సాక్షి, న్యూఢిల్లీ: ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలతో కుంగిపోయిన సామాన్యుడికి మరో షాక్ తగిలింది. వంటగ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. సబ్సిడీ సిలిండర్ ధర రూ. 2.34 చొప్పున, సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ. 48 చొప్పున పెరిగాయి. దీంతో ఢిల్లీలో ప్రస్తుతం సబ్సిడీ సిలిండర్ ధర రూ.493.55, సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ. 698.50 గా ఉంది. కోల్‌కతాలో రాయితీగల వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.496.65, సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ. 723.50, ముంబైలో సబ్సిడీ సిలిండర్ ధర రూ. 491.31, రాయితీ లేని సిలిండర్ ధర రూ. 671.50 ఉండగా.. చెన్నైలో సబ్సిడీ సిలిండర్ ధర రూ. 481.84, రాయితీ లేని సిలిండర్ ధర రూ. 712.50 కు చేరింది.
వరుసగా 16 రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు వినియోగదారులకు వాతలు పెడుతూ వస్తున్నాయి. వాటి ధరలను నియంత్రించడానికి ఇప్పటి వరకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు జీవితకాల గరిష్ఠాన్ని తాకాయి. ఇప్పుడు సిలిండర్ ధర కూడా పెంచడంతో సామాన్యుడిపై మరింత భారం పడనుంది.
Comments
Please login to add a commentAdd a comment