర్యలు చేపట్టారు. గ్రామంలో కార్పొరేషన్ బ్యాంకు మినీ శాఖ ఉండగా.. ఇక్కడ స్వైప్ మిషన్ వాడుతున్నారు. అలాగే రెండు కిరాణాషాపులతో పాటు ఇద్దరు మక్కల వ్యాపారులు గ్రామంలో ఉన్నారు. వీరికి సైతం త్వరలో స్వైప్ మిషన్లు ఇప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సర్పంచ్‌తో కలెక్టర్ సమీక్ష ఆరెపల్లె గ్రామంలో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కావడంతో ఈనెల 19వ తేదీన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ తుమ్మనపెల్లి శ్రీనివాస్‌తో పాటు పలువురునగదు రహిత లావాదేవీల విషయమై కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో ఆయన ఈ విషయమై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ మరుసటి రోజు సర్పంచ్‌ను పిలిపించుకుని నగదు రహిత లావాదేవీలు జరిగే గ్రామాన్ని తీర్చిదిద్దాలని.. ఇందుకు తన సహకారం ఉంటుందని తెలిపారు. అంతే కాకుండా ఆంధ్రాబ్యాంకు మేనేజర్‌ను పిలిపించి అందరికీ ఖాతాలు ఉండేలా చూడాలని సూచించారు. రాష్ట్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి హరీష్‌రావు ఇప్పటికే సిద్ధిపేటలోని ఇబ్రహీంపూర్ గ్రామాన్ని పూర్తిగా నగదురహిత లావాదేవీలు జరిగేలా తీర్చిదిద్దారు. ఇక్కడ కూడా అనుకున్నవన్నీ సజావుగా జరిగితే త్వరలోనే ఆరెపల్లె కూడా ఇబ్రహీంపూర్ సరసన నిలవనుంది. 15 రోజుల్లో పూర్తి చేస్తా తుమ్మనపెల్లి శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ రానున్న 15 రోజుల్లో గ్రామంలోని అందరికీ బ్యాంకు ఖాతాలతో పాటు ఏటీఎం కార్డులు అందేలా కృషి చేస్తున్నాం. ఆ తర్వాత స్వైప్మిషన్ల ద్వారా లావాదేవీలు జరిగేలా చర్యలు చేపడుతున్నాం. గ్రామం నుంచి నగరానికి వెళ్లి ఆర్థిక లావాదేవీలు చేసే వారి వద్ద ఏటీఎం కార్డులు ఉండటంతో నగదు కొరత సమస్య ఎదురుకాదు. -
ప్రశ్నార్థకంగా నగదు రహిత లావాదేవీల నిర్వహణ
► అందుబాటులో లేని స్వైపింగ్ మిషన్లు ► ప్రశ్నార్థకంగా మారిన నగదు రహిత లావాదేవీల నిర్వహణ కడప అగ్రికల్చర్: నగదు రహిత లావాదేవీలు నిర్వహించుకోవాలంటే ప్రతి ఒక్కరికీ బ్యాంకుల్లో ఖాతా ఉండాలి. తప్పని సరిగా రూపే,డెబిట్ కార్డులు ఉండాలి. జిల్లాలో 75 శాతం మందికి ఖాతాలు ఉన్నా అందులో 30 శాతం మందికి కూడా డెబిట్, రూపే, ఏటీఎం కార్డులు లేవు. ఈ పరిస్థితిలో దుకాణాలు, పెట్రోలు బంకుల్లో పాయింట్ ఆఫ్ స్కేల్ మిషన్లు(పీఓఎస్ఎం) పెట్టి నగదు రహిత లావాదేవీలు చేయలేమని వ్యాపారులు అంటున్నారు. . జిల్లాలో రిజిస్టర్ చేసుకున్న షాపులు 3100, చౌకదుకాణాలు 1740 ఉన్నాయి. ఇందులో 2437 పీఓఎస్‌ఎంలు ఉన్నాయి. జిల్లాకు 10 వేల స్వైపింగ్ మిషన్లు కావాలని ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం నివేదికలు పంపింది. కిరాణా, మెడికల్ షాపులు, వస్త్ర, బంగారు, తదితర దుకాణాల్లో తప్పని సరిగా పీఓఎస్‌ఎంలు ఏర్పాటు చేసుకుని డెబిట్, రూపే కార్డుల ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. ఆ దిశగా ఇప్పటికే అవగాహన సదస్సులు నిర్వహించింది. అయితే ఆయా షాపుల నిర్వాహకుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. కార్మిక, వాణిజ్య పన్నుల శాఖ వద్ద ఉన్న అంచనా ప్రకారం షాపులు దాదాపు 20 వేల దాకా ఉన్నట్లు సమాచారం. పీఓఎస్ఎంల కోసం వచ్చిన దరఖాస్తులు 150 దాకా ఉన్నట్లు బ్యాంకర్లు తెలిపారు. దీనిబట్టి చూస్తే నగదు రహిత లావాదేవీలపై వ్యాపార వర్గాలు అంతగా ఆసక్తి చూపడంలేదని తేటతెల్లమవుతోంది. బ్యాంకు ఖాతాలు ఉన్నా... డెబిట్ కార్డులు లేవు జిల్లాలో 29 లక్షలకు పైగా జనాభా ఉంది. జిల్లా మొత్తం 33 బ్యాంకులకు సంబంధించి 330 బ్రాంచీలు పనిచేస్తున్నాయి. ఇందులో పట్టణాల్లో 1,86,092, గ్రామీణ ప్రాంతాల్లో 1,97,658 ఖాతాలు ఉన్నాయి. ఇప్పటి వరకు అన్ని రకాల కార్డులు 3,51,547 అందజేశారు.గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 70 శాతం మందికి డెబిట్ కార్డులు లేవు. దీనిని బట్టి చూస్తే జిల్లా వ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలు నిర్వహించడం సాధ్యమైన పని కాదనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. కేవలం పెట్రోలు బంకులు, షాపింగ్ మాల్స్ల్లో మాత్రమే వీటిని వాడుకోవడానికి అవకాశం ఉంటుందని, చిన్న దుకాణాల్లో ఈ విధానం అమలు చేసే పరిస్థితి లేదని చిరువ్యాపారులు చెబుతున్నారు. చౌక దుకాణాల్లో కనిపించని మినీ ఏటీఎంలు, స్వైపింగ్ మిషన్లు జిల్లాలో 1740 రేష¯ŒSషాపులు ఉన్నాయి. ఈ షాపుల డీలర్లను బిజినెస్ కరస్పాండెట్లుగా నియమించి, మినీ ఏటీఎంలు, డెబిట్ కార్డులు అందజేసి నగదు రహిత లావేదేవీలు నిర్వహిస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పినా ఎక్కడ కూడా అది అమలు కావడం లేదు. స్వైపింగ్ మిషన్లు అందజేయకపోవడంతో నగదు రహితం అమలుకు నోచుకోలేదు. -
వారికి లక్షల కోట్లు కట్టబెడుతున్నారు
‘చలో వెలగపూడి’లో ఏఐసీసీ కార్యదర్శి కుంతియా ఆరోపణ సాక్షి, అమరావతి: నగదు రహిత లావాదేవీలు చేసే పేదలపై ట్యాక్స్‌లు వేసి ఆ మొత్తాన్ని ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితంగా ఉండే అంబానీ, అదానీ కంపెనీలకు లక్షల కోట్లు సునాయాసంగా కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి రామచంద్ర కుంతియా ధ్వజమెత్తారు. నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పీసీసీ ఆధ్వర్యంలో శుక్రవారం చలో వెలగపూడి (సచివాలయం) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఉన్న ఫళంగా పెద్దనోట్లు రద్దు చేయడం వల్ల పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. పెద్ద నోట్ల రద్దుతో పనిలో పనిగా రూ.కోట్ల విలువ చేసే నకిలీ నోట్లను బీజేపీ, టీడీపీ నేతలు బ్యాంకుల్లో మార్చుకున్నారని ఆరోపించారు. -
ప్రజల కష్టాలు తీర్చేందుకే..
నగదు రహితంపై మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్య సిద్దిపేట జోన్: ‘సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్ గ్రామం ఒక మారుమూల పల్లె.. సర్పంచ్ లక్ష్మి నిరక్షరాస్యురాలు. అయినా ఇంకుడు గుంతల ఆదర్శాన్ని ఢిల్లీలో ట్రైనీ ఐఏఎస్ అధికారులకు వివరించింది. చదువు, సాం కేతికతో ఆమెకు సంబంధం లేకున్నా ఢిల్లీలో ప్రతిభ చూపింది. నగదు రహిత లావాదేవీలది మన ప్రయత్నం మాత్రమే. వంద శాతం ఇదే అని అనడం లేదు. క్యాష్, కార్డు రెండింటినీ వాడుకోవచ్చు. కానీ ఎప్పటికైనా కార్డుతోనే భవితవ్యం’ అంటూ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఆదివారం సిద్దిపేట లో పలు సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ ‘ప్రధాని ఢిల్లీలో కూర్చుని కరెన్సీని రద్దు చేశారు. దీంతో ప్రజలకు కరెన్సీ కష్టాలు మొదలయ్యాయి. బ్యాంకుల్లో డబ్బులు ఉన్నా యాసంగి పెట్టుబడులు పెట్టలేక రైతులు, సరు కులు కొనలేక సామాన్యులు ఇబ్బందులు పడుతు న్నారు. ప్రజల కష్టాలను తీర్చే క్రమంలో ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలను చేపట్టింది. నచ్చిన వారు, విద్యావంతులు, యువకులు, ఉద్యోగులు కార్డును వాడు కోవాలి. గ్రామాల్లో వృద్ధులు, నిరక్షరాస్యులు పైసలను కూడా వాడుకోవచ్చు. కార్డు పెట్టి నీటిని పడుతున్న అనుభవం ఐదేళ్లుగా నియోజకవర్గ మహి ళలకు ఉంది. గ్రామాల్లో ప్రజలకు నిరక్షరాస్యులకు విశ్వాసం కలిగిస్తాం. కొద్ది రోజులు నేర్చుకుంటే చాలు అందరికి ఇది సులభతరంగా మారుతుంది’ అని మంత్రి చెప్పారు. -
మున్సిపాలిటీల్లో క్యాష్‌లెస్ విధానం
ఇందూరు : జిల్లాలోని మున్సిపాలిటీల్లో ముందుగా నగదు రహిత లావాదేవీలు జరగాల్సిందేనని కలెక్టర్ యోగితా రాణా స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రగతిభవన్‌లో మున్సిపల్ కమిషనర్లు, సిబ్బందితో క్యాష్‌లెస్ విధానం ఏ విధంగా జరుగుతుందో కలెక్టర్ సమీక్షించారు. మున్సిపాలిటీల పరిధిలోని 90 శాతం మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయన్నారు. ఈ నెల 22లోగా ప్రతి కుటుంబంలో క్యాష్‌లెస్ లావాదేవీలు చేయించాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో వాణిజ్యపన్నులశాఖ ఆధ్వర్యంలో టీవోటీలకు క్యాష్‌లెస్‌పై రెండోరోజు అవగాహన కల్పించారు. లంచాలు, అవినీతి ని అరికట్టాలంటే నగదు రహిత చెల్లింపులు ముఖ్యమన్నారు. క్యాష్‌లెస్‌పై బ్యాంకు మిత్ర, పంచాయతీ కార్యదర్శులతోనూ కలెక్టర్ మాట్లాడారు -
గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ
అసెంబ్లీ సమావేశాలు, నగదురహిత లావాదేవీలపై చర్చ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం భేటీ అయ్యారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణపై గవర్నర్‌తో సీఎం చర్చించినట్లు తెలుస్తోంది. 14వ తేదీ తర్వాత అసెంబ్లీ శీతాకాల సమావేశాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అందుకు సంబంధించిన షెడ్యూలును ఒకటీరెండు రోజుల్లో విడుదల చేయనున్నారు. సమావేశాల షెడ్యూలుకు ముందుగా గవర్నర్ అనుమతితో నోటిఫికేషన్‌ను జారీ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు గత నెలలో కేంద్రం ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు అనంతర పరిణామాలు, రాష్ట్రంలో నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు చేపడుతున్న చర్యలపై గవర్నర్‌తో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. -
గీకేస్తారు జాగ్రత్త!
మర్రిపాలెం : పెద్ద నోట్ల రద్దుతో నగదు రహిత లావాదేవీలు ఊపందుకున్నారుు. డెబిట్, క్రెడిట్, నెట్ బ్యాంకింగ్ సేవలు అమాంతంగా పెరిగారుు. గతంలో రోజుకు లక్షలాదిగా ఉంటే ప్రస్తుతం కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగుతుండడం విశేషం. జిల్లా వ్యాప్తగా రోజు దాదాపు రెండు లక్షల నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నారుు. అరుుతే ఆన్లైన్ చెల్లింపుల ప్రక్రియలో ఖాతాదారులు అప్రమత్తంగా లేకపోతే నష్టం తప్పదు. జాగ్రత్త పాటించకపోతే మోసాలకు అవకాశం లేకపోలేదు. ఇప్పటికే కొత్త కొత్త సైబర్ నేరాలు పుట్టుకొస్తున్నారుు. బ్యాంకు ఖాతాల్లోని నగదు మాయమవుతోంది. క్రెడిట్ కార్డుతో యజమానికి తెలియకుండా చెల్లింపు జరుగుతోంది. ఇలాంటి పరిణామాలతో ఖాతాదారులు భయపడే దుస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఆన్లైన్ మోసాలతో అనేకులు బాధితులయ్యారు. సైబర్ నేరంతో పట్టుబడితే జైలు జీవితం గడపాల్సి వస్తుందని తెలియక మోసాలకు పాల్పడుతున్నా రు. అరుుతే చిన్నపాటి జాగ్రత్తలతో మోసా లకు దూరంగా ఉండవచ్చుననేది కాస్త ఉపశమనమే. వివిధ రకాల మోసాలు : సైబర్ నేరాల్లో బెంగళూరు అగ్రస్థానంలో ఉంటే ముంబరుు, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ నగరాలు అదే కోవలో నడుస్తున్నారుు. సైబర్ స్టాల్కింగ్, బ్లాక్ మెరుులింగ్, హాకింగ్, ఫిషింగ్, స్పామింగ్, ఫార్మింగ్, అబ్సెయానిటీ, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్, డేటా థెఫ్ట్, క్యాష్ ట్రాన్సఫర్, తదితర సైబర్ నేరాలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యారుు. లాటరీ లు, గిఫ్ట్‌లు, బంపర్ డ్రాల పేరుతో మోసపోతున్న బాధితులున్నారు. బయటకు చెబితే పరువు పోతోం దని సైబర్ బాధితులు బయటపడటం లేదు. ఇప్పటికే సైబర్ నేరాలతో రూ.లక్షలు పోగొట్టుకున్న బాధితులు పోలీస్స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వందల సంఖ్యలో కేసులు నమోదయ్యారుు. సైబర్ నేరాలకు పాల్పడేవారంతా అధికంగా 25నుంచి 40 ఏళ్ల మధ్య యువకులని తేలింది. సైబర్ నేరాలకు పాల్పడేవారికి ఐటీ యాక్ట్, ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) చట్టంలో ఆయా సెక్షన్ల ప్రకారం శిక్ష పడుతోంది. అవగాహన లోపంతోనే చిన్నపాటి తప్పిదాలతోనే జనం సైబర్ మోసాల బారిన పడుతున్నారు. నేరగాళ్లు బ్యాంక్ అధికారుల్లా మాట్లాడి వివరాలు రాబట్టడం, అంతర్జాతీయ కంపెనీల లాటరీలో మీరు ఎంపికయ్యారంటూ చెప్పగానే ’ఈ-మెరుుల్’ సందేశాలకు తిరిగి వివరాలు పంపడం, డెబిట్ కార్డు పిన్ నంబర్ చెప్పడంతో సైబర్ నేరాలు సులభంగా జరిగిపోతున్నారుు. ఇలా జాగ్రత్త పడొచ్చు ఖాతాదారులు బ్యాంక్ ఖాతా వివరాలు, డెబిట్ కార్డు నంబర్ ఇతరులకు చెప్పొద్దు పిన్ నంబర్ రహస్యంగా ఉంచాలి. కార్డు మీద, పర్సులో ఎక్కడా రాసి పెట్టుకోకూడదు బ్యాంకుల నుంచి సిబ్బంది, ఇతర స్థారుు అధికారులు ఫోన్లలో వివరాలు సేకరించరని గ్రహించాలి అనుమానం వస్తే పోలీసులకు ఫిర్యాదివ్వాలి ఏటీఎం కేంద్రాలు, పోస్ (పీవోఎస్)యంత్రాలలో పిన్ నంబర్ స్వయంగా నమోదు చేయగలగాలి. ఇతరుల సహాయం తీసుకోవద్దు. ఆన్లైన్లో షాపింగ్ చేసే సందర్భాలలో సదరు సంస్థ గుర్తింపును పరిశీలించాలి. అతి తక్కువ ధరలు, మోసపూరిత ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. -
