చమురు కంపెనీలకు కరుణ, జాలి, దయాలాంటి లక్షణాలేమీ కనిపించడం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరల వంకతో ఎడాపెడా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుకుంటూ పోతున్నాయి. ధరల పెరుగుదలతో మాకేం సంబంధం లేదన్నట్టుగా ప్రభుత్వాలు మిన్నకుండిపోతున్నాయి.
ఇప్పటికే కరోనా సంక్షోభంతో ఆదాయం తగ్గిపోయిన సామాన్యులకు పెట్రోలు ధరలు మోయలేని గుదిబండగా మారుతున్నాయి. గ్యాప్‌లేకుండా వరుసగా పెట్రోలు ధరలు పెంచుకుంటూ పోతున్నాయి చమురు సంస్థలు. ఈ నెలలో ఇప్పటికే ఇరవై సార్లకు పైగా ఇంధన ధరలు పెరిగాయి. ఇది చాలదన్నట్టు గురువారం పెట్రోలు, డీజిల్‌లపై లీటరుకు 35 పైసల వంతున మరోసారి ధర పెరిగింది.
పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.112.64గా నమోదు అవగా లీటరు డీజిల్ ధర రూ.105.36గా ఉంది. ఇటువైపు పెట్రోలు ధరల మోతనే భరించడం కష్టంగా ఉంటే మరో వారం రోజుల్లో గ్యాస్ సిలిండర్ ధరలను పెంచేందుకు కేంద్రం రెడీ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment