Commercial
-
కమర్షియల్ ఫ్లైట్లలో తరలుతున్న బంగారం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US president Donald Trump) విధించిన సుంకాలు (US tariffs) భిన్నమైన గోల్డ్ రష్కు దారితీశాయి. న్యూయార్క్, లండన్ నగరాల మధ్య వాణిజ్య విమానాల్లో బిలియన్ల డాలర్ల విలువైన బంగారం తరలుతోందని ఒక నివేదిక తెలిపింది. పెరుగుతున్న ధరలు, మారుతున్న మార్కెట్ల కారణంగా జేపీ మోర్గాన్ సహా బ్యాంకులు బంగారాన్ని తరలించడానికి ఇబ్బంది పడుతున్నందున వింత పరిస్థితి ఏర్పడుతోందని క్వార్ట్జ్ నివేదించింది.పెరుగుతున్న బంగారం ధరలు బంగారం ధర నిరంతరం పెరుగుతోంది. ఈ సంవత్సరం ఫ్యూచర్స్ కాంట్రాక్టులు 11% పెరిగాయని నివేదిక పేర్కొంది. గత బుధవారం న్యూయార్క్‌లోని కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ట్రాయ్ ఔన్సుకు 2,909 డాలర్ల వద్ద ముగిశాయి. ఇది త్వరలో 3,000 డాలర్లకు చేరుకోవచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారని ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ట్రంప్ ఎన్నిక, యూరప్‌పై సుంకాలు విధిస్తానని ఆయన బెదిరింపు తర్వాత, డిసెంబర్ ప్రారంభం నుండి లండన్‌లో భౌతిక బంగారం ధర దాదాపు 20 డాలర్లు తక్కువగా ట్రేడవుతోందని నివేదిక పేర్కొంది.న్యూయార్క్‌కు బంగారం తరలింపుసాధారణంగా లండన్, న్యూయార్క్ నగరాల్లో బంగారం ధరలు ఒకే రకంగా కదులుతాయి. ధరల అంతరం ఉన్నప్పుడల్లా వ్యాపారులు ఈ రెండు నగరాల మధ్య బంగారాన్ని తరలిస్తూ ఉంటారు. లండన్‌లో గోల్డ్ బార్లను కలిగి ఉన్న బ్యాంకులు వాటిని రుణంగా ఇవ్వడం ద్వారా ఈ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఇక ధరల తగ్గుదల నుండి రక్షించుకోవడం కోసం న్యూయార్క్‌లో ఫ్యూచర్స్ కాంట్రాక్టులను విక్రయిస్తుంటాయి. జేపీ మోర్గాన్, హెచ్ఎస్బీసీ వంటి పెద్ద బ్యాంకులు ఈ బంగారు లావాదేవీలను నిర్వహిస్తుంటాయి.కానీ ఇటీవల పరిస్థితులు మారిపోయాయి. అమెరికాలో బంగారం ధరలు లండన్ కంటే ఎక్కువగా పెరగడంతో గోల్డ్ ఫ్యూచర్లను విక్రయించిన బ్యాంకులు ఇప్పుడు నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఈ ఫ్యూచర్స్ కాంట్రాక్టులను నష్టానికి తిరిగి కొనుగోలు చేయడానికి బదులుగా, బ్యాంకులు తమ లండన్ వాల్ట్‌ల నుండి భౌతిక బంగారాన్ని న్యూయార్క్‌కు తరలించే తెలివైన పరిష్కారాన్ని కనుగొన్నాయి. ఇలా చేయడం ద్వారా బ్యాంకులు నష్టపోకుండా తమ ఒప్పందాలను నెరవేర్చుకోవచ్చు. అలాగే బంగారాన్ని అధిక యూఎస్ ధరకు అమ్మడం ద్వారా లాభం కూడా పొందవచ్చు. వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం.. ఒక్క జేపీ మోర్గాన్ సంస్థే ఈ నెలలో న్యూయార్క్‌కు 4 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని తరలించాలని ప్రణాళిక వేసింది.బంగారం తరలింపునకు వాణిజ్య విమానాలుబంగారం తరలింపు బ్యాంకులకు నష్టాలను తగ్గించి, లాభాలను కూడా పొందేందుకు వీలు కల్పించినప్పటికీ, తరలింపులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొంతమంది క్లయింట్లు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఖజానాల నుండి తమ బంగారాన్ని తిరిగి పొందడానికి ఒక వారం వరకు వేచి ఉన్నారని నివేదిక పేర్కొంది. ధర వ్యత్యాసాలు ఓవైపు ఉంటే మరోవైపు కామెక్స్ కాంట్రాక్టులు గోల్డ్ బార్ల పరిమాణానికి సంబంధించి కూడా కఠినమైన నిబంధనలు ఉన్నాయి. అంటే వ్యాపారులు బంగారాన్ని యథాతథంగా రవాణా చేయలేరు. యూఎస్‌కు రవాణా చేయడానికి ముందు సరైన పరిమాణంలోకి మార్చడానికి వాటిని ముందుగా శుద్ధి కర్మాగారాలకు పంపాల్సి ఉంటుందని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.ఇలా బంగారం సిద్ధమైన తర్వాత కూడా దానిని రవాణా చేయడం అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే వాణిజ్య విమానాల ద్వారా తరలింపు సురక్షితమైన మార్గమని బ్యాంకులు భావిస్తున్నాయని నివేదిక పేర్కొంది. బ్యాంకులు భద్రతా సంస్థలతో కలిసి సాయుధ వ్యాన్లలో బంగారాన్ని లండన్‌లోని విమానాశ్రయాలకు తరలిస్తున్నాయని, తరువాత వాటిని న్యూయార్క్‌కు తరలిస్తారని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. -
అలాంటి సినిమాలు చేయడమంటే చాలా ఇష్టం: రాశీ ఖన్నా
హీరోయిన్ రాశి ఖన్నా సినిమాల ఎంపికపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తేనే కెరీర్ ఎదుగుదలకు ఊపయోగపడతుందని తెలిపింది. కేవలం కమర్షియల్ చిత్రాలు మాత్రమే కాకుండా కంటెంట్ ఓరియంటెడ్ ప్రాజెక్టుల్లో నటించడంపై రాశీ ఖన్నా మాట్లాడింది.రాశీ ఖన్నా మాట్లాడుతూ.. 'నాకు కమర్షియల్ సినిమాలంటే చాలా ఇష్టం. కానీ అలాంటి చిత్రాలు చేయడానికి ఇంకా సమయం ఉంది. నేను నటిగా ఎదగాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నా. మంచి కంటెంట్‌తో నడిచే చిత్రాలే మన ఎదుగుదలకు కారణం. అలాంటి సినిమాలు ఎక్కువగా చేయాలని కోరుకుంటున్నా. చాలా కాలంగా సౌత్‌లో సినిమాలు చేస్తున్నా. కానీ అలాంటి చిత్రాలే హిందీలో చేస్తే ఎలాంటి ఎగ్జైయిట్‌మెంట్ ఉండదు.' అని పంచుకున్నారు.కాగా.. రాశీ ఖన్నా దాదాపు ఒక దశాబ్దం పాటు అనేక తెలుగు, తమిళ స్టార్ హీరోల చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. 2013లో హిందీ చిత్రం మద్రాస్ కేఫ్‌తో అరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ.. ఆ తర్వాత సౌత్ సినిమాల్లోకి ప్రవేశించింది. ఎందుకంటే ఆమెకు హిందీలో కలిసి రాకపోవడంతో సౌత్‌వైపు అడుగులేసింది. అయితే 2022లో రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్ అనే సైకలాజికల్ క్రైమ్ సిరీస్‌తో హిందీ పరిశ్రమలో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్‌తో కలిసి నటించింది. ప్రస్తుతం తెలుగులో తెలుసు కదా అనే చిత్రంలో కనిపించనుంది. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ సరసన నటిస్తోంది. ఇందులో కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి కూడా హీరోయిన్గా చేయనుంది. కాగా.. రాశి ఖన్నా చివరిసారిగా ది సబర్మతి రిపోర్ట్‌లో కనిపించింది. -
SC: మాజీ భర్త కష్టాల్లో భాగం పంచుకుంటారా?
వివాహ వ్యవస్థపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు. చట్టాలు భర్తలను బెదిరించి ఆస్తి గుంజుకోవడానికి కాదని మరోమారు స్పష్టం చేసింది.చట్టాలు మహిళల సంక్షేమం కోసమే.. భర్తలను శిక్షించడానికి, బెదిరించడానికి కాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. వైవాహిక వ్యవస్థలో హింస, భరణం అంశాలపై దేశవ్యాప్త చర్చ నడుస్తున్న వేళ.. మరోమారు కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.వివాహ వ్యవస్థను..హిందువులు పవిత్రమైనదిగా, కుటుంబానికి బలమైన పునాదిగా భావిస్తారు. అదేం కమర్షియల్ వెంక్చర్ లాంటిది ఏం కాదని జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది.ప్రభుత్వాలు కఠినమైన చట్ట నిబంధనలను రూపొందించింది మహిళల సంక్షేమం కోసమే. అంతేకాని భర్తలను వేధించి, బెదిరించి, శిక్షించి, ఆస్తిని దండుకోవడానికి కాదు. భార్యను క్రూరంగా హింసించారని, వేధింపులకు గురిచేశారని, అత్యాచారం చేశారనే ఆరోపణలన్నింటినీ ఒక ప్యాకేజీగా చేసి.. నేర శిక్షాస్మృతిలోని సెక్షన్ల ప్రకారం భర్త, అతని కుటుంబ సభ్యులపై కేసులు పెడుతున్నారు. భార్య తరఫున గట్టిగా బేరసారాలు చేసేందుకు భర్త, అతని కుటుంబ సభ్యులపై తీవ్రమైన నేరారోపణలు చేయటం కూడా పరిపాటిగా మారింది అని ధర్మాసనం ఆక్షేపించింది. ఈ డిమాండ్లలో అత్యధికంగా ఆర్థికపరమైనవే ఉంటున్నాయని ధర్మాసనం ప్రస్తావించింది.గృహ హింస ఫిర్యాదులతో రంగంలోకి దిగే పోలీసులు కూడా భర్త తరఫు బంధువుల్లో వృద్ధులను, అనారోగ్యంతో ఉన్నవారిని సైతం అరెస్టు చేసి బెయిల్ రాకుండా చేస్తున్నారని, ఈ ఘటలన్నీ ఒకే చైన్ సిస్టమ్ మాదిరిగా ఉంటాయని పేర్కొంది.విడాకులు తీసుకున్న తర్వాత మాజీ భర్తకు వ్యాపారంలో నష్టాలు వచ్చి దివాలా తీస్తే మాజీ భార్య వచ్చి ఆ కష్టాల్లో ఏమైనా భాగం పంచుకుంటుందా? అని ధర్మాసనం ప్రశ్నించింది... తీవ్ర మనస్పర్థలతో విడివిడిగా నివసిస్తోన్న దంపతుల వైవాహిక బంధాన్ని రద్దు చేస్తూ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో భార్యకు శాశ్వత భరణం నెలలోగా చెల్లించాలన్న కింది కోర్టు ఉత్తర్వులను సుప్రీం కోర్టు సమర్థించింది. ఈ క్రమంలో ఆ భర్త పై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేయడం గమనార్హం.తన భర్తకు రూ.5వేల కోట్ల ఆస్తులున్నాయని, అతని తొలి భార్యకు రూ500 కోట్లను భరణంగా ఇచ్చారు కనుక తనకూ అదే స్థాయిలో చెల్లించాలన్న పిటిషనర్ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. ఫ్యామిలీ కోర్టు నిర్ణయించిన రూ.12 కోట్ల భరణాన్ని ఖరారు చేసింది. -
ప్రపంచంలోనే తొలి కమర్షియల్ స్పేస్ స్టేషన్..అచ్చం లగ్జరీయస్ హోటల్..!
మాములుగా అంతరిక్ష కేంద్రాలు ఎలా ఉంటాయో తెలిసిందే. అవి వారి పరిశోధనకు అనుగుణంగా ఉంటాయి. అలా కాకుండా భూమ్మీద ఉండే అత్యంత విలాసవంతమైన హోటల్ మాదిరిగా ఉంటే..ఆ ఊహా అబ్బా అనిపిస్తోంది కదూ. అలాంటి ఆలోచనకే అంకురార్పణ చేసింది అమెరికా కొత్త స్టార్టప్ స్పేస్ టెక్ కంపెనీ వాస్ట్. ఈ కంపెనీ స్పేస్ ట్రావెల్ కొత్త శకానికి నాంది పలికింది. సాంప్రదాయ అంతరిక్ష కేంద్రాలకు స్వస్తి చెప్పి అత్యంత ఆధునాత లగ్జరియస్ హోటల్‌లా తీర్చిదిద్దనుంది. ఆగస్ట్ 2025లో ప్రయోగించనున్న స్పేస్ ఎక్స్ పాల్కన్ 9 రాకెట్లో హెవెన్ -1 అనే పేరుతో దీన్ని ఆవిష్కరించనుంది. అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్‌తో వ్యోమగాములకు రిసార్ట్ లాంటి వాతావరణాన్ని అందించనుంది. పత్రికా ప్రకటన ప్రకారం.. ఈ హెవెన్-1ని చెక్కతో అందంగా తీర్చిదిద్దిన ద్వారాలు, తెల్లటి గోడలు, హై ఎండ్ హోటల్‌కు సరిపోయే సౌకర్యాలతో అత్యంత ఆధునాతనంగా తీర్చిదిద్దారు.pic.twitter.com/6VD6XrJg8P— VAST (@vast) October 10, 2024 అంతేగాదు ఇందులో అత్యాధునిక జిమ్ కూడా ఉంటుందట. సందర్శకులు సున్నా గురుత్వాకర్షణలో చూసేలా వీలు కల్పిస్తోంది. ఇది అచ్చం భూమిపై ఉన్న హోటల్ మాదిరి అనుభూతిని అందిస్తుంది. అంతేగాదు ఈ హేవెన్ 1కి సంబంధించిన తుది డిజైన్‌ను స్పేస్ కంపెనీ వెస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీన్ని పీటర్ రస్సెల్ క్లార్ట్, వ్యోమగామి ఆండ్రూ ఫ్యూస్టెల్ రూపొందిస్తున్నారు. ఇందులో వ్యోమగాములు హాయిగా గదుల్లో ఉండేలా సౌకర్యం ఉటుంది. అలాగే మెరుగైన నిద్ర కోసం ప్రత్యేకంగా రూపొందించిన బెడ్ వంటివి కూడా ఉంటాయి. అంతేగాదు గుండె, ఎముకల ఆరోగ్యం కోసం ఆన్‌బోర్డ్ ఫిట్నెస్ సిస్టమ్ వంటి ఆధునాత సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఈ స్పేస్ఎక్స్ ఫాల్కన్ రాకెట్‌ను 2025లో ప్రారంభించనుండగా, అందులోని ఈ హెవెన్1 చెల్లింపు కస్టమర్లు మాత్రం 2026 నుంచి మొదలవుతారని వెల్లడించారు పరిశోధకులు. చెప్పాలంటే ఇది ప్రపంచంలోనే తొలి కమర్షియల్ స్పేస్ స్టేషన్. అందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. Today, Vast unveiled the final design for Haven-1, the world’s first commercial space station, setting a new standard. Guided by visionary designer Peter Russell-Clarke and astronaut Andrew Feustel, we’re pushing the boundaries of life in space with human-first design led by… pic.twitter.com/xDdMzNFnuF— VAST (@vast) October 10, 2024(చదవండి: ‘నలుగురు కూతుళ్లేనా..’ కాదు డాక్టర్ డాటర్స్..!) -
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే?
న్యూఢిల్లీ: దేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు అక్టోబర్ ఒకటిన ఉదయాన్నే వంటగ్యాస్ వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. 19 కిలోల గ్యాస్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.48.50 నుంచి రూ.50కి పెరిగింది.ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం ఇప్పుడు ఢిల్లీలో 19 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర 1740 రూపాయలకు చేరింది. అయితే డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలో కంపెనీలు ఎలాంటి మార్పు చేయలేదు. గతంలో మాదిరిగానే ఢిల్లీలో రూ.803కే లభ్యం కానుంది.2024, అక్టోబర్ ఒకటి నుండి, వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ముంబైలో రూ. 1,692.50, కోల్‌కతాలో రూ. 1,850.50, చెన్నైలో రూ. 1,903కు చేరింది. దీనికిముందు సెప్టెంబర్‌లో కూడా ఎల్పీజీ సిలిండర్ ధర సుమారు రూ.39 పెరిగి రూ.1,691.50కి చేరింది. దీనికి ముందు రూ.1,652.50గా ఉంది. కోల్‌కతాలో మంగళవారం నుంచి 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.48 పెరిగింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరల పెరుగుదల కారణంగా, రెస్టారెంట్లు, హోటళ్లు, ధాబాలలోని ఆహార ధరలు పెరగనున్నాయి.ఇది కూడా చదవండి: 31నే దీపావళి.. తేల్చిచెప్పిన కాశీ పండితులు -
LPG Price Hike: పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర
న్యూఢిల్లీ: చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను సవరించాయి. దీని ప్రభావం సామాన్యులపై కూడా కనిపించనుంది. సెప్టెంబర్ ఒకటి నుంచి ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.39 పెరిగింది. దీంతో ఇప్పుడు ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ రిటైల్ అమ్మకపు ధర రూ.1,691.50గా మారింది. అయితే డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.కోల్‌కతాలో వాణిజ్య సిలిండర్ కొత్త ధర రూ.1802.50గా, ముంబైలో కమర్షియల్ సిలిండర్ కొత్త ధర రూ.1644గా, చెన్నైలో కమర్షియల్ సిలిండర్ కొత్త ధర రూ.1855కి చేరింది. గత జూలై ఒకటిన వాణిజ్య సంస్థలకు ఉపశమనం కలిగించేందుకు చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. జూలై ఒకటిన 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.30 తగ్గింది.ప్రతి నెల ప్రారంభంలో ఎల్పీజీ సిలిండర్ ధరలలో చోటుచేసుకుంటున్న సర్దుబాట్లు మార్కెట్‌ను ప్రభావితం చేస్తుంటాయి. అంతర్జాతీయ చమురు ధరలు, పన్నుల విధానాలు , సరఫరా, డిమాండ్ వంటి వివిధ అంశాలు ఈ ధర నిర్ణయాలలో కీలకంగా ఉంటాయి. -
గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
చమురు కంపెనీలు ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ల ధరను తగ్గించాయి. ప్రతి నెల మొదటి తేదీన చమురు సంస్థలు ఎల్పీజీ సిలిండర్ ధరను సవరిస్తాయి. అందులో భాగంగా కొత్త ధరలు నేడు విడుదలయ్యాయి.జూలైలో చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య సిలిండర్ల ధరలను రూ .30 తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. కొత్త రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. కమర్షియల్ సిలిండర్ల ధరలు తగ్గుముఖం పట్టడం ఇది వరుసగా మూడో నెల. అయితే డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.వాణిజ్య సిలిండర్ల తాజా రేట్లుదేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1676గా ఉండగా నేటి నుంచి రూ.1646కు చేరింది. కోల్‌కతాలో రూ.1756, ముంబైలో రూ.1598, చెన్నైలో కమర్షియల్ ఎల్పీజీ ధర రూ.1809.50లకు ఎగిసింది. కాగా డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. దేశవ్యాప్తంగా డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.803లుగా ఉంది. -
‘కన్నడ’ బోర్డుల రగడ
బనశంకరి: వాణిజ్య, వ్యాపార సంస్థల కార్యాలయంపై దర్శనమిచ్చే సైన్‌బోర్డు, నేమ్‌ప్లేట్ల(నామఫలకాల)లో 60 శాతం బోర్డులు కన్నడలోనే ఉండాలనే బృహత్ బెంగళూరు మహానగర పాలిక(బీబీఎంపీ) నిబంధన తాజాగా బెంగళూరు నగరంలో బోర్డుల విధ్వంసానికి దారితీసింది. కన్నడ నగరంలో వ్యాపారం చేసే వారు ఎవరైనా సరే తమ కార్యాలయం బోర్డును కన్నడ భాషలోనే పెట్టుకోవాలంటూ కర్ణాటక రక్షణ వేదిక(ఎన్జీ) కార్యకర్తలు బుధవారం బెంగళూరులో ర్యాలీలతో వీరంగం సృష్టించారు. ఇంగ్లి‹Ùలో కనిపించిన ప్రతీ సైన్‌బోర్డును ధ్వంసంచేశారు. కొన్నింటిపై నలుపు రంగు పూశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేఆర్వీ కనీ్వనర్ టీఏ నారాయణ గౌడను అదుపులోకి తీసుకున్నారు. ఈ వివాదంపై బృహత్ బెంగళూరు మహానగర ఉన్నతాధికారి తుషార్ గిరినాథ్ స్పందించారు. సైన్‌బోర్డు, నేమ్‌ప్లేట్లలో 60 శాతం కన్నడలోనే ఉండాలన్న నిబంధనను ఫిబ్రవరి 28 నుంచి అమల్లోకి తెస్తామని, నిబంధనను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఆయన అన్నారు. -
బొగ్గు బ్లాకులను ఎవరూ వాపసు చేయలేదు..
న్యూఢిల్లీ: అనుమతుల్లో జాప్యం కారణంగా వాణిజ్య, క్యాప్టివ్ బొగ్గు గనులను కొన్ని సంస్థలు వాపసు చేస్తున్నాయన్న వార్తలను కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి అమృత్ లాల్ మీనా ఖండించారు. బొగ్గు బ్లాకులను పొందిన సంస్థలేవీ తిరిగి ఇచ్చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఆయా బ్లాకుల్లో పనులు ప్రణాళికకు అనుగుణంగానే సాగుతున్నాయని, తదనుగుణంగా ఉత్పత్తి కూడా ఉంటుందని పేర్కొన్నారు. పలు పనులు చేపట్టాల్సి ఉంటుంది కాబట్టి సాధారణంగా బొగ్గు గని అందుబాటులోకి రావడానికి సుమారు 51 నెలలు పడుతుందని మీనా చెప్పారు. వేలంలో గనులు దక్కించుకున్న సంస్థలకు సత్వరం క్లియరెన్సులను ఇచ్చేందుకు రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర పర్యావరణ శాఖతో బొగ్గు శాఖ కలిసి పని చేస్తోందని ఆయన వివరించారు. ప్రస్తుతం దేశీయంగా బొగ్గు ఉత్పత్తిలో.. కమర్షియల్, క్యాప్టివ్ (సంస్థలు తమ సొంత అవసరాలకు వినియోగించుకునేందుకు తీసుకునే గనులు) గనుల వాటా 14 శాతంగా ఉంటోందని చెప్పారు. 152 వాణిజ్య, క్యాప్టివ్ గనులు ఉండగా.. ప్రస్తుతం 51 గనుల్లో ఉత్పత్తి జరుగుతోందన్నారు. తదుపరి విడత కింద నవంబర్ 15కి కాస్త అటూ ఇటూగా మరో 40 కొత్త బ్లాకులను వేలం వేయనున్నట్లు మీనా పేర్కొన్నారు. అటు కోల్ ఇండియా రెండు అనుబంధ సంస్థల (బీసీసీఎల్, సీఎంపీడీఐ) లిస్టింగ్‌పై ప్రస్తుతం ఎలాంటి ప్రణాళికలు లేవని మీనా చెప్పారు. కోల్ ఇండియా పనితీరు బాగుందని, గత ఏడాది వ్యవధిలో కంపెనీ మార్కెట్ క్యాప్ 26 శాతం పెరిగిందని వివరించారు. బీసీసీఎల్, సీఎంపీడీఐలను ఒకదాని తర్వాత ఒకటిగా లిస్టింగ్ చేయనున్నట్లు ఆగస్టులో షేర్‌హోల్డర్ల వార్షిక సమావేశంలో కంపెనీ ప్రకటించింది. -
ఏటీఎఫ్ ధర 6 శాతం తగ్గింపు..
న్యూఢిల్లీ: నాలుగు నెలలుగా వరుసగా పెరుగుతూ వచి్చన విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు తాజాగా దాదాపు 6 శాతం తగ్గాయి. అయితే, వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్ (19 కేజీలు) రేటు రూ. 101.5 మేర పెరిగింది. గృహావసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ (14.2 కేజీలు) ధర మాత్రం యధాతథంగా రూ. 903 (ఢిల్లీలో) వద్దే ఉంది. ప్రభుత్వ రంగ ఇంధన రిటైలింగ్ సంస్థలు బుధవారం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఏటీఎఫ్ రేటు కిలోలీటరుకు రూ. 6,954.25 మేర (5.79 శాతం) తగ్గి రూ. 1,18,199.17కి దిగి వచి్చంది. జూలై నుంచి చూస్తే నాలుగు నెలల్లో విమాన ఇంధనం ధర రూ. 29,391 మేర పెరిగింది. ఎయిర్‌లైన్స్ నిర్వహణ వ్యయాల్లో ఇంధనం వాటా దాదాపు 40 శాతం ఉంటున్న నేపథ్యంలో తాజా తగ్గింపుతో విమానయాన సంస్థలకు కాస్త ఊరట లభించనుంది. మరోవైపు, సవరించిన రేట్ల ప్రకారం 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 1,833గా ఉంటుంది. వాణిజ్య సిలిండర్ ధరను పెంచడం ఇది రెండోసారి. అక్టోబర్ 1న రేటును ఏకంగా రూ. 209 మేర ఇంధన కంపెనీలు పెంచాయి. ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) సంస్థలు .. అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా ప్రతి నెల 1న వంట గ్యాస్, ఏటీఎఫ్ ధరలను సవరిస్తాయి. -
నాలాంటివాళ్లు కొత్త కథలే చేయాలి – సోహైల్
‘‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ప్రీమియర్ షో చూశాక చాలా మంది మహిళలు అమ్మ పడే ఇబ్బందులు బాగా చూపించారని కన్నీళ్లు పెట్టుకుని చెప్పా రు. దీంతో మా ప్రయత్నం విజయవంతం అయిందనిపించింది’’ అన్నారు సయ్యద్ సోహైల్ రియాన్. శ్రీనివాస్ వింజనం పాటి దర్శకత్వంలో సయ్యద్ సోహైల్, రూపా కొడవయూర్ జంటగా రూపొందిన చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. అప్పిరెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా సోహైల్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘స్టార్ హీరో లకు ఫ్యాన్స్ ఉంటారు. కమర్షియల్ సినిమాలు చేసినా వర్కవుట్ అవుతుంది. కానీ, నాలాంటి వాళ్లు కొత్త ప్రయత్నాలు చేస్తేనే ప్రేక్షకులు సినిమాలకు వస్తారని నమ్మాను. అందుకే ‘బిగ్ బాస్’ నుంచి రాగానే ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ వంటి కొత్త జానర్ మూవీ చేశాను. మేల్ ప్రెగ్నెన్సీ నిజంగా సాధ్యమైతే కనీసం 20 శాతం మంది మేల్స్ ప్రెగ్నెన్సీ తీసుకోవడం కోసం రెడీగా ఉన్నారు’’ అన్నారు. -
ఆకాశ ఎయిర్.. ఏడాది పూర్తి
ముంబై: విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ కాలంలో 43 లక్షల మందిని వారి గమ్యస్థానాలకు చేర్చినట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. 20 విమానాలతో వారంలో 900లకుపైగా సరీ్వసుల మైలురాయిని దాటినట్టు వెల్లడించింది. 2023 డిసెంబర్ నుంచి విదేశాలకూ సరీ్వసులను నడపనున్నట్టు ఇప్పటికే ఆకాశ ఎయిర్ తెలిపింది. దేశీయ విమానయాన రంగంలో సంస్థకు 4.9 శాతం వాటా ఉంది. ‘2022 ఆగస్ట్ 7న తొలి విమానం ముంబై నుంచి అహ్మదాబాద్‌లో అడుగుపెట్టింది. 16 నగరాలను అనుసంధానిస్తూ 35 రూట్లలో విమానాలు నడుస్తున్నాయి. సంస్థకు చెందిన విమానాల ద్వారా 25,000 టన్నులకు పైచిలుకు కార్గో రవాణా జరిగింది’ అని వివరించింది. ఇప్పటికే ఆకాశ ఎయిర్ 152 విమానాలకు ఆర్డర్లు ఇచి్చంది. వీటికి అదనంగా 2023 చివరినాటికి మూడంకెల స్థాయిలో విమానాలకు ఆర్డర్ ఇవ్వనున్నట్టు ధీమా వ్యక్తం చేసింది. శిక్షణ కోసం పెట్టుబడి చేస్తామని, దేశంలోని ప్రధాన నగరాల్లో లెరి్నంగ్ కేంద్రాలను నెలకొల్పుతామని తెలిపింది. ఆకాశ ఎయిర్‌ను ఎస్ఎన్వీ ఏవియేషన్ ప్రమోట్ చేస్తోంది. జెట్ ఎయిర్వేస్ మాజీ సీఈవో వినయ్ దూబే, ఇతరులు ఈ కంపెనీలో పెట్టుబడి చేశారు. -
కమర్షియల్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ముఖేశ్ అంబానీ
సాక్షి,ముంబై: బిలియనీర్, పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యాపార విస్తరణలో దూసుకుపోతోంది. కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగానికి పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో తాజాగా ఈ వ్యాపారంలోకి అడుగుపెడుతోంది. ఇందుకోసం రిలయన్స్ ఆర్ఎస్ఏయూఎల్ (RSOUL) లిమిటెడ్ అనే కొత్త యూనిట్‌ను స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లలో ప్రకటించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ బీఎస్ఈ ఫైలింగ్ ప్రకారం, రిలయన్స్ సోయు లిమిటెడ్ (Reliance SOU Ltd ) అనే పూర్తిగా యాజమాన్య అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. తద్వారా వాణిజ్య రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దూకుడుగా వస్తోంది. ఈ సంస్థలో (ఆర్ఎస్ఓఎల్ ఈక్విటీ షేర్లలో) రూ. ఒక లక్ష ప్రారంభ మూలధనాన్ని పెట్టుబడి పెట్టినట్లు తెలిపింది. అయితే రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ డెవలప్మెంట్ రంగంలో రిలయన్స్‌ది ఇదే మొదటి అడుగు కాదు. 2019లో, ముంబై వ్యాపార కేంద్రమైన బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లో 65శాతం వాటాను రూ.1,105 కోట్లకు కొనుగోలు చేసింది. నెల తరువాత, ఇది రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసం రిలయన్స్ నవీ ముంబై ఇన్ఫ్రా డెవలప్మెంట్ను స్థాపించింది. జియో వరల్డ్ గార్డెన్ బాంద్రా కుర్లాలోని జియో వరల్డ్ సెంటర్ వంటి ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. అలాగే గత ఏడాది సెప్టెంబర్ నాటికి రూ. 8,000 కోట్ల పెట్టుబడితో రిలయన్స్ అనుబంధ సంస్థ, మోడల్ ఎకనామిక్ టౌన్షిప్ లిమిటెడ్ (METL), ప్రస్తుతం హర్యానాలోని ఝజ్జర్‌లో సమీకృత పారిశ్రామిక టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేస్తోంది. తాజా నిర్ణయంతో కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలో అదానీ ప్రాపర్టీస్, టాటా రియల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, షాపూర్జీ పల్లోంజీ అండ్ కో వంటి దిగ్గజాలతో గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా. -
గుడ్‌న్యూస్.. తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధర
సాక్షి, ముంబై: ఎల్పీజీ సిలిండర్ల ధర వరుసగా దిగి వస్తోంది. 19 కేజీల వాణిజ్య సిలిండర్ల ధరను 115 రూపాయలు తగ్గించింది. దీంతో కమర్షియల్ వినియోగదారులకు భారీ ఉపశమనం లభించింది. తాజా సవరణతో హైదరాబాద్‌లో కమర్షియల్ వంట గ్యాస్ సిలిండర 1798.50 నుంచి 115 రూపాయలు తగ్గి 1683 రూపాయలుగా ఉంటుంది. ఇక దేశ రాజధాని నగరంలో ఢిల్లీలో రూ. 1,744 గాను కోలకతాలో రూ. 1,846, ముంబైలో రూ. 1,696, చెన్నైలో రూ. 1,893 గానూ ఉండనుంది. కొత్త రేట్లు తక్షణం అమల్లోకి వచ్చాయి. గత జూన్ మాసం నుంచి వరుసగా ఇది ఏడో తగ్గింపు కాగా, 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ధర జూలై నుండి మారకపోవడం గమనార్హం. కాగా చమురు కంపెనీలు ప్రతీ నెల వంట గ్యాస్ సిలిండర్ ధరలను సమీక్షిస్తుంటాయి. అయితే డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్‌లో ఎలాంటి మార్పు చేయలేదు. గత ఏడాది నవంబరులో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరన రూ. 266 పెంచింది. ఆ తరువాత 2022, జనవరి కొత్త ఏడాదిలో102.50 రూపాయల మేర సిలిండర్ ధర దిగి వచ్చింది. -
ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధర భారీ తగ్గింపు
సాక్షి, న్యూఢిల్లీ: వరుస చార్జీల బాదుడుతో విలవిల్లాడిన కమర్షియల్ సిలిండర్ వినియోగదారులకు స్వల్ప ఊరట లభించింది. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.135 తగ్గించినట్లు బుధవారం చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. ఈ తగ్గింపు ధరలు నేటి (జూన్ 1) నుంచి అమల్లోకి వచ్చినట్టు ఒక నోటిఫికేషన్లో తెలిపాయి. గత రెండు నెలలుగా వాణిజ్య సిలిండర్ ధరలను వరుసగా రెండుసార్లు పెంచిన తర్వాత తాజాగా ధర తగ్గించడం విశేషం. అయితే, గృహోపకరణాల గ్యాస్ సిలిండర్లలో ధరల సవరణను ప్రకటించలేదు. తాజా సవరణతో హైదరాబాద్‌లో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,220.50 అయింది. ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 2,355.50 నుండి రూ. 2219కి తగ్గింది. ముంబైలో 2,307 నుండి 2171.50 రూపాయలకు దిగి వచ్చింది. కోల్‌కతాలో రూ.2,455 ధరకు బదులుగా రూ.2,322 చెల్లించాల్సి ఉంటుంది. చెన్నైలో రూ.2,508 నుంచి రూ.2,373కి తగ్గింది. అయితే 14.2 కిలోల గృహోపకరణాల సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదు. మరి భవిష్యత్తులో వంట గ్యాస్ ధర కూడా తగ్గించనున్నారా? అనేది వేచి చూడాలి. -
ట్విటర్: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ఎలన్ మస్క్
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ట్విటర్ విషయంలో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ట్విటర్ యూజర్లకు స్వేచ్ఛ విషయంలో ఎలాంటి ఆటంకాలు ఉండబోవంటూ ప్రకటిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ స్వేచ్ఛను కొన్ని వర్గాలకు ఉచితంగా అందించకూడదనే నిర్ణయానికి ఆయన వచ్చాడు. ట్విటర్ ఇప్పటివరకు ఫ్రీ సోషల్ మీడియా యాప్. అయితే.. రాబోయే రోజుల్లో మాత్రం కొంత డబ్బు చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటికైతే కేవలం కమర్షియల్, ప్రభుత్వ అకౌంట్ల విషయంలో ఫీజు వసూలు చేయాలనే నిర్ణయానికి వచ్చాడు ట్విటర్ కొత్త బాస్ ఎలన్ మస్క్. ఈ ఫీజులు ఏమేర ఉంటాయనే విషయంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. క్యాజువల్ యూజర్స్‌కి ట్విటర్ సేవలు ఉచితమే, బహుశా ప్రభుత్వ, కమర్షియల్ యూజర్ల విషయంలో స్వల్పంగా ఫీజు వసూలు చేయొచ్చు అంటూ నిర్ణయాన్ని చెప్పకనే చెబుతూ బుధవారం ఎలన్ మస్క్ ఒక ట్వీట్ ద్వారా ప్రకటించాడు. Twitter will always be free for casual users, but maybe a slight cost for commercial/government users — Elon Musk (@elonmusk) May 3, 2022 ► ఇదిలా ఉండగా.. ప్రపంచంలోని చాలా దేశాల్లో అధ్యక్షుడి దగ్గరి నుంచి స్థానిక నేతల దాకా.. ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ సంబంధిత వ్యక్తులు.. ట్విటర్ ద్వారానే పోస్టులతో ప్రచారం చేస్తారనే విషయం తెలిసిందే. మరోపక్క కంపెనీలు సైతం తమ ప్రకటనలకు సోషల్ మీడియాలను వేదికగా చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో ఫీజులు స్వల్పంగానే ఉంటాయని ఎలన్ మస్క్ చెప్పినప్పటికీ.. ఇదంతా పైసా వసూల్ వ్యవహారమనే విషయం చెప్పకనే చెప్పినట్లయ్యింది. ► ట్విటర్ కొనుగోలు విషయంలో హైడ్రామా నడిచిన సంగతి తెలిసిందే. తాను ట్విటర్ కొనుగోలుకు ప్రయత్నించానంటూ మస్క్ చేసిన ట్వీట్‌తో మొదలై.. చివరకు వంద శాంతం వాటాను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసే దాకా డ్రామా నడిచింది. అయితే ట్విటర్ ఆఫీస్ నుంచి మేనేజ్మెంట్, వ్యవహారాలు ప్రతీ విషయంలో తాను సంతృప్తిగా లేనంటూ మస్క్ నేరుగా ట్విటర్ అధికార ప్రతినిధుల వద్దే ప్రస్తావించడం విశేషం. ► ఈ నేపథ్యంలో ట్విటర్లో సమూల మార్పులు రానున్నట్లు ముందుగానే సంకేతాలు ఇచ్చాడు ఎలన్ మస్క్. ముందు ముందు ఇంకా ట్విటర్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాడో అనే ఆసక్తి మొదలైంది ఇప్పుడు. ఇంకోవైపు సీఈవో పరాగ్ అగర్వాల్‌తో పాటు లీగల్ హెడ్ విజయా గద్దెను సైతం తప్పించే అవకాశాలు లేకపోలేదంటూ ది న్యూయార్క్ పోస్ట్ఒక కథనం ప్రచురించింది. ► ఎలన్ మస్క్ ఇంతకు ముందే ట్విట్టర్ బ్లూ ప్రీమియం సబ్స్క్రిప్షన్ సేవకు కొన్ని మార్పులను సూచించాడు. అందులో ధర తగ్గింపు ప్రస్తావన కూడా ఉంది. ఇక మొన్న సోమవారం న్యూయార్క్‌లోని వార్షిక మెట్ గాలాలో, ఎలాన్ మస్క్ పారదర్శకంగా పని చేస్తుంటాడు ప్రకటించాడు. మరో ఆరు నెలలో ట్విటర్ పూర్తిగా ఎలన్ మస్క్ చేతుల్లోకి వెళ్లనుంది. చదవండి: మస్క్ బెదిరింపులకు భయపడం! -
విమానయానానికి మరింత డిమాండ్ ..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్‌పరమైన సవాళ్లు క్రమంగా తగ్గుతుండటంతో దక్షిణాసియాలో విమానయానానికి మరింతగా డిమాండ్ పెరగనుందని విమానాల తయారీ దిగ్గజం బోయింగ్ కమర్షియల్ ఎయిర్‌ప్లేన్స్ ఎండీ (రీజనల్ మార్కెటింగ్) డేవ్ షుల్టి తెలిపారు. వ్యాపార అవసరాలు, విహారయాత్రలు మొదలైన వాటి కోసం ప్రయాణాలు చేసేందుకు ప్రజల్లో మళ్లీ ధీమా పెరుగుతోందని, ఎయిర్‌లైన్స్ కూడా సర్వీసులను పెంచుతున్నాయని ఆయన చెప్పారు. దాదాపు 90 శాతం వాటాతో దక్షిణాసియా విమానయాన మార్కెట్లో భారత్ కీలకంగా ఉంటోందని వివరించారు. ఈ నేపథ్యంలో రాబోయే 20 ఏళ్లలో భారత ఎయిర్‌లైన్ ఆపరేటర్లకు కొత్తగా 2,000 పైగా చిన్న విమానాలు అవసరమవుతాయని డేవ్ చెప్పారు. ఇందుకు సంబంధించి దక్షిణాసియా, భారత మార్కెట్‌పై బోయింగ్ రూపొందించిన అంచనాల నివేదికను శుక్రవారమిక్కడ వింగ్స్ ఇండియా 2022 కార్యక్రమం సందర్భంగా డేవ్ ఆవిష్కరించారు. భారత్ ఆర్థిక వృద్ధి మెరుగుపడుతుండటం, మధ్య తరగతి వర్గాల పరిమాణం పెరుగుతూ ఉండటం తదితర సానుకూల అంశాల ఊతంతో దక్షిణాసియాలో డిమాండ్ పుంజుకోగలదని ఆయన తెలిపారు. ఫలితంగా దక్షిణాసియాలో వచ్చే రెండు దశాబ్దాల్లో ఎయిర్ ట్రాఫిక్ ఏటా 6.9 శాతం మేర వృద్ధి నమోదు కాగలదని, కొత్తగా దాదాపు 375 బిలియన్ డాలర్ల విలువ చేసే 2,400 కమర్షియల్ విమానాలు అవసరమవుతాయని డేవ్ పేర్కొన్నారు. దూర ప్రాంతాలకు సర్వీసులను మెరుగుపర్చుకోవడానికి విమానయాన సంస్థలు.. ఇంధనం ఆదా చేసే విశిష్టమైన పెద్ద విమానాలపై మరింతగా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం దేశీ ఎయిర్‌లైన్స్‌కు బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ తరహా పెద్ద విమానాలు 240 పైగా అవసరం పడవచ్చని వివరించారు. భారత్‌లో కార్గో కార్యకలాపాలు సగటున 6.3 శాతం వార్షిక వృద్ధి సాధించే అవకాశం ఉందని బోయింగ్ తన నివేదికలో పేర్కొంది. దేశీయంగా 75 పైగా రవాణా విమానాలు అవసరమవుతాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. -
అనుకున్నట్టే అయ్యింది .. గ్యాస్ సిలిండర్ ధరల పెంపు..
Oil Companies Hike LPG Price: రష్యా - ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అంతా భయపడుతున్నట్టే జరిగింది. ధరల పెంపు నిర్ణయాన్ని ముందుగా చమురు కంపెనీలు ప్రకటించాయి. వాణిజ్య సిలిండర్ ధరలు పెంచుతూ సోమవారం చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు 2022 మార్చి 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచాయి చమురు కంపెనీలు. 19 కేజీల సిలిండర్ ధరపై రూ. 105లు , 5 కేజీల సిలిండర్‌పై రూ. 27 వంతున ధర పెంచాయి. దీంతో దేశ రాజధానిలో కమర్షియల్ సిలిండర్ ధర రెండు వేలు దాటింది. 19 కేజీ సిలిండర్ ధర రూ. 2,012కి చేరగా 5 కేజీల సిలిండర్ ధర రూ. 569గా ఉంది. పెరిగిన ధరలను పరిగణలోకి తీసుకుని వివిధ నగరాల వారీగా 19 కేజీలు సిలిండర్ల ధరను పరిశీలిస్తే చెన్నైలో రూ. 2185, ముంబై రూ.1962 , కోల్‌కతా రూ.2089లు, హైదరాబాద్‌లో రూ.1904లుగా నమోదు అవుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతుండటంతో గృహ అవసరాలకు ఉపయోగించే సిలిండర్ ధరలు పెంచే సాహాసం చమురు కంపెనీలు చేయలేదు. దీంతో వీటి ధరల్లో ఎటువంటి మార్పులేదు. అయితే త్వరలోనే డొమెస్టిక్ సిలిండర్లకు ధరల వాత తప్పదనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ద్రవ్యోల్బణం ఎఫెక్ట్‌తో కొట్టుమిట్టాడుతున్న చిరు వ్యాపారులకు, స్ట్రీట్‌ఫుడ్ వెండర్స్‌కి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల పెంపు అశనిపాతంగా మారింది. కోవిడ్ కారణంగా వచ్చిన నష్టాల భర్తీకి గతంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచారు. దీంతో తమ ఆదాయానికి గండి పడుతుందనే ఆవేదన చిరు వ్యాపారుల నుంచి వచ్చింది. ఇప్పుడు ఒకేసారి ఒక్కో సిలిండర్‌పై రూ. 105 వంతున ధరల పెంచాయి చమురు కంపెనీలు -
మాటలకే పరిమితమైన మల్టీలెవెల్ పార్కింగ్!!
సాక్షి హైదరాబాద్: గ్రేటర్ నగరంలో వాహనాల సాఫీ ప్రయాణానికి ఫ్లైఓవర్లు, లింక్‌రోడ్లు వంటివి నిర్మిస్తున్నప్పటికీ పార్కింగ్ సదుపాయాలను మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా వాణిజ్య ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య నివారణ కోసం వాణిజ్య ప్రాంతాల్లో మల్టీలెవల్ పార్కింగ్ సదుపాయాలు కల్పిస్తామని ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ఏళ్ల తరబడి చెబుతున్నప్పటికీ, ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. నగరంలో దాదాపు వంద ప్రాంతాల్లో మల్టీలెవెల్ పార్కింగ్ ఏర్పాట్లు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పటికీ, ఒక్కచోట కూడా అందుబాటులోకి రాలేదు. నాలుగేళ్ల క్రితమే.. దాదాపు నాలుగేళ్ల క్రితం ప్రైవేట్ స్థలాల్లో పార్కింగ్ లాట్ల ఏర్పాటుకు ముందుకొచ్చేవారిని ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ వెలువరించారు. అయినా స్పందన లేకపోవడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. అనంతరం.. రెండేళ్ల క్రితం వాణిజ్య స్థలాల్లో మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాట్లు చేసే సాంకేతిక సామర్థ్యం కలిగిన వారికి.. ప్రైవేట్ స్థలాలున్న యజమానులకు మధ్య ఒప్పందం కుదిర్చే బాధ్యతను తీసుకోవాలని జీహెచ్ఎంసీ భావించింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నగరాల్లోని మల్టీ పార్కింగ్ విధానాలను సేకరించాలని, కువైట్‌కు చెందిన కేజీఎల్ ఏజెన్సీ నుండి మల్టీలెవల్ పార్కింగ్ నిబంధనలను తెప్పించుకోవాలని కమిషనర్ లోకేశ్‌కుమార్ అధికారులకు సూచించారు. పార్కింగ్ కోసం స్థలాలిచ్చేందుకు ముందుకొచ్చేవారి వివరాలను ప్రభుత్వానికి నివేదించి నియమ నిబంధనల అమలును జీహెచ్ఎంసీ మానిటరింగ్ చేయాలని భావించారు. కానీ ఇప్పటి వరకూ ముందడుగు పడలేదు. మొబైల్ యాప్‌లో వివరాలు.. మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాట్లు చేయడం ద్వారా పార్కింగ్ సదుపాయం తదితర వివరాలు వాహనదారులకు తెలిసేలా ప్రత్యేక యాప్‌ను రూపొందించాలనుకున్నారు. అంతేకాదు.. అవసరమైతే సదరు యాప్ నిర్వహణను గూగుల్ వంటి సంస్థలకు అప్పగించాలనుకున్నా రు. ఆలోచనలు బాగానే ఉన్నప్పటికీ, అమలుకు మాత్రం నోచుకోలేదు. మరోవైపు, పబ్లిక్ పార్కింగ్ కోసం ప్రభుత్వ శాఖలకు చెందిన ఇరవై స్థలాల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాట్లకు హెచ్ఎంఆర్ఎల్కు బాధ్యతలప్పగించినా ఏర్పాటు కాలేదు. (చదవండి: worlds longest name: ఎంత పె...ద్ద.. ‘పేరు’!) -
భారీగా తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధర
సాక్షి, న్యూఢిల్లీ: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్‌పై రూ. 122 మేర తగ్గిస్తూ తాజాగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయించాయి. నేటి(జూన్ 1) నుంచి ఈ సవరించిన ధరలు అమల్లోకి వచ్చాయి. అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మాత్రం ఊరట లభించలేదు. 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధర మాత్రం యథాతథంగానే ఉండనుంది. వాణిజ్య సిలిండర్ ధర మే నెలలో కూడా తగ్గిన విషయం తెలిందే. తాజా సవరణతో ఢిల్లీలో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.1473కి చేరింది. ముంబైలోరూ.1422కు, కోల్‌కతాలో రూ.1544కు, చెన్నైలో కూడా సిలిండర్ ధర రూ.1603కు తగ్గింది. ఇక 14 కేజీల గ్యాస్ సిలిండర్ ఢిల్లీ లో 14 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ. 809గా ఉంది. . కోల్‌కతాలో రూ.835, ముంబైలో సిలిండర్ ధర రూ. 809గానూ, చెన్నైలో రూ. 825గా హైదరాబాద్‌లో రూ. 861.50 గానూ ఉంది. చదవండి: మిషన్ చోక్సీ: కీలక మహిళ ఎవరంటే? కరోనా విలయం: కోటి ఉద్యోగాలు గల్లంతు -
వ్యాక్సిన్ విదేశాలకు ఎందుకంటే..
న్యూఢిల్లీ: దేశంలోని ప్రజలను పట్టించుకోకుండా విదేశాలకు వ్యాక్సిన్లను పంపడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర బుధవారం వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ఈ వ్యవహారాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా రాజకీయం చేసే ప్రయత్నాలు చేస్తున్నా యని తెలిపారు. సీరం సంస్థ తయారు చేస్తున్న వ్యాక్సిన్ మేధో హక్కులు ఆస్ట్రాజెనెకాతో ముడిపడి ఉన్నాయన్నారు. మరోవైపు వ్యాక్సిన్ల తయారీకి అవసరమవుతున్న ముడి పదార్థాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. ఈ క్రమం లో మొత్తం డోసులను కేవలం భారతీయులకే ఉపయోగించడం కుదరదని, మేధోపర హక్కుల రీత్యా, ఇతర దేశాల నుంచి పొందిన సాయం రీత్యా కొన్ని డోసులను ఎగుమతి చేయాల్సి ఉంటుందన్నారు. కోవిషీల్డ్ మేధోపర హక్కులు వేరే సంస్థతో ముడిపడి ఉందన్నారు. అందుకే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అడిగినట్లు సీరం సంస్థ వ్యాక్సిన్ ఫార్ములను ఇతరులకు అందించే అవకాశం లేకుండా పోయిందన్నారు. చదవండి: (ఆందోళన అవసరం లేదు.. నీటి ద్వారా కరోనా వ్యాప్తి చెందదు) ఇప్పటి వరకూ 1.07 కోట్ల డోసులను ఇతర దేశాలకు సాయం అందజేశామని, 78.5 లక్షల డోసులు ఏడు ఇరుగుపోరుగు దేశాలకు పంపినట్లు తెలిపారు. మరో 2 లక్షల డోసులు ఐక్యరాజ్య సమితికి పంపినట్లు తెలిపారు. దాని ద్వారా పేద దేశాలకు సాయం అందుతుందన్నారు. వాస్తవాలు తెలియకుండా వ్యాక్సిన్ ఎగుమతుల గురించి రాజకీయం చేయవద్దంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్‌ను కోరారు. 5.50 కోట్ల డోసులను ఉత్పత్తి సంస్థలు కమర్షియల్, లైసెన్సింగ్ ఒప్పందాల కింద విదేశాలకు ఎగుమతి చేసినట్లు తెలిపారు. ఎగుమతి చేసిన టీకాల్లో ఇవే 84 శాతమన్నారు. -
ఏపీ: వాహన విక్రయాల్లో జోష్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వాణిజ్య, వ్యవసాయ వాహన విక్రయాలు భారీగా పెరిగాయి. గతేడాది మార్చితో పోల్చితే ఈ ఏడాది మార్చిలో పెద్ద ఎత్తున వాహనాల అమ్మకాలు జరిగాయి. వాణిజ్య అవసరాల నిమిత్తం ఈ ఏడాది మార్చిలో 1,366 ట్రాక్టర్లు, ప్రైవేట్ వినియోగానికి మరో 1,891 ట్రాక్టర్లను ప్రజలు కొనుగోలు చేశారు. అలాగే వ్యవసాయ అవసరాల కోసం ఈ ఏడాది మార్చిలో 430 ట్రిల్లర్లు, వాణిజ్య అవసరాల కోసం మరో 960 ట్రిల్లర్లను కొన్నారు. ఆటోల విక్రయాలు అయితే ఈసారి భారీగా పెరిగాయి. గతేడాది మార్చిలో కేవలం 158 ఆటోల విక్రయాలు జరగ్గా.. ఈ ఏడాది మార్చిలో ఏకంగా 1,842 ఆటోలను విక్రయించారు. అలాగే మోటారు సైకిళ్లు, కార్ల అమ్మకాలు కూడా గతేడాది మార్చితో పోల్చితే.. ఈ ఏడాది మార్చిలో పెరిగాయి. మొత్తం మీద గతేడాది మార్చిలో 32,814 వాహనాలను విక్రయించగా.. ఈ ఏడాది మార్చిలో ఏకంగా 84,509 వాహనాలను విక్రయించారు. చదవండి: విదేశీ ఎగుమతుల్లో ఏపీ రికార్డు కొనుగోళ్లకు అధిక ప్రా'ధాన్యం' -
తెలంగాణ: చౌకగా ఇంటి, వాహన గ్యాస్..
హైదరాబాద్: టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఆ టెక్నాలజీని అభివృద్ధి చేసి కొత్త పుంతలు తొక్కిస్తోంది. పటిష్టమైన ప్రణాళికతో ఎలాంటి వ్యయ ప్రయాసలు లేకుండా నేరుగా పైపుల ద్వారా గృహ, వాణిజ్య అవసరాలకు మేఘా గ్యాస్‌ను సరఫరా చేస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికి నేరుగా గ్యాస్‌ను సరఫరా చేయడంతో పాటు వాహన అవసరాలకు ఇంధనాన్ని అందిస్తోంది. ఈ మేఘా టెక్నాలజీతో సమయం ఆదాతో పాటు వినియోగదారులకు సులభంగా, సురక్షితంగా గ్యాస్ అందిస్తోంది. ఒక వైపు ఆకాశాన్నంటిన ఎల్పీజీ సిలిండర్ ధరలు.. మరో వైపు పరుగులు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ రేట్లతో పేద, మధ్యతరగతి గృహ వినియోగదారులు భారం మోయలేకపోతున్నారు. ఆ భారాన్ని తగ్గించి వారికి ఊరటనివ్వడానికి మేఘా ఇంజనీరింగ్ సంస్థ కృషి చేస్తోంది. పక్కా ప్రణాళికతో శరవేగంగా సీజీడీ, సీఎన్జీ గ్యాస్ స్టేషన్లను నిర్మించి మధ్యతరగతి ప్రజలకు భారం తగ్గిస్తోంది. ఎల్పీజీ సిలిండర్ ధరలతో పోలిస్తే 40 శాతం తక్కువ రేటుకు మేఘా గ్యాస్‌ను ఎంఈఐఎల్ అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ర్టాల్లో ఇప్పటికే గ్యాస్ ను సరఫరా చేస్తున్న ఎంఈఐఎల్ సంస్థ ఇప్పుడు తెలంగాణాలో తన సేవలను విస్తరిస్తోంది. అందులో భాగంగా నల్గొండ జిల్లాలో సేవలను ఇటీవలనే ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అన్ని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతీ ఇంటికి వాణిజ్య పరంగా వంటగ్యాస్ సరఫరా చేయాలనే ఉద్దేశ్యంతో తీసుకువచ్చిన సీజీడీ (City Gas Distribution) ప్రాజెక్ట్‌లో భాగంగా మేఘా ఇంజనీరింగ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక ప్రాంతాల్లో పనులను పూర్తి చేసి మేఘా గ్యాస్ కింద గ్యాస్ సరఫరా సేవలను చౌకదరలకు అందిస్తోంది. 5000 కోట్లతో ఈ మూడు రాష్ర్టాలలో కలిపి మొత్తం 11 లక్షల గ్రహాలకు గ్యాస్ సరఫరా కనెక్షన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ సిజిడి వ్యవస్థ ద్వారా దాదాపు 4 వేల మంది ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ఉపాధి పొందనున్నారు. నల్గొండ జిల్లాలో తొలిసారిగా గ్యాస్ పైప్ లైన్, సిటీ గేట్ స్టేషన్, పనులను గడువులోగా పూర్తి చేసి నల్గొండ ప్రజలకు 'మేఘా గ్యాస్' కింద చౌక ధరలకు గ్యాస్ సరఫరా చేస్తోంది. సీజీడీ - నల్గొండ ప్రాజెక్ట్ లో భాగంగా నల్గొండ జిల్లాలోని వెలిగొండ మండలం, సుంకిషాల గ్రామంలో సహజవాయువు సరఫరా లో కీలకమైన సిటీ గేట్ స్టేషన్ (CGS), మదర్ స్టేషన్ ను ప్రారంభించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్యాస్ సరఫరా సేవలను అందిస్తోంది మేఘా సంస్థ. వ్యయ ప్రయాసలు తగ్గించి సులభంగా ఇంటింటికి గ్యాస్ అందే విధంగా ‘మేఘా గ్యాస్’ పటిష్టమైన ప్రణాళికతో మౌళిక వసతులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ర్టాల్లోని వివిధ జిల్లాలో అమలు చేస్తున్నట్లు మేఘా గ్యాస్ బిజినెస్ హెడ్ పలింపాటి వెంకటేశ్ తెలిపారు. ప్రజల అవసరాల దృష్ట్యా గ్యాస్ సిటీ గేట్ స్టేషన్ ద్వారా PNG ( piped natural gas) గృహ, పారిశ్రామిక అవసరాలకు, అలాగే మదర్ స్టేషన్ ద్వారా సీఎన్జీ (compressed Natural Gas) ని వాహన అవసరాల కోసం అందుబాటులోకి తీసుకురావడం ఎంతో గర్వకారణమన్నారు. దీనితో నల్గొండ జిల్లాలో మరో 10 స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఇప్పటికే 32 km స్టీల్ పైప్ లైన్ వేయగా, మరో 80 కి.మీ పైప్ లైన్ పనులు కొనసాగుతున్నాయి. 40,000 కుటుంబాలకు, పరిశ్రమలకు గ్యాస్ సరఫరా చేసే ఉద్దేశ్యం తో ఇంకా 500 కి.మీ పొడవు గల ఎండీపీఈ పైప్ లైన్ నిర్మాణము చేపడుతోంది. అంతే కాకుండా మేఘా సంస్థ నల్గొండ జిల్లాలో బిబినగర్, భువనగిరి, చౌటుప్పల్, చిట్యాల, నల్గొండ, నకిరేకల్, మిర్యాలగూడ, మల్లేపల్లి, సూర్యాపేట మరియు కోదాడ లలో 10 సీఎన్జీ స్టేషన్లు నిర్మిస్తున్నారు. సిజిడి ప్రాజెక్ట్‌లో భాగంగా ఇంటింటికి గ్యాస్ సరఫరా చేయడానికి ఉమ్మడి నల్గొండతో పాటు రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పైప్ లైన్ నిర్మాణంతో పాటు 20 సిఎన్జి స్టేషన్లను త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నారు. ఎంఈఐఎల్ ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా, కర్నాటకలోని తూంకూరు - బెల్గాం జిల్లాలలో గ్యాస్ సరఫరాను ఇప్పటికే ప్రారంభించింది. కృష్ణా జిల్లాలోని నున్న సమీపంలో సిటి గ్యేట్ స్టేషన్ ద్వారా, అలాగే తూంకూరు - బెల్గాం జిల్లాల్లోనూ గ్యాస్ ప్రాజెక్ట్ ను ప్రారంభించి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గృహ - వాణిజ్య అవసరాలకు నేరుగా గ్యాస్ సరఫరా చేయటం ద్వారా ఏకో ఫ్రెండ్లీ పద్ధతులను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు అవసరమైన గ్యాస్‌ను ఓఎన్జీసీ - గెయిల్ నుంచి పొందనుంది. మేఘా గ్యాస్ ‘ఇట్స్ స్మార్ట్ - ఇట్స్ గుడ్’ అనే ట్యాగ్ లైన్ తో తన సేవలను విస్తరిస్తున్న మేఘా గ్యాస్ గృహాలు - వాణిజ్య సంస్థలు - పారిశ్రామిక సంస్థలతో పాటు రవాణా వాహనాలకు సహజ వాయువును సరసమైన ధరకు అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని ఆగిరిపల్లిలో ఏర్పాటు చేసిన మదర్ స్టేషన్ నుంచి గ్యాస్‌ను వివిధ ప్రాంతాలకు సరఫరా చేసేందుకు స్టీల్ - ఎండిపీ ఈ పైప్‌లను 722 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసారు కర్ణాటకలోని తూంకూరు జిల్లాలో కూడా ఇంటింటికి గ్యాస్ సరఫరా చేస్తోంది. వక్కోడి - హెగ్గేరి - గోళ్లహళ్లి - గొల్లరహతి - కుప్పూరు - దసముద్దేప్యా - సిరగతే - దిబ్బుర్ - గుళురు - సంతపేట - మరురూర్ దీన్నే - శేట్టిహళ్లి - జయనగర్ - గోకుల్ ఎక్స్ టెన్షన్ - ఖ్యాతిసాండ్రా - హీరేహళ్లి ఏరియా - మంచికల్ కుప్పె - బట్వాడీ - హనుమంతపురలో 595 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ ఏర్పాటు చేసింది. అలాగే బెల్గామ్ జిల్లాలో బసవన్న కోళ్ల - ఆటోనగర్ - రాంతీర్థనగర్ - అశోక సర్కిల్ - ఆజాద్ నగర్ - చెన్నమ్మ సర్కిల్ - మారుతీ నగర్ - సదాశివ నగర్ తదితర ప్రాంతాల్లో 460 కిలోమీటర్ల మేర స్టీల్ - ఎండిపీ ఈ పైప్ లైన్ వేశారు. చదవండి: వీధి కుక్కలంటే అందరికి భయం.. కానీ ఆమెకు కాదు! ప్రముఖ హిప్నాటిస్ట్ కమలాకర్ కన్నుమూత -
సరుకు డెలివరీకి సరికొత్త ఇ-స్కూటర్
సాక్షి,న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీలో ఉన్న కబీరా మొబిలిటీ హెర్మ్స్-75 పేరుతో హైస్పీడ్ ఈ-స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. గోవా ఎక్స్‌షోరూంలో దీని ధర రూ.89,600. పర్యావరణ అనుకూల మొబిలిటీ పరిష్కారాలను అందించే లక్ష్యం, సరుకు డెలివరీకి ఉపయుక్తంగా ఉండేలా దీనిని రూపొందించినట్టు కంపెనీ తెలిపింది. ఒకసారి చార్జ్ చేస్తే ఫిక్స్డ్ బ్యాటరీ అయితే 120 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. మార్చుకోవడానికి వీలుండే స్వాపేబుల్ బ్యాటరీతో 80 కిలోమీటర్లు జర్నీ చేయవచ్చు. గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో పరుగెడుతుంది. కబీరా ఖాతాలో ఇప్పటికే రెండు ఎలక్ట్రిక్ బైక్స్, ఆరు స్కూటర్ మోడళ్లున్నాయి. Introducing Hermes 75, the Electric Bull. Starting at ₹89,600. Learn more at https://t.co/FmBFZmyszu #Hermes75 #KabiraMobility #KM #HelloEV pic.twitter.com/D2T036uvHw — KabiraMobility (@KabiraMobility) April 12, 2021 -
మళ్లీ పెరిగిన వంట గ్యాస్ ధర
సాక్షి, న్యూఢిల్లీ : అదుపులేకుండా పెరుగుతున్న వంట గ్యాస్ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. తాజాగా వంట గ్యాస్ సిలిండర్ ధరపై రూ.25 పెంచారు. ఈ ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కంపెనీలు ప్రకటించాయి. తాజాపెంపుతో ఢిల్లీలో 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.819కు పెరిగింది. అలాగే 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధర మరో రూ .95 పెరిగింది. దీంతో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1614కు చేరింది. దీంతో ఒక్క నెలరోజుల వ్యవధిలోనే సిలిండర్ ధర రూ.100లకు పైగా భారం కావడం గమనార్హం. హైదరాబాదులో ఇప్పటిదాకా రూ.846.50గా ఉన్న సిలిండర్ ధర ప్రస్తుత బాదుడుతో రూ.871.50కి చేరింది. బెంగళూరులో రూ.823, చెన్నైలో రూ.835, ముంబైలో రూ.819, కోల్‌కతాలో రూ.845కి చేరింది. ఈ నెల 4న సిలిండర్‌పై రూ.25 పెంచగా 15న తేదీన మరో రూ.50 వడ్డించాయి. చివరగా గత నెల 25న కూడా 25 రూపాయలు పెరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు మండుతున్న పెట్రోలు డీజిల ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. -
రూ.3500 కోట్లను సమీకరించిన భారతీ ఎయిర్టెల్
దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ హోల్డింగ్ కంపెనీ భారతీ టెలికాం రూ.3500 కోట్లను సమీకరించింది. వాణిజ్య పేపర్ల జారీ చేయడం ద్వారా ఈ మొత్తం నిధులను సమీకరించినట్లు కంపెనీ ఒక ప్రకనటలో తెలిపింది. 3నెలల మెచ్యూరిటితో సగటున 6.16శాతం ఆఫర్ చేసింది. సమీకరించిన నిధులను రుణాల చెల్లింపులకు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చడానికి వినియోగిస్తామని కంపెనీని తెలిపింది. ‘‘రేట్ల మేన్‌జ్, ఇప్పటికే ఉన్న పోర్ట్‌ఫోలియో రీఫైనాన్సింగ్ నిర్వహించడానికి కంపెనీ చేసే సాధారణ ట్రెజరీ కార్యకలాపాలు ఇవి.’’ అని భారతీ గ్రూప్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. క్యూఐపీ, ఓవర్సీస్ కన్వర్టబుల్ బాండ్ల జారీతో ఇప్పటికే ఈ ఏడాదిలో భారతీ ఎయిర్టెల్ 3బిలియన్ డాలర్లను సమీకరించింది. ఎయిర్‌టెల్‌లో భారతి టెలికాం 38.79 శాతం వాటాను కలిగింది. మార్చి 31 ముగిసిన త్రైమాసికం నాటికి కంపెనీకి మొత్తం రూ.88,251 కోట్ల నికర రుణాన్ని కలిగి ఉంది. లీజ్ ఆబ్లికేషన్‌తో కలుపుకుంటే కంపెనీ మొత్తం రుణాలు రూ.1.18లక్షల కోట్లకు చేరుకుంటుందని కంపెనీ తెలిపింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం... ఏప్రిల్ 17, మే 15 మధ్య తేదిల్లో 3 నెలల కమర్షియల్ పేపర్ల వడ్డీ రేట్లపై 220 బేసిస్ పాయింట్లు తగ్గాయి. ఆర్బీఐ ఈ శుక్రవారం మే 22న పాలసీ రేటును శుక్రవారం 40 బేసిస్ పాయింట్లు తగ్గించిన తరువాత కమర్షియల్ పేపర్లపై వడ్డీ రేటు మరింత తగ్గే అవకాశం ఉంది. భారతీ ఎయిర్టెల్ సమీకరించిన మొత్తం నగుదు ప్రధానంగా స్వల్పకాలిక ఫైనాన్సింగ్ అవసరాలను తీర్చేందుకు, ఇప్పటికే ఉన్న అప్పుల చెల్లింపులకు వినియోగించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు రోహణ్ దమీజా తెలిపారు. -
ఫీ‘జులుం’పై చర్యలేవీ..?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్య వ్యాపారీ కరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణను ప్రారంభించింది. సోమవారం దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఈ క్యాంపెయిన్ ను మాజీ మంత్రి, మండలిలో మాజీ ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ తొలి సంతకం చేసి ప్రారంభించారు. టీపీసీసీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి షబ్బీర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో పాఠశాల విద్య భారతదేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే అత్యంత ఖరీదైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు కాంగ్రెస్ ప్రభుత్వం 2009 ఆగస్టులో అమల్లోకి తెచ్చిన ఉత్తర్వులను టీఆర్ఎస్ తుంగలో తొక్కింద న్నారు. సీఎం కేసీఆర్ విద్యావ్యాపారంపై ఎప్పుడూ కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదని, దాదాపు 52 శాతం మంది పిల్లలు చదువుకుంటున్న ప్రైవేటు విద్యాసంస్థలకు ముకుతాడు వేయడం గురించి ఆయన పట్టించుకోలేదని ఆరోపించారు. టీపీసీసీ మైనార్టీ సెల్ చైర్మన్ అబ్దుల్లా సోహైల్ మాట్లాడుతూ.. రానున్న 2 నెలల్లో 10 లక్షల సంతకాలను సేకరించి గవర్నర్‌కు ఇస్తా మని చెప్పారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తొలి సంతకం చేస్తున్న మాజీ మంత్రి షబ్బీర్‌అలీ -
వెస్టియన్‌కు పీఈఆర్‌పీ అవార్డు
సాక్షి, హైదరాబాద్: చికాగో ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న నివాస, వాణిజ్య, రిటైల్ రంగాల్లో వర్క్‌ప్లేస్ సొల్యూషన్ కంపెనీ వెస్టియన్‌కు కస్టమర్ వాల్యూ లీడర్షిప్ అవార్డు దక్కింది. ముంబైలో జరిగిన 5వ ఫ్రోస్ట్ అండ్ సులివన్ ప్రాజెక్ట్ ఎవాల్యుయేషన్ అండ్ రికగ్నిషన్ ప్రోగ్రాం (పీఈఆర్‌పీ) అవార్డు–2018 కార్యక్రమంలో వెస్టియన్ వైస్ ప్రెసిడెంట్ రాజ్‌కిరణ్ నాయక్ ఈ అవార్డును అందుకున్నారు. వెస్టియన్‌కు ఈ అవార్డు రావటం వరుసగా నాల్గోసారి. -
నివాస భవనాలకూ ఈసీబీసీ
సాక్షి, హైదరాబాద్: నివాస భవనాలకు ఎనర్జీ కన్సర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ) నిబంధన అమల్లోకి వచ్చింది. గతేడాది జూన్‌లో వాణిజ్య భవనాలకు ఈసీబీసీ కోడ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. నివాస విభాగంలో ఈసీబీసీ కోడ్‌తో 2030 నాటికి 125 బిలియన్ యూనిట్ల విద్యుత్ శక్తి ఆదా అవుతుందని కేంద్రం అంచనా వేసింది. నివాస, వాణిజ్య భవనాలు రెండు విభాగాల్లో కలిపి 2030 నాటికి సుమారు 1,000 బిలియన్ యూనిట్ల విద్యుత్ శక్తి ఆదా అవుతుంది. -
డిసెంబర్ 1 నుంచి వాణిజ్య డ్రోన్లు
న్యూఢిల్లీ: భారత్‌లో డ్రోన్ల వాణిజ్య వినియోగానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయం, ఆరోగ్యం, ప్రకృతి విపత్తుల సందర్భంగా సహాయక చర్యల్లో డ్రోన్లను వినియోగించేలా వీటిని రూపొందించారు. పౌరవిమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు సోమవారం డ్రోన్ల వాడకానికి సంబంధించిన నిబంధనలను ఢిల్లీలో ఆవిష్కరించారు. ప్రస్తుతానికి వ్యవసాయ, ఆరోగ్యం, ప్రకృతి విపత్తుల సందర్భంగా డ్రోన్ల వినియోగంపై మార్గదర్శకాలు రూపొందించినట్లు తెలిపారు. 2018, డిసెంబర్ 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయన్నారు. డ్రోన్ల ద్వారా మనుషుల రవాణాతో పాటు మందులు, ఆహారం, ఇతర వస్తువులను డెలివరీ చేయడాన్ని ఇందులో చేర్చలేదని పేర్కొన్నారు. పగటిపూటే వినియోగం: తాజా మార్గదర్శకాల ప్రకారం పౌర అవసరాల కోసం వాడే డ్రోన్లను కేవలం పగటిపూట మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా గరిష్టంగా ఈ డ్రోన్లు 450 మీటర్లు ఎత్తుకు వెళ్లేందుకు మాత్రమే వీలుంది. వీటిని వివాహ వేడుకల చిత్రీకరణలో వాడుకోవచ్చు. అంతర్జాతీయ సరిహద్దుతో పాటు విమానాశ్రయాలు, తీరప్రాంతాలు, రాష్ట్ర సచివాలయాలు, సైనిక కేంద్రాలు, ఢిల్లీలోని విజయ్‌చౌక్ వంటి వ్యూహాత్మక ప్రాంతాల్లో డ్రోన్లను వినియోగించడానికి వీల్లేదు. కేంద్ర నిఘా సంస్థలతో పాటు జాతీయ సాంకేతిక, పరిశోధన సంస్థ వాడుతున్న నానో డ్రోన్లు మినహా అన్ని నానో డ్రోన్లను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలి. వీటికి ప్రభుత్వం విశిష్ట గుర్తింపు సంఖ్యను జారీచేస్తుంది. డ్రోన్ల వినియోగం కోసం తప్పు డు పత్రాలు సమర్పించినా, నిబంధనలు ఉల్లంఘించినా.. లైసెన్సులను సస్పెండ్ లేదా రద్దు చేయడంతో పాటు కేసు నమోదు చేస్తారు. అనుమతి లేకుంటే టేకాఫ్ కాదు.. ‘డిజిటల్ స్కై’ ప్లాట్‌ఫామ్ ద్వారా డ్రోన్ల రిజిస్ట్రేషన్‌తో పాటు టేకాఫ్‌కు అధికారులు అనుమతులు జారీచేస్తారు. ఈ యాప్ స్థానిక పోలీస్‌స్టేషన్‌తో అనుసంధానమై ఉంటుంది. డ్రోన్లను వాడటానికి ముందు వీటిని వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా డ్రోన్లను టేకాఫ్ చేయాలంటే తొలుత మొబైల్ యాప్ ద్వారా అనుమతి కోరాలి. అప్పుడు ఎయిర్‌ట్రాఫిక్‌ను బట్టి అనుమతి ఇవ్వడం లేదా నిరాకరించడం ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. ప్రజా భద్రత దృష్ట్యా అనుమతి లేకుండా డ్రోన్ల టేకాఫ్‌ను నిరోధించేలా కొత్త విధానంలో నిబంధనలు చేర్చారు. దీనిప్రకారం డిజిటల్ అనుమతులు రాకుండా డ్రోన్ల ను టేకాఫ్ చేసేందుకు వీలుకాదు. కేవలం 50 అడుగుల ఎత్తుకు వెళ్లగల నానో డ్రోన్ల(250 గ్రాముల బరువు)కు పోలీసు అనుమతులు అవసరం లేదు. వ్యవసాయం, ఆరోగ్యం సహా 23 విభాగాల్లో డ్రోన్లను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
పంటలకు రక్షణ బమావె ద్రావణం!
వాణిజ్య, ఉద్యాన పంటలు, పండ్ల తోటలను చీడపీడల నుంచి రక్షించే మరో ద్రావణాన్ని వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలం టి.వెలంవారిపల్లెకు చెందిన సేంద్రియ వ్యవసాయ నిపుణుడు, వెన్నెల రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపకులు కొమ్ములూరి విజయకుమార్ రైతులకు పరిచయం చేస్తున్నారు. పల్లెల్లో బీడు భూముల్లో, గట్ల మీద, వాగులు, వంకల దగ్గర, అడవిలో విరివిగా కనిపించే బంకీర పండ్లు, మారేడు కాయలు, వెర్రి పుచ్చకాయలతో తయారు చేసే ఈ ద్రావణానికి ‘బమావె’ ద్రావణం అని పేరు పెట్టారు. పత్తి, మినుము,పెసర, వేరుశనగ, చీనీ(బత్తాయి), మామిడి, సపోటా, జామ, టమాటా, బీర, సొర, కాకర, దోస, కళింగర ఇతర తీగ జాతి పంటలు, పండ్ల, కూరగాయ పంటలను చీడపీడల నుంచి రక్షించుకోవడానికి రైతులకు ఈ ద్రావణం ఉపకరిస్తుందని విజయకుమార్ తెలిపారు. వార్షిక పంటలకు మొలక దశలో ఆశించి నష్టపరిచే మిడతలు, పచ్చదోమ, తెల్లదోమ, వైరస్ తెగుళ్ల నివారణకు ఈ ద్రావణం ఉపయోగపడుతుంది. పురుగులను సమూలంగా నాశనం చేస్తుందన్నారు. పంటలపై ప్రయోగించినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయని ఆయన తెలిపారు. బంకీర పండ్లు బంకీర పండ్లు 10 కిలోలు సేకరించుకొని ఉంచుకోవాలి. ఇవి పొలాల గట్ల మీద, అడవులు, కొండలు, గుట్టలు, వాగులు, వంకలు తదితర చోట్ల పెరుగుతుంటాయి. పండ్లు తెల్లగా ఉంటాయి. విత్తనానికి చుట్టూ బంకతో కూడిన కండ ఉంటుంది. పండు తియ్యగా ఉన్నా తింటే బబుల్ గమ్లాగా నోటికి అంటుకుంటూ ఉంటుంది. మారేడు కాయలు మారేడు కాయలు 5 కిలోలు తీసుకొని బాగా పచ్చడి పచ్చడిగా దంచి సిద్ధం చేసుకోవాలి. ఈ చెట్లు దేవాలయాల వద్ద, పొలాల గట్లు, అటవీ ప్రాంతాల్లో విరివిగా ఉంటాయి. ఎలాంటి చీడపీడలు ఆశించని చెట్టు ఇది. బాగా మాగి ఉన్న కాయలు సేకరిస్తే మరీ మంచిది. వెర్రి పుచ్చ కాయలు వెర్రి పుచ్చకాయలు రెండున్నర కిలోలు సేకరించి మెత్తగా దంచి ఉంచాలి. ఈ కాయలు చెరువుల వద్ద గ్రామాల్లో వంకలు, వాగులు, గుట్టల సమీపంలో విరివిగా తీగలకు కాస్తుంటాయి. ఇవి బాగా మాగితే పసుపు పచ్చగా ఉంటాయి. ముఖ్యంగా చెరువులు, వంకలు, వాగుల వద్ద దొరుకుతాయి. వెర్రిపుచ్చ తీగలకు ఎలాంటి పురుగులు, తెగుళ్లు ఉండవు. కాయలు పచ్చగా నిగనిగలాడుతుంటాయి. కాయలు పండుబారి కొద్ది రోజులకు నశించి మళ్లీ కొత్త తీగలు అదే కాండం నుంచి పుడతాయి. ద్రావణం తయారీ ఎలా? 200 లీటర్ల నీరు పట్టే డ్రమ్ములో.. దంచి పెచ్చుకున్న 10 కిలోల బంకీరపండ్లు, 5 కిలోల మారేడు కాయలు, రెండున్నర కిలోల వెర్రి పుచ్చకాయలను వేసి బాగా కలియతిప్పాలి. డ్రమ్మును నీడలో ఉంచాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో కర్రతో కలియబెడుతుండాలి. గొనె సంచి కప్పి 8 రోజులు మురగబెడితే ‘బమావె’ ద్రావణం వాడకానికి సిద్ధమవుతుంది. పిచికారీ ఎలా? ► పత్తి, టమాటా, మిరప, అన్ని రకాల కూరగాయ తోటలతో పాటు ఆముదం పంటకు, చీనీ, సపోట, జామ, దానిమ్మ, మామిడి, ఇతర పండ్ల తోటలకు ‘బమావె’ ద్రావణాన్ని నెలలో నాలుగు సార్లు పిచికారీ చేసుకోవాలి. ఏ పంటకైనా సరే.. మొదటిసారి– 10 లీటర్ల నీటికి 1 లీటరు ద్రావణం, 2వ సారి– 10 లీటర్ల నీటికి 1.25 లీటర్లు, 3వ సారి– 10 లీటర్ల నీటికి 1.5 లీటర్లు, 4వ సారి– 10 లీటర్ల నీటికి 2 లీటర్ల ద్రావణం కలిపి పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుందని విజయకుమార్ చెబుతున్నారు. ► ఉదయం 5.30 గంటల నుంచి 9 గంటల లోపల, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్య ఈ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ► పంటకు పూత వచ్చినా, రాకపోయినా ద్రావణం పిచికారీని మరువకూడదు. ► లేత పంటను ఆశించే పచ్చ, తెల్లదోమ, ఆకులు తినే దాసరి పురుగు, మిడతలను ఇది నశింపజేస్తుంది. ► పూతను ఆశించే ఎటువంటి పురుగునైనా ఇది మట్టుబెడుతుంది. వైరస్‌ను మోసుకు వచ్చే పురుగులను పంట దరి చే రనీయదు. ► పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు.. పావు లీటరు నుంచి అర లీటరు పశువుల మూత్రం కలుపుకొని పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. ► అరటిలో పండు ఈగ రైతు ఆదాయాన్ని కోల్పోయేలా చేస్తుంది. దీని నివారణకు అరటి గెల వేసే సమయంలోనే ‘బమావె’ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. గెల పూర్తిగా పెరిగే వరకు నాలుగు సార్లు పిచికారీ చేసుకోవాలి. ► మిరప తోటలను ఆకుముడత వేధిస్తుంటుంది. ముడత ఆశిస్తే పంట దున్నేయాల్సిందేనని రైతులు చెబుతుంటారు. ముడత నివారణకు ‘బమావె’ ద్రావణం అద్భుతంగా పనిచేస్తుంది. ► వరి పంటను దుంప కుళ్లు, ఉల్లికోడు, అగ్గి తెగులు, కాండం కుళ్లు తెగులు, రెల్లా పురుగులు ఆశించి నష్టపరుస్తుంటాయి. వీటి నివారణకు చక్కని మార్గం ‘బమావె’ ద్రావణం పిచికారీ చేసుకోవాలి. మొలక దశ నుంచి కంకులు వేసే దశ వరకు పిచికారీ చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ► బంకీర పండ్లు, మారేడు కాయలు, వెర్రి పుచ్చకాయలు కేవలం మే, జూన్ నెలల్లో మాత్రమే లభిస్తాయి. ఈ సీజన్లో వీటిని సేకరించుకొని ద్రావణం తయారు చేసి పెట్టుకుంటే.. ఏడాది పొడవునా పంటలకు పిచికారీ చేసుకోవచ్చని విజయకుమార్(98496 48498,79814 07549) తెలిపారు. – మాచుపల్లె ప్రభాకరరెడ్డి, సాక్షి, వ్యవసాయం, వెఎస్సార్ జిల్లా -
నోట్ల రద్దు... ప్రకంపనలు క్యాష్తో ముందే వేతనాలివ్వాలి!
• ప్రభుత్వానికి పారిశ్రామిక, వాణిజ్య సంఘాల సూచనలు • నోట్ల రద్దుతో నష్టం జరగకుండా చూడాలని వినతి న్యూఢిల్లీ: నోట్ల రద్దుతో తక్షణం పడే ప్రభావంపై ఆందోళనతో ఉన్న వాణిజ్య, పారిశ్రామిక సంఘాలు ఈ విషయంలో ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారుు. కొత్త కరెన్సీ నోట్ల రూపంలో ముందస్తుగా వేతనాలు చెల్లించాలని, నగదు కొరతను నివారించేందుకు పదవీ విరమణ చేసిన బ్యాంకు ఉద్యోగుల సేవలను పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని సూచించారుు. ఈ మేరకు పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఓ వినతిపత్రం సమర్పించారుు. ప్రభుత్వ, ప్రభుత్వరంగ, ప్రైవేటు రంగ ఉద్యోగులకు పాక్షికంగా లేదా పూర్తిగా వేతనాలను మందుగానే రూ.500 నోట్ల రూపంలో చెల్లించాలని కోరారుు. దీనివల్ల బ్యాంకుల వద్ద క్యూలు తగ్గుతాయని, నగదు మార్చుకునే క్రమంలో ఉద్యోగుల గైర్హాజరు కారణంగా ఉత్పాదకత తగ్గకుండా చూడవచ్చని పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ పేర్కొంది. మరోవైపు అసోచామ్ సైతం ఈ విషయంలో ప్రధాని మోదీకి నేరుగా ఓ సూచన చేసింది. వేగంగా నగదు మార్పిడి, నగదు ఉపసంహరణ సాఫీగా జరిగేలా చూసేందుకు బ్యాంకులు రిటైర్డ్ ఉద్యోగులను భారీగా నియమించుకోవాలని అసోచామ్ సూచించింది. సాధారణ ఎన్నికల విధుల కోసం వివిధ శాఖల ఉద్యోగులను నియమించినట్టే ఇప్పుడు బ్యాంకుల్లోనూ వివిధ రకాల ఉద్యోగులను నియమించాలని కోరింది. 25 శాతం పడిపోరుున వ్యాపారం నోట్ల రద్దు నిర్ణయం తర్వాత దేశవ్యాప్తంగా వ్యాపారం 25 శాతం మేర తగ్గినట్టు ట్రేడర్ల సంఘం సీఏఐటీ పేర్కొంది. ఒకవైపు నగదు సరఫరా సాఫీగా కొనసాగేలా చూడడంతోపాటు ఎలక్ట్రానిక్ చెల్లింపులను పెంచే చర్యలను వేగవంతం చేయాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కోరింది. -
కమర్షియల్ చిత్రంగా మున్నోడి
మనిషి ఎదగడానికి స్ఫూర్తి కావాలని చెప్పే చిత్రం మున్నోడి అని తెలిపారు ఆ చిత్ర దర్శక నిర్మాత ఎస్‌పీటీఏ.కుమార్. ఇప్పుడు సినిమాపై ప్రేమ ఉంటే చాలు. అదే సినిమాను తీయిస్తుంది. ఈ చిత్ర దర్శకుడిది అలాంటి ప్రేమే. ఎవరి వద్దా శిష్యరికం చేయకుండానే మున్నోడి చిత్రానికి మోగాఫోన్ పట్టారు. తెన్కాశీకి చెందిన వ్యాపారవేత్త అయిన ఎస్‌పీటీఏ.కుమార్ స్వీయ దర్శకత్వంలో సోహం అగర్వాల్‌తో కలిసి నిర్మించిన చిత్రం ఇది. టాలీవుడ్ వర్ధమాన జంట హరీష్, యామినీభాష్కర్లను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తున్నారు. ముఖ్య పాత్రలో తల్లిగా సితార చాలా కాలం తరువాత తమిళంలో నటిస్తున్న చిత్రం మున్నోడి. వినోద్త్న్రసామి చాయాగ్రహణ ం, ప్రభుశంకర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది ప్రేమ,యాక్షన్,సెంటిమెంట్, హాస్యం అంటూ అన్ని అంశాలూ కలిగిన జనరంజక పూర్తి కమర్శియల్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. మనం తీసుకునే స్ఫూర్తిని బట్టే జీవితపయనం ఉంటుంది. బాంధవ్యాల విలువలు చెప్పే చిత్రం మున్నోడి అని తెలిపారు. ఇప్పటికీ 95 శాతం చిత్రీకరణ పూర్తి అయ్యిందన్నారు. ఇందులో నాలుగు పాటలతో పాటు రెండు బిట్ సాంగ్స్ ఉంటాయని చెప్పారు. అందులో ఒక పాటను పూర్తిగా గ్రాఫిక్స్‌లో రూపొందించామని అందుకు మాత్రమే ఆరు నెలలు పట్టిందని తెలిపారు. హీరోహీరోయిన్లు తెలుగు వారు అయినా సన్నివేశాలను అర్థం చేసుకుని చక్కగా నటిస్తున్నారని, ముందుగా వారితో రిహార్సల్స్ చేయించినట్లు తెలిపారు.త్వరలో చిత్ర ఆడియోను విడుదల చేసి చిత్రాన్ని డిసెంబర్లో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇది యూనివర్సల్ కథా చిత్రం అని, అందువల్ల తెలుగులోనూ విడుదల చేయనున్నట్లు తెలిపారు. -
సాగర్‌లో కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయం ప్రారంభం
నాగార్జునసాగర్ తెలంగాణ రాష్ట్ర సరిహద్దు అయిన నాగార్జునసాగర్‌లో శనివారం కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయాన్ని సీటీఓ మస్తాన్‌వలి ప్రారంభించారు. ముందుగా ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఇకపై రాష్ట్రంలోకి ప్రవేశించే,సరిహద్దు దాటి బయటకు వెళ్లే సరుకుల లారీలనుంచి పన్ను వసూలు చేస్తామని వివరించారు. కార్యక్రమంలో డీసీటీఓ విజయసాగర్‌బాబు,ఏసీటీఓ లింగయ్య, రవీందర్‌బాబు, సైదులు పాల్గొన్నారు. -
బంద్‌కు వ్యాపార వర్గాల మద్దతు
నెహ్రూనగర్ : ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పార్టీలకతీతంగా మంగళవారం నిర్వహించే బంద్‌కు వ్యాపార వర్గాలు పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు చాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు తెలిపారు. బంద్‌కు మద్దతు తెలుపుతూ సోమవారం అన్ని వ్యాపార వర్గాల ఆసోసియేషన్ నాయకులతో జిన్నాటవర్ సెంటర్లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. పార్లమెంటులో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు నోరు మెదపకపోవడం సబబు కాదన్నారు. కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తేకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సంస్థ వైస్ ప్రెసిడెంట్ షారాబు క్రిష్ణమూర్తి, కార్యదర్శి జి.రాంబాబు, వాసవి క్లాత్ మర్చంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అడ్డగిరి సాంబశివరావు, కానూళ్ళ ప్రవీణ్‌కుమార్ కిరణా మర్చంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పువ్వాడ నాగ వెంకటనారాయణ, నగర రైస్ డీలర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఈశ్వరరావు పాల్గొన్నారు. -
కోట్లల్లో కొందరు!
తెలుగు సినిమాలో..... ఆ మాటకొస్తే ఇండియన్ సినిమాలో..... అదీ కమర్షియల్ సినిమాలో హీరోయిన్లకి అంత విలువండదు. కథంతా హీరో చుట్టే తిరుగుతుంటుంది అనేది మనం తరచూ వినే కమెంట్. అంత విలువ లేని పాత్రలు ఈ హీరోయిన్లు ఎందుకు చేస్తారన్న అనుమానం మనకు రాకుండా ఉండదు. అందుకే ఓ చిన్న పరిశోధన చేసి, ఇండస్ట్రీ పొరలను ఎన్నో తవ్వి... కొన్ని విషయాలను గోడలను అడిగి, ఇంకొన్నిటిని గుర్రాలతో చెప్పించుకునిమీదాకా తీసుకొస్తున్నాం. దిమ్మ దిరిగింది. విలువ లేదంటారేంటి? ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటారో చూడండి. అంత తీసుకున్నాక కథ ఎవరి చుట్టు తిరిగితేనేమి? మనం బ్యాంకు చుట్టూ తిరిగితే చాలదూ? అని హీరోయిన్లు తప్పకుండా నవ్వుకుంటూ ఉంటారని అనిపించింది. డైరీలో డేట్లు తక్కువ ఉంటే బ్యాంకులో బ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంది. అదీ మా పరిశోధనా సారాంశం. సమంత చెన్నై చందమామ 28 ఏళ్లు తెలుగులో ఫస్ట్ మూవీ అండ్ ఫస్ట్ బ్రేక్: ‘ఏ మాయ చేసావె’ (2010) చేస్తున్న సినిమాలు: ‘అ..ఆ..’, ‘బ్రహ్మోత్సవం’, తమిళంలో అరడజను సినిమాలు ఇప్పుడు మార్కెట్ గిరాకీ: రూ. 1.25 - 1.75 కోట్లు రకుల్ ప్రీత్‌సింగ్ ఢిల్లీ పిల్లతెమ్మెర 24 ఏళ్లు ఫస్ట్ మూవీ: ‘కెరటం’ (2011) ఫస్ట్ బ్రేక్: ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ (2013) చేస్తున్న సినిమాలు: రామ్‌చరణ్‌తో ‘బ్రూస్లీ’, బన్నీతో, ఎన్టీఆర్‌తో సినిమాలు, హిందీలో ‘సిమ్లా మిర్చి’. ఇప్పుడు మార్కెట్ గిరాకీ: రూ. కోటి దాకా నయనతార మలయాళ మకరందం 30 ఏళ్లు తెలుగులో ఫస్ట్ మూవీ అండ్ ఫస్ట్ బ్రేక్: ‘చంద్రముఖి’ (2005) చేస్తున్న సినిమాలు: తమిళంలో 5, మలయాళంలో 1, తెలుగులో 1. ఇప్పుడు మార్కెట్ గిరాకీ:రూ. 2.25 కోట్లకు పైగా అనుష్క కన్నడ స్వీటీ 33 ఏళ్లు ఫస్ట్ మూవీ: ‘సూపర్’ (2005) ఫస్ట్ బ్రేక్: ‘విక్రమార్కుడు’ (2006) చేస్తున్న సినిమాలు: ‘రుద్రమ దేవి, సైజ్ జీరో, దోస్త్ (గెస్ట్ రోల్), బాహుబలి-2’ ఇప్పుడు మార్కెట్ గిరాకీ: రూ. 2 కోట్ల పై మాటే. శ్రుతీ హాసన్ తమిళ తంగవు 29 ఏళ్లు ఫస్ట్ మూవీ: ‘అనగనగా ఓ ధీరుడు’ (2011) ఫస్ట్ బ్రేక్: ‘గబ్బర్‌సింగ్’ (2012) చేస్తున్న సినిమాలు: విజయ్‌తో ‘పులి’, అజిత్‌తో ఒకటి, సూర్యతో ‘సింగం-3’, హిందీలో 2 సినిమాలు ఇప్పుడు మార్కెట్ గిరాకీ: రూ. 1.25-1.5 కోట్లు కాజల్ అగర్వాల్ ముంబై ముద్దుగుమ్మ 30 ఏళ్లు ఫస్ట్ మూవీ: ‘లక్ష్మీ కల్యాణం’ (2007) ఫస్ట్ బ్రేక్: ‘చందమామ’ (2007) చేస్తున్న సినిమాలు: పవన్ కల్యాణ్‌తో ‘సర్దార్ గబ్బర్‌సింగ్’; మహేశ్‌బాబుతో ‘బ్రహ్మోత్సవం’; తమిళంలో 3, హిందీలో 1. ఇప్పుడు మార్కెట్ గిరాకీ: రూ. 1- 1.25 కోట్లు తమన్నా పంజాబీ మిల్కీబ్యూటీ 25 ఏళ్లు ఫస్ట్ మూవీ: ‘శ్రీ’ (2005) ఫస్ట్ బ్రేక్: ‘హ్యాపీడేస్’ (2007) చేస్తున్న సినిమాలు: రవితేజతో ‘బెంగాల్ టైగర్’, నాగార్జున-కార్తీతో ‘దోస్త్’, ప్రభాస్‌తో ‘బాహుబలి-2’. ఇప్పుడు మార్కెట్ గిరాకీ: రూ. 1-1.25 కోట్లు నిత్యామీనన్ మలయాళ మందారం 27 ఏళ్లు ఫస్ట్ మూవీ అండ్ ఫస్ట్ బ్రేక్: ‘అలా మొదలైంది’ (2011) చేస్తున్న సినిమాలు: ‘రుద్రమదేవి’, తమిళంలో 3 సినిమాలు ఇప్పుడు మార్కెట్ గిరాకీ: రూ. 50 - 60 లక్షలకు పైగా ‘కలర్స్’ స్వాతి పదహారణాల తెలుగమ్మాయి 28 ఏళ్లు ఫస్ట్ మూవీ: ‘డేంజర్’ (2005) ఫస్ట్ బ్రేక్: ‘అష్టా చమ్మా’ (2008) చేస్తున్న సినిమాలు: ‘త్రిపుర’, తమిళంలో 3 సినిమాలు. ఇప్పుడు మార్కెట్ గిరాకీ: రూ. 45 లక్షలు రాశీ ఖన్నా ఢిల్లీ పోరీ 23 ఏళ్లు ఫస్ట్ మూవీ అండ్ ఫస్ట్ బ్రేక్: ‘ఊహలు గుసగుసలాడె’ (2014) చేస్తున్న సినిమాలు: రవితేజతో ‘బెంగాల్ టైగర్’, రామ్‌తో ‘శివమ్’, సాయిధరమ్ తేజ్‌తో ఓ సినిమా. ఇప్పుడు మార్కెట్ గిరాకీ: రూ. 50 -75 లక్షలు రెజీనా తమిళ మిలమిల 23 ఏళ్లు ఫస్ట్ మూవీ: ‘ఎస్ఎమ్ఎస్’ (2012) ఫస్ట్ బ్రేక్: ‘రొటీన్ లవ్‌స్టోరీ’ (2012) చేస్తున్న సినిమాలు: సాయిధరమ్‌తేజ్‌తో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, గోపీచంద్‌తో ఓ సినిమా, సాయిధరమ్ తేజ్‌తో మరో చిత్రం. ఇప్పుడు మార్కెట్ గిరాకీ: రూ.25 - 50 లక్షలు లావణ్యా త్రిపాఠీ ఉత్తరప్రదేశ్ బ్యూటీ 24 ఏళ్లు ఫస్ట్ మూవీ అండ్ ఫస్ట్ బ్రేక్: ‘అందాల రాక్షసి’ (2012) చేస్తున్న సినిమాలు: నాగార్జునతో ‘సోగ్గాడే చిన్నినాయనా’, అల్లు శిరీష్‌తో ఓ సినిమా, మంచు మనోజ్‌తో ఓ సినిమా ఇప్పుడు మార్కెట్ గిరాకీ: రూ.35 లక్షలు. త్రిష తమిళ్ అళగి 32 ఏళ్లు ఫస్ట్ మూవీ: ‘నీ మనసు నాకు తెలుసు’ (2003) ఫస్ట్ బ్రేక్: ‘వర్షం’ (2004) చేస్తున్న సినిమాలు: తెలుగులో కమలహాసన్‌తో ‘చీకటి రాజ్యం’, ‘నాయకి’, తమిళంలో 4, మలయాళంలో 1 సినిమా. ఇప్పుడు మార్కెట్ గిరాకీ: అర కోటి పైనే ఇలియానా గోవా సుందరి 27 ఏళ్లు ఫస్ట్ మూవీ అండ్ ఫస్ట్ బ్రేక్: ‘దేవదాసు’ (2006) చేస్తున్న సినిమాలు: రామ్‌చరణ్ ‘బ్రూస్లీ’లో ఐటమ్‌సాంగ్ చేయనున్నట్టు సమాచారం. ఇప్పుడు మార్కెట్ గిరాకీ: కొత్తగా ఏవీ ఒప్పుకోవట్లేదు. పెళ్ళి చేసుకొనే యోచన. హన్సిక సింధీ బొద్దుగుమ్మ 24 ఏళ్లు ఫస్ట్ మూవీ అండ్ ఫస్ట్ బ్రేక్: ‘దేశముదురు’ (2007) చేస్తున్న సినిమాలు: విజయ్‌తో ‘పులి’; మరో 3 తమిళ సినిమాలు. ఇప్పుడు మార్కెట్ గిరాకీ: రూ.75 లక్షల నుంచి ఒక కోటి దాకా. అంజలి గోదావరి తెలుగందం 29 ఏళ్లు ఫస్ట్ మూవీ: ‘ఫొటో’ (2006) ఫస్ట్ బ్రేక్: ‘జర్నీ’ (2011) (డబ్బింగ్ ) చేస్తున్న సినిమాలు: బాలకృష్ణతో ‘డిక్టేటర్’, లేటెస్ట్ ‘శంకరాభరణం’, ‘చిత్రాంగద’, తమిళంలో 5 సినిమాలు ఇప్పుడు మార్కెట్ గిరాకీ: రూ.50 లక్షల దాకా. శ్రీయ ఢిల్లీ మోడల్ 33 ఏళ్లు ఫస్ట్ మూవీ: ‘ఇష్టం’ (2001) ఫస్ట్ బ్రేక్: ‘సంతోషం’ (2002) చేస్తున్న సినిమాలు: ప్రస్తుతం తెలుగులో ఏవీ ఒప్పుకోలేదు. ఇప్పుడు మార్కెట్ గిరాకీ: రూ. 50 లక్షల దాకా. తాప్సీ ఢిల్లీ గ్లామర్ గాళ్ 28 ఏళ్లు ఫస్ట్ మూవీ: ‘ఝుమ్మంది నాదం’ (2010) ఫస్ట్ బ్రేక్: ‘మిస్టర్ పర్ఫెక్ట్’ (2011) చేస్తున్న సినిమాలు: తమిళంలో 1, హిందీలో 2 సినిమాలు, తెలుగులో ఏమీ చేయడం లేదు. ఇప్పుడు మార్కెట్ గిరాకీ: రూ. 30 లక్షల దాకా -
ఇస్రో సైట్‌పై చైనా హ్యాకర్ల దాడి
-
భవిష్యత్ అభివృద్ధికి బాటలు: ఫ్యాప్సీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కేంద్ర బడ్జెట్ భవిష్యత్ అభివృద్ధికి బాటలు పరిచేలా ఉందని ఫ్యాప్సీ అభిప్రాయపడింది. 10కిగాను 8 మార్కులు ఇస్తున్నట్టు ఫ్యాప్సీ ప్రెసిడెంట్ శివ్‌కుమార్ రుంగ్టా శనివారమిక్కడ మీడియాకు తెలిపారు. సంతులిత బడ్జెట్‌గా ఆయన అభివర్ణించారు. ఇన్ఫ్రా రంగానికి అదనంగా రూ.70 వేల కోట్లు కేటాయించారు. అలాగే చిన్న వ్యాపారులకు రుణాలిచ్చేందుకు రూ.20 వేల కోట్లతో ముద్ర బ్యాంకు, రూ.3 వేల కోట్లతో క్రెడిట్ గ్యారంటీ కార్పస్ ఏర్పాటుతో వాణిజ్య, వ్యాపార పరంగా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. స్టార్టప్‌లను వెన్నుతట్టేలా రూ.1,000 కోట్లు కేటాయించడం ఆహ్వానించతగ్గదని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వెన్నం అనిల్ రెడ్డి చెప్పారు. ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తారని ఎదురు చూసిన పరిశ్రమకు నిరాశ కలిగించారని అన్నారు. వ్యవసాయ రుణాలకు రూ.8.5 లక్షల కోట్లు కేటాయించారు. వ్యవసాయ రంగానికి అతిపెద్ద బూస్ట్ అని వైస్ ప్రెసిడెంట్ రవీంద్ర మోడి తెలిపారు. గార్ అమలు వాయిదా వల్ల భారత్‌కు పెట్టుబడులు పెరుగుతాయని ఫ్యాప్సీ మాజీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అయ్యదేవర అభిప్రాయపడ్డారు. విదేశీ పెట్టుబడిదారుల భయాలను తొలగించడంలో ఇది కీలక నిర్ణయమన్నారు. ద్రవ్యోల్బణం కట్టడికి మానిటరీ పాలసీ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారని, కమిటీ రాకతో ఆర్బీఐ గవర్నర్ అధికారాలు తగ్గే అవకాశం ఉందని అన్నారు. -
పన్ను ఎగ్గొడుతున్నారు
హుజూరాబాద్ : జిల్లాలో జీరో దందా జోరుగా సాగుతోంది. ఎలాంటి అనుమతి లేకుండానే వ్యాపారం నిర్వహిస్తుండడంతో ప్రభుత్వాదాయానికి భారీగా గండిపడుతోంది. వ్యాట్, టర్నోవర్ ట్యాక్స్ రూ.కోట్లలో చేజారుతున్నా సంబంధిత అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతీనెలా జిల్లాలోని వివిధ సర్కిళ్ల నుంచి రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల ఆదాయం సమకూరుతోంది. ఏడాదికి రూ.200 కోట్ల పైచిలుకు వాణిజ్య పన్ను వసూలవుతోంది. ఉదాహరణకు హుజూరాబాద్ ఉప వాణిజ్య కార్యాలయం పరిధిలో 11 మండలాలున్నాయి. ఇక్కడ 300 మంది టర్నోవర్ ట్యాక్స్ చెల్లింపుదారులు, 1200 మంది వ్యాట్ పన్నుదారులు ఉన్నారు. తద్వారా ఏటా ప్రభుత్వానికి రూ.20 కోట్ల ఆదాయం సమకూరుతోంది. వ్యాట్ చెల్లించాల్సిన వ్యాపారులు తప్పుడు లెక్కలు చూపుతూ టర్నోవర్ ట్యాక్స్‌కే పరిమితమవుతున్నారు. టర్నోవర్ ట్యాక్స్ చెల్లించే వారు మొత్తానికే పన్ను ఎగ్గొడుతున్నారు. దీంతో ఒక్క హుజూరాబాద్ సర్కిల్ పరిధిలోనే లక్షలాది రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. సంబంధిత అధికారులు తనిఖీలు చేస్తే రెట్టింపు ఆదాయం సమకూరే అవకాశముంది. 11 మండలాలున్న హుజూరాబాద్ డీసీటీవో సర్కిల్ పరిధిలోనే భారీగా ఆదాయానికి గండిపడుతుంటే... జిల్లా వ్యాప్తంగా జీరో వ్యాపారాలను కట్టడి చేస్తే అదనంగా 50 కోట్ల రూపాయలు వస్తుందని అంచనా. పన్నుచెల్లించే విధానం ఇదీ.. ఏడాదికి రూ.7.5 లక్షల వరకు అమ్మకాలు జరిపే వ్యాపారులకు ఎలాంటి పన్ను ఉండదు. రూ.7.5 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు క్రయవిక్రయాలు జరిపేవారు లావాదేవీల పై ఒకశాతం టర్నోవర్ ట్యాక్స్ (టీవోటీ) చెల్లించాలి. రూ. 50 లక్షల టర్నోవర్ పైన వ్యాపారాలు నిర్వహించేవారు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్) చెల్లించాలి. వ్యవసాయ సంబంధిత, నిత్యావసర వస్తువులపై 5 శాతం పన్ను, మిగతా వాణిజ్యపరమైన వస్తువులు, యంత్రాలకు 14.5 శాతం వ్యాట్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ టర్నోవర్ ఉన్నవారు తప్పనిసరిగా వాణిజ్య పన్ను శాఖ నుంచి లెసైన్సులు తీసుకోవాలి. చిన్నాచితక వ్యాపారులు, కూరగాయలు, పండ్ల దుకాణాలకు ఎలాంటి అనుమతి అవసరం లేదు. ఆస్పత్రులు, విద్యాలయాలు, ఇతర కంపెనీలు మాత్రం వృత్తి పన్ను చెల్లించాలి. కొరవడిన పర్యవేక్షణ ప్రభుత్వానికి ఆదాయాన్ని భారీగా సముపార్జించి పెట్టే వాణిజ్య పన్నులశాఖ అధికారులు తూతూమంత్రంగా తనిఖీలు చేస్తుండడంతో జీరో దందా జోరుగా సాగుతోంది. చాలా మంది అనుమతి లేకుండానే వ్యాపారం సాగిస్తున్నారు. మెడికల్ షాపుల నిర్వాహకులు చాలావరకు పన్ను ఎగ్గొడుతున్నారు. విద్యాసంస్థలైతే వృత్తిపన్ను చెల్లింపునకు దూరంగా ఉంటున్నాయి. వాణిజ్య పన్నుల శాఖాధికారులు కేవలం కొన్నింటికే పరిమితమవుతున్నారు. దీంతో వ్యాపారుల ఇష్టారాజ్యమైపోయింది. పలువురు వ్యాపారులు తప్పుడు లెక్కలు చూపిస్తూ పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారు. వీరికి అధికారుల అండదండలు కూడా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
కీలక పరిశ్రమల మందగమనం
న్యూఢిల్లీ: కీలక ఎనిమిది పరిశ్రమల గ్రూప్ సెప్టెంబర్‌లో నిరాశను మిగిల్చింది. కేవలం 1.9 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. ఇది ఎనిమిది నెలల కనిష్ట స్థాయి. గత యేడాది ఇదే నెలలో ఈ గ్రూప్ వృద్ధి రేటు 9శాతం. క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువుల రంగాల్లో అసలు వృద్ధి లేకపోగా క్షీణత నమోదు కావడం సెప్టెంబర్‌లో మొత్తం గ్రూప్ పనితీరును దెబ్బతీసింది. ఇక బొగ్గు, స్టీల్, సిమెంట్, విద్యుత్ రంగాలు కూడా వృద్ధి రేటు తగ్గింది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాలు రంగాల వారీగా చూస్తే... * క్రూడ్ ఆయిల్: 2013 సెప్టెంబర్‌లో 0.5 శాతం వృద్ధి రేటు నమోదుకాగా, 2014 సెప్టెంబర్‌లో అసలు వృద్ధి లేకపోగా -1.1 శాతానికి (క్షీణతకు) జారింది. * సహజవాయువు: క్షీణతలోనే కొనసాగినా ఈ రేటు -13.9 శాతం నుంచి -6.2 శాతానికి తగ్గింది. * రిఫైనరీ ప్రొడక్టులు: 7.7 శాతం వృద్ధి రేటు -2.5 శాతానికి క్షీణించింది. * ఎరువులు: ఈ రంగంలో కూడా వృద్ధి 5.3 శాతం నుంచి -11.6 శాతానికి పడింది. * బొగ్గు: వృద్ధి రేటు 13.6% నుంచి 7.2%కి తగ్గింది. * స్టీల్: వృద్ధి 10.7% నుంచి 4.0 శాతానికి జారింది. * సిమెంట్: ఈ రంగం వృద్ధి రేటు 12.1 శాతం 3.2 శాతానికి పడిపోయింది. * విద్యుత్: ఈ రంగంలో వృద్ధి 12.9 శాతం నుంచి 3.8 శాతానికి జారింది. ఆరు నెలల్లో చూసినా డౌన్! ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరు నెలల కాలంలో (2013-14, ఏప్రిల్-సెప్టెంబర్) చూసినా ఈ కీలక పరిశ్రమల గ్రూప్ వృద్ధి రేటు దిగజారింది. 5 శాతం నుంచి 4 శాతానికి తగ్గింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపీ)లో ఈ కోర్ గ్రూప్ వాటా దాదాపు 38 శాతం. సెప్టెంబర్ ఐఐపీ గణాంకాలు ఈ నెల రెండవ వారంలో రానున్నాయి. తాజా ఫలితాలు మొత్తంపై ఐఐపీ సెప్టెంబర్ గణాంకాలపై పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
పోస్టాఫీసులో ‘మీ సేవ’
వరంగల్, హన్మకొండ, మహబూబూబాద్, జనగామలో ప్రారంభం అందుబాటులోకి రానున్న 225 రకాల సేవలు మున్ముందు ఏటీఎంలు కూడా.. ఇన్నాళ్లూ ఉత్తరాల బట్వాడాకే పరిమితమైన పోస్టల్‌శాఖ ఇప్పుడు తన రూటు మార్చుకుంది. రకరకాల సేవలతో ముందుకు దూసుకుపోతోంది. బహుముఖ సేవలతో ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల పోస్టాఫీసుల్లో మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మున్ముందు ఏటీఎం సేవలను కూడా అందించేందుకు సిద్ధమవుతోంది. పోచమ్మమైదాన్ : రోజుల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తి రగాల్సిన అవసరం లేకుండా, ముడుపులు, సిఫారుసుల తో పనిలేకుండా పలు రకాల ధ్రువపత్రాలను ఒకేచోట అందించేందుకు వీలుగా మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వివిధ ప్రభుత్వశాఖలు జారీచేసే ధ్రవపత్రాలన్నీ ఒకేచోట లభ్యం కావడం, ప్రతీ పనికి నిర్ధి ష్ట గడువు ఉండడంతో మీ సేవలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దీంతో ఇటీవల పోస్టాఫీసుల్లోనూ మీసేవ కేంద్రాలను ప్రారంభించారు. ప్రస్తుతం ఇందులో టెలిఫోన్ బిల్లులు, ఇంటి పన్నులు, కరెంటు బిల్లులు తీసుకుంటున్నారు. త్వరలో రెవెన్యూ, పోలీసుశాఖ, మునిసిప ల్, పౌరసరఫరాల శాఖ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, పరిశ్రమలు, వాణిజ్య, విద్యా, మైనింగ్, జియాలజీ, కార్మిక, వ్య వసాయ శాఖల సేవలు అందుబాటులోకి రానున్నాయి. అందుబాటులోకి రానున్న 225 సేవలు పౌర సేవలను ప్రజలకు అతి సులభంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మీ సేవ కేంద్రాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారాయి. ఇక పోస్టాఫీసుల్లో ఏర్పాటు చేసిన మీసేవ కేంద్రాల ద్వారా 15శాఖలకు సంబంధించిన 225 రకాల సేవలను ప్రజలకు అందించనున్నారు. రెవెన్యూశాఖ నుంచి 55, మునిసిపల్ శాఖ 22, స్టాంపులు,రిజిస్ట్రేషన్ల శాఖ 12, పోలీస్‌శాఖ 4, రవాణాశాఖ 4, విద్యాశాఖ 4, కార్మికశాఖ 4, సాధారణ పరిపాలన శాఖ 4, సమాచార సాంకేతిక, కమ్యూనికేషన్‌శాఖ 11, పౌరసరఫరాలశాఖ 3, భారీ పరిశ్రమలశాఖ 4, మైనింగ్, జియాలజీ శాఖ 7, వ్యవసాయశాఖ 2, విద్యుత్‌శాఖకు సంబంధించిన 4 రకాల సేవలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సేవలు అందించేందుకే.. ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు పోస్టాఫీసులలో మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇటీవల మీ సేవ కేంద్రాన్ని ఏర్పాటు చేసి సాధారణ సేవలు ప్రారంభించాం. మరో వారం రోజుల్లో సాధారణ సేవల్లోని అన్ని సేవలను పోస్టాఫీసులలో ఏర్పాటు చేసిన మీసేవ కేంద్రాల ద్వారా అందిస్తాం. - శ్రీనివాస్ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్, వరంగల్ కేంద్రాలు ఇవే.. వరంగల్‌లోని హెడ్ పోస్టాఫీస్, హన్మకొండ డిపో క్రాస్‌లోని హెడ్ పోస్టాఫీస్, మహబూబాద్‌లోని హెడ్ పోస్టాఫీస్, జనగామలోని హెడ్ పోస్టాఫీస్‌లలో కేంద్ర ప్రభుత్వం మీ సేవ కేంద్రాలను ఏర్పాటు చేసింది. -
7 రూపాయలతో ఎన్ని ప్రయోజనాలో..
