‘రేషన్ ’లో దశల వారీగా నగదు రహిత లావాదేవీలు
సబ్బవరం (పెందుర్తి) : రేషన్ షాపుల్లో నిర్భంధ విధానం కాకుండా దశలవారీగా నగదు రహిత లావాదేవీలు అమలు చేయాలని రేషన్ డీలర్ల రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి దివిలీల మాధవరావు అన్నారు. ఆదివారం మండలంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మండల రేషన్ డీలర్లతో సమావేశమయా్యరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం ఉదయం విజయనగరంలో రాష్ట్ర రేషన్ లర్ల సమావేశం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ–పోస్ విధానాన్ని రాష్ట్ర డీలర్లు విజయవంతం చేసి ప్రజాపంపిణీ వ్యవస్థను దేశంలోనే తొలిస్థానానికి తీసుకువెళ్లారన్నారు.
డీలర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా రూ.20 నుంచి రూ.70కు కమీషన్ పెంచిం దని తెలిపారు. రేషన్ డీలర్లను బ్యాంక్ కరస్పాం డెంట్‌లు నియమిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నారు. అందువల్ల వీరికి ఖర్చులు పోనూ 5 శాతం కమీషన్ వచ్చేవిధంగా విధివిధానాలు రూపొం దించాలని కోరారు. డీలర్ల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో రేషన్ డీలర్ల రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.గంగాధరగౌడ, రాష్ట్ర కోశాధికారి పి.చిట్టిరాజు, కె.అప్పారావు, వాసిరెడ్డి నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.