సాక్షి, ముంబై: ఎల్‌పీజీ సిలిండర్ల ధర వరుసగా దిగి వస్తోంది. 19 కేజీల వాణిజ్య సిలిండర్ల ధరను 115 రూపాయలు తగ్గించింది. దీంతో కమర్షియల్ వినియోగదారులకు భారీ ఉపశమనం లభించింది.
తాజా సవరణతో హైదరాబాద్‌లో కమర్షియల్ వంట గ్యాస్ సిలిండర 1798.50 నుంచి 115 రూపాయలు తగ్గి 1683 రూపాయలుగా ఉంటుంది. ఇక దేశ రాజధాని నగరంలో ఢిల్లీలో రూ. 1,744 గాను కోలకతాలో రూ. 1,846, ముంబైలో రూ. 1,696, చెన్నైలో రూ. 1,893 గానూ ఉండనుంది. కొత్త రేట్లు తక్షణం అమల్లోకి వచ్చాయి. గత జూన్ మాసం నుంచి వరుసగా ఇది ఏడో తగ్గింపు కాగా, 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ల ధర జూలై నుండి మారకపోవడం గమనార్హం.
కాగా చమురు కంపెనీలు ప్రతీ నెల వంట గ్యాస్ సిలిండర్ ధరలను సమీక్షిస్తుంటాయి. అయితే డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్‌లో ఎలాంటి మార్పు చేయలేదు. గత ఏడాది నవంబరులో 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరన రూ. 266 పెంచింది. ఆ తరువాత 2022, జనవరి కొత్త ఏడాదిలో102.50 రూపాయల మేర సిలిండర్ ధర దిగి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment