హుజూర్‌నగర్ (సూర్యాపేట): రాష్ట్రంలో రేషన్ షాపుల్లో పూర్తిస్థాయిలో సన్న బియ్యం ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లో కొనసా గుతున్న అభివృద్ధి పనులపై ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖల అధికారులతో ఆది వారం హుజూర్‌నగర్‌లోని మంత్రి క్యాంప్ కార్యాల యంలో ఎమ్మెల్యే పద్మావతితో కలిసి సమీక్ష నిర్వ హించారు.
అనంతరం ఆయన విలేకరులతో మా ట్లాడుతూ... ఉమ్మడి ఏపీలో ఏర్పాటైన లిఫ్టుల్లో పని చేయని వాటిని పూర్తి సామర్థ్యంతో నడిచే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామ న్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం గతంలో కోట్ల రూపా యలతో లిఫ్టులు మంజూరు చేశారు కానీ వాటిని సరిగ్గా నిర్వహించలేదని ఆరోపించారు. అటువంటి వాటిని సరిగ్గా నిర్వహించేందుకు, మరమ్మతులు చేపట్టేందుకు ప్రతి మూడు నాలుగు లిఫ్టులకు కలిపి ఫిట్టర్ ఆపరే టర్‌తో పాటు ఎలక్ట్రీషియన్‌ను కూడా నియమించే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో నీటి సౌకర్యం ఉండి లిఫ్టులు లేని ప్రాంతాల్లో లిఫ్టులు మంజూరు చేయిస్తామని, అలాగే నూతన ఆయకట్టు సామర్థ్యాన్ని పెంచే ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment