ఇక నెలనెలా నెత్తిన ‘బండ’
గ్యాస్, కిరోసిన్ ధరలను పెంచే యోచనలో కేంద్రం
సిలిండర్‌కు రూ.5, కిరోసిన్ లీటర్‌కు 50-100 పైసల పెంపు!
రూ.80 వేల కోట్ల సబ్సిడీ భారం తొలగింపుపై దృష్టి
న్యూఢిల్లీ: డీజిల్ తర్వాత ఇప్పుడు ఎల్పీజీ, కిరోసిన్‌ల వంతు. డీజిల్ మాదిరిగానే వంటగ్యాస్ (ఎల్పీజీ), కిరోసిన్ ధరలను స్వల్ప మోతాదుల్లో ప్రతినెలా పెంచే దిశలో కేంద్రం కసరత్తు కొనసాగిస్తోంది. తద్వారా కాలక్రమంలో ఈ రెండు ఇంధనాలకు సంబంధించిన రూ.80 వేల కోట్ల సబ్సిడీ భారాన్ని పూర్తిగా తొలగించుకోవాలని భావిస్తోంది. ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.5 చొప్పున, కిరోసిన్ ధరను లీటర్‌కు 50 పైసల నుంచి రూపారుు చొప్పున ప్రతినెలా పెంచే ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. డీజిల్ ధరను ప్రతినెలా 50 పైసల చొప్పున పెంచాలని గత యూపీఏ ప్రభుత్వం 2013 జనవరిలో నిర్ణరుుంచింది. అప్పటినుంచి ఓ రెండుసార్లు మినహా క్రమం తప్పకుండానే డీజిల్ ధర పెరుగుతూ వచ్చింది. దీంతో డీజిల్‌పై సబ్సిడీ భారం లీటర్‌కు కేవలం రూ.1.62కు తగ్గిపోరుుంది.
యూపీఏ ప్రభుత్వ నిర్ణయూన్ని కొత్త ప్రభుత్వం సైతం కొనసాగిస్తుండటంతో ఈ భారం కూడా తొలగిపోయే సూచనలు కన్పిస్తున్నారుు. డీజిల్ పద్దతిలోనే ఎల్పీజీ, కిరోసిన్ ధరలను క్రమంగా పెంచాలని చమురు మంత్రిత్వ శాఖ ప్రతిపాదిస్తున్నట్టు తాజా పరిణామాలపై అవగాహన కలిగిన వర్గాల సమాచారం. 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్‌పై ప్రస్తుతం రూ.432.71 సబ్సిడీ కొనసాగుతుండగా.. నెలకు రూ.5 పెంపుతో సబ్సిడీ భారం పూర్తిగా తొలగిపోవాలంటే ఏడేళ్లు పట్టవచ్చని అంచనా. ఒకవేళ ప్రభుత్వం కనుక సానుకూలంగా ఉంటే నెలకు రూ.10 చొప్పున పెంచాలనే అభిప్రాయంతోనూ ఇంధన శాఖ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక కిరోసిన్‌పై ప్రస్తుతం లీటర్‌కు రూ.32.87 చొప్పున సబ్సిడీ ఉంది. నెలకు రూపారుు చొప్పున పెంచుతూ వెళితే సబ్సిడీ భారాన్ని పూర్తిగా తొలగించుకునేందుకు రెండున్నరేళ్లకు పైగానే పట్టే అవకాశం ఉంది.
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో డీజిల్, ఎల్పీజీ, కిరోసిన్‌లపై ఇచ్చే సబ్సిడీ రూ.1,15,548 కోట్లుగా అంచనా. ఇందులో ఎల్పీజీ వాటా రూ.50,324 కోట్లు కాగా, కిరోసిన్ వాటా రూ.29,488 కోట్లుగా ఉంది. బడ్జెట్ నుంచి నేరుగా చేసే నగదు కేటారుుంపులు, ఓఎన్‌జీసీ వంటి ప్రభుత్వ సంస్థల విరాళాలతో సబ్సిడీ మొత్తాన్ని పూరిస్తారు.