SC: మాజీ భర్త కష్టాల్లో భాగం పంచుకుంటారా? | Hindu marriage is a sacrament and not a commercial venture | Sakshi
Sakshi News home page

SC: మాజీ భర్త కష్టాల్లో భాగం పంచుకుంటారా?

Published Fri, Dec 20 2024 7:02 AM | Last Updated on Fri, Dec 20 2024 7:04 AM

Hindu marriage is a sacrament and not a commercial venture

వివాహ వ్యవస్థపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు. చట్టాలు భర్తలను బెదిరించి ఆస్తి గుంజుకోవడానికి కాదని మరోమారు స్పష్టం చేసింది.

చట్టాలు మహిళల సంక్షేమం కోసమే.. భర్తలను శిక్షించడానికి, బెదిరించడానికి కాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. వైవాహిక వ్యవస్థలో హింస, భరణం అంశాలపై దేశవ్యాప్త చర్చ నడుస్తున్న వేళ.. మరోమారు కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

వివాహ వ్యవస్థను..హిందువులు పవిత్రమైనదిగా, కుటుంబానికి బలమైన పునాదిగా భావిస్తారు. అదేం కమర్షియల్ వెంక్చర్ లాంటిది ఏం కాదని జస్టిస్‌ బి.వి.నాగరత్న, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌ ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది.

ప్రభుత్వాలు కఠినమైన చట్ట నిబంధనలను రూపొందించింది మహిళల సంక్షేమం కోసమే. అంతేకాని భర్తలను వేధించి, బెదిరించి, శిక్షించి, ఆస్తిని దండుకోవడానికి కాదు. భార్యను క్రూరంగా హింసించారని, వేధింపులకు గురిచేశారని, అత్యాచారం చేశారనే ఆరోపణలన్నింటినీ ఒక ప్యాకేజీగా చేసి.. నేర శిక్షాస్మృతిలోని సెక్షన్ల ప్రకారం భర్త, అతని కుటుంబ సభ్యులపై కేసులు పెడుతున్నారు. భార్య తరఫున గట్టిగా బేరసారాలు చేసేందుకు భర్త, అతని కుటుంబ సభ్యులపై తీవ్రమైన నేరారోపణలు చేయటం కూడా పరిపాటిగా మారింది అని ధర్మాసనం ఆక్షేపించింది. ఈ డిమాండ్లలో అత్యధికంగా ఆర్థికపరమైనవే ఉంటున్నాయని ధర్మాసనం ప్రస్తావించింది.

గృహ హింస ఫిర్యాదులతో రంగంలోకి దిగే పోలీసులు కూడా భర్త తరఫు బంధువుల్లో వృద్ధులను, అనారోగ్యంతో ఉన్నవారిని సైతం అరెస్టు చేసి బెయిల్‌ రాకుండా చేస్తున్నారని, ఈ ఘటలన్నీ ఒకే చైన్ సిస్టమ్ మాదిరిగా ఉంటాయని పేర్కొంది.

విడాకులు తీసుకున్న తర్వాత మాజీ భర్తకు వ్యాపారంలో నష్టాలు వచ్చి దివాలా తీస్తే మాజీ భార్య వచ్చి ఆ కష్టాల్లో ఏమైనా భాగం పంచుకుంటుందా? అని ధర్మాసనం ప్రశ్నించింది.

.. తీవ్ర మనస్పర్థలతో విడివిడిగా నివసిస్తోన్న దంపతుల వైవాహిక బంధాన్ని రద్దు చేస్తూ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో భార్యకు శాశ్వత భరణం నెలలోగా చెల్లించాలన్న కింది కోర్టు ఉత్తర్వులను సుప్రీం కోర్టు సమర్థించింది. ఈ క్రమంలో ఆ భర్త పై నమోదైన క్రిమినల్‌ కేసులను కొట్టివేయడం గమనార్హం.

తన భర్తకు రూ.5వేల కోట్ల ఆస్తులున్నాయని, అతని తొలి భార్యకు రూ500 కోట్లను భరణంగా ఇచ్చారు కనుక తనకూ అదే స్థాయిలో చెల్లించాలన్న పిటిషనర్‌ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. ఫ్యామిలీ కోర్టు నిర్ణయించిన రూ.12 కోట్ల భరణాన్ని ఖరారు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement