దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. గ్లోబల్ మార్కెట్‌లో పసిడి క్షీణించిన నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం (జులై 31) 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ.60,350కి చేరిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ తెలిపింది.
క్రితం ట్రేడింగ్‌లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,450 వద్ద ముగిసింది. ఇక వెండి కూడా కిలోకు రూ.300 తగ్గి రూ.76,700కి చేరుకుంది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు వరుసగా ఒక ఔన్స్‌కు 1,955 డాలర్లు, 24.25 డాలర్ల వద్ద ఉన్నాయి.
ఇదీ చదవండి ➤ గ్యాస్ ధర పెంపు.. పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ ప్రకటన
ఫెడరల్ రిజర్వ్ రేటు పెంపు ఊహాగానాల నేపథ్యంలో బంగారం ధర ఎటువంటి దారి తీసుకుంటుందో ఊహించడం కష్టంగా మారింది. డాలర్ ఇండెక్స్ ప్రస్తుతం 0.11 శాతం పెరిగి 101.51 వద్ద ట్రేడవుతోంది. ఇది విలువైన బంగారు, వెండి లోహాల ధరలపైనా ఒత్తిడి తెచ్చిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment