Cooking gas
-
విలేజి టెక్నాలజీ
రాజీగళ్ల భూపాల్..మూడుచింతలపల్లి మండలంలోని పోతారం, కొల్తూర్ గ్రామాల్లో గేటెడ్ కమ్యూనిటీలకు దీటుగా పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా జరుగుతోంది. ఇక్కడికి సమీపంలోని జీనోమ్ వ్యాలీలో ఉన్న ఫార్మా కంపెనీలకు ఎల్పీజీ గ్యాస్ సరఫరా చేసేందుకు మెగా గ్యాస్ కంపెనీ పోతారంలో సబ్‌స్టేషన్ (కంప్రెసర్) ఏర్పాటు చేసింది. తమ గ్రామంలో సబ్‌స్టేషన్ పెట్టిన నేపథ్యంలో.. ఇక్కడి ఇళ్లకు పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్ సరఫరా చేయాలని గ్రామస్తులు కోరడంతో ఆ ఏర్పాట్లు చేసింది. వినియోగదారులు రూ.6 వేలు చెల్లిస్తే.. వారి ఇంటికి వంటగ్యాస్ పైప్‌లైన్ కనెక్షన్ ఇస్తారు. దానికి ఒక మీటర్‌ను అమర్చుతారు. ప్రతి నెలా కంపెనీ సిబ్బంది వచ్చి మీటర్ వద్ద స్కాన్ చేసి.. వినియోగించిన గ్యాస్‌కు సంబంధించిన బిల్లు ఇస్తారు. అచ్చు కరెంటు బిల్లు తరహాలో నెలనెలా బిల్లు కట్టేస్తే సరిపోతుంది.సిలిండర్ల కోసం ఇబ్బంది తప్పింది పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్ సరఫరా చేయడం గ్రామస్తులకు ఉపయోగకరంగా ఉంది. గతంలో సిలిండర్ అయిపోతే రెండు, మూడు రోజుల వరకు ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చేది. దానికితోడు గ్యాస్ సిలిండర్లు ఇచి్చనప్పుడు డెలివరీ చార్జ్‌లు, సరీ్వస్ చార్జ్‌లు అంటూ అదనంగా డబ్బులు తీసుకునేవారు. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. నిరంతరాయంగా వంట గ్యాస్ సరఫరా అవుతోంది. వాడుకున్న మేర బిల్లు చెల్లిస్తే సరిపోతోంది. – హరిమోహన్‌రెడ్డి, పోతారం మాజీ సర్పంచ్ ఉద్దమర్రి గ్రామంలో స్మార్ట్ కార్డులుమూడుచింతలపల్లి మండలం ఉద్దమర్రిలోని వాటర్ ఫిల్టర్ కేంద్రం (సామాజిక నీటి శుద్ధి కేంద్రం)లో సిబ్బంది లేకుండానే ప్రజలు నీటిని కొని తీసుకెళ్లేలా ఏర్పాటు చేశారు. తాజా మాజీ సర్పంచ్ యాంజాల అనురాధ పట్టభద్రురాలు కావడం, డిజిటల్ విధానంపై అవగాహన ఉండటంతో.. స్మార్ట్‌కార్డు విధానం ఏర్పాటుకు నిర్ణయించారు. దీనిపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.ఈ వాటర్ ఫిల్టర్ నిర్వాహకులకు ముందుగా రూ.50 చెల్లిస్తే ఒక 20 లీటర్ల వాటర్ క్యాన్‌తోపాటు యాక్టివేట్ చేసిన స్మార్ట్ కార్డును వినియోగదారులకు ఇస్తారు. తర్వాత వినియోగదారులు నగదు ఇచ్చి స్మార్ట్ కార్డును రీచార్జ్ చేసుకోవచ్చు. వాటర్ ప్లాంట్ వద్ద ఉన్న మిషన్ సెన్సర్ వద్ద స్మార్ట్ కార్డును స్కాన్ చేస్తే కార్డులో నుంచి రూ.5 కట్ అయి.. వారు నాజిల్ దగ్గర పెట్టిన వాటర్ క్యాన్ నిండుతుంది. ఇలా స్మార్ట్‌కార్డు వినియోగించిన ప్రతిసారీ రూ.5 చొప్పున కట్ అయి.. వాటర్ బాటిల్ నిండుతుంది. ఫిల్టర్ వాటర్ కేంద్రం 24 గంటలూ ఆన్‌లో ఉంటుంది. ఎప్పుడు కావాలన్నా వెళ్లి నీళ్లు తెచ్చుకోవచ్చు.కావాల్సినప్పుడల్లా తెచ్చుకుంటున్నాం.. స్మార్ట్ కార్డ్‌తో మంచి ప్రయోజనం ఉంది. రోజూ నీళ్లు తెచ్చుకోవాలంటే చేతిలో డబ్బులు, చిల్లర ఉండకపోవచ్చు. నెల మొదటి వారంలో డబ్బు ఉన్నపుడు రీచార్జి చేయించుకుంటే చాలు. ఈ కేంద్రం 24 గంటలూ అందుబాటులో ఉంటోంది. అవసరమైనప్పుడల్లా నీటిని తెచ్చుకుంటున్నాం. –జూపల్లి పద్మ, ఉద్దమర్రి -
Hyderabad: ‘గ్యాస్’ బెనిఫిట్.. 10 లక్షల మందికే..
సాక్షి, హైదరాబాద్: సబ్సిడీ వంట గ్యాస్ స్కీంకు రేషన్‌కార్డు మెలిక పెట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఆహార భద్రత (రేషన్) కార్డులు కలిగిన నిరుపేద కుటుంబాలకు మాత్రమే సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్లు పొందేందుకు అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. అయితే మహానగర పరిధిలోని గృహోపయోగ వంటగ్యాస్ కనెక్షన్‌దారుల్లో సగానికి పైగా కుటుంబాలకు రేషన్ కార్డులు లేవు. గత పదేళ్లలో అనేక కుటుంబాల్లోని సభ్యులు వివాహాలతో వేరుపడడం, కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేయకపోవడంతో కార్డులు లేని కుటుంబాల సంఖ్య బాగా పెరిగింది. అది కాస్తా సబ్సిడీ వంట గ్యాస్ అర్హతకు సమస్యగా తయారైంది. 10 లక్షల కనెక్షన్లకే సబ్సిడీ వర్తింపు గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా పరిధిలో సుమారు 10 లక్షల గ్యాస్ కనెక్షన్లకే సబ్సిడీ వంట గ్యాస్ వర్తించనుంది. ప్రసుత్తం కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ అధికారికంగా గృహోపయోగ వంట గ్యాస్ కనెక్షన్లు కలిగిన సుమారు 30 లక్షల కుటుంబాలకు మాత్రమే నగదుగా బదిలీ అవుతోంది. మరోవైపు ఉపాధి, ఇతరత్రా కోసం వలస వచి్చన కుటుంబాలతో మరో పది లక్షల అనధికార కనెక్షన్లు ఉన్నట్లు అంచనా. ఇటీవల జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో సుమారు 19.01 లక్షల కుటుంబాలు సబ్సిడీ వంట గ్యాస్ వర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. కాగా, అందులో తెల్లరేషన్ కార్డులు కలిగిన గ్యాస్ కనెక్షన్ దారులు కేవలం 10 లక్షల వరకు మాత్రమే ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచారు. దీంతో మిగిలిన వారి పరిస్థితి ప్రశ్నార్ధకంగా తయారైంది. ఉజ్వలకు వర్తింపు ? ప్రధాన మంత్రి ఉజ్వల కల్యాణ్ యోజన పథకం కింద గల కనెక్షన్లకు సబ్సిడీ వర్తింపుపై అయోమయం నెలకొంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం కింద వంటగ్యాస్ కనెక్షన్లు కలిగి ఉన్న కుటుంబాలకు సిలిండర్‌పై రూ.300ల సబ్సిడీ వర్తింపజేస్తోంది. మహానగరం మొత్తం మీద లక్ష వరకు కనెక్షన్లు ఉన్నట్లు ప్రధాన ఆయిల్ కంపెనీల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఉజ్వల పథకం ఏడాదికి 12 సిలిండర్లపై సబ్సిడీ వర్తిస్తోంది. కొత్త పథకం వర్తిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ రెండు విధాలుగా నగదు బదిలీ జమ అవుతుందా? లేక సబ్సిడీ సొమ్ము తగ్గుతుందా? అనేది స్పష్టత లేకుండా పోయింది. ప్రస్తుతం సబ్సిడీ ఇలా కేంద్ర ప్రభుత్వం గృహోపయోగ వంటగ్యాస్ సిలిండర్లపై ప్రస్తుతం రూ.40.17 పైసలు సబ్సిడీ అందిస్తోంది. గత రెండేళ్లుగా వంట గ్యాస్ ధరతో సంబంధం లేకుండా సబ్సిడీలో మాత్రం ఏలాంటి మార్పు లేకుండా వర్తింపజేస్తోంది. వాస్తవంగా వంట గ్యాస్ సిలిండర్‌పై వర్తింపజేసే సబ్సిడీ వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలోకి నేరుగా జమ చేసే డీబీటీఎల్ పథకం 2014 నవంబర్ 10న అమల్లో వచి్చంది. వినియోగదారులు గ్యాస్ సిలిండర్ రీఫిల్ కోసం పూర్తి మొత్తాన్ని డెలివరీ సమయంలో చెల్లిస్తే అనంతరం వినియోగదారుల బ్యాంకు ఖాతాలో సబ్సిడీ నగదు జమ జరిగేది. డీబీటీ పథకం అమలు తొలిరోజుల్లో సబ్సిడీ బాగానే వర్తించేంది. తాజాగా సిలిండర్ ధరతో నిమిత్తం లేకుండా సబ్సిడీ నగదు జమ రూ 40.71 పైసలకు పరిమితమైంది. -
27 లేదా 29 నుంచి.. మరో రెండు గ్యారంటీలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సర్కారు మరో రెండు గ్యారంటీలను అమల్లోకి తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ అందించే పథకాలను ఈ నెల 27 లేదా 29వ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఆరు గ్యారంటీల అమలుకోసం ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా రెండు పథకాల అమలు, విధివిధానాలపై సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారు. జీరో బిల్లింగ్.. ఏజెన్సీలకు సబ్సిడీ సొమ్ము మార్చి మొదటివారం నుంచి జారీచేసే విద్యుత్ బిల్లులకు సంబంధించి.. 200యూనిట్లలోపు వాడే అర్హులైన వినియోగదారులకు జీరో బిల్లులు ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించేందుకు వీలుగా విధివిధానాలను సిద్ధం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పించిందని.. ఆరోగ్యశ్రీ వైద్య చికిత్సల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిందని సీఎం గుర్తు చేశారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని సూచించారు. రూ.500కు గ్యాస్ సిలిండర్ అందించే పథకంలో.. ‘ప్రభుత్వ సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేయాలా? లేక ఏజెన్సీలకు చెల్లించాలా? ఈ క్రమంలో వచ్చే అడ్డంకులు, ఇబ్బందులేమిట’న్న అంశాలపై సివిల్ సప్లైస్, ఆర్థిక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే ఎలాగైనా సరే లబ్ధిదారు రూ.500 చెల్లిస్తే సిలిండర్ అందించేలా చూడాలని, ప్రజలకు అనువైన విధానాన్ని అనుసరించాలని సూచించారు. దీనికి సంబంధించి గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసే ఏజెన్సీలతో చర్చించాలన్నారు. ప్రభుత్వమిచ్చే సబ్సిడీ నిధులను వెంటవెంటనే చెల్లించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇక 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ఇచ్చే ‘గృహజ్యోతి’ పథకాన్ని అనుమానాలు, అపోహలకు తావులేకుండా పారదర్శకంగా అమలు చేయాలని విద్యుత్తు శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. తెల్లరేషన్ కార్డు ఉండి, 200యూనిట్లలోపు వాడే గృహ విద్యుత్ వినియోగదారులందరికీ ఈ పథకం వర్తింపజేయాలని స్పష్టం చేశారు. తప్పుల సవరణకు అవకాశం ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తుల్లో కార్డు నంబర్లు, విద్యుత్ కనెక్షన్ నంబర్ల తప్పుల కారణంగా జీరో బిల్లుకు అర్హత కోల్పోయిన వారెవరైనా ఉంటే.. సవరించుకునే అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్ సూచించారు. విద్యుత్ బిల్లుల కలెక్షన్ సెంటర్లు, సర్వీస్ సెంటర్లన్నింటా ఈ సవరణ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. ఈ విషయంలో ప్రజలందరికీ తెలిసేలా ప్రతి గ్రామంలో విద్యుత్ శాఖ తగినంత ప్రచారం కూడా చేపట్టాలని సూచించారు. తప్పులను సవరించుకున్న అర్హులందరికీ తదుపరి నెల నుంచి పథకం వర్తింపజేయాలన్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోనివారు ఇప్పుడు కూడా ఎంపీడీవో, తహసీల్దార్ ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకునేలా.. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి, ఆర్థికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణారావు, సివిల్ సప్లైస్ కమిషనర్ డీఎస్ చౌహాన్, ట్రాన్స్‌కో, జెన్కోల సీఎండీ రిజ్వీ, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికలు ముగియగానే పెరిగిన వంటగ్యాస్
ఎన్నికలు ముగియగానే పెరిగిన వంటగ్యాస్ -
ఏపీ ఇంట.. ఈ–వంట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అమలవుతోన్న అనేక సంక్షేమ పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శమవుతుండటం ఓ విశేషం కాగా..దేశంలో అమలు చేసే ఏ పథకానికైనా రాష్ట్రం ఎంపిక అవుతుండటం మరో విశేషం. తాజాగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) ఆధ్వర్యంలో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన నేషనల్ ఎఫిషియెంట్ కుకింగ్ ప్రోగ్రాం (ఎన్‌ఈసీపీ), ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్స్ ప్రోగ్రాం (ఈఈఎఫ్‌పీ) పథకాలకు ఏపీ ఎంపికైంది. కుకింగ్ ప్రోగ్రామ్ ద్వారా దేశవ్యాప్తంగా 20 లక్షల ఇండక్షన్ కుక్‌స్టవ్‌లను ఈఈఎస్ఎల్ సరఫరా చేయనుంది. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, వినియోగంలో చురుకుగా వ్యవహరిస్తున్న యూపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో పాటు ఏపీలోనూ వీటిని పంపిణీ చేయనున్నట్లు ఈఈఎస్ఎల్ తెలిపింది. ఈ–కుక్కర్‌తో ఆరోగ్యం.. ‘ఎన్‌ఈసీపీ’ ద్వారా ఇచ్చే ఈ స్టవ్‌లు వంటకు ఉపయోగించే సంప్రదాయ సహజ వాయువు (ఎల్పీజీ), బయోమాస్ వంటి ఇంధనాలను ప్రత్యామ్నాయంగా ఉపయోగపడనున్నాయి. వంటకు వినియోగించే ఇంధనాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి్సన అవసరం, అధిక ధర చెల్లించి కొనుగోలు చేయాల్సిన ఆగత్యం తప్పుతుంది. సాంప్రదాయ వంట పద్ధతుల కంటే 25–30% ఖర్చును దీనివల్ల ఆదా చేయవచ్చు. ఈ–కుకింగ్ ద్వారా చేసిన వంటకు, గ్యాస్ ఉపయోగించి వండిన ఆహారానికి ఎలాంటి తేడా ఉండదు. పైగా వంట పొయ్యి వద్ద పొగతో అనారోగ్యానికి గురికావాలి్సన అవసరం రాదు. వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించడం వీలవుతుంది. హానికరమైన బయోమాస్ ఆధారిత వంటకు దూరంగా పరిశుభ్రమైన వంట పద్ధతులను ప్రజలకు అలవాటు చేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఫ్యాన్లతో ఇళ్లలో విద్యుత్ ఆదా.. ‘ఈఈఎఫ్‌పీ’ ద్వారా జగనన్న ఇళ్లలో విద్యుత్ ఆదా ఫ్యాన్లను పంపిణీ చేసేందుకు ఇటీవల గోవాలో జరిగిన జీ20 సదస్సులో గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఈఈఎస్ఎల్ సీఈవో విశాల్ కపూర్ సంతకాలు చేసి, ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో నిర్మిస్తోన్న ఇళ్లకు 6 లక్షల ఎల్ఈడీ బల్బులు, 3 లక్షల ఎల్ఈడీ ట్యూబ్ లైట్లు, 3 లక్షల బ్రష్‌లెస్ డైరెక్ట్ కరెంట్ మోటర్(బీఎల్డీసీ) సీలింగ్ ఫ్యాన్లు సరఫరా చేయనున్నారు. ఒక్కో ఇంటికీ 4 ఎల్ఈడీ బల్బులు, 2 ట్యూబ్ లైట్లు, 2 ఎనర్జీ ఎఫిషియెన్సీ ఫ్యాన్లను రాయితీపై అందించనున్నారు. రూ.400 కోట్లతో పంపిణీ చేసే ఈ ఉపకరణాల వల్ల ప్రతి ఇంటికీ ఏడాదికి 734 యూనిట్ల ఇంధనం ఆదా అవుతుంది. తొలి దశలో 15.6 లక్షల ఇళ్లలో ఇంధన సామర్థ్య ఉపకరణాలను వినియోగించడం వల్ల ఏడాదికి 1,145 మిలియన్ యూనిట్ల విద్యుత్తు మిగులుతుందని అంచనా. విద్యుత్ బిల్లుల ఖర్చులను తగ్గించడానికి, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడనుంది. ఏపీ ముందుకు రావడం అభినందనీయం వంటశాలలలో ఆధునిక ఎలక్ట్రిక్ వంట పరికరాలను వినియోగించడం ద్వారా ఎల్పీజీ, కిరోసిన్ ఆధారిత వంటపై ఆధారపడటాన్ని తగ్గించడం మా లక్ష్యం. ఇందుకోసం మోడరన్ ఎనర్జీ కుకింగ్ సర్వీసెస్ (ఎంఈసీఎల్)తో కలిసి ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో ఈ–స్టవ్‌లను పంపిణీ చేయనున్నాం. పాండిచ్చేరి, కేరళ, లడ్హాక్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టులు ప్రారంభించాం. జగనన్న ఇళ్లలో బీఎల్డీసీ ఫ్యాన్లు అందించేందుకు ఏపీ ముందుకు రావడం అభినందనీయం. – విశాల్ కపూర్, సీఈవో, ఈఈఎస్ఎల్ -
మేమొస్తే రూ.500కే గ్యాస్ సిలిండర్
జల్‌బంధా: ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కొత్తగా మహతారీ న్యాయ్ యోజన పథకం ప్రారంభించి మహిళలకు రూ.500కే వంటగ్యాస్ అందిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా హామీ ఇచ్చారు. సోమవారం ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా జల్‌బంధాలో ఆమె ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. ‘ మేం మళ్లీ అధికారంలోకి వస్తే దాదాపు 6,000 ప్రభుత్వ ఉన్నత మాధ్యమిక, ఉన్నత పాఠశాలలను స్వామి ఆత్మానంద్ ఇంగ్లిష్, హిందీ మీడియం స్కూళ్లుగా అప్‌గ్రేడ్ చేస్తాం. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందిస్తాం. స్వయం సహాయక బృందాలు, సాక్ష్యమ్ యోజన కింద రుణాల పొందిన వారి రుణాలను మాఫీ చేస్తాం. కొత్తగా 700 గ్రామీణ పారిశ్రామిక పార్కులను నెలకొల్పుతాం. దీంతో వీటి సంఖ్య ఏకంగా 1,000కి చేరుతుంది. తివారా రకం పప్పు ధాన్యాన్ని రైతుల నుంచి కనీస మద్దతు ధరకే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలుచేయనుంది’ అని ప్రియాంక పలు హామీ ప్రకటించారు. ‘ 2018 ఏడాది వరకు రాష్ట్రంలోని రవాణా రంగంతో సంబంధం ఉన్న 6,600 మందికిపైగా వాహన యజమానుల వాహన పన్నును మాఫీ చేస్తాం’ అని ప్రకటించారు. వంట గ్యాస్‌పై మహిళలకు ఇచ్చే రూ.500 సబ్సిడీని నేరుగా వారి బ్యాంక్ ఖాతాలోనే జమచేస్తామని ర్యాలీ తర్వాత ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ పోస్ట్‌చేశారు. మహిళలను తెలివితక్కువ వాళ్లుగా లెక్కగట్టారు ర్యాలీ సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వంపైనా ప్రియాంక నిప్పులు చెరిగారు. ‘ మధ్యప్రదేశ్‌లో 18 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. అయినా అక్కడ మహిళలకు దక్కిన హక్కులు, రక్షణ శూన్యం. హింస పెరిగింది. ఆ రాష్ట్రంలో రోజూ సగటున 17 అత్యాచారాలు నమోదవడం సిగ్గుచేటు. ఇన్నాళ్లూ మహిళలను గాలికొదిలేసిన చౌహాన్ సర్కార్ రెండు నెలల క్రితం లాడ్లీ బెహ్నా పథకం మొదలుపెట్టి మహిళల ఖాతాలోకి కొంత మొత్తం జమచేయడం షురూ చేసింది. ప్రభుత్వం అకస్మాత్తుగా మహిళలపై ప్రేమ ఒలకబోస్తోంది. ఎన్నికల వేళ ఆమాత్రం తెలుసుకోలేనంత తెలివితక్కువ వారిగా మహిళలను లెక్కగట్టింది’ అని ప్రియాంక ఆరోపించారు. -
‘ఉజ్వల’ లబ్దిదారులకు మరో రూ.100 రాయితీ
న్యూఢిల్లీ: ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ కింద వంట గ్యాస్ సిలిండర్లపై రాయితీని మరో రూ.100 పెంచాలని కేంద్ర మంత్రివర్గం బుధవారం నిర్ణయించింది. దీంతో ఒక్కో సిలిండర్‌పై మొత్తం రాయితీకి రూ. 300కు చేరుకుంది. ఉజ్వల యోజన కింద కేంద్ర ప్రభుత్వం పేద మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచి్చన సంగతి తెలిసిందే. ప్రతి ఏటా 12 రాయితీ సిలిండర్లు తీసుకోవచ్చు. ప్రస్తుతం ఒక్కో సిలిండర్ (14.2 కిలోలు)పై రూ.200 చొప్పున కేంద్రం రాయితీ ఇస్తోంది. ఈ రాయితీని మరో రూ.100 పెంచినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. దీనివల్ల దేశవ్యాప్తంగా 9.6 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందుతాయని తెలియజేశారు. ఉజ్వల పథకం లబ్ధిదారులు ప్రస్తుతం ఒక్కో సిలిండర్ కోసం రూ.703 ఖర్చు చేస్తున్నారు. ఇకపై రూ.603 చొప్పున వెచి్చంచాల్సి ఉంటుంది. త్వరలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. తాము అధికారంలోకి వస్తే రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఉజ్వల యోజన లబి్ధదారులకు సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం మరో రూ.100 పెంచడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
గ్యాస్ బండ రూ. 200 తగ్గింది
వంటగ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు నిర్ణయానికిఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదు. ఇది ఓనం, రక్షాబంధన్ పండుగల సందర్భంగా మహిళలకు మోదీ ప్రభుత్వం ఇస్తున్న కానుక.– అనురాగ్ ఠాకూర్, కేంద్ర మంత్రి న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.200 చొప్పున తగ్గించింది. ఈ నిర్ణయం బుధవారం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం మంగళవారం సమావేశమైంది. మధ్యప్రదేశ్‌తోపాటు తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే చౌక ధరకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తామంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ హామీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో గ్యాస్ బండ ధరను రూ.200 చొప్పున తగ్గిస్తూ మోదీ సర్కారు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దేశంలో గత రెండేళ్లుగా గ్యాస్ సిలిండర్ ధర పెరగడమే తప్ప తగ్గిన దాఖలాలు లేవు. దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1,103 ఉండగా, బుధవారం నుంచి రూ.903కు లభించనుంది. ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ లబ్ధిదారులు వంట గ్యాస్ సిలిండర్‌పై ఇప్పటికే రూ.200 చొప్పున రాయితీ పొందుతున్నారు. తాజా తగ్గింపు ధర వారికి కూడా వర్తిస్తుంది. అంటే ఒక్కో సిలిండర్ రూ.703కే పొందవచ్చు. అంతేకాకుండా ఉజ్వల యోజన కింద అదనంగా 75 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ పథకం కింద లబ్ధి పొందేవారి సంఖ్య 10.34 కోట్లకు చేరుకోనుంది. ఎన్నికలతో సంబంధం లేదు: మంత్రి ప్రజలకు ఉపశమనం కలి్పంచడానికే వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలని నిర్ణయించినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ఈ నిర్ణయానికి ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఇది ఓనం, రక్షాబంధన్ పండుగల సందర్భంగా మహిళలకు మోదీ ప్రభుత్వం ఇస్తున్న కానుక అని వివరించారు. ప్రజలపై ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యంగా చేపట్టిన చర్యల్లో భాగంగానే గ్యాస్ ధరను తగ్గించినట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రజల సంక్షేమం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి, అంకితభావానికి ఇదొక నిదర్శనమని స్పష్టం చేసింది. నిత్యావసరాలు సరసమైన ధరలకే ప్రజలకు అందాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొంది. సోదరీమణులకు ఉపశమనం: మోదీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.200 చొప్పున కేంద్ర ప్రభుత్వం తగ్గించడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. రక్షాబంధన్ పండుగ సందర్భంగా వెలువడిన ఈ నిర్ణయం కుటుంబాల్లో సంతోషాన్ని పెంచుతుందని చెప్పారు. అక్కాచెల్లెమ్మలకు మరింత ఉపశమనం లభిస్తుందని వెల్లడించారు. తన సోదరీమణులంతా సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలంటూ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందడానికే వంట గ్యాస్ సిలిండర్ ధరను ప్రభుత్వం తగ్గించినట్లు ప్రచారం సాగుతోంది. వంట గ్యాస్‌తోపాటు నిత్యావసరాల ధరల పెరుగుదలను కాంగ్రెస్ ప్రచారాస్త్రంగా మార్చుకుంది. కాంగ్రెస్ పాలిత రాజస్తాన్‌లో రూ.500కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్, తెలంగాణలో అధికారంలోకి వస్తే రూ.500కు సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది. కొన్ని నెలల క్రితం జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఇలాంటి హామీతో కాంగ్రెస్ విజయం సాధించింది. అందుకే కాంగ్రెస్ ప్రచార ఎత్తుగడలను తిప్పికొట్టి జనాన్ని తమవైపు తిప్పుకోవాలన్న వ్యూహంలో భాగంగానే సిలిండర్ ధరను మోదీ సర్కారు భారీగా తగ్గించినట్లు సమాచారం. ఈ తగ్గింపు వల్ల చమురు సంస్థలపై పడే భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. ఎన్నికల వ్యూహమే!? రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందడానికే వంట గ్యాస్ సిలిండర్ ధరను ప్రభుత్వం తగ్గించినట్లు ప్రచారం సాగుతోంది. వంట గ్యాస్‌తోపాటు నిత్యావసరాల ధరల పెరుగుదలను కాంగ్రెస్ ప్రచారాస్త్రంగా మార్చుకుంది. కాంగ్రెస్ పాలిత రాజస్తాన్‌లో రూ.500కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్, తెలంగాణలో అధికారంలోకి వస్తే రూ.500కు సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది. కొన్ని నెలల క్రితం జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఇలాంటి హామీతో కాంగ్రెస్ విజయం సాధించింది. అందుకే కాంగ్రెస్ ప్రచార ఎత్తుగడలను తిప్పికొట్టి జనాన్ని తమవైపు తిప్పుకోవాలన్న వ్యూహంలో భాగంగానే సిలిండర్ ధరను మోదీ సర్కారు భారీగా తగ్గించినట్లు సమాచారం. ఈ తగ్గింపు వల్ల చమురు సంస్థలపై పడే భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. -
ప్రపంచంలో 230 కోట్ల మందికి వంటగ్యాస్ లేదు
ఐక్యరాజ్యసమితి: నేటి ఆధునిక యుగంలోనూ విద్యుత్ వెలుగులు చూడనివారు, వంటగ్యాస్ అందుబాటులో లేనివారు ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ఉన్నారు. ఈ మేరకు ఐదు అంతర్జాతీయ సంస్థలు.. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఎజెన్సీ, ఐక్యరాజ్యసమితి గణాంక విభాగం, ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తాజాగా ఒక నివేదిక విడుదల చేశాయి. ప్రపంచంలో దాదాపు 230 కోట్ల మంది వంటచెరుకుగా కట్టెలు, పిడకల వంటివి ఉపయోగిస్తున్నారని వెల్లడించాయి. 67.50 కోట్ల మందికి ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేదని తెలియజేశాయి. ♦ 2030 నాటికి కరెంటు లేని వారి సంఖ్య 66 కోట్లకు, వంట గ్యాస్ లేని వారి సంఖ్య 190 కోట్లకు తగ్గిపోతుంది. ♦ 2010లో ప్రపంచంలో 84 శాతం మందికి విద్యుత్ సౌకర్యం ఉంది. 2021 నాటికి ఇది 91 శాతానికి చేరింది. కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి వల్ల 2019–21లో ఈ వృద్ది కొంత మందగించింది. ♦ కరెంటు సౌకర్యం లేనివారిలో 80 శాతం మంది (56.7 కోట్లు) సబ్ సహారన్ ఆఫ్రికాలో నివసిస్తున్నారు. ♦ ఇంధన వనరుల విషయంలో ప్రపంచ దేశాలు అనుసరిస్తున్న విధానాలు ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ♦ వంట గ్యాస్ లేకపోవడంతో కట్టెలు, పిడకలు వంటి కాలుష్యకారక ఇంధనాల వాడకం, దానివల్ల వాయు కాలుష్యం కారణంగా ప్రపంచంలో ప్రతిఏటా దాదాపు 32 లక్షల మంది చనిపోతున్నారని అంచనా. -
వంట గ్యాస్ ఆదా చేసుకోండిలా! ఈ చిట్కాలు పాటిస్తే ఎక్కువకాలం పాటు
ఇంచుమించు ప్రతి ఇంట్లోనూ ఇప్పుడు వంటకు గ్యాసే వాడుతున్నారు. దాంతో వంట గ్యాస్ ధర రోజురోజుకీ పెరిగి మంట గ్యాస్‌గా మారిపోతోంది. అందుకే దాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటే ఎక్కువకాలం పాటు గ్యాస్ వచ్చే విధంగా చూసుకోవచ్చు. గ్యాస్ ఆదాకు చిట్కాలు తెలుసుకుందాం... వంట చేసేటప్పుడు రోజులో ఒకేసారి ఎక్కువ మొత్తంలో కూర వండుకోవడం మంచిది. ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి... ఇలా వండడం వల్ల గ్యాస్ ఎక్కువ మొత్తంలో పోతుంది. అదే మధ్యాహ్న భోజనం చేయడానికి ఒక గంట ముందు వండుకుంటే, అదే కూర మధ్యాన్నానికి, రాత్రికి కూడా వస్తుంది. దీనివల్ల రెండు మూడుసార్లు గ్యాస్‌ను వాడాల్సిన అవసరం రాదు. ప్రెషర్ కుకర్ బెస్ట్ ►ప్రెషర్ కుకర్ అధిక పీడనం కింద ఆవిరి మీద ఆహారాన్ని ఉడికిస్తుంది పైగా రెండు మూడు రకాలను ఒకేసారి కుకర్‌లో పెట్టవచ్చు కాబట్టి తక్కువ సమయంలో వంట పూర్తవుతుంది. గ్యాస్ కూడా ఆదా అవుతుంది. చిన్న బర్నర్‌తో ►చిన్నగిన్నెలో వంటలు చేస్తున్నప్పుడు పెద్ద బర్నర్ వాడకూడదు. అలా వాడటం వల్ల మంట చాలా మటుకు బయటికి పోతుంది. దాంతో ఆ మేరకు గ్యాస్ వృథా అయినట్లే కదా.. అందువల్ల సాధ్యమైనంత వరకు చిన్న బర్నర్‌నే వాడటం మంచిది. ఇలా చేస్తే మరింత ఆదా ►బర్నర్లను తరచూ శుభ్రపరుస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల అది త్వరగా వేడెక్కి వంట త్వరగా పూర్తయ్యేలా చేస్తుంది. వంట పూర్తవడానికి కొంచెం ముందే స్టవ్ ఆపి వేయండి. గిన్నె మీద మూత మాత్రం తీయవద్దు. లోపల ఉన్న వేడి ఆ మిగతా వంటను పూర్తి చేస్తుంది. దీనివల్ల గ్యాస్ ఆదా అవుతుంది. ►వంట చేస్తున్నప్పుడు గిన్నె మీద మూత పెట్టే ఉంచండి. ఎందుకంటే మూత పెట్టడం వల్ల లోపల ఉన్న వేడి బయటికి పోదు. ఆ వేడి మీదే త్వరగా ఉడుకుతుంది. అదేవిధంగా స్నానానికి వేడినీళ్లను గ్యాస్ మీద పెట్టవద్దు. నీళ్లు వేడెక్కడానికి చాలా సమయం పడుతుంది. దాంతో ఎక్కువ గ్యాస్ వాడాల్సి వస్తుంది. ►పగటిపూట వంట చేస్తున్నప్పుడు వంటగదిలోని లైట్లను ఆన్ చేయవద్దు. దీనివల్ల శక్తి ఆదా అవుతుంది. అలాగే మీకు తెలియకుండానే గ్యాస్ వినియోగం కూడా తగ్గుతుంది. ►ఈ చిట్కాలన్నీ పాటించడం వల్ల గ్యాస్ సిలెండర్ దాదాపు పది రోజులు అదనంగా వచ్చే అవకాశం ఉంది. -
వంట గ్యాస్ వినియోగదారులకు ఊరట.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర!
గ్యాస్ ధరలపై కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 2023-2024 ఆర్థిక సంవత్సరం మొదటి రోజునే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను సవరించింది. ఏప్రిల్ 1న వంట గ్యాస్ ధరలు దాదాపు రూ.92 తగ్గించింది. అయితే రేట్ల తగ్గింపు కేవలం వాణిజ్య గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మాత్రమే. గృహోపయోగానికి వినియోగించే డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి తగ్గింపు లేదు. 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలను ప్రభుత్వం గత నెలలోనే రూ.50 పెంచిన విషయం తెలిసిందే. అలాగే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను రూ.350 పెంచింది. (Jio offer: జియో అన్లిమిటెడ్ డేటా ఆఫర్.. కొత్త కస్టమర్లకు ఉచిత ట్రయల్!) సాధారణంగా కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజున పెట్రోలియం కంపెనీలు ఎల్పీజీ సిలిండర్ల ధరలను సవరిస్తుంటాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ, అంతర్జాతీయ బెంచ్‌మార్క్ రేటు భారతదేశంలో ఎల్పీజీ సిలిండర్ ధరలను ప్రభావితం చేసే రెండు కీలక అంశాలు. సవరించిన తర్వాత 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర ఢిల్లీలో రూ.2,028, కోల్‌కతాలో రూ.2,132, ముంబైలో రూ.1,980, చెన్నైలో రూ.2192.50 చొప్పున ఉంది. కాగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం గృహ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీని ప్రకటించింది. ఈ పథకం కింద 9.59 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రతి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌పైనా రూ.200 సబ్సిడీ అందిస్తున్నట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ గత నెలలో ప్రకటించారు. డొమెస్టిక్ సిలిండర్లు ఏడాదికి 12 మాత్రమే వినియోగించకునేలా కేంద్ర ప్రభుత్వం పరిమితిని విధించింది. -
గ్యాస్ మంటపై రేపు నిరసనలు
సాక్షి, హైదరాబాద్: ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియగానే ప్రధాన మంత్రి మోదీ వంటగ్యాస్ ధరలు పెంచారంటూ భారత రాష్ట్ర సమితి తీవ్రస్థాయిలో మండిపడింది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండల కేంద్రాల్లో వినూత్న కార్యక్రమాలతో నిరసనలు చేపట్టాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కె.తారక రామారావు పిలుపునిచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో ఆయన బుధవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు అయిన వెంటనే ప్రతిసారీ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడం కేంద్ర ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని ఆరోపించారు. గృహావసరాల సిలిండర్ ధరను రూ.50, వాణిజ్య సిలిండర్ ధరను రూ. 350 మేర భారీగా పెంచడంపై ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మహిళా దినోత్సవం సందర్భంగా దేశ మహిళలకు ప్రధాన మంత్రి మోదీ ఇచ్చిన కానుకా..? అని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం రాకముందు రూ.400 ఉన్న సిలిండర్ ధర ఈరోజు రూ. 1160 దాటి రూ.1200 వరకు పెరిగిందన్నారు. ఒకవైపు ఉజ్వల స్కీమ్ పేరుతో మాయమాటలు చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఈరోజు భారీగా గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ, వారిని సిలిండర్లకు దూరం చేస్తోందని విమర్శించారు. ఈ పథకంలో సిలిండర్లు పొందిన మహిళలు ఇప్పుడు వాటిని కొనలేక కట్టెల పొయ్యిపై వంట చేయాల్సిన పరిస్థితులు తలెత్తాతయని ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన ధరలను తక్షణమే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. అడ్డగోలుగా గ్యాస్ ధరల పెరుగుదలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలే కాదు అన్ని వర్గాల వారూ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. ప్రజల కష్టాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లే విధంగా, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ శుక్రవారం నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. -
ఎల్పీజీ ధరలో నెంబర్–2, పాట్నా తర్వాత హైదరాబాద్ టాప్
సాక్షి, సిటీబ్యూరో: వంట గ్యాస్ ధర సామాన్య, మధ్య తరగతి ప్రజానీకాన్ని బాదేస్తోంది. దేశంలోని మెట్రో నగరాలతో పోల్చితే గృహోపయోగ సిలిండర్ ధర విషయంలో నగరం రెండో స్థానాన్ని ఆక్రమించింది. దేశ రాజధాని ఢిల్లీ, ఆ తర్వాత మెట్రో నగరాలైన ముంబయి, బెంగళూర్, చెన్నై, కోల్‌కతా, లక్నో కంటే హైదరాబాద్‌లోనే ఎల్పీజీ సిలిండర్ రీఫిల్ ధర అధికంగా ఉంది. విశ్వనగరం వైపు పరుగులు తీస్తున్న మహానగరానికి ఉద్యోగ, ఉపాధి, విద్య, వైద్యం దృష్ట్యా వలస వచ్చి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్న కుటుంబాలతో డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ వినియోగం బాగా పెరిగింది. అదే స్థాయిలో వాణిజ్య సిలిండర్లకు డిమాండ్ అధికమైంది. మార్కెట్ ధర ఇలా... మెట్రో నగరాల మార్కెట్‌తో పోల్చితే హైదరాబాద్ మార్కెట్లో సిలిండర్ రీఫిల్ ధర మండిపోతోంది. చమురు సంస్థలు రాష్ట్రానికోవిధంగా రవాణా దూరాన్ని బట్టి ధరను నిర్ణయించి అమలు చేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ కంటే హైదరాబాద్‌లో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.52 అధికంగా ఉంది. డొమెస్టిక్ సిలిండర్‌పై సబ్సిడీ ఎత్తివేయడంతో బహిరంగ మార్కెట్ ధర ప్రకారం మొత్తాన్ని భరించాల్సి వస్తోంది. ఐదు శాతం పన్నుల మోత వంటగ్యాస్ సిలిండర్ రీఫిల్‌కు రవాణా, పన్నులు మరింత భారంగా మారాయి. చమురు సంస్థలు రవాణా, జీఎస్టీ పన్నులు కలుపుకొని ప్రస్తుత మార్కెట్ ధర అనుసరించి హైదరాబాద్‌లో 14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్ సరఫరాకు రూ.1,105 వసూలు చేస్తున్నాయి. వాస్తవంగా సిలిండర్ ధర రూ.1052.38 ఉండగా దానిపై సీజీఎస్టీ 2.5 శాతం కింద రూ.26.31, ఎస్జీఎస్టీ 2.5 శాతం కింద రూ. 26.31 పన్నుల భారం పడుతోంది. రవాణా చార్జీలను బట్టి.. చమురు సంస్థలు గ్యాస్ రవాణా దూరాన్ని బట్టి సిలిండర్ ధర నిర్ణయిస్తున్నాయి. హైదరాబాద్ నగరం కంటే ఎల్పీజీ ధర ఆదిలాబాద్‌లో రూ. 25 అధికంగా ఉంది. మిగతా జిల్లాల్లో సైతం కనీసం రూ. 20 నుంచి రూ. 27 వరకు అధికంగా ధర పలుకుతోంది. 19 కేజీల వాణిజ్య సిలిండర్ టాప్ వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర కూడా మోత మోగిస్తోంది. ఢిల్లీ కంటే సుమారు రూ. 204 అధికంగా పలుకుతోంది. హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ రూ. 1973 ఉండగా, చెన్నైలో రూ. 1971, కోల్‌కతాలో రూ.1870 ఢిల్లీలో రూ. 1,769, ముంబయిలో రూ.1721 ప్రకారం ధర పలుకుతోంది. 28.21 లక్షలపైనే... గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రధాన చమురు సంస్థలకు సంబంధించి సుమారు 28.21 లక్షల గృహోపయోగ వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు తెలుస్తోంది. -
వైరల్ వీడియో: ప్లాస్టిక్ కవర్లలో ‘వంట గ్యాస్’.. ప్రమాదమని తెలిసినా తప్పట్లే!
-
ప్లాస్టిక్ కవర్లలో ‘వంట గ్యాస్’.. ప్రమాదమని తెలిసినా తప్పట్లే!
ఇస్లామాబాద్: మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో ప్రజల జీవితంపై ఆర్థిక సంక్షోభం ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఈ దృశ్యాలే నిదర్శనం. సంక్షోభం తలెత్తడం వల్ల రాయితీపై అందించే నిత్యావసర వస్తువులపై పాక్ ప్రభుత్వం కోత పెడుతోంది. మరోవైపు ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ దుర్భర పరిస్థితుల్లో ధరల పెరుగుదల భారాన్ని తగ్గించుకునేందుకు ఆ దేశ ప్రజలు వంటగ్యాస్‌ను ప్లాస్టిక్ కవర్లలో నిల్వ చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పాకిస్థాన్‌లోని వాయస్వ ఖైబెర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలో స్థానికులు ఎల్పీజీ గ్యాస్‌ను నిల్వ చేసుకునేందుకు పెద్ద పెద్ద ప్లాస్టిక్ బ్యాగులను తీసుకెళ్తున్న దృశ్యాలు వీడియోల్లో కనిపిస్తున్నాయి. దేశ గ్యాస్ పైపులైన్ నెట్‌వర్క్‌కు అనుసంధానమైన దుకాణల వద్దకు ప్లాస్టిక్ బ్యాగులను తీసుకెళ్లి అందులో వంట గ్యాస్‌ను నింపించుకుంటున్నారు. అందులోంచి లీకేజీ లేకుండా విక్రయదారులు బ్యాగులకు బిగుతుగా నాజల్, వాల్వ్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాతే వాటిని ప్రజలకు విక్రయిస్తున్నారు. ప్లాస్టిక్ బ్యాగుల్లో 3-4 కేజీల గ్యాస్ నింపేందుకు ఒక గంట సమయం పడుతోంది. ఈ వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ‘పాకిస్థాన్‌లో సిలిండర్లలో కాకుండా ప్లాస్టిక్ బ్యాగుల్లో వంట గ్యాస్ నింపుతున్నారు. గ్యాస్ పైపులన్ నెట్‌వర్క్‌తో అనుసంధానమైన దుకాణాల్లో ప్లాస్టిక్ బ్యాగుల్లో గ్యాస్ నింపుతున్నారు. చిన్న ఎలక్ట్రిక్ సక్షన్ పంప్ సాయంతో వీటిని వంట గదిలో వినియోగిస్తున్నారు.’అని రాసుకొచ్చారు. అత్యంత ప్రమాదకరమైన రీతిలో వీటిని ఉపయోగిస్తున్నారని వస్తోన్న వార్తలను అధికారులు కొట్టిపారేశారు. ప్లాస్టిక్ బ్యాగుల వినియోగంపై ఆంక్షలు విధించినట్లు స్థానిక మీడియాతో వెల్లడించారు. In Pakistan, the practice of using gas packed in plastic bags instead of cylinders for cooking has increased. Gas is sold by filling bags inside the shops connected to the gas pipeline network. People use it in the kitchen with the help of a small electric suction pump.#pkmb pic.twitter.com/e1DpNp20Ku — R Singh...🤸🤸 (@lonewolf_singh) December 31, 2022 ఇదీ చదవండి: ఆకాశంలో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. ముగ్గురు మృతి -
గాడి తప్పిన ‘గ్యాస్’!
సాక్షి, హైదరాబాద్: ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ (పీఎన్జీ), వాహనాలకు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) సరఫరా చేయాలనే ప్రభుత్వం లక్ష్యం నీరుగారింది. ప్రాజెక్టు అమలు బాధ్యతలను నెత్తినెత్తుకున్న భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (బీజీఎల్) సంస్థ గ్యాస్ పంపిణీలో చేతులెత్తేసింది. ప్రాజెక్టును ప్రారంభించి పన్నెండేళ్లయినా 28% పనులు కూడా పూర్తికాకపోవడంతో పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ ఇప్పట్లో అందడం కలగానే కనిపిస్తోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, అనాలోచిత నిర్ణయాలు, అంతర్గత కుమ్ములాటల ఫలితంగా ఈ ప్రాజెక్టు మొదటి విడత తొలి అయిదేళ్ల లక్ష్యమే ఇప్పటివరకు పూర్తి కాకపోగా, కాలపరిమితి పొడిగింపుతో అంచనా వ్యయం తడిసిమోపెడవుతోంది. ఏపీ, తెలంగాణలోని హైదరాబాద్, విజయవాడ, కాకినాడ నగరాల్లో గత పన్నెండేళ్లలో 2,44,469 గృహోపయోగ వంట గ్యాస్ కనెక్షన్లు ఇవ్వగా, 209 వాణిజ్య కనెక్షన్లు, 47 పరిశ్రమలకు ఇండస్ట్రీ గ్యాస్ కనెక్షన్లను జారీ చేసినట్లు బీజీఎల్ వార్షిక నివేదిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక సీఎన్జీ పురోగతిని పరిశీలిస్తే.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ) పరిధిలో 116, ఆర్టీసీ పరిధిలో 6, ఎంఎస్ అండ్ కోకో పరిధిలో 4 సీఎన్జీ స్టేషన్లు వాహనాలకు వాయువును సరఫరా చేస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో సీఎన్జీతో నడిచే వాహనాల్లో కార్లు 30,894, ఆటోలు 38,367, బస్సులు 1,092 ఉన్నట్లు లెక్కలు స్పష్టం చేసున్నాయి. మొక్కుబడిగా విస్తరణ.. ►నగర శివారులోని శామీర్‌పేట్‌లో మదర్ స్టేషన్‌ను ఏర్పాటు చేసిన బీజీఎల్.. 2011 నవంబర్ 21న సిటీ ప్రాజెక్టు అమలుకు శ్రీకారం చుట్టింది. తొలి అయిదేళ్లలో 2.66 లక్షల కుటుంబాలకు వంటగ్యాస్, 50 స్టేషన్ల ద్వారా వాహనాలకు సీఎన్జీ గ్యాస్ అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు తొలుత మదర్‌స్టేషన్ సమీపంలోని నల్సార్ వర్సిటీ క్యాంపస్‌లోని 30 ఫ్లాట్లకు పీఎన్జీ కనెక్షన్లు జారీ చేసింది. అనంతరం మేడ్చల్‌లో సుమారు 410 కుటుంబాలకూ పీఎన్జీ కనెక్షన్లు ఇచ్చింది. ►ఇప్పటికే కనెక్షన్లు పొందిన వినియోగదారులకు సైతం పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా చేసేందుకు బీజీఎల్ ఆపసోపాలు పడుతోంది. 20 ఏళ్లలో రూ.3,166 కోట్ల అంచనా వ్యయంతో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్‌ను విస్తరించాలని బీజీఎల్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ మేరకు తొలి దశలో పైప్‌లైన్ పనులు పూర్తి చేసేందుకు సుమారు రూ.733 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. పనులు గాడిలో పడకపోవడంతో కాలపరిమితి పొడిగింపునకు బీజీఎల్ సంస్థ మొగ్గు చూపుతోంది. మరోవైపు గ్రిడ్ నుంచి తగినంత గ్యాస్ సరఫరా లేక, ప్రతిపాదిత పైప్‌లైన్ మార్గంలో క్లియరెన్సుల జారీలో జాప్యం కూడా ప్రాజెక్టుపై ప్రభావం చూపుతోంది. సీఎన్జీ కూడా అంతంతే ►హైదరాబాద్‌లో పూర్తి స్థాయిలో సీఎన్జీని అందుబాటులోకి తెచ్చే ప్రక్రియ సైతం ముందుకు సాగడం లేదు. శామీర్‌పేట్ మదర్ స్టేషన్ ఏర్పాటు చేసి సీఎన్జీని అందుబాటులోకి తెచ్చినప్పటికీ కొంతకాలంగా గ్యాస్ కొరతతో గ్రిడ్ నుంచి స్టేషన్లకు డిమాండ్‌కు తగ్గ సరఫరా చేయలేక పోతోంది. పన్నెండేళ్ల క్రితం గ్రేటర్లో ప్రజా రవాణాకు వినియోగించే 85 వేల ఆటోలు, 7,500 బస్సులు, 20 వేలకు పైగా టాక్సీలకు సగటున రోజుకు 7,62,500 కిలోల (1.067 ఎంఎంఎస్‌సీఎండీ) సీఎన్జీ అవసరమని బీజేఎల్ అంచనా వేసింది. ►తొలిదశలో మేడ్చల్, హకీంపేట, కంటోన్మెంట్ తదితర డిపోలకు చెందిన 350 ఆర్టీసీ బస్సులకు సీఎన్జీ పంపిణీ చేస్తామని ప్రకటించింది. కానీ కొద్ది రోజులు 164 బస్సులకు సరఫరా చేసినా ప్రస్తుతం ఈ సంఖ్య 135కు పడిపోయింది. దీంతో 215 సీఎన్జీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఇక నగరంలో ఏర్పాటు చేసిన సీఎన్జీ స్టేషన్ల ద్వారా కూడా గ్యాస్ సరఫరా అంతంత మాత్రంగా మారింది. ప్రతిరోజూ డిమాండ్‌కు తగినట్లు సీఎన్జీ సరఫరా కావడం లేదని డీలర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. స్మార్ట్ గ్యాస్ నగరం.. ఆమడదూరం.. ►ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరాతో స్మార్ట్ గ్యాస్ నగరంగా విజయవాడను తీర్చిదిద్దాలనే లక్ష్యం కూడా అమడ దూరంగా తయారైంది. 2010లో ప్రారంభమైన భాగ్యనగర్ గ్యాస్ పైప్ లైన్ల పనులు మొక్కుబడిగా సాగుతున్నాయి. ముందుగా 200 కిలోమీటర్ విస్తరించి నగరంలో లక్ష కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ పుష్కర కాలమైనా కనెక్షన్ల సంఖ్య 43వేలకు దాటలేదు. నగరంలో పాముల కాలువ నుంచి ప్రారంభమైన గ్యాస్ పైపు ప్రధాన లైన్ పనులు ఆంతంత మాత్రంగా మారాయి. ►పైప్లైన్లు వేయటానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించినా.. పనులు మాత్రం ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. ఇక సీఎన్జీ పరిస్థితి కూడా మరింత అధ్వానంగా తయారైంది. ఇప్పటివరకు సీఎన్జీ వాహనాల సంఖ్య 25,923 కూడా దాటలేదు. ►కాకినాడలో సైతం బీజేఎల్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇక్కడ మొదటి విడతగా 93 వేల గృహాలకు వంటగ్యాస్ సరఫరాకు మదర్ స్టేషన్ ఏర్పాటు చేసినా గృహోపయోగ కనెక్షన్ల సంఖ్య 58 వేలు దాటలేదు. వివిధ ప్రాంతాలకు పైప్‌లైన్ నెట్‌వర్క్‌ను విస్తరించడంలో విపరీతమైన జాప్యం, మరోవైపు వరుస అడ్డంకులు ఈ పరిస్థితికి దారితీసినట్లు తెలుస్తోంది. వాహనాలకు వాయువు అందించే సీఎన్జీ స్టేషన్ల సంఖ్య డజను కూడా దాటకపోగా.. సీఎన్జీ వాహనాల సంఖ్య 1,728 మాత్రమే ఉంది. -
వంటగ్యాస్.. ప్రైవేటు రూట్!
న్యూఢిల్లీ: వంటగ్యాస్ (ఎల్పీజీ) కూడా అతి త్వరలో ఓపెన్మారెక్ట్ (సబ్సిడీ రహిత) కానుందా..? కేంద్ర ప్రభుత్వ తీరును చూస్తే సామాన్యుడికి సైతం ఈ సందేహం రాకమానదు. గడిచిన ఆరేళ్ల కాలంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు రెట్టింపయ్యాయి. కానీ, సర్కారు సబ్సిడీ మాత్రం ఇదే కాలంలో రెండంకెల స్థాయికి దిగిపోయింది. వంటగ్యాస్‌పై ప్రభుత్వం సబ్సిడీ భారాన్ని గణనీయంగా తగ్గించుకుందని స్పష్టంగా అర్థమవుతోంది. దీంతో ప్రైవేటు సంస్థలైన గోగ్యాస్, ప్యూర్గ్యాస్, రిలయన్స్ గ్యాస్ తదితర కంపెనీలకు ఈ విభాగంలో ద్వారాలు తెరుచుకున్నట్టయింది. ఈ సంస్థలు ప్రధానంగా వాణిజ్య ఎల్పీజీ విక్రయాలకే ఇంతకాలం పరిమితం అయ్యాయి. ఎందుకంటే కేంద్ర సర్కారు ప్రభుత్వరంగ చమురు/గ్యాస్ కంపెనీలకే ఎల్పీజీ విక్రయాలపై సబ్సిడీలను పరిమితం చేసింది. అంటే ఈ సబ్సిడీయే ప్రైవేటు సంస్థలకు ఇంతకాలం అడ్డుగోడగా నిలిచిందని చెప్పుకోవాలి. కానీ, ఈ సబ్సిడీలకు కేంద్రం మంగళం పాడటం మొదలుపెట్టింది. ఇప్పటికీ సబ్సిడీ ఇస్తున్నా కానీ.. ఒక్కో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్‌పై ఇది రూ.40–50ను మించడం లేదు. వాస్తవానికి పెరుగుతున్న ధరలకు తగ్గట్టు కేంద్రం సబ్సిడీ కూడా పెరగాలి. కానీ, కేంద్ర సర్కారు తెలివిగా ఈ భారం మొత్తాన్ని క్రమంగా వినియోగదారుల నెత్తినే రుద్దే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తోందని చెప్పుకోవాలి. ఇదీ పరిస్థితి.. ప్రస్తుతానికి ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.884గా ఉంది. గత ప్రభుత్వాలు ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.500లోపే పరిమితం చేశాయి. కానీ, కేంద్రంలోని మోదీ సర్కారు.. డీజిల్, పెట్రోల్‌పై క్రమంగా సబ్సిడీని ఎత్తివేసిన తీరులోనే.. ఎల్పీజీ సబ్సిడీని గణనీయంగా తగ్గించుకుంటూ వచ్చింది. ఇక ఇప్పుడు ఒక్కో సిలిండర్ (ఏడాదికి గరిష్టంగా ఒక వినియోదారుకు 12 సిలిండర్లకే సబ్సిడీ)కు ఇస్తున్న నామమాత్రపు రూ.40 సబ్సిడీని ఎత్తివేయడానికి ఎక్కువ సమయం పట్టేట్టు లేదు. ఓపెన్ మార్కెట్.. ప్రభుత్వ విధానం.. ప్రైవేటు సంస్థలకు వ్యాపార వరంగా మారనుంది. భారత్ కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎల్పీజీ మార్కెట్లోకి దూకుడుగా వెళ్లే ప్రణాళికలతో ఉంది. ఈ సంస్థ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్‌లో వంటగ్యాస్ కనెక్షన్ల విక్రయాలను చేపట్టింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అతిపెద్ద రిఫైనరీ ఉండడంతో చుట్టుపక్కల ఉన్న ఈ రాష్ట్రాలకు సులభంగా సిలిండర్లను చేరవేయగలదు. అహ్మదాబాద్‌లో రిలయన్స్ గ్యాస్ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ 15 కిలోలు ధర ప్రస్తుతం రూ.1,200గా ఉంది. అంటే కిలో ధర రూ.80. ఏజిస్ లాజిస్టిక్స్‌కు చెందిన ప్యూర్గ్యాస్ ఒక్కో సిలిండర్‌ను రూ.1,300కు విక్రయిస్తోంది. అంటే కిలో ధర రూ.87. గోగ్యాస్ (కాన్ఫిడెన్స్ పెట్రోలియం) 15 కిలోల ఎల్పీజీ సిలిండర్‌కు రూ.1,200 వసూలు చేస్తోంది. ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలు (ఓఎంసీలు) విక్రయిస్తున్న సిలిండర్ ధరలు రూ.900 స్థాయిలో ఉన్నాయి. మా సేవలు చూడండి.. వేగవంతమైన సేవలకు మాది పూచీ.. ఇది ప్రైవేటు సంస్థలు చెబుతున్న మాట. కనెక్షన్‌ను వెంటనే జారీ చేయడం.. సిలిండర్‌ను 48 గంటల్లోనే డెలివరీ చేస్తామని చెబుతున్నాయి. ప్రభుత్వరంగ సంస్థల నుంచి కనెక్షన్‌కు రోజుల నుంచి వారాలు కూడా పట్టే పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో ఉంటోంది. ‘‘ఓఎంసీలు కనెక్షన్ ఇచ్చే ముందు ఎంతో పరిశీలన చేస్తాయి. సబ్సిడీ గణనీయంగా తగ్గిపోయినా కానీ వారి విధానం మారలేదు’’ అంటూ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ డీలర్ ఒకరు వాపోవడం గమనార్హం. పైగా గృహ వినియోగ గ్యాస్ వాణిజ్య అవసరాలకు మళ్లకుండా ఓంఎసీలు ప్రయతి్నస్తుంటాయి. గృహ ఎల్పీజీపై 5 శాతం జీఎస్టీ అమల్లో ఉంటే.. వాణిజ్య ఎల్పీజీపై ఇది 18%గా ఉండడం గమనార్హం. ప్రైవేటుకు బాటలు.. పెట్రోలియం శాఖ సమాంతర మార్కెటింగ్ వ్యవస్థ (పీఎంఎస్) కింద కల్పించిన సరళీకరణలు ప్రైవేటు సంస్థలకు అనుకూలించాయి. పీఎంఎస్ కింద ఎల్పీజీ దిగుమతి, నిల్వ, రవాణా, బాట్లింగ్, మార్కెటింగ్, పంపిణీ, విక్రయాలకు అవకాశాలు పెరిగాయనేది క్రిసిల్ అంచనా. దేశీయంగా ఉత్పత్తి అయ్యే ఎల్పీజీని ప్రభుత్వ ఓఎంసీలకే సరఫరా చేయాలన్న 2014 నాటి ఆదేశాలను పెట్రోలియం శాఖ పక్కన పెట్టేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతీ నెలా 10,000 టన్నుల ఎల్పీజీని ప్రైవేటు సంస్థలకు విక్రయించుకునేందుకు 2015లో అను మతించింది. దీంతో ప్రైవేటు సంస్థలు రిలయన్స్ నుంచి గ్యాస్‌ను కొనుక్కునే అవకాశం ఏర్పడింది. ఇదొక్కటీ మారితే.. ఓఎంసీ సంస్థలతో పోలిస్తే ఎల్పీజీ గ్యాస్ మార్కెట్లో రిలయన్స్ మినహా మిగిలిన సంస్థలకు అంత సానుకూలతలు ఇప్పటికైతే కనిపించడం లేదు. ఎందుకంటే అవి దేశీయ రిఫైనరీ సంస్థల నుంచి ఎల్పీజీని కొనుగోలు చేసుకోవడం లేదంటే దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. ‘ఓఎంసీలు విక్రయించే ఎల్పీజీని చమురు నుంచి ఉత్పత్తి చేస్తున్నాయి. దాంతో వాటిపై దిగుమతి సుంకం (5%) ఉండడం లేదు. ప్రైవే టు సంస్థలు రిఫైనరీలు లేకపోతే (ప్రైవేటులో రిలయన్స్‌కే రిఫైనరీలున్నాయి).. దిగుమతి చేసుకోవడం లేదంటే దేశీయ సంస్థల నుంచి కొనుగో లు చేసుకోవడం చేయాలి. దీంతో తయారీ వ్య యాలు పెరుగుతాయి. ఇది ధరలపై ప్రభా వం చూపిస్తోంది’ అని ఐవోసీ అధికారి చెప్పారు. -
వంట గ్యాస్‌పై 50 పెంపు
న్యూఢిల్లీ: వంట గ్యాస్ ధర మరో సారి పెరిగింది. 14.2 కేజీల గృహావసర సిలిండర్‌పై ప్రభుత్వ రంగ చమురు సంస్థలు రూ. 50 పెంచాయి. పెంపు అనంతరం ఢిల్లీలో ఈ సిలిండర్ ధర రూ. 769కి చేరింది. ఈ పెంపు నేటి(సోమవారం) నుంచి అమల్లోకి రానుంది. అంతర్జాతీయ చమురు ధరల ఆధారంగా నెలవారీగా చమురు సంస్థలు ఈ ధరను సమీక్షిస్తాయి. గృహావసర ఎల్పీజీ సిలిండర్లపై ప్రస్తుతం ప్రభుత్వం సబ్సీడీ ఇస్తోంది. ఈ మొత్తాన్ని నేరుగా వినియోగదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. ఆగని పెట్రో మంట న్యూఢిల్లీ: దేశంలో వరుసగా ఆరో రోజూ పెట్రోల్ ధరలు పెరిగాయి. ఆదివారం పెట్రో ల్ ధర లీటరుకు 29 పైసలు, డీజిల్ ధర 32 పైసలు పెరిగింది. దీంతో రాజస్తాన్‌లోని గంగానగర్ టౌన్లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 99.29కి చేరగా డీజిల్ ధర రూ. 91.17కి చేరింది. దేశంలోకెల్లా రాజస్తాన్‌లో అత్యధిక పన్ను లు ఆయిల్ రేట్లపై వడ్డిస్తున్న కారణంగా ఈ రేట్లు పెరిగాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర జీవిత కాల గరిష్టానికి రూ. 88.73కి చేరుకోగా, డీజిల్ ధర రూ. 79.06కు చేరకుంది. -
రెండు కళ్లలోకి బుల్లెట్లు దూసుకుపోయి..
సాక్షి, న్యూఢిల్లీ : ఒకప్పుడు చమురు ఎగుమతులతో సమద్ధిగా ఎదిగిన దేశం వెనిజులాలో నిత్యావసరాల కోసం అక్కడి ప్రజలు నిత్యం ఆందోళనలు చేయడం, వారిని పోలీసులు పాశవికంగా అణచివేయడం నిత్యకత్యమైంది. అలాగే వంట గ్యాస్ కోసం తల్లి ఆండ్రియానా వెంట కుమారులు రూఫో ఛాకన్ (16), ఆండ్రియాన్ (14)లు తారిబా పట్టణంలో రెండు వారాల క్రితం ఆందోళన చేస్తుండగా, వారిపైకి పోలీసులు రబ్బర్ బుల్లెట్లు కాల్చారు. ఆ బుల్లెట్లకు సంబంధించిన 51 ముక్కలు వచ్చి రూఫో ఛాకన్ ముఖానికి తగులగా, వాటిల్లో 16 ముక్కలు నేరుగా రెండు కళ్లలోకి దూసుకుపోయాయి. దీంతో రెండు కళ్ల నుంచి రక్తం చిమ్మింది. సకాలంలో ఆస్పత్రిలో చేరి చికిత్స అందించినప్పటికీ రెండు కళ్లు పోయాయి. చూపు తెప్పించే ఆస్కారమే లేదని వైద్యులు తేల్చి చెప్పారు. వంట గ్యాస్ లేక ఇబ్బంది పడుతున్న తల్లికి అండగా తాను ఆందోళనకు వెళ్లినందుకు ఇప్పుడు తల్లికి భారంగా మారాల్సి వచ్చిందని ఆ తనయుడు బాధ పడుతున్నాడు. ఇంక తానే మాత్రం ఏడ్వదల్చుకోలేదని, ఆస్పత్రిలోనే కావాల్సినంత ఏడ్చేశానని మీడియా ముందు వాపోయాడు. తాను మదిలో రంగులు మర్చిపోకముందే చూపు రావాలని కోరుకుంటున్నానని, తనకు జీవితంలో ఏ కలలు చావలేదని, చూపు కోసం తాను ఎంత కష్టపడాలన్నా పడతానని, అలాంటి దారి ఉంటే చూపుమని మీడియాను కూడా వేడుకున్నాడు. బాధ్యతారహితంగా రబ్బర్ బుల్లెట్లను పేల్చిన ఇద్దరు పోలీసులను వెనిజులా యంత్రాంగం గుర్తించి వారిని విధుల నుంచి సస్పెండ్ చేసింది. అమెరికా ఆంక్షల వల్ల ఇప్పుడు వెనిజులాలో చమురు, వంట గ్యాస్ కొరత తీవ్రమైంది. -
వాహనాల్లో వంట గ్యాస్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని వాహనాల సిలిండర్లలో వంట గ్యాస్ నిండుతోంది. గ్రేటర్ పరిధిలో అక్రమ రీఫిల్లింగ్ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. జనావాసాల్లో ప్రమాదాలు పొంచి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు నామమాత్రపు చర్యలతో సరిపెడుతుండటం విస్మయానికి గురిచేస్తోంది. ఎల్పీజీ గ్యాస్ స్టేషన్లలో గ్యాస్‌కు కొరత లేనప్పటికీ వాహనదారులు మాత్రం డొమెస్టిక్ గ్యాస్‌పైనే ఆసక్తి చూపుతున్నారు. అధికారిక స్టేషన్లలో నింపే ఎల్పీజీ కంటే డొమెస్టిక్ గ్యాస్ మందంగా ఉండటంతోపాటు మైలేజీ అధికంగా వస్తుండటం, ధర కూడా తక్కువ ఉండటం ఇందుకు కారణం. దీంతో నగరంలో అక్రమ గ్యాస్ ఫిల్లింగ్ కేంద్రాలు పుట్టగొడుగులా పుట్టుకొచ్చాయి. నిత్యం ఆయా కేంద్రాల వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. ఇందులో ఆటోలు అధికంగా ఉండటం విశేషం. ధరలు మంటే కారణం.. పెట్రోల్, డీజిల్ ధరలు మండుతుండటంతో చౌక గ్యాస్ వినియోగంపై వాహనదారులు ఆసక్తి చూపుతున్నారు. నాలుగు చక్రాల వాహనదారులు కొందరు అధికారికంగా అనుమతి తీసుకొని వాహనాల ట్యాంకుల మార్చుకుంటుండగా మరి కొందరు అనధికారికంగా మార్పిడి చేసుకుంటున్నారు. ఆటో డ్రైవర్లు ఎల్పీజీ, సీఎన్జీల కంటే చౌకగా లభిస్తుండటంతో డొమెస్టిక్ గ్యాస్‌పై మక్కువ చూపుతున్నారు. రెండు లక్షలకు పైనే.. మహా నగరంలో వాహనాల సంఖ్య 52 లక్షలకు పైగా ఉండగా అందులో సుమారు రెండు లక్షల వాహనాలు గ్యాస్‌ను వినియోగిస్తున్నాయి. ఆటో గ్యాస్, లిక్విడ్ గ్యాస్‌కు కొరత లేకపోయినా సీఎన్జీ గ్యాస్ సరఫరా సక్రమంగా లేదు. సాధారణంగా గ్యాస్ స్టేషన్లకు ప్రతి రోజు 5000 ఆటోలు, 1000 వరకు నాలుగు చక్రాల వాహనాలు వస్తాయి. ఆటోల సీఎన్జీ కిట్స్ సామర్ధ్యం 4.5 కిలోలు కాగా, 4 కిలోల వరకు, కార్ల సామర్థ్యం 10కిలోలు కాగా, 8 కిలోల వరకు గ్యాస్‌ను నింపుతారు. ఈ నేపథ్యంలో ఒక్కో స్టేషన్‌కు రోజూ 6వేల కిలోవరకు గ్యాస్ డిమాండ్ ఉంటుంది. వాహనాల గ్యాస్ ధర నిలకడగా ఉన్నప్పటికీ డొమెస్టిక్ గ్యాస్‌కు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో అక్రమ రీఫిల్లింగ్ కేంద్రాలు పుట్టుకొస్తున్నాయి. -
పేదలపై ‘గ్యాస్’ భారం
♦ మార్చి నాటికి సబ్సిడీ పూర్తిగా ఎత్తివేత ♦ బీపీఎల్ కుటుంబాల్లో ఆరిపోనున్న గ్యాస్ వెలుగులు సాక్షి, హైదరాబాద్: పేదలకు వంట గ్యాస్ ఇక భారం కానుంది. గృహోపయోగ గ్యాస్ సిలిండర్‌పై ప్రతినెలా రూ. 4 చొప్పున ధర పెంచి, వచ్చే మార్చి నాటికి సబ్సిడీని పూర్తిగా ఎత్తివేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో పేదల ఇళ్లల్లో గ్యాస్ వెలుగు ఆరిపోయే పరిస్థితికి దారి తీయనుంది. సంపన్న వర్గాలు గ్యాస్ సబ్సిడీని వదులుకొనేందుకు ముందుకు రాకపోవడమే ప్రభుత్వం సబ్సిడీని పూర్తిగా ఎత్తివేసే పరిస్థితులకు దారితీసిందనే వాదనలు వినబడుతున్నాయి. సంపన్న వర్గాలకు సబ్సిడీ.. గ్రేటర్ హైదరాబాద్‌లో సగానికి పైగా సంపన్న, అధిక ఆదాయ వర్గ కుటుంబాలు గృహోపయోగ వంట గ్యాస్‌పై సబ్సిడీ పొందుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద మహానగరంలో సుమారు 25 లక్షల వరకు కుటుంబాలు ఉండగా, అందులో వంట గ్యాస్ కనెక్షన్లు వినియోగిస్తున్న కుటుంబాలు 22 లక్షల వరకు ఉన్నాయి. మరో 3 లక్షల కుటుంబాలు కిరోసిన్, వంట చెరుకు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా వంట గ్యాస్ వినియోగిస్తున్న బీపీఎల్ కుటుంబాలు తొమ్మిది లక్షలకు మంచి లేవని పౌరసరఫరాల శాఖ‡ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. మిగిలిన 13 లక్షల కుటుంబాలు ఆదాయ వర్గాలుగా స్పష్టమవుతోంది. వదులుకుంది 90 వేల కుటుంబాలే... వంట గ్యాస్‌పై సబ్సిడీ వదులు కున్న కుటుంబాల సంఖ్య వెళ్లపై లెక్కించవచ్చు. సరిగ్గా రెండేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ ఆర్ధిక సంస్కరణల్లో భాగంగా సంపన్న వర్గాలు స్వచ్ఛందంగా సబ్సిడీ వదులుకోవాలని (గివ్ ఇట్ ఆప్) పిలుపు ఇచ్చారు. సెలబెట్రీలు రంగంలోకి దిగి విస్తృత ప్రచారం చేశారు. ప్రధాన ఆయిల్ కంపెనీలు మొబైల్ ద్వారా సంక్షిప్త సమాచారాలు పంపాయి. అయితే, వీటికి సంపన్న, అధిక ఆదాయ వర్గాల నుంచి వచ్చిన స్పందన మాత్రం అంతంతే. కేవలం 90 వేల కుటుంబాలు మాత్రమే సబ్సిడీని వదులుకున్నట్టు ఆయిల్ కంపెనీల రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఏడాదికి సబ్సిడీ రూ.1056.. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్‌పై అందించే సబ్సిడీ సొమ్ము ఏడాదికి రూ. 1056 మాత్రమే. ఈ మొత్తాన్ని వదులుకునేందుకు సంపన్నులు ముందుకు రాకపోడం గమనార్హం. -
గ్యాస్ తుస్
ఐదేళ్లుగా పురో‘గతి’ లేని బీజీఎల్ పథకం చింతల్ దాటని పైప్‌లైన్ పనులు ఇప్పటికీ అందని వంటగ్యాస్ సిటీబ్యూరో: మహానగరంలో ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ (పీఎన్జీ), వాహనాలకు కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్ (సీఎన్జీ) అందించాలన్న లక్ష్యం నీరుగారుతోంది. ఐదేళ్ల క్రితం ఆర్భాటంగా ప్రారంభమైన ప్రాజెక్టు ఆచరణలో చతికిలబడింది. పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ చౌకగా అందుతుందన్న నగరవాసుల ఆశలపై నత్తనడకన సాగుతున్న పైప్‌లైన్ పనులు నీళ్లు చల్లుతున్నాయి. ప్రాజెక్టు ప్రారంభమై ఐదేళ్లు గడిచినా కనీసం 30 శాతం పైప్‌లైన్ పనులు కూడా పూర్తి కాలేదు. నాలుగేళ్ల నుంచి పైప్లైన్ల పనుల తీరు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఐదేళ్లక్రితం ఆర్భాటం.. సరిగ్గా ఐదేళ్ల క్రితం నగర శివారులోని రంగారెడ్డి జిల్లా శామీర్‌పేటలో మదర్ స్టేషన్‌ను ఏర్పాటుచేసి ఇంటింటికీ పైప్డ్ నాచురల్ గ్యాస్ (పీఎన్జీ), వాహనాలకు కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్ (సీఎన్జీ) అందించాలని నిర్ణయించారు. అందుకు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (బీజేఎల్) సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టు అమలుకు శ్రీకారం చుట్టింది. తొలుత శామీర్‌పేట మదర్ స్టేషన్‌కు సమీపంలో గల నల్సార్ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లోని గృహ సముదాయాల్లోని 30 ఫ్లాట్లకు పైప్‌లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్లు అందించారు. తర్వాత సమీపంలోని మేడ్చల్ మండల కేంద్రంలో వెయ్యి కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించినా 410 కుటుంబాలకు మాత్రమే వంటగ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. ఆ తర్వాత సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల ప్రాంతాలకు పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్ అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. అయితే పైప్‌లైన్ పనులు మాత్రం చింతల్ దాటలేదు. మరోవైపు ఇప్పటికే కనెక్షన్లు అందించిన వినియోగాదారులకు సైతం పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేసేందుకు బీజీఎల్ ఆపసోపాలు పడుతోంది. సీఎన్జీ కూడా అంతంతే.. మహానగరానికి పూర్తి స్థాయిలో సీఎన్జీని అందుబాటులోకి తెచ్చే ప్రక్రియ సైతం మందుకు సాగడం లేదు. శామీర్‌పేటలో మదర్ స్టేషన్‌ను నిర్మించి సీఎన్జీని అందుబాటులోకి తెచ్చినప్పటికీ కొంతకాలంగా గ్యాస్ కొరతతో గ్రిడ్ నుంచి స్టేషన్లకు డిమాండ్‌కు తగ్గ సరఫరా చేయలేక పోతోంది. వాస్తవంగా హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణాకు వినియోగించే 85 వేల ఆటోలు, 7,500 బస్సులు, 20 వేలకు పైగా టాక్సీలకు సగటున రోజుకు 7,62,500 కిలోల (1.067 ఎంఎంఎస్‌సీఎండీ) సీఎన్జీ అవసరమని బీజేఎల్ అంచనా వేసింది. ప్రాజెక్టు ప్రారంభించిన తొలిదశలో మేడ్చల్, హకీంపేట, కంటోన్మెంట్ తదితర డిపోలకు చెందిన 350 ఆర్టీసీ బస్సులకు సీఎన్జీ సరఫరా చేస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు 164 బస్సులకు మాత్రమే సరఫరా చేస్తోంది. దీంతో 236 బస్సులు డిపోల్లోనే మూలుగుతున్నాయి. ఇక నగరంలో ఏర్పాటు చేసిన సీఎన్జీ స్టేషన్ల ద్వారా 23 వేల వాహనాలకు మాత్రమే గ్యాస్ సరఫరా చేస్తోంది. వాస్తవంగా ప్రతిరోజు నగరంలోని సీఎన్జీ వినియోగదారుల నుంచి 20 వేల కిలో లీటర్లకు పైగా డిమాండ్ ఉంది. కానీ, ప్రతినిత్యం 12 వేల కిలో లీటర్లకు మించి సరఫరా కావడం లేదని డీలర్లు వాపోతున్నారు. పురోగతి లేని పైప్‌లైన్ పనులు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ఐదేళ్ల క్రితం ప్రాజెక్టు కోసం రూపొందించిన ప్రణాళిక లక్ష్యానికి తగ్గట్టు పురోగతి సాధించలేకపోయింది. ఇప్పటిదాకా శామీర్‌పేట నుంచి చింతల్ వరకు 33.55 కిలో మీటర్ల మేర మాత్రమే పనులు జరిగాయి. తాజాగా బాలాపూర్ వరకు పైప్‌లైన్ పనులు జరుగుతున్నాయి. గత మూడేళ్లలో పైప్‌లైన్ పనులను పరిశీలిస్తే సరిగ్గా మూడు కిలో మీటర్లు కూడా పూర్తికానట్టు ప్రగతి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. రూ.733 కోట్లతో ప్రాజెక్టు.. మహానగరానికి ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేయాలని భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ రూ.733 కోట్లతో ప్రణాళిక వేసింది. వచ్చే 20 ఏళ్లలో రూ.3,166 కోట్లతో సిటీగ్యాస్ డిస్ట్రిబ్యూషన్‌ను కూడా విస్తరించాలని నిర్ణయించింది. కానీ కొంతకాలం గ్రిడ్ నుంచి సరైన గ్యాస్ సరఫరా లేక, ఆ తర్వాత పైప్‌లైన్ వేసే మార్గంలో క్లియరెన్స్ రాక పనులు ముందుకు సాగలేదు. ఇప్పుడు తాజాగా పనులు ప్రారంభమయ్యాయి. -
వంట గ్యాస్‌పై రూ.5 డిస్కౌంట్!
ఆన్లైన్ ద్వారా రీఫిల్ చెల్లింపులకు వర్తింపు సాక్షి, హైదరాబాద్: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే దిశగా ప్రధాన చమురు సంస్థలు మరో అడుగు ముందుకు వేశాయి. పెద్ద నోట్ల రద్దుతో పెట్రోల్, డీజిల్‌కు డిజిటల్ చెల్లింపులపై డిస్కౌంట్లు ఇస్తున్నాయి. నూతన సంవత్సరం కానుకగా ఆన్లైన్లో చెల్లించే వంట గ్యాస్ రీఫిల్ బుకింగ్ ధరపై రూ.5 డిస్కౌంట్ ప్రకటించాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ఇప్పటికే తమ వినియోగదారుల మొబైల్ ఫోన్లకు ఎస్ఎంఎస్లు పంపించింది. ఇప్పటి వరకు గ్యాస్ ఏజెన్సీలు నగదు రహిత లావాదేవీలకు దూరంగా ఉన్నాయి. దీంతో కొందరు డెలివరీ బాయ్స్ రూ.2వేల నోటకు చిల్లర లేదంటూ సిలిండర్ వెనక్కు తీసుకెళ్లిపోతున్నారు. తిరిగి గ్యాస్ బుక్ చేసుకొని, సరిపడా చిల్లర పెట్టుకోవాల్సిన పరిస్థితులు దాపురించా యి. ఆన్లైన్ చెల్లింపుల వల్ల సిలిండర్ డెలివరీ సమయంలో చిల్లర ఇబ్బందులూ తప్పుతాయి. రోజుకు 60 వేల సిలిండర్లు... చమురు సంస్థలు నిర్దేశించిన ధరతో బిల్లింగ్ చేస్తున్న గ్యాస్ డీలర్లు... డెలివరీ బాయ్స్‌కు చాలీచాలని వేతనాలిస్తున్నాయి. దీంతో కొందరు డెలివరీ బాయ్స్ బిల్ మొత్తంపై రూ.20–రూ.30 అదనంగా వసూలు చేస్తున్నారు. ఆన్లైన్ చెల్లింపు అందుబాటులోకి వస్తే... డెలివరీ బాయ్ భారం తమపై పడుతుందని ఏజెన్సీలు స్వైపింగ్ యంత్రాలను దూరం పెట్టాయి. నిబంధనల ప్రకా రం క్యాష్ బిల్లుపై అదనపు చార్జీలూ వసూలు చేయకూడదు. ఎవరైనా డెలివరీ బాయ్స్ అదనపు సొమ్ము డిమాండ్ చేస్తే పౌరసరఫరాల శాఖకు ఫిర్యాదు చేయవచ్చు. గ్రేటర్ హైదరాబాద్‌లో 3 ప్రధాన కంపెనీలకు చెందిన వంటగ్యాస్ కనెక్షన్లు 29.18 లక్షలున్నాయి. సుమారు 115 గ్యాస్ ఏజె న్సీలకు రోజూ 80 వేల బుకింగ్‌లు అవు తుండగా, 60 వేల సిలిండర్లు డెలివరీ చేస్తున్నాయి. ఆన్లైన్ చెల్లింపులు చేయాలి... నగదు రహిత లావాదేవీల్లో భాగంగా వంట గ్యాస్ రీఫిల్ ధర ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయవచ్చు. రీఫిల్ ధరపై రూ.5లు డిస్కౌంట్‌ను ప్రధాన చమురు సంస్థలు ప్రక టించాయి. దీనివల్ల చిల్లర కష్టాలూ ఉండవు. – అశోక్‌కుమార్, అధ్యక్షుడు,వంట గ్యాస్ డీలర్ల సంఘం, హైదరాబాద్ -
రాష్ట్రంలో 15 పథకాల ఫార్ములా
ఒంగోలు పర్యటనలో సీఎం చంద్రబాబు సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్రంలో 15 పథకాల ఫార్ములాను అమలు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. పెన్షన్లు మొదలుకొని పక్కా గృహాలు, 5 కిలోల బియ్యం, చంద్రన్న బీమా, వంట గ్యాస్, ఇంటింటికీ మరుగుదొడ్లు తదితర 15 పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నెలనెలా ప్రతి ఇంటికి రూ.10 వేలు ఆదాయం వచ్చేలా చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మంగళవారం ఒంగోలులో పర్యటించిన సీఎం ఒంగోలులోని కొప్పోలు గాంధీనగర్ ఎస్సీ కాలనీలో జరిగిన జనచైతన్యయాత్రలో పాల్గొన్నారు. అనంతరం ఒంగోలు మినీస్టేడియంలో జరిగిన డ్వాక్రా సంఘాల సమావేశానికి హాజరై మాట్లాడారు. డ్వాక్రా సంఘాలకు రూ.10 వేల పెట్టుబడి నిధి ఇస్తున్నట్లు చెప్పారు. డ్వాక్రా సంఘాలను నడిపిస్తున్న సెర్ఫ్ ఉద్యోగులకు అదనంగా 35 శాతం జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించారు. మంత్రులు రావెల, శిద్దా, బుచ్చయ్యచౌదరి, కరణం బలరాం పాల్గొన్నారు. -
వంటగ్యాస్ కోసం మళ్లీ పెళ్లా?
45 ఏళ్ల పుత్తిలాల్ గౌతం నిరుపేద దళితుడు. భార్య చనిపోయింది. నలుగురు పిల్లలు ఉన్నారు. రెక్కల కష్టం మీద బతికే దినసరి కూలీ అయిన పుత్తిలాల్ కు ఇప్పుడో వింత కష్టం వచ్చి పడింది. ఇన్నాళ్లు పుత్తిలాల్ ఇంట్లో ఉన్నది కట్టెలపొయ్యి మాత్రమే. ఇప్పుడు ఉచిత వంటగ్యాస్ కనెక్షన్ పొందాలంటే ఆయన మరో పెళ్లి చేసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. గ్యాస్ సిలిండర్ కోసం మాకు సవతి తల్లిని తీసుకొస్తావా? అంటూ పిల్లలు తండ్రి రెండోపెళ్లికి నిరాకరిస్తున్నారు. దీంతో ఏం చేయాలో తోచక పుత్తిలాల్ డైలామాలో పడిపోయారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందాలంటే ప్రభుత్వ నిబంధనలప్రకారం పుత్తిలాల్ కు భార్య ఉండాలి. అతని కూతుళ్లు చిన్నవారు కావడంతో వారు గ్యాస్ కనెక్షన్ కు దరఖాస్తు చేసుకునే వయస్సు రాలేదు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సీతాపూర్ జిల్లాలోని జుధువురా గ్రామానికి చెందిన పుత్తిలాల్ ఉచిత గ్యాస్ కనెక్షన్ కోసం స్థానిక ఎల్పీజీ డీలర్ చుట్టు కాళ్లు అరిగేలా తిరుగుతున్నాడు. అయినా స్థానిక డీలర్ నిబంధనలు అనుమతించవంటూ అతన్ని తిప్పి పంపుతున్నాడు. 'సరైన ధ్రువపత్రాలను మీ భార్యకు ఇచ్చి పంపండి. అప్పుడు గ్యాస్ కనెక్షన్ ఇస్తామని వారు చెప్తున్నారు. నా భార్య చనిపోయింది. నాకు నలుగురు పిల్లలు ఉన్నారు. వారి బాగోగులు నేను చూసుకోవాలి అని చెప్పినా వారు వినిపించుకోవడం లేదు. నిబంధనలు ఒప్పుకోవాలని తేల్చిచెప్తున్నారు' అని పుత్తిలాల్ 'హిందూస్థాన్ టైమ్స్' పత్రికకు తెలిపారు. -
ట్యాపు తిప్పితే గ్యాస్
పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా విజయవంతంగా 225 ఇళ్లకు సరఫరా త్వరలో నగరమంతటా విస్తరణకు గెయిల్ గ్యాస్ లిమిటెడ్ సన్నాహాలు బెంగళూరు: నగర మహిళలకు శుభవార్త. గ్యాస్ అయిపోయింది. ఎప్పుడు సిలెండర్ వస్తుందో అని చింతించనక్కరలేదు. 24 గంటల పాటు 365 రోజులూ కొళాయి తరహాలో పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా కానుంది. పెలైట్ ప్రతిపాదికన ఇప్పటికే 225 ఇళ్లకు పైప్‌లైన్ ద్వారా గ్యాస్‌ను విజయవంతంగా సరఫరా చేసి సంతృప్తికర ఫలితాలు పొందిన అధికారులు ఈ ప్రాజెక్టును నగరమంతటా విస్తరింపజేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రస్తుతం వంటింట్లో గ్యాస్ అయిపోయిన తర్వాత గ్యాస్ బుక్ చేస్తే గరిష్టంగా పది రోజుల తర్వాత సిలెండర్ అందుతోంది. దీంతో గృహిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఒక సారి సిలెండర్ బుక్ అయిన తర్వాత కనీసం 20 రోజుల పాటు మరో సిలెండర్ బుక్ చేయడానికి వీలు ఉండదు. (ఈ నిబంధనలు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకు మారుతుంటాయి). ఇటు వంటి సమస్యను పరిష్కరించడంలో భాగంగా గెయిల్ గ్యాస్ లిమిటెడ్ పైప్‌లైన్ ద్వారా గ్యాస్‌ను (పీఎన్జీ) సరఫరా చేయడానికి ముందుకు వచ్చింది. మహారాష్ట్రలోని దబోల్ నుంచి బెంగళూరు వరకూ 1,386 కిలోమీటర పొడవున పైప్‌లైన్ ఏర్పాటైంది. ఈ పైప్ లైన్ ద్వారా ప్రస్తుతం హెచ్.ఎస్.ఆర్ లేఅవుట్, బెల్లందూర్, సింగసంద్ర, డాలర్స్కాలనీ, మంగమ్మనపాళ్యలో సరఫరా చేయడానికి బృహత్ బెంగళూరు మహానగర పాలికే నుంచి అనుమతి కూడా పొందింది. పెలైట్ ప్రతిపాదికన ఇప్పటికే హెచ్ఎస్ఆర్ లే అవుట్ (సెక్టార్-2)లోని 225 ఇళ్లకు ఇప్పటికే పైప్ లైన్ ద్వారా గ్యాస్‌ను సరఫరా చేస్తేంది. మరో 7,000 మంది పైప్ లైన్ ద్వారా గ్యాస్‌ను పొందడానికి వీలుగా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. పీఎన్జీ కనెక్షన్ కోసం రూ.5,800 సెక్యూరిటీ డిపాజిట్‌గా కట్టాల్సి ఉంటుంది. ఇక గ్యాస్ బిల్లును రెండు నెలలకు ఒకసారి చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయమై సంస్థ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ... ‘ప్రస్తుతం గృహ అవసరాలకు మాత్రమే పైప్ లైన్ ద్వారా గ్యాస్‌ను సరఫరా చేస్తున్నాం, ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే వాణిజ్య అవసరాలకు సంబంధించి కూడా గ్యాస్‌ను సరఫరా చేస్తాం. 2017 ఫిబ్రవరిలోపు నగరంలోని 25 వేల మందికి పైప్ ద్వారా గ్యాస్‌ను అందజేయాలన్నది లక్ష్యంగా నిర్ణయించుకున్నాం.’ అని పేర్కొన్నారు. -
అగ్రగామి రాష్ట్రమే నా లక్ష్యం..
అందుకు అందరూ సంకల్పం చేపట్టాలి - కడప మహాసంకల్ప సభలో సీఎం చంద్రబాబు - ఏడాదిలో 30 లక్షల గ్యాస్ కనెక్షన్ల పంపిణీ లక్ష్యం - 1.5 లక్షలమంది అసంఘటిత కార్మికుల కోసం ప్రత్యేక బీమా సాక్షి ప్రతినిధి, కడప: ‘అడ్డగోలుగా రాష్ట్ర విభజన చేశారు. అప్పుల పంపిణీ జనాభా ప్రాతిపదికన చేపట్టి ఆస్తులు తెలంగాణకు కట్టబెట్టారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో ప్రజలు నమ్మకంతో అండగా నిలిచారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయను. రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. ఆమేరకే నవ నిర్మాణ దీక్షను చేపట్టాను. కలెక్టర్ల నేతృత్వంలో అర్థవంతంగా చర్చ సాగింది. రాష్ట్రాభ్యున్నతికి భవిష్యత్ కార్యాచరణపై సంకల్పం తీసుకుంటున్నాను’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. బుధవారం కడప మున్సిపల్ గ్రౌండ్లో నవనిర్మాణదీక్ష ముగింపులో భాగంగా నిర్వహించిన మహాసంకల్పంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘ప్రగతి పథంలో 2 సంవత్సరాలు’ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. సీఎం స్వయంగా మహాసంకల్పం ప్రతిజ్ఞ చదివి ప్రజానీకంతో చేయించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ విభజనలో అన్యాయం జరిగినా సాంకేతిక పరిజ్ఞానంతో విద్యుత్ రంగంలో విజయం సాధించామని తెలిపారు. ఏడాదిలో తొలివిడతగా 2 లక్షల మంది రైతులకు ఉచితంగా పంపుసెట్లు సరఫరా చేస్తామన్నారు. అమిత్‌షా కోరిక మేరకే ఎంపీ సీటు కేంద్రప్రభుత్వ సహకారం రాష్ట్రానికి అవసరమని, ఆమేరకే బీజేపీతో చెలిమి చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కోరిక మేరకే రాజ్యసభ స్థానమిచ్చినట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్రం రూ.16 వేల కోట్ల లోటుబడ్జెట్లో ఉందని, కేంద్రం రూ.2,800 కోట్లు మాత్రమే కేటాయించిందని వాపోయారు. ప్రత్యేకహోదా ఇచ్చి నిధులు ఇవ్వకపోయినా ఇబ్బందేనని, పోలవరం జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం రూ.850 కోట్లు కేటాయిస్తే అదనంగా రూ.1,700 కోట్లు ఖర్చు చేశామన్నారు. ‘ఇక్కడ ఒక మహానాయకుడు మాట్లాడుతున్నారు.. నరేంద్రమోదీని చూసి భయపడుతున్నానంట.. నేనెందుకు భయపడాలి, ఎవ్వరికీ భయపడాల్సిన పనిలేదు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకప్పుడు నా సహచరుడు. ఆయనంటే నాకెందుకు భయం, నిప్పులా బతికాను.’ అని సీఎం చంద్రబాబు చెప్పారు. చనిపోయిన ప్రతి కార్మికుడి కుటుంబానికీ రూ.5 లక్షలు చెల్లించేలా ఆగస్టు 15 నుంచి అసంఘటిత కార్మికుల కోసం ప్రత్యేక బీమాను ప్రవేశపెట్టనున్నట్లు సీఎం తెలిపారు. ఉద్యోగులు సమైక్య రాష్ట్రం కోసం పెద్దఎత్తున ఉద్యమాలు చేసిన నేపథ్యంలో 80 రోజులు సెలవులు మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చామన్నారు. రాబోయే ఏడాదిలో 30 లక్షల గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. వచ్చే ఏడాదికల్లా ఇంటింటికీ వంట గ్యాస్ సాక్షి, విజయవాడ బ్యూరో: రెండేళ్ల పాలనలో ప్రతి గ్రామానికీ విద్యుత్ సౌకర్యం కల్పించామని, అలాగే వచ్చే ఏడాది కల్లా ఇంటింటికీ వంట గ్యాస్ కనెక్షన్ ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. బుధవారం మహాసంకల్పం సందర్భంగా గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసం నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రతి ఇంటికి తాగునీరు, కరెంటు, వంటగ్యాస్, మంచినీటి కొళాయి, కేబుల్ కనెక్షన్లు, ప్రతి పొలానికి సాగునీరు ఇవ్వాలనే లక్ష్యమన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు వేల కిలోమీటర్ల సిమెంటు రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పేదల ఉన్నతే లక్ష్యంగా ఇంటింటి సర్వే కులమతాలతో నిమిత్తం లేకుండా పేదల ఉన్నతి కోసం జూన్ 20 నుంచి ఇంటింటి పల్స్ సర్వే నిర్వహించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. యువత ఆశలను వమ్ము చేయకుండా ‘బాబు వస్తే జాబు వస్తోంది’ అనే నమ్మకం కోసం రూ.4.70 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులను తీసుకువస్తున్నట్లు తెలిపారు. మైనార్టీలకు రూ.650 కోట్లు కేటాయించామని, రాబోవు 9 నెలల్లో కడపలో హజ్‌హౌస్ నిర్మిస్తామన్నారు. -
గ్యాస్ సబ్సిడీ గందరగోళం
► ఫినో ఖాతాలో జమ ► వినియోగదారులకు అందనివైనం ► సాంకేతిక సమస్య పేరిట దాటవేత కరీంనగర్ రూరల్ : వంటగ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బు వినియోగదారులకు అందడంలేదు. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల నిర్లక్ష్యం, ఫినో కంపెనీ దాటవేత వైఖరితో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవైసీలో బ్యాంకు ఖాతాల నంబర్లతో వినియోగదారులు దరఖాస్తు చేసుకున్నా సబ్సిడీ డబ్బును వారి ఖాతాల్లో కాకుండా ఫినో కంపెనీ ఖాతాలో జమచేస్తున్నారు. సబ్సిడీ డబ్బుల కోసం వినియోగదారులు ఫినో కంపెనీ ప్రతినిధుల చుట్టూ మూడు నెలలుగా తిరుగుతున్నా.. సాంకేతిక సమస్య సాకుతో తప్పించుకుంటున్నారు. కరీంనగర్ మండలంలోని పలు గ్రామాలకు భారత్ గ్యాస్‌ను శివ థియేటర్ సమీపంలోని ఓంసాయిరాం గ్యాస్ ఏజెన్సీ సరఫరా చేస్తోంది. గతంలో గ్యాస్ సిలిండర్‌ను సబ్సిడీ మినహాయించి వినియోగదారులకు సరఫరా చేసేవారు. గతేడాదినుంచి కేంద్రప్రభుత్వం నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లోకి సబ్సిడీ జమచేస్తోంది. దీనికోసం గ్యాస్ ఏజెన్సీలకు వినియోగదారులు కేవైసీలో బ్యాంకుఖాతాలను సమర్పించారు. గ్యాస్ సిలిండర్ ధర రూ.599 ఉండగా సబ్సిడీ రూ.138 వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు. ప్రభుత్వ లబ్ధిదారులకే ఈ తిప్పలు గ్యాస్ వినియోగదారులకు దాదాపు నాలుగైదు నెలల నుంచి సబ్సిడీ డబ్బు జమకావడంలేదు. ప్రభుత్వం నుంచి లబ్ధిపొందుతున్న వారికి మాత్రమే ఈ సమస్య ఏర్పడగా.. మిగిలిన వినియోగదారులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ డబ్బులు జమవుతున్నాయి. ఉపాధిహామీ కూలీలు, ఆసరా ఫించన్‌దారులకు ఫినో కంపెనీ నుంచి సబ్సిడీ డబ్బు చెల్లిస్తున్నారు. ఈ వినియోగదారులు కేవైసీలో బ్యాంకు ఖాతా నంబర్లు ఇచ్చినా ఆధార్‌కార్డు నంబర్ ఫీడింగ్తో ఫినో కంపెనీలో నమోదైన ఖాతాల్లోకి జమవుతోందని ఓంసాయిరాం గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధి వెంకటేశ్వర్రావు తెలిపారు. అయితే పలు గ్రామాల్లో టెక్నికల్ సమస్య పేరిట డబ్బులను కంపెనీ ప్రతినిధులు వినియోగదారులకు చెల్లించడంలేదని తెలుస్తోంది. మొగ్ధుంపూర్‌లో 50మందికి.. కరీంనగర్ మండలం మొగ్ధుంపూర్‌లో దాదాపు 50మంది వినియోగదారులకు నాలుగైదు నెలలుగా గ్యాస్ సబ్సిడీ డబ్బులు చెల్లించడంలేదు. తమకు కనీసం సమాచారం లేదంటూ ఇవ్వడంలేదని తాళ్లపల్లి ఎల్లమ్మ, వీరగోని వెంకటస్వామి, కందుల రమేశ్‌గౌడ్ ఆరోపించారు. స్మార్ట్మిషన్లో గ్యాస్ వినియోగదారుల ఆధార్‌కార్డు నంబర్‌ను ఫీడింగ్ చేస్తే కస్టమర్ నాట్అవైలబుల్ అనే సమాచారం రావడంతో డబ్బులను చెల్లించడం లేదని ఫినో కంపెనీ ప్రతినిధి సరస్వతి తెలిపారు. సమాచారమున్న కొందరు వినియోగదారులకు చెల్లించినట్లు వివరించారు. కొందరు వినియోగదారుల సమాచారం లభించడంలేదని, పూర్తి వివరాలను తెలుసుకుని సమస్య పరిష్కరించనున్నట్లు ఫినో మండల కోఆర్డినేటర్ రవూఫ్ తెలిపారు. -
బండ బాదుడు!
సిలిండర్ నిర్ణీత ధర కంటే అదనపు వసూళ్లు డెలివరీ బాయ్స్ ఆగడాలు వినియోగదారుల జేబులకు చిల్లులు నెలకు రూ.8.17 కోట్లకు పైగా భారం సిటీబ్యూరో: మహా నగరంలో ఎల్పీజీ వంట గ్యాస్ వినియోగదారులకు అ‘ధన’పు బాదుడు తప్పడం లేదు. సిలిండర్ అసలు ధర కంటే అదనంగా వసూలు చేస్తూ డెలివరీ బాయ్స్ పబ్లిక్‌గా దోచుకుంటున్నారు. ఇలా ఒక నెలలో వినియోగదారులు చెల్లిస్తున్న మొత్తమెంతో తెలుసా? అక్షరాలా 8 కోట్ల 17 లక్షల రూపాయల పైమాటే. కొందరు వినియోగదారులు ‘చిల్లర’ కదా... అని తేలికగా తీసుకోవడంతో అది కాస్త డిమాండ్‌గా మారింది. ఎవరైనా ఇలా ఇచ్చుకోలేకపోతే రుసరుసలు తప్పవు. దీంతో అందరూ అదన ంగా చెల్లించాల్సి వస్తోంది. ఇది పేదలకు భారంగా మారుతోంది. డెలివరీ బాయ్స్‌కు కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం సిలిండర్ రీఫిల్ ధర రూ.662 ఉండగా... డెలివరీ బాయ్స్ వినియోగదారుల నుంచి బలవంతంగా వసూలు చేస్తోంది రూ.690. అంటే నిర్ణీత ధర కంటే అదనంగా రూ.28 వంతున లాక్కుంటున్నారు. మహా నగరం మొత్తం వినియోగదారులు నెలకు ముట్ట జెప్పుతోంది లెక్కిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఏజెన్సీల నిర్లక్ష్యం... వినియోగదారులకు సిలిండర్‌ను డోర్ డెలివరీ చేయడంలో ఏజెన్సీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఫలితంగా చమురు సంస్థలు నిర్దేశించిన ధర అమలు కావడం లేదు. గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు రీఫిల్ ధర, డోర్ డెలివరీ చార్జీ (రవాణా, హమాలీ, నిర్వహణ)తో కలుపుకొని బిల్లు వేసి.. వినియోగదారులకు సరఫరా చేయాల్సి ఉంటుంది. చమురు సంస్థల ధరనే బిల్లుపై వేస్తున్న ఏజెన్సీలు సిలిండర్ సరఫరా భారాన్ని డెలివరీ బాయ్స్‌పై పెట్టి చేతులు దులుపుకుంటున్నాయి. దీంతో వారు ఇష్టమొచ్చినట్టుగా వసూలు చేస్తున్నారు. వాస్తవంగా డెలివరీ బాయ్స్‌కు ఏజెన్సీలు కనీస వేతనాలను అమలు చేయాల్సి ఉంటుంది. కొందరు నామమాత్రంగా వేతనాలు అందిస్తుండగా... మరికొందరు సిలిండర్ల సంఖ్యను బట్టి కమీషన్ చెల్లిస్తున్నారు. ఫలితంగా డెలివరీ బాయ్స్ అదనపు వసూళ్లపై దృష్టి పెడుతున్నారు. నిబంధనల ప్రకారం సరఫరా సమయంలో ప్రత్యేక పరికరంతో రీఫిల్ నిర్ణీత బరువును వినియోగదారులకు చూపించాలి. కానీ ఇది ఎక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. కేవలం బిల్లింగ్‌పై అదనపు బాదుడు ధ్యాస తప్ప బరువు చూపించాలన్న నిబంధనలను వారు మరచిపోయారు. ఇవీ నిబంధనలు వినియోగదారుడు ఆన్లైన్లో గ్యాస్ రీఫిల్ బుక్ చేసుకున్న తర్వాత బిల్లుతో డోర్ డెలివరీ చేయాలి. ఏజెన్సీ నుంచి 5 కిలోమీటర్ల వరకు ఉచితంగా సరఫరా చేయాలి. 6 నుంచి 15 కిలోమీటర్ల వరకూ రవాణా చార్జీల పేరిట రూ.10 వసూలు చేయాలి. 16-30 కిలోమీటర్ల దూరానికి రూ.15 వసూలు చేయాలి వినియోగదారుడు సిలిండర్ రీఫిల్‌ను గ్యాస్ కంపెనీ గోదాముకు వెళ్లి తీసుకుంటే బిల్లులో రూ.8 మినహాయించాలి. -
ఆరు నెలల్లో కుప్పంలో ప్రతి ఇంటికీ గ్యాస్
రూ.500 కోట్లతో గుడివంక సుబ్రమణ్యస్వామి ఆలయ అభివృద్ధి ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మిస్తా నియోజకవర్గంలోనాలుగు కోల్డ్ స్టోరేజీలు కుప్పాన్ని దేశంలో నంబర్ వన్ చేస్తా గుడివంక సభలో సీఎం చంద్రబాబు చిత్తూరు:రాబోయే ఆరు నెలల్లో కుప్పం నియోజకవర్గంలో ఇంటింటికీ వంట గ్యాస్ కనెక్షన్ ఇస్తానని సీఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. బుధవారం సాయంత్రం గుడుపల్లె మండలం గుడివంకలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. నియోజకవర్గంలో ఇంకా 30 వేల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందన్నారు. రాబోయే ఆరు నెలల్లో ప్రతి ఇంటికీ గ్యాస్ అందిస్తామన్నారు. దీంతో పాటు నియోజకవర్గంలోని అన్ని కుటుంబాలకు మరుగుదొడ్లను నిర్మిస్తామన్నా రు. ఒక్కొక్క మరుగుదొడ్డికి ప్రభుత్వం రూ.15 వేలు చెల్లిస్తుందన్నారు. టమాటాతో పాటు రైతులు పండించే ఇతర కాయగూరలు నిల్వ ఉంచుకునేందుకు నాలుగు మండలాల్లో ఒక్కో కోల్డ్ స్టోరేజీని నిర్మిస్తామన్నారు. అలాగే టమాట జ్యూస్ ఫ్యాక్టరీ నెలకొల్పుతామన్నారు. పోటాటో (బంగాళాదుంప) చిప్స్ పరిశ్రమ కోసం పెప్సీ కంపెనీతో మాట్లాడుతున్నట్లు సీఎం వెల్లడించారు. రూ.300 కోట్లతో పలమనేరు-కృష్ణగిరి రోడ్డును నిర్మిస్తున్నామన్నారు. వాడియంబాడీ వయా వి.కోట రోడ్డు సైతం నిర్మిస్తామని చెప్పారు. కుప్పం నియోజకవర్గం నుంచి విదేశాలకు 20 వేల మందికి పైగా వెళ్తున్నారని, అందరి సౌకర్యం దృష్ట్యా విమానాశ్రయాన్ని నిర్మించి కుప్పం నియోజకవర్గాన్ని దేశంలో నంబర్ వన్‌గా చేస్తానని సీఎం చెప్పారు. అలాగే గుడివంకలోని ఇంటర్ మీడియట్ కాలేజీకి పూర్తిస్థాయిలో కొత్త భవనాలు నిర్మిస్తామన్నారు. టీటీడీ అతిథి గృహాలను అభివృద్ధి చేస్తామన్నారు. రూ.500 కోట్లతో 18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గుడివంక సుబ్రమణ్యస్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పార్కులు, రిసార్ట్స్ నిర్మిస్తామన్నారు. గుడుపల్లెలో ఎక్స్‌ప్రెస్ రైలు ఆగేలా చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులు కుప్పం అభివృద్ధికి అహర్నిశలు పని చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, చిత్తూరు ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, జడ్పీ చైర్‌పర్శన్ గీర్వాణీ, చిత్తూరు నగర మేయర్ కఠారి అనురాధ, కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, జడ్పీ సీఈఓ వేణుగోపాల్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ రవిప్రకాష్‌రెడ్డి, హౌసింగ్ పీడీ వెంకటరెడ్డి, డీపీఓ ప్రభాకర్‌రావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ విజయకుమార్‌లతో పాటు స్థానిక నేతలు పాల్గొన్నారు. హంద్రీ-నీవా పనుల వేగవంతం కోసం సీయం సమీక్ష జిల్లాలో హాంద్రీ-నీవా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కాంట్రాక్టర్లతో పాటు ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కుప్పం ఆర్అండ్బీ అతిథి భవనంలో నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమతో పాటు పనులు చేస్తున్న కంపెనీ ప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులతో సీఎం సమావేశమయ్యారు. పనుల పురోగతిపై సమీక్షించారు. త్వరగా పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని కాంట్రాక్ట్ కంపెనీకి ప్రతినిధులకు, ఇరిగేషన్ అధికారులకు సూచించారు. -
క్రీస్తుపూర్వమే వంటగ్యాస్..
చాలామంది వంటగ్యాస్‌ను ఆధునిక ఆవిష్కరణలలో ఒకటిగా భావిస్తారు గానీ, నిజానికి క్రీస్తుపూర్వం రెండో శతాబ్దిలోనే చైనాలో వంటగ్యాస్ వాడేవారు. అప్పట్లో హాన్ వంశీయుల హయాంలో చైనా వారు శాస్త్ర సాంకేతిక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించారు. సహజ వాయువు కోసం విరివిగా తవ్వకాలు జరిపి ఎట్టకేలకు సాధించారు. అప్పట్లోనే వంటగ్యాస్‌ను పైపులైన్ల ద్వారా సరఫరా చేసి, వంటచెరకుకు ప్రత్యామ్నాయంగా వాడటం ప్రారంభించారు. గ్యాస్ సరఫరా కోసం తొలినాళ్లలో వారు గ్యాస్ బావుల నుంచి నేరుగా వెదురు గొట్టాలను వాడేవారు. వెదురు గొట్టాలు తరచు ప్రమాదాలకు దారితీస్తుండటంతో కొంతకాలానికి ప్రత్యామ్నాయాన్ని కనిపెట్టారు. భారీ కొయ్య పీపాల్లో గ్యాస్‌ను బంధించి, వాటిని భూమిలో పాతర వేసి, వాటికి గొట్టాలను అమర్చి గ్యాస్ సరఫరా చేయడం ప్రారంభించారు. ఈ పద్ధతి కాస్త సురక్షితంగానే ఉన్నప్పటికీ అకస్మాత్తుగా ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా ఉండటానికి పొడవాటి ఎగ్జాస్ట్ పైపును వాడేవారు. -
అ‘ధన’పు భారం
► గ్యాస్ వినియోగదారులపై బాదుడు ► నెలకు అదనంగా రూ.14.64 కోట్లు చెల్లింపు సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ వంట గ్యాస్ వినియోగదారులపై అ‘ధన’పు బాదుడు తప్పడం లేదు. వీరు నెలకు రూ.14.64 కోట్లు అదనంగా భరించాల్సి వస్తోంది. వినియోగదారులు ఒక్కో సిలిండర్‌పై (డెలివరీ బాయ్స్‌కు ఇచ్చే మొత్తంతో కలిపి) రూ.52.50 చెల్లించాల్సి వస్తోంది. డీబీటీ అమలుతో సిలిండర్ ధరకు వ్యాట్ తోడవుతోంది. అంతకుముందు డొమెస్టిక్ సిలిండర్‌పై వ్యాట్ ఉండేది కాదు. ప్రభుత్వం అందించే సబ్సిడీ నగదు రూపంలో నేరుగా లబ్ధిదారుడి ఖాతాలో జమ చేస్తుండడంతో మార్కెట్ ధర ప్రకారం నగదు చెల్లించి సిలిండర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇదీ బాదుడు తీరు చమురు సంస్థలు గ్యాస్ ఏజెన్సీలకు డొమెస్టిక్ సిలిండర్‌ను రూ.657కు సరఫరా చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సిలిండర్‌పై ఐదు శాతం వ్యాట్ విధిస్తోంది. గ్యాస్ ఏజెన్సీలు వ్యాట్ రూపంలో వసూలు చేసే రూ.32.50 కలుపుకొని వినియోగదారులకు ఒక్కో సిలిండర్‌ను రూ.689.50కు సరఫరా చేస్తున్నాయి. మరోవైపు డెలివరీ బాయ్స్ వినియోగదారుల నుంచి ఒక్కో సిలిండర్‌కు రూ.20 వంతున బలవంతంగా వసూలు చేస్తున్నారు. ఇది కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఎక్కువేనని తెలుస్తోంది. ఇదీ లెక్క... గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో సుమారు 27.89 లక్షల డొమెస్టిక్ వంట గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. అందులో 25.30 లక్షల మంది ఆధార్, బ్యాంక్‌లతో అనుసంధానమయ్యారు. వారికి సబ్సిడీ మొత్తం బ్యాంకు ఖాతాలో జమవుతోంది. అనుసంధానానికి దూరంగా ఉన్న వినియోగదారులు పూర్తి స్థాయి మార్కెట్ ధరను భరిస్తున్నారు. ఈ లెక్కన మొత్తం వినియోగదారులపై నెలకు రూ.14.64 కోట్ల అదనపు భారం పడుతోంది. ఇక అనుసంధానానికి దూరంగా ఉన్న 2.59 లక్షల వినియోగదారులు కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సి డీ మొత్తాన్నీ కోల్పోతున్నారు. రాయితీ పొందుతున్న వారికి కొంత ఊరట లభిస్తుండగా... ఈ అవకాశం లేని వారు ఎక్కువ మొత్తాన్ని భరించాల్సి వస్తోంది. -
నీటితో మండే పొయ్యి!
నీటితో మంటలు ఆర్పవచ్చునని అందరికీ తెలుసు. కానీ... నీళ్లంటే.. రెండు వంతుల హైడ్రోజన్, ఒక వంతు ఆక్సిజన్ అని తెలిసిన వారు మాత్రం దాంతో నిప్పు ఎలా పుట్టించాలో ఆలోచిస్తారు. కోచీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని విమల్ గోపాల్, రిశ్విన్, ప్రవీణ్ శ్రీధర్ మాదిరిగా అన్నమాట. హైడ్రోజన్ బాగా మండుతుందని, ఆక్సిజన్ మంటను ఎగదోస్తుందనీ తెలిసిన వీరు... కరెంటు సాయంతో నీటిని అక్కడికక్కడే విడగొట్టి మండించగల ఓ సరికొత్త పొయ్యిని అభివృద్ధి చేశారు. ఇంకోలా చెప్పాలంటే... నీళ్లనే వంటగ్యాస్‌లా మార్చారన్నమాట. కోచీలోని స్టార్టప్ విలేజ్‌లో వీరు ఇప్పటికే ఓ ఫ్యాక్టరీ కూడా పెట్టేశారండోయ్! ముందుగా హోటళ్లకు అవసరమైన స్టవ్‌లను తయారు చేసి పరీక్షిస్తామనీ, ఆ తరువాత ఈ హైడ్గ్యాస్ స్టౌ అందరికీ అందుబాటులోకి తెస్తామనీ అంటున్నారు వీరు. గ్యాస్ అక్కడికక్కడే తయారవుతూండటం వల్ల రవాణా చేయాల్సిన పని లేదు.. మండి పేలిపొతుందన్న భయమూ అక్కరలేదని భరోసా కూడా ఇస్తున్నారు. చూద్దాం... ఎప్పుడు వస్తుందో ఈ నీటి గ్యాస్ స్టౌ! -
నీటితో వంటగ్యాస్!
ఎస్ఈఆర్ఐ ఉత్పాదన సాక్షి, బెంగళూరు : నీరు, నూనె ప్రధాన ముడిపదార్థాలుగా వంటగ్యాస్‌ను ఉత్పత్తి చేయడానికి అనువైన యంత్రాన్ని బెంగళూరులోని ప్రముఖ పరిశోధన సంస్థ స్కాలైన్ ఎనర్సీ రీసెర్చ ఇనిస్టిట్యూట్ (ఎస్ఈఆర్ఐ) కనుగొనింది. హైడ్రో డిసైడర్‌గా వ్యవహరించే ఈ యంత్రం వివరాలను ఆ సంస్థ చైర్మన్ రాజా విజయ్‌కుమార్ మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ యంత్రంలో వంట గ్యాస్ ఉత్పత్తి అయ్యేందుకు నీరు, సూర్యరశ్మి (శక్తి జనకం), నూనె (ఆర్గానిక్ కార్బన్ దాత), పెల్లాడియం, ప్లాటినమ్ (సూపర్ క్యాటలిస్ట్ - ఉత్ప్రేరికాలు) అవసరం. తొలుత పెల్లాడియం, ప్లాటినమ్ కోటింగ్ గల నికెల్ పాత్రలోకి మూడు లీటర్ల నీరు, 500 గ్రాముల నూనెను పంపిస్తారు. అంతకు ముందు ఈ పాత్ర సూర్యరశ్మి ద్వారా వేడెక్కి ఉంటుంది. పాత్రలోకి వెళ్లిన ద్రావణాల్లో తొలుత నీరు నెసెంట్ హైడ్రోజన్, అటామిక్ ఆక్సిజన్‌గా విడిపోతుంది. ఈ రెండు వాయువుల్లో అటామిక్ ఆక్సిజన్ నూనెలోని పదార్థాల బంధానాలను విడగొట్టి కర్బన వాయువులను ఉత్పత్తి చేస్తుంది. ఇవి నెసెంట్ హైడ్రోజన్‌తో కలిసి సుమారు 15 కిలోల బరువైన హైడ్రోకార్బన్ వాయువులను ఉత్పత్తి చేస్తాయి. ఇలా ఉత్పత్తైన ఆర్గానిక్ పెట్రోలియం వాయువు(ఓపీజీ)లను ప్రత్యేక కంటైనర్‌లో నిల్వ చేస్తారు. రసాయనికంగా ఎల్పీజీకు ఓపీజీకు ఎలాంటి తేడా ఉండదు. అంతేకాక ఓపీజీ ద్వారా ఎక్కువ వేడి ఉంటుంది. ప్రస్తుత హైడ్రో డిసెండర్ ధర రూ. 75 వేలుగా ఉందని, ఉత్పత్తి మొదలైన తర్వాత రూ. 35 వేల నుంచి రూ. 40 వేలకు ధర తగ్గవచ్చునని ఈ సందర్భంగా విజయ్‌కుమార్ తెలిపారు. -
రూ.3కే వంటగ్యాస్
చెన్నై : మూడు రూపాయలకు లభించే విధంగా వంటగ్యాసును, చక్కని గాలిని అందించే డబుల్ డెక్కర్ విద్యుత్ ఫ్యాన్‌ను రూపొందించి మదురై సైంటిస్ట్ ఒకరు ప్రతిభ కనుపరిచారు. మదురై బిబి కుళానికి చెందిన అబ్దుల్ రజాక్ (45)ఎలక్ట్రీషియన్‌గా వున్నారు. ఏడో తరగతి వరకు చదివారు. రైల్వే పట్టాలపై పగుళ్లను కనుగొనే పరికరం, ఒకే సమయలో అన్నం, కూర తయారు చేసే కుక్కర్‌తో సహా 37 రకాలైన అనేక దైనందిన జీవనానికి అవసరమయ్యే పరికరాలను తయారుచేసి అబ్దుల్ రజాక్ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ప్రస్తుతం సీలింగ్ ఫ్యానులో టేబుల్ ఫ్యాన్ రెక్కలను అమర్చి డబుల్ డెక్కర్ ఫ్యాన్‌ను రూపొందించారు. సీలింగ్ ఫ్యాను నుంచి ఎక్కువగా గాలి లభించడం లేదని, తాను రూపొందించిన ఈ ఫ్యానుతో అధికంగా గాలి వస్తుందన్నారు. దీంతో విద్యుత్ ఖర్చు ఎక్కువయ్యే అవకాశం లేదన్నారు. అంతేగాకుండా రంపపు పొట్టుతో అగరుబత్తిలకు ఉపయోగించే జిగురును చేర్చి కంప్రెస్ యంత్రం ద్వారా అదిమి చెక్కపొట్టు ఇంధనపు కడ్డీని రూపొందించారు. మూడు రూపాయల ఖర్చుతో తయారైన ఈ వెడల్పాటి కడ్డీ ద్వారా ఒక గంటకు పైగా వంట చేసుకోవచ్చని తెలిపారు. స్టవ్ బర్నర్ సెట్‌ను జతచేసి వంటచేసుకునేందుకు వీలుందన్నారు. ఈ ఉత్పత్తుల పేటెంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం సహకరించి పెద్ద ఎత్తున వీటిని ఉత్పత్తి చేసేందుకు వీలు కల్పించాలని కోరారు. -
గ్యాస్‌తో అధార్ అనుసంధానానికి 14వరకే గడువు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిది జిల్లాల్లో వంటగ్యాస్ కోసం బ్యాంకు ఖాతాలతో ఆధార్ నంబర్ అనుసంధానానికి గడువు ఈనెల 14వ తేదీతో ముగియనుంది. తర్వాత కూడా అనుసంధానం చేసుకోవడానికి అవకాశం ఉన్నా ఈ గడువులోగా అనుసంధానం చేసుకోని వారికి సబ్సిడీ సిలిండర్ల సరఫరా తాత్కాలికంగా ఆగిపోతుంది. ఆధార్ అనుసంధానం చేసుకోని వినియోగదారులు ఈనెల 15వ తేదీ నుంచి రాయితీ లేకుండా గ్యాస్ సిలిండర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అనంతపురం, చిత్తూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, వైఎస్సార్, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో నవంబరు నుంచి నగదు బదిలీ అమలులోకి వచ్చింది. ఈనెల 15 నుంచి ఈ జిలాల్లోని వినియోగదారులు పూర్తి మొత్తం చెల్లించి గ్యాస్ కొనుగోలు చేయాలి. రాయితీ సొమ్ము వారి ఖాతాల్లో జమ అవుతుంది. -
రూ.600కే గ్యాస్ సిలిండర్
టీ నగర్: వంట గ్యాస్ సబ్సిడీని ఒకే నెలలో రూ.100 తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ రూ.600కు కొనుగోలు చేయవచ్చు. వంట గ్యాస్ ప్రత్యక్ష సబ్సిడీ పథకం జనవరి ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ పథకం ద్వారా గ్యాస్ సిలిండర్‌ను పూర్తి ధర చెల్లించి ప్రజలు కొనుగోలు చేయాల్సి వుంది. దీనికి సంబంధించిన సబ్సిడీ వినియోగదారుల బ్యాంకు ఖాతాకు నేరుగా చెల్లించనున్నారు. జనవరిలో సిలిండరు ధర రూ.410, సబ్సిడీ రూ.300 మొత్తం రూ.710 చెల్లించి గ్యాస్ ఏజన్సీల వద్ద ప్రజలు సిలిండర్లు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన సబ్సిడీ సొమ్ము రూ.300 వినియోగదారుల బ్యాంకు ఖాతాలకు చేరింది. వంట గ్యాస్ ప్రత్యక్ష సబ్సిడీ పథకం రాష్ట్రంలో అమలులోకి వచ్చిన నెలలోనే సబ్సిడీ మొత్తం హఠాత్తుగా తగ్గించారు. గత నెల సబ్సిడీ రూ.300 అందజేయగా ఈ నెల రూ.200కు తగ్గించారు. ఈ నెలలో సిలిండర్ కొనుగోలు చేసేవారు రూ.600 చెల్లించి కొనుగోలు చేయాల్సివుంటుంది. -
అనుసంధానం అంతంతే
ఆధార్ అనుసంధానం జిల్లాలో ప్రహసనంగా మారింది. తొలుత అనుసంధానం తప్పనిసరంటూ అధికారులు హడావుడి చేసినా.. ఆ తర్వాతతప్పనిసరి కాదని తేలడంతో జనం అంతగా ఆసక్తి చూపలేదు. అయితే కేంద్రం ఇపుడు ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేయడంతో పాటు గడువు విధించినా, జిల్లాలో 50 శాతమే ఆధార్ సీడింగ్ పూర్తయింది. మరోవైపు అధికారులు మాత్రం అనుసంధానం ఉంటేనే సబ్సిడీ వర్తిస్తుందని హెచ్చరిస్తున్నారు. సాంకేతిక, ఇతర సమస్య నేపథ్యంలో మరో మూడు నెలలు గడువు పొడిగించినప్పటికీ గ్యాస్ సబ్సిడీ లభించాలంటే మాత్రం ప్రస్తుతానికి పూర్తి మొత్తం డబ్బు చెల్లించాలని చెబుతున్నారు. సిద్దిపేటకు చెందిన సురేష్, కొండాపూర్‌కు చెందిన జగదీష్‌లు ఇంతవరకు గ్యాస్ కనెక్షన్‌కు ఆధార్ కార్డును అనుసంధానం చేయలేదు. ప్రస్తుతం వీరు పూర్తి మొత్తం చెల్లిస్తేనే గ్యాస్ కంపెనీ సిలిండర్ ఇస్తుంది. సబ్సిడీ మొత్తం మాత్రం వీరి బ్యాంకు అకౌంట్లో జమ అవుతుంది. ఇది కూడా కేవలం మూడు నెలలే. అప్పటికీ ఆధార్ అనుసంధానం చేసుకోకపోతే ఏప్రిల్ నుంచి సబ్సిడీ డబ్బులు వీరికి లభించవు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఏళ్లకేళ్లు గడుస్తున్నా వంట గ్యాస్-ఆధార్ కార్డు అనుసంధాన ప్రక్రియ మాత్రం ముందుకు సాగడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలోనే సర్కార్ గ్యాస్ సిలిండర్‌కు ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేసింది. అయితే ఆ తర్వాత కోర్టుల జోక్యంతో ఆధార్ బాధ తప్పిందని జనమంతా సంబరపడ్డారు. అయితే ఆధార్‌ను అనుసంధానం చేస్తేనే గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీ ఇచ్చే నిబంధనను సర్కార్ మళ్లీ అమల్లోకి తెచ్చింది. గ్యాస్ సిలిండర్‌కు ఇచ్చే రాయితీని నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే జమ చే సేస్తోంది. అయినప్పటికీ బ్యాంక్ ఖాతాల అనుసంధానం ఏమాత్రం పెరగలేదు. ఇప్పటి వరకు జిల్లాలో కేవలం 50 శాతం వినియోగదారులు మాత్రమే ఆధార్‌తో అనుసంధానం చేయించుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో 5,07,916 గృహ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అందులో 3,52,000 కనెక్షన్లు మాత్రమే ఆధార్‌తో అనుసంధానమయ్యాయి. ఇక ఆధార్-బ్యాంక్ ఖాతాల అనుసంధానమైతే కేవలం 2.50 లక్షల కనెక్షన్లకు మాత్రమే పూరై ్తంది. వంట గ్యాస్ సబ్సిడీని ఆధార్‌తో ముడిపెట్టవద్దని సుప్రీం కోర్టు, రాష్ట్ర హైకోర్టుల తీర్పుల నేపథ్యంలో మొదట్లో వినియోగదారులు ఆధార్ అనుసంధానానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. ప్రభుత్వం న్యాయ స్థానాల తీర్పులను అమలు చేయకపోవడంతో ఆధార్‌తో అనుసంధానం తప్పని సరి అయింది. అయినా వినియోగదారులు ముందుకు రాకపోవడంతో ఈ ప్రక్రియ ఎప్పటి నుంచో కొనసా..గుతోంది. పెరిగిన గడువు .. వంట గ్యాస్-ఆధార్ అనుసంధానానికి తుది గడువును ఇప్పటి వరకు నాలుగైదు సార్లు పొడిగించారు. గత డిసెంబర్ 31తో తాజా గడువు కూడా ముగిసిపోయింది. అయినప్పటికీ ఆధార్ అనుసంధానంలో పురోగతి లేకపోవడంతో ప్రభుత్వం గడువును ఈ ఏడాది ఏప్రిల్ మాసం వరకు మరోసారి పొడిగించింది. దీంతో ప్రస్తుతం ఆధార్‌తో అనుసంధానం కాని వినియోగదారులకు సబ్సిడీపైనే గ్యాస్ అందిస్తున్నారు. పొడిగించిన గడువులోగా ఆధార్‌తో అనుసంధానం కాకపోతే ఆ తర్వాత రాయితీపై వంట గ్యాస్ లభించదని అధికారులు చెబుతున్నారు. గడువులోగా ఆధార్‌ను అనుసంధానం చేసుకోని వినియోగదారులు ఒక్కో సిలిండర్‌పై రూ.900 వరకు అదనపు భారాన్ని మోయాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. ఆధారే అడ్డంకి... కేంద్ర ప్రభుత్వం మహిళలతో జీరో అకౌంట్ బ్యాంకు ఖాతాలు తెరిపించింది. ఈ పథకానికి భారీగానే స్పందన లభించింది. మహిళలు భారీ ఎత్తున ఖాతాలు తెరిచారు. జిల్లా నుంచి భారీగా వలసలు ఉండటంతో..ప్రజలు ఆధార్ కార్డులు తీసుకోలేకపోయారు. ప్రస్తుత ప్రభుత్వం అన్ని పథకాలకు ఆధార్‌కార్డును తప్పని సరి చేయడంతో జనం ఆధార్ కార్డు అవసరం అర్థం చేసుకున్నారు. ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం ఆధార్ సెంటర్లను ఎత్తి వేయడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ-సేవా కేంద్రాల్లో ఆధార్‌కార్డులు ఇస్తున్నప్పటికీ, అవి సకాలంలో అందడంలేదు. ఈ నేపధ్యంలోనే గ్యాస్‌తో ఆధార్ అనుసంధానం చేయించలేకపోతున్నామని వినియోగదారులు అంటున్నారు. -
ఆధార్‌ను బ్యాంకు ఖాతాతో లింక్ చేయించండి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: వంటగ్యాస్‌పై నగదుబదిలీకి సంబంధించి మూడునెలల గడువున్నందున వినియోగదారులంతా ఆధార్ కార్డు వివరాలను బ్యాంకు ఖాతాకు అనుసందానం చేయించాలని జాయింట్ కలెక్టర్ ఎంవీరెడ్డి సూచించారు. గ్యాస్ నగదుబదిలీపై బుధవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులు, బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో 14.49లక్షల గ్యాస్ కనెక్షన్లున్నాయని, ఇందులో 12.82లక్షల మందికి ఆధార్ కార్డులున్నాయన్నారు. వీరిలో 11.49లక్షల మంది బ్యాంకు ఖాతాతో అనుసందానం చేయించారన్నారు. మిగతా వినియోగదారులు గడువులోగా సీడింగ్ చేయించుకోవాలని సూచించారు. ఈ అంశంపై విస్తృత ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎస్ఓ నర్సింహారెడ్డి, ఎల్డీఎం సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. అర్హులందరికీ పింఛన్లు: జేసీ జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక పింఛన్లు అందించనున్నట్లు జాయింట్ కలెక్టర్ ఎంవీరెడ్డి అన్నారు. పింఛన్ల పంపిణీపై బుధవారం కలెక్టరేట్లో ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ పింఛన్లు అందించాలని, ఆందోళన చెందకుండా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌లో నెలకొన్న సమస్యతో కొంత జాప్యం జరుగుతోందని, వీలైనంత త్వరలో సమస్యను అధిగమించి అర్హులకు న్యాయం చేస్తామని అన్నారు. -
వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.25 వాత
* సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ.952 * బ్యాంకులో సబ్సిడీ నగదు జమ రూ.482.50 సాక్షి,సిటీబ్యూరో: హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో వంటగ్యాస్‌కు నగదు బదిలీ పుణ్యమా అంటూ వినియోగదారుడిపై రూ.25 అదనపు భారం పడింది. శనివారం నుంచి వంటగ్యాస్ డీబీటీ వర్తించడంతో నాన్‌సబ్సిడీ కింద సిలిండర్ బిల్లింగ్ ప్రారంభమైంది. ప్రస్తుత మార్కెట్లో సబ్సిడీయేతర డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.952. డీబీటీ పథకంలో చేరిన వినియోగదారులకు బ్యాంకులో సబ్సిడీ నగదు 482.50 జమవుతోంది. వాస్తవంగా వినియోగదారులు చెల్లించిన బిల్లులో సబ్సిడీ సిలిండర్ రూ.444.50 కాగా, బ్యాంక్‌లో రూ. 507.50 జమ కావలసి ఉంది. కానీ, వ్యాట్ పేరుతో వినియోగదారుడు రూ.25 అదనంగా భరించక తప్పడం లేదు. -
గ్యాస్ సబ్సిడీ.. ఇక కిలోకు రూ. 20!
వంటగ్యాస్ సబ్సిడీకి నరేంద్రమోదీ ప్రభుత్వం సరికొత్త విధానం ప్రవేశపెట్టబోతోంది. కిలోకు రూ. 20 చొప్పున మాత్రమే సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ప్రస్తుతానికి దీనివల్ల వినియోగదారులకు అదనపు భారం ఏమీ పడబోదు. అయితే, అంతర్జాతీయంగా చమురు, గ్యాస్ ధరలు పెరిగితే మాత్రం అప్పుడు ఆ భారాన్ని వినియోగదారుల మీదకు నెడతారా, లేదా చమురు కంపెనీలను భరించమంటారా అనేది నిర్ణయించుకోవాలి. కిలోకు 20 రూపాయల లెక్కన గ్యాస్ సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించిన విషయాన్ని కేంద్ర చమురుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. పెద్ద సిలిండర్లు కొనలేక, చిన్న సిలిండర్లకు సబ్సిడీ రాక ఇబ్బంది పడుతున్న పేద ప్రజలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. షాంపూల లాంటి వాటిని చిన్న సాచెట్లలో ఇస్తున్నట్లే.. ఐదు కిలోల సిలిండర్లను పంపిణీ చేయాలని, వాటికి కూడా కిలో లెక్కన సబ్సిడీ ఇవ్వాలని యోచిస్తున్నామన్నారు. ఇన్నాళ్లూ కేవలం 14.2 కిలోల సిలిండర్లకు మాత్రమే సబ్సిడీ వర్తిస్తోంది. ఈ చర్య వల్ల దిగువ మధ్యతరగతి, పేద ప్రజలకు ఉపయోగం ఉంటుందని ధర్మేంద్ర ప్రధాన్ చెబుతున్నారు. -
వంటకు తంటా !
శ్రీకాకుళం పాతబస్టాండ్: అన్నివర్గాలనూ అవస్థల పాల్జ్జేసి న హుదూద్ తుపాను ప్రభావం ఇప్పుడు వంట గ్యాస్‌పై పడింది. గ్యాస్ కొరత ఉండడంవతో బుక్ చేసిన తరువాత సిలిండర్ అందేసరికి నెల రోజులు పైబడుతుండడంతో వినియోగదారులు అల్లాడిపోతున్నారు. మహిళలు వంటకు తంటా పడుతున్నారు. గత నెల 12వ తేదీన సంభవించిన తుపాను కారణంగా జిల్లాకు రావాల్సిన వంట గ్యాస్ సరఫరా గణనీయంగా తగ్గింది. గ్యాస్ కంపెనీలకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఉత్పత్తి పడిపోయింది. ఫలితంగా కావాల్సినంత స్థాయిలో గ్యాస్‌ను సరఫరా చేయలేకపోతున్నాయి. గతనెల రెండో తేదీన అన్లైన్లో బుక్ చేసిన వినియోగదారులకు ఇప్పటికీ సిలిండర్లు సరఫరా కాకపోవడంతో గ్యాస్ ఏజెన్సీల చుట్టూ వినియోగదారులు తిరుగుతున్నారు. జిల్లాలో హెచ్‌పీ, భారత్, ఇండియన్ తదితర గ్యాస్ ఏజన్సీలు 20 ఉన్నాయి. వీటిలో దీపం, డబల్ సిలిండర్, ఇతర వినియోగదారులు కలిపి 3.72 లక్షల మంది ఉన్నారు. వీటిలో ఇప్పటి వరకు ఆధార్, బ్యాంకు ఖాతాల అనుసంధానం 2.85 లక్షల సర్వీసులకు జరిగాయి. ఇందులో 1.21 ల క్షలు కనెక్షన్లు దీపం పథకంలో ఉండగా వీటిలో ఇప్పటి వరకు ఆధార్ అనుసంధానం చేసినవి 82 వేలు ఉన్నాయి. జిల్లాలో వినియోగంలో ఉన్న గ్యాస్ కనెక్షన్లు అన్నీ కలిపి 2.85 లక్షలు ఉన్నాయి. వీరిలో చాలామంది గ్యాస్ బుక్ చేసినా సిలిండర్లు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో రోజుకి సుమారు 5000 సిలిండర్లను వినియోగదారులు వాడుతున్నారు. గ్యాస్ అయిపోయిన వారంతా తిరిగి బుక్ చేసుకొని సిలిండర్ల కోసం ఎదురు చూస్తున్నారు. గ్యాస్ కొరత విషయూన్ని జిల్లా సివిల్ సప్లై ఆధికారి సీహెచ్ ఆనంద కుమార్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా తుపాను వల్ల ఇబ్బంది వచ్చిందన్నారు. ప్రస్తుతం సరఫరా ప్రారంభమైందని, మరో పది రోజుల్లో పరిస్థితి చక్కబడుతోందన్నారు. -
డేట్ దాటితే డేంజరే!
* వంట గ్యాస్ సిలిండర్లకూ ఎక్స్పైరీ డేట్ * వినియోగదారులూ జాగ్రత్త మండపేట రూరల్ : ఎక్స్పైరీ డేట్ అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది మెడిసిన్, ఇంజక్షన్లు, కూల్ డ్రింక్స్, తినుబండారాలు, ఎక్స్ట్రాఎక్స్ట్రా... అయితే మనం నిత్యం వాడే గ్యాస్ సిలిండర్‌కూ ఎక్స్పైరీ డేట్ ఉంటుందనే సంగతి మీకు తెలుసా..? చాలా మందికి తెలియదు కదూ... అయితే ఈ కథనం చదవండి... చాలా వరకు మనం ఇంటికి వచ్చిన సిలిండర్‌ను పూర్తిగా గమనించం... గమనిస్తే సిలిండర్ రింగ్ కింది భాగంలో వాటి తయారీ తేదీ, కాలపరిమితి ముగిసే తేదీ(ఎక్స్పైరీ డేటు) కూడా ముద్రిస్తారు. ఆ తేదీలను ఏ,బీ,సీ,డీలుగా విభజిస్తారు. అంటే జనవరి - మార్చి(ఏ), ఏప్రిల్- జూన్(బి), జూలై- సెప్టెంబర్(సీ), అక్టోబర్- డిసెంబర్(డి)గా ముద్రిస్తారు. ఉదాహరణకు సిలిండర్ కాలపరిమితి 2014 మే నెలతో ముగుస్తుందనగా, దానిపై బీ-14 అని ముద్రిస్తారు. ప్రమాదం సుమా! కాలపరిమితి ముగిసిన సిలిండర్లు వాడడ ం వల్ల అవి పేలి ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉంది. ఇలా కాలపరిమితి ముగిసిన సిలిండర్లను కంపెనీలు ముందుగానే గుర్తించి వాటిని పక్కన పెడతాయి. అలా కాకుండా పొరపాటున కాలపరిమితి ముగిసిన సిలిండర్లు వస్తే వాటిని గుర్తించి డెలివరీ బాయ్‌కు సమాచారమివ్వాలి. వారొచ్చి కొత్త సిలిండర్‌ను అందజేస్తారు. గ్యాస్ వినియోగంలో కొన్ని మెళకువలు... గ్యాస్ వినియోగంలో కొద్దిపాటి మెళకువలు పాటిస్తే ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. సిలిండర్‌కు స్టౌకి తగినంత దూరం ఉండేలా చూసుకోవాలి. ఒకే సిలిండర్‌కు రెండు స్టౌలు ఉంచకూడదు. సిలిండర్‌ను కబ్ బోర్డులో పెట్టినట్టయితే తగినంత గాలి తగిలేలా చూసుకోవాలి. వంటగది కిటికీలు తెరిచే ఉంచుకోవాలి. వంట చేసేటప్పడు మినహా మిగిలిన సమయంలో రెగ్యులేటర్ ఆఫ్‌లో చేయాలి. రెగ్యులేటర్ నుంచి స్టౌవ్‌కి గ్యాస్ సరఫరా చేసే ట్యూబ్‌కు లీకేజీలు లేకుండా చూసుకోవాలి. ఇలా జాగ్రత్తలు పాటిస్తే పెనుప్రమాదాలు జరగకుండా చేయవచ్చు. -
అప్పుడు వద్దు.. ఇప్పుడు ముద్దు..!
నవంబర్ 10 నుంచి వంట గ్యాస్ లబ్ధిదారులకు నగదు బదిలీ అమలు లబ్ధిదారుల ఖాతాలోకి రాయితీ జమ చేయాలని కేంద్రం నిర్ణయం యూపీఏ హయాంలో నగదు బదిలీని తప్పుపట్టిన బీజేపీ అధిష్టానం! సాక్షి ప్రతినిధి, తిరుపతి: అప్పుడు వద్దే వద్దన్నారు.. ఉద్యమాలు చేశారు.. చివరకు యూపీఏ ప్రభుత్వం దిగవచ్చి పథకాన్ని రద్దు చేసింది.. ఇప్పుడు యూపీఏ స్థానంలో గద్దెనెక్కిన ఎన్డీఏ సర్కారు అదే ముద్దు అంటోంది. వచ్చే నెల 10 నుంచి గ్యాస్ లబ్ధిదారులకు నగదు బదిలీ పథకాన్ని వర్తింపజేయాలని శనివారం నిర్ణయించింది. తొలుత పూర్తి ధరకు లబ్ధిదారుడు గ్యాస్ సిలిండర్‌ను కొనుగోలు చేస్తే.. ఆ తర్వాత రాయితీని వారి ఖాతాల్లోకి జమ చేయాలని కేంద్రం నిర్ణయించడం గమనార్హం. రాయితీ భారాన్ని తగ్గించుకోవడానికి యూపీఏ ప్రభుత్వం ఏప్రిల్ 1, 2013 నుంచి వంట గ్యాస్ లబ్ధిదారులకు నగదు బదిలీ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది. ఇందుకు వంట గ్యాస్ సర్వీసు నెంబరు, బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డులను అనుసంధానం(సీడింగ్) చేశారు. జిల్లాలో 7.20 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఉంటే.. ఇప్పటిదాకా 6.79 లక్షల మంది లబ్ధిదారుల సీడింగ్‌ను పూర్తిచేశారు. అంటే.. నేటికీ 41 వేల మంది లబ్ధిదారుల సీడింగ్‌ను పూర్తిచేయాల్సి ఉంది. ఆధార్ సీడింగ్‌లో తప్పులు దొర్లడం.. నిరుపేదలైన లబ్ధిదారులు పూర్తిస్థాయి ధరను పెట్టి గ్యాస్‌ను కొనుగోలు చేయలేకపోవడం.. అనుసంధానంలో తప్పుల వల్ల రాయితీ ఖాతాల్లోకి జమా కాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన బాట పట్టారు. అప్పట్లో విపక్షంలో ఉన్న బీజేపీ గ్యాస్‌కు నగదు బదిలీ పథకాన్ని వర్తింపజేయడాన్ని తప్పుపట్టింది. బీజేపీ మిత్రపక్షమైన టీడీపీ కూడా నగదు బదిలీ పథకాన్ని తూర్పారబట్టింది. గ్యాస్ నగదు బదిలీ పథకాన్ని అమలుచేయడానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను చేశారు. ప్రజావ్యతిరేకతను ఆలస్యంగా పసిగట్టిన యూపీఏ ప్రభుత్వం ఎన్నికలకు సరిగ్గా నాలుగు నెలల ముందు గ్యాస్‌కు నగదు బదిలీ పథకాన్ని రద్దు చేసింది. దాంతో.. సాధారణ ధరకే లబ్ధిదారులు గ్యాస్‌ను కొనుగోలు చేస్తున్నారు. కానీ.. అప్పట్లో గ్యాస్‌కు నగదు బదిలీ పథకాన్ని వద్దే వద్దని ఉద్యమించిన ఎన్డీఏ ఇప్పుడు ఆ పథకమే ముద్దు అంటోంది. నవంబర్ 10 నుంచి గ్యాస్ లబ్ధిదారులకు నగదు బదిలీ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది. రాయితీని లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తామని స్పష్టీకరించింది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ పూర్తి ధర 917.50 రూపాయలు. ఇందులో రాయితీ రూ.470. ఇప్పుడు నగదు బదిలీ పథకం అమల్లో లేకపోవడం వల్ల రూ.446.50 చెల్లిస్తే.. గ్యాస్ సిలిండర్‌ను రీఫిల్లింగ్ చేసేవారు. నవంబర్ 10 నుంచి ఇది సాధ్యం కాదు. గ్యాస్ కనెక్షన్ నెంబరు, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా నెంబరును అనుసంధానం చేశారో లేదో తెలుసుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ రీఫిల్లింగ్ కోసం బుక్ చేసుకోవాలి. పూర్తి ధర అంటే రూ.917.50ను వెచ్చిస్తే గ్యాస్ సిలిండర్‌ను రీఫిల్లింగ్ చేస్తారు.. ఆ తర్వాత రాయితీని అంటే రూ.470ను లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తారు. సీడింగ్ సక్రమంగా జరగకపోతే రాయితీ గోవిందా.. గోవిందా..!! -
పొదుపు చేస్తే ఇం‘ధనమే’!
పొదుపనేది కేవలం డబ్బుకు మాత్రమే పరిమితం చేస్తే సరిపోదు. డబ్బు ఖర్చు చేసి కొనుక్కునే ప్రతి వస్తువునూ సద్వినియోగం చేసుకోవాలి. ప్రత్యేకించి ఇంట్లోవాడే వంటగ్యాస్.. కరెంటు, బైక్‌లో పోసే పెట్రోల్ వంటివాటిపై శ్రద్ధపెట్టాలి. మనకు తెలియకుండానే వీటి కోసం చేసే ఖర్చు వేల రూపాయలకు చేరిపోతుంది. అందుకే ఇంధనాలను పొదుపుగా వాడితే ధనాన్ని పొదుపు చేసినట్లేనంటారు మేనేజ్మెంట్ గురువులు. న్యూఢిల్లీ: పొదుపుతోనే ఇంధనం ఖర్చు ఆదా చేసుకోవచ్చు. వంట గ్యాస్‌ను వృథా చేయకుండా ఉపయోగించుకోవాలి. వంట వండేటప్పుడు అవసరమైన వస్తువులను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. స్టౌను అవసరమున్నప్పుడే వెలిగించాలి. దీంతో ఇంధనం వృథా కాకుండా ఆదా అవుతుంది. వాహనాలను నడిపేటప్పుడు సైతం పొదుపు చర్యలు పాటించాలి. ట్రాఫిక్ జామ్ అయినప్పుడు లేదా సిగ్నల్‌లో వాహనం ఆగిపోయినప్పుడు వెంటనే ఇంజన్‌ను ఆఫ్ చేయాలి. బండి ఇంజన్ చెడిపోకుండా ఎప్పటికప్పుడు చెక్ చేయించాలి. బైక్‌ను ఎప్పుడూ కండిషన్లో ఉంచుకోవాలి. అప్రూవ్డ్ గ్యాస్ కిట్లు ఉంటే బెస్ట్.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కారు నడిపేవారు ఎక్కువమంది గ్యాస్కిట్లపై ఆసక్తి చూపుతున్నారు. అయితే అప్రూవ్డ్ గ్యాస్కిట్లు ఉంటేనే మేలు. వీటిని మాత్రమే వాడాలి. లేకుంటే గ్యాస్ వృథా అయ్యే అవకాశం ఉంది. టైర్లలో గాలి ఎప్పుడూ చెక్ చేసుకోవాలి. నిర్ణీత సమయంలో ఆయిల్ మార్చుతూ సర్వీసింగ్ చేయించాలి. కార్లలో ఏసీని అవసరం మేరకు వాడుకోవాలి. కాలం చెల్లిన వాహనాల స్థానంలో కొత్తవి వాడితే మంచింది. సైకిల్ బెటర్.. నేటి రోజుల్లో సైకిల్ వాడకం చాలా తగ్గిపోయింది. ఏ చిన్న పని కైనా వాహనాన్నే ఉపయోగిస్తున్నారు. దీంతో అటు ఇంధనం ఖర్చవడంతోపాటు ఆరోగ్యం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు. దగ్గర్లో చేసుకోవాల్సిన చిన్నచిన్న పనులకు వాహనాలకు బదులు సైకిల్‌పై వెళ్తే, అటు వ్యాయామానికి వ్యాయామం.. ఇటు ఇం‘ధనం’ కూడా ఆదా అవుతుంది. వారానికి ఒక్కసారైనా సైకిల్ తొక్కండి.. చురుకుగా ఉండాలంటే వారానికి ఒక్కసారైనా వాహనాలను పక్కనబెట్టి సైకిల్ తొక్కాలి. ఇంధనం ఆదా కావడంతోపాటు ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. సైకిల్ వినియోగంపై రాజధాని ఢిల్లీలో అనేక సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. విద్యార్థులు, యువకులు, ఉద్యోగులకు పోటీలు నిర్వహించి సైకిళ్లను బహుమతిగా అందజేస్తున్నాయి. ఇలా సైకిల్ తొక్కడంపై ప్రజలకు అవగాహన కల్పించడం వల్ల కూడా ఇంధనం పొదుపు చేసినవారమవుతాము. విద్యుత్‌ను ఆదా చేయాల్సిందే. విద్యుత్‌ను సైతం పొదుపు చేయకుంటే ఇబ్బందులు తప్పవు. పాత బల్బుల స్థానం సీఎఫ్ఎల్ (కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంపు) బల్బులు వాడాలి. ఇంట్లోని ఫ్యాన్లు, టీవీ, కంప్యూటర్లు, వాషింగ్ మిషన్, సెల్ఫోన్లు, బల్బులను అవసరాలకు అనుగుణంగా వాడాలి. ఎవరూ లేనప్పుడు ఫ్యాన్లను ఆపేయాలి. -
యథేచ్ఛగా గ్యాస్ రీఫిల్లింగ్
నెల్లూరు(టౌన్): జిల్లాలో సబ్సిడీతో గల వంటగ్యాస్‌ను ఏజెన్సీ నిర్వాహకుల సహకారంతో అక్రమ వ్యాపారులు యథేచ్ఛగా రీఫిల్లింగ్ చేపడుతున్నారు. సరిగ్గా పది రోజుల క్రితం కొత్తకాలువ సెంటర్లో అక్రమ రీఫిల్లింగ్ చేస్తున్న వ్యాపారుల నుంచి అధికారులు గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు పొదలకూరు రోడ్డులో స్వాధీనం చేసుకున్నారు. చిన్నబజారులో రీఫిల్లింగ్ గోడౌన్ ఉందని ప్రచారం సాగుతోంది. ఇక్కడ గతంలో పలుమార్లు రీఫిల్లింగ్ చేస్తుండగానే అధికారులు పట్టుకున్నారు. తాజాగా గురువారం నెల్లూరు నగరం నడిబొడ్డున అత్యంత రద్దీ గల ములుముడి బస్టాండ్ సెంటర్లో అక్రమంగా రీఫిల్లింగ్ చేస్తుండగా అధికారులు గ్యాస్ సిలిండర్లన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇలా మొక్కుబడిగా దాడులు నిర్వహించడం తప్ప ‘అక్రమ రీఫిల్లింగ్’ను అధికారులు శాశ్వతంగా ఆపలేరా అని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ పరిస్థితి పునరావృతమైతే పరిస్థితి ఏంటి? ఇటీవల కాలంలో హైదరాబాద్‌లో బీజేపీ కార్యాలయానికి సమీపంలో అక్రమంగా రీఫిల్లింగ్ చేస్తున్న సందర్భంలో గ్యాస్‌లీకై మంటలు వ్యాపించిన సంఘటనలో పలువురు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. గతంలో అనంతపురం జిల్లాలో అదే పరిస్థితి త లెత్తింది. ఇప్పుడు నెల్లూరు ములుముడి బస్టాండ్ సెంటర్లో అత్యంత సన్నటి దారిలో మిద్దెమీద గ్యాస్‌ను రీఫిల్లింగ్ చేస్తూ అక్రమార్కులు దొరికారు. ఈ దుకాణాలున్న కాంప్లెక్స్‌లో ఒకే సారి ఇద్దరు నడిచేందుకు కూడా వీలు లేని సన్నటి దారి. ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కాంప్లెక్స్‌లోని మొత్తం దుకాణాలు, వాటిలో పనిచేస్తున్న వారు ప్రమాదానికి గురైతే దిక్కెవరు అనేది ప్రశ్నార్థకంగా మారింది. అధికారుల నిర్లక్ష్యం ఫలితంగానే అక్రమార్కులు గాలి, వెలుతురు లేని ఇలాంటి చోట్ల దొంగతనంగా రీఫిల్లింగ్ చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లాలో పరిస్థితి జిల్లాలో ప్రస్తుతం 4,78,091 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. 45 గ్యాస్ ఏజెన్సీల వారు ఈ వంటగ్యాస్‌ను వినియోగదారులకు పంపిణీ చేస్తున్నారు. వినియోగదారులకు అందాల్సిన సిలిండర్లను పక్కదారి పట్టిస్తూ ఏజెన్సీలు దండిగా సొమ్ము చేసుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి. చిన్న సిలిండర్లకు పెరిగిన గిరాకీ జిల్లాలో బంగారం వ్యాపారం చేసేవారు, నగరంలో చదువుకుంటున్న విద్యార్థులు ఈ చిన్న గ్యాస్ సిలిండర్లను ఉపయోగిస్తున్నారు. ఇక గ్యాస్ లేని చిరుద్యోగులు, ప్రజలు అడపాదడపా ఈ చిన్న సిలిండర్లను కొనుగోలు చేస్తారు. దీంతో చిన్న సిలిండర్లకు గిరాకీ పెరిగింది. అయితే మార్కెట్లో ఈ చిన్న సిలిండర్లకు గ్యాస్ పట్టే అవకాశం లేదు. దీనిని ఆసరాగా చేసుకున్న వ్యాపారస్తులు బ్లాక్‌లో వంటగ్యాస్ సిలిండర్లను కొనుగోలు చేసి చిన్న సిలిండర్లకు గ్యాస్‌ను అక్రమంగా రీఫిల్లింగ్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. 3 కిలోలు, 5 కిలోల గ్యాస్రూపంలో అమ్ముతున్నారు. సబ్సిడీతో కూడిన గ్యాస్ సిలిండర్ ధర రూ.450. అక్రమార్కులు అదే గ్యాస్ సిలిండర్‌ను ఐదు చిన్న సిలిండర్లలోనికి రీఫిల్లింగ్ చేస్తారు. ఒక్కొక్క సిలిండర్‌ను రూ.220 లెక్కన అమ్ముతున్నారు. అంటే ఒక సబ్సిడీ సిలిండర్ ద్వారా రూ.650 అదనంగా సంపాదిస్తారు. బ్లాక్‌లో కొనుగోలు చేసిన ఖర్చులు తీసేసినా కనీసంగా రూ.400 మిగులుతుంది. కాబట్టి ఈ వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. ఏజెన్సీ నిర్వాహకుల నుంచే కావాల్సినన్ని సిలిండర్లు వీరికి చేరుతుండటంతో ఈ వ్యాపారానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. గ్యాస్ ఏజెన్సీల నుంచి పౌరసరఫరాల అధికారులకు మామూళ్లు అందుతుండటంతో అధికారులు ఏజెన్సీలు జోలికి వెళ్లరు. అడపాదడపా ఇలాంటి చిన్న, చిన్న దాడులు నిర్వహించి ప్రచార ఆర్భాటాన్ని ప్రదర్శిస్తారు. దాడులు ముమ్మమరం చేస్తాం అక్రమంగా రీఫిల్లింగ్ చేస్తున్న వారి భరతం పట్టేందుకు ముమ్మరంగా దాడులు చేస్తాం. కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరిస్తాం. గ్యాస్ ఏజెన్సీలపై కూడా దాడులు చేసి అక్రమార్కుల పనిబడుతాం. శాంతకుమారి, పౌరసరఫరాల అధికారి -
ఇక పైప్‌లైన్ గ్యాస్
ఇంటింటి సరఫరాకు శ్రీకారం పెండింగ్‌లో కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు డిసెంబర్ నాటికి రెండువేల కనెక్షన్లు ఏజెన్సీ సన్నాహాలు సాక్షి, సిటీబ్యూరో/కుత్బుల్లాపూర్: గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాలకు పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా ప్రారంభమైంది. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (బీజీఎల్) సంస్థ ఆధ్వర్యంలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టులో భాగంగా పైప్లైన్ల నిర్మాణ పనులు పూర్తయిన ప్రాంతాలకు వంటగ్యాస్ కనెక్షన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు నగర శివారులోని నల్సార్ విశ్వవిద్యాలయ క్యాంపస్, మేడ్చల్ మండల కేంద్రానికే పరిమితమైన వంటగ్యాస్ సరఫరా తాజాగా కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాలకు విస్తరించింది. దీంతో పైప్‌లైన్ గ్యాస్ కనెక్షన్ల జారీ ప్రక్రియ చేపట్టారు. ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నా... మహానగరంలో ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ (పీఎన్జీ) సరఫరా చేసేందుకు ‘భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్’ సంస్థ నాలుగేళ్ల క్రితం సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టుకు ముందుకు వచ్చింది. అప్ప ట్లో 32 కిలోమీటర్ల మేరకు పనులు చేపట్టి, అర్థంతరంగా నిలిపివేసింది. తొలుత నగర శివారులోని శామీర్‌పేటలో మదర్‌స్టేషన్‌ను ఏర్పాటు చేసి, సమీపంలోని నల్సార్ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లోగల 30 ఫ్లాట్లకు, మేడ్చల్ మండల కేంద్రంలో సుమారు 410 కుటుంబాలకు పైప్లైన్ల ద్వారా కనె క్షన్లు ఇచ్చింది. వాస్తవానికి మేడ్చల్‌లో సుమారు వెయ్యి కనెక్షన్లు ఇచ్చి, అప్పటి ముఖ్యమంత్రి ద్వారా ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ కార్యక్రమం వాయిదా పడటంతో కొన్ని కనెక్షన్లను జారీ చేసి మిన్నకున్నారు. ఆ తర్వాత కొత్త కనెక్షన్ల జోలికి వెళ్లలేదు. తాజాగా పైప్‌లైన్ నిర్మాణ పనులు పూర్తయిన ప్రాంతాలకు గ్యాస్ సరఫరాపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. లక్ష్యానికి దూరం.. గ్రేటర్ పరిధిలో పైప్‌లైన్ ద్వారా ఐదేళ్లలో సుమారు 2.66 లక్షల కుటుంబాలకు వంటగ్యాస్ అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇంతవరకూ ఈ లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. మొదటి విడతగా 2014 ఏప్రిల్ నాటికి లక్ష కుటుంబాలకు పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చే సేందుకు సుమారు రూ.733 కోట్లతో ప్రాజెక్టు సిద్ధమైనట్లు బీజేఎల్ ప్రకటించింది. ఆచరణలో మాత్రం విఫలమైంది. రెండేళ్లుగా పైప్‌లైన్ పనలు ఒక అడుగు కూడా ముందుకు సాగలేదు. మరోవైపు జీడిమెట్లల బంజారాహిల్స్, మాదాపూర్, జూబ్లీహిల్స్ ప్రాంతాలకు పైప్‌లైన్ నిర్మాణ పనుల ప్రణాళిక కాగితాలకే పరిమితమైంది. రెండు వేల కనెక్షన్లు... నగర శివారులోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని కొంపల్లి నుంచి సర్కిల్ కార్యాలయం వరకు డిసెంబరు నాటికి సుమారు రెండు వేల కనెక్షన్లు జారీ చేసేందుకు బీజేఎల్ అధికారులు చర్యలు చేపట్టారు. 2011లో నిర్మాణాలు పూర్తయినా,పైపులైన్లను పరిశీలిస్తూ లీకేజీలుంటే మరమ్మతులు చేపడుతూ కనెక్షన్లు ఇస్తున్నారు. ఇప్పటికే చర్మాస్ ఫ్యాక్టరీ నుంచి కుత్బుల్లాపూర్ సర్కిల్ ఆఫీస్ వరకు 1.5 కిలో మీటర్ల మినహా పైప్లైన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. పైప్‌లైన్ గ్యాస్ కోసం కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన 2,400 కుటుంబాలు భాగ్యనగర్ గ్యాస్ ఏజెన్సీకి దరఖాస్తు చేసుకున్నాయి. తాజాగా గోదావరి హోమ్స్, గాయత్రీ నగర్ సమీపంలో ఉన్న సాయికృష్ణా రెసిడెన్సీ ఫ్లాట్ నెంబరు 204, 401 లకు గ్యాస్ సరఫరాకు శ్రీకారం చుట్టారు. శివారులకు విస్తరణ నగర శివారులోని కొంపల్లి, సినీ ప్లానెట్, ప్రజెయ్ అపార్టుమెంట్, జయభేరి, వెన్సాయి, ఎన్సీఎల్, పేట్ బషీరాబాద్, జీడిమెట్ల, గోదావరి హోమ్స్, గాయత్రీనగర్, బ్యాంక్ కాలనీ, సుచిత్ర, వెన్నెలగడ్డ, బౌద్ధనగర్, వేంకటేశ్వర కాలనీ, కౌండిన్య క్లబ్, ఎన్సీఎల్ నార్త్, మీనాక్షి ఎన్క్లేవ్, స్ప్రింగ్ ఫీల్డ్, ఓం బుక్స్, రామరాజునగర్ ప్రాంతాల్లో ఇప్పటికే పలువురు దరఖాస్తు చేసుకున్నా రు. అక్టోబరు నుంచి శ్రీకష్ణనగర్, భాగ్యలక్ష్మి కాలనీ, జయరాం నగర్, విమానపురి కాలనీ, కుత్బుల్లాపూర్, అయోధ్యనగర్, కృష్ణకుంజ్ గార్డెన్, వీరస్వామినగర్, బీరప్పనగర్, మంజీర అపార్టుమెంట్స్ ప్రాంతాలకు పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్ సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కనెక్షన్‌కు మూడు కంట్రోళ్లు పైప్‌లైన్ గ్యాస్ కనెక్షన్లకు మూడు కంట్రోళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒకటి వంట గదిలోకి వెళ్లగానే మీటర్ వద్ద, రెండోది రబ్బర్ ట్యూబ్ ముందు, మైడో కంట్రోలర్ స్టౌ నాబ్ వద్ద ఉంటుంది. దీని వల్ల ఎలాంటి ప్ర మాదాలకు ఆస్కారం ఉండదు. పేట్ బషీరాబాద్‌లోని మేడ్చల్ ఆర్టీఏ కార్యాలయం వద్ద కంట్రోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచే గ్యాస్ సరఫరా అవుతుంది. అటు కొంపల్లి, కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాల యం వరకు గ్యాస్ పైపులైన్లు అనుసంధానం చేశారు. ఐడీప్రూఫ్ ఉంటే చాలు... పైప్‌లైన్ గ్యాస్ కనెక్షన్ల జారీకి ఐడీ ఫ్రూఫ్ ఉంటే చాలు. రూ.5 వేలు రిఫండబుల్ డబ్బులు చెల్లించి కనెక్షన్ తీసుకోవచ్చు. గ్యాస్ అయిపోతుందన్న దిగులు కూడా ఉండదు. 24 గంటలూ సరఫరా అవుతూనే ఉంటుంది. వినియోగదారులు ఎంత వాడుకుంటే... అంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. సామాన్య, మధ్య తరగతి కుటుంబీకులు రోజూ 0.5 ఎంసీహెచ్ గ్యాస్ వాడే అవకాశముందని బీజేఎల్ సిబ్బంది పేర్కొంటున్నారు. -
దేశం కోసం సబ్సిడీ వదులుకో!
-
దేశం కోసం సబ్సిడీ వదులుకో!
► స్వచ్ఛందంగా ముందుకు రావాలని గ్యాస్ కంపెనీలతో కేంద్రం ప్రచారం ► దేశ నిర్మాణంలో పాలుపంచుకోవాలని పిలుపు ► ఆధార్ వివరాల ఆధారంగా వినియోగదారులకు సందేశాలు ► ఆన్లైన్లోనే సబ్సిడీని వదులుకునే ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: వంట గ్యాస్‌పై సబ్సిడీని పేద వర్గాలకే పరిమితం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థపై గ్యాస్ సబ్సిడీ పెనుభారంగా మారిన నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి వారితోనే ‘స్వచ్ఛంద గ్యాస్ సబ్సిడీ ఉపసంహరణ’ హామీని పొందే దిశగా తొలి అడుగు వేసింది. ‘మాతో కలిసి రండి.. దేశ నిర్మాణం దిశగా’ అంటూ ప్రజల్లో జాతీయ భావాలను ప్రేరేపించే ప్రయత్నం చేస్తోంది. తద్వారా గ్యాస్ సబ్సిడీ నుంచి అధికాదాయవర్గాలను స్వచ్ఛందంగా దూరం చేయాలని చూస్తోంది. ఈ మేరకు చమురు సంస్థలకు ఇప్పటికే ఆదేశాలు అందాయి. తదనుగుణంగా ఆయా కంపెనీలు గ్యాస్ వినియోగదారులను ‘చైతన్యం’ చేసే దిశగా కార్యక్రమాన్ని చేపట్టాయి. ఇప్పటి కే ఆధార్ కార్డులు పొంది, గ్యాస్ కనెక్షన్లతో అనుసంధానం చేసుకున్న వినియోగదారుల నుంచి అధికాదాయ వర్గాలను గుర్తిస్తున్నాయి. వారి మొబైల్ ఫోన్లకు సంక్షిప్త సందేశాలు(ఎస్ఎంఎస్) పంపిస్తున్నాయి. ఆయా గ్యాస్ కంపెనీల వెబ్సైట్లలోనూ ఈ మేరకు ‘ఆప్ట్ అవుట్ సబ్సిడీ’ పేరుతో కేటగిరీని ఏర్పాటు చేశాయి. సబ్సిడీ అవసరం లేదనుకునే వినియోగదారులు ఇందులో స్వచ్ఛందంగా తమ గ్యాస్ కనెక్షన్ నంబర్, గ్యాస్ కంపెనీ డీలర్ పేరును పొందుపరిస్తే, మరుసటి నెల నుంచి సబ్సిడీ లేని వంట గ్యాస్ సిలిండర్‌ను అందించే ఏర్పాట్లు చేశాయి. దేశభక్తిని ప్రేరేపిస్తూ...: ప్రజల్లో దేశభక్తిని ప్రేరేపిస్తూ సబ్సిడీ భారాన్ని తగ్గించుకునేందుకు చమురు కంపెనీలు తమ వెబ్సైట్లను వేదికగా మార్చుకున్నాయి. స్వచ్ఛందంగా సబ్సిడీని వదులుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిస్తూ ‘గివ్ అప్ సబ్సిడీ’ లింక్‌ను ఆప్షన్‌గా ఇచ్చాయి. ఈ లింక్‌ను క్లిక్ చేసి ఎవరైనా స్వచ్ఛందంగా సబ్సిడీని వదులుకోవచ్చు. అలా చేసిన వారి పేర్లను ‘స్క్రోల్ ఆఫ్ ఆనర్’ కింద గ్యాస్ కంపెనీలు తమ వెబ్సైట్లలో పొందుపరిచి గౌరవించనున్నాయి. స్పందన అంతంత మాత్రమే! సబ్సిడీని వదులుకోవాలంటూ ఆయిల్ కంపెనీల ప్రచారం ఇటీవలే మొదలైంది. అయితే దేశవ్యాప్తంగా పెద్దగా స్పందన కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మొబైల్ఫోన్ల ద్వారా ‘చైతన్యం’ తీసుకొచ్చే కార్యక్రమానికి ఆ సంస్థలు శ్రీకారం చుట్టాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఇండేన్ గ్యాస్ వినియోగదారుల్లో 1,470 మంది నాన్ సబ్సిడీకి స్వచ్ఛందంగా ముందుకు రాగా, రూ. 88.20 లక్షలు ఆదా అయినట్లు ఆ కంపెనీ పేర్కొంది. భారత్ గ్యాస్ వినియోగదారుల్లో 406 మంది సబ్సిడీని వదులుకోవడంతో రూ. 24.36 లక్షలు మిగిలాయి. హెచ్‌పీ గ్యాస్‌కు సంబంధించి 368 మంది వల్ల రూ. 22.08 లక్షలు ఆదా అయ్యాయి. కాగా, సబ్సిడీతో కూడిన వంట గ్యాస్ ప్రస్తుతం రూ. 450కి లభిస్తుండగా, సబ్సిడీ లేని సిలిండర్ ధర రూ. 1,100గా ఉంది. మొత్తానికి ఆయిల్ కంపెనీల సంక్షిప్త సమాచారాలతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. -
‘గ్యాస్, కిరోసిన్ ధరలు పెంచం’
పాట్నా: వంట గ్యాస్, కిరోసిన్ ధరలను పెంచకూడదని తమ ప్రభుత్వం నిర్ణయించినట్టు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ధరల పెంపు వల్ల ప్రజలపై పడే భారాన్ని పరిగణనలోకి తీసుకున్న అనంతరం ఈ నిర్ణయానికి వచ్చినట్టు చెప్పారు. దీనివల్ల మధ్య తరగతి ప్రజలతో పాటు వంట కోసం కిరోసిన్ వినియోగించే పేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు. పెట్రోల్ ధరలు మాత్రం మార్కెట్‌కు అనుగుణంగా మారుతుంటాయని చెప్పారు. రూపాయి స్థిరంగా ఉన్నందున భవిష్యత్తులో పెట్రో ధరల పెంపు ఉండకపోవచ్చన్నారు. ఆదివారం ఆయన బీహార్ రాజధాని పాట్నాలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. -
గ్యాస్, కిరోసిన్ రేట్లు పెరగవు
-
గ్యాస్, కిరోసిన్ రేట్లు పెరగవు
* అలాంటి ప్రతిపాదనేమీ లేదు * ధరల పెంపు కథనాలను ఖండించిన కేంద్రం న్యూఢిల్లీ: వంటగ్యాస్, కిరోసిన్ ధరలను పెంచే యోచన లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఎల్పీజీ సిలిండర్‌పై రూ. 250, లీటర్ కిరోసిన్‌పై 4 రూపాయలు పెంచడానికి చమురు శాఖ కసరత్తు చేస్తోందన్న కథనాలను పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఖండించారు. ప్రభుత్వం ముందు అలాంటి ప్రతిపాదనలేవీ లేవని తోసిపుచ్చారు. చమురు ఉత్పత్తుల రేట్లు పెంచాలని కిరీట్ పారిఖ్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ చేసిన సిఫారసుల మేరకు చమురు శాఖ ఓ నోట్ సిద్ధం చేసిందని, రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీపీఏ) అనుమతి కోసం ప్రయత్నిస్తోందని మీడియా కథనాలు వెలువడటంతో కేంద్ర మంత్రి స్పందించారు. గ్యాస్, కిరోసిన్ ధరలు పెంచే యోచన కానీ, డీజిల్ ధరల విధానాన్ని మార్చే ప్రతిపాదన కానీ పెట్రోలియం శాఖ వద్ద లేదని స్పష్టం చేశారు. చమురు ఉత్పత్తుల ధరలు పెంచి రూ. 72 వేల కోట్ల సబ్సిడీని తగ్గించుకోవాలని పారిఖ్ కమిటీ గత అక్టోబర్‌లో నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. రేట్లను పెంచకపోతే ఈ ఆర్థిక సంవత్సరంలో చమురు సంస్థలు దాదాపు రూ. 1.07 లక్షల కోట్ల మేర నష్టాలను మూటగట్టుకుంటాయని, దీన్ని కేంద్రమే భరించాల్సి వస్తుందని కమిటీ తన నివేదికలో హెచ్చరించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు సబ్సిడీ భాగం పెరగడంతో మూడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెందిన దాదాపు వందకుపైగా ఉద్యోగులు తమ ఎల్పీజీ సబ్సిడీ మొత్తాలను వదులుకున్నారని పెట్రోలియం మంత్రిత్వశాఖ శుక్రవారం విడుదలచేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. -
ఇక నెలనెలా నెత్తిన ‘బండ’
-
ఇక నెలనెలా నెత్తిన ‘బండ’
గ్యాస్, కిరోసిన్ ధరలను పెంచే యోచనలో కేంద్రం సిలిండర్‌కు రూ.5, కిరోసిన్ లీటర్‌కు 50-100 పైసల పెంపు! రూ.80 వేల కోట్ల సబ్సిడీ భారం తొలగింపుపై దృష్టి న్యూఢిల్లీ: డీజిల్ తర్వాత ఇప్పుడు ఎల్పీజీ, కిరోసిన్‌ల వంతు. డీజిల్ మాదిరిగానే వంటగ్యాస్ (ఎల్పీజీ), కిరోసిన్ ధరలను స్వల్ప మోతాదుల్లో ప్రతినెలా పెంచే దిశలో కేంద్రం కసరత్తు కొనసాగిస్తోంది. తద్వారా కాలక్రమంలో ఈ రెండు ఇంధనాలకు సంబంధించిన రూ.80 వేల కోట్ల సబ్సిడీ భారాన్ని పూర్తిగా తొలగించుకోవాలని భావిస్తోంది. ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.5 చొప్పున, కిరోసిన్ ధరను లీటర్‌కు 50 పైసల నుంచి రూపారుు చొప్పున ప్రతినెలా పెంచే ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. డీజిల్ ధరను ప్రతినెలా 50 పైసల చొప్పున పెంచాలని గత యూపీఏ ప్రభుత్వం 2013 జనవరిలో నిర్ణరుుంచింది. అప్పటినుంచి ఓ రెండుసార్లు మినహా క్రమం తప్పకుండానే డీజిల్ ధర పెరుగుతూ వచ్చింది. దీంతో డీజిల్‌పై సబ్సిడీ భారం లీటర్‌కు కేవలం రూ.1.62కు తగ్గిపోరుుంది. యూపీఏ ప్రభుత్వ నిర్ణయూన్ని కొత్త ప్రభుత్వం సైతం కొనసాగిస్తుండటంతో ఈ భారం కూడా తొలగిపోయే సూచనలు కన్పిస్తున్నారుు. డీజిల్ పద్దతిలోనే ఎల్పీజీ, కిరోసిన్ ధరలను క్రమంగా పెంచాలని చమురు మంత్రిత్వ శాఖ ప్రతిపాదిస్తున్నట్టు తాజా పరిణామాలపై అవగాహన కలిగిన వర్గాల సమాచారం. 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్‌పై ప్రస్తుతం రూ.432.71 సబ్సిడీ కొనసాగుతుండగా.. నెలకు రూ.5 పెంపుతో సబ్సిడీ భారం పూర్తిగా తొలగిపోవాలంటే ఏడేళ్లు పట్టవచ్చని అంచనా. ఒకవేళ ప్రభుత్వం కనుక సానుకూలంగా ఉంటే నెలకు రూ.10 చొప్పున పెంచాలనే అభిప్రాయంతోనూ ఇంధన శాఖ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక కిరోసిన్‌పై ప్రస్తుతం లీటర్‌కు రూ.32.87 చొప్పున సబ్సిడీ ఉంది. నెలకు రూపారుు చొప్పున పెంచుతూ వెళితే సబ్సిడీ భారాన్ని పూర్తిగా తొలగించుకునేందుకు రెండున్నరేళ్లకు పైగానే పట్టే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో డీజిల్, ఎల్పీజీ, కిరోసిన్‌లపై ఇచ్చే సబ్సిడీ రూ.1,15,548 కోట్లుగా అంచనా. ఇందులో ఎల్పీజీ వాటా రూ.50,324 కోట్లు కాగా, కిరోసిన్ వాటా రూ.29,488 కోట్లుగా ఉంది. బడ్జెట్ నుంచి నేరుగా చేసే నగదు కేటారుుంపులు, ఓఎన్జీసీ వంటి ప్రభుత్వ సంస్థల విరాళాలతో సబ్సిడీ మొత్తాన్ని పూరిస్తారు. -
విత్తుపైనా..బెత్తమే
సబ్సిడీ వేరుశెనగ విత్తనాలకు నగదు బదిలీ పూర్తి నగదు చెల్లిస్తేనే వేరుశెనగ విత్తనాలు ఆపై రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నగదును జమ చేస్తారట 40 శాతం మంది రైతులకుబ్యాంకులో ఖాతాల్లేవు జిల్లాలోని రైతన్నలపై 15 కోట్ల భారం వంట గ్యాస్ సబ్సిడీ పంపిణీలో నగదు బదిలీ అభాసుపాలైనా అధికారుల తీరులో మార్పు కనిపించడం లేదు. వచ్చే నెల మొదటి వారంలో జిల్లాలో ప్రారంభం కానున్న సబ్సిడీ వేరుశెనగ విత్తన కాయల పంపిణీ సైతం నగదు బదిలీ ద్వారా చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సం బంధించిన ఉత్తర్వులు జేడీ కార్యాలయం నుంచి జిల్లాలోని అన్ని ఏడీ కార్యాలయాలకు అందాయి. తొలుత ప్రైవేటు మార్కెట్లో ఉన్నంత పూర్తి ధరతో రైతులు నగదు చెల్లించి వేరుశెనగ విత్తన కాయలను పొందాలట. ఆపై రైతుల ఖాతాల్లోకి సబ్సిడీ సొమ్ము జమ చేస్తారట. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. పలమనేరు, న్యూస్‌లైన్: జిల్లాలో 11 వ్యవసాయశాఖ డివిజన్లు ఉండగా ప్రస్తుతం 9 డివిజన్లలో మాత్రం ఈ విత్తన కాయలను జూన్ మొదటి వారంలో అందజేయనున్నారు. సత్యవేడు, శ్రీకాళహస్తి మినహా మిగిలిన 53 మండలాల్లో ఈ పంపిణీ జరగనుంది. ఖరీఫ్‌కు సంబంధించి లక్ష క్వింటాళ్ల విత్తనాలను సుమారు 4 లక్షల మందికి పైగా రైతులకు అందజేయాలని అధికార యం త్రాంగం సిద్ధమవుతోంది. ఈ దఫా కే-6 అనే రకం విత్తనాలను పంపిణీ చేయనున్నారు. 30 కిలోల బస్తాకు సబ్సిడీ రూ.450 ఈ దఫా వ్యవసాయ శాఖ 30 కిలోల వేరుశెనగ బస్తాకు ధర రూ.1380గా నిర్ణయించింది. ఇందులో 33 శాతం (రూ.450) సబ్సిడీతో వీటిని అందజేస్తారు. ఒక్కో రైతుకు మూడు బస్తాల చొప్పున ఇవ్వనున్నారు. ప్రభుత్వ ధర ప్రకారం ఓ బస్తా రూ.1380 కాగా, మొత్తం ధర చెల్లించి విత్తనాలను పొం దాల్సి ఉంది. ఆపై రైతుల ఖాతాల్లోకి రూ.450 సబ్సిడీని జమ చేయనున్నా రు. అయితే రైతులు పట్టదారు పాసుపుస్తకంతో పాటు బ్యాంకు అకౌంట్‌ను ఇవ్వాల్సి ఉంది. పాసుపుస్తకంలో యజమానిగా ఉన్న వ్యక్తి పేరు మీదనే బ్యాంకు ఖాతా కూడా ఉండాలట. జిల్లాలోని రైతన్నలపై రూ.15 కోట్ల భారం వ్యవసాయ శాఖ లక్ష క్వింటాళ్ల వేరుశెనగ విత్తనాలను పంపిణీ చేయనుంది. దీనికయ్యే మొత్తం ఖరీదు రూ.46 కోట్లు. ఇందులో సబ్సిడీ రూ.15 కోట్లు. ఈ మొత్తాన్ని రైతులు ఫుల్‌కాస్ట్ రూపేణా ముందుగానే చెల్లించాల్సి ఉంది. అసలే కష్టాల్లో ఉన్న రైతన్నకు మొత్తం ధర చెల్లించడం ఇబ్బందే. దీంతో ఈ దఫా సబ్సిడీ వేరుశెనగ విత్తనాలపై ఆసక్తి చూపరని వ్యవసాయాధికారులే పెదవి విరుస్తున్నారు. నగదు బదిలీలో ఇబ్బందులేమంటే జిల్లాలోని 40 శాతం మంది రైతులకు బ్యాంకుల్లో వ్యక్తిగత ఖాతాల్లేవు. ఒకవేళ ఉన్నా పాసుబుక్ కలిగిన వారి పేరిటే ఖాతాల్లేవ్. దీంతో రైతుకు మూడు బస్తాలకందే రూ.1350 కోసం బ్యాంకులో రూ.1000 డిపాజిట్ చెల్లించి ఖాతా పొందడం కష్టంగా మారనుంది. పాసుపుస్తకంలో యజ మానులుగా ఉన్న పలువురు రైతులు మృతిచెందారు. వారి వారసులకు ఇంతవరకు పాసుపుస్తకాలు బదిలీ కాలేదు. ఇలాంటి వారు భూములను ట్రాన్స్ఫర్ చేసుకొనేదెప్పుడు? ఆపై విత్తనాలు పొందేదెప్పుడు? ఒకవేళ ఖాతాలున్న రైతులకు సంబంధిత బ్యాంకుల్లో అప్పులుంటే బ్యాంకర్లు ఆ వచ్చే సబ్సిడీ నగదును రుణానికి జమ చేసుకోవడం ఖాయం. ఇలాంటి పరిస్థితుల మధ్య వేరుశెనగ పంపిణీలో నగదు బదిలీ అభాసుపాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు రైతులు ఈ పద్ధతిని విమర్శిస్తున్నారు. ఈ విషయమై పలమనేరు వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు రమేష్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా సబ్సిడీ విత్తనాల పంపిణీలో నగదు బదిలీ కాస్త ఇబ్బందని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. అయితే ప్రభుత్వ పాలసీ కాబట్టి తాము ఏమీ చేయలేమన్నారు. -
తెగిన లింక్
బెంగళూరు : రాష్ట్ర వ్యాప్తంగా పాత పద్ధతిలోనే వంట గ్యాస్ సరఫరాను చమురు కంపెనీలు పునరుద్ధరించాయి. అయితే ఏడాదికి 12 సిలిండర్లను మాత్రమే రూ.423 చొప్పున సరఫరా చేస్తారు. తొలుత సబ్సిడీపై తొమ్మిది సిలిండర్లను మాత్రమే సరఫరా చేస్తామని ప్రకటించిన కేంద్రం, దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో 12 సిలిండర్లకు పెంచింది. ఇప్పటి వరకు వినియోగదారులు ఆధార్ నంబరు (విశిష్ట గుర్తింపు సంఖ్య)ను తీసుకుని, దానిని గ్యాస్ డీలర్లు, బ్యాంకులకు అనుసంధానం చేయాలని చమురు కంపెనీలు ఆదేశించాయి. అలా చేసిన వారికే సబ్సిడీ లభిస్తుందని, ఆ మొత్తం కూడా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అవుతుందని చెబుతూ వచ్చాయి. మైసూరు, తుమకూరు, ధార్వాడ జిల్లాల్లో ఈ పద్ధతిని తప్పనిసరి చేశారు. బెంగళూరులో వచ్చే నెల నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో ‘ఆధార్ అనుసంధానం తప్పనిసరి’ అనే నిబంధన రాష్ట్రంలో మంగళవారం నుంచి తొలగిపోయింది. అంటే... ఇకమీదట పాత పద్ధతిలోనే చమురు కంపెనీలు వినియోగదారులకు సిలిండర్లను సరఫరా చేస్తాయి. కాకపోతే సబ్సిడీపై ఏడాదికి 12 సిలిండర్లు మాత్రమే అనే నిబంధన ఉన్నందున, గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసే సమయంలో సరఫరాదార్లు గ్యాస్ కంపెనీకి సంబంధించిన బ్లూ బుక్కులో నమోదు చేస్తారు. సుప్రీం కోర్టు ఆదేశించినా.... వంట గ్యాస్‌తో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్‌ను తప్పనిసరి చేయడం సరికాదని సుప్రీం కోర్టు ఆదేశించినప్పటికీ, చమురు కంపెనీల వ్యవహార శైలిలో మార్పు రాలేదు. వంట గ్యాస్ కోసం ఎస్ఎంఎస్లు చేసినా చెల్లుబాటు అయ్యేవి కావు. ఆధార్ సంఖ్యను ఇవ్వాల్సిందిగా గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులకు ఎస్ఎంఎస్లు పంపడం మానలేదు. దీని వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాలను ఈ ఏజెన్సీలు పట్టించుకోవా... అనే ప్రశ్నలు తలెత్తాయి. దీనికి తోడు ఆధార్ సంఖ్యను గ్యాస్ ఏజెన్సీలు, బ్యాంకులతో అనుసంధానం చేసిన వారికి సబ్సిడీ మొత్తం బ్యాంకుల్లోనే జమ కావాల్సి ఉంది. అయితే ఇలా జమ కాకపోవడంతో చాలా మంది వినియోగదారులు లబోదిబోమనేవారు. ఇప్పుడా సంకటం తొలగిపోయింది. ఇదివరకే సిలిండర్‌కు మార్కెట్ ధరను చెల్లించిన వినియోగదారులకు సైతం త్వరలోనే సబ్సిడీ మొత్తాన్ని చెల్లిస్తామని గ్యాస్ ఏజెన్సీలు ప్రకటించాయి. -
తగ్గిన గ్యాస్ ధర
గృహావసరాల సిలిండర్‌పై రూ.53 వాణిజ్య అవసరాల సిలిండర్‌పై రూ.88 విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : వంట గ్యాస్ ధర స్వల్పంగా తగ్గింది. చమురు కంపెనీలు గృహ, వాణిజ్య అవసరాల గ్యాస్ ధరలను తగ్గిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశాయి. గృహావసరాల సిలిండర్‌పై రూ.53, వాణిజ్య అవసరాల సిలిండర్‌పై రూ.88 తగ్గించారు. గృహావసరాల సిలిండర్ ధర రూ.1,213 ఉండగా అది రూ.1,160కి తగ్గుతోంది. వాణిజ్య అవసరాల సిలిండర్ ధర రూ.2,019 ఉండగా, రూ.1,981కి తగ్గించారు. తగ్గిన ధరలు జిల్లాలోని అన్ని గ్యాస్ ఏజెన్సీల్లో అమలులోకి వచ్చాయి. గ్యాస్ ధరలు ప్రతినెలా పెరగటం, తగ్గటం వల్ల వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంత వినియోగదారులకు గ్యాస్ ధర తగ్గిన విషయం తెలియటం లేదని చెబుతున్నారు. ప్రతినెలా హెచ్చుతగ్గుల వల్ల రిక్షాలపై గ్యాస్ సరఫరా చేసేవారు మోసాలు చేసి అమాయకుల నుంచి అధిక సొమ్ము వసూలు చేసే అవకాశముందని పలువురు పేర్కొంటున్నారు. 10 రోజుల్లో ఆధార్ పై ఆదేశాలు... గ్యాస్ సబ్సిడీని ఆధార్‌కు సంబంధం లేకుండా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఇంకా గ్యాస్ కంపెనీలకు అందలేదు. మరో పది రోజుల వరకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ కొనసాగిస్తామని గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు. ఉత్తర్వులు జారీ అయ్యేవరకు గ్యాస్ సబ్సిడీ బ్యాంకు ఖాతాలలోనే పడుతుందని తెలిపారు. దాంతో జిల్లాలో ఆధార్ అనుసంధానం కాని వినియోగదారులు పూర్తి ధర చెల్లించి గ్యాస్ కొనుగోలు చేయాల్సి వస్తోంద ని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది మంది వినియోగదారులు ఆధార్ తొలగించిన ఉత్తర్వుల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూపులు చూస్తున్నారు. -
తప్పిన గండం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలోని వంట గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో మంగళవారం నుంచి తలపెట్టనున్న నిరవధిక సమ్మెను ఉపసంహరించుకున్నారు. సిలిండర్ ధర అంతటా ఒకే విధంగా ఉండాలని, డిస్ట్రిబ్యూటర్‌షిప్ అగ్రిమెంట్లను సమీక్షించాలని, ప్రస్తుతం గ్యాస్ సిలిండర్‌పై వేస్తున్న ప్లాస్టిక్ సీలుకు బదులుగా పకడ్బందీ సీలును అమర్చాలని.... తదితర డిమాండ్లతో డిస్ట్రిబ్యూటర్లు సమ్మె చేయదలిచారు.. మార్కెట్లో రెండు, మూడు, ఐదు కిలోల సిలిండర్లు విచ్చలవిడిగా చలామణిలో ఉన్నాయని, ఇవన్నీ అక్రమమైనవే కాకుండా అత్యంత ప్రమాదకరమైనవని ఆలిండియా ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల సమాఖ్య కర్ణాటక సర్కిల్ కార్యదర్శి ఎన్. సత్యన్ ఆరోపించారు. సిలిండర్లపై ప్రస్తుతం వేస్తున్న ప్లాస్టిక్ సీళ్లను లాఘవంగా తొలగించి గ్యాస్‌ను దొంగిలించే అవకాశం కూడా ఉందని తెలిపారు. ప్రస్తుతం సబ్సిడీ కింద ఇస్తున్న 14.2 కిలోల సిలిండర్ ధర ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటోందని తెలిపారు. అలా కాకుండా ఒకే ధరను నిర్ణయించాలన్నారు. వీటికి తోడు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ 2,700 మంది రెగ్యులర్ డీలర్లను, రాజీవ్ గాంధీ గ్రామీణ ఎల్పీజీ వితరణ యోజన కింద మరో 1,500 మంది డీలర్లను నియమించాల్సిందిగా చమురు కంపెనీలను ఆదేశించిందని వెల్లడించారు. ఇదే కనుక అమలైతే ప్రస్తుత డీలర్లందరూ నష్టపోతారని వివరించారు. కాగా సమ్మెను విరమింపజేయడానికి సమాఖ్య ప్రతినిధులతో అధికారులు సోమవారం రాత్రి కూడా చర్చలు జరిపారు. డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తామని హామీ ఇవ్వడంతో డీలర్లు సమ్మె యోచనను విరమించుకున్నారు. -
చెప్పారంతే..!
సాక్షి, కడప: ‘నోరు ఒకటి చెబుతుంది... చెయ్యి మరొకటి చేస్తుంది. దేని దోవ దానిదే!’’ అన్నట్లుంది కేంద్ర ప్రభుత్వ వైఖరి. ఎన్నికలకు ముందు ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయాలను ప్రకటించిన కేంద్రం.. వాటిపై చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదు. వంటగ్యాస్‌కు ‘ఆధార్’ అనుసంధానాన్ని నిలిపేస్తూ, ఏడాదికి సిలిండర్ల సంఖ్యను 12కు పెంచుతున్నట్లు 15రోజుల కిందట కేంద్ర మంత్రివర్గం ప్రకటించింది. అయితే ఉత్తర్వులు మాత్రం వెలువరించలేదు. దీంతో వినియోగదారులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. మాటలు ఒకలా చేతల్లో మరొకలా వ్యవహరిస్తున్న కేంద్రం తీరుపై మండిపడుతున్నారు. అంతా గందరగోళం: కేంద్రం తీసుకున్న నిర్ణయాల్లో ఏదీ సక్రమంగా అమలు కావడం లేదు. రాయితీ సిలిండర్లు ఏడాదికి 9మాత్రమే ఇచ్చేవారు. అయితే 12 సిలిండర్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అంటే మార్చిలోపు 3 సిలిండర్లు అదనంగా వినియోగదారులకు అందాలి. అయితే గ్యాస్ ఏజెన్సీల డీలర్లు మాత్రం ఈ ఆర్థిక సంవత్సరం మార్చితో ముగుస్తుందని, అందువల్ల ఫిబ్రవరి, మార్చిలకు రెండు సిలిండర్లు మాత్రమే ఇస్తామని చెబుతున్నారు. ఏప్రిల్ నుంచి 12 సిలిండర్లు ఇస్తామంటున్నారు. అంటే ఈ ఏడాదికి 11 సిలిండర్లు మాత్రమే ఇచ్చినట్లువుతుంది. డీలర్లకు..వినియోగదారులకు వాగ్వాదం: జిల్లాలో గ్యాస్‌సిలిండర్ ధర 413 రూపాయలు. అయితే సర్వీసు చార్జీతో కలిపి పట్టణాల్లో 440, పల్లెల్లో 450 రూపాయలు గ్యాస్ఏజెన్సీలు వసూలు చేస్తున్నాయి. ఆధార్‌తో బ్యాంకు ఖాతాను అనుసంధానం చేసిన తర్వాత సిలిండర్ ధర 1343రూపాయలు (రశీదుపైన ఉండే ధర). అయితే సర్వీసు చార్జీతో కలిపి 1380 రూపాయలు తీసుకుంటున్నారు. రాయితీ డబ్బు బ్యాంకు ఖాతాలో పడుతుందా అంటే అదీ లేదు. రోజుల తరబడి డ బ్బులు జమకావడం లేదు. ఒక బ్యాంకులో ఖాతా ఉంటే మరొక బ్యాంకులో సొమ్ము జమ అవుతుందంటే ‘ఆధార్, బ్యాంక్ ఖాతాల వ్యవస్థ’ ఎంత అధ్వానంగా ఉందో ఇట్టే తెలుస్తుంది. ఈ కొత్త ప్రక్రియతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించారు. దీంతో ఈ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేస్తున్నామని, సబ్సిడీ ధరను కేంద్రమే చెల్లించి రాయితీ సిలిండర్లు పాతపద్ధతి ద్వారా అందిస్తామని కేంద్ర మంత్రివర్గం ప్రకటించింది. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఈ పరిణామంపై టీవీల్లో భారీ ప్రకటనలు కూడా చేస్తోంది. అయితే ఉత్తర్వులు మాత్రం వెలువరించలేదు. ఈ క్రమంలో ప్రకటనలు చూపి మహిళలు రాయితీకి సిలిండర్లు ఇవ్వాలని డీలర్లతో వాదనకు దిగుతున్నారు. డీలర్లు మాత్రం తమకు ఆదేశాలు రాలేదని, 1380 రూపాయలు చెల్లిస్తేనే సిలిండర్ ఇస్తామని లేదంటే లేదని తేల్చి చెబుతున్నారు. బ్యాంక్ ఖాతాకు ఆధార్ అనుసంధానం కూడా తప్పనిసరి అని లేదంటే రాయితీ మొత్తం జమ కాదని కూడా చెబుతున్నారు. దీంతో నిత్యం డీలర్లకు, వినియోగదారులకు వాగ్వాదం చోటు చేసుకుంటోంది. బ్యాంకు....‘ఆధార్’ అనుసంధానం ఇలా: జిల్లాలో 5.76 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఇండేన్, హెచ్‌పీ, భారత్ ఏజెన్సీలలో 5, 24, 305 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 63 శాతం కనెక్షన్లు బ్యాంకు ఖాతాలో ఆధార్ అనుసంధానం అయ్యాయి. ఈ 63 శాతం కనెక్షన్లలో 42శాతం మందికి మాత్రమే బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి. తక్కిన వాటికి ఖాతా నెంబర్ తప్పుపడిందనో, ఆధార్ నెంబరు తప్పుగా నమోదైందనో...ఏదో ఒక కారణంతో గ్యాస్ సబ్సిడీ జమ కావడం లేదు. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం కేంద్రప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతోనైనా ఉపశమనం లభిస్తుందని భావిస్తే అదీ జరగకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వంటగ్యాస్ రాయితీ మొత్తాన్ని ఆధార్ అనుసంధానంతో బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లించే పద్ధతిని తొలగించాం. అలాగే ఏడాదికి ఇస్తున్న రాయితీ సిలిండర్ల సంఖ్యను 9 నుంచి 12కు పెంచాం. ఇక నుంచి పాతపద్ధతిలోనే రాయితీతో వినియోగదారులు గ్యాస్ సిలిండర్లు పొందవచ్చు. - కేంద్రమంత్రివర్గం నిర్ణయం కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయంపై మాకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. కాబట్టి ఎప్పటిలానే రాయితీ మొత్తాన్ని ఆధార్ అనుసంధానంతో బ్యాంకు ఖాతా ద్వారానే పొందాలి. సిలిండర్‌కు సబ్సిడీ సొమ్ము కూడా చెల్లించాలి. ఆధార్ అనుసంధానం జరగని పక్షంలో రాయితీ సొమ్ము రాదు. - వంటగ్యాస్ సరఫరా చేసే డీలర్లు ఏం తగ్గిచ్చినట్టబ్బా! ముందు 450రూపాయలకి గ్యాస్ ఇచ్చాంటిరి. తర్వాత ఆధార్‌కార్డు అదీ...ఇదీ అని సెప్పి 1380 రూపాయలు తీసుకుంటాండారు. మళ్లా 450కే ఇచ్చారని అన్యారు. కానీ ఇప్పటికీ 1380 తీసుకుంటాండారు. ఇంగ ఏం తగ్గిచ్చినట్టబ్బా. తగ్గించనిదానికి సెప్పడం దేనికి. హజరతమ్మ, రాజుపాళెం లంకె పెట్టొద్దు గ్యాస్‌కు ఆధార్‌కార్డుతో లంకెపెట్టడం శానా తప్పు. 1380 రూపాయలు మేమిస్తే మాకు 650 రూపాయలే జమ అవుతాంది. ముందు 450 ఇచ్చాంటిమి. కొత్త పద్ధతితో చానా ఇబ్బందిగా ఉండాది. ఆధార్‌కార్డు తీసేస్తున్నామని సెప్పినారు. మాతో మాత్రం మొత్తం లెక్క తీసుకున్యారు. గౌసియా, రాజుపాళెం ఖాతాలో డబ్బు పడలేదు డిసెంబర్లో గ్యాస్ తీసుకున్నా. ఇప్పటి వరకూ నా ఖాతాలో డబ్బులు పడలేదు. బాలాజి గ్యాస్ ఏజన్సీ వద్దకు పోయి అడిగితే నా ఖాతాలో కాకుండా ఐసీఐసీఐ బ్యాంకులో పడింది. నేను ఏపీజీబి బ్యాంకు ఆకౌంట్ బుక్ ఆధార్ కార్డు లింక్‌తో ఇచ్చాను. ఈ విషయంపై అడిగితే వారు స్పందంచడం లేదు. మదార్ బీ, ఎర్రగుంట్ల -
అంతా ‘గ్యాస్’
నగదు బదిలీ పథకంలో కొన్ని సమస్యలు తలెత్తాయి. ఆధార్ సంఖ్యకు, బ్యాంకు ఖాతాలకు కొన్నిచోట్ల అనుసంధానం పూర్తి కాలేదు. వినియోగదారులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని సమీక్షిస్తున్నాం. వంట గ్యాస్ రాయితీ సిలిండర్ల పరిమితిని ఏడాదికి 9 నుంచి 12కు పెంచాం. ఆధార్‌తో సంబంధం లేకుండా వినియోగదారులు గతంలో మాదిరే రాయితీపై వంటగ్యాస్ సిలిండర్లు పొందవచ్చు. - వీరప్ప మొయిలీ, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి సాక్షి, కర్నూలు: వినియోగదారులతో కేంద్ర ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు ఆడుకుంటున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అర్ధరాత్రి నుంచే అమలు చేసే ఆయిల్ కంపెనీలు.. వంట గ్యాస్ విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నాయి. విద్యార్థుల ఉపకార వేతనాలు, పింఛన్లు, రేషన్‌కార్డులు, పట్టాదార్ పాస్ పుస్తకాలు.. ఇలా అన్ని పథకాలకు ప్రభుత్వం ఆధార్‌తో లంకె పెట్టింది. ఈ కోవలోనే ఆధార్ నెంబర్లు అందజేయని వినియోగదారులకు రాయితీ సిలెండర్లు ఇవ్వబోమని భయపెట్టడంతో గ్యాస్ ఏజెన్సీల వద్ద ప్రజలు క్యూ కట్టారు. జిల్లా మొత్తం మీద 5.04 లక్షల గ్యాస్ కనెక్షను ఉండగా దాదాపు 3 లక్షల కనెక్షన్లకు ఆధార్ అనుసంధానం పూర్తయింది. వివిధ కారణాలతో ఇప్పటికీ 2 లక్షల మంది ఆధార్ నెంబర్లు అందజేయలేకపోయారు. అయితే ప్రభుత్వం 2014 జనవరి నుంచి నగదు బదిలీని ప్రారంభించింది. దీంతో ఒక్కో వినియోగదారుడు గ్యాస్ సిలెండర్ కోసం రూ.1,235 చెల్లించాల్సి వచ్చింది. ఇలా చెల్లించిన వారి ఖాతాలో మొదట రూ.435.. ఆ తర్వాత మిగిలిన రాయితీ మొత్తం జమ అవుతుందని డీలర్లు చెబుతున్నా.. ఎప్పుడనే విషయంలో స్పష్టత కరువైంది. సిలెండర్ బుక్ చేసుకున్న నెల రోజులకు కూడా రాయితీ సొమ్ము జమ కాకపోవడంతో వినియోగదారులు తమ అవస్థలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తికమకపడుతున్నారు. ఈ దృష్ట్యా గ్యాస్ సిలెండర్లకు ఆధార్ లింకును ఉపసంహరించుకున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ పది రోజుల క్రితం ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే ఇప్పటికీ ఆదేశాలు అమల్లోకి రాకపోవడంతో వినియోగదారుల అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. ఇదే సమయంలో అధికార యంత్రాంగం ఆధార్ అనుసంధానంపై ముందుకు సాగుతోంది. జిల్లాలో ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి రాకపోవడం గందరగోళ పరిస్థితులకు కారణమవుతోంది. అసలు రాయితీ గ్యాస్ సిలెండర్లు ఏడాదికి 12 ఇస్తారా, లేదా అనే విషయంపైనా స్పష్టత కరువైంది. జిల్లా గ్యాస్ డీలర్లు మాత్రం ఆయిల్ కంపెనీల ఆదేశాలతో ఆధార్ నమోదును వేగవంతం చేస్తున్నారు. ఈ విషయంలో గ్యాస్ ఏజెన్సీలు, వినియోగదారుల మధ్య తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా అమలు చేయకపోవడం ఏమిటని ప్రజలు నిలదీస్తున్నారు. ఇందుకు డీలర్లు తమకు అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు అందలేదని సమాధానమిస్తున్నారు. ఫలితంగా ప్రజల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తర్వులు అందలేదు: కె.కన్నబాబు, జేసీ, కర్నూలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మీడియా ద్వారానే తెలుసుకున్నాం. సిలెండర్లకు ఆధార్‌తో లింకు వద్దే విషయమై స్పష్టమైన ఉత్తర్వులు ఇప్పటి వరకు అందలేదు. ఉత్తర్వులు అందిన తర్వాత గ్యాస్ ఏజెన్సీలకు విషయాన్ని తెలియజేసి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. -
గ్యాస్ ఊరట
సాక్షి, నల్లగొండ: గృహ అవసర వంటగ్యాస్‌కు గత అక్టోబర్ ఒకటో తేదీ నుంచి నగదు బదిలీ పథకం అమలులోకి వచ్చింది. ఆధార్ అనుసంధానం లేని వినియోగదారులు రీఫిల్ సిలిండర్‌ను వాస్తవ ధరకు కొనాల్సిందేనని ప్రభుత్వం నిక్కచ్చిగా పేర్కొంది. అయితే అన్ని వర్గాల ప్రజల నుంచి ఆందోళనలు వ్యక్తంకావడం, పూర్తిస్థాయిలో ఆధార్ అందకపోవడం తదితర కారణాల వల్ల గడువును డిసెంబర్ 31వ తేదీకి పొడిగించింది. అయినా ఆశించిన స్థాయిలో ఫలితం లేకపోవడంతో గడువును మరోసారి పొడిగించక తప్పలేదు. 2014 జనవరి 31వ తేదీలోగా ఆధార్‌కు బ్యాంకు ఖాతా అనుసంధానం చేసుకోవాలని సూచించింది. లేకుంటే ఆధార్ అనుసంధానం కాని వినియోగదారులు సబ్సిడీయేతర ధర రూ.1333కే రీఫిల్ సిలిండర్ కొనాల్సిందేనని తెగేసి చెప్పింది. వారికే వర్తింపు..... గ్యాస్ ఏజెన్సీతోపాటు బ్యాంక్ ఖాతాతో ఆధార్ అనుసంధానమైన వినియోగదారులకు నగదు బదిలీ పథకం (డీబీసీ) వర్తిస్తుంది. అంటే వారు వాస్తవ ధరకే రీఫిల్ కొనుగోలు చేయాలి. ఒక్కో రీఫిల్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1333. ఈ మొత్తాన్ని సిలిండర్ డెలివరీ చేసే సమయంలో ఏజెన్సీకి చెల్లిస్తే ప్రభుత్వం నుంచి అందే సబ్సిడీ రూ.843.50 ఆ వినియోగదారుడి ఖాతాలో జమవుతుంది. బ్యాంకు ఖాతాతో ఆధార్ సీడింగ్ కాకుండా మిగిలిన 4,40,619 మంది వినియోగదారులు నేరుగా సబ్సిడీ ధర రూ.446కే రెండు నెలలపాటు కొనుగోలు చేయవచ్చు. గడువు ముగిసన తర్వాత వీరికి నగదు బదిలీ పథకం వర్తిస్తుంది. రెండునెలల పాటు తప్పనున్న భారం జిల్లాలో మూడు ఆయిల్ కంపెనీల పరిధిలో 6.23 లక్షల వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. 1.82 లక్షల మంది వినియోగదారుల మాత్రమే తమ బ్యాంకు ఖాతాకు, వంటగ్యాస్ కనెక్షన్‌కు ఆధార్ సీడింగ్ చేయించుకున్నారు. వీరు ఫిబ్రవరి నుంచి మొదటగా రీఫిల్ సిలిండర్‌ను వాస్తవ ధర రూ.1333కు కొనుగోలు చేయాల్సి వచ్చేది. సిలిండర్ ధర పోను ప్రభుత్వం నుంచి అందే సబ్సిడీ వారి బ్యాంక్ ఖాతాలో జమయ్యేది. మరో 3.14 లక్షల మంది వినియోగదారులు తమ ఆధార్ కార్డు నంబర్లు కేవలం గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లకే అందాయి. వీరి బ్యాంక్ ఖాతాలకు ఆధార్ అనుసంధానం కాలేదు. వీరితోపాటు ఇప్పటికీ గ్యాస్ ఏజెన్సీలకు అసలు ఆధార్ నంబర్లు ఇవ్వని 1.26 లక్షల మంది సబ్సిడీయేతర ధరకే రీఫిల్ సిలిండర్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రెండు నెలలపాటు ఈ భారం వినియోగదారులకు తప్పనుంది. కొంత మేర ప్రయోజనం.. జిల్లాలో ఆరు లక్షలకు పైగా వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో ఏడాదిలో ఆరుకు పైగా సిలిండర్లు వాడే కుటుంబాలు 2 లక్షల వరకు ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. 9 సిలిండర్లకు పైగా వినియోగించే కుటుంబాలు మరో లక్ష వరకు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇలాంటప్పుడు గరిష్టంగా 12 సిలిండర్లకు పెంపు నిర్ణయం వీరికి కొంత మేర ప్రయోజనం కలిగించినట్టే. -
ఆధార్‌పై చేతులెత్తేసిన ప్రభుత్వం
సాక్షి, బెంగళూరు : సబ్సిడీపై వంట గ్యాస్‌ను పొందడానికి ‘ఆధార్’ విధిగా ఉండాలనే నిబంధనపై రాష్ర్ట ప్రభుత్వం ఏమీ చేయజాలదని పౌర సరఫరాల శాఖ మంత్రి దినేశ్ గుండూరావు చేతులెత్తేశారు. ఆధార్‌పై సుప్రీం కోర్టు ఆదేశాలున్నాయని, వంట గ్యాస్ సరఫరా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని చెబుతూ, ఈ విషయంలో రాష్ర్ట ప్రభుత్వ పాత్ర ఉండబోదని స్పష్టం చేశారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ సభ్యుడు రామచంద్రే గౌడ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, సబ్సిడీపై వంట గ్యాస్ పొందే విషయంలో వినియోగదారులు ఇబ్బందులు పడుతుంటే కోర్టులను ఆశ్రయించ వచ్చని సూచించారు. కర్ణాటకలోనే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఈ సమస్య ఉందన్నారు. -
రాయితీ గ్యాస్ పక్కదారి
వేంపాడులో వంట గ్యాస్ రాకెట్ యథేచ్ఛగా రాయితీ గ్యాస్ అమ్మకం వ్యాపారులతో కుమ్మక్కయిన ఏజెన్సీలు విడిపించుకోని సిలెండర్లతో వ్యాపారం నాలుగు నెలల్లో 55 సిలెండర్ల స్వాధీనం రాయితీ గ్యాస్ సిలెండర్లు పక్కదారి పడుతున్నాయి. వ్యాపారులకు కాసులు కురిపిస్తున్నాయి. ఏటా నాలుగుకు మించి విడిపించని వారి సిలెండర్లు అధిక ధరకు అమ్ముడవుతున్నాయి. భారీగా సాగుతున్న ఈ వ్యవహారం వెనక గ్యాస్ ఏజెన్సీలు కూడా ఉన్నాయి. వేంపాడు కేంద్రంగా ఈ వ్యాపారం యథేచ్ఛగా సాగిపోతోంది. పౌర సరఫరాల శాఖ మొద్దు నిద్రలో జోగుతోంది. నక్కపల్లి, న్యూస్‌లైన్ : వేంపాడు కేంద్రంగా అక్రమ గ్యాస్ సిలెండర్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. తూర్పుగోదావ రి జిల్లా గొల్లప్రోలు, చేబ్రోలు తదితర ప్రాంతాలకు చెందిన కొందరు వ్యాపారులు, స్థానికులు, గ్యాస్‌ఏజెన్సీ నిర్వాహకులతో కుమ్మక్కయి గ్యాస్ సిలెండర్లను, రాయితీ గ్యాస్‌ను పక్కదారి పట్టించి అధిక ధరలకు విక్రయించి రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. ఒక్కొక్క సిలెండర్‌పై రూ.800 నుంచి రూ.1000 లాభం వస్తోంది. కాసులు కురిపిస్తున్న రాయితీ గ్యాస్ నాలుగు నెలల్లో హెచ్‌పీ, బారత్ గ్యాస్ కంపెనీలకు చెందిన 55 సిలెండర్లు వేంపాడు కూడలిలో పోలీసులకు పట్టుబడ్డాయి. ఈ వ్యాపారానికి సమీప గ్యాస్ ఏజెన్సీల సహకారం ఉందన్న ఆరోపణలున్నాయి. వినియోగదారులకు ప్రస్తుతం ఏటా 9 సిలెండర్లను రాయితీపై సరఫరా చేస్తున్నారు. చాలామంది దీపం లబ్దిదారులు ఏడాదికి నాలుగు సిలెండర్లకు మించి విడిపించుకోకపోవడం ఏజెన్సీలకు కాసులు కురిపిస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి ఖాళీ సిలెండర్లను తీసుకొచ్చి జాతీయరహదారిని ఆనుకుని వేంపాడు సమీప ప్రాంతాల్లోని తోటలు, మారుమూల ప్రాంతాల్లో ఉంచుతున్నారు. ఈ వ్యాపారానికి వేంపాడు, ఉద్దండపురం గ్రామాలకు చెందిన కొందరి సహకారం ఉంది. డోర్ డెలివరీ పేరుతో ఏజెన్సీ నిర్వాహకులు కూడా తమ వాహనాల్లో నిండు సిలెండర్లను ఈ వ్యాపారం జరిగే స్థావరాలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యాపారం ఇటీవల నక్కపల్లి పోలీసుల కంటపడింది. నాలుగు నెలల క్రితం ఎస్ఐ రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో పోలీసులు వేంపాడు కొత్తురు వద్ద 42 గ్యాస్ సిలెండర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటికి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అక్రమమని గుర్తించి కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసారు. వీరిలో ఒకరు స్థానికుడు కాగా మరొకరు తునికి చెందిన వ్యాపారి. తాజాగా ఈనెల13వ తేదీన ఇదే వేంపాడు కూడలిలో ఆటోలో తీసుకొస్తున్న 14 ఖాళీ సిలెండర్లను స్వాధీనం చేసుకున్నారు. కిరాణా వ్యాపారుల హస్తం వేంపాడుతోపాటు నక్కపల్లిలో కూడా పలువురు కిరాణా వ్యాపారులు అక్రమంగా సిలండర్లను నిల్వ ఉంచి ఏజెన్సీలతో కుమ్మక్కయి గ్యాస్ విడిపించి రూ.1200 నుంచి రూ.1500కి విక్రయిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పౌర సరఫరాల శాఖ అధికారుల కంటపడకపోవడం ఆశ్చర్యకరం. ఈ నెల 13వ తేదీన పట్టుబడ్డ సిలెండర్లను పోలీసులు పౌర సరఫరాల శాఖాధికారులకు అప్పగించడంతో వాటిని తీసుకొచ్చిన వాహనం, వ్యక్తులపై 6-ఏ కేసు నమోదు చేశారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు దృష్టి సారించి గ్యాస్ సిలెండర్ల రాకెట్ గుట్టు రట్టు చేయాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు. -
ఇక సమ్మెటే
నేటి నుంచి ఇతర లారీలూ బంద్ సమ్మెలో పెట్రోలు ట్యాంకర్లు, వంట గ్యాస్ రవాణా లారీలు టెంపోల యజమానులు కూడా అదే బాట ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే లారీలూ బంద్ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర వ్యాప్తంగా శనివారం అర్ధ రాత్రి నుంచి లారీల సమ్మె ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ ఇసుక విధానానికి నిరసనగా ఇసుక లారీల యజమానులు గత మూడు వారాలుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. వారికి మద్దతుగా ఇతర లారీల యజమానులు కూడా సమ్మె బాట పట్టారు. తద్వారా సరుకు, వాణిజ్య రవాణా వాహనాల రాకపోకలు నిలిచి పోనున్నాయి. పెట్రోలు ట్యాంకర్లు, వంట గ్యాస్ సిలిండర్లను రవాణా చేసే లారీలు కూడా సమ్మెలో పాల్గొంటున్నాయి. మరో వైపు తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్రంలోని టెంపోల యజమానులు కూడా సమ్మె బాట పట్టారు. మొత్తం నాలుగు లక్షల టెంపోలు ఇక రోడ్డెక్కవు. డ్రైవర్లకు కనీస విద్యార్హత ఎనిమిదో తరగతి అంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆదేశాలను ఉటంకిస్తోందని సరుకు రవాణా ట్రక్కు సంఘాల సమాఖ్య ఒక ప్రకటనలో తెలిపింది. డ్రైవింగ్ లెసైన్స్ రెన్యువల్ సమయంలో పదో తరగతి మార్కుల జాబితా చూపించాలంటూ బలవంత పెడుతున్నారని ఆరోపించింది. దీని వల్ల లక్షా 70 వేల మంది డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. డీజిల్ ధర దేశంలోనే కర్ణాటకలో ఎక్కువని తెలిపింది. పట్టణాలు, నగరాల్లో ట్రక్ టెర్మినళ్లు నిర్మించాలని, టెంపో డ్రైవర్లపై పోలీసులు, ఆర్టీవో అధికారుల వేధింపులను ఆపించాలని డిమాండ్ చేసింది. అన్నిటికీ కట కట సరుకు రవాణా లారీలు, టెంపోలు సమ్మెలో పాల్గొంటున్నందున పెట్రోలు, వంట గ్యాస్, నిత్యావసర సరుకుల వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పాలు, దిన పత్రికలు, మందులు, కూరగాయలను రవాణా చేసే వాహనాలను సమ్మె నుంచి మినహాయించారు. రోజూ ఇతర రాష్ట్రాల నుంచి 40 వేలకు పైగా లారీలు రాష్ట్రంలో ప్రవేశిస్తాయి. ఆ లారీల యజమానులు కూడా సమ్మెకు సంఘీభావం ప్రకటించినందున రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభావం ఉంటుం దనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఐటీ, బీటీ కంపెనీలు బాడుగకు తీసుకున్న వాహనాలు కూడా సమ్మెలో పాల్గొంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను సమ్మతించే వరకు సమ్మె విరమించేది లేదని రాష్ట్ర లారీల యజమానుల సంఘం అధ్యక్షుడు షణ్ముగప్ప తెలిపారు. ఇసుక లారీలు సహా మొత్తం లక్ష వాహనాలు సమ్మెలో పాల్గొంటున్నాయని వెల్లడించారు. -
వంట గ్యాస్ ధరలు తగ్గించాల్సిందే
ఆదోని టౌన్, న్యూస్‌లైన్: పెంచిన వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఆదోనిలో నిరసన చేపట్టారు. రోడ్డుపైనే వంట చేసి విద్యార్థులకు భోజనాలు వడ్డించారు. పార్టీ నియోజకవర్గ నాయకుడు సాయిప్రసాద్‌రెడ్డి నేతృత్వంలో మహిళా విభాగం జిల్లా నాయకురాళ్లు వినూత్న నిరసన చేపట్టారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి కట్టెలు, కుండలను నెత్తిన పెట్టుకొని పురవీధుల్లో ర్యాలీ చేశారు. భీమాస్ సర్కిల్ చేరుకొని రోడ్డుపై వంటావార్పు నిర్వహించారు. వైఎస్సార్సీపీ బీసీ సెల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ మధుసూదన్, పట్టణ కన్వీనర్ చంద్రకాంత్‌రెడ్డి, మహిళా విభాగం నాయకురాళ్లు శ్రీదేవి, జిలేఖ మాట్లాడారు. నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఆరోపించారు. వంటగ్యాస్‌పై పెరిగిన భారాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ జిల్లా అడహక్ కమిటీ సభ్యులు ప్రసాదరావు, మునిస్వామి, అబ్దుల్ ఖాదర్, మండల కన్వీనర్ విశ్వనాథ్ గౌడ్, యువజన సంఘం నాయకులు వెంకటేశ్వరరెడ్డి, నగరూరు చంద్రశేఖర్ రెడ్డి, బుద్దారెడ్డి, సన్ని, ఫయాజ్ అహ్మద్, సాయిరామ్, చిన్న ఈరన్న, అక్బర్, మైనార్టీ నాయకులు ఎజాజ్, చాంద్‌బాషా, నజీర్ అహ్మద్, బ్రహ్మయ్య, సత్య, సుధాకర్, ఈరన్న, తిమ్మప్ప, నరసింహులు, వేణు, మునిస్వామి, పట్టణ మహిళలు ఈరమ్మ, నరసమ్మ, అన్నపూర్ణమ్మ, రేణుకా, సుజాత, లక్ష్మి పాల్గొన్నారు. -
గ్యాస్ ధర పెంపు.. నాన్ సబ్సిడీ సిలిండర్ 1327!!
-
గ్యాస్ ధర పెంపు.. నాన్ సబ్సిడీ సిలిండర్ 1327!!
సామాన్యుడిపై మరోసారి 'బండ' పడింది. గ్యాస్ ధర మరింత పెరిగింది. నాన్ సబ్సిడీ సిలిండర్ల ధరను ప్రభుత్వం ఒక్కసారిగా పెంచేసింది. అంటే, ఏడాదికి తొమ్మిది సిలిండర్లు దాటితే జేబుకు భారీ చిల్లు పడటం ఖాయమన్న మాట. పదో సిలిండర్ నుంచి ఒక్కోటీ రూ. 1327.50 పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ ధర కేవలం 1112.50 రూపాయలు మాత్రమే ఉండేది. ఒక్కసారిగా నాన్ సబ్సిడీ సిలిండర్ ధరలను 215 రూపాయలు పెంచేశారు. దీంతోపాటు సబ్సిడీ సిలెండర్ ధరను కూడా స్వల్పంగా పెంచారు. రాయితీ పోను హైదరాబాద్‌లో రూ.441కు సిలెండర్ ధర చేరుకుంది. ఇది ఇప్పటివరకు రూ. 411.50 గా ఉండేది. అంటే, సబ్సిడీ సిలిండర్ల ధర ఒక్కోటీ రూ. 30 వంతున పెరిగిందన్నమాట. ప్రస్తుతం వంట గ్యాస్ సిలిండర్‌పై ప్రభుత్వం రూ. 843 వరకు సబ్సిడీ ఇస్తుండగా, ఆ సబ్సిడీ ప్రభుత్వం నుంచి కంపెనీలకు చేరట్లేదని, అందుకే సబ్సిడీ సిలిండర్ ధర కూడా పెరిగిందని అంటున్నారు. -
అంతా గ్యాసే!
= సిలిండర్ సరఫరా చేశామంటూ ఎస్ఎంఎస్లు = అదిగో ఇదిగో అంటూ ఊరడింపులు = పక్షం రోజులు గడచినాఅందని సిలిండర్ = చమురు కంపెనీలదే జాప్యమంటున్న డిస్ట్రిబ్యూటర్లు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంతో పాటు నగరంలో వంట గ్యాస్ కోసం వినియోగదారులు పడిగాపులు పడుతున్నారు. నగరంలో బుక్ చేసిన మూడు వారాలకు కానీ సిలిండర్ అందడం లేదు. బుకింగ్, సరఫరాకు సంబంధించి ఎస్ఎంఎస్ల ద్వారా వినియోగదారులకు సమాచారం అందుతోంది. ‘మీకు సిలిండర్‌ను సరఫరా చేశాం’ అని ఎస్ఎంఎస్ వ చ్చి 15 రోజులు గడుస్తున్నా వినియోగదారులకు అందడం లేదు. దీనిపై ఏజెన్సీల్లో ఫోన్ ద్వారా వాకబు చేస్తే ‘ఇదిగో పంపుతున్నాం’ అని సమాధానమైతే వస్తుంది కానీ సిలిండర్ ఆచూకీ మాత్రం లేదు. దాదాపు నెల రోజులుగా చమురు కంపెనీలు సిలిండర్ల సరఫరాలో చాలా జాప్యం చేస్తున్నాయి. దీని వల్లే బుక్ చేసిన 20 నుంచి 25 రోజులకు కానీ వినియోగదారులకు అందడం లేదని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. దీనికి తోడు నగదు బదిలీకి సంబంధించి చమురు కంపెనీలు డేటాను అప్డేట్ చేసే క్రమంలో ఈ నెలలో డీలర్లు కొద్ది రోజుల పాటు కార్యకలాపాలను ఆపేశారు. కొన్ని చమురు కంపెనీలు మాత్రం సిలిండర్ల సరఫరాలో జాప్యం జరగడం లేదని చెబుతున్నాయి. శీతాకాలం, కస్టమర్ల సంఖ్య పెరిగినందున ‘వేచి ఉండాల్సిన కాలం’ పది రోజులకు పెరిగిందని తెలిపాయి. చమురు కంపెనీలకు రాష్ట్రంలో 90 లక్షల మంది కస్టమర్లు ఉండగా, ఒక్క బెంగళూరులోనే 30 లక్షల మంది ఉన్నారు. -
ఆధార్ నిర్బంధం కాదు
= వంట గ్యాస్‌కు లింక్‌పై మొయిలీ = సుప్రీం కోర్టు ఆదేశాన్ని పాటించాల్సిందే = ఆధార్ సంఖ్యను గ్యాస్ ఏజెన్సీలు, బ్యాంకులకు ఇస్తే మంచిదే = బోగస్ కనెక్షన్లను నివారించవచ్చు = అమలు కాని మంత్రి, ‘సుప్రీం’ ఆదేశాలు‘ = ‘ఆధార్’ ఇవ్వాల్సిందేనంటూ ఏజెన్సీల నుంచి మెసేజ్‌లు = సిలిండర్ల సరఫరాలో అసాధారణ జాప్యం.. వినియోగదారుల్లో అసహనం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : విశిష్ట గుర్తింపు సంఖ్య (ఆధార్) లేదనే సాకుతో గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులకు వంట గ్యాస్‌ను నిరాకరించడానికి వీల్లేదని పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. ఇక్కడి జ్ఞాన జ్యోతి ఆడిటోరియంలో శనివారం ఏర్పాటు చేసిన అఖిల భారత 66వ వాణిజ్య సమ్మేళనంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ సబ్సిడీలను పొందడానికి ఆధార్‌ను నిర్బంధం చేయరాదని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో వంట గ్యాస్‌కు కూడా ఆ నిబంధన ఉండబోదని తేల్చి చెప్పారు. అయితే ఆధార్ సంఖ్యను గ్యాస్ ఏజెన్సీలు, బ్యాంకులకు అందజేస్తే వినియోగదారులకే అనుకూలమని పేర్కొన్నారు. దేశంలో 14 కోట్ల వంట గ్యాస్ కనెక్షన్లు ఉంటే మూడు కోట్లు నకిలీవనే అంచనాలున్నాయని వెల్లడించారు. ఆధార్ సంఖ్య వల్ల ఇలాంటి బోగస్ కనెక్షన్లను నివారించవచ్చని సూచించారు. తద్వారా వంట గ్యాస్ ధర కూడా తగ్గే అవకాశాలున్నాయని చెప్పారు. ఆధార్ లేకపోతే సిలిండర్లను ఇచ్చేది లేదంటూ గ్యాస్ ఏజెన్సీలు మొండికేస్తున్న విషయాన్ని ఆయనృదష్టికి తీసుకెళ్లినప్పుడు, దానిని సమర్పించాలని కోరవచ్చునే కానీ బలవంత పెట్టరాదని అన్నారు. ఉత్తుత్తి మాటలే... వంట గ్యాస్‌కు ఆధార్‌ను లంకె పెట్టిన విషయంలో మంత్రి డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితి వేరుగా ఉంది. గతంలో గ్యాస్ కోసం ఎస్ఎంఎస్ చేస్తే క్షణాల్లో రిజిస్ట్రేషన్ నంబరు వచ్చేది. ఇప్పుడు ‘ఇన్వాలిడ్ కీవర్డ్’ అంటూ ప్రత్యుత్తరం వస్తోంది. ఫోన్ ద్వారా బుక్ చేసుకుంటున్నా, ‘సబ్సిడీ పొందడానికి ఆధార్ నంబరును మీ డిస్ట్రిబ్యూటర్, బ్యాంకులకు ఇవ్వండి’ అని వెంటనే మెసేజ్ వస్తోంది. మార్చి ఒకటో తేదీ లోగా నగరంలో ఆధార్ సంఖ్యను బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయకపోతే మార్కెట్ ధరకే సిలిండర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గ్యాస్ ఏజెన్సీలు సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించే రీతిలో వ్యవహరిస్తున్నా, కేంద్ర ప్రభుత్వం మిన్నకుండి పోతోంది. ఏజెన్సీల చర్య కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని పలువురు వినియోగదారులు నొక్కి చెబుతున్నా, చెవిటి వాని ముందు శంఖం ఊదిన చందాన తయారైంది. మరో వైపు ఆధార్ సంఖ్యను అనుసంధానం చేసే ప్రక్రియలో తలమునకలుగా ఉన్న ఏజెన్సీలు సిలిండర్ల సరఫరాలో అసాధారణ జాప్యాన్ని ప్రదర్శిస్తూ, వినియోగదారుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. -
గుది‘బండ’
వరంగల్, న్యూస్‌లైన్ వంట గ్యాస్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చారుు. చమురు సంస్థలు ఒక్కసారిగా తమ ప్రతాపం చూపించారుు. ఒక్కో సిలిండర్‌పై ఏకంగా రూ.66.50 వడ్డించారుు. ప్రత్యక్ష లబ్ధి బదిలీ (డీబీటీ) ప్రారంభమైనప్పటి నుంచి మధ్యలో ఒకటి, రెండు నెలలు తప్ప... ప్రతి నెలా సిలిండర్ ధర పెరుగుతూనే ఉంది. డీబీటీ అమలు ప్రారంభంలో రూ.854.50 ఉన్న సిలిండర్ మార్కెట్ ధర ప్రస్తుతం రూ.1104.50కు పెరిగింది. తగ్గినట్టే తగ్గిన వంట గ్యాస్ ధర.. ఒక్కసారిగా పెరగడంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. ఆధార్ గజిబిజి ఆధార్ అనుసంధానం నేపథ్యంలో గ్యాస్ ధర గజిబిజిగా మారింది. ఆధార్‌తో లింక్ చేసుకున్నవారి ఖాతాలో ప్రభుత్వం ఒక్కో సిలిండర్‌కు ఇస్తున్న సబ్సిడీ రూ.21.50 జమచేయకపోవడం... ఆధార్‌తో లింక్ కానివారికి అవి జమ అవుతుండడంతో ధరల్లో వ్యత్యాసం నెలకొంది. ఆధార్ అనుసంధామైన వారికి ఒక్కో సిలిండర్‌కు రూ. 88 చొప్పున ... ఆధార్ అనుసంధానం కాని వారికి రూ.66.50 భారం పడుతోంది. ఆధార్ అనుసంధానమైతే... జిల్లాలో మొత్తం 5,48,997 మంది గ్యాస్ వినియోగదారులు ఉండగా... ఆధార్‌తో అనుసంధానమైన వారు 3,10,660 మంది ఉన్నా రు. ఈ లెక్కన ఒక్కో సిలిండర్‌పై చమురు సంస్థలు తాజాగా వడ్డించిన మొత్తం రూ. 2,06,58,890. ప్రభుత్వం ఎగ్గొడుతున్న సబ్సి డీ సుమారు రూ.66,79,190. అంటే అదనపు భారం పడుతున్న మొత్తం రూ.2,73,38,080. ఆధార్ అనుసంధానం కాని వారికి... ఆధార్‌తో లింక్ లేని వారికి ఒక్కో సిలిండర్‌పై ప్రభుత్వం తాజాగా పెంచిన రూ.66.50 మాత్రమే పడుతోంది. ఈ లెక్కన 2,38,337 మందిపై రూ.1,58,49,410.50 భారం పడుతున్నట్లు అంచనా. తాజాలెక్కల ప్రకారం... పెరిగిన ధర ప్రకారం ఒక్కో సిలిండర్‌కు రూ.1104.50 పలుకుతోంది. ఆధార్ ఉన్న వినియోగదారుడి ఖాతాలో ప్రభుత్వం రూ.603 జమచేస్తోంది. మిగిలిన రూ.501.50లను వినియోగదారుడు చెల్లిస్తున్నాడు. అదే.. ఆధార్ లేని వ్యక్తి రూ.482 మాత్రమే చెల్లిస్తున్నారు. నెలలవారీగా.... సెప్టెంబర్ : ఈ నెలలో ఒక్క సిలిండర్ ధర రూ. 1,000కి చేరింది. వినియోగదారుడి ఖాతాలో ప్రభుత్వం రూ. 587 జమ చేయూల్సి ఉండగా... రూ. 534.50 మాత్రమే చేసింది. లెక్కప్రకారం వినియోగదారుడు సిలిండర్‌కు రూ.413.50 చెల్లించాలి. కానీ.. సర్కారు జమచేయకుండా ఉన్న రూ.52.50లతో కలుపుకుని మొత్తం రూ.466లను గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారుడి నుంచి వసూలు చేశారుు. అక్టోబర్ : సిలిండర్ ధర కాస్తా రూ.1,090 చేరింది. ఈ లెక్క న ప్రభుత్వం వినియోగదారుడి ఖాతాలో రూ.676.5 జమచే యూలి. కానీ రూ.603 మాత్రమే జమచేసింది. ఈ మేరకు ఒక్కోసిలిండర్‌పై వినియోగదారుడికి 73.5భారం పడిం ది. నవంబర్ : ఒక్కో గ్యాస్ సిలిండర్‌పై రూ.52 తగ్గగా... ధర రూ.1,038కు చేరింది. ఈ లెక్కన ప్రభుత్వం రూ.624.5లను వినియోగదారుడి ఖాతాల్లో జమ చేయూలి. కానీ రూ. 551 మాత్రమే జమ చేసింది. ఈ మేరకు ఒక్కో సిలిండర్‌పై రూ.73.5 మేర భారం పడింది. -
వంట గ్యాస్‌కు నగదు బదిలీ పథకం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : వంట గ్యాస్‌కు నగదు బదిలీ పథకం నగరంతో పాటు పలు జిల్లాల్లో ప్రారంభమైంది. బ్యాంకు ఖాతాతో ఆధార్ సంఖ్యను అనుసంధానం చేసిన వారికి ఇకమీదట సబ్సిడీ మొత్తాన్ని ఆయా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. అంటే... ఇక వంట గ్యాస్‌ను బుక్ చేసిన వినియోగదారులు మార్కెట్ ధరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వారం తర్వాత సబ్సిడీ మొత్తం బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. ఆధార్ సంఖ్యను బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేయని వినియోగదారులకు చమురు కంపెనీలు మూడు నెలలు గడువునిచ్చాయి. అప్పటి వరకు సబ్సిడీ ధరపైనే సిలిండర్లను సరఫరా చేస్తారు. వచ్చే ఏడాది మార్చి ఒకటో తేదీలోగా అనుసంధాన ప్రక్రియను పూర్తి చేయకపోతే మార్కెట్ ధరకే సిలిండర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆధార్ లేకపోతే... వంట గ్యాస్ వినియోగదారులు ఆధార్ సంఖ్యను బ్యాంకు ఖాతా, వంట గ్యాస్ ఏజెన్సీల వద్ద అనుసంధానం చేయిస్తే అత్యుత్తమం. గ్యాస్ ఏజెన్సీ, బ్యాంకుల వద్దకెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. దీని కోసం బ్యాంకు, గ్యాస్ ఏజెన్సీలకు ప్రత్యేక అర్జీలను పూర్తి చేసి సమర్పిస్తే సరిపోతుంది. ఆధార్ కార్డు నకళ్లను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు ఇంకా లభించని వారు బెంగళూరు వన్ కేంద్రాలకు వెళ్లి ఈ-ఆధార్ సంఖ్యను పొందవచ్చు. ఆధార్ నమోదు కేంద్రాల్లో ఇచ్చిన రసీదుల నకళ్లను సమర్పించినా సరిపోతుంది. కాగా గ్యాస్ వినియోగదారులకు పలు బ్యాంకుల్లో ఖాతాలున్నప్పటికీ, ఏదైనా ఒక బ్యాంకు వద్దే ఆధార్ అనుసంధానం చేయించాలని అధికారులు సూచిస్తున్నారు. తమకు ఖాతాలున్న అన్ని బ్యాంకులతో అనుసంధానం చేస్తే భవిష్యత్తులో అనేక ఇబ్బందులు తలెత్తడమే కాకుం డా సబ్సిడీ లభించకపోయే ప్రమాదం కూడా ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ నెల ఒకటి నుంచి... బెంగళూరు సహా హావేరి, కొప్పళ, బీదర్, దావణగెరె, బిజాపురలలో ఈ నెల ఒకటో తేదీ నుంచి నగదు బదిలీ పథకం అమలులోకి వచ్చింది. ఇదివరకే మైసూరు, తుమకూరు, ధార్వాడ, ఉడిపి, ఉత్తర కన్నడ, గదగ జిల్లాల్లో ఈ పథకం అమలులో ఉంది. మిగిలిన 18 జిల్లాల్లో వచ్చే జనవరి ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తుంది. 70 శాతం మందికి ఆధార్ 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా ఆరు కోట్లా 11 లక్షలా 30 వేలా 704 మంది కాగా నాలుగు కోట్లా 30 లక్షలా ఏడు వేలా 539 మంది ఆధార్ పరిధిలోకి వచ్చారు. వీరిలో మూడు కోట్లా 44 లక్షలా 15 వేలా 581 మందికి ఆధార్ కార్డులు కూడా అందాయి. బెంగళూరులో 77 లక్షలా తొమ్మిది వేలా 78 మంది ఆధార్ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోగా, ఇప్పటి వరకు 57 లక్షలా 19 వేలా 319 మందికి ఆధార్ సంఖ్య లభించింది. -
‘గ్యాస్’ దోపిడీ
తూకంలో చేతివాటం = ఆయిల్ కంపెనీల మాయాజాలం = బాట్లింగ్ యూనిట్లలోనే మోసపు తంతు =తక్కువ గ్యాస్ నింపి వినియోగదారులకు పంపిణీ = నెలకు రూ.18 కోట్ల మేరకు టోకరా సాక్షి, సిటీబ్యూరో: విజయనగర్‌కాలనీకి చెందిన గృహిణి అనురాధ ఆన్లైన్లో సిలిండర్ బుక్ చేసిన వారానికి గ్యాస్‌బండ వచ్చింది. ముగ్గురు సభ్యుల కుటుంబం.. కానీ 20 రోజులకే గ్యాస్ నిండుకొంది. మరో సిలిండర్ బుక్ చేస్తే, అదీ వచ్చిన 17 రోజులకే ఖాళీ అయింది. మూడోసారి అనుమానం వచ్చి సిలిండర్ ఇంటికి రాగానే తూకం వేశారు. ఉండాల్సిన బరువులో 1.30 కిలోల వరకు తక్కువున్నట్టు తేలింది. అనురాధే కాదు.. మహానగరంలో లక్షలాది మంది ఎల్పీజీ వినియోగదారులు నిత్యం ఇలాగే మోసపోతున్నారు. మహానగరంలో వంటగ్యాస్ వినియోగదారులు నిట్టనిలువునా దోపిడీకి గురవుతున్నారు. నగదు బదిలీ పథకం పుణ్యమా అని ఇప్పటికే గ్యాస్‌బండ ధర చుక్కలు చూపిస్తోంది. ఇక, సిలిండర్‌లో సైతం తక్కువ గ్యాస్ నింపడం తాజా షాక్. సిలిండర్‌లో నిర్ధేశిత బరువు కంటే తక్కువ పరిమాణంలో లిక్విడ్ పెట్రోలి యం గ్యాస్ (ఎల్పీజీ) నింపుతూ సరఫరా చేయడం సర్వసాధారణమైంది. ప్రతి గృహవినియోగ సిలిండర్‌లో కిలో నుంచి రెండు కిలోల వరకు, కమర్షియల్ సిలిండర్‌లో 2-3 కిలోల వరకు తక్కువ గ్యాస్ నింపుతూ పంపిణీ చేస్తున్నారు. ఆయిల్ కంపెనీల ఎల్పీజీ బాట్లింగ్ యూనిట్ల నుంచే ఇలా తక్కువ తూకంతో రీఫిల్లింగ్ జరుగుతున్నట్లు ఇటీవల తూని కల కొలతల శాఖ నిర్వహించిన తనిఖీల్లో వెలుగు చూసింది. తక్కువ తూకం వుంటే.. గ్యాస్ ఏజెన్సీ.. ఎల్పీజీ సిలిండర్‌ను బరువు తూచే యంత్రం ద్వారా తూకం వేసి వినియోగదారులకు అందించాలి. వినియోగదారుడు కూడా సిలిండర్‌ను తూకం వేసి తీసుకోవాలి. గృహవినియోగ సిలిండర్ మొత్తం బరువు సుమారు 29.9 కిలోలు ఉంటుంది. అందులో 15.7 కేజీలు సిలిండర్, 14.2 కేజీల వరకు గ్యాస్ బరువు ఉండాలి. సిలిండర్‌ను వేయింగ్ మెషీన్‌పై తూకం వేస్తే మొత్తం బరువు 29.9 కేజీల వరకు ఉండాలి. దీనికంటే తక్కువుంటే మాత్రం తూకంలో మోసం జరిగినట్లు భావించాలి. తక్షణం తూనికల కొలతల శాఖకు ఫిర్యాదు చేయాలి. వాణిజ్య అవసరాల సిలిండర్ పరిమాణం 19 కేజీల మేర ఉండాలి. గ్రేటర్లో 63 కేసులు నమోదు గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో తూనికల కొలతల శాఖాధికారులు ఇటీవల 63 వరకు కేసులు నమోదు చేశారు. గృహవినియోగ సిలిండర్‌లో 585 గ్రాముల నుంచి 1.09 కిలోల వరకు, కమర్షియల్ సిలిండర్‌లో 1.6 కిలోల నుంచి 2.9 కిలోల వరకు తక్కువగా రీఫిల్లింగ్ చేసి మోసం చేస్తున్న కారణంగా ప్రధాన మూడు ఆయిల్ కంపెనీలతో పాటు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లపై కేసులు నమోదు చేశారు. ఇటీవల చర్లపల్లిలోని ఐవోసీ ఎల్పీజీ బాట్లింగ్ యూనిట్లో తూనికల కొలతల శాఖాధికారులు తనిఖీలు చేసి ఒక డొమెస్టిక్ సిలిండర్ బరువును పరిశీలించారు. నిర్ధేశిత బరువు కంటే తక్కువ తూగింది. దీంతో సదరు కంపెనీపై కేసు నమోదు చేశారు. ఇలా మూడు కంపెనీలపైనా కేసులు నమోదయ్యాయి. తేడాలుంటే ఫిర్యాదు చేయండి ఎల్పీజీ సిలిండర్‌లో గ్యాస్ తక్కువగా ఉంటే ఫిర్యాదు చేయవచ్చు. వినియోగదారులు గ్యాస్ సిలిండర్‌ను తూకం వేశాకే తీసుకోవాలి. సిలిండర్ బరువును తీసేసి గ్యాస్ బరువును లెక్కించాలి. తక్కువగా ఉంటే తిరస్కరించాలి. - పీఆర్ఎన్టీ స్వామీ, ప్రాంతీయ ఉప కంట్రోలర్, తూనికలు, కొలతల శాఖ, హైదరాబాద్ గ్యాస్ దోపీడీ నెలకు రూ.18 కోట్ల పైమాటే.. గ్రేటర్లో మొత్తం ఎల్పీజీ గృహవినియోగ కనెక్షన్లు: 26 లక్షలు నిత్యం ఐవోసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ కంపెనీల రీఫిల్లింగ్ సిలిండర్ల సరఫరా: 80 వేలు గృహావసరాల సిలిండర్ పరిమాణం:14.2 కేజీలు మార్కెట్ ధర ప్రకారం కిలో గ్యాస్ విలువ:రూ.75 గృహవినియోగ సిలిండర్ల తూకంలో సగటున తక్కువ ఉంటున్న పరిమాణం: 1- 2 కేజీలు 80 వేల సిలిండర్లపై రోజుకు వినియోగదారులు నష్టపోతున్న గ్యాస్ విలువ: రూ.60 లక్షలు ఆయిల్ కంపెనీలు నెలకు వేస్తున్న టోకరా విలువ: రూ.18 కోట్లు. -
నవ్వులపాలు!
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: వంటగ్యాస్‌ను కొనుగోలు చేయాలంటేనే విని యోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. సబ్సిడీ లే కుండా వంటగ్యాస్ సిలిండర్‌కు ఇక నుంచి రూ.1060 చె ల్లిస్తే నగదు బదిలీ కింద ప్రభుత్వం సబ్సిడీ రూపంలో రూ.625 వినియోగదారుని బ్యాంకు ఖాతాలో జమచేస్తుం దని అధికారులు ఊదరగొట్టారు. తీరా బ్యాంకుకు వెళ్లి సబ్సిడీ జమకాకపోవడం చూసి దిక్కుతోచనిస్థితిలో పడ్డారు. ఈనెల 1వ తేదీ నుంచి జిల్లాలో గ్యాస్ సిలిండర్ కు నగదు బదిలీ పథకం అమలయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆధార్‌కార్డులు జత చేసి ఇచ్చిన వినియోగదారులు సిలిండర్ కోసం గ్యాస్ ఏజెన్సీల వద్ద బుక్ చేసుకున్న 24 గంట ల్లోపు సబ్సిడీ మొత్తాన్ని రూ.625 బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని కూడా చెప్పారు. జిల్లాలో 4,32,713 మంది వినియోగదారులు హెచ్‌పీ, భారత్, ఇండే న్ గ్యాస్‌ను వాడుతున్నారు. ఇప్పటివరకు 15,210 మంది వినియోగదారులు గ్యాస్ కోసం బుక్‌చేసుకుని సిలిండర్లు తీసుకుని ఐదు రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్క వినియోగదారునికి కూడా బ్యాంకు ఖాతాలో సబ్సిడీ మొత్తం జమకాలేదు. జిల్లాలో గ్యాస్ వినియోగదారులు 1,73,512 మంది హెచ్‌పీ గ్యాస్ వినియోగదారుల్లో 9238 మంది ఆధార్ కార్డులు సమర్పించారు. వీరిలో 4500 మంది గ్యాస్ కోసం బుక్ చేసుకుని రూ.1060 నగదు చెల్లించి సిలిండర్లు తీసుకున్నా సబ్సిడీ మొత్తం మాత్రం ఇవ్వలేదు. 1,40,164 మంది భారత్ గ్యాస్ వినియోగదారులు ఉండగా వీరిలో ఇప్పటివరకు 16,427 మంది ఆధార్ కార్డుకు సంబంధించిన ధ్రువపత్రాలను ఏజెన్సీల నిర్వాహకులకు ఇచ్చారు. వీరిలో 9,560 మంది గ్యాస్‌కోసం బుక్ చేసుకుని సిలిండర్లు తీసుకున్నా ఒక్కరికి కూడా నగదు బదిలీ పథకం వర్తించలేదు. జిల్లాలో 1,19,037 మంది ఇండేన్ గ్యాస్ వినియోగదారులు ఉండగా ఇప్పటివరకు 4,226 మంది ఆధార్ కార్డులు ఇచ్చారు. వీరిలో 1,150 మంది గ్యాస్ కోసం బుకింగ్ చేసుకుని గ్యాస్ తీసుకున్నా ఏ ఒక్కరికి కూడా సబ్సిడీ మొత్తం వారి బ్యాంక్ ఖాతాల్లో జమకాలేదు. వినియోగదారుల్లో అయోమయం నగదు బదిలీ పథకం అమలు గురించి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరచకపోవడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. సబ్సిడీ మొత్తం ఎప్పుడొస్తుందోనని వినియోగదారులు ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. నగదు బదిలీ పథకం కింద ప్రభుత్వ సబ్సిడీ అటుంచింతే జిల్లాలో ఉన్న 4,32,713 మంది గ్యాస్ వినియోగదారులపై రూ.3.36కోట్ల భారం పడనుంది. ఏడాదికి తొమ్మిది సిలిండర్ల వరకు సబ్సిడీ ఇస్తామని ఆ తర్వాత వినియోగదారుడు ఎన్ని సిలిండర్లు వాడినా సబ్సిడీ వర్తించదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నగదు బదిలీ పథకం అమల్లోకి వచ్చి ఐదు రోజులు గడిచినా ఏ ఒక్క వినియోగదారునికి కూడా సబ్సిడీ మొత్తం అకౌంట్లో జమ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై గ్యాస్ ఏజెన్సీలను అడిగితే తమకు ఏమాత్రం సంబంధం లేదని ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెబుతున్నారు. -
వంట గ్యాస్ ధరల తగ్గింపు
దీపావళి సందర్భంగా పిండివంటలు చేసుకోవాలంటే గ్యాస్ ఎక్కువ అయిపోతుందని భయపడుతున్నారా? అయితే మీకో శుభవార్త. వంటగ్యాస్ ధరను చమురు కంపెనీలు తగ్గించాయి. గృహ వినియోగానికి సరఫరా చేసే 14.2 కిలోల సిలిండర్‌పై 53.50 రూపాయల వంతున ధరను తగ్గించాయి. ఇటీవలే పెట్రోలు ధరను లీటరు 1.15 రూపాయల చొప్పను తగ్గించిన చమురు సంస్థలు, తాజాగా వంటగ్యాస్ ధరను కూడా తగ్గించడం విశేషం. గృహ వినియోగ సిలిండర్లే కాక, వాణిజ్య సిలిండర్ల ధరలను కూడా చమురు కంపెనీలు తగ్గించాయి. ఒక్కో వాణిజ్య సిలిండర్ ధరను 91 రూపాయల వంతున తగ్గించడంతో చిరు వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తగ్గిన ధరలు శుక్రవారం నుంచే అమలులోకి వచ్చాయి. -
భారంగా మారుతున్న వంటగ్యాస్ సిలిండర్లు
= భారంగా మారుతున్న వంటగ్యాస్ సిలిండర్లు = బ్యాంకు ఖాతాల్లో జమకాని ‘సబ్సిడీ నగదు’ = వారం,పదిరోజులంటూ కాలయాపన = గగ్గోలు పెడుతున్న లబ్ధిదారులు = నిత్యం గ్యాస్ ఏజెన్సీల వద్ద వాదులాట సాక్షి,సిటీబ్యూరో: సైదాబాద్‌కు చెందిన రాజేశ్వర్ గతనెల 22న గ్యాస్ బుక్ చేయగా.. ఈనెల 2న సిలిండర్ ఇంటికి చేరింది. రూ.1096 చెల్లించి సిలిండర్ తీసుకున్నారు. సబ్సిడీ నగదు మాత్రం ఇప్పటివరకు బ్యాంకు ఖాతాలో జమకాలేదు. కూకట్‌పల్లికి చెందిన సుజాత పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంది. ఆధార్‌కార్డు జీరాక్స్ కాపీలను గ్యాస్ ఏజెన్సీలో, బ్యాంకులో రెండుచోట్లా ఇచ్చారు. ఇప్పటివరకు ఆధార్ కనెక్ట్ కాలేదు. అదేమంటే రేపు..మాపు అంటూ తిప్పుతున్నారు. ఇవీ ఒక్క రాజేశ్వర్, సుజాతల సమస్యలే కాదు..మహానగరంలో లక్షలాదిమంది గ్యాస్ వినియోగదారుల సమస్య. కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నగదుబదిలీ పథకం ఆరంభంలోనే నవ్వులపాలవుతోంది. ఎంతో కసరత్తు చేసి దీన్ని ప్రారంభించామని ప్రకటించిన ప్రభుత్వం..గ్యాస్ వినియోగదారులకు పట్టపగలే చుక్కలు చూపుతోంది. ఫలితంగా గ్యాస్ సిలిండర్ ముట్టుకోవాలంటనే భయమవుతోందని పలువురు వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సబ్సిడీ నగదు ఖాతాలో జమ కాక పూర్తిస్థాయి రీఫిల్లింగ్ ధరలను భరించాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. కొందరు వినియోగదారులకు సబ్సిడీ నగదు అసలు బదిలీ కాకపోగా, మరికొందరికి అడ్వాన్‌గా బ్యాంకు ఖాతాలో జమఅయినా..రెండు,మూడోసారి మాత్రం తీవ్రజాప్యం జరుగుతోంది. చేసేదిలేక వినియోగదారులు సబ్సిడీ నగదు కోసం డీలర్ల, బ్యాంకుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. సబ్సిడీ కొందరికే..: వంటగ్యాస్‌కు నగదుబదిలీ అమలుతో ‘సబ్సిడీ’పై అయోమయం నెల కొంది. ఆధార్, బ్యాంకు ఖాతాలతో అనుసంధానమైనా రీఫిల్లింగ్‌పై సబ్సిడీ వస్తుందో రాదో? అర్థంకాని దుస్థితి ఏర్పడింది. సిలిండర్‌కు మాత్రం మార్కెట్ ధర చెల్లించక తప్పడంలేదు. గ్రేటర్లో ప్రస్తుతం వినియోగంలో 26.05 లక్షల ఎల్పీజీ కనెక్షన్లుండగా, అందులో 68 శాతం కనెక్షన్లు ఆధార్‌తో అనుసంధానమయ్యాయి. అందులో బ్యాంకు ఖాతాలతో అనుసంధానమైన కనెక్షన్లు 46 శాతానికి మించలేదు. ఆధార్,బ్యాంకు రెండింటితో అనుసంధానమైన వారు మాత్రమే సబ్సిడీకి అర్హులు కాగా, అందులో సైతం సగంమందికి మాత్రమే సబ్సిడీ నగదు జమవుతోంది. బాధ్యులేవరు..? ఆధార్, బ్యాంకు ఖాతాలతో అనుసంధానమై నా.. సబ్సిడీ నగదు బదిలీపై జవాబుదారితనం లేకుండాపోయింది. ఇటు డీలర్లు, అటు బ్యాం కర్లు తమకు సంబంధం లేదంటే తమకులేదని పట్టించుకోవడం లేదు. ఫలితంగా నగదు బదిలీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న రిజర్వుబ్యాంకు (ఆర్బీఐ) పరిధిలోని భారత జాతీయ చెల్లింపు సంస్థ(ఎన్పీసీఐ) అనుసంధానంలో సాంకేతిక తప్పిదాలే సమస్యకు కారణమని అధికారులు అంటున్నారు. వాస్తవంగా కేంద్రం సబ్సిడీ మొ తాన్ని ఆయిల్ కంపెనీలకు విడుదల చేస్తే.. కంపెనీలు ఆయా బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తాయి. ఎన్పీసీఐ అనుసంధానం ఆధారంగా సబ్సిడీ నగదు వినియోగదారుల ఖాతాలో జమవుతుం ది. సిలిండర్ ఆన్లైన్లో బుక్ కాగానే సంబంధిత డీలర్ల ద్వారా ఆయా కంపెనీలు ఓఎంసీలకు అనుసంధానమై అక్కడ్నుంచి ఎన్పీసీఐలకు మ్యాపడ్ జరగాల్సి ఉంది. అయితే మ్యాప్డ్లో ఎలాంటి సాంకేతిక తప్పిదం జరిగినా.. నగదు బదిలీ పెండింగ్ పడిపోతోంది. ఇలా నగరంలో 52శాతంమంది వినియోగదారులకు నగదు బదిలీలో ఆటంకం తలెత్తినట్లు తెలుస్తోంది. సీడింగ్ వరకే మా బాధ్యత.. ఎల్పీజీ ఆధార్‌తో అనుసంధానం వరకే మా బాధ్యత. అనుసంధానం కాకుంటే సమస్య పరిష్కారానికి కృషిచేస్తాం. నగదు బదిలీ బాధ్యత బ్యాంకర్లదే. తమ దృష్టికి వస్తే మాత్రం ఎల్డీఎం దృష్టికి తీసుకెళ్తున్నాం. - పద్మ, చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ సాంకేతిక కారణాల వల్లే.. సబ్సిడీ నగదు జమ కాకపోవడానికి సాంకేతిక కారణాలే. లేకుంటే వినియోగదారుడి బహుళ ఖాతాలకు అనుసంధానమైతే ఏదొకదానిలో సబ్సిడీ సొమ్ము పడుతుంది. ఆలస్యమైనా సబ్సిడీ సొమ్ము జమవుతుంది. - భరత్‌కుమార్, లీడ్‌బ్యాంకు జనరల్ మేనేజర్ బ్యాంకులో డబ్బులు పడట్లే... మొదటిసారి గ్యాస్ బుక్ చేయగానే అడ్వాన్స్‌గా సబ్సిడీ నగదు బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. సిలిండర్ కూడా త్వరగా వచ్చింది. రెండోసారి బుకింగ్ చేసిన తర్వాత 15రోజులకు సిలిండర్ వచ్చినా..సబ్సిడీ నగదు జమకాలేదు. డీలర్‌ను అడిగితే పట్టించుకోవడం లేదు. సిలిండర్‌ను రూ.1120కి కొనుగోలు చేశా.. చాలా ఇబ్బందిగా ఉంది. -శ్రీశైలం,సీతాఫల్‌మండీ -
సబ్సిడీ అయోమయం
ఉదయగిరి, న్యూస్‌లైన్ : జిల్లాలో మంగళవారం నుంచి వంట గ్యాస్ కనెక్షన్ల సబ్సిడీకి సంబంధించి ‘నగదు బదిలీ పథకం’ అమల్లోకి వచ్చింది. జిల్లాలో ఇంత వరకు మొత్తం గ్యాస్ కనెక్షన్లలో 20 శాతం కూడా ఆధార్‌తో అనుసంధానం జరగకపోవడంతో లబ్ధిదారుల్లో అయోమయం, గందరగోళం నెలకొంది. ఇంత తక్కువ సంఖ్యలో ఆధార్ అనుసంధానం జరిగినా అధికారులు మాత్రం ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. అంతకుముందు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అక్టోబరు 1వ తేదీ నుంచి నగదు బదిలీ పథకం అమల్లోకి వచ్చినట్లు గ్యాస్ ఏజెన్సీలు ప్రకటిస్తున్నాయి. నగదు బదిలీ అంటే ఏమిటి? కేంద్ర ప్రభుత్వం గ్యాస్ లబ్ధిదారులకు ఇంత వరకు కొంత సబ్సిడీ ఇచ్చేది. ఆ సబ్సిడీని నేరుగా గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకే ఇచ్చేది. ఇందులో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని భావించిన ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి బదలాయించాలని సంకల్పించింది. దీంతో ప్రతి గ్యాస్ కనెక్షన్ ఉన్న లబ్ధిదారుడు ఆధార్‌తో బ్యాంకులో ఖాతా తెరవాలని నిబంధన విధించింది. గ్యాస్ బుక్ చేసిన వెంటనే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మొత్తం లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలో జమవుతుంది. అయోమయంలో లబ్ధిదారులు అక్టోబరు ఒకటో తేదీ నుంచి జిల్లాలో నగదు బదిలీ పథకం అమల్లోకి వస్తుందని ప్రకటించడంతో కొంతమంది లబ్ధిదారులు ఆధార్ నంబర్లను అటు గ్యాస్ ఏజెన్సీలకు, ఇటు బ్యాంకులకు అందజేశారు. జిల్లాలో మొత్తం 4.19 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉండగా, వాటిలో కేవలం 1.67 లక్షల మంది మాత్రమే ఆధార్ అనుసంధానం చేయించుకున్నారు. అంటే..మిగతా 2.5 లక్షల మంది ఇంత వరకు ఆధార్‌తో అనుసంధానం కాలేదు. దీంతో ఈ లబ్ధిదారుల్లో కొంత గందరగోళం నెలకొంది. సబ్సిడీలో తికమక: ఆధార్ అనుసంధానం చేయించుకున్న ప్రతి లబ్ధిదారుడు సిలిండర్ డెలివరీ సమయంలో గ్యాస్ ఏజెన్సీకి రూ.1020 చెల్లించాలి. అందులో రూ.450 సబ్సిడీ రూపంలో బ్యాంకులో జమ చేస్తారు. ఇందులో వ్యాట్ రూపేణ రూ.171 కటింగ్ అవుతుంది. ఈ మొత్తాన్ని రెండో సారి సిలిండరు బుక్ చేసుకున్నప్పుడు ఆయా ఖాతాల్లో జమ చేస్తామని ఏజెన్సీలు చెబుతున్నాయి. నగదు బదిలీ పథకం అమల్లో ఉన్న జిల్లాల్లో ఇప్పటికే ఖాతాల్లో సబ్సిడీ జమకావడం లేదని అక్కడి లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ అనుసంధానం చేయించుకున్న లబ్ధిదారులు ఒక్కో సిలిండరుకు రూ.650 చెల్లించాల్సి ఉండగా, ఆధార్ అనుసంధానం చేయించుకోని వారికి మాత్రం రూ.420 మాత్రమే సిలిండరు ఇస్తుండటంతో ఒక విధమైన గందరగోళ పరిస్థితి నెలకొంది. పూర్తిస్థాయిలో నగదు బదిలీ పథకం 2014 జనవరి నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో డిసెంబరు 31వ తేదీ లోపు గ్యాస్ కనెక్షన్లు ఉన్న ప్రతి లబ్ధిదారుడు ఆధార్‌తో అనుసంధానం చేయించుకోవాల్సి ఉంటుంది. సుప్రీం తీర్పు అమలు జరిగేనా : ప్రజా సంక్షేమం దృష్ట్యా అమలు జరిగే పథకాలకు ఆధార్ కార్డులతో బ్యాంకుల్లో ఖాతాలు తెరవాలని, అందుకు వచ్చే రాయితీ ఖాతాల్లో జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొనడాన్ని సుప్రీంకోర్టు ఇటీవల తప్పుపట్టింది. ఆధార్ అనేది తప్పనిసరి కాదని తేల్చి చెప్పింది. దీంతో గ్యాస్‌కు సంబంధించిన నగదు బదిలీ పథకానికి ఊరట లభించినట్టేనని భావిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. అంటే పథకం అమలుకు ఆధార్ కచ్చితంగా అవసరమని, అవసరం లేదనిగానీ స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడంతో గందరగోళం నెలకొంది. ఇండేన్ గ్యాస్ విజయవాడ విభాగం సేల్స్ మేనేజర్ సతీష్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా నగదు బదిలీ పథకం అక్టోబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిందన్నారు. ఆధార్ అనుసంధానం చేయించుకున్న ఖాతాదారులకు సబ్సిడీ బ్యాంకులో జమవుతుందన్నారు. ఆధార్ అందించని వారికి మరో రెండు నెలలు రూ.420కే ఇస్తామన్నారు. 2014 జనవరి నుంచి ఈ పథకం పూర్తి స్థాయిలో అమల్లోకి రానుందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు విషయమై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుందన్నారు. -
ఆదాయానికి ‘సెగ’
సాక్షి,సిటీబ్యూరో: ప్రభుత్వానికి కామధేనువు అయిన వాణిజ్య పన్నుల వసూళ్లు నగరంలో చాలావరకు తగ్గుముఖం పట్టాయి. సీమాంధ్ర సెగతో వ్యాపార,వాణిజ్యరంగాల టర్నోవర్ బాగా తగ్గిపోయి ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. గత రెండునెలలుగా వివిధ పన్నుల వసూళ్లు తగ్గడంతో ఉన్నతాధికారులు కలవరపడుతున్నారు. వాణిజ్యపన్నులశాఖకు సమకూరే ఆదాయంలో హైదరాబాద్ నగర రాబడియే అత్యంత కీలకం. మొత్తం రాష్ట్ర రాబడిలో 74శాతం వరకు ఇక్కడినుంచే జమవుతోంది. వాణిజ్య పన్నులశాఖ వసూలు చేసే పన్నుల్లో వ్యాట్ (విలువఆధారిత పన్ను), అమ్మకం పన్నులు ప్రధానమైనవి. ఇవేకాకుండా వృత్తి, వినోద తదితర పన్నుల ద్వారా కూడా కొంతవరకు ఆదాయం వస్తుంది. మొత్తం రాబడిలో ఒక వ్యాట్ ద్వారానే సుమారు 85 శాతంపైగా,మిగతా పన్నుల ద్వారా మరో 15 శాతం వరకు సమకూరుతోంది. తాజా పరిణామాలతో వ్యాట్‌తోపాటు వివిధ పన్నుల వసూళ్లు క్షీణించడం ఆందోళన కలిగిస్తున్న పరిణామం. ఈనెల మొత్తం లక్ష్యంలో ఇప్పటివరకు కనీసం 40శాతం కూడా వసూలు కాకపోవడం పరిస్థితికి నిదర్శనం. గ్రేటరే పెద్ద అన్న : గ్రేటర్ హైదరాబాద్ వాణిజ్య పన్నులశాఖకు కల్పతరువు లాంటిది. ఇక్కడినుంచే అధిక రాబడి వసూలవుతోంది. రాష్ట్రం మొత్తం 25 డివిజన్లలో కలిపి వివిధ పన్నుల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు సమకూరిన ఆదాయం రూ.8706.32 కోట్ల కాగా, అందులో కేవలం గ్రేటర్‌లోని ఏడు డివిజన్ల రాబడి మొత్తం రూ.5214.47 కోట్ల వరకు ఉంటుంది. అంటే సగానికన్నా ఎక్కువన్నమాట. అందులో సైతం అత్యధికంగా పంజగుట్ట డివిజన్ నుంచి రూ.1125.74 కోట్లు వసూలయ్యాయి. ఆ తర్వాత అబిడ్స్ డివిజన్ నుంచి రూ.932.12 కోట్లు, బేగంపేట డివిజన్ నుంచి రూ.902.36కోట్ల వరకు రాబడి లభించింది. ప్రధాన ంగా వివిధ వ్యాపార,వాణిజ్య సంస్థలు, కంపెనీల నుంచి వ్యాట్,అమ్మకం తదితర పన్నులు వసూళ్లవుతాయి.పెట్రోలియం ఉత్పత్తులు పెట్రోలు,డీజిల్, వంటగ్యాస్, సీఎన్జీ తదితర వాటిపై అధిక పన్నులు వసూలవుతాయి. ప్రధానంగా రాజధానిలో పెట్రోలియం కంపెనీల కార్యాలయాలు ఉన్నకారణంగా వ్యాట్‌ను ఇక్కడే చెల్లిస్తారు. మొత్తం వ్యాట్ రాబడిలో కేవలం పెట్రోలుపైనే సుమారు 27శాతం వరకు ఉంటుంది. అలాగే మద్యం వినియోగం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నప్పటికీ కేవలం హైదరాబాద్‌లోనే మొత్తం వ్యాట్ వసూలవుతోంది. రాష్ట్ర బ్రేవరేజ్ కార్పొరేషన్ మద్యం విక్రయాలకు అనుగుణంగా నగరంలోనే వ్యాట్ చెల్లిస్తుంది. -
రాయచూరులో కుండపోత
రాయచూరు / రాయచూరు సిటీ , న్యూస్‌లైన్ : నైరుతి రుతుపవనాలు తిరుగు ప్రయాణంలో రాయచూరును అతలాకుతలం చేశాయి. శనివారం రాత్రి నగరంలో కుండపోతగా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అధికారులు సకాలంలో స్పందించలేదని జాతీయ రహదారిపై గ్రామస్తులు రాస్తారోకో చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఐదు గుడిసెలు కూలి ఇద్దరు మహిళలతో పాటు ముగ్గురు గాయపడ్డారు. వందలాది ఇళ్లు జలమయమయ్యాయి. వేలాది ఎకరాలలో పంట నష్టం జరిగింది. రాత్రంతా ప్రజలు జాగరణ చేయక తప్పలేదు. శనివారం రాత్రి 11 గంటల నుంచి కురిసిన వర్షం దాదాపు రెండు మూడు గంటల పాటు వివిధ ప్రాంతాలన్నింటినీ అతలాకుతలం చేసింది. జలాల్నగర్లో ఐదు గుడిసెలు కూలిపోయాయి. దీంతో స్థానికంగా ఉంటున్న భీమణ్ణ అనే యువకుడి కాలు విరగ్గా పద్మమ్మ అనే మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పిడుగులు, ఉరుముల గర్జన కు తోడు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలైన నీరుబావి కుంట, జలాల్నగర్ లేఔట్‌లోని ఇళ్లల్లో రెండు మూడు అడుగుల మేర నీరు చేరడంతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. వీరి పరిస్థితి చూడనలవి కాదు. తట్ట బుట్ట పిల్లజల్లని చేతపట్టుకుని ఎత్తైన ప్రాంతం కోసం పరుగులు తీశారు. బసవనబావి సర్కిల్ నుంచి రాజేంద్రగంజ్ రోడ్డు మధ్యలోని మున్నూరువాడి స్కూల్ ఎదుట నాలుగు అడుగుల మేర నీరు చేరింది. దీంతో ఉదయం వరకు వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా మురికి కాలువలన్నీ పూడికలతో నిండి ఉండటంతో స్థలాల ఆక్రమణ, మురికి కాలువలపై ఇళ్ల నిర్మాణం, ఫలితంగా నీరుబావికుంట, జలాల్నగర్ ఇళ్లు జలమయమయ్యాయి. సమీపంలో హెగ్గసనహళ్లిలోని కోణద వాగు నిండి ప్రవాహం ముంచెత్తింది. ఐదేళ్ల క్రితం ఇదే రీతిలో ప్రజలు ఆందోళన చెందారు. ప్రస్తుతం అదే విధంగా వ ంకలో భారీ స్థాయిలో పిచ్చి మొక్కలు, పూడిక విపరీతంగా పెరిగిపోయింది. దీంతో వ ర్షం నీరంతా ఊరు మీద పడింది. దీంతో ఆ గ్రామంలోని ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. వేలాది ఎకరాలు నీటమునిగాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇంత తీవ్ర నష్టం జరుగుతున్నా తగు రీతిలో స్పందించలేదన్న ఆగ్రహంతో అక్కడి ప్రజలు రాయచూరు-హైదరాబాద్ రోడ్డుపై రాస్తారోకో జరిపారు. ఈ వాగు వల్ల తాము వర్షాకాలంలో పడరాని పాట్లు పడుతున్నామని, తీవ్రంగా నష్టపోయాని వాపోయారు. తక్షణం పరిహార పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాయచూరు తహశీల్దార్ చామనూరు ప్రజలకు ఎంత నచ్చజెప్పినా వినిపించుకోలేదు. అసిస్టెంట్ కమిషనర్ ఎన్.మంజుశ్రీ ప్రజలను ఓదార్చేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. రెండు గంటల పాటు రాస్తారోకో జరిగింది. రెండవ శనివారం, ఆదివారం సెలవు కావడంతో జెడ్పీ, ఇతర రెవెన్యూ అధికారులు అందుబాటులో లేకపోవడం సహాయక చర్యలు ఆలస్యమయ్యాయి.