ఇంచుమించు ప్రతి ఇంట్లోనూ ఇప్పుడు వంటకు గ్యాసే వాడుతున్నారు. దాంతో వంట గ్యాస్ ధర రోజురోజుకీ పెరిగి మంట గ్యాస్‌గా మారిపోతోంది. అందుకే దాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటే ఎక్కువకాలం పాటు గ్యాస్ వచ్చే విధంగా చూసుకోవచ్చు. గ్యాస్ ఆదాకు చిట్కాలు తెలుసుకుందాం...
వంట చేసేటప్పుడు రోజులో ఒకేసారి ఎక్కువ మొత్తంలో కూర వండుకోవడం మంచిది. ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి... ఇలా వండడం వల్ల గ్యాస్ ఎక్కువ మొత్తంలో పోతుంది. అదే మధ్యాహ్న భోజనం చేయడానికి ఒక గంట ముందు వండుకుంటే, అదే కూర మధ్యాన్నానికి, రాత్రికి కూడా వస్తుంది. దీనివల్ల రెండు మూడుసార్లు గ్యాస్‌ను వాడాల్సిన అవసరం రాదు.
ప్రెషర్ కుకర్ బెస్ట్
►ప్రెషర్ కుకర్ అధిక పీడనం కింద ఆవిరి మీద ఆహారాన్ని ఉడికిస్తుంది పైగా రెండు మూడు రకాలను ఒకేసారి కుకర్‌లో పెట్టవచ్చు కాబట్టి తక్కువ సమయంలో వంట పూర్తవుతుంది. గ్యాస్ కూడా ఆదా అవుతుంది.
చిన్న బర్నర్‌తో
►చిన్నగిన్నెలో వంటలు చేస్తున్నప్పుడు పెద్ద బర్నర్ వాడకూడదు. అలా వాడటం వల్ల మంట చాలా మటుకు బయటికి పోతుంది. దాంతో ఆ మేరకు గ్యాస్ వృథా అయినట్లే కదా.. అందువల్ల సాధ్యమైనంత వరకు చిన్న బర్నర్‌నే వాడటం మంచిది.
ఇలా చేస్తే మరింత ఆదా
►బర్నర్లను తరచూ శుభ్రపరుస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల అది త్వరగా వేడెక్కి వంట త్వరగా పూర్తయ్యేలా చేస్తుంది.
వంట పూర్తవడానికి కొంచెం ముందే స్టవ్ ఆపి వేయండి. గిన్నె మీద మూత మాత్రం తీయవద్దు. లోపల ఉన్న వేడి ఆ మిగతా వంటను పూర్తి చేస్తుంది. దీనివల్ల గ్యాస్ ఆదా అవుతుంది.
►వంట చేస్తున్నప్పుడు గిన్నె మీద మూత పెట్టే ఉంచండి. ఎందుకంటే మూత పెట్టడం వల్ల లోపల ఉన్న వేడి బయటికి పోదు. ఆ వేడి మీదే త్వరగా ఉడుకుతుంది. అదేవిధంగా స్నానానికి వేడినీళ్లను గ్యాస్ మీద పెట్టవద్దు. నీళ్లు వేడెక్కడానికి చాలా సమయం పడుతుంది. దాంతో ఎక్కువ గ్యాస్ వాడాల్సి వస్తుంది.
►పగటిపూట వంట చేస్తున్నప్పుడు వంటగదిలోని లైట్లను ఆన్ చేయవద్దు. దీనివల్ల శక్తి ఆదా అవుతుంది. అలాగే మీకు తెలియకుండానే గ్యాస్ వినియోగం కూడా తగ్గుతుంది.
►ఈ చిట్కాలన్నీ పాటించడం వల్ల గ్యాస్ సిలెండర్ దాదాపు పది రోజులు అదనంగా వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment