గీకేస్తారు జాగ్రత్త!
మర్రిపాలెం : పెద్ద నోట్ల రద్దుతో నగదు రహిత లావాదేవీలు ఊపందుకున్నారుు. డెబిట్, క్రెడిట్, నెట్ బ్యాంకింగ్ సేవలు అమాంతంగా పెరిగారుు. గతంలో రోజుకు లక్షలాదిగా ఉంటే ప్రస్తుతం కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగుతుండడం విశేషం. జిల్లా వ్యాప్తగా రోజు దాదాపు రెండు లక్షల నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నారుు. అరుుతే ఆన్‌లైన్ చెల్లింపుల ప్రక్రియలో ఖాతాదారులు అప్రమత్తంగా లేకపోతే నష్టం తప్పదు. జాగ్రత్త పాటించకపోతే మోసాలకు అవకాశం లేకపోలేదు. ఇప్పటికే కొత్త కొత్త సైబర్ నేరాలు పుట్టుకొస్తున్నారుు.
బ్యాంకు ఖాతాల్లోని నగదు మాయమవుతోంది. క్రెడిట్ కార్డుతో యజమానికి తెలియకుండా చెల్లింపు జరుగుతోంది. ఇలాంటి పరిణామాలతో ఖాతాదారులు భయపడే దుస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఆన్‌లైన్ మోసాలతో అనేకులు బాధితులయ్యారు. సైబర్ నేరంతో పట్టుబడితే జైలు జీవితం గడపాల్సి వస్తుందని తెలియక మోసాలకు పాల్పడుతున్నా రు. అరుుతే చిన్నపాటి జాగ్రత్తలతో మోసా లకు దూరంగా ఉండవచ్చుననేది కాస్త ఉపశమనమే.
వివిధ రకాల మోసాలు : సైబర్ నేరాల్లో బెంగళూరు అగ్రస్థానంలో ఉంటే ముంబరుు, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ నగరాలు అదే కోవలో నడుస్తున్నారుు. సైబర్ స్టాల్కింగ్, బ్లాక్ మెరుులింగ్, హాకింగ్, ఫిషింగ్, స్పామింగ్, ఫార్మింగ్, అబ్సెయానిటీ, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్, డేటా థెఫ్ట్, క్యాష్ ట్రాన్‌సఫర్, తదితర సైబర్ నేరాలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యారుు. లాటరీ లు, గిఫ్ట్‌లు, బంపర్ డ్రాల పేరుతో మోసపోతున్న బాధితులున్నారు. బయటకు చెబితే పరువు పోతోం దని సైబర్ బాధితులు బయటపడటం లేదు. ఇప్పటికే సైబర్ నేరాలతో రూ.లక్షలు పోగొట్టుకున్న బాధితులు పోలీస్‌స్టేషన్‌ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వందల సంఖ్యలో కేసులు నమోదయ్యారుు. సైబర్ నేరాలకు పాల్పడేవారంతా అధికంగా 25నుంచి 40 ఏళ్ల మధ్య యువకులని తేలింది. సైబర్ నేరాలకు పాల్పడేవారికి ఐటీ యాక్ట్, ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) చట్టంలో ఆయా సెక్షన్‌ల ప్రకారం శిక్ష పడుతోంది.
అవగాహన లోపంతోనే
చిన్నపాటి తప్పిదాలతోనే జనం సైబర్ మోసాల బారిన పడుతున్నారు. నేరగాళ్లు బ్యాంక్ అధికారుల్లా మాట్లాడి వివరాలు రాబట్టడం, అంతర్జాతీయ కంపెనీల లాటరీలో మీరు ఎంపికయ్యారంటూ చెప్పగానే ’ఈ-మెరుుల్’ సందేశాలకు తిరిగి వివరాలు పంపడం, డెబిట్ కార్డు పిన్ నంబర్ చెప్పడంతో సైబర్ నేరాలు సులభంగా జరిగిపోతున్నారుు.
ఇలా జాగ్రత్త పడొచ్చు
ఖాతాదారులు బ్యాంక్ ఖాతా వివరాలు, డెబిట్ కార్డు నంబర్ ఇతరులకు చెప్పొద్దు
పిన్ నంబర్ రహస్యంగా ఉంచాలి. కార్డు మీద, పర్సులో ఎక్కడా రాసి పెట్టుకోకూడదు
బ్యాంకుల నుంచి సిబ్బంది, ఇతర స్థారుు అధికారులు ఫోన్‌లలో వివరాలు సేకరించరని గ్రహించాలి
అనుమానం వస్తే పోలీసులకు ఫిర్యాదివ్వాలి
ఏటీఎం కేంద్రాలు, పోస్ (పీవోఎస్)యంత్రాలలో పిన్ నంబర్ స్వయంగా నమోదు చేయగలగాలి. ఇతరుల సహాయం తీసుకోవద్దు. ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసే సందర్భాలలో సదరు సంస్థ గుర్తింపును పరిశీలించాలి. అతి తక్కువ ధరలు, మోసపూరిత ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి.