
జైపూర్ : రెండో వివాహం ఓ సీనియర్ ఐపీఎస్ అధికారిని చిక్కుల్లో పడేసింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారి సీనియర్ ఐపీఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఓ ఐపీఎస్ అధికారి హోదా తగ్గించింది. ఈ నిర్ణయంతో సీనియర్ ఐపీఎస్ అధికారిగా హోదాతో పాటు తీసుకునే పేస్కేలు సైతం తగ్గింది. కొత్తగా విధుల్లో చేరిన ఐపీఎస్ ఎంత వేతనం తీసుకుంటారో.. అంతే వేతనం సదరు సీనియర్ ఐపీఎస్ అధికారికి అందుతుంది.
పలు నివేదికల ప్రకారం.. రాజస్థాన్ కేడర్ ఐపీఎస్ అధికారి పంకజ్ కుమార్ చౌదరి జైపూర్‌లో కమ్యూనిటీ పోలీసింగ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా పని చేస్తున్నారు. అయితే పంకజ్ కుమార్ మొదటి భార్య నుంచి విడాకులు తీసుకోకుండా రెండో వివాహం చేసుకున్నారు. ఈ వివాదంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ పంకజ్ కుటుంబ సభ్యులు రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టుకు చేరింది. విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని పంకజ్ కుమార్ మీడియాకు వెల్లడించారు.
ఈ తరుణంలో ఐపీఎస్ అధికారి పంకజ్ కుమార్ వివాహంపై రాజస్థాన్ రాష్ట్ర ఉన్నాతాధికారులు విచారణ చేపట్టారు. విచారణలో పంకజ్ కుమార్ దోషిగా తేల్చారు. విచారణ అనంతరం మూడు సంవత్సరాల పాటు ప్రస్తుతం ఉన్న తన డిజిగ్నేషన్‌ను తగ్గించారు. లెవల్ 11 సీనియర్ పే స్కేల్ నుండి లెవల్ 10 జూనియర్ పే స్కేల్‌కు కుదించారు. ఈ పేస్కేల్ కొత్తగా విధుల్లోకి చేరిన ఐపీఎస్‌లకు కేటాయిస్తారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
కాగా, 2009 బ్యాచ్ ఐపీఎస్ అధికారి పంకజ్ చౌదరి. ప్రస్తుతం,జైపూర్‌లో కమ్యూనిటీ పోలీసింగ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా పని చేస్తున్నారు. హోదా తగ్గించడంతో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (లెవల్ 10)గా కొనసాగనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment