Cash Transfer
-
మరింత సమర్థంగా ‘ప్రత్యక్ష నగదు బదిలీ’
సాక్షి, అమరావతి: ప్రజా సంక్షేమంలో దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం.. పథకాల అమలులో పారదర్శకతకు, నిష్పాక్షికతకు పెద్ద పీట వేస్తోంది. ఇందులో భాగంగా ప్రతి పథకాన్ని ప్రతి లబ్ధిదారుకి ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అందిస్తోంది. దీని ద్వారా అవినీతి, ఆశ్రితపక్షపాతానికి తావు లేకుండా పథకం ఫలాలు ప్రజలకు అందుతున్నాయి. ప్రత్యక్ష నగదు బదిలీని మరింత సమర్ధంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన పలువురు మంత్రులు సభ్యులుగా రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్ర స్థాయి కమిటీ నిర్ణయాలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అధ్యక్షతన పలు శాఖల అధికారులు సభ్యులుగా ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ‘ప్రత్యక్ష నగదు బదిలీకి అత్యంత సానుకూల ప్రభావం ఉన్న నేపథ్యంలో పథకాల వర్క్‌ఫ్లోను నిరంతరం క్రమబద్ధీకరించడంతో పాటు కొత్తగా వస్తున్న సాంకేతికతలను స్వీకరించడం, వివిధ విభాగాలను సమన్వయం చేయడం, లీకేజీలను తగ్గించడం బదిలీ వ్యయాన్ని తగ్గించడం ద్వారా మరింత సమర్ధవంతంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నవరత్నాల్లోని పలు పధకాలను ప్రత్యక్ష నగుదు బదిలీ ద్వారా అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుంది. వివిధ పథకాల లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా ఆర్ధిక సాయం అందుతోంది. సమర్ధంగా, పారదర్శకంగా, జవాబుదారీగా ఎటువంటి లీకేజీ లేకుండా ప్రత్యక్ష నగదు బదిలీ అమలవుతోంది అనడానికి లబ్ధిదారులే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నారు. అలాగే ఈ విధానం సామాజిక శ్రేయస్సుపై సానుకూల ప్రభావం చూపుతోంది. లబ్ధిదారులతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తోంది. ఇలాంటి ప్రత్యక్ష నగదు బదిలీని మరింత సమర్ధంగా అమలు చేయడం కోసమే సమన్వయ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది’ అని ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. రాష్ట్రస్థాయి ప్రత్యక్ష నగదు బదిలీ కమిటీ ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, ఐటీ, పరిశ్రమలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ, కార్మిక, ఉపాధి, శిక్షణ, మహిళా, శిశు అభివృద్ధి శాఖల మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి సభ్య కన్వీనర్‌గా ఉంటారు. ఈ కమిటీకి ముఖ్యమంత్రి ఏ మంత్రినైనా లేదా నిపుణులనైనా ఆహ్వానించవచ్చు. రాష్ట్రస్థాయి కమిటీ లక్ష్యాలు రాష్ట్రస్థాయి కమిటీ ప్రత్యక్ష నగదు బదిలీకి విస్తృత దృష్టితో దిశను నిర్ధారిస్తుంది. ప్రత్యక్ష నగదు బదిలీ విస్తృత విధానాలు, లక్ష్యాలు, వ్యూహాలను రాష్ట్ర స్థాయి కమిటీ నిర్ణయిస్తుంది. మరింత సమర్ధత, పారదర్శకత, జవాబుదారీ పెంపొందించే లక్ష్యాలను నిర్ధారిస్తుంది. ఎగ్జిక్యూటివ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఆర్థిక శాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక సీఎస్, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి, ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక సీఎస్, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, కార్మిక శాఖ కార్యదర్శి, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రణాళికా శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి సభ్య కన్వీనర్‌గా ఉంటారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ లక్ష్యాలు ఎగ్జిక్యూటివ్ కమిటీ రాష్ట్ర స్థాయి కమిటీ నిర్ణయాల అమలుకు చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర స్థాయి కమిటీ నిర్ణయాలను నిరంతరం పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవడానికి చర్యలు తీసుకుంటుంది. -
PM PRANAM Scheme: ఈ పథకంతో ఆహార భద్రతకు ప్రమాదం
కేంద్ర ప్రభుత్వం ‘పీఎం ప్రణామ్’ పథకాన్ని చర్చల కోసం విడుదల చేసింది. ఈ పథకాన్ని రాష్ట్రాలు ఆమో దిస్తే చట్టం చేయాలని నిర్దేశించారు. దేశంలో ఎరువుల వాడకం విచక్షణా రహితంగా పెరుగుతున్నదనీ, ఆ విని యోగాన్ని తగ్గించాలనీ ఈ పథకాన్ని రూపొందించారు. ఎరువుల వినియోగం తగ్గితే వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత తగ్గిపోతుంది. ఇప్పటికే వంటనూనెలు, పప్పులు, పంచదార, పత్తి, ముతక ధాన్యాలను దిగుమతి చేసుకుంటున్నాము. గతంలో ఇవన్నీ ఎగుమతి చేసిన దేశం మనది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీఓ) విధానాలు వచ్చిన తర్వాత, స్వయంపోష కత్వంలో ఉన్న దేశం సబ్సిడీలు తగ్గించడంతో దిగుమతులపై ఆధారపడుతున్నాము. ‘పీఎం ప్రణామ్’(పీఎం ప్రమోషన్ ఆఫ్ ఆల్టర్నేట్ న్యూట్రియంట్స్ ఫర్ అగ్రికల్చర్ మేనేజేమెంట్) పథకం ఎరువుల సబ్సిడీలను కోత పెట్టాలని స్పష్టంగా చెపుతున్నది. 2017–18లో 528 లక్షల టన్నుల ఎరువులు విని యోగించాము. 2021–22లో 640 లక్షల టన్నులకు వినియోగం పెరిగింది. ఈ పెరుగుదలను తగ్గించడానికి ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పథకం ప్రకారం ఎరువులకు ఇస్తున్న సబ్సిడీని ఆదా చేస్తారు. ఆదా చేసిన దానిలో 50 శాతం రాష్ట్రాలకు ఇస్తారు. ఈ 50 శాతంలో 70 శాతం గ్రామ, జిల్లా, బ్లాక్‌లకు ప్రత్యామ్నాయ ఎరువుల సాధనకు ఇస్తారు. మిగిలిన 30 శాతం ఎరువుల తగ్గింపుపై, సేంద్రీయ ఎరువులపై అవగాహన కల్పించడానికీ, రైతులను చైతన్యపర్చడానికీ శిక్షణ ఇస్తారు. మిగిలిన 50 శాతం కేంద్రప్రభుత్వం తన బడ్జెట్లో కలుపుకొంటుంది. భారతదేశంలో హెక్టారుకు 175 కిలోల ఎరువులు వాడుతున్నాము. హెక్టారు ఉత్పాదకత 3,248 కిలోలు వస్తున్నది. 43 కోట్ల ఎకరాలు సాగుచేస్తున్న దేశంలో నేటికి 9 కోట్ల ఎకరాల భూమి బీడుగా మారింది. జనాభా ఏటా 1.9 శాతం పెరుగుతున్నది. పెరిగిన జనాభాకు ఆహారధాన్యాల ఉత్పత్తిని మరింత పెంచాలి. వాస్తవానికి భారతదేశంలో 80 కోట్ల మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. అందులో 40 కోట్ల మంది దినసరి ఆహారధాన్యాల వాడకం 450 గ్రాముల నుండి 325 గ్రాములకు తగ్గిపోయింది. సేంద్రీయ ఎరువులను, రసాయనిక ఎరువులను కలిపి వాడడం ద్వారానే వ్యవసాయోత్పత్తులు పెరుగుతాయి. చైనాలో 25.5 కోట్ల ఎకరాలలో 61.22 కోట్ల టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి చేస్తున్నారు. హెక్టారుకు 6,081 కిలోలు ఉత్పత్తి అవుతున్నది. 2018 గణాంకాల ప్రకారం హెక్టారుకు 393.2 కిలోల ఎరువులు వాడుతున్నారు. ఎరువుల వినియోగం పెంచడంతో మనదేశం కన్నా రెట్టింపు ఉత్పత్తి, ఉత్పాదకత పెరుగుతున్నది. పైగా వారు 2.77 బిలియన్ డాలర్ల ఎరువులను ఎగుమతి చేస్తున్నారు. ఎరువుల వినియోగాన్ని పెంచకుండా ఉత్పత్తి, ఉత్పాదకత పెరగదు. ఈమధ్య శ్రీలంక అనుభవం చూసినపుడు సేంద్రీయ ఎరువుల వాడకంతో ఆహారధాన్యాల ఉత్పత్తి తగ్గిపోయి తీవ్ర సంక్షోభంలో పడి ప్రభుత్వమే కూలిపోయింది. ఈ పథకం అమలుచేస్తే భారతదేశంలో కూడా అలాంటి పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికే వ్యవసాయ రంగంలోకి 8 కార్పొరేట్ సంస్థలు వచ్చి తమ వ్యాపారాలు సాగిస్తున్నాయి. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి చేయడంకన్నా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటేనే వారికి మంచి లాభాలు వస్తాయి. 2015లో శాంత కుమార్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం, కేంద్ర ప్రభుత్వ కొనుగోలు సంస్థలను ఎత్తివేయడం, సబ్సిడీని నగదు బదిలీగా మార్చడం చేయాలని ఇచ్చిన సలహాలను ప్రస్తుతం మోదీ ప్రభుత్వం అమలుచేస్తున్నది. మనకు ఎగుమతులు చేస్తున్న దేశాలు తమ బడ్జెట్లలో 7 నుండి 10 శాతం వ్యవసాయ రంగానికి కేటాయిస్తున్నాయి. పైగా ముడి వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేసి అదనపు లాభానికి భారతదేశానికి ఎగుమతి చేస్తూ వేలకోట్ల లాభాలు గడిస్తున్నాయి. దిగుమతులు రావడం వల్ల స్థానిక పంటల ధరలు తగ్గి రైతులకు గిట్టుబాటు కావడంలేదు. కార్పొరేట్ సంస్థలు వ్యవసాయరంగంలో తమ ప్రాబల్యం పెంచడానికి వీలుగా ఇలాంటి పథకాలను తేవడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం రుణాలు ఇవ్వక పోవడం, సబ్సిడీలకు కోతపెట్టడంతో రైతులు మైక్రోఫైనాన్స్ సంస్థల బారిన పడి, వారికి వడ్డీ చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికీ వ్యవసాయ రంగానికి కేంద్ర బడ్జెట్లో 2.5 శాతం మాత్రమే సబ్సిడీ ఇస్తున్నారు. దీనిని 7 శాతానికి పెంచాలి. ఎరువులను శాస్త్రీయంగా వినియోగించడానికి వీలుగా భూసార పరీక్షలు జరిపి రైతులను చైతన్య పరచాలి. అంతేగానీ ఇలాంటి ప్రమాదకర పథకాలను అమలు పరచరాదు. - సారంపల్లి మల్లారెడ్డి ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు -
Huzurabad Bypoll: ఈ ఎన్నిక చాలా ఖరీదు గురూ!
