సెలూన్ లో కలెక్టర్‌ షేవింగ్‌.. | collector Shaving in the saloon .. | Sakshi
Sakshi News home page

సెలూన్ లో కలెక్టర్‌ షేవింగ్‌..

Published Wed, Jan 4 2017 4:11 AM | Last Updated on Tue, Sep 5 2017 12:19 AM

సెలూన్ లో కలెక్టర్‌ షేవింగ్‌..

సెలూన్ లో కలెక్టర్‌ షేవింగ్‌..

పేటీఎం ద్వారా చెల్లింపులు
కనగల్‌: నగదు రహిత లావాదేవీలపై నల్లగొండ జిల్లా కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ ప్రచారం నిర్వహిస్తున్నారు. మంగళవారం కనగల్‌ మండలం చిన్నమాదారంలో పర్య టించిన ఆయన క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఓ హెయిర్‌ సెలూన్ లో షేవింగ్‌ చేయించుకున్న కలెక్టర్‌.. తన మొబైల్‌ ఫోన్ నుంచి పేటీఎం ద్వారా నగదు రహిత చెల్లింపులు నిర్వహించారు. మారుమూల కుగ్రామంలో ఉన్న చిన్న కటింగ్‌ డబ్బాలో కలెక్టర్‌  షేవింగ్‌ చేయించుకోవడంతో స్థానికులు ఆశ్చర్య పోయారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీల గ్రామాలుగా మార్చేందుకు జిల్లాలో 11 పల్లెలను ఎంపిక చేశామన్నారు. ఇందులో చినమాదారం గ్రామం ఒక్కటని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement