LPG cylinder price
-
గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
చమురు కంపెనీలు ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ల ధరను తగ్గించాయి. ప్రతి నెల మొదటి తేదీన చమురు సంస్థలు ఎల్పీజీ సిలిండర్ ధరను సవరిస్తాయి. అందులో భాగంగా కొత్త ధరలు నేడు విడుదలయ్యాయి.జూలైలో చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య సిలిండర్ల ధరలను రూ .30 తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. కొత్త రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. కమర్షియల్ సిలిండర్ల ధరలు తగ్గుముఖం పట్టడం ఇది వరుసగా మూడో నెల. అయితే డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.వాణిజ్య సిలిండర్ల తాజా రేట్లుదేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1676గా ఉండగా నేటి నుంచి రూ.1646కు చేరింది. కోల్‌కతాలో రూ.1756, ముంబైలో రూ.1598, చెన్నైలో కమర్షియల్ ఎల్పీజీ ధర రూ.1809.50లకు ఎగిసింది. కాగా డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. దేశవ్యాప్తంగా డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.803లుగా ఉంది. -
గ్యాస్ బండపై పెరిగిన భారం!
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMC) వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరల సవరణలను ప్రకటించాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధర రూ. 25.50 పెరిగింది. కొత్త రేట్లు మార్చి 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. ధరల పెంపు తర్వాత, ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ రిటైల్ విక్రయ ధర ఇప్పుడు రూ.1,795 అవుతుంది. అలాగే కలకత్తాలో రూ. 1,911, ముంబైలో రూ. 1749లకు పెరిగింది. ఇక చెన్నైలో రూ. 1960.50, హైదరాబాద్‌లో రూ. 2027, విశాఖపట్నంలో రూ. 2110.50 చొప్పున 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర ఉంది. అయితే డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు మాత్రం యథాతథంగా ఉండనున్నాయి. కమర్షియల్, డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరల నెలవారీ సమీక్షలు సాధారణంగా ప్రతి నెలా మొదటి రోజున జరుగుతాయి. స్థానిక పన్నుల ఆధారంగా దేశీయ వంట గ్యాస్ ధరలు రాష్ట్రాల నుంచి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి. -
కేంద్రం మరో సంచలనం: భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?
దేశ ప్రజలకు రక్షాబంధన్ గిప్ట్ అందించిన కేంద సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకోనుందా అంటే.. అవుననే అంటున్నాయి తాజా రిపోర్టులు. 2024 ఎన్నికలకు ముందు కేంద్రం మోటార్ ఇంధన ధరలపై దృష్టి పెట్టే అవకాముందని సిటీ గ్రూప్ నివేదించింది. ఎల్పీజీ సిలిండర్ల రేటును తగ్గించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ద్రవ్యోల్బణం దాదాపు 30 బేసిస్ పాయింట్ల మేర తగ్గనుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఈ క్రమంలో మరో కీలకమైన పెట్రోల్, డీజిల్ ధరలను కూడా తగ్గించే దేశ ప్రజలకు ఊరట కల్పించనుందని అంచనా వేస్తున్నారు. వంట గ్యాస్ ధరల్ని తగ్గిస్తూ మోదీ సర్కార్ నిర్ణయం ద్రవ్యోల్బణాని చెక్ పెట్టడమేకాకుండా, కొన్ని ప్రధాన పండుగలు, కీలక ఎన్నికలకు ముందు గ్యాసోలిన్, డీజిల్ ధరల తగ్గింపు వైపు దృష్టి సారించనుందని సిటీ గ్రూప్ తన కథనంలో పేర్కొంది. ఎల్పీజీ తగ్గింపుతో ద్రవ్యోల్బణం దిగి వస్తుందని ఆర్థికవేత్తలు సమీరన్ చక్రవర్తి, ఎం. జైదీ అభిప్రాయపడ్డారు. అంతేకాదు టొమాటో ధరల తగ్గుదల, తాజా చర్యతో సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం 6శాతం దిగువకు చేరే అవకాశం ఉందన్నారు. జులైలో 15 నెలల గరిష్ట స్థాయికి చేరిన రిటైల్ ధరలను చల్లబరచడానికి అధికారులు చురుకైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఎల్పీజీ సిలిండర్ల ధరలను 14.2 కిలోగ్రాముల గ్యాస్‌ను 200 రూపాయలు తగ్గింపుతో దాదాపు 300 మిలియన్ల వినియోగ దారులకు కొంత ఉపశమనం కలిగించింది. ఆహార ధరలను తగ్గించడానికి గృహ బడ్జెట్లను అదుపులో ఉంచడానికి భారతదేశం ఇప్పటికే బియ్యం, గోధుమలు , ఉల్లిపాయలు వంటి ప్రధాన వస్తువుల ఎగుమతులను కఠినతరం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఒత్తిడితోపాటు, కే- ఆకారపు రికవరీ నేపథ్యంలో, గ్యాస్ ధర తగ్గింపు వినియోగదారుల సెంటిమెంట్‌కు సానుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యంగా సెప్టెంబర్‌లో డిమాండ్-సరఫరా కొరత కారణంగా ఉల్లి ధర పెరుగుతుందన్న అంచనాలను గమనించాలన్నారు.అలాగే గ్లోబల్ క్రూడ్ ధరలలో అస్థిరత ఉన్నప్పటికీ, గత ఏడాదినుంచి పెట్రోలు, డీజిల్ ధరలు పెరగలేదనీ, ఈ నేపథ్యంలో ఎక్సైజ్ డ్యూటీ కోతద్వారా ఇంధన ధరలను తగ్గించవచ్చని, ఎన్నికల ముందు ఈ అంశాన్ని తోసి పుచ్చలేమని వ్యాఖ్యానించారు. కాగా తెలంగాణ, మిజోరం రాజస్థాన్, మధ్యప్రదేశ్ ,ఛత్తీస్‌గఢ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఈ ఏడాది చివరల్లో జరగ నున్నాయి. ఆ తర్వాత 2024 ప్రారంభంలో జాతీయ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ కేంద్రంలో మరోసారి అధికారాన్ని చేజిక్కించు కోవాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. -
LPG Price Cut: మహిళలకు రూ. వేల కోట్ల రక్షాబంధన్ గిఫ్ట్
LPG price by Rs 400/cylinder బీజేపీ సర్కార్ హయాంలో ఇటీవలి కాలంలో వంట గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరిగి సామాన్యుడికి పెనుభారంగా మారడంతో బీజేపీ సర్కార్ తీవ్ర విమర్శల పాలైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా వంటగ్యాస్ సిలిండర్ల ధరను రూ. 200 తగ్గించింది. అలాగే పిఎం ఉజ్వల పథకం లబ్ధిదారులకు అదనంగా రూ.200 లభించనుంది. దీంతో PMUY ఖాతాదారులకందే సబ్సిడీ రూ.400 అయ్యింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ మహిళలకు అందించిన రక్షాబంధన కానుక అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియా సమావేశంలో వెల్లడించారు ఎల్పిజి సీలిండర్ ధర తగ్గింపు రాబోయే ఎన్నికలకు సంబంధించినదేనా అన్నదానిపై స్పందించిన ఠాకూర్ అలా అనుకుంటే ముందే తగ్గించే వాళ్లం అంటూ ఈ వాదనను తోసిపుచ్చారు. ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నా ప్రజల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సౌదీ CP (కాంట్రాక్ట్ ధరలు) ధరలను పరిశీలిస్తే, ఏప్రిల్ 2022 నుండి 303 శాతం పెరిగింది. కానీ తాము మాత్రం 63 శాతం మాత్రమే పెంచి కొంత ఉపశమనం కలిగించామంటూ వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజా తగ్గింపు నిర్ణయానికి ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కోట్లాది వినియోగదారుల ప్రయోజనం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అలాగే ఉజ్వల పథకం కింద 7.5 మిలియన్ కొత్త గ్యాస్ కనెక్షన్లకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి వెల్లడించారు. తాజా నిర్ణయంతో 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.6,100 కోట్లు కేటాయించామని, 2023-24 సంవత్సరానికి ఆర్థిక ప్రభావం రూ. 7,680 కోట్లుగా అంచనా వేశామన్నారు. కాగా ప్రస్తుతం న్యూఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ రూ. 1,103గా ఉంది. చివరిసారిగా ఈ ఏడాది మార్చి 1న సిలిండర్‌కు రూ. 50 పెరిగిన సంగతి తెలిసిందే. "Government has decided Rs 200 reduction in the price of domestic LPG cylinders for all LPG consumers" -Union Minister @ianuragthakur#CabinetDecisions #LPGcylinder pic.twitter.com/sfwTyxUlsN — PIB in Telangana 🇮🇳 (@PIBHyderabad) August 29, 2023 ఇప్పటివరకు దేశంలోని ప్రధాన నగరాల్లో 14.2 కేజీల వంట గ్యాస్ ధరలు హైదరాబాద్ రూ. 1,155.00 ముంబై రూ. 1,102.50 గుర్గావ్ రూ. 1,111.50 బెంగళూరు రూ. 1,105.50 చండీగడ్ రూ. 1,112.50 జైపూర్ రూ. 1,106.50 పాట్నా రూ. 1,201.00 కోలకత్తా రూ. 1,129.00 చెన్నై రూ. 1,118.50 నోయిడా రూ. 1,100.50 భువనేశ్వర్ రూ. 1,129.00 లక్నో రూ. 1,140.50 త్రివేండ్రం రూ. 1,112.00 -
మళ్ళీ తగ్గిన ఎల్పీజీ గ్యాస్ ధరలు.. ఈ సారి ఎంతంటే?
LPG Cylinder Price: పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రమే కాకుండా ఎప్పటికప్పుడు 'ఎల్పీజీ' (LPG) ధరలు కూడా మారుతూ ఉంటాయి. తాజాగా మరో సారి గ్యాస్ ధరలు భారీగా తగ్గాయి. ఎల్పీజీ కొత్త ధరలను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ఈ రోజు (2023 జూన్ 01) నుంచి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు వినియోగదారులకు భారీ ఊరటను కలిగించనున్నాయి. ప్రస్తుతం తగ్గిన గ్యాస్ సిలిండర్ల ధరలు కేవలం కమర్షియల్ గ్యాస్‌కి మాత్రమే వర్తిస్తాయి. కాగా డొమెస్టిక్ గ్యాస్ ధరలలో ఎటువంటి మార్పు లేదు. (ఇదీ చదవండి: కస్టమర్లకు షాకిచ్చిన ఓలా.. పెరిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు) 14.2 కేజీల గ్యాస్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. కావున దీని ధర రూ. 1133 వద్ద స్థిరంగా ఉంది. అదే సమయంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 1856.50 వద్ద నుంచి రూ. 1773 కి తగ్గింది. అంటే ఈ ధరలు మునుపటి కంటే రూ. 83 తగ్గినట్లు తెలుస్తోంది. 2023 మే 1న కూడా కమర్షియల్ గ్యాస్ ధరలు ఏకంగా రూ. 171.50 తగ్గాయి. అప్పుడు కూడా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలలో ఎటువంటి మార్పు లేదు. ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ ధరలు తగ్గి, డొమెస్టిక్ గ్యాస్ ధరల్లో మార్పు లేకపోవడం వల్ల సామాన్య ప్రజలు కొంత నిరాశ చెందుతున్నారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
గుడ్‌న్యూస్.. తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధర
సాక్షి, ముంబై: ఎల్పీజీ సిలిండర్ల ధర వరుసగా దిగి వస్తోంది. 19 కేజీల వాణిజ్య సిలిండర్ల ధరను 115 రూపాయలు తగ్గించింది. దీంతో కమర్షియల్ వినియోగదారులకు భారీ ఉపశమనం లభించింది. తాజా సవరణతో హైదరాబాద్‌లో కమర్షియల్ వంట గ్యాస్ సిలిండర 1798.50 నుంచి 115 రూపాయలు తగ్గి 1683 రూపాయలుగా ఉంటుంది. ఇక దేశ రాజధాని నగరంలో ఢిల్లీలో రూ. 1,744 గాను కోలకతాలో రూ. 1,846, ముంబైలో రూ. 1,696, చెన్నైలో రూ. 1,893 గానూ ఉండనుంది. కొత్త రేట్లు తక్షణం అమల్లోకి వచ్చాయి. గత జూన్ మాసం నుంచి వరుసగా ఇది ఏడో తగ్గింపు కాగా, 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ధర జూలై నుండి మారకపోవడం గమనార్హం. కాగా చమురు కంపెనీలు ప్రతీ నెల వంట గ్యాస్ సిలిండర్ ధరలను సమీక్షిస్తుంటాయి. అయితే డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్‌లో ఎలాంటి మార్పు చేయలేదు. గత ఏడాది నవంబరులో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరన రూ. 266 పెంచింది. ఆ తరువాత 2022, జనవరి కొత్త ఏడాదిలో102.50 రూపాయల మేర సిలిండర్ ధర దిగి వచ్చింది. -
వంట గ్యాస్ మంట.. హైదరాబాద్‌లో సిలిండర్ రూ.1002
న్యూఢిల్లీ: ఐదురాష్ట్రాల ఎన్నికల ప్రభావంతో దాదాపు ఐదు నెలలుగా గ్యాస్, పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచకుండా ఉన్న కంపెనీలు మంగళవారం జూలు విదిల్చాయి. వంటగ్యాస్ సిలిండర్‌పై రూ. 50 పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో ఎల్పీజీ సిలిండర్ ధర జీవితకాల గరిష్టానికి చేరింది. అయితే పెట్రోల్, డీజిల్ ధరలను మాత్రం భారీగా పెంచకుండా లీటరుకు దాదాపు 80పైసలతో సరిపెట్టాయి. తాజా పెరుగుదలతో ఒక్కసారిగా ద్రవ్యోల్బణ భయాలు పెరిగాయి. కొత్త ధరల ప్రకారం సబ్సిడీఏతర ఎల్పీజీ సిలిండర్ (14.2 కిలోలు) ధర ఢిల్లీ, ముంబైలో 949.50 రూపాయలకు చేరింది. గతేడాది అక్టోబర్ తర్వాత ఎల్పీజీ రేట్లు సవరించడం ఇదే ప్రథమం. గతేడాది జూలై, అక్టోబర్ మధ్య కాలంలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 100 మేర పెరిగింది. ప్రస్తుతం సబ్సిడీ సిలిండర్ ధర సైతం నాన్ సబ్సిడీ సిలిండర్ ధరంత పలుకుతోంది. గతంలో ప్రభుత్వం సబ్సిడీ కింద రూ.600 వరకు సాయం అందించేది. 2020 నుంచి ఈ సబ్సిడీని తొలగించారు. పెంచిన ధరల ప్రకారం 5 కిలోల గ్యాస్ íసిలిండర్ ధర రూ. 349కి, 10కిలోల íసిలిండర్ ధర రూ. 669కి చేరింది. మరోవైపు దేశ రాజధానిలో లీటర్ పెట్రోలు ధర రూ. 95.41 నుంచి 96.21కి, డీజిల్ ధర రూ. 86.67 నుంచి 87.47కు పెరిగింది. ఇతర నగరాల్లో స్థానిక పన్నులు కలుపుకొని ధరలు పెరిగాయి. ప్రభుత్వం సిలిండర్ ధర రూ. వెయ్యికి చేర్చాలని కంకణం కట్టుకుందని విపక్షాలు దుయ్యబట్టాయి. పార్లమెంట్లో ఈ విషయమై నిరసనకు దిగాయి. అంతర్జాతీయంగా ఉక్రెయిన్ సంక్షోభ కారణంగా ఇంధన ధరలు పెరగడంతో దేశీయంగా ధరలు పెంచాల్సివచ్చిందని ఇంధన సంస్థలు తెలిపాయి. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 119 డాలర్ల వద్ద కదలాడుతోంది. భారత్ తన ఇంధన అవసరాల్లో 85 శాతం వరకు దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధర పెరిగితే భారత్‌పై భారం పడుతోంది. నిజానికి తాజా రేట్ల ప్రకారం పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ. 15– 25 చొప్పున పెంచాల్సిఉందని, కానీ కంపెనీలు ఆ మొత్తాన్ని తామే భరిస్తున్నాయని అధికారులు తెలిపారు. విజయవాడలో సిలిండర్ రూ. 972 విజయవాడలో గ్యాస్ íసిలిండర్ ధర రూ. 50 పెరిగి రూ. 972కు చేరింది. కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2,185ను తాకింది. ఇతర ప్రధాన నగరాల్లో కూడా గ్యాస్ సిలిండర్ ధర రూ. 50 మేర పెరిగింది. విజయవాడలో పెట్రోల్ ధర లీటరుకు 0.96పైసలు(స్థానిక పన్నులు కలుపుకొని) పెరిగి రూ. 110.89కి చేరింది. డీజిల్ 83పైసలు పెరిగి రూ. 96.89కి చేరింది. విశాఖ పట్నంలో పెట్రోల్ ధర రూ. 110. 01కు, డీజిల్ ధర రూ. 96.02కు, తిరుపతిలో పెట్రోల్ధర రూ. 112.02కు, డీజిల్ ధర రూ. 98.00కు చేరాయి. హైదరాబాద్‌లో సిలిండర్ రూ.1002 తెలంగాణలో మంగళవారం లీటర్ పెట్రోల్ ధర 90 పైసలు, డీజిల్ ధర 88 పైసలు (స్థానిక పన్నులు కలుపుకొని) చొప్పున పెరిగాయి. వంట గ్యాస్ ధర రూ. 50 పెరిగడంతో 14.2 కిలోల గృహావసర వంట గ్యాస్ సిలిండర్ ధర రాష్ట్రంలో పన్నులు కలుపుకొని రూ. 1000 దాటింది. సిలిండర్ ధర తెలంగాణలో ఆదిలాబాద్‌లో అత్యధికంగా రూ. 1,026కు చేరింది. రాష్ట్రంలో 1.18 కోట్ల గృహావసర సిలిండర్లు వినియోగంలో ఉండగా, ప్రతిరోజూ సగటున 1.20 లక్షల సిలిండర్లను డెలివరీ చేస్తున్నారు. సగటున రాష్ట్రంలో పెట్రోల్‌వినియోగం నెలకు 15 కోట్ల లీటర్లుండగా, సగటు డీజిల్ వినియోగం 25 కోట్ల లీటర్లుంది. -
గ్యాస్ ఊరట
సాక్షి ప్రతినిధి, కాకినాడ : కొత్త సంవత్సరం సందర్భంగా గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కాస్త ఉపశమనం కల్పిం చింది. సిలిండర్ల ధర తగ్గిస్తూ సోమవారం సాయంత్రం నిర్ణయం తీసుకోవడంతో జిల్లా ప్రజలపై సుమారు రూ. 7 కోట్లకుపైగా సిలిండర్ల భారం తగ్గనుంది. గృహ వినియోగదారుల కన్నా వాణిజ్య వినియోగదారులకు మరింత ప్రయోజనం చేకూర్చింది. గృహ వినియోగదారుల సిలిండర్లపై రూ. 5.90 తగ్గించగా, వాణిజ్య వినియోగ సిలిండర్లపై రూ. 120 తగ్గించింది. జిల్లాలో గృహ వినియోగ గ్యాస్ కనెక్షన్లు 12 లక్షల 96 వేల 869 ఉన్నాయి. దాదాపు ప్రతి 20 రోజులకోసారి సిలిండర్‌ను విడిపించుకుంటున్నారు. ఈ లెక్కన నెలవారీగా చూస్తే ఒక్క గృహ వినియోగదారులకు రూ. కోటి వరకు ఆదా కానుంది. ఇక వాణిజ్య గ్యాస్ కనెక్షన్లు 2 లక్షల 92 వేల 871 ఉన్నాయి. తాజాగా సిలిండర్‌పై తగ్గించిన రూ.120తో వాణిజ్య వినియోగదారులకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరనుంది. ప్రతినెలా రూ.6 కోట్ల వరకు వారికి భారం తగ్గనుంది. మొత్తంగా జిల్లా ప్రజలపై రూ.7 కోట్లకు పైగా భారం తగ్గనుండడంతో ఇది నూతన వత్సర కానుకగా ప్రజలు భావిస్తున్నారు. -
సామాన్యుడికి మరో షాక్
సాక్షి, న్యూఢిల్లీ: ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలతో కుంగిపోయిన సామాన్యుడికి మరో షాక్ తగిలింది. వంటగ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. సబ్సిడీ సిలిండర్ ధర రూ. 2.34 చొప్పున, సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ. 48 చొప్పున పెరిగాయి. దీంతో ఢిల్లీలో ప్రస్తుతం సబ్సిడీ సిలిండర్ ధర రూ.493.55, సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ. 698.50 గా ఉంది. కోల్‌కతాలో రాయితీగల వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.496.65, సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ. 723.50, ముంబైలో సబ్సిడీ సిలిండర్ ధర రూ. 491.31, రాయితీ లేని సిలిండర్ ధర రూ. 671.50 ఉండగా.. చెన్నైలో సబ్సిడీ సిలిండర్ ధర రూ. 481.84, రాయితీ లేని సిలిండర్ ధర రూ. 712.50 కు చేరింది. వరుసగా 16 రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు వినియోగదారులకు వాతలు పెడుతూ వస్తున్నాయి. వాటి ధరలను నియంత్రించడానికి ఇప్పటి వరకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు జీవితకాల గరిష్ఠాన్ని తాకాయి. ఇప్పుడు సిలిండర్ ధర కూడా పెంచడంతో సామాన్యుడిపై మరింత భారం పడనుంది. -
తగ్గిన వంటగ్యాస్ ధరలు
సాక్షి, న్యూఢిల్లీ: వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. అటు పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగేళ్ల గరిష్టాన్ని తాకితే ఇటు వంట గ్యాస్ ధరలు దిగి వచ్చాయి. సబ్సిడీ ఎల్పీజీ (ద్రవీకృత పెట్రోలియం వాయువు), నాన్ సబ్సిడీ వంటగ్యాస్ ధరలు తగ్గాయి. సబ్సిడీ సిలిండర్ రూ. 1.77 తగ్గగా, సబ్సిడీ లేని సిలిండర్ ధర (14.2 కిలోల) రూ.35.36 లు తగ్గింది. అన్ని మెట్రో నగరాల్లో ఏప్రిల్ 1 నుంచి ఈ తగ్గింపు ధరలు అమల్లో ఉంటాయి. కాగా ఈ ఏడాదిలో ఇప్పటివరకూ సిలిండర్ ధరలను తగ్గించడం ఇది నాలుగవ సారి. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెబ్సైట్ అందించిన సమాచారం ప్రకారం వంటగ్యాస్ ధరలు ఇలా ఉన్నాయి. నాన్ సబ్సిడీ సిలిండర్ ధర ఢిల్లీ- రూ.653.5 కోలకతా - రూ.676 ముంబై - రూ.625 చెన్నై- రూ. 663.5 హైదరాబాద్ - 705.00 సబ్సిడీ సిలిండర్ ధర ఢిల్లీ - రూ. 491.35 కోలకతా - రూ. 494.33 ముంబై - రూ. 489.04 చెన్నై- 479.44 హైదరాబాద్ - 489.50 మరోవైపు ప్రభుత్వ రంగ ఇంద్రప్రస్థ గ్యాస్ ఢిల్లీలో సిఎన్జీ పీఎన్జీ (పైప్డ్ సహజ వాయువు) ధరలను పెంచేసింది. ఏప్రిల్ 2 నుంచి సీఎన్జీ కిలోకు 90 పైసలు, స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల (ఎస్సిఎం) కు 1.15 రూపాయలు పెంచింది. -
ఇక నెలనెలా నెత్తిన ‘బండ’
-
ఇక నెలనెలా నెత్తిన ‘బండ’
గ్యాస్, కిరోసిన్ ధరలను పెంచే యోచనలో కేంద్రం సిలిండర్‌కు రూ.5, కిరోసిన్ లీటర్‌కు 50-100 పైసల పెంపు! రూ.80 వేల కోట్ల సబ్సిడీ భారం తొలగింపుపై దృష్టి న్యూఢిల్లీ: డీజిల్ తర్వాత ఇప్పుడు ఎల్పీజీ, కిరోసిన్‌ల వంతు. డీజిల్ మాదిరిగానే వంటగ్యాస్ (ఎల్పీజీ), కిరోసిన్ ధరలను స్వల్ప మోతాదుల్లో ప్రతినెలా పెంచే దిశలో కేంద్రం కసరత్తు కొనసాగిస్తోంది. తద్వారా కాలక్రమంలో ఈ రెండు ఇంధనాలకు సంబంధించిన రూ.80 వేల కోట్ల సబ్సిడీ భారాన్ని పూర్తిగా తొలగించుకోవాలని భావిస్తోంది. ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.5 చొప్పున, కిరోసిన్ ధరను లీటర్‌కు 50 పైసల నుంచి రూపారుు చొప్పున ప్రతినెలా పెంచే ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. డీజిల్ ధరను ప్రతినెలా 50 పైసల చొప్పున పెంచాలని గత యూపీఏ ప్రభుత్వం 2013 జనవరిలో నిర్ణరుుంచింది. అప్పటినుంచి ఓ రెండుసార్లు మినహా క్రమం తప్పకుండానే డీజిల్ ధర పెరుగుతూ వచ్చింది. దీంతో డీజిల్‌పై సబ్సిడీ భారం లీటర్‌కు కేవలం రూ.1.62కు తగ్గిపోరుుంది. యూపీఏ ప్రభుత్వ నిర్ణయూన్ని కొత్త ప్రభుత్వం సైతం కొనసాగిస్తుండటంతో ఈ భారం కూడా తొలగిపోయే సూచనలు కన్పిస్తున్నారుు. డీజిల్ పద్దతిలోనే ఎల్పీజీ, కిరోసిన్ ధరలను క్రమంగా పెంచాలని చమురు మంత్రిత్వ శాఖ ప్రతిపాదిస్తున్నట్టు తాజా పరిణామాలపై అవగాహన కలిగిన వర్గాల సమాచారం. 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్‌పై ప్రస్తుతం రూ.432.71 సబ్సిడీ కొనసాగుతుండగా.. నెలకు రూ.5 పెంపుతో సబ్సిడీ భారం పూర్తిగా తొలగిపోవాలంటే ఏడేళ్లు పట్టవచ్చని అంచనా. ఒకవేళ ప్రభుత్వం కనుక సానుకూలంగా ఉంటే నెలకు రూ.10 చొప్పున పెంచాలనే అభిప్రాయంతోనూ ఇంధన శాఖ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక కిరోసిన్‌పై ప్రస్తుతం లీటర్‌కు రూ.32.87 చొప్పున సబ్సిడీ ఉంది. నెలకు రూపారుు చొప్పున పెంచుతూ వెళితే సబ్సిడీ భారాన్ని పూర్తిగా తొలగించుకునేందుకు రెండున్నరేళ్లకు పైగానే పట్టే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో డీజిల్, ఎల్పీజీ, కిరోసిన్‌లపై ఇచ్చే సబ్సిడీ రూ.1,15,548 కోట్లుగా అంచనా. ఇందులో ఎల్పీజీ వాటా రూ.50,324 కోట్లు కాగా, కిరోసిన్ వాటా రూ.29,488 కోట్లుగా ఉంది. బడ్జెట్ నుంచి నేరుగా చేసే నగదు కేటారుుంపులు, ఓఎన్జీసీ వంటి ప్రభుత్వ సంస్థల విరాళాలతో సబ్సిడీ మొత్తాన్ని పూరిస్తారు.