సాక్షి, హైదరాబాద్ : దుకాణాలు, వాణిజ్య సంస్థలు, ఇతర ఎస్టాబ్లిష్మెంట్లలో పనిచేసే కార్మికు ల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంక్షేమ నిధి ద్వారా అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. అటు యజమానులకు, ఇటు కార్మికులకు వీటిపై సరైన అవగాహన లేక ఈ ప్రయోజనాలను కార్మికులు, ఉద్యోగులు పొందలేకపోతున్నారు. కేవలం ఏడాదికి ఏడు రూపాయలు చెల్లిస్తే కార్మికులకు, వారి కుటుంబాలకు ఎన్నో రకాల ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి. వీరికే వర్తింపు.. కార్మిక సంక్షేమ నిధి చట్టం (1987) ద్వారా సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి నిర్వహణ కోసం కార్మిక సంక్షేమ మండలిని ఏర్పాటు చేశారు. దుకాణాలు, వాణిజ్య సంస్థల చట్టం(1988) కింద పేర్కొన్న సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు 1948 ఫ్యాక్టరీ చట్టం కింద పేర్కొన్న కంపెనీలలో పనిచేసే కార్మికులు 1961 మోటారు రవాణా సిబ్బంది చట్టం కింద పనిచేస్తున్న కార్మికులు రిజిస్ట్రేషన్ ఆఫ్ సొసైటీస్ యాక్టు కింద నమోదైన సహకార సంఘాలు ధర్మాదాయ, ఇతర ట్రస్టులలో పనిచేసే ఉద్యోగులు ఈ సంక్షేమ నిధి చట్టం పరిధిలోకి వస్తారు. ఏడాదికి ప్రతి ఉద్యోగి తన వాటాగా రూ.2, ప్రతి ఉద్యోగి తరఫున యజమాని వాటాగా రూ.5 ఈ నిధికి చెల్లించాల్సి ఉంటుంది. సంక్షేమ పథకాలివే.. దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స : క్యాన్సర్, కిడ్నీ, బ్రెయిన్ ట్యూమర్, గుండె జబ్బు, పక్షవాతం, గర్భసంచి చికిత్స, ట్రామాకేర్ కింద చికిత్స పొందుతున్న కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు రూ. 20 వేల వరకు ఆర్థికసాయం అందిస్తారు. చికిత్స ప్రారంభించిన ఏడాదిలోపు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలి. మరణిస్తే : కార్మికుడు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ. 20 వేలు, సహజ మరణం పొందితే రూ.10 వేలు అందజేస్తారు. కార్మికుడు మరణించిన తేదీ నుంచి ఏడాదిలోపు అతని కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవాలి. అంత్యక్రియలకు: మరణించిన కార్మికుని అంత్యక్రియల ఖర్చుల కోసం రూ.5వేలు అందిస్తారు. కార్మికుడు మరణించిన ఆరు నెలలలోపు అతని కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవాలి. అంగవైకల్యం సంభవిస్తే : ప్రమాదం కారణంగా అంగవైకల్యం సంభవించినట్లయితే రూ.20 వేలు అందజేస్తారు. ఎయిడ్స్ చికిత్స : ఎయిడ్స్ రోగులకు రూ.20 వేలు ఆర్థికసాయం అందజేస్తారు. వివాహ కానుక : ప్రతి ఏడాది కార్మికుని కుమార్తె(కుటుంబం లో ఒకరికి మాత్రమే), మహిళా కార్మికుల వివాహం సందర్భంగా రూ.9వేలు ఫిక్సిడ్ డిపాజిట్ రూపంలో, రూ.1000 ఖరీ దుకు మించకుండా ప్రెషర్కుక్కర్ను కానుకగా అందిస్తారు. ప్రసూతి, కుటుంబ నియంత్రణ పథకం : ఈ పథకం కింద మహిళా కార్మికులకు ప్రసూతి సమయంలో రూ.5వేలు (ఇద్దరు పిల్లలకు మాత్రమే) అందిస్తారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న కార్మికులకు రూ.2వేలు అందజేస్తారు. కార్మికుల పిల్లల చదువులకు : కార్మికుల పిల్లలు చదివే కోర్సుల ప్రకారం ఏడాదికి పదో తరగతి, ఐటీఐలకు రూ.1000, పాలిటెక్నిక్‌కు రూ.1,500, ఇంజినీరింగ్, మెడిసిన్, లా, బీఎస్సీ (అగ్రి, హార్టికల్చర్), బీఏఎంఎస్, బీడీఎస్, డీఎంఎల్టీ, ఎంఎల్టీ, బీవీఎస్సీ, బీఫార్మసీ, బీసీఏ, ఎంసీఏ, బీబీఏ, ఎంబీఏ, డీహెచ్ఎంఎస్ తదితర కోర్సులకు రూ.2వేలు వంతున ఉపకార వేతనాలు అందిస్తారు. వికలాంగ విద్యార్థులకు : వికలాంగులైన విద్యార్థులకు ఏడాదికి రూ.2వేలు స్కాలర్షిప్ను అందిస్తారు. ఉచిత శిక్షణ: కార్మికుల కుటుంబ ఆదాయాన్ని పెంచేందుకు కుటుంబ సభ్యులకు వివిధ వృత్తులలో ఉచిత శిక్షణ ఇప్పిస్తారు. -
సరోగసీ మోసే మారుటమ్మే అద్దె అమ్మ! పెంచే అసలు తల్లే మాయమ్మ!!
సాధారణంగా ఒక స్త్రీ కడుపు పండి, పండంటి బిడ్డను ప్రసవించడానికి పిండాన్ని తొమ్మిది నెలలు తన గర్భంలో మోయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ సజావుగా జరగాలంటే ఆమె శరీరంలోని అనేక అవయవాలు... అంటే గర్భాశయం, అండాశయం, ఫెలోఫియన్ ట్యూబ్స్... ఇవన్నీ సక్రమంగా పనిచేయాలి. అలాగే హార్మోన్లన్నీ సక్రమంగా విడుదలవ్వాలి. వీటితో పాటు భర్త శుక్రకణాల సంఖ్య, కదలిక, నాణ్యత కూడా ప్రధానమే. ఈ అన్ని అంశాలలో ఏ ఒక్కదాని పనితీరు సక్రమంగా లేకపోయినా గర్భధారణ ప్రక్రియలో ఆటంకం ఎదురవుతుంది. చాలా సందర్భాల్లో 100 మంది దంపతుల్లో 80 మందికి గర్భధారణకు ఏడాది వ్యవధి పట్టవచ్చు. మిగతా 20 మందిలో పదిమందికి రెండేళ్లు పట్టవచ్చు. అయితే చివరి పది మందికి మాత్రమే చికిత్స అవసరమవుతుంది. వీరిలోనూ 80 శాతం మందికి సమస్యను బట్టి హార్మోన్ల (మాత్రలు, ఇంజెక్షన్లు)తో చికిత్స చేస్తే గర్భం దాలుస్తారు. మిగతా 20 మందికి ఐయూఐ, ఐవీఎఫ్, ఇక్సీ వంటి అత్యాధునికమైన, ఖర్చుతో కూడిన చికిత్సా విధానాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇది కూడా సాధ్యపడనప్పుడు కొన్ని సందర్భాల్లో ‘సరోగసీ’ పద్ధతిని ప్రయత్నించాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భం ఎదురైనప్పుడు కొందరు బిడ్డలను పెంచాలనే తమ కోరికను సాకారం చేసుకోడానికి బిడ్డను పెంచుకుంటారు. మరికొందరు బిడ్డ తమ సంతానమై ఉండాలనే తపనతో ‘సరోగసీ’ ప్రక్రియను ఆశ్రయిస్తారు. సరోగసీ అంటే... ఒక స్త్రీకి తన అండాశయం తాలూకు అండాల వల్లనే గర్భధారణ జరిగినా, అది పిండంగా మారాక, తన సొంత కడుపు (గర్భాశయం)లో ఆ పిండాన్ని తొమ్మిది నెలల పాటు పెంచే అవకాశం ఉండకపోవచ్చు. అప్పుడు సదరు పిండాన్ని తొమ్మిది నెలల పాటు పెంచడానికి వేరేస్త్రీ ముందుకు వస్తే... అలా ముందుకు వచ్చిన తల్లిని సరోగేట్ మదర్ అంటారు. సరోగేట్ మదర్ ఆ గర్భాన్ని తొమ్మిది నెలలు మోసి,ప్రసవం అయ్యాక బిడ్డను అసలు తల్లికి ఇచ్చేస్తుంది. ప్రక్రియను ‘సరోగసీ’ అంటారు. సరోగసీ... ఎవరికి, ఎప్పుడు? అండాశయాలు ఉండి, గర్భాశయం లేకపోవడం. అది పుట్టుకతో లేకపోవడం గానీ లేదా ఆపరేషన్ ద్వారా తొలగించాల్సి వచ్చిన సందర్భంలో. గర్భాశయంలో పుట్టుకతో లోపాలు ఉండటం; టీబీ లాంటి ఏదైనా ఇన్ఫెక్షన్ వంటి కారణాల వల్ల గర్భాశయం పాడవడం; లోపలి పొర సన్నగా ఉండటం; అతుకులు ఉండటం. గర్భాశయంలో గడ్డలు; గర్భాశయంపైన చాలాసార్లు ఆపరేషన్ చేయడం; దానివల్ల గర్భం దాల్చినా నెలలు నిండేవరకు గర్భం నిలవకపోవడం. తీవ్రమైన మధుమేహం; గుండెజబ్బులు; కిడ్నీ సంబంధిత వ్యాధులు వంటివి ఉండి గర్భం దాల్చడం వల్ల తల్లి ప్రాణానికే ముప్పు ఉన్నప్పుడు; కొన్ని రకాల క్యాన్సర్లు ఉన్నప్పుడు. అన్ని రకాల పరీక్షలూ, చికిత్సలూ చేసినా మాటిమాటికీ అబార్షన్లు అవుతూ ఉంటే. ఐవీఎఫ్ (ఇన్విట్రో ఫెర్టిలైజేషన్) ప్రక్రియను ఎన్నిసార్లు చేసినా ఫలితం లేకపోతే. సింగిల్ పేరెంట్‌గా ఉండదలచిన వాళ్లు. సరోగసీలో రకాలు జెస్టేషనల్ సరోగసీ ఇందులో దంపతుల నుంచి సేకరించిన అండాన్ని, శుక్రకణాలని ఐవీఎఫ్ (ఇన్విట్రో ఫెర్టిలైజేషన్) ప్రక్రియ ద్వారా ల్యాబ్‌లో ఫలదీకరణ చేసి, తద్వారా వచ్చిన పిండాన్ని వేరొక స్త్రీ (సరోగేట్ మదర్) గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఇలా వచ్చే గర్భం వల్ల జన్మించే బిడ్డ జన్యుపరంగా దంపతులిద్దరికీ చెందినదయ్యే ఉంటుంది. (గర్భాన్ని వేరే తల్లి (సరోగేట్ మదర్)మోసినప్పటికీ). కొందరిలో అండం సరిగా లేనప్పుడు దాత నుంచి తీసిన అండాన్ని, భర్త వీర్యకణాలతో ఫలదీకరణ చేయించి, తద్వారా తయారైన పిండాన్ని సరోగేట్ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. సాంప్రదాయిక సరోగసీ (ట్రెడిషనల్ సరోగసీ) ఇందులో భార్య అండాలు, అండాశయం సరిగా లేనప్పుడు భర్త శుక్రకణాలను సరోగేట్ మదర్ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. పిండం సరోగేట్ మదర్ గర్భంలో పెరిగేలా చేస్తారు. కమర్షియల్ సరోగసీ ఇందులో గర్భాన్ని మోసేందుకు సిద్ధపడ్డ తల్లి (సరోగేట్ మదర్)కి గర్భాన్ని మోసినందుకూ, ఆమె సమయాన్ని వెచ్చించినందుకూ, వైద్యపరమైన ఖర్చులకూ... ఇలా వీటన్నింటితో పాటు ఇంకా కొంత ఎక్కువ డబ్బును అందజేస్తారు. ఇలా సరోగసీ ద్వారా గర్భాన్ని అద్దెకు ఇవ్వడాన్ని సుప్రీం కోర్టు ఆమోదించింది. ఇక రష్యా, థాయిల్యాండ్, ఉక్రెయిన్, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని కొన్నింటిలో సరోగసీకి ఆమోదం ఉంది. అయితే ఇంగ్లాండ్‌లో కమర్షియల్ సరోగసీకి ఆమోదం లేదు. ఆల్ట్రుయిస్టిక్ సరోగసీ ఇందులో గర్భాన్ని మోసే తల్లి డబ్బు కోసం చూసుకోదు. తన సొంత బంధువులు లేదా స్నేహితుల సంతృప్తి కోసం డబ్బు ప్రమేయం లేకుండా ఈ పని చేస్తుంది. సాధారణంగా దంపతుల బంధువులు, స్నేహితులు ఈ పనికి ఒప్పుకుంటారు. సరోగసీ జరిగేదిలా... దంపతుల్లోని స్త్రీకి లేదా అండం దానం చేసే దాతకు అండాలు తయారయ్యేలా చికిత్స అందిస్తూ ఉండగానే... అదే సమయంలో సరోగేట్ మదర్ గర్భాశయం పిండాన్ని స్వీకరించేందుకు వీలుగా అయ్యేలా చికిత్స చేస్తారు. అండాశయంలో తయారయ్యే అండాలను బయటకు తీసి వాటిని భర్త తాలూకు శుక్రకణాలతో (కొన్ని పరిస్థితుల్లో దాత శుక్రకణాలతో) ఫలదీకరణం చేయిస్తారు. తద్వారా తయారయ్యే పిండాన్ని సరోగేట్ మదర్ గర్భాశయంలోకి పంపిస్తారు. తర్వాత సరోగేట్ మదర్ తాలూకు గర్భాశయం ఆ పిండాన్ని స్వీకరిస్తే... సాధారణ గర్భం నిలిచి, పెరిగినట్లే... ఈ గర్భమూ నిలుస్తుంది. పెరుగుతుంది. అయితే ఒక్కోసారి గర్భం నిలిచినా ఆ తర్వాత అందరి గర్భవతుల్లోలాగే వీరిలో కూడా అబార్షన్లు, అవయవలోపాలు, బీపీ, షుగర్ వంటి సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అందుకే ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని చట్టబద్ధమైన అంశాలను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. సరోగసీకి సంబంధించిన చట్టాలు, విధానాలు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటాయి. భారత్‌లో అద్దె గర్భం ఆమోదయోగ్యమే కానీ... భారతదేశంలో గర్భాన్ని అద్దెకు తీసుకోవడం 2002 నుంచి ఆమోదయోగ్యంగానే ఉంది. 2008 నాటికి సుప్రీం కోర్టు అధికారికంగా అనుమతించింది. అయితే దీనికి సంబంధించి సరైన నియమావళి లేదు. ఇక 2005లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) దీనికి సంబంధించిన కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. పూర్తిస్థాయి చట్టం కోసం మన దేశంలోని ఐయూఎఫ్ నిపుణులు, ప్రముఖ న్యాయవాదులు, ఈ రంగాలకు సంబంధించిన ఇతర నిపుణులు కలిసి సరోగసీ సంబంధిత చట్టాన్ని రూపొందించేందుకు గాను ఒక ముసాయిదా (డ్రాఫ్ట్) తయారు చేశారు. అయితే ఈ డ్రాఫ్ట్‌ను పార్లమెంట్లో బిల్లుగా ఇంకా ప్రవేశపెట్టలేదు. ఐసీఎమ్ఆర్, కేంద్ర ఆరోగ్య శాఖ, కేంద్ర కుటుంబసంక్షేమ శాఖ కలిసి ఏఆర్టీ రెగ్యులేషన్ బిల్ 2010ని రూపొందించాయి. అయితే ఈ బిల్లు ఇంకా భారత న్యాయశాఖ ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. గత కొన్నేళ్లుగా భారతదేశం సరోగసీకి పెట్టింది పేరుగా తయారవుతోంది. స్వదేశీయులే కాకుండా, విదేశీయులు కూడా ఈ చికిత్సా విధానం కోసం మన దేశానికి వస్తున్నారు. మన మహిళల గర్భాలను అద్దెకు తీసుకుంటున్నారు. అయితే విధిలేని పరిస్థితుల్లో ఆచరించాల్సిన నైతిక ప్రక్రియకూ, డబ్బు కోసం పాటించే అనైతిక విధానాలకూ మధ్య తేడాలను గుర్తించినప్పుడు ఏ విధానమైనా సత్ఫలితాలు ఇస్తుంది. ఒకవేళ ఆధునికతను అనైతికత కోసం ఉపయోగిస్తే అది అనర్థాలకు దారి తీస్తుంది. ఆ తేడాను గుర్తించి విచక్షణ ఉన్నప్పుడు ఏ విధానమైనా సత్ఫలితాలు ఇస్తుంది. సరోగసీకి మొగ్గు చూపడానికి కారణాలివే... ఈ ఆధునిక కాలంలో ఇటీవల ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం, కెరియర్‌కు ఎక్కువగా ప్రాముఖ్యమివ్వడం, గర్భధారణను బాగా ఆలస్యం చేయడం వల్ల వారి శరీరంలో హార్మోన్లపరమైన మార్పులు వచ్చి గర్భధారణ కోరుకున్నప్పుడు జరిగేందుకు అనుకూలమైన పరిస్థితులు లేకపోవడం, సాధారణ చికిత్స, ఐవీఎఫ్లతోనూ గర్భం దాల్చలేకపోవడం వల్ల కొంతమంది సరోగసీకి వెళ్తున్నారు. మరికొందరు గర్భాన్ని మోయడానికి భయపడటం, అన్ని నెలల సమయాన్ని గర్భాన్ని మోయడానికి కేటాయించలేకపోవడం, శరీర ఆకృతి పాడవుతుందేమోననే భయంతో కొందరు సరోగసీకి వెళ్తున్నారు. కానీ ఇది నైతికంగా ఆమోదయోగం కాదు. చట్టబద్ధంగా కూడా దీనికి ఆమోదం లేదు. సరోగసీ ప్రక్రియకు వెళ్లాలంటే ఉండాల్సిన అర్హతలు దంపతుల వయసు 21 - 45 మధ్య ఉండాలి ఇద్దరి ఆరోగ్యపరిస్థితి బాగుండాలి ఎలాంటి కాంప్లికేషన్లు ఉండకూడదు జన్యుపరమైన సమస్యలు ఉండకూడదు ఒకవేళ అంతకుముందే వారికి పిల్లల ఉంటే మంచిదే. ఎందుకంటే అది వారి ప్రత్యుత్పత్తి ఆరోగ్యం బాగుందన్న అంశానికి ఒక సూచన గర్భాన్ని అద్దెకు ఇచ్చే మహిళ మూడు సార్ల కంటే ఎక్కువగా తన గర్భాన్ని అద్దెకు ఇవ్వకూడదు. బిడ్డ పుట్టాక ఇచ్చే బర్త్ సర్టిఫికేట్లో దంపతులిద్దరి పేర్లనే రాస్తారు. ఒకవేళ సింగిల్ పేరెంట్ అయితే ఒక్కరి పేరే ఉంటుంది. డబ్బుకోసం గర్భాన్ని అద్దెకు ఇచ్చే మహిళ వాళ్ల మధ్య జరిగిన ఒప్పందాన్ని బట్టి దాదాపు రూ. 50,000 నుంచి రెండు లక్షల వరకు వసూలు చేయవచ్చు. మన దేశ మహిళల గర్భాలకు గిరాకీ...? కమర్షియల్ సరోగసీకి సుప్రీం కోర్టు ఆమోదం తర్వాత విదేశీయులు సైతం భారతీయ మహిళల గర్భాలను అద్దెకు తీసుకోవడం కోసం ఇక్కడికి విరివిగా వస్తున్నారు. దీంతో మెడికల్ టూరిజం అభివృద్ధి చెందింది. దాంతోపాటు విదేశీయులకు ఆ సేవలందించేందుకు వీలుగా అధునాతన వైద్య ఉపకరణాలు, మౌలిక సదుపాయాలు, అత్యున్నత స్థాయి నిపుణుల ఆవిర్భావం... ఇవన్నీ జరిగాయి. దీనికి మరో కారణం కూడా ఉంది. విదేశీ మహిళల్లాగా మన దేశ మహిళల్లో ధూమపానం, ఆల్కహాల్ వంటి దురలవాట్లు లేకపోవడం వల్ల మన దేశ మహిళల గర్భాలను అద్దెకు తీసుకోడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఇక మన దేశంలోని పేదరికం వల్ల సరోగసీకి సిద్ధపడే మహిళలు ఎక్కువ. వీళ్లు విదేశీ మహిళలతో పోలిస్తే చాలా చవకగా లభించడం వల్ల ఇక్కడ సరోగసీకి ప్రాధాన్యం పెరిగింది . పైగా సరోగసీ ప్రక్రియ కోసం విదేశాల్లో చేయాల్సిన ఖర్చుతో పోలిస్తే మన దేశంలో జరిగే వ్యయం కేవలం ఐదో వంతు మాత్రమే. ఉదాహరణకు యూఎస్ఏలో సరోగసీ మొత్తం ప్రక్రియకు అయ్యే ఖర్చు రూ. 40 లక్షల నుంచి రూ. 75 లక్షల వరకు ఉంటుంది. అదే మన దేశంలో ఇది రూ. 9 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు ఉండవచ్చు. ఐసీఎమ్ఆర్ మార్గదర్శకాలు ఇవే... సరోగసీకి వెళ్లాలంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ విధించిన మార్గదర్శకాలివే... సాధారణంగానే గర్భధారణ జరిగి, ప్రసవం అయ్యేందుకు అవకాశం ఉన్న దంపతులకు సరోగసీకి అవకాశం లేదు. సరోగసీ ఒప్పందాలు చట్టబద్ధంగా అమలు చేయడానికి యోగ్యమైనవి. (లీగల్లీ ఎన్‌ఫోర్సబుల్) ఒకవేళ వివాహిత ... సరోగసీ ద్వారా బిడ్డను పొందాలనుకుంటే భర్త అనుమతి తప్పనిసరి. గర్భాన్ని అద్దెకు వచ్చే సరోగేట్ మదర్... అలా మూడు సార్లకు మించి చేయకూడదు. సొంత బిడ్డలున్న మహిళ అయితే ఆమెఐదుసార్లకు మించి ప్రసవానికి అనుమతించబడదు. అండాన్ని దానం చేసే దాతల వివరాలన్నీ గోప్యంగా ఉంచాల్సి ఉంటుంది. సాఫల్య కేంద్రాలు, శుక్రకణ బ్యాంకుల వివరాలన్నీ ఒక అక్రిడిటేషన్ ప్రక్రియ ద్వారా గుర్తింపును కలిగి ఉండాలి. భారతదేశంలోని ఆరోగ్య సంబంధిత పరిశోధన సంస్థలు ఒక ‘జాతీయ ఏఆర్టీ రిజిస్ట్రీ’ని నిర్వహించాలి. దీంతోపాటు ఈ రంగంలో పనిచేసే వ్యక్తులు, ఏజెంట్లు, సైంటిస్టులు, ఇతరుల వివరలతో జాతీయ, రాష్ట్ర సలహా బోర్డుల ఏర్పాటు జరగాలి. సరోగసీ ప్రక్రియ జరిగేదిలా... పైన పేర్కొన్న కారణాల వల్ల ఒక తల్లి గర్భాన్ని మోసేందుకు వీలు కాని పరిస్థితుల్లో సరోగసీకి ప్రయత్నిస్తారు. దానికి సిద్ధపడ్డ దంపతులు తొలుత ఈ ప్రక్రియ పట్ల అవగాహన పెంచుకోవాలి. అన్ని రకాల సందేహాలను నివృత్తి చేసుకోవాలి. ఇందులో మిళితమై ఉన్న చట్టపరమైన అంశాలు (లీగల్ యాస్పెక్ట్స్), చట్టపరమైన ఇబ్బందులు (లీగల్ ప్రాబ్లమ్స్) గురించి విపులంగా తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. లేకపోతే తర్వాత రకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ప్రక్రియను అనుసరించ దలచినప్పుడు బిడ్డను కోరుకునే దంపతులు, గర్భాన్ని మోసేందుకు సిద్ధపడ్డ తల్లి (సరోగేట్ మదర్), ఆమె భర్త, కుటుంబ సభ్యులు, సాఫల్య చికిత్సా నిపుణులు (ఫెర్టిలిటీ స్పెషలిస్ట్), సరోగసీ ఏజెంట్స్, లీగల్ అడ్వైజర్స్... ఇలా అందరూ కలసి సమష్టిగా నిర్ణయం తీసుకుని పనిచేయాల్సి ఉంటుంది. దంపతులు, సరోగేట్ మదర్... ఈ ఇరువురూ అన్ని రకాల పరీక్షలు చేయించుకోవాలి. వీరిని మానసికంగా సంసిద్ధం చేయడం కోసం సైకలాజికల్ కౌన్సెలింగ్ చేయడం కూడా ఎంతో ముఖ్యం. ఇందులో గర్భం మోసే తల్లిని ఎంపిక చేసేప్పుడు సరైన వారిని ఎంచుకోవడం ఎంతో అవసరం. ఈ సరోగేట్ మదర్... స్నేహితురాలు, బంధువులు ఇలా ఎవరైనా కావచ్చు. లేదా ఇందుకోసమే ఉద్దేశించిన ఏజెంట్స్ వెతికిపెట్టే సరోగేట్ మదర్స్ కూడా కావచ్చు. సరోగేట్ మదర్‌కు స్కానింగ్, హార్మోన్ పరీక్షలూ, రక్తపరీక్షలూ చేయాల్సి ఉంటుంది. ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయేమో తెలుసుకోవడంతో పాటు హెచ్ఐవీ, వీడీఆర్ఎల్, హెచ్‌బీఎస్‌ఏజీ వంటి పరీక్షలూ చేయించాల్సి ఉంటుంది. చట్టబద్ధమైన అంశాలు... ఇది నేరుగా దంపతులిద్దరికీ సంబంధించిన వ్యవహారం కాకపోవడం వల్ల... గర్భాన్ని మోసేందుకు సిద్ధపడే మరో తల్లి ప్రమేయం కూడా ఉండటం వల్ల కొన్ని చట్టబద్ధమైన అంశాలు ఉత్పన్నమవుతాయి. అందువల్ల బిడ్డను కోరుకునే దంపతులకూ, గర్భాన్ని మోసే తల్లికీ మధ్య ఒక ఒప్పందం ఉంటుంది. ఈ ఒప్పందం చట్టబద్ధంగా జరగాల్సి ఉన్నందున న్యాయవాది ప్రమేయమూ ఉంటుంది. ఈ చట్టబద్ధమైన వ్యవహారాలకు అవసరమైన ఖర్చులన్నీ బిడ్డను కోరే దంపతులు భరించాల్సి ఉంటుంది. ఏదైనా అనుకోని అవాంతరాలో, అనుకోని సమస్యలో వస్తే వాటిని పరిష్కరించుకునే దిశగా అనుసరించాల్సిన వ్యవహారశైలిపై కూడా ముందుగానే ఒప్పందాలు, ఒడంబడికలూ జరుగుతుంటాయి. విదేశీయులూ... కాస్త జాగ్రత్త విదేశీయులైన దంపతులు సరోగసీ కోసం భారత్‌కు వస్తే... ఆ దంపతుల్లో ఏ ఒక్కరిదైనా... అండంగానీ లేదా శుక్రకణాలు గాని ఉపయోగించి ఫలదీకరణ జరగాలి. లేకపోతే అలా పుట్టిన బిడ్డకు ఆ దేశ పౌరసత్వం, పాస్‌పోర్టు వంటివి ఇవ్వరు. ఇందుకోసం డీఎన్ఏ పరీక్ష జరిపి, పుట్టిన బిడ్డలో ఆ దంపతుల డీఎన్ఏలు ఉన్నాయని నిర్ధారణ చేశాకనే పౌరసత్వం వంటి హక్కులు ఇస్తారు. ఒకవేళ అలా కాకుండా ఉంటే... వారికి సరోగసీ ద్వారా పుట్టిన బిడ్డకు భారతదేశపు పౌరసత్వం లభించదు. అందుకే విదేశాలనుంచి వచ్చి ఇక్కడ సరోగసీ ద్వారా బిడ్డను కోరుకునేవారు చట్టబద్ధమైన అన్ని అంశాలనూ ముందుగానే తెలుసుకుని రావడం మంచిది. భారతదేశం... సరోగసీ రంగం మన దేశంలో సరోగసీ ప్రక్రియ ద్వారా ఏటా రూ. 25,000 కోట్ల వ్యాపారం జరుగుతోంది. గత కొన్నేళ్లుగా సరోగసీ ప్రక్రియకు మన దేశం ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందింది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఏ పాశ్చాత్య దేశాలతో పోల్చినా... ఇక్కడ ఈ సౌకర్యం చాలా చవకగా లభ్యం కావడమే దీనికి కారణం. 2010లో భారతీయ సరోగసీ కేంద్రాల్లో దాదాపు 1500 సరోగసీ ప్రసవాలు అయినట్లు ఒక అంచనా. అంతకు మునుపు రెండేళ్ల గణాంకాలతో పోలిస్తే అది 50 శాతం ఎక్కువ. భారతదేశంలోని ప్రధాన నగరాలైన ఈ కింది వాటిల్లో ఏడాదికి జరుగుతున్న సరోగసీ ప్రసవాల సంఖ్య... ఢిల్లీ - 300 గుజరాత్ - 300 హైదరాబాద్ - 100 బెంగళూరు - 50 ముంబాయి - 25. ఇదో మహా వ్యాపారం... ఐక్యరాజ్య సమితి 2012లో నిర్వహించిన సర్వే ప్రకారం భారతదేశంలో ఏడాదికి దాదాపు 400 మిలియన్ డాలర్ల వ్యాపారం సరోగసీ ద్వారా జరుగుతోంది. దేశవ్యాప్తంగా 3000 కు పైగా ఫెర్టిలిటీ క్లినిక్స్ (సంతాన సాఫల్య కేంద్రాలు) ఉన్నాయి. చివరగా... నాణేనికి రెండు పక్కలు ఉన్నట్లే అభివృద్ధికీ రెండు పార్శ్వాలుంటాయి. ఆధునిక వైద్య విజ్ఞానం ఇచ్చిన వరాన్ని మనం సద్వినియోగం చేస్తున్నామా, దుర్వినియోగపరుస్తున్నామా అన్నది మన నైతికత, విచక్షణ మేరకు చేయాల్సిన పని ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి -
ఈ ఏడాదిలోనూ మొండి బకాయిల బండే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్త సంవత్సరం కూడా దేశీయ బ్యాంకింగ్ రంగానికి కలిసొచ్చేట్లు కనిపించడం లేదు. అనూహ్యంగా పెరుగుతున్న నిరర్ధక ఆస్తులు అందర్నీ భయపెడుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ ఏ మాత్రం కోలుకోకపోతే 2015 మార్చి నాటికి స్థూల నిరర్ధక ఆస్తుల విలువ 7 శాతానికి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదంటే పరిస్థితి ఎంత గడ్డుగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2013 సెప్టెంబర్ నాటికి స్థూల నిరర్థక ఆస్తుల విలువ 4.6 శాతంగా ఉన్నట్లు ఆర్బీఐ విడుదల చేసిన తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొత్తగా నిరర్ధక ఆస్తులు పెరుగుతుండటంతో వచ్చే మూడు నెలల్లో నికర నిరర్థక ఆస్తులు రూ.1.50 లక్షల కోట్లకు చేరుతాయని అసోచామ్ సర్వేలో తేలింది. 2012 సెప్టెంబర్ నాటికి రూ.1.67 లక్షల కోట్లుగా ఉన్న స్థూల నిరర్ధక ఆస్తులు... ఏడాది తిరిగేసరికి అంటే 2013 సెప్టెంబర్ నాటికి రూ.2.29 లక్షల కోట్లకు చేరుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఇది మొత్తం రుణాల్లో 4.6 శాతానికి సమానం. ఇదే సమయంలో బ్యాంకులు పునర్వ్యవస్థీకరిం చిన రుణాల విలువ రూ. నాలుగు లక్షల కోట్లను తాకింది. ఇది మొత్తం రుణాల్లో 10.2 శాతానికి సమానం. పునర్వ్యవస్థీకరించిన రుణాలు ఈ స్థాయికి చేరుకోవడం దేశీయ బ్యాంకింగ్ చరిత్రలో ఇదే ప్రధమమని, ఇది ఆందోళన కలిగించే అంశమే అయినా, పరిస్థితి చేయిదాటిపోలేదని ఆర్బీఐ పేర్కొనడం విశేషం. ప్రస్తుత ముగిసిన త్రైమాసికంతోపాటు మరో త్రైమాసికంలో కూడా ఎన్పీఏలు భారీగా పెరిగే అవకాశం ఉందని ఆంధ్రాబ్యాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ సి.వి.ఆర్ రాజేంద్రన్ తెలిపారు. ఈ త్రైమాసికంలో మరో రూ.3,000 కోట్ల విలువైన రుణాలను పునర్ వ్యవస్థీకరించామని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఆంధ్రాబ్యాంక్ మొత్తం రుణాల్లో 13 శాతం పునర్ వ్యవస్థీకరించగా, 5 శాతం నిరర్థక ఆస్తులున్నాయి. అంటే 18 శాతం ఆస్తుల నుంచి ఎలాంటి ఆదాయం రావట్లేదన్న మాట. రియల్టీ పరిస్థితి ఘోరం నిరర్థక ఆస్తుల విషయంలో రియల్టీ రంగం బాగా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దాదాపు 13,200 యూనిట్లకు సంబంధించిన రుణాలు ఎన్పీఏలుగా మారిపోయాయి. వీటి విలువ దాదాపు రూ.7,700 కోట్లకు సమానమని, వీటిని వేలం వేయడానికి బ్యాంకులు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ఎన్‌పీఏసోర్స్ డాట్ కామ్ తన నివేదికలో పేర్కొంది. ఇందులో 2,200 యూనిట్లు వాణిజ్య సముదాయాలు, 11,000 రెసిడెన్షియల్ ప్రాజెక్టులు ఉన్నాయి. మొత్తం రూ.27,500 కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ రుణాల్లో 15 శాతం ఎన్పీఏలుగా మారాయి. రెసిడెన్షియల్ ఎన్పీఏల విషయంలో రాష్ట్రం రూ.497 కోట్లతో మూడో స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాల్లో ముంబై, ఢిల్లీలున్నాయి. ఎన్నికల తర్వాతే... ఈ ఏడాది ద్వితీయార్ధం నుంచి ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఎన్నికల తర్వాత బ్యాంకింగ్ రంగంలో ఎన్పీఏలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం 4.6%గా ఉన్న ఎన్పీఏలు 2015 మార్చి నాటికి 4.4 శాతానికి తగ్గుతుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఒకవేళ ఆర్థిక వ్యవస్థ మెరుగవకుండా మరింత దిగజారితే మాత్రం ఎన్పీఏలు 7 శాతానికి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆర్బీఐ వ్యాఖ్యానించడం గమనార్హం.