సబ్సిడీపై వంట గ్యాస్‌ను పొందడానికి ‘ఆధార్’ విధిగా ఉండాలనే నిబంధనపై రాష్ర్ట ప్రభుత్వం ఏమీ చేయజాలదని పౌర సరఫరాల శాఖ మంత్రి దినేశ్ గుండూరావు చేతులెత్తేశారు.
సాక్షి, బెంగళూరు : సబ్సిడీపై వంట గ్యాస్‌ను పొందడానికి ‘ఆధార్’ విధిగా ఉండాలనే నిబంధనపై రాష్ర్ట ప్రభుత్వం ఏమీ చేయజాలదని పౌర సరఫరాల శాఖ మంత్రి దినేశ్ గుండూరావు చేతులెత్తేశారు. ఆధార్‌పై సుప్రీం కోర్టు ఆదేశాలున్నాయని, వంట గ్యాస్ సరఫరా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని చెబుతూ, ఈ విషయంలో రాష్ర్ట ప్రభుత్వ పాత్ర ఉండబోదని స్పష్టం చేశారు.
శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ సభ్యుడు రామచంద్రే గౌడ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, సబ్సిడీపై వంట గ్యాస్ పొందే విషయంలో వినియోగదారులు ఇబ్బందులు పడుతుంటే కోర్టులను ఆశ్రయించ వచ్చని సూచించారు. కర్ణాటకలోనే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఈ సమస్య ఉందన్నారు.