రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేది
అవగాహన సైకిల్‌యాత్ర
కరీంనగర్ క్రైం : నగదు రహిత లావాదేవీలతో అవినీతి నిర్మూలించబడుతుందని రాష్ట్రహోం శాఖ కార్యదర్శి, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫొర్స్‌మెం ట్ డీజీపీ రాజీవ్ త్రివేది అన్నారు. నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించేందుకు కరీం నగర్ జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫొర్స్‌మెంట్ శాఖ అదివారం కమిషనరేట్ హెడ్‌క్వార్టర్‌లో ఏ ర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పటిష్ట ఆర్థిక వ్యవస్థ ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. నగదు రహిత లావాదేవీలపై ఆందోళనలు చెం దాల్సిన అవసరం లేదన్నారు. వ్యాపారులు పా రదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించాలని తెలిపారు. కరీంనగర్ పోలీస్‌కమిషనర్ క మలాసన్‌రెడ్డి మాట్లాడుతూ నగదు రహిత లా వాదేవీల కొనసాగింపునకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. రాబోయే రోజుల్లో డెబిట్/క్రెడిట్ కార్డులు అవసరం లేకుండానే లా వాదేవీలు కొనసాగించే దిశగా ముందుకు సాగుతుందన్నారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని స్థా యిల పోలీస్‌అధికారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. స్మార్ట్‌సిటీ నిర్మాణంలో భాగంగా పో లీసులు చేపడుతున్న చర్యలకు అన్ని వర్గాల ప్ర జలు తమవంతు సహకారం అందించాలని కో రారు. కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ శశాంక, అడిషనల్ డీసీపీ అన్నపూర్ణ, డీఆర్‌వో అయేషాఖాన్, వ్యాపార వాణిజ్య ప్రతినిధులు మునీందర్, భాస్కర్, అంజయ్య, శంకర్, శ్రీనివాస్, బ్యాంక్ అధికారి శ్రీనివాసరెడ్డి, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫొర్స్‌మెంట్ అడిషనల్ ఎస్పీ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
ఘనంగా స్వాగతం
నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పి స్తూ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేది ఇద్దరు కుమారులు హైదరాబాద్ నుంచి కరీంనగర్ వరకు సైకిల్‌యాత్రగా వచ్చారు. ఈ సందర్భంగా తిమ్మాపూర్ మండలం వాగేశ్వరీ, జ్యోతి ష్మతి, శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలల వద్ద విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు.
నగదు రహితంతో అవినీతి నిర్మూలన
Published Mon, Jan 9 2017 11:47 PM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM
Advertisement
Advertisement