సర్వేకు అందని ప్రజా సహకారం
► వెనుకడుగు వేసిన ప్రభుత్వం ► జిల్లాలో ఇప్పటికి 81.09 శాతమే నమోదు ► ఊపిరి పీల్చుకున్నఅదికారులు ► వందశాతం పూర్తి ఎప్పటికో? విజయనగరం గంటస్తంభం: ప్రభుత్వం ఎంత తొందర పెట్టినా.. అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చినా ప్రజాసాధికార సర్వే జిల్లాలో శతశాతం పూర్తి కాలేదు. పొట్టకూటి కోసం జనం వలస బాట పట్టడంతో ఇప్పటివరకు 81.09 శాతం మాత్రమే పూర్తరుుంది. నిర్దేశిత గడువు పూర్తి కావడంతో ప్రస్తుతం ఇంటింటి సర్వేను అధికారులు తాత్కాలికంగా ఆపారు. ప్రజల నుంచి సహకారం లేకపోవడం, అధికార వర్గాల నుంచి లోలోపల వ్యతిరేకత వ్యక్తం కావడంతో ప్రభుత్వం కూడా దీనిపై ఒత్తిడి తగ్గించింది. దీంతో శతశాతం పూర్తి కావడానికి మరికొన్ని నెలలు పట్టే అవకాశాలు కనిపిస్తున్నారుు. ప్రజల పూర్తి వివరాలు సేకరించడానికి ప్రభుత్వం ప్రజాసాధికార సర్వే చేపట్టిన విషయం విదితమే. ఇందులోభాగంగా జిల్లాలో జులై 8వతేదీన ఈ సర్వే ప్రారంభమైంది. ఆరంభంలో ఆ నెలాఖరుకు పూర్తి కావాలని ఆదేశించిన ప్రభుత్వం తర్వాత అనేక పర్యాయాలు వారుుదాలు వేసుకుంటూ వచ్చింది. చివరిగా గత నెలలో మాత్రం అధికారులపై ఒత్తిడి పెంచింది. నవంబరు నెలాఖరుకు పూర్తి కావాలని ఆదేశించింది. ఈమేరకు మండలస్థారుు అధికారులు, ఎన్యుమరేటర్లుపై జిల్లా అధికారులు తీవ్ర ఒత్తిడి పెంచారు. వలస వెళ్లిన వారినిసైతం తెప్పించి సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పరిస్థితుల్లో అధికారులు కూడా సర్వే చేయడం లేదు. మరో వైపు నగదు రహిత లావాదేవీలపై ప్రచారం కోసం ప్రభుత్వం అధికారులను పురమారుుంచడంతో సర్వే పనిని ప్రస్తుతం వారు చేయడం లేదు. అరుుతే తదుపరి కూడా ప్రత్యేకించి సర్వే ఉండదని అధికారులు చెబుతున్నారు. నిరంతర పక్రియ అరుునా వచ్చిన వారికి మాత్రమే నమోదు చేసే అవకాశముందంటున్నారు. సెంట్రలైజ్ చేసి ఏదో ఒక కేంద్రంలో నమోదు చేస్తారని ఒక అధికారి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసినట్లు సమాచారం. మరోవైపు అమరావతిలో గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చిన విషయం విదితమే. ప్రజలు, అధికారుల్లో వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో సర్వేపై వెనుకడుగు వేసి తదుపరి గడువు తేదీలు చెప్పకుండా వదిలేసినట్లు కొందరు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యం లో శతశాతం సర్వే ఎప్పటికి పూర్తి కానుందోనన్న ప్రశ్న ఇంకా అలాగే మిగిలిఉంది. -
జిల్లాకు రూ.95 కోట్లు అవసరం
సీఎంకు వివరించిన కలెక్టర్ ఒంగోలు టౌన్ : జిల్లాకు తక్షణం 95 కోట్ల రూపాయలు అవసరమవుతాయని కలెక్టర్ సుజాతశర్మ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లారు. గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. జిల్లాలోని పరిస్థితుల గురించి సుజాతశర్మ వివరిస్తూ ప్రస్తుతం తమ వద్ద 25 కోట్ల రూపాయల నగదు సిద్ధంగా ఉందన్నారు. 8500 మందికి కోటి రూపాయల పింఛన్లు ఇచ్చినట్లు తెలిపారు. 21 వేల మంది వృద్ధులు, వికలాంగులకు 200 రూపాయల చొప్పున నగదు రూపంలో అందించినట్లు వివరించారు. ఉపాధి కూలీలకు కూడా నగదు చెల్లింపులు జరిపినట్లు తెలిపారు. జిల్లాకు 10 వేల ఈ-పాస్ మిషన్లు అవసరం అవుతాయన్నారు. 1684 మొబైల్ ట్రాన్షక్షన్లు, 4 వేల మైక్రో ట్రాన్షక్షన్లు నిర్వహించినట్లు వివరించారు. మొబైల్ బ్యాంకింగ్‌కు సంబంధించి బ్యాంకు మిత్రలు, సీసీలకు శిక్షణ ఇచ్చామని చెప్పారు. శిక్షణ పొందిన వారు తమకు కేటారుుంచిన ప్రాంతాల్లో నగదు రహిత లావాదేవీలపై క్షేత్ర స్థారుులో ప్రజలకు అవగాహన కలిగిస్తారని తెలిపారు. నగదు రహిత లావాదేవీల ద్వారా ఉపాధి : సీఎం నగదు రహిత లావాదేవీల ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని నిర్ణరుుంచినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఒక నిరుద్యోగి ఒక వ్యక్తికి నగదు రహిత లావాదేవీ నిర్వహిస్తే రిజిస్ట్రేషన్ ఫీజు కింద 15 రూపాయలు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ఒక వ్యక్తికి నెల రోజులపాటు శిక్షణ ఇచ్చి నగదు రహిత లావాదేవీలపై పూర్తి స్థారుులో అవగాహన కలిగిస్తే 20 రూపాయలు చెల్లిస్తామని చెప్పారు. మొత్తంగా ఒక నిరుద్యోగి ఒక వ్యక్తికి నగదు రహిత లావాదేవీలపై అవగాహన కలిగించినందుకు నెలకు 35 రూపాయలు ఇస్తామని వివరించారు. బహిరంగ మలవిసర్జన లేని గ్రామాలకు ప్రకటిస్తున్న ప్రోత్సాహకాల మాదిరిగా నగదు రహిత లావాదేవీలు నిర్వహించే గ్రామాలకు కూడా ప్రోత్సాహకాలు అందించనున్నట్లు సీఎం వెల్లడించారు. అతి చిన్న గ్రామానికి రూ.10 వేలు, చిన్న గ్రామానికి రూ.25 వేలు, పెద్ద గ్రామానికి రూ.50 వేలు, మేజర్ పంచాయతీకి లక్ష రూపాయల చొప్పున ప్రోత్సాహకాలు చెల్లించనున్నట్లు వివరించారు. జేసీ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్, ఎల్డీఎం నరసింహారావు, జెడ్పీ సీఈఓ బాపిరెడ్డి పాల్గొన్నారు. -
‘స్వైపింగ్’తో లబ్ధి కొంతే
సర్కార్ నగదు రహిత లావాదేవీలపై రిజిస్ట్రేషన్ల శాఖ అభిప్రాయం సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల శాఖలో స్వైపింగ్ మెషిన్ల (డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులకు వీలు కల్పించే పరిక రాలు)ను ప్రవేశపెట్టడం ద్వారా కలిగే ప్రయోజనాలు స్వల్పమేనని ఉన్నతాధికారు లు భావిస్తున్నారు. నగదు రహిత లావా దేవీలను అమల్లోకి తెచ్చేందుకు స్వైపింగ్ యంత్రాలను వినియోగించాలని ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై అధికారులు మంగళ వారం కసరత్తు చేశారు. ఇటీవలే ప్రవేశపె ట్టిన ఈ-స్టాంప్స్, ఈ-చలాన్ల పనితీరు ప్రయోజనకరంగా ఉన్నందున ఇప్పటికి ప్పుడు స్వైపింగ్ మెషిన్లను ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని సబ్ రిజిస్ట్రార్లు అంటున్నా రు. పైగా స్వైపింగ్ మెషిన్ల ద్వారా చెల్లింపులు చేయడం వల్ల సర్వీస్ చార్జి కింద వినియోగ దారులే ఎక్కువ సొమ్మును నష్టపోవాల్సి వస్తుందంటున్నారు. నగదు చెల్లింపుల ద్వారా ఏటా రూ. 25 కోట్లకన్నా తక్కువ ఆదాయం వచ్చే లావాదేవీల కోసం స్వైపింగ్ యంత్రా లను భారీగా కొనుగోలు చేయడం ఎంతవరకు ఆమోదయోగ్యమో ఉన్నతాధి కారులు పరిశీలించాలని కోరుతున్నారు. ఏదేమైనా ‘స్వైపింగ్’ ప్రతిపాదనకు సంబంధించి ప్రభుత్వం నుంచి రాతపూర్వక ఆదేశాలు అందనందున తుది నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం పడుతుందని చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖకు ఏటా వచ్చే సుమారు రూ. 4 వేల కోట్ల వార్షికాదాయంలో అధిక భాగం స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు రూపంలోనే సమకూరుతుంది. తగ్గుముఖం పట్టిన లావాదేవీలు.. పాత నోట్లతో రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీల చెల్లింపునకు కేంద్రం ఇచ్చిన గడువు ఈ నెల 24తో ముగియడంతో గత 4 రోజులుగా రిజిస్ట్రేషన్ల శాఖలో లావాదేవీలు తగ్గుముఖం పట్టారుు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 24న 5,422 లావాదేవీలు జరగ్గా మంగళవారం నాటికి రోజువారీ లావాదేవీ లు 1,805 పడిపోయారుు. రిజిస్ట్రేషన్ల ఆదాయం ఈ నెల 24న రూ. 25 కోట్లు రాగా మంగళవారం నాటికి రూ.7 కోట్లకు తగ్గింది. -
నగదు రహితంగా లావాదేవీలు
► పెట్టుబడి నిధిని గ్రూపు సభ్యులు వ్యక్తిగత అవసరాలకు వాడుకోవచ్చు ►డీఆర్డీఏ పీడీ ఎం.ఎస్.మురళి ఒంగోలు సెంట్రల్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గ్రూపు సభ్యుల, ఇతర లావాదేవీలన్నీ నగదు రహితంగానే జరగాలని డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ ఎంఎస్.మురళి అన్నారు. స్థానిక టెక్నికల్ అండ్ ట్రైనింగ్ డెవలప్మెంట్ సెంటర్లో గురువారం ఇంటర్నెట్ సాధీలకు, గ్రామ సంఘాలకు నగదు రహిత లావాదేవీలపై ఒకరోజు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ గ్రూపు సభ్యులు తమ రోజువారీ కార్యకలాపాలకు మొబైల్ బ్యాకింగ్, నెట్ బ్యాంకింగ్, రూపే డెబిట్ కార్డు స్వైపింగ్ ద్వారా లావాదేవీలు నిర్వహించాలన్నారు. గ్రూపు బ్యాంకు ఖాతాలో ఉన్న పెట్టుబడి నిధిని సభ్యులు తమ వ్యక్తిగత బ్యాంకు ఖాతాలోకి మార్చుకుని వాడుకోవచ్చన్నారు. అరుుతే మళ్లీ తిరిగి ఖాతాకు నగదు జమచేయాలని చెప్పారు. గ్రూపుల్లో రూ.30 వేల వరకు జమరుు ఉంటాయన్నారు. ఒక్కొక్కరూ రూ.3 వేల వరకు నగదును తమ వ్యక్తిగత ఖాతాలోకి బదిలీ చేసుకుని వాడుకోవచ్చని తెలిపారు. జన్‌ధన్ బ్యాంకు ఖాతాల వినియోగదారులకు రూపే డెబిట్ కార్డులను అందజేశారన్నారు. రూపే డెబిట్‌కార్డు ద్వారా కూడా తమ నగదు లావాదేవీలు నిర్వహించుకోవాలన్నారు. వచ్చే నెల 1వ తేదీ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా పంపిణీ చేసే పెన్షన్ కూడా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారని చెప్పారు. శిక్షణ కార్యక్రమంలో డ్వామా పీడీ ఎన్.పోలప్ప, జిల్లా లీడ్‌బ్యాంకు మేనేజర్ నరశింహారావు, జెడ్పీ సీఈవో బాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.