
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల బరితెగింపు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు టీడీపీ కార్యాలయంలో రేషన్ షాప్ ఏర్పాటు చేశారు. పార్టీలకు అతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాల్ని అందించాలి. కానీ టీడీపీ నేతలు మాత్రం అందుకు విరుద్ధంగా పార్టీ కార్యాలయాన్ని రేషన్ కేంద్రంగా మార్చడంపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.
టీడీపీ కార్యాలయం నుంచి బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్న వైనంపై జనం ముక్కున వేలేసుకుంటున్నారు. విధిలేని పరిస్థితుల్లో పేదలు టీడీపీ కార్యాలయానికి వెళ్లి రేషన్ తెచ్చుకుంటున్నారు. అయితే, టీడీపీ కార్యాలయంలో రేషన్ షాప్ నిర్వహిస్తున్నా సివిల్ సప్లైస్ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం, టీడీపీ ఆఫీస్‌లో రేషన్ షాపు నిర్వహణ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Comments
Please login to add a commentAdd a comment