prices slashed
-
తగ్గిన బంగారం ధర.. దిగొచ్చిన వెండి
దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. గ్లోబల్ మార్కెట్లో పసిడి క్షీణించిన నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం (జులై 31) 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ.60,350కి చేరిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. క్రితం ట్రేడింగ్‌లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,450 వద్ద ముగిసింది. ఇక వెండి కూడా కిలోకు రూ.300 తగ్గి రూ.76,700కి చేరుకుంది. గ్లోబల్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు వరుసగా ఒక ఔన్స్‌కు 1,955 డాలర్లు, 24.25 డాలర్ల వద్ద ఉన్నాయి. ఇదీ చదవండి ➤ గ్యాస్ ధర పెంపు.. పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ ప్రకటన ఫెడరల్ రిజర్వ్ రేటు పెంపు ఊహాగానాల నేపథ్యంలో బంగారం ధర ఎటువంటి దారి తీసుకుంటుందో ఊహించడం కష్టంగా మారింది. డాలర్ ఇండెక్స్ ప్రస్తుతం 0.11 శాతం పెరిగి 101.51 వద్ద ట్రేడవుతోంది. ఇది విలువైన బంగారు, వెండి లోహాల ధరలపైనా ఒత్తిడి తెచ్చిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. -
గుడ్‌న్యూస్.. తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధర
సాక్షి, ముంబై: ఎల్పీజీ సిలిండర్ల ధర వరుసగా దిగి వస్తోంది. 19 కేజీల వాణిజ్య సిలిండర్ల ధరను 115 రూపాయలు తగ్గించింది. దీంతో కమర్షియల్ వినియోగదారులకు భారీ ఉపశమనం లభించింది. తాజా సవరణతో హైదరాబాద్‌లో కమర్షియల్ వంట గ్యాస్ సిలిండర 1798.50 నుంచి 115 రూపాయలు తగ్గి 1683 రూపాయలుగా ఉంటుంది. ఇక దేశ రాజధాని నగరంలో ఢిల్లీలో రూ. 1,744 గాను కోలకతాలో రూ. 1,846, ముంబైలో రూ. 1,696, చెన్నైలో రూ. 1,893 గానూ ఉండనుంది. కొత్త రేట్లు తక్షణం అమల్లోకి వచ్చాయి. గత జూన్ మాసం నుంచి వరుసగా ఇది ఏడో తగ్గింపు కాగా, 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ధర జూలై నుండి మారకపోవడం గమనార్హం. కాగా చమురు కంపెనీలు ప్రతీ నెల వంట గ్యాస్ సిలిండర్ ధరలను సమీక్షిస్తుంటాయి. అయితే డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్‌లో ఎలాంటి మార్పు చేయలేదు. గత ఏడాది నవంబరులో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరన రూ. 266 పెంచింది. ఆ తరువాత 2022, జనవరి కొత్త ఏడాదిలో102.50 రూపాయల మేర సిలిండర్ ధర దిగి వచ్చింది. -
మరింత తగ్గనున్న వంట నూనె ధరలు..!
సామాన్యులకు ఉపశమనం కల్పిస్తూ... ఆయా వంట నూనెల ధరలను రూ.7 నుంచి రూ.20 వరకు కేంద్రం తగ్గించిన విషయం తెలిసిందే. దిగుమతి సుంకాలు భారీగా తగ్గడంతో వంట నూనె ధరలను భారీగా తగ్గాయి. రాబోయే రోజుల్లో వంటనూనె ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాకర్స్ అసోసియేషన్ వెల్లడించింది. నూనె గింజల మెరుగైన దేశీయ ఉత్పత్తి, ప్రపంచ మార్కెట్లలోని అనుకూల అంశాలతో నూనె ధరలు కిలోకు రూ.3-4 రూపాయలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం నూనెలపై దిగ్గుమతి సుంకాలు తగ్గించడంతో ధరలు తగ్గాయని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అతుల్ చతుర్వేది వెల్లడించారు. భారీ మొత్తంలో సాగు..! దేశ వ్యాప్తంగా నూనె గింజల సాగు గణనీయంగా ఉన్నట్లు అతుల్ పేర్కొన్నారు. దేశీయంగా సాగుచేస్తోన్న నూనె గింజలతో వంట నూనె ధరలు మరింత తగ్గనున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా వంట నూనె ధరలు కొంతవరకు బేరిష్‌గా ఉండటంతో నూనె ధరలు రేట్లు తగ్గే అవకాశం ఉందన్నారు. ఎస్ఈఏ ప్రకారం... భారత్ సుమారు 65 శాతం మేర ఇంపోర్ట్పైనే ఆధారపడుతుంది. చదవండి: ‘అలా చేస్తే ఆర్బీఐకు ఇక్కట్లు తప్పవు..!’ -
రూ.12 వేలు దిగొచ్చిన పుత్తడి
సాక్షి,ముంబై: ఆకాశాన్నంటిన బంగారం ధరలు క్రమేపీ దిగివస్తున్నాయి. మరీ ముఖ్యంగా గతవారం రోజులుగా బులియన్ మార్కెట్లలో తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి రేట్లు ధరలు శుక్రవారం మరింత క్షీణించాయి. ఆల్-టైమ్ హై నుండి రూ.12వేల మేర పతనం కావడం గమనార్హం. నిజంగా బంగారం కొనుగోలు చేయాలని వారికి ఇది శుభ తరుణమనే చెప్పాలి. వెండి ధరకూడా భారీ పతనాన్నినమోదు చేసింది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ విడుదల చేసిన రేట్ల ప్రకారం స్పాట్ మార్కెట్లో ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ. 44,422గా ఉంది. వెండి కిలో ఏకంగా 1360 రూపాయలు తగ్గి రూ. 64,766 స్థాయికి చేరింది. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.41,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.45,220కి చేరింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.41,810 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.45,610కి చేరింది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.44,430 వద్ద, 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,430పలుకుతోంది. కాగా 2020, ఆగస్టులో 10గ్రాముల పసిడి ధర రూ. 57008గా నమోదైన సంగతి తెలిసిందే.ఒక దశలో ఇది 63 వేలకు చేరుతుందనే అంచనాలుకూడా వెలువడ్డాయి. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ వెబ్సైట్ ప్రకారం, శుక్రవారం (2021, మార్చి 5) బంగారు, వెండి స్పాట్ ధరలు: -
భారీగా తగ్గిన పెట్రోల్ ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : సామాన్యుడికి కాస్తంత ఊరట లభించింది. దేశీ ఇంధన ధరలు మరోసారి తగ్గాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో పెట్రోల్ ధర 2.69 పైసలు, డీజిల్ ధర 2.33 పైసలు చొప్పున క్షీణించాయి. దీంతో లీటరు పెట్రోల్ ధర రూ.70.29కు, డీజిల్ ధర రూ.63.01కు తగ్గింది. చదవండి : తగ్గిన ‘పెట్రో’ ధరలు -
జీప్ కార్ల ధరలు భారీగా తగ్గాయి..
జీప్ ఇండియా తన మోడల్స్‌పై భారీగా ధరలను తగ్గించింది. అమెరికాకు చెందిన ఈ కంపెనీ భారత్‌లో తన మోడల్స్‌పై రూ.18.5 లక్షల వరకు ధరలు తగ్గిస్తున్నట్టు కొత్త ధరల ప్రకటనలో తెలిపింది. ఈ ప్రకటనలో గ్రాండ్ చెరోకీ లిమిటెడ్ మోడల్ ధర రూ.18.49 లక్షల వరకు తగ్గించినట్టు ప్రకటించగా... గ్రాండ్ చెరోకి సమిట్ మోడల్ ధరను రూ.17.85 లక్షల వరకు తగ్గిస్తున్నట్టు తెలిపింది. జీప్ కార్లలన్నింటిలోనూ ఈ మోడల్స్‌పైనే అత్యధిక మొత్తంతో ధర తగ్గింపు చూడొచ్చు. గతంలో రూ.71.59 లక్షలుగా ఉన్న జీప్ రాంగ్లర్ అన్లిమిటెడ్ ప్రస్తుతం రూ.64.45 లక్షలకు దిగొచ్చింది. పాత ధరకు, కొత్త ధరకు ఉన్న తేడా రూ.7.14 లక్షలు. చివరిగా గ్రాండ్ చెరోకి ఎస్ఆర్టీపై కూడా 5 లక్షల రూపాయల వరకు ధర తగ్గింపు ఉంది. గ్రాండ్ చెరోకి ఎస్ఆర్టీ దేశంలో లభ్యమవుతున్న జీప్ మోడలన్నింటిలో కెల్లా అత్యంత ఖరీదైన మోడల్. తాజాగా లాంచ్ అయిన గ్రాండ్ చెరోకి పెట్రోల్ వేరియంట్, రాంగ్లర్ అన్లిమిటెడ్ పెట్రోల్ వేరియంట్ ధరలు తగ్గలేదు. గ్రాండ్ చెరోకి పెట్రోల్ రూ.75.15 లక్షలు కాగ, రాంగ్లర్ అన్లిమిటెడ్ పెట్రోల్ మోడల్ రూ.56 లక్షలు. భారత్‌లో లభ్యమవుతున్న జీప్ మోడళ్లలో సరసమైన ధరకు దొరికేవి ఈ రెండే. తన కార్ల ధరల తగ్గింపుతో పాటు కంపెనీ గ్రాండ్ చెరోకికి అప్డేట్స్ చేసింది. జీప్ మోడల్స్ పాత ధరలు కొత్త ధరలు తగ్గింపు రాంగ్లర్ అన్లిమిటెడ్ రూ.71.59 లక్షలు రూ.64.45 లక్షలు రూ.7.14 లక్షలు రాంగ్లర్ అన్లిమిటెడ్ పెట్రోల్ రూ.56 లక్షలు రూ.56 లక్షలు నిల్ గ్రాండ్ చెరోకి లిమిటెడ్ డీజిల్ రూ.93.64 లక్షలు రూ.75.15 లక్షలు రూ.18.49 లక్షలు గ్రాండ్ చెరోకి సమిట్ డీజిల్ రూ.1.03 కోట్లు రూ.85.15 లక్షలు రూ.17.85 లక్షలు గ్రాండ్ చెరోకి ఎస్ఆర్టీ రూ.1.12 కోట్లు రూ.1.07 కోట్లు రూ.5 లక్షలు గ్రాండ్ చెరోకి పెట్రోల్ నిల్ రూ.75.15 లక్షలు నిల్ -
ఎరువుల ధరలు తగ్గించిన కేంద్రం
ఏరువాక సమయంలో ఉన్న రైతులకు తీపి కబురు.. కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాల ఎరువుల ధరలను తగ్గించింది. టన్ను డీఏపీకి రూ. 2500 చొప్పున తగ్గింది. అలాగే 50 కిలోల డీఏపీ బస్తా మీద రూ. 125 చొప్పున తగ్గించారు. టన్ను ఎంఓపీపై రూ. 5000 చొప్పున తగ్గించారు. అంటే 50 కిలోల ఎంఓపీ బస్తాకు రూ. 250 చొప్పన తగ్గింది. ఒక టన్ను ఎన్పీకే కాంప్లెక్స్ ఎరువు మీద రూ. వెయ్యి చొప్పున తగ్గించారు. అంటే 50 కిలోల ఎన్పీకే కాంప్లెక్స్ ఎరువు మీద రూ. 50 తగ్గింది. -
షియోమి ఎంఐ4 ధర రూ. 2వేలు తగ్గింపు
చైనా యాపిల్‌గా పేరొందిన షియోమి కంపెనీ తన ఎంఐ4 ఫోన్ ధరను భారతీయ మార్కెట్లలో రూ. 2 వేలు తగ్గించింది. ఎంఐ4 16 జిబి వేరియంట్ ధర రూ. 19,999 ఉండగా.. దాన్ని రూ. 17,999కి తగ్గించారు. అలాగే 64 జిబి వేరియంట్ ధర రూ. 23,999 ఉండగా దాన్ని కూడా 2 వేలు తగ్గించి రూ. 21,999 చేశారు. ఈ కొత్త ధరలు ఫ్లిప్‌కార్ట్‌తో పాటు మొబైల్ స్టోర్‌లో కూడా అమలవుతాయి. ఈ విషయాన్ని షియోమి ఇండియా అధినేత మను కుమార్ జైన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు.