జీప్ కార్ల ధరలు భారీగా తగ్గాయి..
జీప్ కార్ల ధరలు భారీగా తగ్గాయి..
Published Wed, Jul 19 2017 7:47 PM | Last Updated on Tue, Sep 5 2017 4:24 PM
జీప్ ఇండియా తన మోడల్స్‌పై భారీగా ధరలను తగ్గించింది. అమెరికాకు చెందిన ఈ కంపెనీ భారత్‌లో తన మోడల్స్‌పై రూ.18.5 లక్షల వరకు ధరలు తగ్గిస్తున్నట్టు కొత్త ధరల ప్రకటనలో తెలిపింది. ఈ ప్రకటనలో గ్రాండ్ చెరోకీ లిమిటెడ్ మోడల్ ధర రూ.18.49 లక్షల వరకు తగ్గించినట్టు ప్రకటించగా... గ్రాండ్ చెరోకి సమిట్ మోడల్ ధరను రూ.17.85 లక్షల వరకు తగ్గిస్తున్నట్టు తెలిపింది. జీప్ కార్లలన్నింటిలోనూ ఈ మోడల్స్‌పైనే అత్యధిక మొత్తంతో ధర తగ్గింపు చూడొచ్చు. గతంలో రూ.71.59 లక్షలుగా ఉన్న జీప్ రాంగ్లర్ అన్‌లిమిటెడ్ ప్రస్తుతం రూ.64.45 లక్షలకు దిగొచ్చింది. పాత ధరకు, కొత్త ధరకు ఉన్న తేడా రూ.7.14 లక్షలు.
చివరిగా గ్రాండ్ చెరోకి ఎస్‌ఆర్‌టీపై కూడా 5 లక్షల రూపాయల వరకు ధర తగ్గింపు ఉంది. గ్రాండ్ చెరోకి ఎస్‌ఆర్‌టీ దేశంలో లభ్యమవుతున్న జీప్ మోడలన్నింటిలో కెల్లా అత్యంత ఖరీదైన మోడల్. తాజాగా లాంచ్ అయిన గ్రాండ్ చెరోకి పెట్రోల్ వేరియంట్, రాంగ్లర్ అన్‌లిమిటెడ్ పెట్రోల్ వేరియంట్ ధరలు తగ్గలేదు. గ్రాండ్ చెరోకి పెట్రోల్ రూ.75.15 లక్షలు కాగ, రాంగ్లర్ అన్‌లిమిటెడ్ పెట్రోల్ మోడల్ రూ.56 లక్షలు. భారత్‌లో లభ్యమవుతున్న జీప్ మోడళ్లలో సరసమైన ధరకు దొరికేవి ఈ రెండే. తన కార్ల ధరల తగ్గింపుతో పాటు కంపెనీ గ్రాండ్ చెరోకికి అప్‌డేట్స్ చేసింది.
జీప్ మోడల్స్ పాత ధరలు కొత్త ధరలు తగ్గింపు
రాంగ్లర్ అన్‌లిమిటెడ్ రూ.71.59 లక్షలు రూ.64.45 లక్షలు రూ.7.14 లక్షలు
రాంగ్లర్ అన్‌లిమిటెడ్ పెట్రోల్ రూ.56 లక్షలు రూ.56 లక్షలు నిల్
గ్రాండ్ చెరోకి లిమిటెడ్ డీజిల్ రూ.93.64 లక్షలు రూ.75.15 లక్షలు రూ.18.49 లక్షలు
గ్రాండ్ చెరోకి సమిట్ డీజిల్ రూ.1.03 కోట్లు రూ.85.15 లక్షలు రూ.17.85 లక్షలు
గ్రాండ్ చెరోకి ఎస్‌ఆర్‌టీ రూ.1.12 కోట్లు రూ.1.07 కోట్లు రూ.5 లక్షలు
గ్రాండ్ చెరోకి పెట్రోల్ నిల్ రూ.75.15 లక్షలు నిల్
Advertisement
Advertisement