సాక్షి, రంగారెడ్డి జిల్లా: వంటగ్యాస్‌పై నగదుబదిలీకి సంబంధించి మూడునెలల గడువున్నందున వినియోగదారులంతా ఆధార్ కార్డు వివరాలను బ్యాంకు ఖాతాకు అనుసందానం చేయించాలని జాయింట్ కలెక్టర్ ఎంవీరెడ్డి సూచించారు. గ్యాస్ నగదుబదిలీపై బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులు, బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో 14.49లక్షల గ్యాస్ కనెక్షన్లున్నాయని, ఇందులో 12.82లక్షల మందికి ఆధార్ కార్డులున్నాయన్నారు. వీరిలో 11.49లక్షల మంది బ్యాంకు ఖాతాతో అనుసందానం చేయించారన్నారు. మిగతా వినియోగదారులు గడువులోగా సీడింగ్ చేయించుకోవాలని సూచించారు. ఈ అంశంపై విస్తృత ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎస్‌ఓ నర్సింహారెడ్డి, ఎల్‌డీఎం సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ పింఛన్లు: జేసీ
జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక పింఛన్లు అందించనున్నట్లు జాయింట్ కలెక్టర్ ఎంవీరెడ్డి అన్నారు. పింఛన్ల పంపిణీపై బుధవారం కలెక్టరేట్‌లో ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ పింఛన్లు అందించాలని, ఆందోళన చెందకుండా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌లో నెలకొన్న సమస్యతో కొంత జాప్యం జరుగుతోందని, వీలైనంత త్వరలో సమస్యను అధిగమించి అర్హులకు న్యాయం చేస్తామని అన్నారు.
ఆధార్‌ను బ్యాంకు ఖాతాతో లింక్ చేయించండి
Published Wed, Nov 19 2014 11:52 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement
Advertisement