సాక్షి,ముంబై: ఆకాశాన్నంటిన బంగారం ధరలు క్రమేపీ దిగివస్తున్నాయి. మరీ ముఖ్యంగా గతవారం రోజులుగా బులియన్ మార్కెట్లలో తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి రేట్లు ధరలు శుక్రవారం మరింత క్షీణించాయి. ఆల్-టైమ్ హై నుండి రూ.12వేల మేర పతనం కావడం గమనార్హం. నిజంగా బంగారం కొనుగోలు చేయాలని వారికి ఇది శుభ తరుణమనే చెప్పాలి. వెండి ధరకూడా భారీ పతనాన్నినమోదు చేసింది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ విడుదల చేసిన రేట్ల ప్రకారం స్పాట్ మార్కెట్‌లో ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ. 44,422గా ఉంది. వెండి కిలో ఏకంగా 1360 రూపాయలు తగ్గి రూ. 64,766 స్థాయికి చేరింది.
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.41,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.45,220కి చేరింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.41,810 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.45,610కి చేరింది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.44,430 వద్ద, 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,430పలుకుతోంది. కాగా 2020, ఆగస్టులో 10గ్రాముల పసిడి ధర రూ. 57008గా నమోదైన సంగతి తెలిసిందే.ఒక దశలో ఇది 63 వేలకు చేరుతుందనే అంచనాలుకూడా వెలువడ్డాయి.
ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ వెబ్‌సైట్ ప్రకారం, శుక్రవారం (2021, మార్చి 5) బంగారు, వెండి స్పాట్ ధరలు:
Comments
Please login to add a commentAdd a comment