రూ.3కే వంటగ్యాస్ | Cooking gas cost Rs. 3 only | Sakshi
Sakshi News home page

రూ.3కే వంటగ్యాస్

Published Mon, Feb 23 2015 3:47 AM | Last Updated on Wed, Sep 5 2018 2:07 PM

రూ.3కే వంటగ్యాస్ - Sakshi

రూ.3కే వంటగ్యాస్

చెన్నై : మూడు రూపాయలకు లభించే విధంగా వంటగ్యాసును, చక్కని గాలిని అందించే డబుల్ డెక్కర్ విద్యుత్ ఫ్యాన్‌ను రూపొందించి మదురై సైంటిస్ట్ ఒకరు ప్రతిభ కనుపరిచారు. మదురై బిబి కుళానికి చెందిన అబ్దుల్ రజాక్ (45)ఎలక్ట్రీషియన్‌గా వున్నారు. ఏడో తరగతి వరకు చదివారు. రైల్వే పట్టాలపై పగుళ్లను కనుగొనే పరికరం, ఒకే సమయలో అన్నం, కూర తయారు చేసే కుక్కర్‌తో సహా 37 రకాలైన అనేక దైనందిన జీవనానికి అవసరమయ్యే పరికరాలను తయారుచేసి అబ్దుల్ రజాక్ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
 
 ప్రస్తుతం సీలింగ్ ఫ్యానులో టేబుల్ ఫ్యాన్ రెక్కలను అమర్చి డబుల్ డెక్కర్ ఫ్యాన్‌ను రూపొందించారు. సీలింగ్ ఫ్యాను నుంచి ఎక్కువగా గాలి లభించడం లేదని, తాను రూపొందించిన ఈ ఫ్యానుతో అధికంగా గాలి వస్తుందన్నారు. దీంతో విద్యుత్ ఖర్చు ఎక్కువయ్యే అవకాశం లేదన్నారు. అంతేగాకుండా రంపపు పొట్టుతో అగరుబత్తిలకు ఉపయోగించే జిగురును చేర్చి కంప్రెస్ యంత్రం ద్వారా అదిమి చెక్కపొట్టు ఇంధనపు కడ్డీని రూపొందించారు.
 
 మూడు రూపాయల ఖర్చుతో తయారైన ఈ వెడల్పాటి కడ్డీ ద్వారా ఒక గంటకు పైగా వంట చేసుకోవచ్చని తెలిపారు. స్టవ్ బర్నర్ సెట్‌ను జతచేసి వంటచేసుకునేందుకు వీలుందన్నారు. ఈ ఉత్పత్తుల పేటెంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం సహకరించి పెద్ద ఎత్తున వీటిని ఉత్పత్తి చేసేందుకు వీలు కల్పించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement