వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.25 వాత
* సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ.952
* బ్యాంకులో సబ్సిడీ నగదు జమ రూ.482.50
సాక్షి,సిటీబ్యూరో: హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో వంటగ్యాస్‌కు నగదు బదిలీ పుణ్యమా అంటూ వినియోగదారుడిపై రూ.25 అదనపు భారం పడింది. శనివారం నుంచి వంటగ్యాస్ డీబీటీ వర్తించడంతో నాన్‌సబ్సిడీ కింద సిలిండర్ బిల్లింగ్ ప్రారంభమైంది. ప్రస్తుత మార్కెట్‌లో సబ్సిడీయేతర డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.952. డీబీటీ పథకంలో చేరిన వినియోగదారులకు బ్యాంకులో సబ్సిడీ నగదు 482.50 జమవుతోంది. వాస్తవంగా వినియోగదారులు చెల్లించిన బిల్లులో సబ్సిడీ సిలిండర్ రూ.444.50 కాగా, బ్యాంక్‌లో రూ. 507.50 జమ కావలసి ఉంది. కానీ, వ్యాట్ పేరుతో వినియోగదారుడు రూ.25 అదనంగా భరించక తప్పడం లేదు.