సాక్షి, కరీంనగర్: ఒకప్పుడు పాడుబడిన జీపు అటూ ఇటూ ఊగుతూ పల్లెల్లోకి వచ్చేది. అభిమానులు దయతలచి రిపేరు చేయిస్తేనే రయ్‌మంటూ తిరిగేది. టాప్‌పైన తనకు ఓటేయాలంటూ నాయకుడు కనిపించేవాడు. ఎన్నికల్లో ప్రచారం కోసం ఖర్చంటే కేవలం భోజనాల కోసమే వెచ్చించేవారు. తలా కొంత పోగేసుకుని భాగస్వాములయ్యేవారు. ఇక ఎన్నికల డిపాజిట్ రూ.250 నుంచి రూ.500 ఉండేది. మొత్తం వ్యయం రూ.3,000 నుంచి రూ.10,000 వరకు అయ్యేది. ఇది నాలుగు దశాబ్దాల కిందటి మాట. చదవండి: హుజురాబాద్ ఉప పోరు: పెరిగిన పోలింగ్ సమయం.. ఎప్పటివరకంటే! కానీ నేడు వాహనాల రణగొణ ధ్వని చెవుల్లో మార్మోగుతోంది. ఒక వాహనం వెంట పదుల సంఖ్యలో వాహనాలు అనుసరిస్తున్నాయి. డీజే శబ్దంతో ప్రచారం హోరెత్తుతోంది. ఎన్నికల ఖర్చంటే మందు, విందు, నగదు, చీరలు, వాహనాలు, పెట్రోల్, డీజిల్ తదితరాలన్నీ కలసి అభ్యర్థి ఖాతా ఖాళీ అవుతోంది. సరాసరి అభ్యర్థి మొత్తం ఎన్నికల వ్యయం రూ.కోట్లలో ఉంటోంది. 1980 నుంచి పెరుగుతూ వస్తున్న ఎన్నికల వ్యయం తాలుకు చరిత్ర ఇది. చదవండి: ‘టీఆర్ఎస్కు ఓటేయకుంటే పింఛన్లు కట్ చేస్తామంటున్నారు’ నేటి రాజకీయవిుదీ.. ప్రత్యర్థిని ఆలోచనలో పడేయడమెలా?.. ఎన్నికల సభలకు భారీ జనాన్ని తరలించి ఇతరులను హడలెత్తించడమెలా? ఇదీ మారిన ఎన్నికల ప్రచార సరళి తీరును స్పష్టం చేస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో జరిగిన పలు సమావేశాలకు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. సభలకు భారీ వ్యయం ఓ సభ నిర్వహించాలంటే వేదిక ఏర్పాటుకే కనీసం రూ.10 లక్షల మంచి రూ.20 లక్షల వ్యయమవుతోంది. వేదిక తీర్చిదిద్దడం నుంచి కుర్చీలు, షామియానాలు, లైట్లు, మైకులు, ఇతరత్రా ప్యాకేజీలు మాట్లాడుకుంటున్నారు. ప్రాంగణంలో వేలల్లో కుర్చీలు కూడా ఏర్పాటు చేస్తుండటం అభ్యర్థులకు భారమవుతోంది. ఇక పార్టీలు కూడా ఖర్చు చేసే శక్తి ఉన్నవారికే టికెట్లు కేటాయిస్తుండటం పరిపాటి. పార్టీ ఎంత ఇస్తుంది.? తానెంతæ భరించేది లెక్కలు కట్టి మరీ అధిష్టానం వద్ద చెప్పుకోవడం ఏటా ఎన్నికల్లో జరుగుతున్న తంతు. మందు, విందు హుజూరాబాద్ ఉప ఎన్నిక తీర్పు ఎలా ఉంటుందోనన్న ఆసక్తి సర్వత్రా ఉండగా యువత మాత్రం అన్ని పార్టీల్లోనూ కనిపిస్తున్నారు. యువకులకు భలే సమయమొచ్చింది. ఖాళీగా ఉంటున్నవారిని పార్టీలు పట్టేశాయి. యువకులు జై కొట్టాలంటే వారికి రూ.500 నుంచి రూ.800 ఇస్తున్నారు. బీరు, బిర్యానీ అదనంగా వ్యయమవుతోంది. ద్విచక్ర వాహనాలు సమకూర్చుకోవడం, బ్యానర్లు, జెండాలు మోయడం, భారీ ర్యాలీలకు అండగా నిలవడం యువకులకు పనిగా మారింది. డబ్బు పంపకం.. వాహనాలే వాహనాలు సభకు, ర్యాలీలు, ప్రచారానికి వచ్చే మహిళలకు రూ.300 నుంచి రూ.500 వరకు ఇస్తున్నారు. వచ్చిన వారి హాజరు కూడా తీసుకుంటుండటంతో ఎన్నికల కోసం ఎలా çవ్యయం చేస్తున్నదీ ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. యువకులు హాజరైతే మందు, విందు రోజువారీ వెళ్లేటపుడు ఏర్పాటు చేస్తున్నారు. ఇక ద్విచక్రవాహనాలు, కార్ల వినియోగానికి అధికంగా ఖర్చు చేస్తున్నారు. ఖరీదైన కార్లతో పాటు ద్విచక్ర వాహనాలు ప్రచారంలో భాగమవుతున్నాయి. ఇలా ఒక్కో గ్రామంలో రూ.20 నుంచి రూ.40వేల వరకు ఖర్చు చేస్తున్నారు. ప్రలోభాలు శిక్షార్హమే ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టరాదు. తమకే ఓటు వేయాలంటూ ప్రలోభపెట్టినా, ప్రలోభాలకు లొంగినా భారత శిక్షాస్మృతిలోని 171(3) సెక్షన్ ప్రకారం ఏడాది పాటు జైలుశిక్ష, జరిమానా విధించే అవకాశముంది. అయితే ప్రలోభాల పరంపర ప్రతీ ఎన్నికల సమయంలో పెరుగుతూనే ఉంది. నిరాడంబరుడు చొక్కారావు నిరాడంబరుడు అంటే గుర్తుకొచ్చే తొలితరం రాజకీయ నాయకుల్లో జువ్వాడి చొక్కారావు ఒకరు. ఆయన 1957 నుంచి 1996 వరకు క్రియాశీల రాజకీయాల్లో ఉన్నా మచ్చలేని రాజకీయ నాయకుడిగా ఎదిగారు. తొలి ఎన్నికల్లో ఆయన ఖర్చు రూ.10వేలలోపేనని పలు సందర్భాల్లో చెప్పారు. ఢిల్లీలో లోక్‌సభ సమావేశాలకు బస్సులో వెళ్లేవారు. మాజీగా మిగిలాక కూడా బస్సులోనే ప్రయాణించారు. చివరగా బస్సులో ప్రయాణిస్తూనే గుండెపోటుకు గురయ్యారు. కాకా ఖర్చు అంతంతే ‘నేను 1957 ఎన్నికల్లో లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేశాను. అప్పుడు నా ఎన్నికల ఖర్చు కేవలం రూ.2వేలు మాత్రమే. చెన్నూరు నుంచి పోటీ చేసినపుడు కేవలం ప్రచారంతోనే గెలిచాను. ఓటర్లు ఇప్పటికీ మారలేదు. రాజకీయ నాయకులు, రాజకీయాల్లో మాత్రమే మార్చు వచ్చింది. ఎన్నికల వ్యయం తడిసిమోపెడవుతుంది’ అని 2014 ఎన్నికల్లో పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వెంకటస్వామి అన్న మాటలివి. నాడు వేలల్లో ఉన్న ఖర్చు నేడు రూ.కోట్లు దాటిందంటూ ఆవేదన చెందారు. నడకతోనే ప్రచారం, పర్యటనలు కరీంనగర్ తొలి పార్లమెంటు సభ్యుడు బద్దం ఎల్లారెడ్డి. నీతి, నిజాయతీ, నిరాడంబరతకు నిలువుటద్దంలా నిలిచారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అగ్రనేత అయిన ఎల్లారెడ్డి 1952లో తొలి సార్వత్రిక ఎన్నికల బరిలో కరీంనగర్ నుంచి నిలిచారు. ఆయన ఎన్నికల కోసం కాలినడకనే ప్రచారం నిర్వహించేవారు. ఎవరైనా వాహనం తెస్తే అందులో ప్రచారం చేసేవారు. ప్రజాప్రతినిధిగా ఎన్నికైనా ఆయన ఎన్నికల వ్యయం రూ.10వేల లోపే -
ఇక రోజంతా ఆర్టీజీఎస్ సర్వీసులు
ముంబై: పెద్ద మొత్తంలో నగదు బదిలీ లావాదేవీలకు ఉపయోగించే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్) సర్వీసులు ఇకనుంచీ రోజంతా 24 గంటలూ .. అందుబాటులో ఉండనున్నాయి. ఈ విధానం ఆదివారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో ఇలాంటి సర్వీసులను ఏడాది పొడవునా, వారమంతా, ఇరవై నాలుగ్గంటలూ అందిస్తున్న అతి కొద్ది దేశాల జాబితాలో భారత్ కూడా చోటు దక్కించుకుంది. దీన్ని సుసాధ్యం చేసిన భాగస్వాములందరినీ అభినందిస్తూ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ .. ట్విటర్లో ట్వీట్ చేశారు. ప్రస్తుతం రూ. 2 లక్షల దాకా నిధుల బదలాయింపునకు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్) విధానాన్ని, అంతకు మించితే ఆర్టీజీఎస్ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. నెఫ్ట్ సేవలు ఇప్పటికే రోజంతా అందుబాటులో ఉంటుండగా.. తాజాగా ఏడాది తర్వాత ఆర్టీజీఎస్ సేవలను కూడా ఆర్బీఐ అందుబాటులోకి తెచ్చింది. 2004 మార్చి 26న ఆర్టీజీఎస్ విధానం అమల్లోకి వచ్చింది. అప్పట్లో నాలుగు బ్యాంకులతో మొదలైన ఈ విధానం ద్వారా ప్రస్తుతం రోజుకు రూ. 4.17 లక్షల కోట్ల విలువ చేసే 6.35 లక్షల పైచిలుకు లావాదేవీలు జరుగుతున్నాయి. 237 బ్యాంకులు ఇందులో పాలుపంచుకుంటున్నాయి. 2020 నవంబర్‌లో ఆర్టీజీఎస్లో సగటు లావాదేవీ పరిమాణం రూ. 57.96 లక్షలుగా నమోదైంది. జైపూర్‌లో బ్యాంక్‌నోట్ ప్రాసెసింగ్ సెంటర్ బ్యాంక్ నోట్ల చలామణీ పెరుగుతున్న నేపథ్యంలో వీటి నిర్వహణ కోసం జైపూర్‌లో ఆటోమేటెడ్ బ్యాŠంక్నోట్ ప్రాసెసింక్ కేంద్రాన్ని (ఏబీపీసీ) ఏర్పాటు చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. ప్రింటింగ్ ప్రెస్‌ల నుంచి వచ్చే కరెన్సీ నోట్ల జమ, నిల్వ, డిస్పాచ్ మొదలైన కార్యకలాపాల కోసం దీన్ని ఉపయోగించనున్నారు. ఏబీపీసీ ఏర్పాటుకు అవసరమయ్యే సేవల నిర్వహణ కోసం కన్సల్టెన్సీ సంస్థల నుంచి ఆర్బీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. 2039–40 నాటికి దశలవారీగా సగటున రోజుకి 685 కోట్ల కొత్త నోట్లను, 2,775.7 కోట్ల పాత నోట్లను నిల్వ చేసే సామర్థ్యంతో ఏబీపీసీని రూపొందించనున్నారు. 2001 మార్చి నుంచి 2019 మార్చి దాకా చలామణీలో ఉన్న బ్యాంక్ నోట్ల పరిమాణం 3 రెట్లు పెరిగింది. రాబోయే రోజుల్లో ఇది ఇంకా పెరుతుందని అంచనా. -
అదే ఏకైక డిమాండ్ కావాలి - చిదంబరం
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కల్లోలం, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్రాల ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ నేపథ్యంలో కేంద్ర మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రెస్ నేత పీ చిదంబరం స్పందించారు. లాక్డౌన్ వల్ల గత 18 రోజులలో ఉద్యోగాలు, ఉపాధిని కోల్పోయిన పేదలను ఆదుకోవాల్సిందిగా కోరాలని ఆయన కోరారు. కరోనా సంక్షోభంతో దాచుకున్న కొద్దిపాటి సొమ్ము కూడా అయిపోయి, ఆకలితో అలమటిస్తూ పలువురు రోడ్డున పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే తక్షణమే ప్రతి పేద కుటుంబానికి నగదును బదిలీ చేయాల్సిందిగా కోరాలని ముఖ్యమంత్రులకు సూచించారు. ఇందుకు 65,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చవుతుందని, ఇది పెద్ద భారం కాదని మాజీ ఆర్థికమంత్రి పేర్కొన్నారు. శనివారం వరుస ట్వీట్లలో చిదంబరం ఈ సూచనలు చేశారు. పేద ప్రజల జీవితాలు కూడా ముఖ్యమైనవని ఈ రోజు ప్రధానమంత్రికి చెప్పాలని ముఖ్యమంత్రులు అమరీందర్ సింగ్,అశోక్ గెహ్లోట్, భూపేష్ భాగెల్, వి నారాయణసామి, ఉద్దవ్ ఠాక్రే , పళనిస్వామిలను ఉద్దేశించిన చిదంబరం ట్వీట్ చేశారు. కోవిడ్-19 (కరోనా వైరస్) పై పోరాడుతున్నట్టుగానే, పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేయాలన్నారు. పేదలు ఉపాధి కోల్పోయారు, వారు ఆకలితో అలమటిస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? అని చిదంబరం ప్రశ్నించారు. పేదల సంక్షేమమే ఏకైక డిమాండ్ గా వుండాలని ఆయన ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. కాగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్డౌన్ కొనసాగుతోంది. అయితే పెరుగుతున్న కేసుల నేపథ్యంలో లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 15వ తేదీ ఎత్తివేయాలా లేదా అనే విషయంపై ముఖ్యమంత్రులతో ప్రధాని శనివారం వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. అయితే మరో రెండు వారాల పాటు లాక్డౌన్ పొడిగింపునకే పలు సీఎంలు మొగ్గు చూపారు. ముఖ్యంగా ఏప్రిల్ 30వ తేదీ వరకూ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పొడిగించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సూచించారు. (అతిచౌక ధరలో ఐఫోన్) Chief Ministers - @capt_amarinder @ashokgehlot51 @bhupeshbaghel @VNarayanasami @uddhavthackeray @EPSTamilNadu should tell the Prime Minister today that just as LIVES are important LIVELIHOOD of the poor is important. — P. Chidambaram (@PChidambaram_IN) April 11, 2020 -
బడ్జెట్ 2019 - రైతులపై వరాల జల్లు
-
బడ్జెట్ 2019 : రైతులకు ఏటా రూ 6000 నగదు సాయం
సాక్షి, న్యూఢిల్లీ : రైతులపై మధ్యంతర బడ్జెట్ వరాల జల్లు కురిపించింది. పెట్టుబడి సాయంగా ఐదు ఎకరాల్లోపు ఉన్న రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయల నగదు సాయం ప్రకటించింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరిట ప్రకటించిన ఈ పథకంలో భాగంగా చిన్న, సన్నకారు రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు వెళుతుందని చెప్పారు. ఈ పథకం కోసం 76 వేల కోట్లు కేటాయించనున్నట్టు వెల్లడించారు. మూడు వాయిదాల్లో డబ్బు లబ్ధిదారులకు చేరుతుందన్నారు. తొలి విడతగా తక్షణమే రూ.2వేల ఆర్థిక సాయం రైతులకు అందజేస్తామని, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండా ఈ నగదు నేరుగా రైతుల ఖాతాలోకి మళ్లిస్తామని గోయల్ తెలిపారు. -
రూ. లక్ష దాటితే చిక్కే!
సాక్షి, హైదరాబాద్: అసలే ఎన్నికల సమరం... లెక్కలకు చిక్కకుండా నల్లధనం బుసలుకొట్టే సమయం... ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ నాయకులు కోట్లు కుమ్మరించడానికీ వెనుకాడని తరుణం... ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీసులు ఏ స్థాయిలో నిఘా ఏర్పాటు చేసినా నగదు రవాణా జరిగిపోతూనే ఉంటుంది. దీనికి చెక్ పెట్టడానికి ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. రూ. లక్షకు మించి లెక్కలు లేని నగదు తరలిస్తుంటే కచ్చితంగా స్వాధీనం చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డబ్బు పట్టుబడుతోంది. తమ అవసరాల కోసం నగదు తీసుకువెళ్తున్న సామాన్యులు ఇలాంటి చిక్కుల్లో పడకుండా ఉండాలంటే కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అవి ఏమిటంటే... - ఎన్నికల సీజన్ ముగిసే వరకు సామాన్యులు వీలైనంత వరకు పెద్ద మొత్తంలో నగదు తీసుకువెళ్లకపోవడమే ఉత్తమం. - తనిఖీలు, సోదాల నేపథ్యంలో పోలీసులకు రూ. లక్ష లేదా దానిలోపు నగదు లభిస్తే ఎలాంటి అభ్యంతరం చెప్పరు. అంతకుమించి కనిపిస్తే ఆ మొత్తానికి లెక్కలు అడుగుతారు. అవి చూపించలేని సందర్భంలో ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం ఆదాయపుపన్ను శాఖకు (ఐటీ) అప్పగిస్తారు. - అనుమానాస్పద స్థితిలో ఎవరి వద్దనైనా రూ. లక్ష లభించినా స్వాధీనం చేసుకుని ఐటీ అధికారుల వద్దకు పంపిస్తారు. అధికారులు తమ విచారణలో సంతృప్తి చెందితే లభించిన మొత్తంపై పన్ను, జరిమానా కట్టించుకున్నాకే మిగిలినవి తిరిగి ఇస్తారు. నగదు తప్పనిసరి అయితే ఇలా... - నగదు తరలింపునకు ప్రత్యామ్నాయంగా చెక్కులు జారీ చేసే అవకాశం ఉంది. దీని ద్వారా నగదు తమ ఎదుటి వారి ఖాతాలో జమ కావడానికి సమయం పడుతుందని భావిస్తే బ్యాంకుల నుంచి డిమాండ్ డ్రాఫ్ట్‌లు తీసుకునే అవకాశమూ ఉంది. - ఇది ఖర్చుతో కూడుకున్నదని భావిస్తే అవకాశం ఉన్న వారు ఆన్లైన్ ట్రాన్స్ఫర్, ఆర్టీజీఎస్, నిఫ్ట్ వంటి సౌలభ్యాలను ఉపయోగించుకోవచ్చు. వాటికి అయ్యే ఖర్చు నామమాత్రమే. - తప్పనిసరి పరిస్థితుల్లో నగదునే తీసుకువెళ్లాల్సి వస్తే బ్యాంకు స్టేట్మెంట్, డ్రా చేయడానికి ఉపకరించిన పత్రాలను వెంట ఉంచుకోవాలి. - రూ. 10 లక్షలకు మించి తీసుకువెళ్లాల్సిన పరిస్థితుల్లో బ్యాంకు అధికారులకు విషయం చెప్పి వారి నుంచి ధ్రువీకరణ తీసుకోవాల్సి ఉంటుంది. - కొద్ది రోజుల ముందే డ్రా చేసిన డబ్బును ఇప్పుడు తీసుకువెళ్తుంటే బ్యాంక్ పాస్‌బుక్, స్టేట్మెంట్ వెంట ఉంచుకోవాలి. ఆ అత్యుత్సాహంపై విమర్శలు... ఏదైనా క్రిమినల్ కేసుకు సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకున్న, అరెస్టు చేసిన నిందితుడిని దోషిగా తేలే వరకు మీడియా ముందుకు తీసుకురాకూడదు అనేది ప్రస్తుతం జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్న అంశం. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు నిర్వహిస్తున్న సోదాల్లో ‘లెక్కలు లేని’సొమ్ముతో దొరికే వ్యక్తులకు సంబంధించిన వివరాలు మీడియాకు ఎలా బయటపెడుతున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అనుమానాస్పదంగా ఉన్న నగదును స్వాధీనం చేసుకునే అధికారం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని 102 సెక్షన్ ప్రకారం పోలీసులకు ఉంది. అదే ఆదాయపుపన్నుశాఖ అధికారులైతే ఐటీ యాక్ట్‌లోని 132 సెక్షన్ కింద స్వాధీనం చేసుకుంటారు. ఆపై అనుమానితుడు ఆ సొమ్ముకు లెక్కచూపిస్తే తిరిగి అప్పగిస్తారు. ఈలోగా పోలీసులు చేస్తున్న హడావుడి కారణంగా వారి పరువు బజారున పడుతోంది. ఈ నేపథ్యంలో తనిఖీల్లో పట్టుబడిన సొత్తు, సొమ్ము అక్రమమని తేలితే తప్ప మీడియా ముందుకు అనుమానితులను తీసుకురాకపోవడం ఉత్తమమనే వాదన వినిపిస్తోంది. -
నగదు బదిలీలో మోసం!
పెదకళ్లేపల్లి(మోపిదేవి): నిత్యావసర సరుకుల పంపిణీలో నగదు రహిత లావాదేవీల వల్ల లబ్ధిదారులకు అన్యాయం జరుగుతోందని గుమ్మడి నాగేశ్వరావు ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిధిలోని పెదకళ్లేపల్లి షాపు నెంబర్ 22లో ఈ నెలలో తీసుకున్న రేషన్ సరుకులకు ఈ–పోస్ మిషన్ ద్వారా నగదు రహిత లావాదేవీలు జరిపినట్లు తెలి పారు. డీలర్ ఎకౌంట్లో నగదు పడలేదని చెప్పి సరుకులు ఇవ్వలేదని చెప్పారు. స్థానిక ఇండియన్ బ్యాంకుకు వెళ్లి పరి శీలించగా తన ఎకౌంట్ నుంచి నగదు బదిలీ అయినట్లు వస్తుందని వాపోయారు. ఇదే గ్రామానికి చెందిన చవాకుల వనజాక్షమ్మ 35 కిలోల బియ్యం, అర కిలో పంచదార తీసుకోగా రూపే కార్డు నుంచి రూ. 150 డీలర్ ఎకౌంట్‌కు జమ అయినట్లు తెలిపింది. రూపే కార్డుల బడ్వాడాపై అధికారులకే అవగాహన లేకపోవడంతో లబ్ధిదారులు నష్ట పోవాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలను అధికారులు పరిష్కరించి లబ్ధిదారులకు అన్యాయం జరగకుండా చూడాలని బాధితులు కోరుతున్నారు. -
మరో సరికొత్త పథకానికి వ్యూహ రచన
-
సంక్షేమ పథకాల స్థానంలో నగదు బదిలీ?
► కేంద్రం పరిశీలనలో కొత్త పథకం ► దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారందరికీ నెలనెలా ఆదాయం అందించే యోచన ► యూబీఐ పేరిట బడ్జెట్లో ప్రకటన చేసే అవకాశం ఉందంటూ ఊహాగానాలు ► ఇదే నిజమైతే ప్రస్తుత ప్రయోజనాలన్నీ నిలిచిపోతాయా.. లేక ప్రజలపై అదనపు పన్నుల మోతా? ► అమలు తీరుపై ఎన్నో సందేహాలు న్యూఢిల్లీ: నోట్ల రద్దుతో సామాన్యులు, పేదలకు చుక్కలు చూపెట్టిన కేంద్ర సర్కారు.. వారిని తన వైపునకు తిప్పుకునేందుకు సరికొత్త పథకానికి వ్యూహ రచన చేస్తోందా? దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రతి ఒక్కరికీ నెలకు కనీస నగదు చొప్పున అందించనుందా? వచ్చేనెల పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ సార్వత్రిక కనీస ఆదాయం (యూనివర్సల్ బేసిక్ ఇన్‌కం–యూబీఐ) పథకం పేరిట ప్రకటన చేసే అవకాశాలున్నాయంటూ అంచనాలు వెలువడుతున్నాయి. జమ్మూకశ్మీర్ ఆర్థిక మంత్రి హసీబ్ ద్రాబుతోపాటు కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం చేసిన ప్రకటనలు ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలందరికీ కనీస ఆదాయం అందించాలనేది తన ఆలోచనని, ఇందుకు సామాజిక భద్రతా నిధిని ఏర్పాటు చేయాలనుకుంటున్నానని జమ్మూకశ్మీర్ ఆర్థిక మంత్రి హసీబ్ ద్రాబు ఈ నెల 11న రాష్ట్ర బడ్జెట్ ప్రసంగం సందర్భంగా మనసులో మాట బయట పెట్టారు. ప్రజలకు నేరుగా ప్రయోజనాలను నగదు రూపంలో బదిలీ చేయాలనుకుంటున్నానని, ఇది అక్రమాలను అరికట్టడంతోపాటు, ప్రయోజనాల బదిలీ వ్యయాన్ని కూడా తగ్గిస్తుందని ఆయన పేర్కొన్నారు. కానీ బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టి తెలివిగా వ్యవహరించారు. ‘‘ప్రస్తుతానికి మేమే సొంతంగా దీన్ని అమలు చేయడం సాధ్యం కాదు. దీనికి ఆమోదం మాత్రమే కాదు.. కేంద్ర సర్కారు సాయం కూడా అవసరం’’ అని ద్రాబు అన్నారు. యూబీఐని దేశవ్యాప్తంగా అమలు చేసే అంశాన్ని 2017 కేంద్ర బడ్జెట్లో ప్రకటించే విషయమై ఏమైనా సమాచారం ఉందా? అంటూ విలేకరులు ద్రాబును ప్రశ్నించగా ఆయన సమాధానం ఇవ్వలేదు. ‘యూబీఐ అద్భుతమైన ఆలోచన’ అని గతేడాది సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం కొనియాడారు. ప్రజల ఉపాధితో సంబంధం లేకుండా వారికి ప్రతీ నెలా కనీస ఆదాయం అందించే ఆలోచన కేంద్రం పరిశీలనలో ఉందని ఆయన ధ్రువీకరించారు కూడా. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కావాలంటే జనవరి చివర్లో కేంద్ర బడ్జెట్‌కు ముందు ప్రకటించే ఆర్థిక సర్వే వరకు ఆగాల్సిందేనని తెలిపారు. దీంతో త్వరలో వెలువడే ఆర్థిక సర్వేలో ఈ అంశాన్ని పేర్కొనే అవకాశాలున్నాయని పరిశీలకలు అంచనా వేస్తున్నారు. ఒకవేళ నిజంగా కేంద్రం సామాజిక భద్రతకు సంబంధించిన ఈ పథకాన్ని ఆచరణలోకి తీసుకుంటే అత్యంత ప్రభావిత సంస్థాగత సంస్కరణ అవుతుందంటున్నారు. యూబీఐతో మార్పు? యూబీఐ మన దేశంలో ఎంతో మార్పును తీసుకొచ్చే పథకం అవుతుందన్నది కొంత మంది నిపుణుల అభిప్రాయం. ఇతరుల నుంచి పేదలను వేరు చేయాల్సి ఉందని వారు సూచిస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో దారిద్య రేఖకు దిగువన (బీపీఎల్) ఉన్న వారి జాబితాలో ఎంతో మంది పేదలకు చోటు లేదని, ఆ జాబితాలో పేరున్న కొన్ని కుటుంబాల వారు లంచాలతో చోటు సంపాదించుకుంటున్నారని యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియాలో గౌరవ ఆర్థిక శాస్త్ర ఆచార్యుడిగా పనిచేస్తున్న ప్రణబ్ బర్ధన్ అన్నారు. ఆధార్ కార్డు కూడా ఇందుకు ఉపకరించదని, ఎందుకంటే ఎవరు పేద, ఎవరు ధనిక అన్నది ఆధార్ కార్డుతో తెలుసుకోవడం కష్టమన్నది ఆయన అభిప్రాయం. అదే యూబీఐకి మళ్లడం ద్వారా బీపీఎల్ పేరుతో జరుగుతున్న అవినీతికి చెక్‌పెట్టవచ్చని ఆయన అభిప్రాయం. ఇక 30 శాతం ప్రజలు పేదరికంతో ఉన్న మన దేశంలో యూబీఐతో ఫలితాలు ఉంటాయన్నది మరికొందరు నిపుణుల కూడా పేర్కొంటున్నారు. పాశ్చాత్య దేశాలకు కొత్తకాదు సార్వతిక్ర కనీస ఆదాయం పథకానికి మూలం యూరోప్. ఇక్కడ ప్రజలకు వారి ఉపాధితో సంబంధం లేకుండా ప్రతీ పౌరుడికి నెల నెలా ఇంత చొప్పున ఇచ్చే విధానం ఉంది. నిజానికి పాశ్చాత్య దేశాల్లో అమల్లో ఉన్న యూబీఐ ప్రకారం ప్రజల ఆర్థిక, ఉపాధి స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరికి నగదు ప్రయోజనాలను అందించడం. ఇందులో ఎలాంటి షరతులు ఉండవు. ఈ ఏడాది జనవరి 1న ఫిన్లాండ్ ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని మొదలు పెట్టింది. 2,000 మంది ఉద్యోగులకు ప్రతీ నెలా ఒక్కొక్కరికి 560 యూరోలు (సుమారు రూ.40వేలు) అందించాలని నిర్ణయించింది. ఉద్యోగం సంపాదించినా ఈ ప్రయోజనాలను కొనసాగిస్తుంది. అసమానత్వం పెరిగిపోవడం వల్లే.. పాశ్చాత్య దేశాల్లో కనీస ఆదాయం ఆలోచన వెనుక అసమానత్వం పెరిగిపోవడమే ప్రధాన అంశంగా ఉంది. పారిశ్రామిక యుగంలో ఉపాధి అవకాశాలు మాత్రమే పేదలకు భరోసా ఇవ్వవన్న ఓ వాదన ఉంది. ఆర్థిక సంక్షోభ సమయాల్లో ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడితే బాధితులుగా మారేది కార్మికులేనని, వారికి కనీస ఆదాయ పథకాలు ఆదుకుంటాయన్నది కొందరి అభిప్రాయం. మరో వాదన ప్రకారం యూబీఐని అమలు చేయడం సులభం. ఎన్నో సంక్షేమ పథకాల పేరుతో పేదలకు ప్రయోజనాలు అందించడం అన్నది చాలా శ్రమతో కూడుకున్న పని. సరైన లబ్ధిదారులను గుర్తించడం, వారికి ప్రయోజనాలను సరిగా అందేలా చూడడం, లీకేజీలు జరగకుండా చూడడం అన్నది అంత సులవు కాదన్నది నిపుణులు పేర్కొంటున్నారు. యూబీఐ వంటివి పేదల సంక్షేమం విషయంలో అవినీతికి చెక్ పెట్టడానికి వీలవుతుందని పాశ్చాత్య దేశాల నిపుణల సూచనలు. పైగా పేదలకు ఆర్థిక స్వాతంత్యాన్ని ఇచ్చినట్టు కూడా అవుతుందంటున్నారు. ఎన్నో సందేహాలు..? కేంద్రం యూబీఐని తీసుకొస్తే దాని అమలు ఎలా...? అన్నదే ఇప్పుడు కీలకం. ప్రస్తుతం అమల్లో ఉన్న అనేక రకాల సామాజిక భద్రతా పథకాల స్థానంలో యూబీఐని తీసుకు వస్తుందా...? ప్రస్తుత సబ్సిడీలకు చరమగీతం పాడుతుందా..? అన్న సందేహాలున్నాయి. ప్రస్తుతం కేంద్రం బడ్జెట్లో 4 శాతం కంటే ఎక్కువ నిధులను సంక్షేమ కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నది. యూబీఐని తలకెత్తుకుంటే జీడీపీలో ఇది 11 శాతంగా ఉంటుందంటున్నారు. నిపుణులు చెబుతున్నదాని ప్రకారం యూబీఐ అనేది ప్రస్తుత సామాజిక భద్రతా పథకాల నుంచి తప్పుకోవడమే. వివిధ రూపాల్లో అందిస్తున్న సబ్సిడీలను నిలిపివేసి వారికి నగదును అందించడం. ఆ నగదుతో పేదలే నేరుగా ఆయా సేవలను అందుకోగలుగుతారు. వంటగ్యాస్ విషయంలో ప్రస్తుతం కేంద్రం చేస్తున్నది ఇదే. నేరుగా సబ్సిడీ మొత్తాన్ని లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. దీని ద్వారా దుర్వినియోగం గణనీయంగా తగ్గిన విషయం గమనార్హం. ఇక యూబీఐ వంటి పథకాలు ప్రజల్లో కష్టపడే తత్వాన్ని నీరుగారుస్తాయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. వ్యవస్థలో నగదు సరఫరా పెరిగి అధిక ద్రవ్యోల్బణానికి దారి తీస్తుందని, బడ్జెట్‌పై భారం భారీగా పెరిగిపోతుంద్న ఆందోళనలు సైతం ఉన్నాయి. అంత సులువు కాదు..? 30 శాతం మంది పేదలు, మానవాభివృద్ధి సూచీలో 130 ర్యాంకులో ఉన్న మన దేశానికి యూబీఐ ఎంత వరకు తగినది?, ప్రభుత్వ ప్రాధాన్య అంశాలైన ఆరోగ్యం, విద్యపై దీని ప్రభావం ఏ మేరకు ఉంటుంది అన్న సందేహాలు ఉన్నాయి. అలాగే, పేద, ధనిక తారతమ్యం ఎక్కువగా ఉన్న మన దేశంలో దీని నిర్వహణ అంత సులువేమీ కాదని, భారీ బడ్జెట్‌తో కూడుకున్న దీని నిర్వహణ పెద్ద సవాలేనన్నది నిపుణుల అభిప్రాయం. అన్ని నిదులు ఎక్కడి నుంచి వస్తాయ్? యూబీఐని అమలు చేయాలంటే పెద్ద ఎత్తున నిధులు అవసరం అని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. మన దేశంలో దారిద్య్ర రేఖకు దిగువన అంటే... రూ.32 నుంచి రూ.47 కంటే తక్కువ ఆదాయం గడిస్తున్న వారని వివిధ రకాల కమిటీలు తేల్చాయి. రూ.32 అనే అనుకున్నా... నెలకు రూ.960 రూపాయలు అయినా యూబీఐ కింద అందించాలి. అంటే ఏడాదికి రూ.11,520. దేశంలో అందరికీ కాకుండా పేదలకే అని తేల్చినా 37.5 కోట్ల మందికి కనీస ఆదాయాన్ని ఇవ్వాల్సి వస్తుంది. ఏడాదికి రూ.4.32 లక్షల కోట్ల భారం పడుతుంది. ఈ నిధులు సమకూర్చుకోవాలంటే కేంద్రం ముందున్నవి రెండే మార్గాలు. ఒకటి ప్రస్తుత సబ్సిడీలన్నింటినీ తగ్గించుకోవడం. లేదంటే ప్రజలపై అదనపు పన్నుల భారం మోపి నిధులు రాబట్టుకోవడం. -
గీకేస్తారు జాగ్రత్త!
మర్రిపాలెం : పెద్ద నోట్ల రద్దుతో నగదు రహిత లావాదేవీలు ఊపందుకున్నారుు. డెబిట్, క్రెడిట్, నెట్ బ్యాంకింగ్ సేవలు అమాంతంగా పెరిగారుు. గతంలో రోజుకు లక్షలాదిగా ఉంటే ప్రస్తుతం కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగుతుండడం విశేషం. జిల్లా వ్యాప్తగా రోజు దాదాపు రెండు లక్షల నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నారుు. అరుుతే ఆన్లైన్ చెల్లింపుల ప్రక్రియలో ఖాతాదారులు అప్రమత్తంగా లేకపోతే నష్టం తప్పదు. జాగ్రత్త పాటించకపోతే మోసాలకు అవకాశం లేకపోలేదు. ఇప్పటికే కొత్త కొత్త సైబర్ నేరాలు పుట్టుకొస్తున్నారుు. బ్యాంకు ఖాతాల్లోని నగదు మాయమవుతోంది. క్రెడిట్ కార్డుతో యజమానికి తెలియకుండా చెల్లింపు జరుగుతోంది. ఇలాంటి పరిణామాలతో ఖాతాదారులు భయపడే దుస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఆన్లైన్ మోసాలతో అనేకులు బాధితులయ్యారు. సైబర్ నేరంతో పట్టుబడితే జైలు జీవితం గడపాల్సి వస్తుందని తెలియక మోసాలకు పాల్పడుతున్నా రు. అరుుతే చిన్నపాటి జాగ్రత్తలతో మోసా లకు దూరంగా ఉండవచ్చుననేది కాస్త ఉపశమనమే. వివిధ రకాల మోసాలు : సైబర్ నేరాల్లో బెంగళూరు అగ్రస్థానంలో ఉంటే ముంబరుు, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ నగరాలు అదే కోవలో నడుస్తున్నారుు. సైబర్ స్టాల్కింగ్, బ్లాక్ మెరుులింగ్, హాకింగ్, ఫిషింగ్, స్పామింగ్, ఫార్మింగ్, అబ్సెయానిటీ, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్, డేటా థెఫ్ట్, క్యాష్ ట్రాన్సఫర్, తదితర సైబర్ నేరాలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యారుు. లాటరీ లు, గిఫ్ట్‌లు, బంపర్ డ్రాల పేరుతో మోసపోతున్న బాధితులున్నారు. బయటకు చెబితే పరువు పోతోం దని సైబర్ బాధితులు బయటపడటం లేదు. ఇప్పటికే సైబర్ నేరాలతో రూ.లక్షలు పోగొట్టుకున్న బాధితులు పోలీస్స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వందల సంఖ్యలో కేసులు నమోదయ్యారుు. సైబర్ నేరాలకు పాల్పడేవారంతా అధికంగా 25నుంచి 40 ఏళ్ల మధ్య యువకులని తేలింది. సైబర్ నేరాలకు పాల్పడేవారికి ఐటీ యాక్ట్, ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) చట్టంలో ఆయా సెక్షన్ల ప్రకారం శిక్ష పడుతోంది. అవగాహన లోపంతోనే చిన్నపాటి తప్పిదాలతోనే జనం సైబర్ మోసాల బారిన పడుతున్నారు. నేరగాళ్లు బ్యాంక్ అధికారుల్లా మాట్లాడి వివరాలు రాబట్టడం, అంతర్జాతీయ కంపెనీల లాటరీలో మీరు ఎంపికయ్యారంటూ చెప్పగానే ’ఈ-మెరుుల్’ సందేశాలకు తిరిగి వివరాలు పంపడం, డెబిట్ కార్డు పిన్ నంబర్ చెప్పడంతో సైబర్ నేరాలు సులభంగా జరిగిపోతున్నారుు. ఇలా జాగ్రత్త పడొచ్చు ఖాతాదారులు బ్యాంక్ ఖాతా వివరాలు, డెబిట్ కార్డు నంబర్ ఇతరులకు చెప్పొద్దు పిన్ నంబర్ రహస్యంగా ఉంచాలి. కార్డు మీద, పర్సులో ఎక్కడా రాసి పెట్టుకోకూడదు బ్యాంకుల నుంచి సిబ్బంది, ఇతర స్థారుు అధికారులు ఫోన్లలో వివరాలు సేకరించరని గ్రహించాలి అనుమానం వస్తే పోలీసులకు ఫిర్యాదివ్వాలి ఏటీఎం కేంద్రాలు, పోస్ (పీవోఎస్)యంత్రాలలో పిన్ నంబర్ స్వయంగా నమోదు చేయగలగాలి. ఇతరుల సహాయం తీసుకోవద్దు. ఆన్లైన్లో షాపింగ్ చేసే సందర్భాలలో సదరు సంస్థ గుర్తింపును పరిశీలించాలి. అతి తక్కువ ధరలు, మోసపూరిత ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. -
‘ఖాతా’ కష్టాలు
– ఉపాధి కూలీలకు డిసెంబర్ నుంచి నగదు బదిలీ – 40 శాతం మందికి బ్యాంక్ ఖాతాలు లేని వైనం జిల్లాలో ఉపాధి కూలీలు : 7,02,833 బ్యాంక్ ఖాతాలన్న వారు : 4,17,616 అకౌంట్లు లేని వారు : 2,85,217 గ్రామ పంచాయతీలు : 1003 బ్యాంక్ ద్వారా నగదు అందిస్తున్న పంచాయతీలు : 559 పోస్టాఫీస్ ద్వారా నగదు అందిస్తున్న పంచాయతీలు : 444 అనంతపురం టౌన్ : పెద్ద నోట్ల ప్రభావం ఉపాధి కూలీలపైనా పడుతోంది. ఇప్పటికే పోస్టాఫీసులకు చేరిన రూ.2 కోట్లు పంపిణీకి నోచుకోకపోవడంతో కూలీలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో అందరికీ బ్యాంక్ ఖాతాలు తప్పనిసరి చేయడంతో కూలీలు ఆందోళన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా 40 శాతం మందికి బ్యాంక్ అకౌంట్లు లేకపోవడంతో యంత్రాంగం తర్జనభర్జన పడుతోంది. కేంద్రం ఏడాది నుంచీ ఖాతాలు తప్పనిసరని చెబుతున్నా అధికారులు నిర్లక్ష్యం వహించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ నుంచే ఉపాధి కూలీలకు నగదు బదిలీ చేయాలని భావించారు. ఆ మేరకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే క్షేత్రస్థాయిలో ఇబ్బందులున్నాయన్న కారణంతో ఆగస్టుకు గడువు పొడిగించారు. అదీ సాధ్యం కాలేదు. ఈ క్రమంలో వచ్చే జనవరి నాటికి పూర్తి స్థాయిలో కూలీలందరికీ జన్‌ధన్ ఖాతాలు తెరిపించాలని ఇటీవల కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు తప్పనిసరిగా బ్యాంక్ ఖాతాలు తీయించాల్సిన పరిస్థితి వచ్చింది. బయోమెట్రిక్ ఉన్నా.. గతంలో ఉపాధి పనులు చేసిన వారి నుంచి పుస్తకాల్లో సంతకాలు తీసుకుని తపాలా సిబ్బంది నగదు పంపిణీ చేసేవారు. ఇందులో అక్రమాలు చోటుచేసుకోవడంతో వేలిముద్రల ఆధారంగా బయోమెట్రిక్‌ను అమల్లోకి తెచ్చారు. కొందరి వేలిముద్రలు సరిపోకపోవడం, మరికొందరి ఆధార్ సంఖ్య సరిపోకపోవడంతో సాంకేతిక సమస్యలు వచ్చి వేతనాల చెల్లింపు ఆలస్యమైంది. దీంతో ప్రత్యక్ష నగదు బదిలీకి కేంద్రం శ్రీకారం చుట్టింది. జాబ్ కార్డులు ఉన్న వారందరికీ ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన (పీఎంజేడీవై) లేదా వ్యక్తిగత పొదుపు ఖాతాలు ఏదో ఒక బ్యాంక్‌లో ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించింది. కాగా జిల్లాలో ప్రస్తుతం ఉపాధి హామీ పథకం కింద 7,02,833 మందికి జాబ్‌కార్డులు ఉన్నాయి. ఇందులో 4,17,616 మందికి మాత్రమే బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. ఇంకా 2,85,217 మందికి ఖాతాలు తెరిపించాల్సి ఉంది. ఖాతాలున్న వారిలో కూడా 43,039 మందివి వెరిఫికేషన్ చేయాల్సి ఉంది. పంపిణీకి నోచుకోని రూ.2 కోట్లు జిల్లాలోని 63 మండలాల పరిధిలో 1,003 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటి వరకు 559 పంచాయతీల్లో మాత్రమే కూలీలకు బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. మిగిలిన 444 పంచాయతీల్లో పోస్టాఫీసుల ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. పెద్ద నోట్లు రద్దు చేసినప్పటి నుంచి తపాలా అధికారులు కూలి పంపిణీకి పుల్‌స్టాప్ పెట్టారు. ఈ క్రమంలో రూ.2 కోట్లు పంపిణీకి నోచుకోక కూలీలు ఇబ్బంది పడుతున్నారు. కూలీలందరికీ 'రూపే' కార్డులు ప్రభుత్వ ఆదేశాల మేరకు కూలీలందరికీ బ్యాంక్ ఖాతాలు తెరిపించి 'రూపే' కార్డులు అందిస్తాం. జన్‌ధన్ ఖాతాల కోసం గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. పోస్టాఫీసుల్లో పంపిణీకి నోచుకోని నగదుపై అధికారులతో మాట్లాడుతా. నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేస్తాం. – నాగభూషణం, డ్వామా పీడీ -
బాబోయ్ బ్యాంకు చార్జీలు!
* ప్రతి లావాదేవీకీ వడ్డింపే వడ్డింపు * కనీస నిల్వ నుంచి స్టేట్మెంట్ వరకూ ఇదే తీరు * ఏటీఎం లావాదేవీలు సహా అన్నిటికీ పరిమితులే * టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ తగ్గుతున్న ఖర్చు * ఖాతాదారులకు మాత్రం అందని ప్రయోజనం * ఆన్లైన్లో నేరుగా లావాదేవీలు జరుపుకున్నా చార్జీల మోత * ముందే తెలుసుకోకపోతే జేబుకు ప్రమాదమే!! ఖాతాదారులందరికీ బ్యాంకులు పాస్ బుక్కులిచ్చేవి. ప్రతి లావాదేవీనీ ఆ పాస్‌బుక్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేవి. నగదు కావాలనుకున్నవారు బ్యాంకుకు వచ్చి విత్‌డ్రాయల్ స్లిప్పై రాసి.. డ్రా చేసుకునేవారు. వేరొకరి ఖాతాకు నగదు బదిలీ చేయాలంటే... అది కూడా బ్యాంకుకొచ్చి, చెక్కు ఇస్తేనే సాధ్యమయ్యేది. అయితే ఇదంతా గతం. ఆన్లైన్ బ్యాంకింగ్ వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. పాస్‌బుక్‌లు లేవు. విత్‌డ్రాయల్స్ నేరుగా ఏటీఎంలలోనే. నగదు బదిలీ నేరుగా కస్టమరే చేసుకోవచ్చు. నిజమే!! ఖాతాదారులకు దీంతో చాలా మేలు జరిగింది. మరి ఖాతాదారులకేనా? పాస్బుక్లివ్వటం, వాటిని అప్డేట్ చేయటం... మూడు నెలలకోసారి ఇళ్లకు స్టేట్మెంట్లు పంపటం... నగదు బదిలీకి, విత్‌డ్రాయల్స్‌కు సిబ్బంది పని చేయాల్సి రావటం... ఇవన్నీ బ్యాంకులకూ మిగిలినట్టేగా? టెక్నాలజీపై ఇన్వెస్ట్ చేయటం వల్ల బ్యాంకులకూ లబ్ధి కలిగినట్లేగా? మరి ఈ సర్వీసులన్నిటికీ ఇంతకు ముందు లేని చార్జీలు ఇపుడెందుకు వేస్తున్నారు? స్టేట్‌మెంటుకు రూ.100, ఏటీఎంలో ఐదు లావాదేవీలు దాటితే ప్రతి లావాదేవీకీ రూ.20పైనే, నగదు బదిలీ చేసినా, ఖాతా ఉన్న బ్రాంచి కాకుండా వేరొక బ్రాంచిలో డిపాజిట్ చేసినా ఎందుకు వడ్డిస్తున్నారు? ఇలాగైతే ఖాతాదారులందరినీ డిజిటల్ వైపు మళ్లించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందా? అసలే ఆన్లైన్ బ్యాంకింగ్ భద్రతపై బోలెడన్ని భయాలున్నాయి. దానికి తగ్గట్టే ఏ కాస్త ఏమరపాటుగా ఉన్నా మోసపోవటమూ తప్పట్లేదు. ఇన్నిటి మధ్యా బ్యాంకులు కూడా చార్జీలు వడ్డిస్తుంటే ఖాతాదారులేమైపోవాలి? అసలు బ్యాంకులనే కాదు!! డిజిటైజేషన్ వల్ల లబ్ధి పొందుతున్న రైల్వేల్లాంటివి కూడా కస్టమర్లపై అదనంగా బాదుతున్నాయంటే ఏమనుకోవాలి? వినియోగదారులకు అందని టెక్నాలజీ లాభం బ్యాంకింగ్ టెక్నాలజీ వల్ల ఏమైనా మార్పులొస్తే అవి ఖాతాదారులకు మేలు చేయాలి. కానీ ఏటీఎంలకు ఖాతాదారుల్ని అలవాటు చేయడానికి... బ్యాంకుల్లో జరిపే లావాదేవీలపై చార్జీలు విధించారు. దీంతో అంతా ఏటీఎంలకు అలవాటు పడ్డారు. అంతలో ఏటీఎం లావాదేవీలకూ పరిమితులు పెట్టి... ఇంటర్నెట్ బ్యాంకింగ్ వైపు మళ్లించారు. సరే కదా అని నెట్ బ్యాంకింగ్ పై ఆధారపడితే... ప్రతి లావాదేవీకీ ఎంతో కొంత వడ్డిస్తూనే ఉన్నారు. అంటే... బ్యాంకులకెళ్లినా, వెళ్లకున్నా పరిమాణంలో తేడా తప్ప మోత మాత్రం తప్పటం లేదు. పెపైచ్చు ప్రతిదానికీ పరిమితులే. గీత దాటితే పెనాల్టీలు కూడా. ఇదీ... చార్జీలు వడ్డిస్తున్న తీరు ప్రతీ నెలా ఖాతాలో బ్యాంకు నిర్దేశించిన కనీస బ్యాలెన్స్ లేకపోతే.. రూ.50 నుంచి మొదలై రూ.600 పైగా పెనాల్టీలు ఉంటున్నాయి. వీటికి మళ్లీ సేవా పన్నులు, సెస్సులు గట్రా అదనం. అందుకే ఆయా బ్యాంకులు నిర్దేశించిన కనీస మొత్తాన్ని ఎప్పుడూ ఖాతాలో ఉండేలా చూసుకోవటం ఉత్తమం. * ఏటీఎంల వాడకానికి వస్తే... ప్రాంతాన్ని బట్టి (మెట్రోలు, సిటీలు మొదలైనవి) పరిమితులొచ్చేశాయి. చాలా మటుకు సొంత బ్యాంకు ఏటీఎంలలో నెలకు ఐదు లావాదేవీలు మాత్రమే ఉచితం. ఇతర బ్యాంకులకు చెందిన ఏటీఎంలలో మాత్రం నెలకు 3 లావాదేవీలు ఉచితంగా నిర్వహించుకోవచ్చు. ఏటీఎంలో నగదు విత్‌డ్రా చేయటం మాత్రమే లావాదేవీ అనుకుంటారు చాలా మంది. అదేమీ కాదు. బ్యాలెన్సు ఎంక్వయిరీ చేసినా... మినీ స్టేట్మెంట్ తీసుకున్నా అవి కూడా లావాదేవీలే. పరిమితి దాటితే ఒక్కో లావాదేవీకి రూ.5 నుంచి రూ. 20 పైగానే చార్జీలుంటున్నాయి. అందుకని సాధ్యమైనంత వరకూ ఏటీఎంలో తక్కువ లావాదేవీలు నిర్వహించడమే ఉత్తమం. * నేరుగా బ్యాంకు శాఖలకు వెళ్లి లావాదేవీలు నిర్వహించినా బాదుడు తప్పదు. ఉదాహరణకు ఐసీఐసీఐ బ్యాంకును తీసుకుంటే బేస్ బ్రాంచ్‌లో (ఒక సిటీలోని అన్ని శాఖలు.. క్యాష్ యాక్సెప్టర్ మెషీన్లలో) నెలకు నాలుగు నగదు లావాదేవీలు మాత్రమే ఉచితం. డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్ అన్నీ కలిసి నాలుగన్న మాట. ఆ తర్వాత ప్రతి రూ.1,000కి అదనంగా రూ. 5 మేర చార్జీ ఉంటుంది. ఇక బేస్ బ్రాంచ్ కాకుండా వేరే నగరంలోని శాఖల నుంచి క్యాష్ డిపాజిట్ చేస్తే ప్రతి వెయ్యి రూపాయలకు రూ. 5 చొప్పున చార్జీ ఉంటోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో నగదు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్ (సెల్ఫ్) లావాదేవీలు ఐదు దాటాయంటే, ఆరో దాన్నుంచి ప్రతీ లావాదేవీకి రూ. 100 చొప్పున చార్జీలుంటున్నాయి. వీటికి పన్నులు అదనం. * పలు బ్యాంకులు డెబిట్ కార్డులు, ఏటీఎం కార్డులకు వార్షికంగా రూ.100 నుంచి నిర్వహణ చార్జీలు వసూలు చేస్తున్నాయి. కొత్త కార్డు తీసుకోవాలనుకుంటే ఎలాగూ వాటికి అదనపు ఛార్జీలు తప్పవు. కాకపోతే కొన్ని బ్యాంకులు మీ కార్డు చెల్లుబాటయ్యే గడువు ఇంకా ఉన్నా సరే... కొత్త కార్డులొచ్చాయని, మీ ఫోటో పెట్టుకోవచ్చని... ఇలా రకరకాల స్కీమ్‌లతో వసూళ్లు మొదలెడుతున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. * ఖాతాదారు నుంచి వసూలు చేసుకునే ఏ అవకాశాన్నీ వదలని బ్యాంకులు .. ఆఖరికి ఎస్ఎంఎస్ అలర్ట్‌లను కూడా విడిచిపెట్టడం లేదు. ఎస్ఎంఎస్ అలర్ట్‌లు పంపినందుకు ప్రతి మూణ్నెల్లకోసారి రూ.15 పై చిలుకు వసూలు చేస్తున్నాయి. * కొన్ని బ్యాంకుల్లో పాస్‌బుక్కులు అడిగితే తప్ప ఇవ్వటం లేదు. నెట్‌బ్యాంకింగ్ ఉంది కనక మీరు స్టేట్మెంట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. కానీ వీసా వంటి అవసరాల కోసం కొన్ని సంస్థలు బ్యాంకు ముద్ర, అధికారి సంతకం ఉన్న స్టేట్మెంట్లు మాత్రమే అడుగుతున్నాయి. సంతకం అవసరం లేని డిజిటల్ స్టేట్మెంట్లను అంగీకరించటం లేదు. దీంతో స్టేట్మెంట్ కోసం బ్యాంకుకెళితే... అది ఒక పేజీ ఉన్నా సరే రూ.100 చెల్లించాల్సిందే. ఆన్లైన్ అయినా తప్పని మోత... బ్యాంకులు, ఏటీఎంలకు వెళ్లకుండా ఆన్లైన్లోనే నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ మార్గాల్లో నగదు బదిలీ సర్వీసులు చేసే విధానాలూ అందుబాటులో ఉన్నాయి. ఈ తరహా లావాదేవీలకూ బ్యాంకులు వసూళ్లు చేస్తూనే ఉన్నాయి. అటు రైల్వే టికెట్ల బుకింగ్‌లు మొదలుకుని ఇటు కరెంటు, వాటర్ బిల్లులు వంటి వాటికి ఆన్లైన్లో కట్టినా అదనపు చార్జీలు తప్పటం లేదు. ఒకవైపు ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ని ప్రోత్సహిస్తున్నామంటూ.. మరోవైపు ఇలాంటి వడ్డింపులే ంటనే విమర్శలు వస్తున్నాయి. బిజినెస్ కరస్పాండెంట్లు మరీను!! గతంలో ఒకే నగరంలో ఏ శాఖ నుంచైనా తన ఖాతాలో డిపాజిట్ చేసుకునే వీలుండేది. కొన్ని బ్యాంకులిపుడు దీనిక్కూడా చార్జీలు విధిస్తున్నాయి. కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు ఏర్పాటు చే స్తున్న బిజినెస్ కరెస్పాండెంట్ల (బీసీ) విధానం... కొన్నిచోట్ల మరీ ఘోరం. బిజినెస్ కరస్పాండెంట్లు బ్యాంకు నుంచి కమిషన్ పొందాలి తప్ప కస్టమర్ల నుంచి ఎలాంటి ఫీజూ వసూలు చేయకూడదని రిజర్వు బ్యాంకు మార్గదర్శకాల్లో స్పష్టంగా ఉంది. కానీ ప్రతి డిపాజిట్‌కూ కోత తప్పటం లేదు. రూ.5 వేలు డిపాజిట్ చేస్తే ఏకంగా రూ.100 కోత వేయటం మరీ విచిత్రం. ఇంకో చిత్రమేంటంటే చాలా బ్యాంకులు తమ శాఖల్లోనే కిందనో... లేక పక్కనో బిజినెస్ కరస్పాండెంట్లను కూర్చోబెడుతున్నాయి. డిపాజిట్ చెయ్యటానికి బ్యాంకుకు వెళితే... పక్కనున్న బీసీ దగ్గర ఖాళీగా ఉంటుంది అక్కడ డిపాజిట్ చేయమని బ్యాంకు సిబ్బందే సలహా ఇస్తున్నారు. తెలియక అక్కడికెళితే... డబ్బులు తీసుకుని నేరుగా డిపాజిట్ చేసేస్తున్నారు. తీరా చూస్తే అకౌంట్లో క్రెడిట్ అయిన మొత్తం తక్కువగా ఉంటోంది. అంటే ఛార్జీల్ని మైనస్ చేస్తున్నారన్న మాట!!. ఏదో బ్యాంకుకు దూరంగా ఏర్పాటు చేస్తే కస్టమర్లకు సౌకర్యంగా ఉంటుంది గానీ... బ్యాంకుల్లోనే ఏర్పాటు చేయటమేంటన్న విమర్శలు వస్తున్నాయి. ఆర్బీఐ కూడా నగరాల్లో అయితే సదరు బ్యాంకు శాఖ తనకు 5 కిలోమీటర్ల దూరంలోపు బీసీని పెట్టవచ్చని, పల్లెలు, పట్టణాల్లో అయిలే ఈ దూరం 30 కి.మీ. వరకూ ఉండవచ్చని ఆర్బీఐ చెబుతోంది. కానీ పలు బ్యాంకులు దీనికి తూట్లు పొడుస్తూనే ఉన్నాయి. -
రేపటి నుంచి నగదు బదిలీ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో వంటగ్యాస్ నగదు బదిలీ పథకం గురువారం నుంచి మళ్లీ ఆరంభమవుతోంది. ఆధార్, బ్యాంకు ఖాతాలు కలిగిన వినియోగదారులంతా గ్యాస్ సిలిండర్ కావాలంటే ఇకపై రూ.861 చెల్లించాల్సిందే. ఆయా వినియోగదారులందరికీ కొద్దిరోజుల తరువాత సబ్సిడీ మొత్తాన్ని బ్యాంక్ ఖాతాలో కేంద్రం జమచేయనుంది. యూపీఏ హయాంలో ప్రవేశపెట్టిన గ్యాస్ నగదు బదిలీ పథకం గందరగోళంగా మారడంతో నిలిపివేసిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం సైతం ఈ పథకాన్ని అమలు చేసేందుకు నడుం బిగించడంతో నూతన సంవత్సరంలో అడుగుపెట్టబోతున్న ప్రజలకు ఇది ఒకింత ఇబ్బంది కలిగించే అంశమే కానుంది. ఇక గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇకపై విధిగా ఆధార్, బ్యాంకు నెంబర్‌కు అనుసంధానించాల్సిందే. లేనిపక్షంలో వారికి సబ్సిడీ ధరపై గ్యాస్ కొనుగోలు చేసే అవకాశాన్ని కోల్పోతారు. జిల్లాలో మొత్తం 7,26,707 డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లున్నాయి. బహిరంగ మార్కెట్లో గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.861. గృహావసరాల కోసం వినియోగించే డొమెస్టిక్ సిలిండర్ ధర సబ్సిడీపై రూ.451కి అందిస్తున్నారు. మిగిలిన మొత్తాన్ని సబ్సిడీ రూపంలో కేంద్రం భరిస్తోంది. కొత్త సంవత్సరం నుంచి బ్యాక్ ఖాతా, ఆధార్ కార్డు కలిగి ఉన్న వినియోగదారులంతా గ్యాస్ సిలిండర్ కావాలంటే తొలుత రూ.861 చెల్లించాల్సిందే. కేంద్రం ఇచ్చే సబ్సిడీ మాత్రం వెంటనే కాకుండా కొద్ది రోజుల తరువాత సదరు వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలో జమ కానుంది. అయితే ఇందులోనూ కొంత తిరకాసు ఉంది. వాస్తవానికి నాన్‌సబ్సిడీ కింద సిలిండర్ ధర 861.50 కాగా వినియోగదారులు ప్రస్తుతం 451.50 మాత్రమే చెల్లిస్తున్నారు. అంటే రూ.410 సబ్సిడీ చెల్లిస్తున్నట్లు లెక్క. కానీ ఇకపై వినియోగదారుడి ఖాతాలో రూ.390 జమ కానుంది. ఎందుకంటే మిగిలిన రూ.20 వ్యాట్ కింద మినహాయిస్తారు. అంటే వినియోగదారుడిపై ఈమేరకు గ్యాస్ భారం కానుంది. గందరగోళం షురూ... మరోవైపు జిల్లాలో ఏడు లక్షల పైచిలుకు డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లుండగా, అందులో 40 శాతం మందికి ఇంతవరకు ఆధార్కార్డుల్లేవు. 70 శాతం మందికి బ్యాంక్ ఖాతాలను గ్యాస్ కనెక్షన్లను అనుసంధానం చేయలేదు. నగదు బదిలీ పథకం ఆరంభానికి మరో 24 గంటల వ్యవధి మాత్రమే మిగిలి ఉంది. కేంద్రం మాత్రం ఆరు నూరైనా ఈ పథకాన్ని జనవరి ఒకటి నుంచి ప్రారంభించాల్సిందేనని ఆదేశించడంతో అధికారులు, ఎల్పీజీ డీలర్లు తలపట్టుకుంటున్నారు. ప్రజలను చైతన్యం చేస్తేనే విజయవంతం : ఈటెల ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లాలోని ఎల్పీజీ డీలర్లు సమావేశమై పథకం అమల్లో ఎదురుకానున్న ఇబ్బందులను చర్చించారు. ఈ సమావేశానికి హాజరైన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి మాట్లాడుతూ ఈ పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేయకపోవడం వల్లనే గత ప్రభుత్వం భారీ మూల్యాన్ని చెల్లించుకుందని గుర్తు చేశారు. ‘వాస్తవానికి తెలంగాణలోని గ్రామాల్లో మెజారిటీ ప్రజలకు బ్యాంకు ఖాతాల్లేవన్నారు. ఈ దశలో రూ.861 చెల్లించి సిలిండర్ కొనాలనడం పెద్ద సమస్యే. గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో పింఛన్లు ఇస్తున్నా విమర్శలొస్తున్నాయే తప్ప యాది చేసుకునేటోళ్లు లేరు. అట్లాకాకుండా గ్యాస్ నగదు బదిలీ పథకంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలనూ భాగస్వామ్యం చేసి ప్రజలను చైతన్యం చేస్తేనే విజయవంతమవుతోంది. ఇందులో ఏమాత్రం పొరపాటు జరిగినా దానికి మమ్ముల్నే బాధ్యుల్ని చేస్తారు. ఎందుకంటే కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టినా క్షేత్రస్థాయిలో ఉండేది మేమే కాబట్టి మేమే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ పథకంతో మాకు సంబంధం లేదని తప్పుకునే పరిస్థితిని మాత్రం తీసుకురాకుండా పద్దతిగా చేయండి’ అని సూచించారు. గ్యాస్ వినియోగదారులందరు బ్యాంకు ఖాతాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం త్వరలోనే బ్యాం కర్లతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపా రు. నగర మేయర్ రవీందర్‌సింగ్ మాట్లాడు తూ.. ఇప్పటివరకు తనకు ఆధార్ కార్డే లేదని, ఇక సామాన్యుల సంగతేమిటని ప్రశ్నించారు. గ్యాస్‌కు, ఆధార్ లింకు పెట్టడంవల్లే ఈ సమస్య ఎదురవుతోందని అభిప్రాయపడ్డారు. ఆధార్‌తో సంబంధం లేకుండా ఈ పథకాన్ని అమలు చేస్తే విజయవంతం అవుతుందని చెప్పారు. మార్చి వరకు గడువు ఎల్పీజీ జిల్లా సమన్వయకర్త నందకిషోర్ మాట్లాడుతూ.. జనవరి నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నప్పటికీ ఆధార్, బ్యాంకు ఖాతాల అనుసంధానం చేసుకునేందుకు మార్చి వరకు గడు వు ఉందని అన్నారు. ఈ రెండు ఖాతాలతో గ్యాస్ కనెక్షన్ అనుసంధానం చేసుకున్న విని యోగదారులు మాత్రం జనవరి నుంచే రూ. 861.50 చెల్లించి సిలిండర్‌ను కొనుగోలు చేయా ల్సి ఉంటుదన్నారు. ఆ తరువాత వారి బ్యాంక్ ఖాతాలో రూ.390 జమ అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి చంద్రప్రకాశ్, రాష్ట్ర ఎల్పీజీ డీలర్ల సంఘం నాయకుడు హెచ్.వేణుగోపాల్, జిల్లా అధ్యక్షులు రాధకృష్ణ, కార్యదర్శి హరిక్రిష్ణ, సభ్యులు సతీష్, సంపత్, గౌరవ్ పాల్గొన్నారు. -
జనవరి 1నుంచి గ్యాస్‌కు నగదు బదిలీ
* 48 శాతం మంది వినియోగదారులకే లబ్ది * మిగిలిన 52 శాతం మందికి మూడు నెలల గడుపు సాక్షి, విశాఖపట్నం: గ్యాస్ నగదు బదిలీ అమలుకు ముహూర్తం సమీపిస్తోంది. జనవరి1 నుంచి ఈ పథకం అమలు కానుంది. జిల్లాలో 8.12లక్షల గ్యాస్ వినియోగదారులున్నారు. ఇందులో 92 శాతం మందికి ఆధార్ సీడింగ్ అయినట్టుగా అధికారులు చెబుతున్నారు. ఆయిల్ కంపెనీల వారీగా చూస్తే హెచ్‌పీసీఎల్ పరిధిలో 95 శాతం మంది లబ్దిదారులకు ఆధార్ సీడింగ్ పూర్తికాగా, బీపీసీ ఎల్ పరిధిలో 99శాతం పూర్తికాగా, ఐఒసీఎల్ పరిధిలో మాత్రం కేవలం 83 శాతం మాత్రమే జరిగింది. కీలకమైన అకౌంట్ సీడింగ్ మాత్రం 48 శాతానికి మించలేదు. గతేడాది అక్టోబర్ నుంచి పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినాసీడింగ్ జరగనందున డిసెంబర్ వరకు అమలు కాలేదు. అప్పట్లో 24 శాతానికి మించి ఆధార్,అకౌంట్సీడింగ్ జరక్క పోవడంతో కొద్ది మందికి మాత్రమే ఈ ఏడాది జనవరిలో అకౌంట్లో డబ్బులు పడ్డాయి. మిగిలిన వారికి డబ్బులు పడలేదు. ఫలితంగా గందరగోళం నెలకొంది. ఆ తర్వాత కేంద్రమే ఈ పథకానికి తాత్కాలికంగా నిలిపివేసింది. ఇప్పుడు తాజాగా అన్ని జిల్లాలకు వర్తింప చేయాలని కేంద్రం నిర్ణయించడంతో యంత్రాంగం అకౌంట్సీడింగ్పై దృష్టి పెట్టింది. మరో 20రోజులే మిగిలి ఉండడంతో అకౌంట్ నెంబర్లు సేకరించి సీడింగ్ చేయాలని జిల్లా జేసీ ప్రవీణ్‌కుమార్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశారు. వినియోగదారుల నుంచి సేకరించిన అకౌంట్ నెంబర్లను బ్యాంకులవారీగా అందజేసేందుకు ప్రతీ బ్యాంకుకొక నోడల్ అధికారిని నియమించారు. సీడింగ్ కాకపోయినా భయపడాల్సిన అవసరం లేదని జేసీ ప్రవీణ్ కుమార్ చెప్పారు. మోడిఫైడ్ డైరెక్టర్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్‌లో జనవరి నుంచి మూడు నెలలలోపు ఆధార్ నెంబర్లు లేకపోయినా అకౌంట్ ఓపెన్ చేసుకుని నెంబర్లను గ్యాస్ ఏజెన్సీలకు లేదా,తమ గ్యాస్ కన్స్యూ మర్ నెంబర్లు బ్యాంకులకు అందజేసి సీడింగ్ చేయించుకుంటే సరిపోతుందని వివరించారు. అప్పటి వరకుపాతపద్దతిలోనే సబ్సిడైజ్డ్ సిలిండర్లే సరఫరా అవుతాయన్నారు. -
వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.25 వాత
* సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ.952 * బ్యాంకులో సబ్సిడీ నగదు జమ రూ.482.50 సాక్షి,సిటీబ్యూరో: హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో వంటగ్యాస్‌కు నగదు బదిలీ పుణ్యమా అంటూ వినియోగదారుడిపై రూ.25 అదనపు భారం పడింది. శనివారం నుంచి వంటగ్యాస్ డీబీటీ వర్తించడంతో నాన్‌సబ్సిడీ కింద సిలిండర్ బిల్లింగ్ ప్రారంభమైంది. ప్రస్తుత మార్కెట్లో సబ్సిడీయేతర డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.952. డీబీటీ పథకంలో చేరిన వినియోగదారులకు బ్యాంకులో సబ్సిడీ నగదు 482.50 జమవుతోంది. వాస్తవంగా వినియోగదారులు చెల్లించిన బిల్లులో సబ్సిడీ సిలిండర్ రూ.444.50 కాగా, బ్యాంక్‌లో రూ. 507.50 జమ కావలసి ఉంది. కానీ, వ్యాట్ పేరుతో వినియోగదారుడు రూ.25 అదనంగా భరించక తప్పడం లేదు. -
వంటగ్యాస్‌పై వ్యాట్ వాత!
* 32.71 లక్షల వినియోగదారులపై రూ. 7.19 కోట్ల వ్యాట్ భారం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ర్టంలోని మూడు జిల్లాల్లో శనివారం నుంచి గ్యాస్‌కు నగదు బదిలీ పథకాన్ని అమలు చేసేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. తొలిదశలో పథకం అమలవుతున్న హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లోని వినియోగదారులు ఇకపై రాయితీయేతర సిలిండర్‌కు రూ. 952 ధర చెల్లించాలి. తర్వాత ప్రభుత్వ సబ్సిడీ వినియోగదారుల ఖాతాలో జమవుతుంది. ఇంతమొత్తాన్ని ఒకేసారి చెల్లించడమే పేద, దిగువ మధ్యతరగతి వినియోగదారులకు తలకు మించిన భారం కాగా, వ్యాట్‌రూపంలో మరో రూ. 22 అదనంగా వడ్డించబోతున్నారు. తొలిదశలో 3 జిల్లా ల్లో ఉన్న 32.71 లక్షల మంది వినియోగదారులపై వ్యాట్ రూపంలో సుమారు రూ. 7.19 కోట్ల భారం పడనుంది. ఈ భారాన్ని భరించేందుకు ప్రభుత్వం ముందుకు వస్తేనే రాయితీ మొత్తం రూ. 508 వినియోగదారుని ఖాతాలో జమ అవుతుందని, లేకుంటే వ్యాట్ మినహాయించి రూ.486 ఖాతాలో పడుతుందని చమురు కంపెనీలు స్పష్టం చేశాయి. రాయితీరహిత సిలిండర్ ధర రూ. 952లో 5 శాతం అంటే రూ. 45 వరకు వ్యాట్ ఉంటుంది. వినియోగదారుడు చెల్లించే ధర రూ. 444 పోనూ... మిగతా రూ. 508లో వ్యాట్ రూ. 22 వరకు ఉంటుంది. ఈ మొత్తం పోగా మిగిలిన రూ. 486 మాత్రమే వినియోగదారుని ఖాతాలో జమయ్యే అవకాశముంది. అయితే వ్యాట్ ను తెలంగాణ ప్రభుత్వం భరించాలని కోరుతూ సంబంధిత అధికారులకు లేఖ రాసినట్లు చమురు కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. దీనిపై శనివారం స్పష్టత వచ్చే అవకాశముంది. ఇప్పటికే నగదు బదిలీ మార్గదర్శకాలను ప్రకటించిన ప్రభుత్వం ఈ పథకానికి ఆధార్ తప్పనిసరి కాదని తెలిపింది. నగదు బదిలీకి బ్యాంకు ఖాతా ఉంటే సరిపోతుందని, ఎల్పీజీ కనెక్షన్‌కు ఖాతాను అనుసంధానం చేస్తే రాయితీ నేరుగా ఆ ఖాతాలో జమవుతుందని వెల్లడించింది. ఫిబ్రవరి 14 వరకు పథకంలో చేరకపోయినా, బ్యాంక్ ఖాతా, ఆధార్ సంఖ్య ఇవ్వకపోయినా.. ఈ 3 నెలలు రాయితీ ధరకే సిలిం డర్ అందిస్తామని ప్రకటించింది. నగదు బదిలీ అమలు కానున్న 3 జిల్లాల పరిధిలో దాదాపు 32.71 లక్షల మంది వినియోగదారులున్నారు. వీరిలో సుమారు 25.04 లక్షల మంది వినియోగదారులకే బ్యాంకు ఖాతాల అనుసంధానం జరి గింది. ఈ లెక్కన 74.9 శాతం మందే శనివారం నుంచి నగదు బదిలీ పరిధిలోకి వస్తారు. మిగతా వారికి ప్రస్తుతం అనుసరిస్తున్న విధానంలోనే సబ్సిడీ సిలిండర్‌ను అందజేస్తారు. 3 నెలల్లో వీరు తమ గ్యాస్ కనెక్షన్‌కు బ్యాంకు ఖాతాను అనుసంధానం చేసుకోవాలి. గ్యాస్ అక్రమ మార్గాలను నివారించేందుకే దీన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు వంట గ్యాస్‌కు నగదు బదిలీ పథకం కింద ఆధార్‌తో సంబంధం లేకుండా వినియోగదారులకు బ్యాంక్ ఖాతా ఉంటే సబ్సిడీ నగదు రూపంలో బదిలీ అవుతుందని హెచ్‌పీసీఎల్ సీనియర్ మేనేజర్, రాష్ట్రస్థాయి సమన్వయకర్త శ్రీనివాస్, ఎల్పీజీ ముఖ్య ప్రాంతీయ మేనేజర్ ఎంబీ ఇంగోలే శుక్రవారం స్పష్టం చేశారు. బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం చేసుకోని వినియోగదారులకు నవంబర్ 15 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 వరకు సబ్సిడీపై సిలిండర్ సరఫరా జరుగుతుందన్నారు. ఆ తర్వాత మరో మూడు మాసాల (మే 14) వరకు అదనపు మినహాయింపుకాలంగా పరిగణిస్తామని వివరించారు. ఆలోగా అందరూ నగదు బదిలీ పథకంలోకి మారాలని కోరారు. -
గ్యాస్ సరఫరాకు మళ్లీ ఆధార్ లింకు
* నగదు బదిలీ ద్వారా సబ్సిడీ చెల్లింపు * జిల్లాలో 2,85,719 మంది వినియోగదారులకు కష్టాలే * ఆధార్ అనుసంధానం చేయించుకున్న వారి సంఖ్య 7,44,797 * బ్యాంక్ ఖాతాలున్నది 5,98,282 మందికే ఏలూరు సిటీ : వంటింట్లో గ్యాస్ బాంబు పేల్చేందుకు సర్కారు మరోసారి సన్నద్ధమైంది. గ్యాస్ సిలిండర్‌పై ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని నగదు బదిలీ పథకం ద్వారా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు అధికారులు శనివారం నుంచి శ్రీకారం చుడుతున్నారు. సాధారణ ఎన్నికలకు ముందే ఈ విధానాన్ని అమలు చేయగా, నగదు బదిలీ సక్రమంగా జరగకపోవడంతో వినియోగదారులు నానాతంటాలు పడ్డారు. అనేకమంది సబ్సిడీ మొత్తం అందక నష్టపోయూరు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అప్పటి సర్కారు దీనిని రద్దు చేయగా, తిరిగి అదే విధానాన్ని శనివారం నుంచి అమలు చేయనుండటంతో వినియోగదారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.951 కాగా, సబ్సిడీ పోగా రూ.444కే వినియోగదారులకు అందిస్తున్నారు. ఇప్పటివరకు వినియోగదారులు నేరుగా రూ.444 చెల్లిస్తే సరిపోతుంది. నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టడం వల్ల ఇకపై సిలిండర్‌కు రూ.951 చెల్లించి గ్యాస్ పొందాల్సి ఉంటుంది. ఆ తరువాత సబ్సిడీ సొమ్మును వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. అంటే వినియోగదారుడు ప్రతిసారి సిలిండర్ కోసం సుమారు రూ.500 అదనంగా పెట్టుబడి పెట్టాల్సింది. ఆధార్ అనుసంధానం చేయించుకోని వారు, ఆధార్ కార్డు లేనివారు సబ్సిడీ మొత్తాన్ని కోల్పోతారు. ఆధార్ సీడింగ్‌కు ఫిబ్రవరి వరకూ ప్రభుత్వం అవకాశం ఇస్తున్నా.. అధార్ నమోదు చేరుుంచుకున్న వారు సైతం గతంలో సబ్సిడీ సొమ్ము అందక, కొందరికి పూర్తి సొమ్ము దక్కక అవస్థలు పడ్డారు. మరి వీరికో... నగదు బదిలీ పథకం వినియోగదారులకు పూర్తి స్థారుులో న్యాయం చేసేలా కనిపించటం లేదు. ప్రస్తుతానికి ఆధార్ సీడింగ్ చేరుుంచుకుని, బ్యాంకు ఖాతాలు ప్రారంభించిన వినియోగదారులకు మాత్ర మే నగదు బదిలీ పథకాన్ని వర్తింప చేస్తారు. ఫిబ్రవరి అనంతరం ప్రతి ఒక్కరూ ఈ పథకం కిందకు వెళ్లాల్సిందే. జిల్లాలో గ్యాస్ వినియోగదారులు 8,84,001 మంది ఉండగా, వీరిలో 7,44,797మంది ఆధార్ సీడింగ్ చేయించుకున్నారు. మిగిలిన 1,39,204 మందికి ఆధార్ అనుసంధానం కాలేదు. ఆధార్ సీడింగ్ చేయించుకున్న వారిలోనూ బ్యాంక్ ఖాతాలు ఉన్న వారి సంఖ్య 5,98,282 మాత్రమే. ఆధార్ సీడింగ్ చేయించుకున్నా బ్యాంకు ఖాతా లేనివారు సుమారు 1,46,515 మంది ఉన్నారు. ఈ విషయూన్ని పక్కన ఉంచితే మొత్తానికి 2 లక్షల 85వేల 719మంది నగదు బదిలీ పథకంలోకి రావటం లేదు. వీరంతా అత్యవసరంగా ఆధార్ సీడింగ్ చేయించుకోవడంతోపాటు బ్యాంకు ఖాతాలు తెరవాల్సి ఉంది. ఇక దీపం పథకంలో బాగంగా జిల్లాలో 93,902 మందికి గ్యాస్ సిలిండర్స్ ఇచ్చేందుకు నిర్ణయించారు. కానీ.. ఇందులో 89,624 మంది లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్ చేయగా, దీపం పథకంలో గ్యాస్ సిలిండర్స్ ఇచ్చింది 49,587మందికి మాత్రమే. మిగిలిన 44,315 మందికి ఈ పథకాన్ని అమలు చేయలేదు. -
నగదు బదిలీకి రంగం సిద్ధం
* ఈ నెల 15 నుంచి అమల్లోకి * రంగంలోకి దిగిన గ్యాస్ ఏజెన్సీలు * ఆధార్ లేని వారికి యూనిక్ ఐడీ నంబర్లతో నగదు బదిలీ రామచంద్రపురం : గ్యాస్ వినియోగదారులకు మళ్లీ నగదు బదిలీ అమలుకు రంగం సిద్ధమవుతోంది. జిల్లాలో ఈ నెల 15నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ఆధార్‌తో అనుసంధానం చేయడంతో గతంలో నగదు బదిలీకి పలు ఇబ్బందులు ఎదురైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం డీబీటీఎల్ పథకం ద్వారా నగదు బదిలీ చేసేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోంది. డీబీటీఎల్ పథకం ద్వారా అమలు ఆధార్‌తో సంబంధం లేకుండా డీబీటీఎల్ పథకం ద్వారా వినియోగదారులకు నగదు బదిలీకి రంగం సిద్ధం చేస్తున్నారు. ఆధార్ సీడింగ్ లేని వారికి ఈసారి నగదు బదిలీకి 17 అంకెల యూనిక్ ఐడీని గ్యాస్ ఏజెన్సీలు అందిస్తున్నాయి. ఇప్పటికే వినియోగదారుల మొబైల్ ఫోన్ల్‌కు 17 అంకెల యూనిక్‌ఐడీ నంబర్‌ను ఎస్ఎంఎస్ల ద్వారా పంపిస్తున్నారు. ఇదివరలో ఆధార్ సీడింగ్ అయినవారికి ఇది అవసరం లేదని గ్యాస్ ఏజెన్సీ వారు చెబుతున్నారు. అయితే ఆధార్ కార్డులు కలిగి ఉండి, ఆధార్ సీడింగ్ జరగని వారికి ఆధార్ కార్డుతో పాటుగా రెండు రకాల ఫారాలను అందించాలి. ఫారం-1, 2లను నింపి సంబంధిత గ్యాస్ ఏజెన్సీలో, ఖాతా కలిగిన బ్యాంకులో అందించాలి. ఆధార్ కార్డు లేని వారు ఏజెన్సీలు అందించిన 17 అంకెల యూనిక్ ఐడీ నంబర్‌ను వేసి ఫారం-3, 4లను పూర్తి చేసి బ్యాంకుతో పాటుగా గ్యాస్ ఏజెన్సీలలో అందించాలి. ఈ ప్రక్రియ ఈనెల 15 నుంచి ఆయా గ్యాస్ ఏజెన్సీల ద్వారా నిర్వహించనున్నారు. అయితే గతంలో ఆధార్ సీడింగ్ ద్వారా నగదు బదిలీని అందుకున్నవారు ఎటువంటి ఫారాలు ఇవ్వాల్సిన పనిలేదు. సిలిండర్‌కు పూర్తి సొమ్ము చెల్లించాల్సిందే ఈ నెల 15 నుంచి నగదు బదిలీ అమలు కానుంది. జిల్లాలోని 54 గ్యాస్ ఏజేన్సీల ద్వారా దాదాపుగా తొమ్మిది లక్షల వరకు వంట గ్యాస్ వినియోగదారులున్నారు. వీరందరూ ప్రస్తుతం సబ్సిడీపై రూ.443 చెల్లించి గ్యాస్ సిలిండర్ పొందుతున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల వినియోగదారులు ముందుగానే సిలిండర్‌ను రూ.960 చెల్లించి కొనుగోలు చే యాలి. ఆ తర్వాత సబ్సిడీ మొత్తం రూ. 520 ఢిల్లీలోని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లోనికి జమ చేస్తారు. గతంలో నగదు బదిలీని అందుకున్న వారికి యథావిధిగా సబ్సిడీ సొమ్ములు బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు. బ్యాంకు ఖాతాలు, ఆధార్ కార్డులు లేనివారు సెల్‌ఫోన్‌కు వచ్చిన యూనిక్ ఐడీ నంబర్‌ను తీసుకువెళ్లినా బ్యాంకుల్లో సబ్సిడీ సొమ్ములను అందించనున్నారు. -
ఆధార్ లేకున్నా గ్యాస్ నగదు బదిలీ
* మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం * ఆధార్ లేకున్నా బ్యాంక్ ఖాతాలో రాయితీ జమ * మొదటి మూడు నెలలు యథావిధిగా రాయితీ * తర్వాత మూడు నెలలకు బ్యాంకు ఖాతా ఇచ్చాకే రాయితీ * పథక పర్యవేక్షణ కోసం రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు సాక్షి, హైదరాబాద్: ఈ నెల 15 నుంచి రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలు, జనవరి నుంచి మిగతా జిల్లాల్లో ప్రారంభం కానున్న గ్యాస్ నగదు బదిలీకి సంబంధించి ప్రభుత్వం బుధవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. పౌర సరఫరాల శాఖ కమిషనర్ పార్థసారధి వాటిని విడుదల చేశారు. దీనిప్రకారం కేంద్రం చేసిన కొన్ని మార్పులు చేర్పులను అందులో వివరించారు. కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి ప్రభుత్వం పథక పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేసింది. రాష్ట్ర కమిటీలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఛైర్మన్‌గా బ్యాంకర్స్ కమిటీ కన్వీనర్, ఆయిల్ కంపెనీల స్టేట్ లెవల్ కో-ఆర్డినేటర్, ఐఓసీఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్, బీపీసీఎల్ ప్రాంతీయ మేనేజర్, మీ సేవ డెరైక్టర్, ఆధార్ ప్రాజెక్టు మేనేజర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డీఎస్ఓలు సభ్యులుగా ఉంటారు. జిల్లా కమిటీలో జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా జిల్లా స్థాయి కో-ఆర్డినేటర్, లీడ్ బ్యాంకు మేనేజర్, డీఎస్ఓ, మీసేవా మేనేజర్, ఆయిల్ కంపెనీల నుంచి ముగ్గురు ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. వీరంతా కేంద్ర మార్గదర్శకాల మేరకు ప్రజలకు అవగాహన కల్పించే చర్యలు తీసుకోవాలి. మార్గదర్శకాలు ఇవీ.. * ఎల్పీజీ, బ్యాంక్ ఖాతాల్లో ఆధార్ సంఖ్యను అనుసంధానం చేస్తే రాయితీ నేరుగా ఆ ఖాతాల్లోకి వెళుతుంది. ఆధార్ లేకున్నా డీలర్‌కు బ్యాంక్ అకౌంట్ ఇస్తే సంబంధిత బ్యాంక్ అకౌంట్‌కు రాయితీ జమ అవుతుంది. * మొదటి మూడు నెలల పాటు ఈ పథకంలో చేరకపోయినా, బ్యాంక్ ఖాతా, ఆధార్ సంఖ్య ఇవ్వకపోయినా తొలి మూడు నెలలు రాయితీ ధరకే సిలిండర్ ఇస్తారు. అయితే తర్వాత మూడు నెలలపాటు రాయితీ ఇవ్వరు. అయితే బ్యాంక్ ఖాతాను ఇవ్వగానే రాయితీ మొత్తాలు అన్నీ ఆ ఖాతాలో జమ అవుతాయి. పథకంపై కేంద్రం చేసిన సూచనలు * పథకంపై ప్రజల్లో అవగాహ కల్పించేందుకు విస్తృత ప్రచారం నిర్వహించాలి. * ఆధార్ సంఖ్య కోసం కొత్త ఎన్రోల్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. * కలెక్టర్లు ఆయిల్ కంపెనీల కో ఆర్డినేటర్లకు తగిన సహాయ సహకారాలు అందించాలి. * ఆధార్,ఎల్పీజీ, బ్యాంకు కేంద్రాల్లో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. -
గందరగోళం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పంటనష్ట పరిహారాన్ని నేరుగా రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తోంది. పంపిణీ బాధ్యతల్ని ఓ ప్రైవేటు బ్యాంకుకు అప్పగించింది. వ్యవసాయశాఖ రైతుల జాబితా, నిధులకు సంబంధించిన బిల్లులు తయారు చేసి ఖజానా శాఖ ఆమోదం పొందిన అనంతరం సదరు బ్యాంకు యంత్రాంగం రైతుల ఖాతాకు ఆన్లైన్ పద్ధతిన నగదును బదిలీ చేస్తుంది. 2013 ఖరీఫ్ సీజన్‌తో పాటు ఇంతకు ముందు బకాయిలన్నీ కలుపుకొని జిల్లాకు రూ.31.03 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పరిహారాన్ని 1,21,327 మంది రైతులకు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే లబ్ధిదారులకు సంబంధించి వ్యవసాయ శాఖ బిల్లులు రూపొం దించి ఖజానా విభాగం ఆమోదంతో సర్వీస్ ప్రొవైడర్‌కు వివరాలు అందించగా.. పంపిణీ ప్రక్రియలో ఇబ్బం దులు తలెత్తాయి. రైతులిచ్చిన బ్యాంకు ఖాతాలు పనిచేయడం లేదని, కొందరు రైతుల బ్యాంకు ఖాతా అంకెల్లో తేడాలున్నట్లు సర్వీస్ ప్రొవైడర్ తేల్చింది. ఇప్పటివరకు 1,01,706 మంది రైతులకు రూ.26.87 కోట్లు పంపిణీ చేశారు. ఇంకా 19,621 మంది రైతులకు రూ.4.16 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. సర్వీస్ ప్రొవైడర్ చేతులెత్తేసింది. దీంతో మళ్లీ వివ రాలు సేకరించాలని వ్యవసాయశాఖ నిర్ణయించి.. క్షేత్రస్థాయిలో చర్యలు మొదలుపెట్టింది. గతంలోనూ ఇదే సీను.. 2012 సంవత్సరంలో జిల్లాకు మంజూరైన పంటనష్ట పరిహారంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టమైంది. రైతులు సరైన వివరాలు ఇవ్వలేదని మొదట వాదించిన వ్యవసాయ శాఖ అధికారులు.. వారంతా బోగస్ రైతులని తేల్చుతూ రూ.8 కోట్లు ప్రభుత్వానికి వెనక్కు ఇచ్చారు. తాజాగా ఇదే తరహాలో రైతులు తప్పుడు ఖాతా నంబర్లు సమర్పించారంటూ వ్యవసాయ శాఖ పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి జిల్లాలో మెజారిటీ రైతులు పంట రుణాలు తీసుకున్నారు. ఈ క్రమంలో రైతులందరికీ బ్యాంకు ఖాతాలున్నాయి. ఇటీవల పంటరుణ మాఫీ ప్రక్రియలోనూ ఈ ఖాతాలను సేకరించారు. తాజాగా ఆ జాబితా ప్రకా రం రైతుల వివరాలు పరిగణలోకి తీసుకుంటే అసలు సమస్యే ఉండదని రైతు సంఘాల నేతలు పేర్కొంటున్నారు. మొత్తంగా అధికారుల తప్పిదాలతో రైతులు నష్టపోతున్నట్లు వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘డబుల్’ ట్రబుల్.. మరోవైపు ఇప్పటికే పంపిణీ చేసిన పంటనష్ట పరిహారంపై కొత్త చిక్కు వచ్చిపడింది. కొన్నిచోట్ల ఒకే రైతుకు రెండుసార్లు పరిహారం జమ అయినట్లు అధికారవర్గాలు గుర్తించాయి. దాదాపు రూ.2కోట్ల వరకు ఇలా రెండేసిసార్లు రైతులకు ఇచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. ఈమేరకు లెక్కలు తీసేపనిలో నిమగ్నమయ్యా రు. రెండుసార్లు పరిహారం విడుదలైన ఖాతాలను వెంటనే సీజ్‌చేసి సరిదిద్దే ప్రయత్నాలు మొదలయ్యాయి. -
‘లింకు’ తెగిందా లేదా..?
‘ఆధార్’పై గందరగోళం గ్యాస్‌కు నగదు బదిలీ ఉన్నట్టా లేనట్టా? రద్దు ఉత్తర్వులు అందలేదంటున్న అధికారులు వినియోగదారుల్లో అయోమయం విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : గ్యాస్‌తో ఆధార్ అనుసంధానం చేసుకోవాలా? వద్దా? నగదు బదిలీ పథకం అమలు చేస్తున్నారా? తాత్కాలికంగా నిలిపివేశారా? లేదా గడువు పొడిగించారా? ఇలా అనేక సందేహాలు ప్రస్తుతం అందరి మెదళ్లను తొలిచేస్తున్నాయి. కేంద్ర ప్రకటన తరువాత ఆధార్ వ్యవహారం మరింత గందరగోళాన్ని సృష్టిస్తోంది. నగదు బదిలీ పథకానికి వివరాలను అనుసంధానం చేసుకోవాలో? లేదో తెలియని పరిస్థితి నెలకొంది. గ్యాస్ సబ్సిడీని వినియోగదారుల ఖాతాలోకి నేరుగా జమ చేసే విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు మాత్రం అధికారులకు అందలేదు. చమురు సంస్థలు కూడా ఆధార్‌పై స్పష్టత ఇవ్వడం లేదు. కేవలం ఒక నెల గడువు పెంచినట్లు సూత్రపాయంగా సమాచారమొచ్చినట్లు చెప్పుకొస్తున్నాయి. దానికి కూడా ఎటువంటి ఉత్తర్వులు రాలేదని పేర్కొంటున్నాయి. అధికారులు మాత్రం నగదు బదిలీకి అనుసంధాన ప్రక్రియను కొనసాగిస్తున్నారు. జిల్లాలో 8.3 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు ఉంటే.. గ్యాస్‌తో కేవలం ఆధార్‌ను 43 శాతం మంది అనుసంధానం చేసుకోగా, గ్యాస్, ఆధార్, బ్యాంకు ఖాతాలతో 29 శాతం మంది అనుసంధానించుకున్నారు. నగదు బదిలీని నిలిపివేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అధికారికంగా ఉత్తర్వులు రాలేదని జేసీ ప్రవీణ్‌కుమార్ న్యూస్‌లైన్‌కు తెలిపారు. ఒకవేళ నగదు బదిలీ పథకం అమలులో ఉంటే ఈ నెల 1వ తేదీ నుంచి అనుసంధానం చేసుకోని వినియోగదారులు నాన్ సబ్సిడీ సిలిండర్‌ను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. -
ఉచిత విద్యుత్ పై నీలినీడలు
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. రైతుల సంక్షేమార్థం దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని నగదు బదిలీ పేరుతో నీరుగార్చేందుకు ప్రభుత్వం సన్నద్ధంకావడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని యూనిట్ల వరకే ఉచిత విద్యుత్‌ను పరిమితం చేసి రైతులపైనా భారం మోపడంతోపాటు అంతిమంగా వ్యవసాయ కనెక్షన్లకూ మీటర్లు బిగించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతన విధానం అమలులోకి వస్తే.. వ్యవసాయానికి వినియోగించుకున్న కరెంటులో నిర్ణీత యూనిట్ల మేరకే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. అది కూడా రైతులు ముందుగా బిల్లు మొత్తం కట్టేశాక సబ్సిడీ సొమ్మును బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉండడంతో రైతుల్లో ఆందోళన కనిపిస్తోంది. ఇప్పటికే రైతులు ఏటా వ్యవసాయంలో తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. దీనికితోడు గిట్టుబాటు ధరలు లేక ఆర్థికంగా కుదేలవుతున్నారు. ఈ నేపథ్యంలో సాగు చేయలేమని చేతులెత్తేసే పరిస్థితి ఉండగా ఆదుకోవాల్సిన సర్కారు ఉచిత విద్యుత్‌నూ లాగేసే ప్రయత్నం చేస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతులపై భారం వేసేందుకే.. జిల్లాలో 89,102వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 79,031 వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ పథకం అమలవుతోంది. ప్రస్తుతం వ్యవసాయ విద్యుత్‌కు మీటర్లు లేవు. జిల్లా వ్యాప్తంగా ట్రాన్స్ఫార్మర్లకు 318శాంపుల్ మీటరింగ్ ఏర్పాటుచేసి రైతులు ఎన్ని యూనిట్లు వినియోగిస్తున్నారో అంచనా వేస్తున్నారు. ఎంత విద్యుత్‌ను వ్యవసాయానికి సరఫరా చేస్తున్నారో లెక్కించి.. ఆ మేరకు ఎన్పీడీసీఎల్కు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. అయితే నగదు బదిలీ పథకం అమలుకు ఇది ఆమోదయోగ్యంకాదని ప్రభుత్వం భావిస్తోంది. వ్యవసాయవిద్యుత్కు మీటర్లు లేకపోవడంతో ఫలాన రైతు కచ్చితంగా ఎంత విద్యుత్ వినియోగించాడనే విషయం తెలుసుకోవడం కష్టం. లెక్కింపు ఇలా.. ప్రస్తుతం ఉచిత విద్యుత్ వినియోగాన్ని ఈ విధంగా లెక్కిస్తున్నారు. 5హార్స్ పవర్ (హెచ్‌పీ) మోటార్ రోజుకు 7 గంట లు విద్యుత్ వినియోగిస్తే 5.25 యూనిట్ల కరెంట్ కాలుతుం దని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన 300 రోజులకు 1575 యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతుందని అంచనా కట్టా రు. ఇన్ని యూనిట్లకు విద్యుత్ ఉత్పత్తి అయ్యే ఖర్చును లె క్కించి ఆ సబ్సిడీని విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం ఇవ్వనుం ది. తద్వారా కొన్ని యూనిట్ల వరకు మాత్రమే సబ్సిడీ ఇచ్చి అంతకుమించితే మొత్తం బిల్లులు రైతులే చెల్లించాలన్న ని బంధన విధించనున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ప్రభుత్వ నిర్ణయూన్ని రైతులంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. లేనిపక్షంలో వ్యవసాయం ఇక కష్టమేనని పేర్కొంటున్నారు. ఎత్తివేయడానికి కుట్ర మాంగ్రుడ్ శివారులో నాకు పదెకరాల చేనుంది. నా సర్వీస్ నంబర్ 149. ఉచిత విద్యుత్‌పై ఆధారపడి రెండు కాలాల్లో వ్యవసాయం చేసుకుంటున్న. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నగదు బదిలీ పేరిట మీటర్లు బిగించాలనుకోవడం సరికాదు. ఇది వ్యవసాయానికి అందిస్తున్న ఉచిత విద్యుత్ ఎత్తివేయడానికి జరుగుతున్న కుట్రనే. దీన్ని ప్రభుత్వం విరమించుకోవాలి. లేకపోతే వ్యవసాయం చేయడం కష్టం. - టాక్రే మంగేశ్, మాంగ్రుడ్, బేల మండలం ఇప్పుడున్న విధానమే బాగుంది నాకు జైనథ్‌లో రెండున్నర ఎకరాల భూమి ఉంది. చేన్లకు ఇచ్చే కరెంటు కనెక్షన్ విషయంలో ఇప్పుడున్న విధానమే బాగుంది. ఇప్పు డు కొత్తగా ఈ కనెక్షన్లకు గవర్నమెంటు మీటర్లు ఇస్తారని అంటున్నారు. మీటర్లో వచ్చిన రీడింగ్ ప్రకారం రైతులు ముందుగా కరెంటు బిల్లు చెల్లిస్తే తర్వాత రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు గవర్నమెంటు జమచేస్తుందని చెబుతున్నారు. ఈ విధానంతో రైతులకూ మస్తు కష్టమైతది. ఇదంతా చూస్తుంటే మెల్లమెల్లగాఉచిత కరెంటు ఎత్తేస్తారేమోనని భయంగా ఉంది. - రాళ్లబండి నారాయణ, జైనథ్ మండలం ఆలోచన విరమించుకోవాలి ఉచిత విద్యుత్‌ను ఎత్తేయడానికే ప్రభుత్వం నగదు బదిలీ పథకం అమలు చేయడానికి పూనుకుంది. ఇప్పటికే పంటల దిగుబడి రాక, విద్యుత్ సరిగా సరఫరా కాక ఇబ్బందులు పడుతున్న రైతులను ఈ విధానం మరింత కష్టాల్లోకి నెట్టనుంది. నగదు బదిలీ అమలు చేస్తే సాగుకు పెట్టే పెట్టుబడులకు తోడు ముందుగానే బిల్లులు చెల్లించడంతో మరింత భారం మా మీద పడుతుంది. ప్రభుత్వం ఈ ఆలోచన విరమించుకోవాలి. - భూమారెడ్డి, యాకర్పెల్లి, సారంగాపూర్ మండలం -
వ్యవసాయశాఖలో ‘నగదు బదిలీ’
చిత్తూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖలో నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆ శాఖ జాయింట్ డెరైక్టర్ జే.రవికుమార్ తెలిపారు. శుక్రవారం జిల్లా శాఖ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రబీ సీజన్ నుంచి వ్యవసాయ శాఖలో నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. తొలుతగా సబ్సిడీపై ఇచ్చే వేరుశెనగ విత్తనకాయల కొనుగోలు నుంచి ఈ పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పారు. బస్తా వేరుశెనగ విత్తనకాయలు రూ.1,620 ఈ సీజన్లో జిల్లాలోని తూర్పున 25 మండలాల్లో వేరుశెనగ పంట సాగుచేసే రైతుల కోసం నవంబర్ మొదటి వారం నుంచి విత్తనకాయలు అందుబాటులో ఉంచుతామని జేడీ వెల్లడించారు. ఇప్పటివరకు 24 వేల క్వింటాళ్ల వేరుశెనగ విత్తనాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. నగదు బదిలీ పథకం కింద బస్తా (30 కిలోలు) వేరుశెనగ కాయలను రూ.1,620 వెచ్చించి రైతు కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. కొనుగోలు సమయంలో పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంకు పాస్ పుస్తకం కచ్చితంగా సమర్పించాలని సూచిం చారు. ఆ తర్వాత సబ్సిడీ కింద రూ.540లు రైతు వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని తెలిపారు. 64,060 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు రబీ సీజన్లో జిల్లాలోని 64,060 హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగు చేస్తారని జేడీ పేర్కొన్నారు. తూర్పు మండలాల్లో ప్రధాన పంటగా వరి 37,491 హెక్టార్లు, వేరుశెనగ 16,330, మిరప 2249, పొద్దుతిరుగుడు 2597, రాగి 821, మొక్కజొన్న 704, ఉద్దులు 1013, ఉలవలు 1768, పొగాకు 123, ఎర్రగడ్డలు 196 , పత్తి 118 హెక్టార్లు, కాగా మిగిలిన విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగు చేస్తారని తెలిపారు. అందుబాటులో ఎరువులు రబీ సీజన్‌కు గాను వివిధ రకాల ఎరువులు జిల్లాలోని రైతులకు అందుబాటులో ఉంచామని జేడీ తెలిపారు. యూరియా 11600 మెట్రిక్ టన్నులు, డీఏపీ 2773 టన్నులు, ఎంవోపీ 839, కాంప్లెక్స్ ఎరువులు 8400 టన్నులు అందుబాటులో ఉన్నాయన్నారు. నవంబర్ మొదటి వారంలో మరో 26 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లాకు వస్తాయని ఆయన వివరించారు.