సాక్షి, రంగారెడ్డి జిల్లా: పంటనష్ట పరిహారాన్ని నేరుగా రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తోంది. పంపిణీ బాధ్యతల్ని ఓ ప్రైవేటు బ్యాంకుకు అప్పగించింది. వ్యవసాయశాఖ రైతుల జాబితా, నిధులకు సంబంధించిన బిల్లులు తయారు చేసి ఖజానా శాఖ ఆమోదం పొందిన అనంతరం సదరు బ్యాంకు యంత్రాంగం రైతుల ఖాతాకు ఆన్‌లైన్ పద్ధతిన నగదును బదిలీ చేస్తుంది. 2013 ఖరీఫ్ సీజన్‌తో పాటు ఇంతకు ముందు బకాయిలన్నీ కలుపుకొని జిల్లాకు రూ.31.03 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పరిహారాన్ని 1,21,327 మంది రైతులకు పంపిణీ చేయాల్సి ఉంది.
అయితే లబ్ధిదారులకు సంబంధించి వ్యవసాయ శాఖ బిల్లులు రూపొం దించి ఖజానా విభాగం ఆమోదంతో సర్వీస్ ప్రొవైడర్‌కు వివరాలు అందించగా.. పంపిణీ ప్రక్రియలో ఇబ్బం దులు తలెత్తాయి. రైతులిచ్చిన బ్యాంకు ఖాతాలు పనిచేయడం లేదని, కొందరు రైతుల బ్యాంకు ఖాతా అంకెల్లో తేడాలున్నట్లు సర్వీస్ ప్రొవైడర్ తేల్చింది. ఇప్పటివరకు 1,01,706 మంది రైతులకు రూ.26.87 కోట్లు పంపిణీ చేశారు. ఇంకా 19,621 మంది రైతులకు రూ.4.16 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. సర్వీస్ ప్రొవైడర్ చేతులెత్తేసింది. దీంతో మళ్లీ వివ రాలు సేకరించాలని వ్యవసాయశాఖ నిర్ణయించి.. క్షేత్రస్థాయిలో చర్యలు మొదలుపెట్టింది.
గతంలోనూ ఇదే సీను..
2012 సంవత్సరంలో జిల్లాకు మంజూరైన పంటనష్ట పరిహారంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టమైంది. రైతులు సరైన వివరాలు ఇవ్వలేదని మొదట వాదించిన వ్యవసాయ శాఖ అధికారులు.. వారంతా బోగస్ రైతులని తేల్చుతూ రూ.8 కోట్లు ప్రభుత్వానికి వెనక్కు ఇచ్చారు. తాజాగా ఇదే తరహాలో రైతులు తప్పుడు ఖాతా నంబర్లు సమర్పించారంటూ వ్యవసాయ శాఖ పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి జిల్లాలో మెజారిటీ రైతులు పంట రుణాలు తీసుకున్నారు.
ఈ క్రమంలో రైతులందరికీ బ్యాంకు ఖాతాలున్నాయి. ఇటీవల పంటరుణ మాఫీ ప్రక్రియలోనూ ఈ ఖాతాలను సేకరించారు. తాజాగా ఆ జాబితా ప్రకా రం రైతుల వివరాలు పరిగణలోకి తీసుకుంటే అసలు సమస్యే ఉండదని రైతు సంఘాల నేతలు పేర్కొంటున్నారు. మొత్తంగా అధికారుల తప్పిదాలతో రైతులు నష్టపోతున్నట్లు వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
‘డబుల్’ ట్రబుల్..
మరోవైపు ఇప్పటికే పంపిణీ చేసిన పంటనష్ట పరిహారంపై కొత్త చిక్కు వచ్చిపడింది. కొన్నిచోట్ల ఒకే రైతుకు రెండుసార్లు పరిహారం జమ అయినట్లు అధికారవర్గాలు గుర్తించాయి. దాదాపు రూ.2కోట్ల వరకు ఇలా రెండేసిసార్లు రైతులకు ఇచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. ఈమేరకు లెక్కలు తీసేపనిలో నిమగ్నమయ్యా రు. రెండుసార్లు పరిహారం విడుదలైన ఖాతాలను వెంటనే సీజ్‌చేసి సరిదిద్దే ప్రయత్నాలు మొదలయ్యాయి.
గందరగోళం!
Published Wed, Nov 12 2014 12:14 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement